iQOO 9T 5G Launches in India: Here is Price & Specifications and Features - Sakshi
Sakshi News home page

iQOO 9T 5G: వన్‌ప్లస్‌కి పోటీ: ఐకూ 9టీ 5జీ వచ్చేసింది..ధర ఎంతంటే?

Published Tue, Aug 2 2022 4:25 PM | Last Updated on Wed, Aug 3 2022 5:26 AM

iQOO 9T 5G launches in India: Here is price specifications and features - Sakshi

సాక్షి, ముంబై: వివో అనుబంధ సంస్థ  ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్‌ చేసింది.  ఐకూ  9టీ 5జీ  పేరుతో దీన్ని  తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌, పంచ్-హోల్ డిజైన్‌తో  ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌, నాలుగు రియర్‌ కెమెరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయ. ఆప్టిమైజ్  ఫోటోగ్రఫీ అనుభవం కోసం Vivo V1+ ఇమేజ్ ప్రాసెసింగ్ చిప్ ను ఇందులో అమర్చింది.  మరోవైపు వన్‌ప్లస్‌ రేపే( ఆగస్టు 3న ) వన్‌ ప్లస్‌10టీ లాంచ్‌కు  సిద్ధమవుతున్న తరుణంలో ఐ​కూ 9టీ 5జీ విడుదల కావడం విశేషం. 

ఐకూ  9టీ 5జీ  ఫీచర్లు
6.78 అంగుళాల E5 AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేను
పూర్తి HD+ రిజల్యూషన్, ఆండ్రాయిడ్‌ 12
16మెగాపిక్సెల్  సెల్ఫీ కెమెరా
50ఎంపీ మెయిన్‌ కెమెరా, 13+2+12 ఎంపీ కెమెరాలు 
4,700mAh బ్యాటరీ, W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

ధరలు, లభ్యత
8జీబీ ర్యామ్‌+ 128 జీబీ స్టోరేజ్‌,  12జీబీ ర్యామ్‌+ 256 స్టోరేజ్‌  రెండు కాన్ఫిగరేషన్‌లలో  లాంచ్‌ అయింది. వీటి ధరలు వరుసగా రూ.49,999 , రూ.54,999. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కలర్‌ ఆప్షన్స్‌లో లభ్యం. 

iQOO 9T 5G iQOO ఇండియా వెబ్‌సైట్ ద్వారా సేల్‌ షేరూ అయింది.  iQOO.com ద్వారా 9Tని కొనుగోలు చేసిన వారికి రూ. 3,999 విలువైన గేమ్‌ప్యాడ్ ఉచితం. అమెజాన్‌ ఆగస్టు 4 నుంచి అందుబాటులో ఉంటుంది. ICICI బ్యాంక్ ఆఫర్‌తో, వినియోగదారులు రూ. 4,000 తగ్గింపును అందిస్తోంది.అలాగే  ఎక్స్ఛేంజ్ ఆఫర్ 12 నెలల వరకు నో-కాస్ట్  ఈఎంఐ ఆప్షన్‌  కూడా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement