సాక్షి,ముంబై: ఐకూ 11 5జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లతో 2023లో తొలి ఫ్లాగ్‍షిప్ మొబైల్‌గా మంగళవారం (జనవరి10) ఆవిష్కరించింది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 (Snapdragon 8 Gen 2) ప్రాసెసర్, 2K ఈ6 అమోలెడ్ డిస్‌ప్లేతో ఇండియాలో లాంచ్ అయిన తొలి ఫోన్ ఇదేనని ఐకూ తెలిపింది. రాత్రిపూట 4K వీడియోలను రికార్డ్ చేసేలా వివో V2 ఇమేజింగ్ చిప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఎనిమిది నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.
Ready your wishlist, because the #iQOO11 with India’s First 2K E6 AMOLED Display at just ₹51,999*. Sale starts 13th Jan, 12PM exclusively on https://t.co/ZK4Krrdztq & @amazonIN. 24 Hours Early Access* for Prime Members.
— iQOO India (@IqooInd) January 10, 2023
*T&C Apply#MonsterInside #AmazonSpecials #iQOO11Launch pic.twitter.com/8iGVM3hDBE
p>
ఐకూ 11 5జీ స్పెసిఫికేషన్స్
6.7 ఇంచుల 2K ఈ6 అమోలెడ్ డిస్‍ప్లే
హెచ్‍డీఆర్10+, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్
50+8 +13 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్
ఐకూ 11 5జీ ధరలు, తొలిసేల్
ఐకూ 11 5జీ బేస్ మోడల్, 8 జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. టాప్ వేరియంట్, 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.64,999గా ఉంది.
జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఐకూ అధికారిక వెబ్‍సైట్ ద్వారా ఫస్ట్ సేల్ ప్రారంభం. ఆల్ఫా, లెజెండ్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం.
ఆఫర్లు
ఐసీఐసీఐ, హెచ్‍డీఎఫ్‍సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో ఐకూ 11 5జీని కొనుగోలు చేస్తే రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, 3 వేల రూపాయల దాకా స్పెషల్ ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment