iQOO Mobiles
-
2024లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే (ఫొటోలు)
-
రూ.15,000 లోపు ప్రీమియం ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లు
-
రూ.10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. కెమెరా ఫీచర్స్ అదుర్స్!
ఐకూ (iQoo) తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఐకూ జెడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite 5G)ని ఈరోజు భారత్‌లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, డ్యూయల్ కెమెరాలతో ఉన్న ఈ ఫోన్లో శక్తివంతమైన ప్రాసెసర్, బ్యాటరీ ఉన్నాయి.ఐకూ జెడ్9 లైట్ 5జీ 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ.10,499. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ. 11,499. ఈ స్మార్ట్ఫోన్లు ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటి విక్రయాలు అమెజాన్‌తోపాటు ఐకూ వెబ్సైట్లో జూలై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలతో రూ. 500 అదనపు తక్షణ తగ్గింపును ఐకూ అందిస్తోంది.స్పెసిఫికేషన్లు, ఫీచర్లు» 6.56-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే » మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్» 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ » సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా» ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 14» 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ» సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
సెప్టెంబరులో రానున్న 5G బెస్ట్ ఫోన్లు ఏవంటే?
iQoo Z7 Pro 5g భారత మార్కెట్లో ఐక్యూ జెడ్ 7 ప్రో (ఆగస్టు 31న లాంచ్ అయింది. Z7 లైనప్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది కంపెనీ. బ్లూ లగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలోరెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధరలు వరుసగా రూ.23,999, రూ.24,999గా నిర్ణయించింది. (30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్) బ్యాంక్ ఆఫర్ అయితే బ్యాంక్ ఆఫర్ కింద రెండువేల రూపాయల తగ్గింపు అందిస్తోంది. దీని ప్రకారం వీటి ధరలు వరుసగా రూ. 21,999, రూ. 22,999గా ఉంటాయి. అమెజాన్, ఐక్యూ అధికారిక వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 5, మధ్యాహ్నం 12 నుంచి సేల్ షురూ అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ CE 3తో పోలిస్తే తక్కువ ధరలో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. The #iQOOZ7Pro 5G is finally here! 🤩 Get this ultimate, power-packed device at an incredible price of just ₹21,999* at the upcoming sale on @amazonIN & https://t.co/ZK4Krrdztq on Sept 5. 💙📱 Know more: https://t.co/tfsaIl9h3Y#AmazonSpecials #FullyLoaded #iQOOZ7Pro5G pic.twitter.com/BgOHLnjnuC — iQOO India (@IqooInd) August 31, 2023 ఐక్యూ జెడ్7 ప్రో ఫీచర్లు : 6.78 అంగుళాల డిస్ప్లే, MediaTek Dimensity 7200 సాక్ ప్రాసెసర్, 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ , 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 64+2 ఎంపీ రియర్ డ్యుయల్ కెమెరాఉంటాయి. చైనా టెక్నో పోవా ఫోన్లు చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్ రెగ్యులర్ స్మార్ట్ఫోన్లకు కాస్త భిన్నంగా ఉండే విధంగా సరికొత్త స్మార్ట్ఫోన్లు పోవా 5, పోవా 5 ప్రో 5జీలను మార్కెట్లోకి విడుదల చేసింది. Tecno Pova 5: పోవా 5 ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డి ప్లస్ 120Hz డిస్ప్లేతో వచ్చింది. మీడియాటెక్ హీలియో G99 6nm చిప్సెట్, 50MP ఏఐ డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W స్మార్ట్ ఛార్జ్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 11,999 Tecno Pova 5 Pro 5G 120 Hz రిఫ్రెష్ రేట్‌తో , 6.78-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే (FHD+) 50-megapixel + VGA రియర్ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజీ ప్రత్యేకత. Tecno Pova 5 Pro నానో-సిమ్ , నానో-సిమ్ కార్డ్ స్లాట్లను కలిగి ఉంటుంది. డ్యూయల్ సిమ్ (GSM ప్లస్ GSM) మొబైల్. ఇది డార్క్ ఇల్యూషన్ , సిల్వర్ ఫాంటసీ రంగులలో అందుబాటులో ఉంది. Tecno Pova 5 Pro 5జి ప్రారంభ ధర రూ. 14,999. సెప్టెంబర్‌లో లాంచ్ అవుతున్న టాప్ స్మార్ట్ఫోన్లు వీటితోపాటు ఈ సెప్టెంబరులో ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, 15 ప్లస్, ఐఫోన్ 15ప్రొ, ఐఫోన్ 15ప్రొ మ్యాక్స్ తదితర ఫోన్లు లాంచ్ కానున్నాయి.ఇంకా హానర్ 90 మొబైల్ తయారీ దారు హానర్ రెండేళ్ల తరువాత భారత మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. 6.4-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLED డిస్ప్లే,50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఈ (Samsung Galaxy S23 FE) లాంచ్ కానుంది. అలాగే Moto G54 5G స్మార్ట్‌ఫోన్ ఈనెలలోనే రానుంది. 6.5-అంగుళాల పూర్తి-HD+ డిస్ప్లే, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 50 ఎంపీ కెమెరా లాంటి ఫీచర్లుంటాయని అంచనా. It’s official! Apple will launch the iPhone 15 at the next #AppleEvent on September 12th at 10 a.m. PDT 🚨 Are you excited? pic.twitter.com/6mBEW7Z0Tm — Apple Hub (@theapplehub) August 29, 2023 Samsung Galaxy S23 FE Might Launch in September 2023 Specs: -6.4'' FHD+ 120Hz Dynamic AMOLED display -Snapdragon 8 Gen 2 or Exynos 2200 SoC -50MP Main +8MP UW +12MP Telephoto camera & 10MP selfie -4500mAh battery with 25W charging -One UI 5.1, Android 13#Samsung #GalaxyS23FE pic.twitter.com/Y3N1tH2ky8 — Smartprix (@Smartprix) August 24, 2023 moto G54 5G is launching on September 6, 2023 in India. - 6.55" FHD+ 120Hz IPS LCD - MediaTek Dimensity 7020 - 50MP OIS + 8MP camera - 16MP front - Stereo speakers, Dolby Atmos - 6000mAh battery, 33W charge - Android 13 - 3.5mm, Side FS - 192g, 8.89mm#Motorola #moto #motoG54 pic.twitter.com/TlfViCJcL4 — Oneily Gadget (@OneilyGadget) August 31, 2023 -
60 వేలమందిలో ఒక్కడు.. 23ఏళ్లకే జాబ్ - ఫోన్ కొనలేని స్థాయి నుంచి సీజీవోగా..
మనిషి గట్టిగా అనుకోవాలే గానీ ఏదైనా సాధిస్తాడు అనటానికి మరో నిదర్శనం 23 సంవత్సరాల 'శ్వేతాంక్ పాండే' (Shwetank Pandey). ఇంతకీ ఇతడెవరు, సాధించిన విజయం ఏమిటి అనే మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. శ్వేతాంక్ పాండేకి చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే అతన్ని ఒక గేమింగ్ కంపెనీలో రూ.10 లక్షల ప్యాకేజీతో జాబ్ కొట్టేలా చేసింది. గేమ్స్ ఆడితే భవిష్యత్ ఉండదనే పాత కాలపు నమ్మకానికి చెక్ పెట్టి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ iQOOలో చీప్ గేమింగ్ ఆఫీసర్ (CGO)గా ఎంపికయ్యాడు. 60వేల మందికి ఒకడు.. నిజానికి శ్వేతాంక్ పాండే ఒక స్మార్ట్‌ఫోన్ కొనటానికి ఏడాదంతా ఉద్యోగం చేసినట్లు వెల్లడించాడు. అలాంటిది ఇప్పుడేకంగా మొబైల్ తయారీ కంపెనీలోనే మంచి జాబ్ కొట్టేశాడు. ఐకూలో చీప్ గేమింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి 60వేల మంది పోటీ పడితే అందులో పాండే గొప్ప ప్రతిభ చూపి ఉద్యోగం కైవసం చేసుకున్నాడు. తనకు ఇష్టమైన గేమింగ్స్ ఆడటానికి ఇంట్లో వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో 12వ తరగతి చదువుకునే రోజుల్లోనే ఈ-స్పోర్ట్స్ ఆడటం మొదలుపెట్టి గ్రాడ్యుయేట్ కూడా పూర్తి చేసాడు. ఓపక్క చదువుకుంటూనే తాను అనుకునే రంగంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నాడు. ఇదీ చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే కారు! అంబానీ కారు అదిరిపోలా.. చదువు పూర్తయిన తరువాత ఒక సంవత్సరం ఉద్యోగం చేసి.. తరువాత ఒక ఫోన్ కొనుగోలు చేసి అందులోనే గేమింగ్ ఆడటం మొదలుపెట్టాడు. ఇలా సాధించిన మెళకువలతోనే ఐకూలో ఉద్యోగం సాధించగలిగాడు. ఆ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడే ఫైనల్ వరకు చేరతాననే నమ్మకం ఉండేదని పాండే వెల్లడించాడు. -
ఐకూ నుంచి జెడ్7 ప్రో 5జీ, కమింగ్ సూన్
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ కొత్తగా జెడ్7 ప్రో 5జీ ఫోన్‌ను ఆగస్టు 31న ఆవిష్కరించనుంది. ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్‌లో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 మొబైల్ ప్లాట్‌ఫాం, 3డీ కర్వ్డ్ సూపర్ విజన్ అమోలెడ్ డిస్ప్లే, 64 ఎంపీ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వివరించింది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వెర్షన్లలో లభ్యం. ఫీచర్లు 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ప్లే 4nm MediaTek డైమెన్సిటీ 7200 SoC 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా 2 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్‌తో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,600mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇది కూడా చదవండి: గుడ్ఇయర్ భాగస్వామ్యంతో అష్యూరెన్స్ బ్యాటరీలు న్యూఢిల్లీ: టైర్ల తయారీ సంస్థ గుడ్ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ నుంచి తీసుకున్న అధికారిక లైసెన్సు కింద అష్యూరెన్స్ ఇంటర్నేషనల్ కొత్త ఫిల్టర్లు, బ్యాటరీల శ్రేణిని ఆవిష్కరించింది. వీటిని భారత్‌లోనే తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. దేశీయంగానే కాకుండా దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆ్రస్టేలియా న్యూజిలాండ్ మార్కెట్లలో విక్రయించనున్నట్లు వివరించింది. ఆగస్టు ఆఖరు నాటికి ఈ బ్యాటరీలు, ఫిల్టర్లు మార్కెట్లోకి రాగలవని అష్యూరెన్స్ ఇంటర్నేషనల్ పేర్కొంది. -
యానివర్సరీ సేల్, ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ఐక్యూ మొబైల్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. కంపెనీ మూడవ వార్షికోత్సవం సందర్బంగా ఐక్యూ బ్రాండ్ స్పెషల్ సేల్ ప్రకటించింది. ఈ రోజునుంచి (ఏప్రిల్ 19, బుధవారం) ఏప్రిల్ 24 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఫ్లాగ్షిప్, నియో సిరీస్ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ తాజా గేమింగ్-ఫోకస్డ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 11 5జీతోపాటు, ఐక్యూ 9, ఐక్యూ 9 ప్రో మోడల్స్ కొనుగోళ్లపై డిస్కౌంట్ లభ్యం. దీంతోపాటు ఆఫర్లు బ్యాంక్ ఆఫర్ కూడా ఉన్నాయని, అయితే హైస్టోరేజ్ వేరియంట్‌కు ఈ తగ్గింపు వర్తించదని కంపెనీ వెల్లడించింది. కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం, ఇండియాలో ఐక్యూ 11 5జీ బేస్ మోడల్ ఇపుడు రూ. 49,999కే లభ్యం. లిస్టెడ్ ధర రూ. 59,999. (ఇదీ చదవండి: ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్?) ఈ సేల్‌లో ఐక్యూ 9, ఐక్యూ 9ప్రో ప్రస్తుత ధర రూ. 30,990, రూ. 39,990. అమెజాన్ ఇండియాలో వీటి ధర ప్రస్తుతం రూ. 35,990, రూ. 44,990 గా ఉంది. దీంతోపాటు ఐక్యూ Neo 6 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 5,000 తగ్గింపు తరువాత రూ. 29,999కే కొనుగోలు చేయవచ్చు. (అదరగొట్టిన టీసీఎస్: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్ చిట్కాలివిగో!) ఐక్యూ 11 5జీ స్పెసిఫికేషన్స్ 6.78-అంగుళాల 2K E6 AMOLED డిస్ప్లే Android 13-ఆధారిత Funtouch OS 13 క్వాల్కం స్నాప్ డ్రాగన్ 8 Gen 2 SoC 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13-మెగాపిక్సెల్ టెలిఫోటో/పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. కేవలం 8 నిమిషాల్లో బ్యాటరీ 50 శాతం ఛార్జ్ అవుతుంది. కాగా చైనీస్ టెక్ దిగ్గజం వివో మద్దతుతో, 2020లో భారతదేశంలో అడుగుపెట్టిన కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ. -
ఐకూ జెడ్ 5జీ విడుదల
న్యూఢిల్లీ: ఐకూ జెడ్ 7 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఇది రెండు వేరియంట్లుగా విడుదలైంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ.18,999. ఆరంభ డిస్కౌంట్ పోను రూ.17,499కు లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ.19,999. డిస్కౌంట్ పోను రూ.18,499కు సొంతం చేసుకోవచ్చు. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్, ఐకూ వెబ్సైట్లలో లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ 7.8 ఎఎం మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్స్ ఓఐఎస్ అల్ట్రా స్టెబుల్ కెమెరా, అమోలెడ్ స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రధాన ఆకర్షణలు. 44 వాట్ ఫ్లాష్ చార్జర్ సదుపాయం ఉంది. -
ఐకూ నుంచి స్నాప్‌డ్రాగన్ 8 ఫోన్
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీ సంస్థ ఐకూ తాజాగా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఐకూ 11ను ఆవిష్కరించింది. దేశీయంగా ఈ తరహా స్మార్ట్‌ఫోన్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని సంస్థ తెలిపింది. వేరియంట్‌ను బట్టి దీని ధర రూ. 59,999 నుంచి రూ. 64,999గా ఉంటుంది. ఆఫర్ ప్రకారం రూ. 51,999 నుంచి రూ. 56,999కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. జనవరి 12న ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్ కింద అదనంగా ఐకూ రూ. 1,000 డిస్కౌంటును ప్రకటించింది. జనవరి 13 నుంచి ఐకూ ఈ–స్టోర్, అమెజాన్‌డాట్‌ఇన్‌లో ఇది లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 గి ఫ్లాష్‌చార్జ్ టెక్నాలజీ, 6.78 అంగుళాల స్క్రీన్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి. 8జీబీ+256జీబీ, 16జీబీ+256జీబీ వేరియంట్లలో ఇది లభిస్తుంది. -
ఐకూ11 5జీ వచ్చేసింది: దీని ప్రత్యేకత, ఆఫర్లు తెలిస్తే ఫిదా
సాక్షి,ముంబై: ఐకూ 11 5జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లతో 2023లో తొలి ఫ్లాగ్షిప్ మొబైల్గా మంగళవారం (జనవరి10) ఆవిష్కరించింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 (Snapdragon 8 Gen 2) ప్రాసెసర్, 2K ఈ6 అమోలెడ్ డిస్ప్లేతో ఇండియాలో లాంచ్ అయిన తొలి ఫోన్ ఇదేనని ఐకూ తెలిపింది. రాత్రిపూట 4K వీడియోలను రికార్డ్ చేసేలా వివో V2 ఇమేజింగ్ చిప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఎనిమిది నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. Ready your wishlist, because the #iQOO11 with India’s First 2K E6 AMOLED Display at just ₹51,999*. Sale starts 13th Jan, 12PM exclusively on https://t.co/ZK4Krrdztq & @amazonIN. 24 Hours Early Access* for Prime Members. *T&C Apply#MonsterInside #AmazonSpecials #iQOO11Launch pic.twitter.com/8iGVM3hDBE — iQOO India (@IqooInd) January 10, 2023 p> ఐకూ 11 5జీ స్పెసిఫికేషన్స్ 6.7 ఇంచుల 2K ఈ6 అమోలెడ్ డిస్ప్లే హెచ్డీఆర్10+, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ 50+8 +13 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఐకూ 11 5జీ ధరలు, తొలిసేల్ ఐకూ 11 5జీ బేస్ మోడల్, 8 జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. టాప్ వేరియంట్, 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.64,999గా ఉంది. జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఐకూ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫస్ట్ సేల్ ప్రారంభం. ఆల్ఫా, లెజెండ్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం. ఆఫర్లు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో ఐకూ 11 5జీని కొనుగోలు చేస్తే రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, 3 వేల రూపాయల దాకా స్పెషల్ ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. -
సేల్స్ బీభత్సం, 700 శాతం వృద్ధి..ఏ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తెలుసా?
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘ఐక్యూ’ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో.. భారత్‌లో వేగంగా వృద్ధి సాధిస్తున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచినట్టు కౌంటర్ పాయింట్ ‘స్మార్ట్‌ఫోన్ మోడల్ ట్రాకర్’ నివేదికను ప్రకటించింది. జూన్ క్వార్టర్లో ఐక్యూ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాల్లో 700 శాతం వృద్ధిని చూపించింది. అంతేకాదు మార్చి త్రైమాసికం గణాంకాలతో పోల్చి చూసినా ఐక్యూ జూన్ క్వార్టర్లో 135 శాతం వృద్ధిని చూపించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
వన్‌ప్లస్‌కి పోటీ: ఐకూ 9టీ 5జీ వచ్చేసింది..ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: వివో అనుబంధ సంస్థ ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఐకూ 9టీ 5జీ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్, పంచ్-హోల్ డిజైన్‌తో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, నాలుగు రియర్ కెమెరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయ. ఆప్టిమైజ్ ఫోటోగ్రఫీ అనుభవం కోసం Vivo V1+ ఇమేజ్ ప్రాసెసింగ్ చిప్ ను ఇందులో అమర్చింది. మరోవైపు వన్‌ప్లస్ రేపే( ఆగస్టు 3న ) వన్ ప్లస్10టీ లాంచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఐకూ 9టీ 5జీ విడుదల కావడం విశేషం. ఐకూ 9టీ 5జీ ఫీచర్లు 6.78 అంగుళాల E5 AMOLED ఫ్లాట్ డిస్ప్లేను పూర్తి HD+ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 12 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 50ఎంపీ మెయిన్ కెమెరా, 13+2+12 ఎంపీ కెమెరాలు 4,700mAh బ్యాటరీ, W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధరలు, లభ్యత 8జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్+ 256 స్టోరేజ్ రెండు కాన్ఫిగరేషన్లలో లాంచ్ అయింది. వీటి ధరలు వరుసగా రూ.49,999 , రూ.54,999. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్స్‌లో లభ్యం. iQOO 9T 5G iQOO ఇండియా వెబ్సైట్ ద్వారా సేల్ షేరూ అయింది. iQOO.com ద్వారా 9Tని కొనుగోలు చేసిన వారికి రూ. 3,999 విలువైన గేమ్‌ప్యాడ్ ఉచితం. అమెజాన్ ఆగస్టు 4 నుంచి అందుబాటులో ఉంటుంది. ICICI బ్యాంక్ ఆఫర్‌తో, వినియోగదారులు రూ. 4,000 తగ్గింపును అందిస్తోంది.అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. -
సూపర్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్: ఐకూ నియో 6 వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: ఐకూ ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం తీసుకొచ్చింది. ప్రీమియం ధరలో ఐకూ నియో 6 ..5జీ మొబైల్‌ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డార్క్ నోవా , ఇంటర్ స్టెల్లార్ కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది.1200Hz తక్షణ టచ్ శాంప్లింగ్ రేట్ 32907mm2 క్యాస్కేడ్ కూలింగ్ సిస్టమ్‌తో సూపర్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ 12 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. స్పెషల్ లాంచింగ్ ధర రూ. 25000 తగ్గింపు అందిస్తోంది. ఈ ప్రత్యేక ధర జూన్ 5వ తేదీవరకు మాత్రమే ఈ ధర అందుబాటులో ఉంటుంది. ఐసీసీఐసీఐ కార్డ్ చెల్లింపులపై మరో 3 వేల రూపాయల తగ్గింపు. ఐకూ నియో 6 ఫీచర్లు 6.62 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 870 5జెన్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12, 1080x2400 పిక్సెల్స్ 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ 16 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా 64+12+2 ఎంపీ రియర్ కెమెరా 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫ్లాష్ చార్జ్ -
మార్కెట్లోకి మరో కిల్లర్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ వివోకు చెందిన ఐక్యూ మొబైల్స్ తాజాగా మరో రెండు ఐక్యూ 8, ఐక్యూ 8 లెజెండ్ మోడల్లను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. ఐక్యూ 8ప్రో మొబైల్ భారత మార్కెట్లో ఐక్యూ 8 లెజెండ్‌గా రానుంది. ఈ రెండు ఫోన్లను ఆగస్టులో చైనాలో లాంఛ్ చేశారు. ఐక్యూ 8, ఐక్యూ 8 లెజెండ్ రెండూ ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉన్నాయి. వీటిని ప్రముఖ మోటార్‌స్పోర్ట్ కంపెనీ బీఎమ్‌డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసింది. ఈ నెల చివరలో లేదా వచ్చే నెల ప్రారంభంలో మన ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఐక్యూ 8, ఐక్యూ 8 లెజెండ్ ఫోన్స్ ఇండియా ధర తెలియదు. కానీ, ఈ స్మార్ట్ ఫోన్ల చైనా మార్కెట్ ధరనే కలిగి ఉండే అవకాశం ఉంది. చైనాలో ఐక్యూ 8 ధర సీఎన్ వై 3,799(సుమారు రూ.43,600)గా ఉంటే, ఐక్యూ 8 లెజెండ్ ధర సీఎన్ వై 4,999(సుమారు రూ.57,300)గా ఉంది. (చదవండి: జియోను వెనక్కినెట్టిన వోడాఫోన్ ఐడియా...!) ఐక్యూ 8 ఫీచర్లు(అంచనా) 6.56 అంగుళాల స్క్రీన్ 1080x2,376 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48 + 13+ 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 4,350 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 120 డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ ఐక్యూ 8 లెజెండ్ ఫీచర్లు(అంచనా) 6.62 అంగుళాల స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 50 + 48 + 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 120 డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ -
రూ.30-40 వేల బడ్జెట్లో ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే!
ఐక్యూ7 సిరీస్(ఐక్యూ7,ఐక్యూ7 లెజెండ్) స్మార్ట్ఫోన్లు ఆగస్టు నెలలో భారతదేశంలో రూ.30,000 నుంచి రూ.40,000 సెగ్మెంట్ లో ఎక్కువగా అమ్ముడైన 5జీ స్మార్ట్ఫోన్లుగా నిలిచాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ దేశంలోని మొబైల్ గేమింగ్ కమ్యూనిటీలో విజయవంతమైంది. ఆగస్టు నెలకు భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ షిప్ మెంట్ వివరాలను వెల్లడిస్తూ ఇటీవల కౌంటర్ పాయింట్ నివేదికలో ఈ గణాంకాలు పంచుకుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఏప్రిల్ లో లాంచ్ చేశారు. ఈ ఐక్యూయూ మొబైల్స్ విమర్శకులు, వినియోగదారుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ పొందాయి. ఐక్యూ 7 లెజెండ్ రూ.40,000 ధరలో అత్యుత్తమ మొబైల్స్ లో ఇది ఒకటిగా నిలిచింది. దీనిలో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఐక్యూ 7 విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ అమోల్డ్ స్క్రీన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 66డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఐక్యూ 7 లెజెండ్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,990 ధరకు, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.43,990 ధరకు మార్కెట్లోకి వచ్చాయి. ఇక ఐక్యూ 7 రెండు వేరియెంట్లు 8జీబీ ర్యామ్, విభిన్న స్టోరేజీలతో వచ్చింది. ఇందులో ప్రస్తుతం రిటైల్ ధర రూ.29,990గా ఉంది. (చదవండి: అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...!) -
బడ్జెట్లో మార్కెట్లోకి మరో కిల్లర్ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో సబ్ బ్రాండ్ ఐక్యూ చైనాలో ఆవిష్కరించిన తన జెడ్5 స్మార్ట్‌ఫోన్‌ను నేడు భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో పంచ్ హోల్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఐక్యూ జెడ్5 44డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేసి వస్తుంది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. (చదవండి: పది సెకండ్ల యాడ్‌కు 18 లక్షలే....!) ఐక్యూ జడ్5 ధర భారతదేశంలో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఐక్యూ జడ్5 రూ.23,990కి లభిస్తే, 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మొబైల్ ధర రూ.26,990 ఉంది. ఇది ఆర్కిటిక్ డాన్, మిస్టిక్ స్పేస్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 3 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో(iQoo.com, Amazon.in) అందుబాటులో ఉంటుంది. లాంఛ్ ఆఫర్ కింద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్/క్రెడిట్, ఈఎమ్ఐ కింద కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. ఐక్యూ జెడ్5 స్పెసిఫికేషన్లు 6.67 అంగుళాల ఫుల్-హెచ్ డీ+ LCD డిస్ ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ 8 జీబీ/12 జీబీ ర్యామ్, 128 జీబీ/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 64 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా 44డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ హై-రెస్ ఆడియో, హై-రెస్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.23,990 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.26,990 -
గేమింగ్ ప్రియుల కోసం ఐక్యూ నుంచి కొత్త ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో సబ్ బ్రాండ్ ఐక్యూ చైనా మార్కెట్లలోకి ఐక్యూ జెడ్5 స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 23న లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లలోకి కూడా వస్తుందని తెలుస్తోంది. సెప్టెంబర్ చివరి నాటికి ఐక్యూ జెడ్5 భారత్‌లో ఆవిష్కరించే అవకాశం ఉందని జీఎస్ఎమ్ఎరీనా పేర్కొంది. రాబోయే ఐక్యూ జెడ్5 భారత మార్కెట్లలో సుమారు రూ. 30వేల లోపే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఐక్యూ జెడ్5 అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌తో గేమింగ్ ప్రియులకు సౌకర్యవంతంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఉంటుందని తెలుస్తోంది. (చదవండి: బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్) ఐక్యూ జెడ్5 ప్రో స్పెసిఫికేషన్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ LPDDR5 ర్యామ్ 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 64 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియో , హై-రెస్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: ఆన్లైన్లో వైరల్ అవుతున్న రియల్మీ జీటీ నియో 2 ఫీచర్స్ -
ఐకూ జెడ్3: 5జీ స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే!
న్యూఢిల్లీ: ఐకూ సంస్థ ‘ఐకూ జెడ్3’ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో అద్భుతమైన కెమెరా టెక్నాలజీ, మంచి హార్డ్‌వేర్ ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 768జీ 5జీ ప్రాసెసర్‌ను ఇందులో ఏర్పాటు చేసింది. అంటే 5జీకి సపోర్ట్ చేస్తూ మంచి గేమింగ్ అనుభవాన్ని ఇచ్చేందుకు ఈ ప్రాసెసర్‌ను వినియోగించింది. 64మెగాపిక్సల్ ఆటోఫోకస్ కెమెరా వెనుక భాగంలో ఉంటుంది. 55వాట్ ఫ్లాష్ చార్జ్‌తో వస్తంది. 6జీబీ, 128జీబీ రకం ధర రూ.19,900 కాగా.. 8జీబీ, 128జీబీ ధర రూ.20,990గా కంపెనీ నిర్ణయించింది. అదే విధంగా 8జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ.22,990. అమెజాన్ డాట్ ఇన్, ఐకూ డాట్‌కామ్ పోర్టళ్లలో విక్రయానికి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. చదవండి : Samsung Galaxy S21+: రూ.10వేల క్యాష్ బ్యాక్, ఇంకా మరెన్నో ఆఫర్స్ -
బీఎమ్‌డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసిన ఈ ఫోన్ అదరహో...!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ వివోకు చెందిన ఐక్యూ మొబైల్స్ తాజాగా మరో రెండు మోడల్లను భారత్‌లో లాంచ్ చేసింది. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తొలుత ఐక్యూ నియో 5ను రిలీజ్ చేయగా, దానినే రిబ్రాండ్ చేస్తూ ఐక్యూ 7గా రిలీజ్ చేసింది. దాంతో పాటుగా ఐక్యూ 7 లెజెండ్‌ను భారత విపణిలోకి లాంచ్ చేసింది. ఐక్యూ 7 లెజెండ్ మొబైల్‌ను ప్రముఖ మోటార్‌స్పోర్ట్ కంపెనీ బీఎమ్‌డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసింది. ఐక్యూ 7, ఐక్యూ 7 లెజెండ్ ట్రిపుల్ రియర్ కెమెరాలను కల్గి ఉన్నాయి. దాంతో పాటుగా 66వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కాగా ఐక్యూ 7, ఎమ్ఐ 11 ఎక్స్‌తో పోటీ పడుతుండగా, ఐక్యూ 7 లెజెండ్ ఎమ్ఐ 11 ఎక్స్ ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ ఫోన్లకు సరితూగుతుంది. ఐక్యూ 7 స్టార్మ్ బ్లాక్, సాలిడ్ ఐస్ బ్లూ కలర్లో లభిస్తుంది. ఐక్యూ 7 ధరలు: (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 31,990 (8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 33,990 (12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 35,990 ఐక్యూ 7 ఫీచర్లు 6.62 అంగుళాల స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 13+2-మెగాపిక్సెల్ రియర్‌కెమెరా 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఐక్యూ 7 లెజెండ్ ధరలు (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 39,990 (12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 43,990 ఐక్యూ 7 లెజెండ్ ఫీచర్లు 6.62 అంగుళాల స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 13+13-మెగాపిక్సెల్ రియర్‌కెమెరా 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం చదవండి: రియల్మీ 5జీ స్మార్ట్‌ఫోన్ : సరసమైన ధరలో -
వన్ ప్లస్ కి పోటీగా ఐక్యూ 7
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ గతేడాది మనదేశంలో ఐక్యూ 3 పేరిట ఒక ఫోన్ తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి మనదేశంలో ఐక్యూ స్మార్ట్ఫోన్లు లాంచ్ చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో ఫ్లాగ్షిప్ ఐక్యూ 7 మొబైల్ ని తీసుకొనివచ్చింది. ఇప్పుడు మనదేశంలో కూడా ఐక్యూ 7ను మార్చి చివరి నాటికి లాంచ్ చేయడానికి ఆ కంపెనీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. దీనిలో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ది-బాక్స్ తీసుకురానున్నట్లు సమాచారం. ప్రముఖ టిప్‌స్టెర్ దేబయన్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి చివరి నాటికి ఐక్యూ 7 భారతదేశంలో లాంచ్ చేయనున్నారు. మరో రెండు స్మార్ట్ఫోన్లు ఏప్రిల్ చివరి నాటికి లాంచ్ అవుతాయి. ఐక్యూ 7 బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ చైనాలో సిఎన్‌వై 3,798(సుమారు రూ.43,100)కు,12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,198 యువాన్లుకు(సుమారు రూ.47,600) తీసుకొచ్చారు. వన్ ప్లస్ కి పోటీగా ఐక్యూ 7లో క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. ఐక్యూ 7 ఫీచర్స్(అంచనా) డిస్ప్లే: 6.62 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ రిఫ్రెష్ రేట్: 120హెర్ట్జ్ బ్యాటరీ: 4,000 ఎమ్ఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 120వాట్ ర్యామ్: 8జీబీ, 12జీబీ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 888 బ్యాక్ కెమెరా: 48 ఎంపీ + 13 ఎంపీ + 13 ఎంపీ సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ఓఎస్ కలర్స్: బ్లాక్, లేటెంట్ బ్లూ కనెక్టివిటీ: 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2 చదవండి: ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు? బిగ్ బ్యాటరీతో వస్తున్న గెలాక్సీ ఎఫ్ 62