సెప్టెంబరులో రానున్న 5G బెస్ట్‌ ఫోన్లు ఏవంటే? | iQOO Z7 Pro 5G With MediaTek Dimensity 7200 SoC Launched in India - Sakshi
Sakshi News home page

సెప్టెంబరులో రానున్న 5G బెస్ట్‌ ఫోన్లు ఏవంటే?

Published Thu, Aug 31 2023 3:49 PM | Last Updated on Thu, Aug 31 2023 7:39 PM

iQoo Z7 Pro 5G MediaTek Dimensity 7200 SoC Launched in India - Sakshi

iQoo Z7 Pro 5g భారత మార్కెట్‌లో ఐక్యూ జెడ్ 7 ప్రో (ఆగస్టు 31న లాంచ్ అయింది. Z7 లైనప్‌లో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో   తీసుకొచ్చింది  కంపెనీ. బ్లూ లగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్‌లలోరెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ ధరలు వరుసగా రూ.23,999, రూ.24,999గా  నిర్ణయించింది. (30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్‌ రాఖీ వేడుక: వీడియో వైరల్‌)

బ్యాంక్‌ ఆఫర్‌
అయితే బ్యాంక్‌ ఆఫర్‌ కింద రెండువేల రూపాయల తగ్గింపు అందిస్తోంది. దీని ప్రకారం వీటి ధరలు వరుసగా  రూ. 21,999, రూ. 22,999గా ఉంటాయి. అమెజాన్‌, ఐక్యూ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సెప్టెంబర్ 5, మధ్యాహ్నం 12 నుంచి సేల్‌ షురూ అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ CE 3తో పోలిస్తే తక్కువ ధరలో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. 

ఐక్యూ జెడ్7 ప్రో ఫీచర్లు : 6.78 అంగుళాల డిస్‌ప్లే, MediaTek Dimensity 7200 సాక్‌ ప్రాసెసర్‌, 2400x1080  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ , 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 64+2 ఎంపీ రియర్‌ డ్యుయల్‌ కెమెరాఉంటాయి.

చైనా టెక్నో పోవా ఫోన్లు
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్ రెగ్యులర్‌ స్మార్ట్‌ఫోన్లకు కాస్త భిన్నంగా ఉండే విధంగా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు పోవా 5, పోవా 5 ప్రో 5జీలను మార్కెట్లోకి విడుదల చేసింది.

Tecno Pova 5: పోవా 5 ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డి ప్లస్ 120Hz డిస్‌ప్లేతో వచ్చింది. మీడియాటెక్ హీలియో G99 6nm చిప్‌సెట్, 50MP ఏఐ డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W స్మార్ట్ ఛార్జ్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ ఫోన్‌  ప్రారంభ ధర రూ. 11,999

Tecno Pova 5 Pro 5G  120 Hz రిఫ్రెష్ రేట్‌తో , 6.78-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే (FHD+)   50-megapixel + VGA రియర్‌ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.  అలాగే 128GB, 256GB ఇంటర్నల్‌ స్టోరేజీ ప్రత్యేకత. Tecno Pova 5 Pro నానో-సిమ్ , నానో-సిమ్ కార్డ్‌ స్లాట్‌లను కలిగి ఉంటుంది. డ్యూయల్ సిమ్ (GSM ప్లస్‌ GSM) మొబైల్. ఇది డార్క్ ఇల్యూషన్ , సిల్వర్ ఫాంటసీ రంగులలో అందుబాటులో ఉంది.  Tecno Pova 5 Pro 5జి ప్రారంభ ధర రూ. 14,999.

సెప్టెంబర్‌లో లాంచ్‌  అవుతున్న  టాప్‌ స్మార్ట్‌ఫోన్లు
వీటితోపాటు  ఈ సెప్టెంబరులో  ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్‌ 15,  15 ప్లస్‌,  ఐఫోన్‌ 15ప్రొ, ఐఫోన్‌ 15ప్రొ  మ్యాక్స్‌  తదితర ఫోన్లు లాంచ్‌ కానున్నాయి.ఇంకా హానర్‌ 90 మొబైల్‌ తయారీ దారు హానర్‌ రెండేళ్ల   తరువాత భారత మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది.  6.4-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLED డిస్‌ప్లే,50 ఎంపీ  ట్రిపుల్ రియర్ కెమెరా  లాంటి ఫీచర్లతో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఈ (Samsung Galaxy S23 FE) లాంచ్‌ కానుంది.  అలాగే Moto G54  5G స్మార్ట్‌ఫోన్‌  ఈనెలలోనే రానుంది. 6.5-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లే, 8 జీబీ  ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 50 ఎంపీ కెమెరా లాంటి ఫీచర్లుంటాయని అంచనా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement