సాక్షి, హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ వివోకు చెందిన ఐక్యూ మొబైల్స్ తాజాగా మరో రెండు మోడల్లను భారత్‌లో లాంచ్ చేసింది. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తొలుత ఐక్యూ నియో 5ను రిలీజ్ చేయగా, దానినే రిబ్రాండ్ చేస్తూ ఐక్యూ 7గా రిలీజ్ చేసింది. దాంతో పాటుగా ఐక్యూ 7 లెజెండ్‌ను భారత విపణిలోకి లాంచ్ చేసింది. ఐక్యూ 7 లెజెండ్ మొబైల్‌ను ప్రముఖ మోటార్‌స్పోర్ట్ కంపెనీ బీఎమ్‌డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసింది. ఐక్యూ 7, ఐక్యూ 7 లెజెండ్ ట్రిపుల్ రియర్ కెమెరాలను కల్గి ఉన్నాయి. దాంతో పాటుగా 66వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కాగా ఐక్యూ 7, ఎమ్‌ఐ 11 ఎక్స్‌తో పోటీ పడుతుండగా, ఐక్యూ 7 లెజెండ్ ఎమ్‌ఐ 11 ఎక్స్ ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ ఫోన్లకు సరితూగుతుంది. ఐక్యూ 7 స్టార్మ్ బ్లాక్, సాలిడ్ ఐస్ బ్లూ కలర్‌లో లభిస్తుంది.
ఐక్యూ 7 ధరలు:
- (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 31,990
- (8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 33,990
- (12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 35,990
ఐక్యూ 7 ఫీచర్లు
- 6.62 అంగుళాల స్క్రీన్
- 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్
- ఆండ్రాయిడ్ 11
- క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 48+ 13+2-మెగాపిక్సెల్ రియర్‌కెమెరా
- 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్
- 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
ఐక్యూ 7 లెజెండ్ ధరలు
- (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 39,990
- (12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 43,990
ఐక్యూ 7 లెజెండ్ ఫీచర్లు
- 6.62 అంగుళాల స్క్రీన్
- 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్
- ఆండ్రాయిడ్ 11
- క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 48+ 13+13-మెగాపిక్సెల్ రియర్‌కెమెరా
- 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్
- 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
Comments
Please login to add a commentAdd a comment