ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ గతేడాది మనదేశంలో ఐక్యూ 3 పేరిట ఒక ఫోన్ తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి మనదేశంలో ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో ఫ్లాగ్‌షిప్ ఐక్యూ 7 మొబైల్ ని తీసుకొనివచ్చింది. ఇప్పుడు మనదేశంలో కూడా ఐక్యూ 7ను మార్చి చివరి నాటికి లాంచ్ చేయడానికి ఆ కంపెనీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. దీనిలో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ది-బాక్స్ తీసుకురానున్నట్లు సమాచారం.
ప్రముఖ టిప్‌స్టెర్ దేబయన్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి చివరి నాటికి ఐక్యూ 7 భారతదేశంలో లాంచ్ చేయనున్నారు. మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఏప్రిల్ చివరి నాటికి లాంచ్ అవుతాయి. ఐక్యూ 7 బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ చైనాలో సిఎన్‌వై 3,798(సుమారు రూ.43,100)కు,12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,198 యువాన్లుకు(సుమారు రూ.47,600) తీసుకొచ్చారు. వన్ ప్లస్ కి పోటీగా ఐక్యూ 7లో క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు సమాచారం.
ఐక్యూ 7 ఫీచర్స్(అంచనా)
డిస్‌ప్లే: 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్
రిఫ్రెష్ రేట్: 120హెర్ట్జ్
బ్యాటరీ: 4,000 ఎమ్ఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్: 120వాట్
ర్యామ్: 8జీబీ, 12జీబీ
స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 888
బ్యాక్ కెమెరా: 48 ఎంపీ + 13 ఎంపీ + 13 ఎంపీ
సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ
ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ఓఎస్
కలర్స్: బ్లాక్, లేటెంట్ బ్లూ
కనెక్టివిటీ: 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment