ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో భారత మార్కెట్లలోకి కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. వివో కంపెనీ వై సిరీస్‌లో భాగంగా వివో వై 53 ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎం 51 వంటి స్మార్ట్‌ఫోన్లకు గట్టిపోటీని ఇవ్వనుంది. వివో వై53 స్మార్ట్‌ఫోన్‌ను మొదటిసారిగా వియత్నాంలో గతనెలలో లాంచ్ చేసింది.
భారత్ మార్కెట్లో వివో వై53ఎస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,490గా నిర్ణయించారు. డీప్ బ్లూ, ఫెంటాస్టిక్ రెయిన్‌బో కలర్ వేరియంట్లలో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ స్టోర్, వివో ఇండియా ఈ-స్టోర్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ ఆఫర్లలో భాగంగా వివోవై53 ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్‌పై కొనుగోలు చేస్తే రూ. 1500 క్యాష్‌బ్యాక్ రానుంది.
వివో వై53ఎస్ ఫీచర్లు
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటిండ్ సిస్టమ
- 6.58-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) డిస్‌ప్లే
- 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 20: 9 యాస్పెక్ట్ రేషియో
- మీడియాటెక్‌హెలియో జీ20 ప్రాసెసర్
- 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
- యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్
- 64ఎమ్‌పీ రియర్ కెమెరా
- 16ఎమ్‌పీ ఫ్రంట్ కెమెరా
- 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
- 5000ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment