మనిషి గట్టిగా అనుకోవాలే గానీ ఏదైనా సాధిస్తాడు అనటానికి మరో నిదర్శనం 23 సంవత్సరాల 'శ్వేతాంక్ పాండే' (Shwetank Pandey). ఇంతకీ ఇతడెవరు, సాధించిన విజయం ఏమిటి అనే మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్వేతాంక్ పాండేకి చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే అతన్ని ఒక గేమింగ్ కంపెనీలో రూ.10 లక్షల ప్యాకేజీతో జాబ్ కొట్టేలా చేసింది. గేమ్స్ ఆడితే భవిష్యత్ ఉండదనే పాత కాలపు నమ్మకానికి చెక్ పెట్టి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ iQOOలో చీప్ గేమింగ్ ఆఫీసర్ (CGO)గా ఎంపికయ్యాడు.
60వేల మందికి ఒకడు..
నిజానికి శ్వేతాంక్ పాండే ఒక స్మార్ట్‌ఫోన్ కొనటానికి ఏడాదంతా ఉద్యోగం చేసినట్లు వెల్లడించాడు. అలాంటిది ఇప్పుడేకంగా మొబైల్ తయారీ కంపెనీలోనే మంచి జాబ్ కొట్టేశాడు. ఐకూలో చీప్ గేమింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి 60వేల మంది పోటీ పడితే అందులో పాండే గొప్ప ప్రతిభ చూపి ఉద్యోగం కైవసం చేసుకున్నాడు.
తనకు ఇష్టమైన గేమింగ్స్ ఆడటానికి ఇంట్లో వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో 12వ తరగతి చదువుకునే రోజుల్లోనే ఈ-స్పోర్ట్స్ ఆడటం మొదలుపెట్టి గ్రాడ్యుయేట్ కూడా పూర్తి చేసాడు. ఓపక్క చదువుకుంటూనే తాను అనుకునే రంగంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నాడు.
ఇదీ చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే కారు! అంబానీ కారు అదిరిపోలా..
చదువు పూర్తయిన తరువాత ఒక సంవత్సరం ఉద్యోగం చేసి.. తరువాత ఒక ఫోన్ కొనుగోలు చేసి అందులోనే గేమింగ్ ఆడటం మొదలుపెట్టాడు. ఇలా సాధించిన మెళకువలతోనే ఐకూలో ఉద్యోగం సాధించగలిగాడు. ఆ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడే ఫైనల్ వరకు చేరతాననే నమ్మకం ఉండేదని పాండే వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment