మార్కెట్లోకి మరో కిల్లర్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్ అదుర్స్! | iQoo 8, iQoo 8 Legend Tipped to Launch in India Soon | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి మరో కిల్లర్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్ అదుర్స్!

Published Mon, Oct 25 2021 8:47 PM | Last Updated on Mon, Oct 25 2021 8:47 PM

iQoo 8, iQoo 8 Legend Tipped to Launch in India Soon - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్‌ బ్రాండ్‌ వివోకు చెందిన ఐక్యూ మొబైల్స్‌ తాజాగా మరో రెండు ఐక్యూ 8, ఐక్యూ 8 లెజెండ్ మోడల్లను భారత్‌లో లాంచ్‌ చేసేందుకు సిద్దం అవుతుంది. ఐక్యూ 8ప్రో మొబైల్ భారత మార్కెట్లో ఐక్యూ 8 లెజెండ్‌గా రానుంది. ఈ రెండు ఫోన్లను ఆగస్టులో చైనాలో లాంఛ్ చేశారు. ఐక్యూ 8, ఐక్యూ 8 లెజెండ్ రెండూ ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉన్నాయి. వీటిని ప్రముఖ మోటార్‌స్పోర్ట్‌ కంపెనీ బీఎమ్‌డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్‌ చేసింది.

ఈ నెల చివరలో లేదా వచ్చే నెల ప్రారంభంలో మన ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఐక్యూ 8, ఐక్యూ 8 లెజెండ్ ఫోన్స్ ఇండియా ధర తెలియదు. కానీ, ఈ స్మార్ట్ ఫోన్ల చైనా మార్కెట్ ధరనే కలిగి ఉండే అవకాశం ఉంది. చైనాలో ఐక్యూ 8 ధర సీఎన్ వై 3,799(సుమారు రూ.43,600)గా ఉంటే, ఐక్యూ 8 లెజెండ్‌ ధర సీఎన్ వై 4,999(సుమారు రూ.57,300)గా ఉంది. (చదవండి: జియోను వెనక్కినెట్టిన వోడాఫోన్‌ ఐడియా...!)

ఐక్యూ 8 ఫీచర్లు(అంచనా)

  • 6.56 అంగుళాల స్క్రీన్‌
  • 1080x2,376 పిక్సెళ్ల రిజల్యూషన్‌
  • ఆండ్రాయిడ్‌ 11 ఓఎస్
  • క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 48 + 13+ 2 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా
  • 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌
  • 4,350 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
  • 120 డబ్ల్యు ఫాస్ట్ చార్జర్

ఐక్యూ 8 లెజెండ్‌  ఫీచర్లు(అంచనా)

  • 6.62 అంగుళాల స్క్రీన్‌
  • 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్‌
  • ఆండ్రాయిడ్‌ 11 ఓఎస్
  • క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్‌ 888 ప్లస్ ప్రాసెసర్
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 50 + 48 + 16 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా
  • 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌
  • 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
  • 120 డబ్ల్యు ఫాస్ట్ చార్జర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement