
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీ సంస్థ ఐకూ తాజాగా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఐకూ 11ను ఆవిష్కరించింది. దేశీయంగా ఈ తరహా స్మార్ట్‌ఫోన్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని సంస్థ తెలిపింది. వేరియంట్‌ను బట్టి దీని ధర రూ. 59,999 నుంచి రూ. 64,999గా ఉంటుంది.
ఆఫర్ ప్రకారం రూ. 51,999 నుంచి రూ. 56,999కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. జనవరి 12న ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్ కింద అదనంగా ఐకూ రూ. 1,000 డిస్కౌంటును ప్రకటించింది. జనవరి 13 నుంచి ఐకూ ఈ–స్టోర్, అమెజాన్‌డాట్‌ఇన్‌లో ఇది లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 గి ఫ్లాష్‌చార్జ్ టెక్నాలజీ, 6.78 అంగుళాల స్క్రీన్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి. 8జీబీ+256జీబీ, 16జీబీ+256జీబీ వేరియంట్లలో ఇది లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment