
కాలేజీ విద్యార్థులు, టెక్నాలజీ ఔత్సాహికులు, యువ గేమర్ల కోసం రూపొందించిన నియో10ఆర్ స్మార్ట్‌ఫోన్‌ను ఐకూ ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా ఉంటుంది. అమెజాన్, ఐకూ ఈ–స్టోర్లలో మార్చ్ 19 నుంచి అందుబాటులో ఉంటుంది. దీనికోసం ప్రీ–బుకింగ్స్ ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.
ఐకూ నియో 10ఆర్ 5జీ స్మార్ట్‌ఫోన్ మూన్‌నైట్ టైటానియం, రేజింగ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్ నుండి ఫోన్ పొందినప్పుడు ఫోన్ సెటప్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో వస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.26,999, రూ.28,999, రూ.30,999. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డుతో కొంటే రూ.2,000 తక్షణ డిస్కౌంట్, రూ.2000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.
ఫోన్ స్పెసిఫికేషన్లు
ఇందులో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ థర్డ్ జనరేషన్ చిప్‌సెట్, 6400 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, ఫన్‌టచ్ ఓఎస్ 15 తదితర ఫీచర్లు ఉన్నాయి. LPDDR5X ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 4.1 ఇంటర్నల్ స్టోరేజ్. ఈ ఫోన్ యాన్ టు టెస్ట్ లో 1.7+ మిలియన్ పాయింట్లు సాధించింది. అలాగే ఐపీ 65 రేటింగ్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ లో 3 ఏళ్ల ఓఎస్ అప్ డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment