న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ కొత్తగా జెడ్7 ప్రో 5జీ ఫోన్‌ను ఆగస్టు 31న ఆవిష్కరించనుంది. ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్‌లో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 మొబైల్ ప్లాట్‌ఫాం, 3డీ కర్వ్‌డ్ సూపర్ విజన్ అమోలెడ్ డిస్‌ప్లే, 64 ఎంపీ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వివరించింది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వెర్షన్లలో లభ్యం.
ఫీచర్లు
6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
4nm MediaTek డైమెన్సిటీ 7200 SoC
64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా
2 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్‌తో
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4,600mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇది కూడా చదవండి:
గుడ్‌ఇయర్ భాగస్వామ్యంతో అష్యూరెన్స్ బ్యాటరీలు
న్యూఢిల్లీ: టైర్ల తయారీ సంస్థ గుడ్‌ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ నుంచి తీసుకున్న అధికారిక లైసెన్సు కింద అష్యూరెన్స్ ఇంటర్నేషనల్ కొత్త ఫిల్టర్లు, బ్యాటరీల శ్రేణిని ఆవిష్కరించింది. వీటిని భారత్‌లోనే తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. దేశీయంగానే కాకుండా దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆ్రస్టేలియా న్యూజిలాండ్ మార్కెట్లలో విక్రయించనున్నట్లు వివరించింది. ఆగస్టు ఆఖరు నాటికి ఈ బ్యాటరీలు, ఫిల్టర్లు మార్కెట్లోకి రాగలవని అష్యూరెన్స్ ఇంటర్నేషనల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment