వివో వాలెంటైన్స్‌ డే గిఫ్ట్‌ | Infinite Red Vivo V7 Plus limited edition smartphone launched in India for Rs 22,990 | Sakshi
Sakshi News home page

వివో వాలెంటైన్స్‌ డే గిఫ్ట్‌

Published Mon, Feb 5 2018 7:11 PM | Last Updated on Mon, Feb 5 2018 7:11 PM

Infinite Red Vivo V7 Plus limited edition smartphone launched in India for Rs 22,990 - Sakshi

సాక్షి, ముంబై:   చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ వివో  వాలెండైన్స్‌ కానుకను అందిస్తోంది.  వివో వి7 ప్లస్‌లో స్పెషల్‌ ఎడిషన్‌ను సోమవారం  లాంచ్‌ చేసింది.   ప్రముఖ ఫ్యాషన్‌​ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాతో  భాగస్వామ‍్యం తో వివో 7 ప్లస్‌  ఇన్ఫినిట్ రెడ్ కలర్ వేరియెంట్‌ను విడుదల చేసింది.  దీని ధరను రూ.22,990 ధరగా నిర్ణయించింది.    వాలెంటైన్స్ డే కానుక‌గా ప్రేమికుల కోసం  ఈ డివైస్‌ వెనుక గుండె ఆకారంలో ఉన్న స్పెషల్‌ డిజైన్‌ ముద్రించి మరీ ప్ర‌త్యేకంగా విడుద‌ల చేసింది. 

దేశవ్యాప్తంగా  అమెజాన్‌ ద్వారా అన్ని ఆన్‌లైన్‌  స్టోర్లలో ఇది ప్రత్యేకంగా లభ్యం కానుందని వివో ఒక ప్రకటనలో తెలిపింది.  వీ7ప్లస్‌ మనీష్‌ మల్హోత్రా స్పెషల్‌ ఎడిషన్‌ లాంచ్‌ చేయడం సంతోషంగా ఉందని వివో ఇండియా సీఈవో  కెన్నీ  జాంగ్‌   వెల్లడించారు. తమ కస‍్టమర్లు తమ  ప్రేమను మరింత ఎలిగెంట్‌గా ఆకర్షణీయమైన పద్ధతిలో తెలియజేసేందుకు ఒక అవకాశాన్ని అందిస్తున్నామన్నారు.  వివోతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందనీ,  యువత  ఉత్సాహాన్ని, అపారమైన ప్రేమకు  చిహ‍్నంగా దీన్ని రూపొందించినట్టు మనీష్‌ మల్హోత్రా చెప్పారు. కాగా  వీ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన విషయం విదితమే. అయితే  వీ 7ప్లస్‌ లాంచింగ్‌ (బ్లూకలర్‌ వేరియంట్‌)వ ధర రూ. 21,990.

లాంచింగ్‌ ఆఫర్లు
 రూ.500 విలువచేసే బుక్‌ మై షో , ఫెర్న్స్‌ అండ్‌ పెటల్స్‌ కూపన్లు,
 ఎక్సేంజ్‌ ద్వారా రూ.3వేల దాకా  తగ్గింపు.


వివో వీ7 ప్లస్ ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్‌హెచ్‌డీ 18: 9 నిష్పత్తిని 'ఫుల్ వ్యూ'
 గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,1440x720 రిజల్యూషన్‌
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1.2నౌగట్
4 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
16 ఎంపీ రియర్‌ కెమెరా,
24 ఎంపీ సెల్ఫీ కెమెరా,
3225 ఎంఏహెచ్ బ్యాటరీ

 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement