Limited Edition
-
టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్‌తో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా కాంపాక్ట్ ఎస్యూవీ టైజర్ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.20,160 విలువ చేసే టయోటా జెనివిన్ యాక్సెసరీస్ కిట్‌ను ఆఫర్ చేస్తోంది.అన్ని టర్బో వేరియంట్లలో అక్టోబర్ 31 వరకే ఇది లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.10.56 లక్షలు. ఇప్పటికే కంపెనీ పండుగ సీజన్ కోసం ఇతర మోడళ్లలోనూ లిమిటెడ్ ఎడిషన్లను అందుబాటులోకి తెచ్చింది. -
50 మందికే ఈ బీఎండబ్ల్యూ కారు
బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ ఈ సంవత్సరం ప్రారంభంలో కాంకోర్సో డి'ఎలెగాంజా విల్లా డి'ఎస్టేలో ఒక కాన్సెప్ట్‌గా మొదటిసారిగా కనిపించింది. అయితే ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకుంది. కానీ ఇది కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితమైనట్లు సమాచారం.బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్ పొందుతుంది. ఇది 617 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ రోడ్‌స్టర్ 8 స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.రెండు సీట్లు కలిగిన ఈ కారు షార్ప్ అండ్ యాంగ్యులర్ ఫ్రంట్ ఎండ్, ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది. ఇందులో డోర్ హ్యాండిల్స్ లేకపోవడాన్ని గమనించవచ్చు. లోపలి భాగం మొత్తం ఎరుపు-గోధుమ రంగులో ఉండటం చూడవచ్చు. గేర్ సెలెక్టర్‌కు క్రిస్టల్ లాంటి రూపాన్ని అందించారు.ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా: ఎందుకంటే..బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ క్యాబిన్లో ప్రీమియం బోవర్స్ & విల్కిన్స్ సౌండ్ సిస్టమ్ ఉంది. మిగిలిన అన్ని ఫీచర్స్ దాదాపు 8 సిరీస్ మోడల్లో మాదిరిగానే ఉన్నట్లు సమాచారం. ఈ కారు ధర, ఇతర వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. లాంచ్ డేట్, డెలివరీ డీటైల్స్ కూడా తెలియాల్సి ఉంది. -
వ్రతం.. వజ్రం..! వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఈ డిజైన్..
సాక్షి, సిటీబ్యూరో: వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్‌ను బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఆధ్వర్యంలోని ‘త్యాని బై కరణ్ జోహార్’ ఆభరణాల స్టోర్ రూపొందించింది. ఈ ఆభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్‌లోని షోరూమ్‌లో మంగళవారం విడుదల చేశారు. ఈ కలెక్షన్లో సంప్రదాయాలను ఆధునికతలను మేళవించిన ఆభరణాలు ఉన్నాయని, వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఇవి డిజైన్ చేయడం జరిగిందని త్యాని నిర్వాహకులు రిషబ్ తెలిపారు. అదేవిధంగా విభిన్న రకాల మేలిమి వజ్రాభరణాలు కూడా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సరికొత్త కలెక్షన్ ప్రదర్శించారు. -
49 మందికే రామ్ మందిర్ వాచ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
స్విస్ వాచ్ తయారీదారు జాకబ్ & కో భారతదేశంలోని దాని రిటైలర్ భాగస్వామి ఎథోస్ వాచ్ బోటిక్స్ సహకారంతో 'రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్' లాంచ్ చేసింది. ఈ వాచ్ కేవలం 49 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. దీని ధర 41000 డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34,00,000.జాకబ్ & కో లాంచ్ చేసిన ఈ వాచ్ ఈ వాచ్‌లో అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం, రాముడు, హనుమంతుని నమూనాలు ఉన్నాయి. ఇది కుంకుమపువ్వు రంగులో ఉంది. దీనికి కేవలం 49మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.భారతీయ సంస్కృతికి నిదర్శనంగా సంస్థ ఈ వాచ్ లాంచ్ చేసింది. ఈ వాచ్‌లో 9 గంటల వద్ద రామ మందిరం, 2 గంటల వద్ద రాముడు, 4 గంటల వద్ద హనుమంతుడు ఉండటం చూడవచ్చు. ఈ వాచ్ కలర్ ఆధ్యాత్మికతకు ప్రతీకగా చెబుతున్నారు. దీనిని ప్రధానంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిధ్వనించేలా రూపొందించారు. View this post on Instagram A post shared by WatchTime India (@watchtimeindia) -
కేవలం 100 మందికి మాత్రమే ఈ బైక్.. వేలంలో కొనాల్సిందే
దేశంలో అతి పెద్ద టూ-వీలర్ తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన హీరో మోటోకార్ప్ తన సెంటెనియల్ ఎడిషన్ మోటార్‌సైకిల్ విక్రయాలను ప్రకటించింది. జనవరిలో జరిగిన హీరో వరల్డ్ ఈవెంట్లో పరిచయమైన ఈ బైక్ త్వరలో రోడ్డుపైకి రానుంది. అయితే కేవలం 100 యూనిట్లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది.హీరో మోటోకార్ప్ ఫౌండర్ డాక్టర్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ 101వ పుట్టినరోజు సందర్బంగా కంపెనీ సెంటెనియల్ ఎడిషన్ బైకును విక్రయించనుంది. ఈ బైక్‌ను తమ 'ఉద్యోగులు, సహచరులు, వ్యాపార భాగస్వాములు, వాటాదారుల' కోసం ప్రత్యేకంగా వేలం వేయనున్నట్లు హీరో ప్రకటించింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంస్థ సమాజం మేలు కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం. డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి.హీరో సెంటెనియల్ ఎడిషన్ అనేది కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కార్బన్ ఫైబర్ బాడీవర్క్, సింగిల్ సీట్, ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్, కార్బన్ ఫైబర్ ఎగ్జాస్ట్ మఫ్లర్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల స్టాండర్డ్ బైక్ కంటే ఇది 5.5 కేజీలు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది.Hero MotoCorp introduces The Centennial Collector's Edition Motorcycle. Designed, sculpted, and etched with the utmost reverence. This masterpiece is meticulously handcrafted for only the chosen one hundred. On auction for the greater good.#HeroMotoCorp #TheCentennial pic.twitter.com/nD9ddlkq3j— Hero MotoCorp (@HeroMotoCorp) July 1, 2024 -
హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్.. రూ.80 వేలకే!
ఏదైనా స్కూటర్ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నవారికి శుభవార్త ఇది. దేశంలో స్కూటర్లలో ప్రముఖంగా పేరొందిన హోండా యాక్టీవా (Honda Activa) లిమిటెడ్ ఎడిషన్ తాజాగా మార్కెట్లో లాంచ్ అయింది. హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ (Honda Activa Limited Edition) ఎక్స్ షోరూమ్ ధర రూ.80,734 మాత్రమే. ఇది డీఎల్ఎక్స్ ట్రిమ్ మోడల్ ధర. ఇక స్మార్ట్ ట్రిమ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.82,734. లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి తక్కువ యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. కావాలనుకున్నవారు దేశవ్యాప్తంగా ఉన్న హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌ల వద్ద వీటిని బుక్ చేసుకోవచ్చు. ఈ పరిమిత ఎడిషన్ స్కూటర్లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ రంగుల్లో ఇది లభ్యమవుతుంది. ఇందులో డార్క్ కలర్ థీమ్, బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్లు ఉంటాయి. DLX వేరియంట్లో అల్లాయ్ వీల్స్ ఉండగా, స్మార్ట్ వేరియంట్లో హోండా స్మార్ట్ కీ ఫీచర్ ఉంటుంది. -
ఈ కారు కేవలం 10 మందికి మాత్రమే.. ఎందుకింత స్పెషల్ అంటే?
Pininfarina B95 Roadster: ఇప్పటి వరకు ఖరీదైన బైక్ గురించి తెలుసుకున్నాం, ఖరీదైన ఫ్యూయెల్ కారు గురించి తెలుసుకున్నాం.. అయితే ఈ కథనంలో ప్రపంచంలోనే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుని పినిన్‌ఫరినా (Pininfarina) అనే కంపెనీ ఆవిష్కరించింది. దీని ధర 4.4 మిలియన్ యూరోలు.. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 39.8 కోట్లు. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఈవీ కారుగా ఇది ప్రసిద్ధి చెందింది. 10 యూనిట్లు మాత్రమే.. పినిన్‌ఫరినా కంపెనీ ఈ 'బి95 రోడ్‌స్టర్' హైపర్ కారుని కేవలం 10 యూనిట్లు మాత్రమే తయారు చేయనున్నట్లు సమాచారం. కంపెనీ 95వ యానివెర్సరీ సందర్భంగా 2025లో డెలివరీలు చేయనున్నట్లు సమాచారం. స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ కారు అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: మనవాళ్లు వారానికి 22గంటలు సోషల్ మీడియాలోనే.. ఆశ్చర్యపరుస్తున్న నిజాలు! గరిష్ట వేగం గంటకు 300 కిమీ.. పినిన్‌ఫరినా బి95 దాని బాటిస్టా మాదిరిగానే అదే పవర్‌ట్రెయిన్ పొందుతుంది. కావున 120 ఇందులోని కిలోవాట్ బ్యాటరీ మంచి పనితీరుని అందిస్తుంది. ఇది కేవలం 2 సెకన్లలోపు గంటకు 0 నుంచి 96 కిమీ/గం వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 300 కిమీ కావడం గమనార్హం. ఇందులో కాల్మా, పురా, ఎనర్జికా, ఫ్యూరియోసా అండ్ కరాటెరే అనే ఐదు డ్రైవింగ్ మోడ్లు లభిస్తాయి. బి95 రోడ్‌స్టర్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 450 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని మోటార్ 1900 హార్స్ పవర్ అండ్ 2340 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 270 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 25 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. -
ఈ బీఎండబ్ల్యూ కారు లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే - ధర ఎంతో తెలుసా?
లగ్జరీ కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'బీఎండబ్ల్యూ' (BMW) దేశీయ మార్కెట్లో ఒక కొత్త కారుని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ లేటెస్ట్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బీఎండబ్ల్యూ విడుదల చేసిన ఈ కొత్త కారు 'ఎక్స్3 ఎమ్40ఐ'. ఈ SUV కేవలం లిమిటెడ్ ఎడిషన్‌గా లభిస్తుంది. కావున ఇది ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. కావున ఆసక్తికలిగిన కొనుగోలుదారులు దీనిని కంపెనీ అధికారిక వెబ్సైట్లలో లేదా, సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఎక్స్3 ఎమ్40ఐ కారు అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది బ్రూక్లిన్ గ్రే అండ్ బ్లాక్ సఫైర్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఎమ్ కిడ్నీ గ్రిల్ చూడవచ్చు. అంతే కాకుండా ముందు భాగంలో మ్యాట్రిక్స్ ఫంక్షన్ తో కూడిన అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సైడ్ ప్రొఫైల్ లో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ రెడ్ బ్రేక్ కాలిపర్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎన్ఆర్ఐ ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది మల్టీఫంక్షన్తో లెదర్ స్టీరింగ్ వీల్, కాంట్రాస్ట్ స్టిచింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెల్కమ్ లైట్ కార్పెట్, యాంబియంట్ లైటింగ్, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, 16-స్పీకర్ హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎమ్40ఐ 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి 360 hp పవర్, 500 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కినీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ఇక చివరగా ప్రధానమైనది సేఫ్టీ ఫీచర్స్, ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, డైనమిక్ బ్రేకింగ్ లైట్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ మొదలైనవి ఉంటాయి. -
ఓలా స్కూటర్ నుంచి లిమిలెడ్ ఎడిషన్.. కాషాయరంగులో అదిరిపోయింది !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో స్కూటర్ తదుపరి విక్రయాలు మార్చి 17, 18న మొదలు కానున్నాయి. ఏప్రిల్ నుంచి డెలివరీలు ఉంటాయి. గ్లాసీ ఫినిష్‌తో స్పెషల్ ఎడిషన్ గెరువా రంగుతో స్కూటర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. ఆ రెండు రోజుల్లో మాత్రమే ఈ రంగు వాహనం లభిస్తుందని వివరించింది. ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లు 17న, కొత్త వారు 18న కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఎస్1 ప్రో ఇప్పటికే 10 రంగుల్లో లభిస్తుంది. హోలి పండుగ నేపథ్యంలో ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు. In between deliveries, the @olaelectric marketing team figured out our Holi plan after all! Launching the S1 Pro in a beautiful new colour - गेरुआ 🧡!! Purchase window opens for reservers on 17th and for EVERYONE ELSE on 18th only on the Ola app! Holi hai!🛵⚡ pic.twitter.com/TfbEB8SQD3 — Bhavish Aggarwal (@bhash) March 14, 2022 -
అదిరే లుక్స్, హై రేసింగ్ పర్ఫార్మెన్స్తో నయా టీవీఎస్ అపాచీ లిమిటెడ్ ఎడిషన్ బైక్!
ప్రముఖ టూవీలర్ వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ న్యూ రేస్ పర్ఫార్మెన్స్ (ఆర్పీ) సిరీస్ బైక్‌లను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ మొదటి బైక్‌గా నిలవనుంది. ఈ బైక్‌ను కొనుగోలుదారులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చును. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌గా రానుంది. కేవలం 200 యూనిట్లను మాత్రమే టీవీఎస్ ఉత్పత్తి చేయనుంది. దీని ధర రూ. 1,45,000(ఎక్స్ షోరూమ్ ధర) టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ ఫీచర్స్..! ఈ బైక్‌లో అధునాతన 164.9 సీసీ సింగిల్-సిలిండర్ 4-వాల్వ్ ఇంజన్‌తో రానుంది. 10,000 ఆర్పీఎమ్ వద్ద 19 బీహెచ్పీ, 8,750 ఆర్పీఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ శక్తిని విడుదల చేయనుంది. ఈ బైక్‌లో కొత్త సిలిండర్ హెడ్, ట్విన్ ఎలక్ట్రోడ్ స్పార్క్ ప్లగ్‌తో రానుంది. రేసింగ్ పర్ఫెర్మెన్స్ కోసం హై-లిఫ్ట్, హై-డ్యూరేషన్ క్యామ్స్ , డ్యూయల్ స్ప్రింగ్ యాక్యుయేటర్లను అమర్చారు. అధిక కంప్రెషన్ రేషియో కోసం కొత్త డోమ్ పిస్టన్ పరిచయం చేసింది. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీనిలో రేస్-ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్, సర్దుబాటు చేయగల క్లచ్, బ్రేక్ లివర్లను కూడా కలిగి ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ బైక్‌లో రేసింగ్ డీకాల్స్, రెడ్ అల్లాయ్ వీల్స్ ,కొత్త సీట్ ప్యాటర్న్‌తో రానుంది. కొత్త హెడ్‌ల్యాంప్ అసెంబ్లీతో పాటు ఫ్రంట్ పొజిషన్ ల్యాంప్స్ (FPL)తో పాటుగా లో,హైబీమ్తో ఏకకాలంలో పని చేయనుంది. చదవండి: టూవీలర్ కొనుగోలుదారులకు మరోసారి భారీ షాక్..! -
స్పైడర్‌మ్యాన్ క్రేజ్..! మార్కెట్లలోకి సూపర్ హీరోస్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్స్
Tvs Ntorq 125 Price And Mileage: ప్రపంచవ్యాప్తంగా మార్వెల్స్ హీరోస్‌పై క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీలు మార్వెల్స్ హీరోస్ స్ట్రాటజీతో తమ వ్యాపారాలకు మరింత ఆదాయాలను సంపాదించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16 న రిలీజైన స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్ వెండి తెర సంచలనం సృష్టిస్తోంది. భారత్‌లో కూడా స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్ క్రేజ్ మామూలుగా లేదు. మార్వెల్స్ హీరోస్ లవర్స్ కోసం ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మార్వెల్స్ సూపర్ హీరోస్ ఎడిషన్ స్కూటర్లను లాంచ్ చేసింది. చదవండి: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..! అందులో టీవీలు, హెడ్‌ఫోన్స్, ఇంకా మరెన్నో..! టీవీఎస్ మోటార్ కంపెనీ టీవీఎస్ NTORQ 125 సూపర్‌స్క్వాడ్ ఎడిషన్‌లో భాగంగా మరో రెండు మార్వెల్ సూపర్ హీరోస్ స్పైడర్ మ్యాన్, థోర్ ప్రేరేపిత స్కూటర్లను కంపెనీ విడుదల చేసింది. గత ఏడాది సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌లో భాగంగా మార్వెల్ సూపర్ హీరోస్ - ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా ఎడిషన్ టీవీఎస్ Ntorq 125బైక్‌లను ప్రారంభించింది. భారత్‌లోకి RT-Fi సాంకేతికతతో వచ్చిన మొట్టమొదటి బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన స్కూటర్‌గా టీవీఎస్ Ntorq 125 నిలుస్తోంది. సూపర్ హీరోస్ ఫీచర్స్‌తో..! కొత్త మార్వెల్ స్పైడర్ మ్యాన్ , థోర్ వెర్షన్లు స్కూటర్స్ సూపర్ హీరోల ముఖ్య లక్షణాలను టీవీఎస్ Ntorq 125 ఏర్పాటుచేశారు. స్పైడర్ మ్యాన్, థోర్ కు సంబంధించిన విషయాలను ఇందులో ఉండేలా టీవీఎస్ డిజైన్ చేసింది. ఈ స్కూటర్లలోని స్మార్ట్‌కనెక్ట్ యాప్ స్పైడర్ మ్యాన్ లోగో , థోర్స్ హమర్ వంటి సంబంధిత పాత్రల చిహ్నాల సిల్హౌట్‌తో ఒపెన్ కానుంది.ఈ స్కూటర్లు మార్వెల్ సూపర్ హీరోస్ అనుభూతిని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ధర ఎంతంటే..! టీవీఎస్ NTORQ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 84,850 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ స్కూటర్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు... స్కూటర్ మొదటి-రకం వాయిస్ అసిస్ట్ ఫంక్షన్, మొదటి-ఇన్-సెగ్మెంట్ డ్యూయల్ రైడ్ మోడ్‌లను అందించే వేరియంట్‌తో రానుంది. చదవండి: మల్టీప్లెక్సుల బిజినెస్ అదరహో.. సాయం చేసిన స్పైడర్‌మ్యాన్- భరోసా ఇచ్చిన పుష్ప -
120 సెకండ్లలో హాట్‌కేకుల్లా అమ్ముడైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఇవే...!
Royal Enfield 650 Twins Anniversary Edition: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లకు ఉండే క్రేజే వేరు. కొద్దిరోజుల క్రితం రాయల్ ఎన్ఫీల్డ్ 120 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు ఫ్లాగ్షిప్ ఎడిషన్ 650 సీసీ బైక్‌లను లాంచ్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైక్‌లను కొనుగోలుదారులకు డిసెంబర్ 6న ఆన్లైన్ వెబ్సైట్లో అమ్మకానికి రాగా..బుల్లెట్ బైక్ లవర్స్ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌లపై ఎగబడ్డారు. యానివర్సరీ ఎడిషన్ 120 బైక్‌లను భారత్‌లో కేవలం 120 సెకన్లలో విక్రయించి సరికొత్త రికార్డును నమోదుచేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 120 యూనిట్లు మాత్రమే..! రాయల్ ఎన్ఫీల్డ్ 120 వార్షికోత్సవం సందర్భంగా భారత్‌లో కేవలం 120 యూనిట్లను మాత్రమే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 480 యూనిట్లను మాత్రమే తయారు చేయనుంది. ఒక్కో ప్రాంతానికి 60 కాంటినెంటల్ GT 650 బైక్స్, 60 ఇంటర్‌సెప్టర్ 650 బైక్‌లను కంపెనీ సప్లై చేసింది. దీంతో భారత్‌లో 120 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చాయి. అదిరిపోయే ఫీచర్స్..! 120 వార్షికోత్సవ ఎడిషన్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 బైక్‌లను యూకే, భారత్‌కు చెందిన బృందాలు రూపొందించాయి. బ్లాక్ క్రోమ్ ట్యాంక్‌ను ఈ రెండు బైక్స్ కల్గి ఉన్నాయి. ఇంజిన్, సైలెన్సర్ ఇతర భాగాలు పూర్తిగా బ్లాక్ కలర్‌తో రానున్నాయి. ఫ్లైస్క్రీన్, ఇంజన్ గార్డ్, హీల్ గార్డ్, టూరింగ్ , బార్ ఎండ్ మిర్రర్స్ వంటి అనేక రకాల ఉపకరణాలు కూడా వస్తాయి. ప్రత్యేక ఆకర్షణగా 120 ఇయర్స్ బ్యాడ్జ్..! ఈ బైక్‌లకు 120 ఇయర్స్ డై-కాస్ట్ బ్రాస్ ట్యాంక్ బ్యాడ్జ్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీటిని భారత్‌కు చెందిన సిర్పి సెంథిల్ కళాకారులు బ్రాస్ బ్యాడ్జ్‌లను చేతితో తయారుచేశారు. చదవండి: Bounce Infinity E1 vs Ola S1: ఈ రెండింటిలో ఏది బెటర్..? -
రాయల్ ఎన్ఫీల్డ్ 650 లిమిటెడ్ ఎడిషన్ ..! ఈ బుల్లెట్ బండ్లను చూస్తే ఫిదా అవాల్సిందే..!
Royal Enfield 650 Twins Anniversary Edition Model Unveiled At EICMA 2021: టూవీలర్ వాహనాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌కు ఉండే క్రేజే వేరు. ధరతో పట్టింపు లేకుండా బుల్లెట్ బండిని సొంతం చేసుకోవడానికి బైక్ లవర్స్ ఎగబడతారు. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ 120 వసంతాలను పూర్తి చేసుకుంది. 120 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా రాయల్ ఎన్ఫీల్డ్ రెండు ఫ్లాగ్షిప్ లిమిటెడ్ ఎడిషన్ 650సీసీ మోటర్‌సైకిళ్లను కంపెనీ మిలాన్‌లో జరగుతున్న ఈఐసీఎమ్ఏ-2021 షోలో ఆవిష్కరించింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైక్‌లను కంపెనీ ప్రదర్శించింది. ఈ రెండు స్పెషల్ ఎడిషన్ బైక్స్ పరిమిత సంఖ్యలోనే కంపెనీ ఉత్పత్తి చేస్తోందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 480 యూనిట్లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది. ఒక్కో ప్రాంతానికి 60 కాంటినెంటల్ GT 650 బైక్స్, 60 ఇంటర్‌సెప్టర్ 650 బైక్‌లను కంపెనీ సప్లై చేయనుంది. దీంతో భారత్‌లో 120 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. 120 వార్షికోత్సవ ఎడిషన్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 బైక్‌లను యూకే, భారత్‌కు చెందిన బృందాలు రూపొందించాయి. బ్లాక్ క్రోమ్ ట్యాంక్‌ను ఈ రెండు బైక్స్ కల్గి ఉన్నాయి. ఇంజిన్, సైలెన్సర్ ఇతర భాగాలు పూర్తిగా బ్లాక్ కలర్‌తో రానున్నాయి. ఫ్లైస్క్రీన్, ఇంజన్ గార్డ్, హీల్ గార్డ్, టూరింగ్ , బార్ ఎండ్ మిర్రర్స్ వంటి అనేక రకాల ఉపకరణాలు కూడా వస్తాయి. బుకింగ్స్ ఎప్పుడంటే..! భారత్‌లో కేవలం 120 యూనిట్లు మాత్రమే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఆసక్తికల్గిన బుల్లెట్ లవర్స్, లిమిటెడ్ ఎడిషన్ బైక్‌లను నవంబర్ 24 నుంచి వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 120 యానివర్సరీ ఎడిషన్ బైక్‌లను డిసెంబర్ 6న ఆన్లైన్ విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. 120 ఇయర్స్ బ్యాడ్జ్..! ఈ బైక్‌లకు 120 ఇయర్స్ డై-కాస్ట్ బ్రాస్ ట్యాంక్ బ్యాడ్జ్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీటిని భారత్‌కు చెందిన సిర్పి సెంథిల్ కళాకారులు బ్రాస్ బ్యాడ్జ్‌లను చేతితో తయారుచేశారు. -
డుకాటీ నుంచి స్క్రాంబ్లర్ లిమిటెడ్ ఎడిషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటాలియన్ సూపర్‌బైక్స్ తయారీ సంస్థ డుకాటీ తాజాగా లిమిటెడ్ ఎడిషన్ స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ ఫాస్ట్హౌజ్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.10.99 లక్షలు. డుకాటీ స్క్రాంబ్లర్, అమెరికన్ క్లోతింగ్ బ్రాండ్ ఫాస్ట్హౌజ్ సహకారాన్ని వేడుక చేసుకోవడంలో భాగంగా కొత్త మోడల్‌కు రూపకల్పన చేశారు. అంతర్జాతీయంగా 800 యూనిట్లు మాత్రమే తయారు చేశారు. -
సరికొత్త హంగులతో టయోటా ఇన్నోవా..!
Toyota Innova Crysta Limited Edition Launched: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ సరికొత్త హంగులతో ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఇన్నోవా క్రిస్టా మోడల్ భారత్ మార్కెట్లలో అధికంగా సేల్ ఐనా ఎమ్‌పీవీ(మల్టీపుల్ పర్పస్ వెహికిల్)గా ప్రజాదరణ పొందింది. ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ ధర ఎక్స్‌షోరూంలో పెట్రోల్ వేరియంట్ ధర రూ.17.18–18.59 లక్షల మధ్య ఉండగా, డీజిల్ వేరియంట్స్ రూ.18.99–20.35 లక్షల కు అందుబాటులో ఉండనుంది. ఇన్నోవా క్రిస్టా లిమిడెట్ ఎడిషన్ మోడల్ 7-సీటింగ్, 8-సీటింగ్ వేరింయట్స్తో అందుబాటులో ఉండనుంది. ఈ కారులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటో హెడ్ ల్యాప్స్, ఆటో క్లైమట్ కంట్రోల్, సెవన్ ఎయిర్‌బ్యాగ్స్ అందుబాటులో ఉండనున్నాయి. భారత్‌లో టయోటా 2005 నుంచి సుమారు 9 లక్షలకు పైగా ఇన్నోవా కార్లను సేల్ చేసింది. చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..! పెట్టుబడి రూ.లక్ష..సంపాదన కోటి రూపాయలు కొత్త ఫీచర్స్ ఇవే...! ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్‌లో.. 360 డిగ్రీ కెమెరా, మల్టీ టెరేయిన్ మానిటర్, హెడ్ అప్ డిస్ప్లే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వైర్లెస్ చార్జర్, డోర్ ఎడ్జ్ లైటింగ్ విత్ 16 కలర్ ఆప్షన్స్, ఎయిర్ అయోనైజర్ వంటి హంగులను ఇన్నోవా క్రిస్టాలో టయోటా జోడించింది. ఇంజిన్ విషయానికి వస్తే..! ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ 164బీహెచ్పీ వద్ద గరిష్టంగా 245ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. 2.4 లీటర్ డిజీల్ ఇంజిన్ వేరియంట్ 148బీహెచ్పీ వద్ద గరిష్టంగా 343ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. చదవండి: మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైన రిషబ్ పంత్..! దినేష్ కార్తీక్ సరసన...! -
నీ ఇల్లు బంగారం గానూ!
సాక్షి, సిటీబ్యూరో: ఇల్లు నిజంగానే బంగారమైపోయింది. లగ్జరీ ఇంటీరియర్‌కు 24 క్యారెట్ గోల్డ్ లీఫింగ్తో (పైన పూత) ఇంటిని తీర్చిదిద్దుతున్నారు నగరవాసులు. ప్రధాన ద్వారం మొదలు కార్పెట్లు, కర్టెన్లు, వాల్ పేపర్స్, లైట్లు, సీలింగ్, ఫర్నిచర్ వరకూ ప్రతీది బంగార వర్ణంతో మెరిసిపోతుంది. టర్కీ, ఇటలీ వంటి దేశాల నుంచి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్‌ను దిగుమతి చేసుకొని మరీ ఇంటిని బంగారుమయం చేసేస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లడం లేదు. వీకెండ్స్, హాలీడే ట్రిప్స్ లేవు. గతంలో రోజులో 8–10 గంటలు మాత్రమే ఇంట్లో గడిపేవాళ్లు. మిగిలిన సమయం ఆఫీసులో, ప్రయాణంలో, ఇతరత్రా అవసరాలకు పోయేవి. కానీ ఇప్పుడు కరోనా, వర్క్ ఫ్రం హోమ్ ఇతరత్రా కారణాలతో ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో వినోదం, ఆనందం కోసం బయట చేసే ప్రతి పనినీ ఇంట్లో ఉంటూనే ఆస్వాదించాలనే అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఇంటిని, ఇంట్లోని ప్రతి వసతులను ఆధునికంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నారు. గతంలో ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం బయట జిమ్, స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లే వారు ఇప్పుడు అవే వసతులు, ఔట్‌డోర్ జిమ్‌లను కల్పించే గేటెడ్ కమ్యూనిటీలను వెతుకుంటున్నారు. వీకెండ్స్‌లో సినిమాకు వెళ్లే బదులు.. ఓవర్ ది టాప్ (ఓటీటీ), నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిల్లో ఇంట్లోనే థియేటర్ అనుభూతి కల్పించే హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కరోనాకు ముందు కంటే హైఎండ్ నగరవాసుల వినియోగ వ్యయం తగ్గింది. దీనిని లగ్జరీ ఇంటీరియర్ కోసం వెచ్చిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి... ఇటలీ, టర్కీ, ఈజిప్ట్ దేశాల నుంచి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్ దిగుమతి అవుతున్నాయి. ఇంటీరియల్లో వినియోగించే ఉత్పత్తుల్లో 60 శాతం ఆయా దేశాల నుంచే దిగుమతి అవుతుంటాయని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ కే ఇంద్రసేనారెడ్డి తెలిపారు. తలుపులు, డైనింగ్ టేబుల్స్, బెడ్స్, వాల్ పేపర్స్, కర్టెన్స్, మ్యాట్స్, లైట్లు, మార్బుల్స్, టైల్స్, ఫర్నిచర్, శాండిలియర్స్, బాత్ ఫిట్టింగ్స్, ల్యాండ్ స్కేపింగ్, పెయింటింగ్స్, శిల్పాలు.. ఇలా ప్రతి ఒక్కటీ దిగుమతి చేసుకుంటునన్నారు. విభిన్న డిజైన్స్, లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తులు దొరకడమే దిగుమతి చేసుకోవటానికి ప్రధాన కారణం. గతంలో హోమ్ డిజైనింగ్‌లో ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ మాత్రమే భాగస్వామ్యమయ్యే వారు. కానీ, ఇప్పుడు శిల్పులు, చిత్రకారులు కూడా వీరితో జతకట్టి నివాసితులకు ఆధునిక అనుభూతిని కల్పించేలా గృహాలను తీర్చిదిద్దుతున్నారు. లిమిటెడ్ ఎడిషన్స్లలో కొన్ని బ్రాండ్లు... పలు లగ్జరీ కార్ల కంపెనీలు బెంట్లీ, పోర్షే వంటివి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నాయి. ఇటలీకి చెందిన ఫెండి కాసా, జియోర్జెట్టి, రోబర్టో కావల్లీ, ట్రుసార్జీ కాసా, ఎట్రో హోమ్, జంబో, జియాన్ఫ్రాంకో ఫెర్రే హోమ్, న్యూయార్క్‌కు చెందిన రాల్ఫ్ లారెన్ హోమ్, యూకేకు చెందిన బెంట్లీ హోమ్, ప్యారిస్‌కు చెందిన బకారట్ లా మైసన్, ఫ్రాన్స్‌కు చెందిన రిట్జ్ పారిస్, బుగట్టీ హోమ్.. ఇవన్నీ అంతర్జాతీయ ఇంటీరియర్ బ్రాండ్లు. క్లాసిక్ స్టయిల్లో చేతితో తయారు చేస్తారు. నాణ్యత, డిజైనింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. నగరంలో లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్.. మైహోమ్, అపర్ణా, రాజపుష్ప, ముప్పా వంటి ప్రాజెక్ట్‌లతో నాలుగైదుగురితో పాటు జూబ్లిహిల్స్ రోడ్ నం.45, గచ్చిబౌలిలోని ఇద్దరు వ్యక్తిగత కస్టమర్లు పూర్తిగా టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న 24 క్యారెట్ల గోల్డ్ లీఫింగ్తో ఇంటీరియర్ చేయించుకున్నారు. గిరిధారి, ప్రణీత్, ఎస్ఎంఆర్ తదితర సంస్థలు క్లబ్‌హౌస్‌లను విదేశీ ఇంటీరియర్ ఉత్పత్తులతో ఆధునికంగా తీర్చిదిద్దుతున్నాయి. సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, రాజకీయ నేతలు తమ గృహాలను లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌తో రాజభవనాల లాగా తీర్చిదిద్దుతున్నారు. కార్మికులూ విదేశాల నుంచే.. ఈ తరహా ఇంటీరియర్స్‌ను ఇక్కడి కార్మికులు చేయలేరు. అందుకే ఈజిప్ట్ నుంచి ఇంటీరియర్ నిపుణులు వచ్చి డిజైనింగ్ చేస్తుంటారని తాయబా తెలిపారు. 10 వేల చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాలకు మాత్రమే ఈ తరహా లగ్జరీ ఇంటీరియర్స్ బాగుంటాయి. వీటి ధరలు చదరపు అడుగుకు రూ.800 నుంచి 4,500 వరకు ఉంటాయి. ప్రాజెక్ట్ మొత్తానికి రూ.5–10 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇంటీరియర్ డిజైన్ పూర్తి చేసేందుకు 30–90 రోజుల సమయం పడుతుంది. కళ్లు తిరిగే ధరలు.. ►బెంట్లీ సోఫా. వీటి ప్రారంభ ధర రూ.30 లక్షల నుంచి ఉంటుంది. పోర్షే కిచెన్ సెట్స్ ప్రారంభ ధర రూ.కోటి నుంచి మొదలవుతుంది. ►అర్మానీ కాసా ఫర్నీచర్, టైల్స్. వీటిని ఆఫ్రికాలో పెరిగే కొన్ని అరుదైన రకాల వృక్షాల నుంచి ఈ ఫర్నీచర్‌ను తయారు చేస్తారు. వీటి ప్రారంభ ధర రూ.50 లక్షల పైమాటే. ►‘ట్రీ ఆఫ్ లైఫ్’ అనే 30–40 ఏళ్ల నాటి అరుదైన వృక్షాలను ఆఫ్రికా దేశం నుంచి దిగుమతి చేసుకొని ల్యాండ్స్కేపింగ్గా వినియోగిస్తుంటారు. ►జపాన్‌కు చెందిన టోటో, జర్మనీకి చెందిన నోకెన్ బాత్రూమ్ అండ్ శానిటైజ్ ఫిట్టింగ్స్‌లో గ్లోబల్ బ్రాండ్లు. ఆయా ఉత్పత్తుల ప్రారంభ ధరలు రూ.5 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఆటోమెటెడ్ టాయిలెట్, షవర్స్, బాడీ జెట్స్ ఉత్పత్తులు వీటి ప్రత్యేకత. టాయిలెట్ పైన కూర్చుంటే చాలు వాతావరణాన్ని బట్టి ఆటోమెటిక్‌గా అదే నీటిని పంపింగ్ చేస్తుంది. శరీర ఉష్ణోగత్రను బట్టి మారుతూ ఉంటుంది. షవర్స్, బాడీజెట్స్ శ్రావ్యమైన మ్యూజిక్, లైటింగ్స్‌తో పైనుంచి వర్షం పడినట్లుగా వస్తుంటుంది. ►డెఫా లైటింగ్ సొల్యూషన్స్ మనిషి మూడ్‌ను, ఉష్ణోగ్రతను బట్టి గదిలో వెలుతురును ఇవ్వటం దీని ప్రత్యేకత. ప్రముఖ జువెల్లరీ బ్రాండ్ స్వరోస్క్వీ.. శాండిలియర్స్ను కూడా విక్రయిస్తుంది. వీటి ప్రారంభ ధర రూ.10 లక్షలు. ►అమెరికాకు చెందిన జేబీఎల్, డెన్మార్క్‌కు చెందిన డాలీ, డైనడియా, జపాన్‌కు చెందిన డినాన్, ఫ్రాన్స్‌కు చెందిన డెవిలెట్, ఫోకల్ వంటివి థియేటర్ అనుభూతిని కల్పించే హోమ్ థియేటర్స్ గ్లోబల్ బ్రాండ్లు. కరోనా కారణంగా ప్రయాణాలు కుదరడం లేదు రెసిడెన్షియల్, కమర్షియల్, ఇనిస్టిట్యూషనల్ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైన్స్ చేస్తాం. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు నగరాలలో 50–60 ప్రాజెక్ట్స్ ఆర్డర్లు ఉన్నాయి. కరోనా కారణంగా విదేశాలకు వెళ్లి ఇంటీరియర్స్‌ను ఎంపిక చేయడం కుదరటం లేదు. – జీ రామ్మోహన్, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ ప్యాలెస్‌లు తీర్చిదిద్దడం మా ప్రత్యేకత హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అహ్మదాబాద్ నగరాల్లో 55 వేల చదరపు అడుగులలో పలు ప్రాజెక్ట్‌ల ఆర్డర్లు ఉన్నాయి. టర్కీ, ఇటలీ రాయల్ ఫర్నిచర్‌తో లండన్, దుబాయ్, సౌదీ ప్యాలెస్ వంటి కాన్సెప్ట్‌లతో ఇంటీరియర్‌ను డిజైన్ చేయడం మా ప్రత్యేకత. పదేళ్ల వారంటీ కూడా ఉంటుంది. – తాయ్యబా, ఎండీ, బెనోయిట్ ఫర్నీచర్ -
సరికొత్త మార్పులతో మారుతి సుజకీ వ్యాగన్ఆర్...!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సరికొత్తగా వ్యాగన్ఆర్ ఎక్స్ట్రా ఎడిషన్‌ను మార్కెట్లలోకి లాంచ్ చేసింది. ఈ కారు 1L లేదా 1.2L ఇంజిన్, ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుందని తెలుస్తోంది. వ్యాగన్ఆర్ ఎక్స్ట్రా కారు లిమిటిడెట్ ఎడిషన్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది స్టాండర్డ్ వ్యాగన్ఆర్ వేరియంట్‌కు 13 కొత్త అప్గ్రేడ్లతో రానుంది. కారు ఇంటీరియర్స్, ఎక్స్‌టిరియర్స్ గణనీయంగా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాగన్ఆర్ కారును సుమారు రూ. 22,990 అదనంగా చెల్లించడంతో అప్‌గ్రేడ్ అవుతుంది. కారులో స్టైలింగ్‌లో భాగంగా కారు వెనుక బంపర్ ప్రొటెక్టర్, సైడ్ స్కర్ట్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బాడీసైడ్ మౌల్డింగ్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, అప్పర్ గ్రిల్ క్రోమ్ గార్నిష్, వెనుక డోర్‌కు క్రోమ్ గార్నిష్, నంబర్ ప్లేట్ సరికొత్తగా అమర్చారు. అంతేకాకుండా డిజిటల్ ఎయిర్ ఇన్‌ఫ్లేటర్, ట్రంక్ ఆర్గనైజర్, కార్ ఛార్జర్ ఎక్స్టెండర్ సౌకర్యాలను కలిగి ఉంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.0 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ 67 బిహెచ్పి సామర్థ్యంతో 90 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఫోర్ సిలిండర్ పెట్రోల్ 1.2 లీటర్ ఇంజన్ 82 బీహెచ్పీ సామర్థ్యంతో 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. భద్రత పరంగా కారులో ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్లను అమర్చారు. -
ధర రూ.36 లక్షలు; ఆన్లైన్లోనే సేల్
సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా ఆక్టేవియా ఆర్ఎస్ 245 మోడల్లో లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరను రూ.35.99 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించామని కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. ఈ కారుకు ఆన్లైన్ బుకింగ్‌లు వచ్చే నెల 1 నుంచి మొదలవుతాయని పేర్కొన్నారు. రూ. లక్ష చెల్లించి బుక్ చేసుకోవాలని, 200 కార్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చామని వివరించారు. బుక్‌స్కోడాఆన్‌లైన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుపుతామని తెలిపారు. ఈ కారును 2లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించామని, ఏడు గేర్ల ఆటోమేటిక్ డ్యుయల్–క్లచ్ ట్రాన్సిమిషన్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఈ కారు వంద కిలోమీటర్ల వేగాన్ని 6.6 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ర్యాలీ గ్రీన్, రేస్ బ్లూ, కొరిడా రెడ్, మ్యాజిక్ బ్లాక్ మరియు కాండీ వైట్ అనే ఐదు రంగుల్లో లభిస్తుంది. -
వన్‌ప్లస్ మరో సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: భారీ అమ్మకాలతో దుమ్ము రేపుతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మరో సంచలనానికి నాంది పలికింది. వన్‌ప్లస్ 6టీను ఏకంగా 10జీబీ వెర్షన్లో తీసుకురాబోతోంది. స్పీడ్‌కు సలాం అంటూ సరికొత్త హంగులతో మెక్లారెన్ ఎడిషన్ (అత్యంత ఖరీదైన ప్రముఖ స్పోర్ట్స్ కారు) వన్‌ప్లస్ 6టీని 10జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ డిసెంబర్ 11న లండన్‌లో లాంచ్ చేయనుంది. అలాగే డిసెంబరు 12న ఇండియన్ మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ మేరకు ట్విటర్లో ఒక టీజర్‌ను వదిలింది. కాగా కంపెనీ ఇప్పటికే వన్‌ప్లస్ 6టీ థండర్ పర్పుల్ ఎడిషన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6టీ కు సమానంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ధర తదితర వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. OnePlus and @McLarenF1. Forever in pursuit of speed. Experience the #SalutetoSpeed on December 11. https://t.co/inqbUCRYcK pic.twitter.com/Q7HGBqmZtw — OnePlus (@oneplus) November 27, 2018 -
మారుతి వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్
సాక్షి, న్యూఢిల్లీ: పండుగ సీజన్లో కస్టమర్లకు ఆకట్టుకునేందుకు ఆటో మేజర్ మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఎక్కువగా అమ్ముడుబోయే తన కార్లలో ఒకటైన వ్యాగన్ ఆర్కు కొత్త సొబగులు అద్ది విడుదల చేసింది. అంతేకాదు వాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్ కొనుగోలుపై రెండు ఆప్షనల్ యాక్ససరీస్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ కిట్లను రూ.15,490, రూ.25,490 ప్రత్యేక ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్‌లో ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, డబుల్-డిన్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్తోపాటు రివర్స్ పార్కింగ్ సెన్సార్లను, ఫాబ్రిక్ ఫ్లోర్ మాట్స్ను జోడించింది. డబుల్ డిన్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ విత్ స్పీకర్స్ అమర్చింది. అలాగే సీటు కవర్ల డిజైన్‌ను కూడా కొత్తగా తీర్చిదిద్దింది. ఇక ఎక్స్ టీరియర్ విషయానికి వస్తే బాడీ గ్రాఫిక్స్‌తో పాటు, వెనుక స్పాయిలర్‌ను అమర్చింది. ఈ పరిమిత ఎడిషన్‌లో జోడించిన అదనపు హంగులతో వినియోగదారులను భారీగా ఆకర్షించాలని మారుతి భావిస్తోంది. వ్యాగన్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ ద్వారా కస్టమర్లకు ఈ పండుగు సీజన్ మరింత అద్భుతంగా మారనుందని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్. కల్సీ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా 1999లో లాంచ్ అయిన వాగన్ఆర్ కంపెనీ అమ్మకాల్లో కీలక పాత్రను పోషిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ కాలానికి మారుతి మొత్తం అమ్మకాల సంఖ్య 21.9 లక్షలు నమోదుకాగా, వ్యాగన్ ఆర్ 85వేల యూనిట్లను విక్రయించడం గమనార్హం. ధర : రూ 4.19 లక్షల నుంచి రూ. 5.39 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 1.0 లీటర్, 3-సిలిండర్ డ్యుయల్ ఇంజీన్(పెట్రోల్, సీఎన్జీ) ఆప్షన్సతో లభిస్తుంది. అలాగే 5-స్పీడ్ ఎఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో పెట్రోల్ వెర్షన్ కూడా లభ్యం. -
బాలెనో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'బాలెనో' లో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. సాంకేతికంగా ఎలాంటి మార్పులు చేయనప్పటికీ కాస్మొటిక్, ఇంటీరియర్ మార్పులు చేసి స్పోర్టీ లుక్‌తో ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. అలాగే ధరల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. అయితే స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే 30 నుంచి 40వేల ప్రీమియం ధర ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.కాగా ఫెస్టివ్ సీజన్లలో లిమిటెడ్ ఎడిషన్ కార్లను కస్టమర్లకు అందించడం ఇది మూడవ సారి. గతంలో ఇగ్నిస్, స్విఫ్ట్ మోడల్ కార్లలో స్పెషల్ ఎడిషన్ కార్లను విడుదల చేసింది. బాలెనో వాస్తవ ధరలు రూ. 5.48 లక్షలు, (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభం. -
టాటా నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్
సాక్షి, న్యూఢిల్లీ: నెక్సాన్ వార్షికోత్సవ కానుకగా ఎడిషన్ నెక్సాన్ కారును టాటా మోటార్స్ లిమిటెడ్ విడుదల చేసింది. కాస్మోటిక్ అపడేట్స్ తో రెండు వేరియంట్లను లాంచ్ చేసింది. టాటా నెక్సాన్ క్రేజ్‌గా పిలుస్తున్న ఈ కారునురెండువేరియంట్లను తీసుకొచ్చింది. నెక్సాన్ క్రేజ్, నెక్సాన్ క్రేజ్ప్లస్ పేరుతో పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో విడుదల చేసింది. యాక్టివ్, స్టోర్టివ్ కస్టమర్లకోసం నియాన్ గ్రీన్ కలర్‌తో నెక్సాన్ క్రేజ్‌ను ఆకర్షణీయంగా తీసుకొచ్చామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పారీక్ వెల్లడించారు. దీని ద్వారా ఈ సెగ్మెంట్లో కొత్త ట్రెండ్ సృష్టించనున్నామన్నారు. ధరలు: (ఎక్స్ షోరూం న్యూఢిల్లీ) నెక్సాన్ క్రేజ్ (పెట్రోల్) ధర. 7.14 లక్షలు నెక్సాన్ క్రేజ్ (డీజిల్) ధర. 8.07 లక్షలు నెక్సాన్ క్రేజ్ ప్లస్ (పెట్రోల్) ధర. 7.76 లక్షలు నెక్సాన్ క్రేజ్ ప్లస్ (డీజిల్) ధర. 8.64 లక్షలు నియోన్ గ్రీన్ కలర్‌తో సిల్వర్ డ్యూయల్ టోన్ రూఫ్, ఓఆర్వీఎం లు, ఫ్రంట్ గ్రిల్ ఇన్సర్ట్, వెనుకవైపు నియోన్గ్రీన్ క్రేజ్ బ్యాడ్జింగ్ లాంటి కాస్మొటిక్ అపడేట్స్‌తో పాటు, వీల్స్మీద కూడా నియోన్ గ్రీన్ కలర్ జోడించింది. ఇక క్యాబిన్ లోపల, డాటాబోర్డు, డోర్, స్టీరింగ్, కన్సోల్ ఫినిషర్స్ పియానో బ్లాక్ ఫినిషింగ్, నియోన్ గ్రీన్ కలర్స్ . 4 స్పీకర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా లభ్యం. ఇంజీన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 110పీఎస్, 170ఎన్ఎం ఉత్పత్తి చేస్తుంది 1.5 లీటర్ డీజిల్ 110పీఎస్, 260ఎంఎచ్ ఉత్పత్తి రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యూల్ ట్రాన్స్మిషన్ -
అత్యంత ఖరీదైన కారు.. ధరెంతో తెలుసా!
లండన్ : హైఎండ్ లగ్జరీ కార్లలో క్రేజీ ప్రోడక్ట్‌గా ఊరించిన బుగట్టి దివో రోడ్లపై పరుగులు తీసేందుకు రెడీ అయింది. అయితే 5 మిలియన్ యూరోలు (రూ 40 కోట్లు) ఖరీదు చేసే ఈ కారు ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 మందికే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం బుగట్టి చిరాన్ కారు యజమానులకే కళ్లుచెదిరే ఈ కారును సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. కాగా, లాంఛ్‌కు ముందే న్యూ దివో 40 యూనిట్లు బుక్ అయ్యాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఎనిమిది లీటర్ల క్వాడ్-టర్బో డబ్ల్యూ16 ఇంజన్ సామర్ధ్యం కలిగిన దివో కేవలం 2.4 సెకన్లలోనే 0-100 కిమీ వేగం పుంజుకుంటుంది. బుగట్టి న్యూ హైపర్కార్కు ఫ్రెంచ్ దిగ్గజ రేసింగ్ డ్రైవర్ అల్బెర్టో దివో పేరు కలిసివచ్చేలా దివో పేరును ఎంచుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. అన్ని బుగట్టి కార్ల తరహాలోనే నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా రాజసం, సౌకర్యం ఉట్టిపడేలా అత్యంత లావిష్‌గా దివోను తీర్చిదిద్దామని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
టయాటా ఎతియోస్ లివా లిమిటెడ్ ఎడిషన్
సాక్షి, న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎతియోస్‌లో లివాలో కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. లిమిటెడ్ ఎడిషన్ ఇటియోస్ లివాను మార్కెట్లో విడుదల చేసింది. డ్యుయల్ టోన్షేడ్లో పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. పెట్రోల్ వెర్షన్ ధరను 6.51 లక్షల రూపాయలుగా ప్రకటించింది.అ లాగే డీజిల్ వెర్షన్ ధర రూ.7.66 లక్షలుగా నిర్ణయించింది. రెండూ ఎక్స్ షో రూం ధరలు. బేస్ మోడల్ ధర కంటే ధర మరో 30వేలు అదనం. వైట్ రంగులో మాత్రమే లభిస్తున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ కారులో డ్యుయల్ (బ్లాక్ అండ్ వైట్) టోన్ 15 అంగుళాల డైమంట్ కట్ అల్లాయ్ వీల్స్ ఇతర ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయడానికి, మెరుగైన ఫీచర్స్ అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. రాజా తెలిపారు. ఎతియోస్ లివా డ్యూయల్ టోన్ స్మార్ట్ లిమిటెడ్ ఎడిషన్ మరింతమంది కస్టమర్లను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎడిషన్ టయోటా ఎతియోస్ లివాలో కీలక మార్పుల విషయానికి వస్తే ఫ్రంట్ బంపర్ గ్రిల్‌పై రెడ్ యాక్సెంట్స్‌ను అమర్చింది. హాండిల్స్దగ్గర కూడా రెడ్ కలర్ ఫినీఫింగ్తో లాంచ్ అయింది. -
విడుదలైన నిమిషాల్లోనే..
లిమిటెడ్ ఎడిషన్‌గా లాంచ్ అయిన వోల్వో సరికొత్త సెడాన్ కారు నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోయింది. ఈ కార్ల బుకింగ్ ప్రారంభమైన 39 నిమిషాల్లోనే మొత్తం యూనిట్లు అమ్ముడయ్యాయట. లిమిటెడ్‌గా తీసుకొచ్చిన మొత్తం 20 యూనిట్లు ప్రీ బుకింగ్‌లో బుక్ అయ్యాయనీ, అమెరికాలో ఈ రికార్డు విక్రయాలు నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. దీని ధర రూ. 45.04 లక్షలు(ఆన్ రోడ్, న్యూఢిల్లీ) . స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తుల సంస్థ వోల్వో ఇటీవల ఎస్60 మోడల్లో ప్రత్యేక ఎడిషన్ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే . అయితే అమెరికా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ కారు ను వోల్వో యాప్ ద్వారా శుక్రవారం విక్రయాలను ప్రారంభించారు. కారు ధర, లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రకటించిన తర్వాత 39 నిమిషాల్లోనే కార్లన్నీ బుక్ అయిపోయాయని వోల్వో తెలిపింది. 2019లో ఈ కారును కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది. పోలెస్టార్ ఇంజనీర్డ్ వెర్షన్ ఎస్ 60 సెడాన్ వోల్వో యాప్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపింది. 415బీహెచ్ పవర్, 669ఎన్ఎం టార్క్, ఓహిలిన్స్ సస్పెన్షన్, బ్రెంబో బ్రేక్స్, తదితర అధునాతన ఫీచర్స్ ఈ సెడాన్ సొంతం.