
ఎతియోస్ లివా (లిమిటెడ్ వెర్షన్)
సాక్షి, న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎతియోస్‌లో లివాలో కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. లిమిటెడ్ ఎడిషన్ ఇటియోస్ లివాను మార్కెట్‌లో విడుదల చేసింది. డ్యుయల్ టోన్‌షేడ్‌లో పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. పెట్రోల్ వెర్షన్ ధరను 6.51 లక్షల రూపాయలుగా ప్రకటించింది.అ లాగే డీజిల్ వెర్షన్ ధర రూ.7.66 లక్షలుగా నిర్ణయించింది. రెండూ ఎక్స్ షో రూం ధరలు. బేస్ మోడల్ ధర కంటే ధర మరో 30వేలు అదనం. వైట్ రంగులో మాత్రమే లభిస్తున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ కారులో డ్యుయల్ (బ్లాక్ అండ్ వైట్) టోన్ 15 అంగుళాల డైమంట్ కట్ అల్లాయ్ వీల్స్ ఇతర ఫీచర్లు ఉన్నాయి.
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయడానికి, మెరుగైన ఫీచర్స్ అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. రాజా తెలిపారు. ఎతియోస్ లివా డ్యూయల్ టోన్ స్మార్ట్ లిమిటెడ్ ఎడిషన్ మరింతమంది కస‍్టమర్లను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎడిషన్ టయోటా ఎతియోస్ లివాలో కీలక మార్పుల విషయానికి వస్తే ఫ్రంట్ బంపర్ గ్రిల్‌పై రెడ్ యాక్సెంట్స్‌ను అమర్చింది. హాండిల్స్‌దగ్గర కూడా రెడ్ కలర్ ఫినీఫింగ్‌తో లాంచ్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment