
Tvs Ntorq 125 Price And Mileage: ప్రపంచవ్యాప్తంగా మార్వెల్స్ హీరోస్‌పై క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీలు మార్వెల్స్ హీరోస్ స్ట్రాటజీతో తమ వ్యాపారాలకు మరింత ఆదాయాలను సంపాదించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16 న రిలీజైన స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్ వెండి తెర సంచలనం సృష్టిస్తోంది. భారత్‌లో కూడా స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్ క్రేజ్ మామూలుగా లేదు. మార్వెల్స్ హీరోస్ లవర్స్ కోసం ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మార్వెల్స్ సూపర్ హీరోస్ ఎడిషన్ స్కూటర్లను లాంచ్ చేసింది.
చదవండి: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..! అందులో టీవీలు, హెడ్‌ఫోన్స్, ఇంకా మరెన్నో..!
టీవీఎస్ మోటార్ కంపెనీ టీవీఎస్ NTORQ 125 సూపర్‌స్క్వాడ్ ఎడిషన్‌లో భాగంగా మరో రెండు మార్వెల్ సూపర్ హీరోస్ స్పైడర్ మ్యాన్, థోర్ ప్రేరేపిత స్కూటర్లను కంపెనీ విడుదల చేసింది. గత ఏడాది సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌లో భాగంగా మార్వెల్ సూపర్ హీరోస్ - ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా ఎడిషన్ టీవీఎస్ Ntorq 125బైక్లను ప్రారంభించింది. భారత్‌లోకి RT-Fi సాంకేతికతతో వచ్చిన మొట్టమొదటి బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన స్కూటర్‌గా టీవీఎస్ Ntorq 125 నిలుస్తోంది.
సూపర్ హీరోస్ ఫీచర్స్‌తో..!
కొత్త మార్వెల్ స్పైడర్ మ్యాన్ , థోర్ వెర్షన్‌లు స్కూటర్స్ సూపర్ హీరోల ముఖ్య లక్షణాలను టీవీఎస్ Ntorq 125 ఏర్పాటుచేశారు. స్పైడర్ మ్యాన్, థోర్ కు సంబంధించిన విషయాలను ఇందులో ఉండేలా టీవీఎస్ డిజైన్ చేసింది. ఈ స్కూటర్లలోని స్మార్ట్‌కనెక్ట్ యాప్ స్పైడర్ మ్యాన్ లోగో , థోర్స్ హమర్ వంటి సంబంధిత పాత్రల చిహ్నాల సిల్హౌట్‌తో ఒపెన్ కానుంది.ఈ స్కూటర్లు మార్వెల్ సూపర్ హీరోస్ అనుభూతిని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ధర ఎంతంటే..!
టీవీఎస్ NTORQ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 84,850 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ స్కూటర్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు... స్కూటర్ మొదటి-రకం వాయిస్ అసిస్ట్ ఫంక్షన్, మొదటి-ఇన్-సెగ్మెంట్ డ్యూయల్ రైడ్ మోడ్‌లను అందించే వేరియంట్‌తో రానుంది.
చదవండి: మల్టీప్లెక్సుల బిజినెస్ అదరహో.. సాయం చేసిన స్పైడర్‌మ్యాన్- భరోసా ఇచ్చిన పుష్ప
Comments
Please login to add a commentAdd a comment