Thor
-
విమానం ఎక్కకుండా ప్రపంచాన్ని చుట్టేశాడు
2013 అక్టోబర్ 10న డెన్మార్క్‌లోని ఇంటి నుంచి బయలుదేరాడు థోర్. 3,512 రోజుల తర్వాత 203 దేశాలు చూసి మే 23, 2023న మాల్దీవుల్లో యాత్ర ముగించాడు. విమానం ఎక్కకుండా ఇలా ప్రపంచాన్ని చుట్టినవాడు ఇతడే. ‘ఇన్ని దేశాలు తిరగడం ఎందుకు?’ అనంటే ‘అన్ని దేశాలు ఉన్నాయి కనుక’ అని జవాబు. జూన్ 13న మాల్దీవుల నుంచి ఇంటికి మరలుతున్నాడు థోర్. ‘తువాలు’, ‘టోంగా’, ‘సమోవా’, ‘పలావు’, ‘నౌరు’, ‘కిరిబటి’.... ఇవేంటని అనుకుంటున్నారా? దేశాలు. ఇవి మీరు విని ఉండొచ్చు. వినకపోయి ఉండొచ్చు. ఏమంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు 193. ‘కాని ఇంకా ఉన్నాయి. అవి తమను తాము దేశాలుగా చెప్పుకుంటాయి. ఐక్యరాజ్యసమితి ఇంకా గుర్తించకపోవచ్చు’ అంటాడు థోర్. అందువల్ల థోర్ చుట్టి వచ్చిన దేశాల సంఖ్య అక్షరాలా 203. వీటిలో యూరప్ నుంచి 37, ఆసియా నుంచి 20, సౌత్ అమెరికా నుంచి 12, ఆఫ్రికా నుంచి 54... ఇలా ప్రపంచ పటంలోని అన్ని దేశాలు అతను చుట్టి వచ్చాడు. ► మనుషుల్ని కలవడానికి... ‘స్నేహితుడు అని ఎవర్ని అనాలంటే అప్పటి దాకా పరిచయం కాని అపరిచితుణ్ణే’ అనే స్లోగన్‌తో థోర్ తన ప్రపంచ యాత్ర మొదలెట్టాడు. డెన్మార్క్‌కు చెందిన 44 ఏళ్ల ఈ వివాహితుడు కొంతకాలం మిలట్రీలో, ఆ తర్వాత షిప్పింగ్ లాజిస్టిక్స్‌లో పని చేశాడు. దేశాలు చూడటం పిచ్చి. కొత్త మనుషుల్ని కలవడం ఇష్టం. అందుకని ప్రపంచంలోని అన్ని దేశాలు చుట్టి రావాలనుకున్నాడు. అయితే డబ్బు పరిమితుల దృష్ట్యా, ఎటువంటి సవాలుకు వీలులేని విమానయానం ద్వారా కాకుండా రైళ్లు, ఓడలు, వాహనాల ద్వారా ప్రపంచం చుట్టాలనుకున్నాడు. దాదాపు పదేళ్ల పాటు ఇంటి ముఖం చూడకుండా తిరిగేశాడు. ► రోజుకు 20 డాలర్లు డెన్మార్క్‌కు చెందిన కొన్ని సంస్థల స్పాన్సర్‌షిప్‌తో యాత్ర మొదలెట్టాడు థోర్. ప్రయాణానికి, తిండికి, వీసా ఫీజులకు కలిపి రోజుకు కేవలం 20 డాలర్లు (1600 రూపాయలు) ఖర్చు చేస్తూ ఈ యాత్ర సాగించాలనుకున్నాడు. దొరికిన తిండి తినడం, ఫ్రీగా బస పొందడం... లాంటి పనుల ద్వారా ఇది సాధ్యమే అనిపించాడు. అతని యాత్రను బ్లాగ్‌లో, ఫేస్బుక్లో రాస్తూ వెళ్లడం వల్ల చదివిన పాఠకులు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ వెళ్లారు. దాంతో ఇన్ని రోజులు అతని విశ్వదర్శనం సాగింది. ‘ఒక్కో దేశంలో కేవలం 24 గంటలు మాత్రమే గడుపుతూ వెళ్లాను. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం ప్రయాణించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ దారిలో మనుషుల్ని కలవడమే ఇష్టపడ్డాను’ అంటాడు థోర్. అతను తన ప్రయాణంలో భాగంగా మన దేశానికి డిసెంబర్ 12, 2018న వచ్చాడు. ► ప్రతిదీ లెక్క థోర్ తన ప్రయాణంలో ప్రతిదీ రికార్డు చేశాడు. ఏ మోసం లేకుండా ఎక్కడికక్కడ టికెట్లు పెడుతూ వెళ్లాడు. తన మొత్తం ప్రయాణంలో 351 బస్సులు, 158 ట్రైన్లు, 43 టుక్‌టుక్‌లు (ఆటో), 37 కంటైనర్ షిప్‌లు, 33 పడవలు, 9 ట్రక్కులు, 3 సెయిల్బోట్లు, 2 క్రూయిజ్ షిప్‌లు ఉపయోగించాడు. మే 23న మాల్దీవుల్లో ఇతని యాత్ర ముగిసింది. అయితే ఇన్నాళ్లూ కుటుంబానికి దూరంగా ఉన్నాడా? లేదు. అతని భార్య అతణ్ణి వెతుక్కుంటూ వెళ్లి కలిసేది. మొత్తం ఇన్ని రోజుల్లో 27 చోట్ల 27 సార్లు కలిసిందామె. అన్నట్టు ఈ మొత్తం యాత్ర పేరు ‘ఒన్స్ అపాన్ ఏ సాగా’. -
బోలెడు ప్రత్యేకతలు ఉన్న బాహుబలి ట్రక్కు.. ఏడేళ్ల పాటు
ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ ట్రక్కు. అత్యంత శక్తిమంతమైన రిగ్ కలిగి ఉన్న ఈ ట్రక్కుకు రెండు డీజిల్ ఇంజిన్లు, 24 సిలిండర్లు ఉండటం విశేషం. దీని రిగ్ 3,974 హార్స్పవర్ శక్తితో పనిచేస్తుంది. ఇంత భారీగా ఉన్నప్పటికీ ఈ ట్రక్కు గంటకు 209 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో దూసుకుపోగలదు. అమెరికన్ ఆటోమొబైల్ ఇంజినీరు మైకేల్ హర్రా ఏడేళ్ల పాటు శ్రమించి, ‘థోర్–24’ పేరిట ఈ ట్రక్కును రూపొందించాడు. దీని నిర్మాణానికి 70 లక్షల డాలర్లు (రూ.58.03 కోట్లు) ఖర్చయింది. ఇందులో 40 అంగుళాల టీవీ, 1500 వాట్ ఆడియో సిస్టమ్ వంటి అదనపు హంగులు కూడా ఉన్నాయి. చదవండి: సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు.. ఆహా అనిపించేలా నగరం! -
'నా సుత్తిని అవలీలగా ఎత్తేస్తుందేమో'.. మీరాబాయిపై 'థోర్' ప్రశంసలు
భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై హాలివుడ్ స్టార్.. థోర్(క్రిస్ ఎమ్‌స్వర్త్) ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి ప్రదర్శనను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. మార్వెల్ కామిక్స్‌లో థోర్ పాత్ర చేతిలో ఉండే సుత్తి చాలా బరువు ఉంటుంది. ఆ సుత్తిని అతను తప్ప ఎవరూ ఎత్తలేరు. అందుకే చాను సాధించిన విజయాన్ని కీర్తిస్తూ..'' ఎంత బరువైనా ఎత్తేస్తుంది.. థోర్ ఇక నీ సుత్తిని వదిలేయాల్సిన సమయం వచ్చేసింది.'' అన్నట్టుగా క్రిస్ హెమ్స్ను ట్యాగ్ చేశాడు సదరు అభిమాని. అభిమాని చేసిన ట్వీట్‌పై హెమ్స్‌వర్త్ స్పందించాడు. ''ఇక నేను సుత్తిని వదిలి వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఆమె నా సుత్తిని కూడా అవలీలగా ఎత్తేస్తుందేమో. అయినా అందుకు ఆమె అర్హురాలే. కంగ్రాట్స్.. సికోమ్.. నువ్వొక లెజెండ్'' అంటూ కామెంట్ చేశాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చానూ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం ఒడిసి పట్టింది. గత శనివారం 49 కేజీల విభాగంలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్లో మీరాబాయి చాను స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి పతకం అందుకుంది. కాగా స్నాచ్ విభాగంలో 90 కేజీల బరువు ఎత్తాలని టార్గెట్‌గా పెట్టుకుంది మీరాబాయి చాను. కానీ స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. She is worthy! Congrats, Saikhom, you legend. — Chris Hemsworth (@chrishemsworth) August 4, 2022 చదవండి: Commonwealth Games 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు Lifting 201kg never felt easy but thanks to the love and wishes of billions back home, every challenge is just an attempt away. 🇮🇳#WeAreTeamIndia #TeamIndia pic.twitter.com/GnyaftZkpv — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 30, 2022 -
సుత్తితో క్రీజులోకి ఆసీస్ కెప్టెన్.. ఎగతాళి చేసిన పాక్ అభిమానులు
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సుత్తితో క్రీజులోకి వచ్చి పిచ్‌ను మరమత్తు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 53వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయడానికి సిద్దమయ్యాడు. అయితే బంతి విసిరే సమయంలో ల్యాండింగ్ ఏరియా కాస్త గట్టిగా ఉండడంతో గ్రీన్‌కు ఇబ్బందిగా మారింది. దీంతో సుత్తి పట్టుకొచ్చిన కెప్టెన్ కమిన్స్ గ్రౌండ్‌మన్ అవతారం ఎత్తి.. సుత్తితో మట్టిని కొట్టాడు. కాస్త బలాన్ని ఉపయోగించి బౌలర్‌కు ల్యాండింగ్ సుగమమయ్యేలా మట్టిని తొలగించాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఇది చూసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కమిన్స్‌ను ''నయా థోర్'' అంటూ కామెంట్ చేసింది. ఇది చూసిన పాక్ అభిమానులు కమిన్స్‌ను ఎగతాళి చేశారు. '' థోర్ కంటే నువ్వే బాగున్నావు.. మార్వెల్ సినిమాలో నటిస్తావా''.. ''కెప్టెన్ కమ్ థోర్ కమ్ కమిన్స్'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో ధీటుగా బదులిస్తోంది. 506 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ప్రస్తుతం 106 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 129, అబ్దుల్లా షఫీక్ 92 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 263 పరుగులు అవసరం కాగా.. విజయానికి ఆసీస్ 8 వికెట్ల దూరంలో ఉంది. చదవండి: 46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్ హీరోయిన్ IPL 2022: ఐపీఎల్లో తెలుగోళ్లు... తొలి సారిగా అంపైర్! So @patcummins30 is Thor ? 😲#BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/kAn8oqtVWn — Pakistan Cricket (@TheRealPCB) March 15, 2022 -
స్పైడర్‌మ్యాన్ క్రేజ్..! మార్కెట్లలోకి సూపర్ హీరోస్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్స్
Tvs Ntorq 125 Price And Mileage: ప్రపంచవ్యాప్తంగా మార్వెల్స్ హీరోస్‌పై క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీలు మార్వెల్స్ హీరోస్ స్ట్రాటజీతో తమ వ్యాపారాలకు మరింత ఆదాయాలను సంపాదించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16 న రిలీజైన స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్ వెండి తెర సంచలనం సృష్టిస్తోంది. భారత్‌లో కూడా స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్ క్రేజ్ మామూలుగా లేదు. మార్వెల్స్ హీరోస్ లవర్స్ కోసం ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మార్వెల్స్ సూపర్ హీరోస్ ఎడిషన్ స్కూటర్లను లాంచ్ చేసింది. చదవండి: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..! అందులో టీవీలు, హెడ్‌ఫోన్స్, ఇంకా మరెన్నో..! టీవీఎస్ మోటార్ కంపెనీ టీవీఎస్ NTORQ 125 సూపర్‌స్క్వాడ్ ఎడిషన్‌లో భాగంగా మరో రెండు మార్వెల్ సూపర్ హీరోస్ స్పైడర్ మ్యాన్, థోర్ ప్రేరేపిత స్కూటర్లను కంపెనీ విడుదల చేసింది. గత ఏడాది సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌లో భాగంగా మార్వెల్ సూపర్ హీరోస్ - ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా ఎడిషన్ టీవీఎస్ Ntorq 125బైక్‌లను ప్రారంభించింది. భారత్‌లోకి RT-Fi సాంకేతికతతో వచ్చిన మొట్టమొదటి బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన స్కూటర్‌గా టీవీఎస్ Ntorq 125 నిలుస్తోంది. సూపర్ హీరోస్ ఫీచర్స్‌తో..! కొత్త మార్వెల్ స్పైడర్ మ్యాన్ , థోర్ వెర్షన్లు స్కూటర్స్ సూపర్ హీరోల ముఖ్య లక్షణాలను టీవీఎస్ Ntorq 125 ఏర్పాటుచేశారు. స్పైడర్ మ్యాన్, థోర్ కు సంబంధించిన విషయాలను ఇందులో ఉండేలా టీవీఎస్ డిజైన్ చేసింది. ఈ స్కూటర్లలోని స్మార్ట్‌కనెక్ట్ యాప్ స్పైడర్ మ్యాన్ లోగో , థోర్స్ హమర్ వంటి సంబంధిత పాత్రల చిహ్నాల సిల్హౌట్‌తో ఒపెన్ కానుంది.ఈ స్కూటర్లు మార్వెల్ సూపర్ హీరోస్ అనుభూతిని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ధర ఎంతంటే..! టీవీఎస్ NTORQ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 84,850 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ స్కూటర్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు... స్కూటర్ మొదటి-రకం వాయిస్ అసిస్ట్ ఫంక్షన్, మొదటి-ఇన్-సెగ్మెంట్ డ్యూయల్ రైడ్ మోడ్‌లను అందించే వేరియంట్‌తో రానుంది. చదవండి: మల్టీప్లెక్సుల బిజినెస్ అదరహో.. సాయం చేసిన స్పైడర్‌మ్యాన్- భరోసా ఇచ్చిన పుష్ప -
హీరో పర్సును తిరిగిచ్చినందుకు.. భారీ నజరానా!
మనకు నచ్చిన హీరో కనబడితేనే.. ఎగిరి గంతేస్తాం. సెల్ఫీ, ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడతాం. అలాంటిది మనకు ఆరాధ్యుడైన సూపర్ స్టార్ హీరో పర్సు దొరికితే ఆ అభిమాని ఆనందానికి హద్దే ఉండదు. అలాంటి ఆనందమే హాలీవుడ్ సూపర్ స్టార్ క్రిస్ హేమ్స్‌వర్త్ అభిమానికి లభించింది. 'థోర్', 'అవెంజర్స్' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు హేమ్స్‌వర్త్. అతనికి యువతలోనూ మంచి క్రేజ్ ఉంది. ఇటీవల ఈ స్టార్ హీరో లాస్ ఏంజిల్స్‌లోని ఓ హోటల్లో భోజనం చేసిన తర్వాత అక్కడే తన పర్సు మరిచిపోయి.. ఇంటికి వెళ్లిపోయాడు. అదే సమయంలో హోటల్‌కు వచ్చిన అతని అభిమాని ట్రిస్టిన్ బడ్జిన్ బేకర్‌కు ఆ పర్సు లభించింది. అది తన అభిమాన హీరో పర్సు గుర్తించిన బేకర్.. ఆ విషయాన్ని వెంటనే హేమ్స్‌వర్త్‌కు తెలియజేశాడు. తానే స్వయంగా వెళ్లి పర్సును అందజేశాడు. అభిమాని నిజాయితీకి మురిసిపోయిన హేమ్స్‌వర్త్ నిజానికి తన పర్సులో పెద్దగా డబ్బులేమీ లేకపోయినా.. బేకర్‌కు భారీగా నజరానా ఇచ్చాడు. అంతేకాకుండా అతన్ని 'థాంక్స్' చెప్తూ ఓ లేఖ కూడా రాశాడు. ప్రస్తుతం 'బాయ్ స్కౌట్' లో ఉన్న అతను భవిష్యత్తులో ఉన్నతమైన హోదాలో ఉండాలని శుభాశీస్సులు తెలిపాడు. ఇక, స్టార్ హీరోకు పర్సు తిరిగి ఇచ్చినందుకు ఇమేజ్ పబ్లిషర్స్ షట్టర్ ఫ్లై సంస్థ ఏకంగా 10వేల డాలర్లు (రూ. 6.7 లక్షలు) బేకర్‌కు బహుమతిగా ప్రకటించింది. తన అభిమాని బేకర్‌తో కలిసి 'ద ఎలెన్ డిజెనర్స్' అనే టీవీ షోలో కనిపించి.. తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు హేమ్స్‌వర్త్. మొత్తానికి హీరో పర్సు దొరికిన ఆనందం బేకర్ కు డబుల్ ధమాకా మిగిలించింది. -
బుల్లెట్ రాణి, బుల్లెట్ రాజాల సాహసయాత్ర
రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై దర్జాగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఇద్దరినీ ఎక్కడో చూసినట్లనిపిస్తోందికదా! అవును. ఆయన 'సుత్తి'తో దుష్టులను అంతం చేసే 'థోర్' హీరో క్రిస్ హేమ్స్ వర్త్ కాగా, ఆవిడ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' హీరోయిన్ ఎల్సా పాట్కీ. వీళ్లిద్దరూ భార్యభర్తలుగా కంటే గొప్ప స్నేహితులుగా, ఒకరికోసం ఒకరన్నట్లు జీవించే ప్రేమపక్షులుగా ప్రసిద్ధి. ఆ బంధాన్ని మరింత దృఢపర్చుకునేందుకు ఈ వాలెంటైన్స్ డేనాడు ఇద్దరూ కలిసి మరో సాహసకృత్యానికి సిద్ధమయ్యారు. సినిమా షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చి.. అడ్వెంచర్ టూరిస్టులకు అడ్డాగా మారిన ఇండియాకు కుటుంబంతోసహా విచ్చేసిన ఈ హాలీవుడ్ జంట ఇప్పటికే గోవా, లడాఖ్ ప్రాంతాలను చుట్టేశారు. వారి తర్వాతి గమ్యం హిమాలయాల్లో ట్రెక్కింగ్. సరిగ్గా ప్రేమికులరోజునాడే హిమాలయ సాహసయాత్రను ప్రారంభించనున్నారీ ప్రేమజంట. స్పెయిన్ కు చెందిన 'ప్లానెటా ఛలేజా(ప్లానెట్ ఛాలెంజ్)' అనే అడ్వెంచర్స్ అంస్థ వీరి టూర్ ను గైడ్ చేస్తోంది. -
సూపర్‌మ్యాన్.. సూపర్ వైరస్
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు తాజాగా సూపర్‌మ్యాన్, థోర్ వంటి సూపర్ హీరో క్యారెక్టర్లతో ఆన్లైన్ దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి క్యారెక్టర్ల పేర్లతో కూడిన హానికారక సాఫ్ట్వేర్లు, వైరస్‌లతో యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని, పాస్‌వర్డ్‌లను తస్కరిస్తున్నారు. సెక్యూరిటీ సర్వీసులు అందించే మెకాఫీ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ‘అత్యంత మోసకారి సూపర్‌హీరో’ అపఖ్యాతిని సూపర్‌మ్యాన్ దక్కించుకున్నాడు. సూపర్‌మ్యాన్ పేరుతో సెర్చి చేస్తే.. మోసాలు జరిగే ఆస్కారం ఉన్న సైట్లలోకి మళ్లే అవకాశాలు అత్యధికంగా 16.5 శాతం మేర ఉన్నాయి. ఉదాహరణకు సూపర్ మ్యాన్ .. టారెంట్ డౌన్లోడ్ అని, సూపర్‌మ్యాన్ అండ్ వాచ్ అని, సూపర్‌మ్యాన్ అండ్ ఫ్రీ యాప్ అని సెర్చి చేస్తే.. వ్యక్తిగత సమాచారం చోరీ చేసే విధంగా రూపొందిన సైట్లలోకి వెళ్లే రిస్కులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సైట్ల నుంచి పిక్చర్స్ లేదా వీడియోలను డౌన్లోడ్ చేసుకుంటే వాటితో పాటు వైరస్లు, మాల్వేర్లు కూడా మన సిస్టంలోకి డౌన్లోడ్ అవుతాయి. తాజాగా బ్యాట్‌మ్యాన్ వర్సస్ సూపర్‌మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సూపర్హీరోలిద్దరూ.. లిస్టులో టాప్ స్థాయికి చేరుకోవచ్చని మెకాఫీ పేర్కొంది. ఇటువంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే.. ఉచిత కంటెంట్‌ను, నమ్మశక్యం గాని విధంగా ఆఫర్లు ఇచ్చే వెబ్సైట్ల నుంచి దూరంగా ఉండాలని తెలిపింది.