హీరో పర్సును తిరిగిచ్చినందుకు.. భారీ నజరానా! | For Returning Thor Wallet, Teen Gets Chris Hemsworth Thanks | Sakshi
Sakshi News home page

హీరో పర్సును తిరిగిచ్చినందుకు.. భారీ నజరానా!

Published Wed, Apr 20 2016 7:51 PM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

హీరో పర్సును తిరిగిచ్చినందుకు.. భారీ నజరానా! - Sakshi

హీరో పర్సును తిరిగిచ్చినందుకు.. భారీ నజరానా!

మనకు నచ్చిన హీరో కనబడితేనే.. ఎగిరి గంతేస్తాం. సెల్ఫీ, ఆటోగ్రాఫ్‌ ల కోసం ఎగబడతాం. అలాంటిది మనకు ఆరాధ్యుడైన సూపర్‌ స్టార్‌ హీరో పర్సు దొరికితే ఆ అభిమాని ఆనందానికి హద్దే ఉండదు. అలాంటి ఆనందమే హాలీవుడ్ సూపర్‌ స్టార్ క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ అభిమానికి లభించింది. 'థోర్‌', 'అవెంజర్స్' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు హేమ్స్‌వర్త్‌. అతనికి యువతలోనూ మంచి క్రేజ్‌ ఉంది.

ఇటీవల ఈ స్టార్‌ హీరో లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ హోటల్‌లో భోజనం చేసిన తర్వాత అక్కడే తన పర్సు మరిచిపోయి.. ఇంటికి వెళ్లిపోయాడు. అదే సమయంలో హోటల్‌కు వచ్చిన అతని అభిమాని ట్రిస్టిన్ బడ్జిన్‌ బేకర్‌కు ఆ పర్సు లభించింది. అది తన అభిమాన హీరో పర్సు గుర్తించిన బేకర్‌.. ఆ విషయాన్ని వెంటనే హేమ్స్‌వర్త్‌కు తెలియజేశాడు. తానే స్వయంగా వెళ్లి పర్సును అందజేశాడు. అభిమాని నిజాయితీకి మురిసిపోయిన హేమ్స్‌వర్త్‌ నిజానికి తన పర్సులో పెద్దగా డబ్బులేమీ లేకపోయినా.. బేకర్‌కు భారీగా నజరానా ఇచ్చాడు. అంతేకాకుండా అతన్ని 'థాంక్స్‌' చెప్తూ ఓ లేఖ కూడా రాశాడు. ప్రస్తుతం 'బాయ్‌ స్కౌట్‌' లో ఉన్న అతను భవిష్యత్తులో ఉన్నతమైన హోదాలో ఉండాలని శుభాశీస్సులు తెలిపాడు.

ఇక, స్టార్ హీరోకు పర్సు తిరిగి ఇచ్చినందుకు ఇమేజ్ పబ్లిషర్స్‌ షట్టర్ ఫ్లై సంస్థ ఏకంగా 10వేల డాలర్లు (రూ. 6.7 లక్షలు) బేకర్‌కు బహుమతిగా ప్రకటించింది. తన అభిమాని బేకర్‌తో కలిసి 'ద ఎలెన్ డిజెనర్స్‌' అనే టీవీ షోలో కనిపించి.. తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు హేమ్స్‌వర్త్‌. మొత్తానికి హీరో పర్సు దొరికిన ఆనందం బేకర్‌ కు డబుల్ ధమాకా మిగిలించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement