wallet
-
ఆర్బీఐ కొత్త రూల్.. యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్
యూపీఐ చెల్లింపులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుభవార్త చెప్పింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి థర్డ్-పార్టీ యూపీఐ ( UPI ) యాప్‌ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) వ్యాలెట్లలోని సొమ్ముతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకూ పీపీఐ సంస్థకు చెందిన యూపీఐ యాప్ ద్వారా మాత్రమే ఈ తరహా పేమెంట్లకు అవకాశం ఉండేది.ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇకపై వ్యాలెట్ హోల్డర్లు యూపీఐ చెల్లింపులు చేయడానికి పీపీఐ వ్యాలెట్ జారీచేసే సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. యూపీఐని ఉపయోగించి వ్యాలెట్ ద్వారా లావాదేవీలు చేయడానికి థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించవచ్చు. ఈ మేరకు ఓ నోటిఫికేషన్లో ఆర్బీఐ పేర్కొంది.పీపీఐ అంటే..పీపీఐలు అనేవి అందులో జమైన సొమ్ముతో వస్తువులు, సేవల కొనుగోలు, ఆర్థిక సేవల నిర్వహణ, చెల్లింపులు మొదలైన వాటిని సులభతరం చేసే సాధనాలు. పీపీఐలను బ్యాంకులు, నాన్-బ్యాంకులు జారీ చేయవచ్చు. ఆర్బీఐ నుండి అనుమతి పొందిన తర్వాత బ్యాంకులు పీపీఐలను జారీ చేస్తాయి. ఇక భారతదేశంలో ఏర్పాటై కంపెనీల చట్టం, 1956 / 2013 కింద నమోదైన నాన్ బ్యాంక్ కంపెనీలు కూడా పీపీఐలను జారీ చేస్తాయి. -
యూపీఐ లైట్ వాలెట్ పరిమితి పెంపు
యూపీఐ లైట్ వాలెట్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వాలెట్ పరిమితిని రూ. 5,000కు, ఒక్కో లావాదేవీ పరిమితిని రూ. 1,000కి పెంచింది. ఇందుకు సంబంధించి 2022 జనవరిలో జారీ చేసిన ’ఆఫ్‌లైన్ ఫ్రేమ్‌వర్క్’ను సవరించింది. ప్రస్తుతం ఈ విధానంలో ఒక్కో లావాదేవీ పరిమితి రూ. 500గా, మొత్తం వాలెట్ లిమిట్ రూ. 2,000గా ఉంది. గత అక్టోబర్‌లో ఆర్బీఐ తన ద్రవ్య విధానంలో భాగంగా ఈ పరిమితులను సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న లేదా అందుబాటులో లేని పరిస్థితుల్లో రిటైల్ డిజిటల్ చెల్లింపులు చేయగలిగే సాంకేతికతలను ఆర్బీఐ ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.యూపీఐ పిన్ని ఉపయోగించకుండా తక్కువ-విలువ లావాదేవీలను నిర్వహించడానికి వినియోగదారులను యూపీఐ లైట్ అనుమతిస్తుంది. ఇది రియల్ టైమ్ బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లపై ఆధారపడకుండా కస్టమర్-ఫ్రెండ్లీ విధానంలో పనిచేస్తుంది. దీని ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి, వ్యాపారులకు ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు. -
పోయిన వాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమానికి చేరింది! ఎలాగంటే..?
కొన్ని వస్తువులు పోతే మళ్లీ మనకు చేరడం అసాధ్యం. ఎవరో కొంతమంది మంచివాళ్లు సదరు యజమానికి అందేలా చేయాలనకుంటే గానీ దొరకదు. అలా సహృదయంతో తిరిగే ఇచ్చివాళ్లు అరుదు. అలాంటిది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం పోయిన వాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమాని తాలుకా కుటుంబసభ్యులను చేరుకుంటే ఆ వ్యక్తి జ్ఞాపకాలు కళ్ల ముందు ఒక్కసారిగా మెదులుతాయి. ఇలాంటి ఘటన ఎవ్వరికో గానీ జరగదు. అసలు ఆ వాలెట్ ఎలా పోయింది?. ఎవరు ఆ వాలెట్‌ని యజమాని కుటుంబసభ్యుల వద్దకు చేర్చారంటే.. అట్లాంటాలోని పురాతన ప్లాజా థియోటర్ ఒకటి ఉంది. దాన్ని మరమత్తు చేస్తుండగా ఆ థియోటర్ వెనుకవైపున ఉన్న బాత్రూం గోడ కూలిపోయింది. దీంతో వాలెట్ బయటపడింది. దానిలో కొన్ని మాగ్నటిక్ స్ట్రిప్లేని క్రెడిట్లు, సినిమా టిక్కెట్, ఫ్యామిలీకి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నాయి. దీంతో ఆ ధియోటర్ యజమాని క్రిస్ ఎస్కోబార్ సదరు వ్యక్తి కుటుంబానికి ఇప్పటికైన అందేలా చేయాలనుకున్నాడు. అయితే 1959లో చేవ్రోలెట్ సినిమా చూడటాని వచ్చి పోగొట్టుకున్నట్లు వాలెట్లో ఉన్న టికెట్‌ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ వాలెట్ యజమాని లేదా అతడి కుటుంబ సభ్యులకు అయినా దీన్ని అందేలా చేయాలన అనుకుంటాడు క్రిస్. అయితే ఆ కుటుంబం మునుపు ఈ పరిసరాల్లోనే ఉండొచ్చేమో గానీ ఇప్పుడూ చాల ఏళ్లు అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటుందనేది కనిపెట్టడం అసాధ్యంగా అనిపించింది క్రిస్ ఎస్కోబార్‌కి. దీంతో ఆ వ్యాలెట్‌లో ఉన్న లైసెన్స్ కార్డుల ఆధారంగా వ్యాలెట్ పోగొట్టుకున్న వ్యక్తి స్త్రీని అని కనుగొంటారు. ఆమె పేరు ఫ్లాయ్ కల్బ్రేత్గా గుర్తించారు. అయితే ఆ కాలంలో స్త్రీలు తమ భర్తల పేరుతో పిలిచేవారు. దీంతో ఆమె అడ్రస్ కనుగొనడం మరింత కష్టంగా మారింది. దీంతో క్రిస్ తన భార్య సాయం తీసుకుంటాడు. ఆమె ఇంటర్నెట్లో సోధించగా కల్‌బ్రెత్ మరణించినట్లు గుర్తిస్తుంది. దీన్ని బట్టి ఫ్లాయ్ ఆమె పేరు అని అర్థం చేసుకుంటారు ఆ దంపతులు. అంతేగాదు కల్‌బ్రెత్ పేరు మీద కల్‌బ్రెత్ కప్ అనే గోల్ఫ్ టోర్నమెంట్ వెబ్‌సైట్‌ను కనుగొంటారు. అతడి కుటుంబ చిన్నపిల్లలకు వచ్చే మస్తిష్క పక్షవాతం(Cerebral Palsy) అనే ఛారిటీ సంస్థ కోసం ఈ టోర్నమెంట్‌ని నిర్వహిస్తున్నట్లు తెలుసుకుంటారు. అలా ఫ్లాయ్ కుమార్తె థియా చాంబర్‌లైన్‌ను కనుగొంటారు. ఆమెకు ఈ వ్యాలెట్‌ని అందజేస్తాడు క్రిస్. దీంతో ఆమె ఒక్కసారిగా ఆ వ్యాలెట్‌ని తీసుకుంటూ తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఆమె చాలా అందంగా ఉంటుందని, మంచి వ్యక్తిత్వం గలదంటూ ఉద్వేగం చెందుతుంది. ఆమె వ్యాలెట్‌లో భీమా కార్డులు, డాక్టర్ అపాయింట్మెంట్ నోట్లు కనుగొంటుంది. ట్విస్ట్ ఏంటంటే థియా చాంబర్‌లైన్‌కు ఇప్పుడు 71 ఏళ్లు. ఈ వ్యాలెట్ పోయినప్పుడు ఆమెకు ఆరేళ్లు. ఈ మేరకు ఆ థియోటర్ యజమాని క్రిస్ మాట్లాడుతూ..తమకు మనవళ్లు, మునివళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కాబట్టి ఈ కల్బ్రేత్కు కూడా అలానే ఉంటారు కదా. ఈ వ్యాలెట్ కలెబ్రెత్ జ్ఞాపకాలను ఆ కుటంబంలోని తరతరాలకు తెలియజేస్తుంది కదా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు క్రిస్. (చదవండి: మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చేయగలవు!) -
ఇక పాకెట్లోనే డేటా వ్యాలెట్!
కేజీ రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) : ♦ ప్రతి వ్యక్తి సగటున రోజుకు 3.5 గిగాబైట్స్ (జీబీ)ని వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ♦ 2021 నాటి గణాంకాల ప్రకారం.. రోజూ 2.5 క్విన్ టిలియన్ (18 జీరోలు) డేటా ఉత్పత్తి అవుతోంది. ..ఇలా ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో నిత్యం డేటా వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. మనకు ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్‌పైనే ఆధారపడుతున్నాం. దాని నుంచి పొందిన డేటాను భద్రపర్చడం, అవసరమైనప్పుడు తిరిగి అందుబాటులోకి తేవడం కష్టంగా మారుతోంది. మూడు దశాబ్దాల క్రితం మెమొరీ స్టోరేజ్.. ఫ్లాపీతో మొదలైంది. ఆ తర్వాత సీడీ, డీవీడీ, మెమొరీ కార్డు, పెన్ డ్రైవ్ ఇలా విభిన్న రూపాలను సంతరించుకుంది. ఈ కోవలో ఇప్పుడు డేటా సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటికి కూడా భారీ స్థలం, వ్యయం, అధిక విద్యుత్ వినియోగం అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన బయోమెమొరీ అనే ఒక స్టార్టప్ సంస్థ.. డీఎన్ఏ డిజిటల్ డేటా స్టోరేజీ విధానంపై పలు పరిశోధనలు చేసింది. మన ప్యాకెట్లో పట్టే వ్యాలెట్ సైజులో ఉంచుకునే క్రెడిట్ కార్డు తరహాలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. వ్యాలెట్ సైజులోనే.. ఇకపై సొంత డేటా, కంపెనీ డేటా.. ఇలా ఏదైనా ఇక ఏ డేటా సెంటర్ నుంచో బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ కంపెనీ సీఈవో మీరే అయితే.. సంస్థకు సంబంధించిన మొత్తం సమాచారం మీ జేబులో ఉంచుకునే రోజులు రాబోతున్నాయి. కొత్త తరహా డేటా సెంటర్లను అభివృద్ధి చేసే ప్రక్రియపై బయో మెమొరీ స్టార్టప్ సంస్థ ప్రయోగాలు దాదాపు సఫలీకృతమయ్యాయి. సుమారు వెయ్యి డాలర్ల ధరకే ఈ డీఎన్ఏ డేటా స్టోరేజీని అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. 150 ఏళ్లపాటు సురక్షితం.. కేవలం డేటా స్టోరేజీ విషయంలోనే కాకుండా.. భద్రంగా దాచుకునేందుకు కూడా ఈ డీఎన్ఏ డేటా ఉపయుక్తం కానుంది. వాస్తవానికి హార్డ్ డిస్క్‌లకు 5 ఏళ్లు, ఫ్లాష్ డ్రైవ్స్‌కు 10 ఏళ్ల మన్నిక ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యాలెట్ సైజులో ఉండే డేటా బ్యాంకు 150 ఏళ్ల పాటు భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా వైరస్ల బెడద కూడా ఉండదు. అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు. ఇతరులెవరూ దీన్ని యాక్సిస్ చేయలేరు. ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ దాడులు జరిగినప్పుడు కూడా సమాచారం చెక్కుచెదరకుండా ఉండేలా రూపుదిద్దుకుంటోంది. ఎంత పెద్ద డేటానైనా కేవలం నానో సెకన్లలోనే చెక్ చేసుకునే సదుపాయం కూడా ఈ డీఎన్ఏ డేటా బ్యాంకుల ద్వారా అందుబాటులోకి రానుంది. డేటా సెంటర్ల కేంద్రంగా.. విశాఖ ఇంటర్నెట్ద్వారా సమాచార సేవలు నిరంతరాయంగా అందాలంటే డేటా సెంటర్లే కీలకం. అటువంటి డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా విశాఖపట్నంలోనూ ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే నిక్సీ ఓ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా.. రూ.21,844 కోట్ల పెట్టుబడితో దిగ్గజ సంస్థ ఆదానీ సైతం డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఓవైపు.. డేటా సెంటర్ల ఏర్పాటులో ఆయా దేశాలు పోటీపడుతుండగా.. బయోమెమొరీ స్టార్టప్ సంస్థ చేస్తున్న ప్రయోగాలతో వ్యాలెట్ రూపంలో డేటా బ్యాంక్ మార్కెట్లోకి వస్తే సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు ఖాయమంటున్నారు. భారత్‌లో భారీ డేటా సెంటర్లు.. ప్రస్తుతం హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ ఆపరేషన్స్ జరుగుతున్న దేశాల్లో 44 శాతంతో యూఎస్ మొదటి స్థానాన్ని ఆక్రమించగా.. చైనా 8 శాతం, జపాన్, యూకే 6 శాతం చొప్పున, ఆస్ట్రేలియా, జర్మనీ 5 శాతం చొప్పున తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డేటా వినియోగానికి అనుగుణంగా భారత్‌లోనూ అడుగులు పడుతున్నాయి. మొత్తం డేటా ట్రాఫిక్ 2025 నాటికి నెలకు 7 ఎక్సాబైట్స్ నుంచి 21 ఎక్సాబైట్స్కు పెరుగుతుందని ఒక అంచనా. డేటా వ్యాపారం 2022లో 4.9 బిలియన్ డాలర్లుండగా.. 2027 నాటికి ఇది 10.09 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. 25 ఎకరాల స్థలంలో మహారాష్ట్రలోని పూణే సమీపంలోని పింప్రీలో దీన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు అమెజాన్, గూగుల్ సైతం డేటా సెంటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయి. -
పర్సుని ఫ్యాంటు వెనుక జేబులో పెడుతున్నారా?
మనం నిత్యం సాధారణంగా భావించి చేసే పనులు ఒక్కోసారి చేటు తెస్తాయి. ఎంతలా అంటే అందువల్లే మనకు ఈ సమస్య వచ్చిందని వైద్యులు లేదా మరేవరైన ఆరోగ్య నిపుణుడు చెప్పేంతవరకు గమనించం. మనం ఊహించను కూడా ఊహించం అలా చేయడం అంత ప్రమాదమా! అని ఆ తర్వాతగానీ తెలిసి రాదు. ఎందుకంటే చాలామంది ఇలాంటి పనులు రోజువారి జీవితంలో సాధారణంగా చేసేవే కావడం. ఇంతకీ ఎందుకిదంతా అంటే..చాలామంది పర్సు లేదా వాలెట్‌ని మగవారు లేదా స్త్రీలు బాక్ పాకెట్లోనే పెట్టుకుంటుంటారు. చాలా సర్వసాధారణమైన విషయం కూడా. ఐతే అలా అస్సలు పెట్టకూడదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వల్లే తలెత్తే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఓ ఏజ్ వచ్చేటప్పటికి సరిగా నడవలేక వంగిపోవడానికి కారణం కూడా ఇదే అని అంటున్నారు ఆరోగ్య నిపుణలు. పర్సు వల్ల ఆరోగ్య సమస్యలా అని ఆశ్చర్యపోకండి!. ఔను! దీని వల్ల ఎలాంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయంటే..చాలా మంది మెడ, భుజాలు, వెన్ను సమస్యలను తరుచుగా ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం పర్సుని వెనుక జేబులో పెట్టడమేనని అంటున్నారు. మనం బ్యాక్ పాకెట్లో పెట్టే వాలెట్‌ని బట్టి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. బరువైన వాలెట్‌ని తీసుకొచ్చి బ్యాక్ పాకెట్లో పెట్టడం వల్ల తెలియకుండా ఆ బరువు కారణంగా కొంత ఒత్తిడి కండరాలు, స్నాయువులపై పడి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఫలితంగా అది కాస్త దీర్ఘకాలిక కీళ్ల నొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వెన్నుపై ఎలా ప్రభావం పడుతుందంటే.. పర్సు ఓ మోస్తారు బరువు ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ మనం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వోచ్చర్స్, ఆధార్ కార్డులని ఇలా ఎన్నో కార్డులతో బరువుగా నింపేస్తాం. పోనీ అక్కడితో ఊరుకోకుండా దాన్ని తీసుకెళ్లి బ్యాక్ జేబులో ఏదోరకంగా కుక్కి ఎత్తుగా కనపడకుండా ఉండేలా పైన ఉన్న షర్ట్ లేదా టీషర్టుని సరిచేసుకుంటాం. ఔనా! దీంతో తుంటి ఎముకలోని కండరాలు, కీళ్లు ఒత్తడికి గరయ్యి ఒకవైపు ఒంగిపోతాయి. అంతేందుకు మనం ఎక్కువ బరువుని మోస్తే ఆటోమోటిక్గా ఒకవైపుకి వంగి నడుస్తాం. మనకు తెలియకుండాని మన నడక వంకర అవుతుంది. దీంతో వెన్ను, తుంటి, కాలు, భుజాలలో నొప్పి మొదలై అసౌకర్యంగా ఉంటుంది. మన బ్యాక్ సైడ్పెట్టే బరువు వెన్నుపూసపై గట్టి ప్రభావం చూపిస్తుంది. చెప్పాలంటే పూసలు కదలడం లేదా వెన్ను ఒకవైపు వంకర అయ్యే ప్రమాదం లేకపోలేదు. అంతేగా ఆ నొప్పి అక్కడ నుంచి మెడకు, భుజాలకు పాకి కీళ్ల నొప్పుల్లోకి పెట్టేస్తుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు వాలెట్‌ని బరువుగా ఉండనివ్వొద్దని వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కార్డులతో పనిలేకుండా.. నిజానికి, అనేక దుకాణాలు పంచ్ కార్డ్‌ని ఉపయోగించకుండా యాప్ ద్వారా లాయల్టీ పాయింట్లను ఉపయోగించేలా అనుమతిస్తాయి కూడా. మీరు చాలా బిల్లులు కట్టేందుకు ఆయా కార్డులు పట్టికెళ్లాల్సి ఉంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుని కార్డులు తగ్గించే యత్నం చేయండి. పంచ్ కార్డ్‌లు, బిజినెస్ కార్డులు, రివార్డు కార్డ్‌లు తదితర ఎలాంటి కార్డులైన తీసుకుని వెళ్లడం తగ్గించేలా యత్నం చేయాలి. అన్నింటిని రోజు మోసుకుంటూ వెళ్లాల్సి అవసరం లేదు. సాధ్యమైనంత వరకు వాలెట్ లేదా పర్సులో కార్డుల సంఖ్య పరిమితిగా ఉండి బరువు లేకుండా ఉండేలా చూసుకోండి. తద్వారా చిన్నగా ప్రారంభమయ్యే ఈ వీపు, మెడ, భుజాలు, కాళ్లు సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చని వైద్యలు నొక్కి చెబుతున్నారు. (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
సైబరాసురులు దోచేస్తున్నారు..కంపెనీల పేరులో వల
‘ఆన్లైన్ ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఇంట్లోనే కూర్చుని నెలకు లక్షలాది రూపాయల్ని స్పందించే అవకాశం’ అంటూ విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ఫోన్‌కు రెండు నెలల క్రితం మెసేజ్ వచ్చింది. ఆశతో మెసేజ్ కింద ఉన్న వెబ్‌లింక్‌ను క్లిక్ చేయగా.. ఓ ప్రముఖ కంపెనీ పేరిట వెబ్సైట్ తెరుచుకుంది. కంపెనీలో పెట్టుబడి పెట్టే వారికి లాభాలు పంచుతామని అందులో పేర్కొనడంతో.. ఆమె రూ.వెయ్యి పెట్టుబడి పెట్టింది. మరుసటి రోజున రూ.15 వేలు లాభం వచ్చినట్టు ఆమె పేరిట ఉన్న ఆ కంపెనీ వాలెట్లో ఆ మొత్తాన్ని జమ చేసినట్టు చూపించారు. వాలెట్లోని నగదు విత్‌డ్రా చేయాలంటే మరో రూ.5 వేలు పెట్టుబడి పెట్టాలనే మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె రూ.5 వేలను పెట్టుబడి పెట్టింది. ఇలా ప్రతి రోజూ ఆమె పేరిట ఉండే వాలెట్లోని నగదు పెరగడం.. ఆ మొత్తాన్ని తీసుకోవాలంటే మరికొంత నగదు జమ చేయాలనే ఆంక్షల రూపంలో మెసేజ్‌లు రావడం పరిపాటిగా మారింది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే ఆమె వాలెట్లో 1,13,42,181 రూపాయలు చేరాయి. ఈ నగదు తీసుకునే నిమిత్తం విడతల వారీగా రూ.9 లక్షలు సమర్పించాక మోసపోయానని గ్రహించిన ఆ మహిళ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త చనిపోవడంతో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. డబ్బులు వస్తే పిల్లల చదువుకు ఉపయోగపడతాయనే ఆశతో బంగారాన్ని అమ్మేసి మరీ సైబర్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతోంది. విజయవాడ నగరంలో ఇలాంటి మోసాలకు సంబంధించి నెలకు సగటున 10 వరకు కేసులు నమోదవుతుండటంతో సైబర్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆశ చూపి లూటీ చేస్తున్నారు అమెజాన్, ఈబే, లవ్ లైఫ్, క్రి΄్టో, స్నాప్ డీల్, ఫ్లిప్‌కార్ట్, ఓలా తదితర బడా కంపెనీల్లో స్వల్ప పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయంటూ పలువురి ఫోన్లకు మెసేజ్‌లు పంపించి సైబరాసురులు ఆకర్షిస్తున్నారు. ఇంట్లోనే కూర్చుని నెలకు రూ.లక్షలు సంపాదించవచ్చంటూ మెసేజ్‌ల ద్వారా సూచిస్తారు. నమ్మకం కుదరకపోతే రూ.లక్షలు సంపాదించిన వారి వీడియోలు చూడండి అంటూ.. వారే తయారు చేసిన కొన్ని వీడియోలను యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ ద్వారా లింక్‌లను పంపుతారు. మొత్తం ఆన్లైన్ అయిపోయిందని, భవిష్యత్ వ్యాపారం పూర్తిగా ఆన్లైన్ వేదికగానే జరుగుతుందంటూ ముగ్గులోకి దించుతారు. ముందుగా రూ.100 పెట్టుబడి పెట్టి పరీక్షించుకోండంటూ బంపర్ ఆఫర్ ఇస్తారు. వారు పంపిన వెబ్‌లింక్ క్లిక్ చేయగానే వారే రూపొందించిన ఆయా కంపెనీల నకిలీ వెబ్సైట్లోకి తీసుకెళ్తారు. తరువాత ఒక యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తారు. అక్కడ మన కోసం ఒక వాలెట్‌ను రూ΄÷ందించి పెట్టుబడులను పలు రకాలైన ఆఫర్లతో ఆకర్షిస్తారు. రూ.100 పెట్టుబడి పెట్టిన 24 గంటల్లోపే లాభం రూ.1,500లకు పైగా వచ్చిందని వాలెట్లో చూపిస్తారు. ఆ నగదు మీ బ్యాంక్ ఖాతాకు చేరాలంటే మరో రూ.500 పెట్టుబడి పెట్టాలంటూ ఆంక్షలు విధిస్తారు. ఇలా వాలెట్లో నగదు అంకెలను పెంచుకుని΄ోతూ ఆశను పెంచేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు గుంజుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి క్యాష్ ఇన్వెస్ట్మెంట్ తరహా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. కేసులు నమోదు చేసి సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నాం. ఈ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజలు అవసరం లేని వెబ్‌లింక్‌ల జోలికి ;పోకూడదు. – యేలేటి శ్రీరచన, ఎస్ఐ, సైబర్ క్రైం, విజయవాడ (చదవండి: భారతీయ చిన్నారులు బాగా ‘స్మార్ట్’ ) -
అక్క ఎంబీఏ, తమ్ముడు లా వదిలేసి.. పాత చీరలతో బ్యాగులు తయారు చేస్తూ..
ఇంట్లో పెద్దపిల్లలు వాడిన ఆట వస్తువులు, పొట్టి అయిన, బిగుతైన బట్టలు, పై తరగతికి వెళ్లిన అక్క లేదా అన్నయ్య పుస్తకాలను తమ్ముడు, చెల్లెళ్లకు ఇవ్వడమనేది మన దేశంలో ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తోన్న పద్ధతి. చిన్నవాళ్లకు కూడా ఆ బట్టలు పొట్టి అయినప్పుడు ఇల్లు తుడిచే మాప్గానో, మసిబట్టగానో ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఈ పద్దతికి టెక్స్టైల్స్ పరిశ్రమలు మరికొన్ని కొత్త హంగులు జోడించి రీసైక్లింగ్ పేరిట ఆకర్షణీయమైన ఉత్పత్తులను ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రవేశపెడుతున్నాయి. రీసైక్లింగ్ చేసిన ఫ్యాషన్ ఉత్పత్తుల క్రేజ్‌ను గుర్తించిన రిని మెహత.. పాత చీరలతో అందమైన బ్యాగ్‌లను రూపొందించి పిటారా పేరుతో విక్రయిస్తోంది. సంప్రదాయ బ్యాగ్‌లతోపాటు, లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫ్యాషన్ ఉత్పత్తులు అందించడం పిటారా ప్రత్యేకత. పాత చీరలకు ప్లాస్టిక్ వ్యర్థాలను జోడించి లగ్జరీ ఉత్పత్తులు తయారు చేస్తోన్న పిటారా గురించి రిని మెహతా మాటల్లో... ‘మాది జైపూర్. చిన్నప్పటి నుంచి సృజనాత్మకంగా ఉండడం ఇష్టం. నా మనసులో వచ్చే అనేక క్రియేటివ్ ఆలోచనలు బ్లాక్‌బోర్డు మీద రాస్తుండేదాన్ని. అలా రాస్తూ కాస్త పెద్దయ్యాక సొంతంగా తయారు చేసిన కార్డులను ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శనకు ఉంచే దాన్ని. నా ఆలోచనలు, అభిరుచులను పట్టించుకోని అమ్మానాన్నలు నన్ను ఎమ్బీఏ చేయమని పట్టుబట్టారు. వారికోసం ఎమ్బీఏలో చేరాను కానీ, పూర్తిచేయలేదు. ఆ తరువాత క్రియేటివ్ రంగంలో పనిచేయాలన్న దృఢసంకల్పంతో.. టెక్స్టైల్ డిజైనర్‌గా పనిచేయడం ప్రారంభించాను. కొన్నాళ్లు డిజైనర్‌గా పనిచేశాక నేనే సొంతంగా సరికొత్తగా ఏదైనా చేయాలనుకున్నాను. ఈ ఆలోచనకు ప్రతిరూపమే ‘పిటారా’. తమ్ముడు లా వదిలేశాడు.. కట్టుకోవడానికి పనికిరాని పాతచీరలతో బ్యాగ్‌లు తయారు చేసి విక్రయించవచ్చు అని తమ్ముడు రోహన్ మెహతాకు చెప్పాను. నా ఐడియా వాడికి బాగా నచ్చింది. దీంతో రోహన్ లా ప్రాక్టీస్‌ను వదిలేసి నాతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఇద్దరం కలిసి పిటారాను ప్రారంభించాము. పిటారా అంటే ‘ట్రెజరీ బాక్స్’ అని అర్థం. ప్రారంభంలో ఇంట్లో మూలుగుతోన్న పాత చీరలతో బ్యాగ్‌లు తయారు చేసే వాళ్లం. క్రమంగా ఇంట్లో పాత చీరలన్నీ అయిపోయాయి. తరువాత మేము తయారు చేస్తోన్న ఉత్పత్తుల గురించి మా కాలనీలో వాళ్లకు, సోషల్ మీడియాలోనూ వివరించడంతో చాలామంది తమ ఇళ్లలో ఉన్న పాత చీరలను తీసుకొచ్చి ఇచ్చేవారు. అలా చీరలు ఇచ్చిన వారికి కూపన్లు ఇచ్చే వాళ్లం. ఆ కూపన్లను మా స్టోర్‌లో ఏదైనా కొనుక్కున్నప్పుడు వాడుకునే విధంగా ఏర్పాటు చేశాం. అన్నీ హ్యాండ్మేడే.. మా పిటారా ఉత్పత్తులన్నీ చేతితో తయారు చేసినవే. వాటిలో రాజస్థానీ కళ, సంస్కృతీ సంప్రదాయాలు స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. మా బ్యాగ్‌లలో బగ్రు, జర్దోసి ప్రింట్లు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ప్రతిదీ యంత్రాలతో తయారు చేస్తున్నారు. మేము మన సంస్కృతిని వెనక్కి తీసుకు రావడంతోపాటు, కళాకారులకు ఉపాధి కల్పించాలనుకున్నాము. అందుకే మా బామ్మ వాలెట్‌ను ప్రేరణగా తీసుకుని అప్పట్లో వాడిన బ్లాక్, ఇక్కత్ ప్రింట్ వస్త్రంతో వివిధ రకాల టెక్నిక్లను వాడి డిజైన్లు రూపొందించి ఇప్పటి ట్రెండ్‌కు నప్పేవిధంగా ఉత్పత్తులు తయారు చేస్తున్నాము. రీసైక్లింగ్ చేసిన చీరలకు న్యూస్ పేపర్లు, మ్యాగజీన్లు, పాత టైర్లు, ఉన్ని, ఈకలు జోడించి రోజువారి వాడుకునే వస్తువులను రూపొందిస్తున్నాం’ అని వివరిస్తోంది రిని మెహతా. సృజనాత్మక ఆలోచనా విధానం ఉండాలే గానీ అద్భుతాలు సృష్టించే అవకాశాలు తన్నుకుంటూ వస్తాయనడానికి రిని మెహతా పిటారా ఉదాహరణగా నిలుస్తోంది. సవాలుగా అనిపించినప్పటికీ.. వ్యాపారం ఏదైనా ప్రారంభంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ప్రారంభంలో మా వద్దకు వచ్చిన వ్యర్థాలను లగ్జరీ ఉత్పత్తులుగా తీర్చిదిద్దడం సవాలుగా అనిపించింది. తరువాత మొత్తం వ్యర్థాలను ఒక పద్ధతి ప్రకారం వేరుచేయడం మొదలు పెట్టాం. లెదర్, జూట్, జరీలను విడివిడిగా తీసి వాటిని అవసరమున్న వాటి దగ్గర వాడేవాళ్లం. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా బ్యాగ్‌లు తయారు చేయడంతో మా ఉత్పత్తులకు మంచి స్పందన లభించింది. ఈ స్పందనతో రంగురంగుల హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్స్, టాట్స్, క్రాస్బాడీ బ్యాగ్స్, పాస్‌పోర్టు కవర్స్, సన్‌గ్లాస్ కేసెస్, టిష్యూ బాక్సెస్, హ్యాంగర్స్, ట్రావెల్ పౌచ్‌లు వంటివి అనేకం తయారు చేసి విక్రయిస్తున్నాం. మనం బతకడానికి పర్యావరణం ఎంతగానో ఉపయోగపడుతుంది. అటువంటి పర్యావరణాన్ని ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌తో కాలుష్యమయం చేసేకంటే వాటిని మరో విధంగా వాడడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని నమ్ముతున్నాము. చదవండి: చుక్కల్లో చంద్రిక.. ఎన్నో రకాల బుక్స్ చదివాను.. కానీ, ఆ ఒక్కటీ.. -
ఈ యాప్ వాడుతున్న వారికి ఆర్బీఐ అలర్ట్..!
RBI Cautions: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరించింది. ఎస్‌రైడ్ యాప్ వాడేవారిని లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ యాప్‌ను మొబైల్లో వినియోగిస్తున్నట్లయితే వెంటనే డిలీట్ చేయాలని ఆర్బీఐ పేర్కొంది. ఎస్‌రైడ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ కంపెనీ ప్రిపెయిడ్ ఇన్స్ట్రుమెంట్(వాలెట్) సేవలు కూడా ఆఫర్ చేస్తోంది. అయితే ఈ యాప్‌కు ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతి లేదు అని తెలిపింది. అందుకే వినియోగదారులు ఎవరైనా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే తొలగించాలని పేర్కొంది. ఈ యాప్‌కు సంబంధించి ఎలాంటి సేవలు వాడొద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. ఒకవేళ ఇంకా యాప్ వినియోగిస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 నిబంధనల ప్రకారం ఆర్బీఐ నుంచి అవసరమైన అనుమతులు పొందకుండా ఎస్‌రైడ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తన కార్ పూలింగ్ యాప్ 'ఎస్‌రైడ్' ద్వారా సెమీ క్లోజ్డ్(నాన్ క్లోజ్డ్) ప్రీ పెయిడ్ ఇనుస్ట్రుమెంట్(వాలెట్)ను నిర్వహిస్తోందని ఆర్బీఐ పేర్కొంది. అందుకే, ఈ యాప్ నుంచి డబ్బులు చెల్లించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వినియోగదారులకు ఆర్బీఐ సూచించింది. (చదవండి: అంతర్జాతీయంగా అదరగొడుతున్న హైదరాబాద్ ఈవీ స్టార్టప్ కుర్రాళ్ళు..!) -
మేడం..! ఈ పర్స్ మీదేనా.. పో..పోవయ్యా నాది కాదు!!.. ట్విస్ట్ అదే..
చాలాసార్లు పొరపాటునో లేక హడావిడిగా వెళ్లాల్సిరావడం వల్లనో మనం వ్యాలెట్ లేదా సెల్‌పోన్ వంటి విలువైన వస్తువులను మరిచిపోవడం జరుగుతోంది. ఇక ఒకవేళ ఏదైన వస్తువు పోతే ఇక అంతే! దొరికితే మాత్రం అదృష్టంగానే భావిస్తాం. చాలా మటుకు ఎవరో మంచివాళ్లయితే గానీ అంతలా పనిగట్టుకుని తీసుకురారు. అచ్చం అలాంటి ఒక మంచి పని అమెరికాలోని ఒక వ్యక్తి చేసి అందరిచే ప్రశంలందుకున్నాడు. (చదవండి: అమెరికాలో కాల్పులు... ఐదుగురికి గాయాలు) అసలు విషయంలోకెళ్లితే..యూఎస్‌లోని ఒక వ్యక్తి మేడమ్ మీ పర్స్ పోయింది అంటూ కిమ్ అనే మహిళ ఇంటి తలుపుకొడతాడు. ఆమె ఎవరీ కొత్త వ్యక్తి అన్నట్లుగా చూస్తూ.. అది తన పర్సు కాదని చెబుతూ తలుపు వేసేయాలనుకుంటుంది. కానీ అతను పర్సు ఓపెన్ చేసి మేడం ఇది మీదే అంటూ అందులోని బ్యాంక్ కార్డులు అవి చూపిస్తాడు. ఇక అంతే కిమ్ ఒక్కసారిగా ఓ మై గాడ్ అని అరుస్తూ అది తన కూతురి వ్యాలెట్ అని ఒప్పుకోవడమే కాక ఆశ్చర్యంగా ఫీలవుతుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ప్రపంచంలో ఇంకా ఇంత మంచి మనుషులు ఉన్నారంటూ రకరకాలుగా కిమ్‌ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: భారత్, పాకిస్తాన్ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు) View this post on Instagram A post shared by Ring (@ring) -
అప్పట్లో షారుక్ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి
‘చెన్నైఎక్స్ప్రెస్’లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌తో కలిసి ప్రియమణితో చిందేసిన ఐటమ్‌సాంగ్ గుర్తుందా. అదేనండి అప్పట్లో వన్ టూ త్రీ ఫోర్.. గెట్ ఆన్ ది డ్యాన్స్ ఫ్లోర్..అంటూ స్టెప్పులేసిన ఈ పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది ఎందుకు అంటారా? ఇటీవల విడుదలై విశేష ప్రజాదరణ పొందుతున్న ఫ్యామిలీ మ్యాన్-2తో ఆకట్టుకున్న నటి ప్రియమణి ఓ ఇంటర్య్వూలో ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ షూటింగ్ సమయంలోని కబుర్లను గుర్తుచేసుకుంది. అది నా పర్సులో భద్రంగా దాచుకున్నా ఈ సందర్భంగా ఆమె.. ‘‘నాకు అది మరచిపోలేని అనుభవం. షూటింగ్ సమయంలో షారుఖ్ ఐప్యాడ్‌లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఆడుతుంటే రూ.300 ఇచ్చారు. అవి ఇప్పటికీ నా పర్సులో భద్రంగా దాచుకున్నా. షారుఖ్‌ని బాలీవుడ్ బాద్షా అని అనడానికి ప్రత్యేకించి ఒక్క కారణమంటూ లేదు. మనదేశంలో ఉన్న గొప్పనటుల్లో ఆయన ఒకరు. సక్సెస్‌ని ఎప్పుడూ తలకెక్కించుకోరు. షూటింగ్‌లోనూ చాలా సింపుల్‌గా ఉంటారు. షారుక్ వ్యక్తిత్వమే మనల్ని మరింతగా ఆయన్ని ఇష్టపడేలా చేస్తుంది. ఎప్పుడు మరుసటి రోజు సమయం వృథా కాకుండా జాగ్రత్త పడేవారు. అలా షూటింగ్ సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకునే వారు’’ అంటూ షారుఖ్‌తో తన అనుబంధాన్ని ఈ రకంగా చెప్పుకొచ్చింది. చదవండి: ఆ కామెంట్స్ చూసి తట్టుకోలేకపోయా: జరీన్ ఖాన్ -
53 ఏళ్లకు దొరికిన పర్స్, ఏదీ మిస్ అవ్వలేదు!
కాలిఫోర్నియా: దశాబ్దాల కిందట పోయిన పర్స్ ఇప్పుడు లభించింది. దీంతో పోగొట్టుకున్న ఆ వ్యక్తి ఉబ్బితబ్బిబయ్యాడు. పర్స్‌లో ఉన్న వస్తువులన్నీ అలాగే ఉండడంతో పరమానందం పొందాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగింది. 1967లో పోగొట్టుకున్న పర్స్ 2021లో లభించడం ఆశ్చర్యమే. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు చెందిన 91 ఏళ్ల పాల్ గ్రిశామ్ నౌక వాతావరణ శాస్త్రవేత్త. అమెరికా నౌక వాతావరణ శాస్త్రవేత్త పౌల్ గ్రిషమ్ రాస్ ద్వీపంలో 1967 ప్రాంతంలో ఏడాది పాటు వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేశారు. 13 నెలలు అక్కడ పనిచేసిన అనంతరం తిరిగి కాలిఫోర్నియాకు చేరుకోగానే ఆయన తన వాలెట్ ఎక్కడో మిస్ అయిందని గ్రహించాడు. అందులో నేవి ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన ఐడీలు ఉన్నాయట. అలా మిస్ అయిన పర్స్ 52 ఏళ్ల తర్వాత తాజాగా దొరికింది. భూమి మీద దక్షిణ దిశలో చిట్టచివరి పట్టణంగా పేర్కొనే అంటార్కిటికా ఖండంలోని మెక్ముర్డో స్టేషన్లో ఇటీవల ఓ భవనాన్ని కూల్చివేశారు. కూల్చివేతల సమయంలో పనులు చేస్తున్న వారికి రెండు పర్సులు కనిపించాయి. వాటిని పరిశీలించగా అందులో ఒకటి గ్రిశామ్‌కు చెందిన పర్స్ కూడా ఉంది. అయితే ఆయన పోగొట్టుకున్న సమయంలో పర్స్‌లో ఉన్న నావీ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం అలాగే ఉన్నాయి. ఇక కూల్చివేతల్లో దొరికిన మరో పర్స్ పౌల్ హావర్డ్ అనే వ్యక్తిదని గుర్తించారు. 2016లో పౌల్ హావర్డ్ మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు తెలిపారు. -
డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ 2025నాటికి మూడింతలు
న్యూఢిల్లీ: భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ 2025నాటికి మూడింతల వృద్ధిని సాధించి రూ.7,092 ట్రిలియన్లకు చేరుకోవచ్చని బెంగళూరు ఆధారిత రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ కన్సల్టింగ్ అంచనా వేసింది. ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో డిజిటల్ పేమెంట్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత, వ్యాపారుల డిజిటలైజేషన్‌ల వృద్ధి దేశంలో డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ విస్తరణకు తోడ్పడతాయని రీసెర్చ్ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2019–20లో భారత డిజిటల్ పేమెంట్ మార్కెట్ విలువ దాదాపు రూ.2,162 కోట్లుగా ఉన్నట్లు రీసెర్చ్ తెలిపింది. ఈ వృద్ధి అనేక డిమాండ్, సరఫరా అంశాలతో ముడిపడి ఉన్నట్లు కన్సల్టెన్సీ సర్వేలో తెలిపింది. డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో ప్రస్తుతం 1శాతంగా ఉన్న మొబైల్ పేమెంట్స్ 2025నాటికి 3.5శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. ఇదే సమయంలో 162 మిలియన్లు ఉన్న మొబైల్ పేమెంట్ యూజర్లు 800 మిలియన్లకు చేరుకొనే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. డిజిటల్ పేమెంట్స్‌లోకీలకపాత్ర పోషిస్తున్న వాలెట్ ఆధారిత పేమెంట్స్... ఫ్రీక్వెన్సీ, యూజర్ బేస్ రెండింటిలో నిరంతర వృద్ధి చెందుతూ రానున్న డిజిటల్ మార్కెట్ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. 2025 నాటికి, వాలెట్ల ద్వారా చెల్లింపులు అధికంగా ఉండవచ్చని, చివరికి తక్కువ–ఆదాయ చెల్లింపుగా భావించే మల్టీపుల్ స్మాల్–టికెట్ లావాదేవీలు కూడా వాలెట్ల ద్వారానే జరగవచ్చని రీసెర్చ్ సంస్థ భావిస్తోంది. కరోనా వ్యాప్తి డిజిటల్ పేమెంట్స్‌కు ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిందని తెలిపింది. కరోనా భద్రత ఆందోళనలతో ప్రజలు మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వడంతో గ్రాసరీ స్టోర్‌లో డిజిటల్ పేమేంట్స్ 75% పెరిగినట్లు నివేదిక తెలిపింది. -
వేలి ఉంగరంతోనూ చెల్లింపులు
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు జేబులో పర్సు, పర్సులో డబ్బులు లేకుండా ఎలాంటి చెల్లింపులు జరిగేయి కాదు. అయితే ఎలాంటి చెల్లింపులైన జరిపేందుకు 2011లో ‘మాస్టర్ కార్డు’ అందుబాటులోకి రావడంతో బ్యాంకింగ్ లావా దేవీలకు సంబంధించి దాన్ని ఓ పెద్ద విప్లవంగా పేర్కొన్నారు. అప్పట్లో ఆ కార్డు కేవలం వీఐపీలకే అందుబాటులో ఉండేది. 2014లో బార్ల్కేల కార్డు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదికి స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి ‘ఆపిల్ పే’ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు పేటీఎం, రూపే, గూగుల్ పే ఎన్నో డబ్బు చెల్లింపు యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. సరికొత్తగా చొక్కా చివరన గుండీలాగా అమర్చుకునే చిప్, వేలికి ధరించే ఉంగరం, కంకణం వంటి పరికరాల చెల్లింపులు జరిపే సౌకర్యం అందుబాటులోకి వచ్చాయి. చెల్లింపు మిషన్ వద్దకు ఈ చిప్, ఉంగరం లేదా కంకణంను తీసుకెళ్లి కావాల్సినంత చెల్లింపులు జరపవచ్చు. క్రెడిట్ కార్డుల్లాగా ఇవి పనిచేయవు. ఖాతాలో డబ్బులు ఉన్నప్పుడే పని చేస్తాయి. పైగా ఇవన్నీ యాప్‌లకు అనుసంధానించి పని చేస్తాయి. చేతికి ధరించిన కంకణం ద్వారా చెల్లింపులు జరపాలంటే బార్ల్కేల తీసుకొచ్చిన ‘పింగిట్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. అలాగే పనిచేసే ‘కే’ ఉంగరం నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తోంది. మూడింటిలో ఇదే ఖరీదైనది. దాదాపు 9వేల రూపాయలకు ఈ ఉంగరం, దాని సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మిగతావి రెండున్నర వేల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ వస్తువులు పోయినప్పుడు లేదా చోరీ అయినప్పుడు చెల్లింపులను యాప్ ద్వారా నిలిపివేయవచ్చు. 2024 సంవత్సరానికి ఇలాంటి చెల్లింపు పద్ధతులు 18 లక్షల వరకు రావచ్చన్నది ఓ అంచనా. అప్పుడు జేబులో పెన్ను, మెడలో గొలుసు, చెవి పోగులు, ముక్కు పుడక ఏ ఆభరణం రూపంలోనైనా చెల్లింపులు జరపొచ్చన్నమాట. -
వారెవ్వా ‘వాలెట్’!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ఎం–వాలెట్. ఇప్పుడు మరోసారి వాహనదారులంతా దీనిపైనే దృష్టిసారించారు. వివిధ రకాల ధృవపత్రాలను మొబైల్ ఫోన్లోనే భద్రపరుచుకొనే అద్భుతమైన సదుపాయం, డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లవలసిన అవసరం లేకపోవడం, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసే వీలుండడంతో వాహనదారులు ఈ యాప్‌ను ఇష్టపడుతున్నారు. ఈ యాప్ ఉంటే అన్నిరకాల డాక్యుమెంట్లు జేబులో ఉన్నట్లే లెక్క. డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వంటి వివిధ రకాల సర్టిఫికెట్లను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకొనేవిధంగా రవాణాశాఖ ఎం–వాలెట్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్ యాప్ ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది వాహనదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. డాక్యుమెంట్లను ఎం–వాలెట్లో భద్రపరుచుకున్నారు. ఈ వాలెట్‌కు రవాణాశాఖ చట్టబద్ధత కల్పించడంతో అనూహ్యంగా డిమాండ్ నెలకొంది. ఇటీవల కేంద్రంకూడా ఈ వాలెట్‌ను గుర్తించింది. దీంతో దేశంలో ఎక్కడైనా ఎం–వాలెట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ యాప్ తాజాగా మరోసారి వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్తగా సవరించిన రోడ్డు భద్రతా చట్టం దృష్ట్యా మరో సారి ఎం–వాలెట్‌కు డిమాండ్ ఏర్పడింది. ఒక్క వాలెట్ చాలు... రోడ్డు భద్రత నిబంధనలను సవరిస్తూ కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త చట్టంతో వాహనదారులంతా అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తూ ఈ చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. వివిధ రకాల ఉల్లంఘనలపై రూ.1000 నుంచి రూ.10,000 వరకు జరిమానాలు విధించే అవకాశం ఉన్న దృష్ట్యా వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కేంద్రం విధించిన జరిమానాలను తగ్గించి అమలు చేసే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఏ క్షణంలోనైనా కొత్త చట్టంకొరడా ఝళిపించే అవకాశం ఉంది. పైగా ప్రభుత్వం జరిమానాలను కొంతమేరకు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న పెనాల్టీల కంటే పెద్ద మొత్తంలోనే భారం పెరగనుంది. దీంతో వాహనదారులు ఇప్పటి నుంచే కొత్త చట్టానికి అనుగుణంగా నిబంధనలను పాటిస్తున్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ వంటి వివిధ రకాల డాక్యుమెంట్లపైన కూడా శ్రద్ధ చూపుతున్నారు. దీంతో మూడేళ్ల క్రితమే రవాణాశాఖ అమల్లోకి తెచ్చిన ఎం–వాలెట్ వాహనదారులకు ఎంతో ఉపయోగంగా మారింది. అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ పత్రాల రూపంలో ఈ వాలెట్ ద్వారా భద్రపరుచుకుంటున్నారు. గత వారం రోజుల్లో సుమారు 15 వేల మందికి పైగా వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో ఎం–వాలెట్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు అంచనా. 33 లక్షలకు పైగా వాహనదారులు మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎం–వాలెట్ వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 33.31 లక్షలకు పెరిగింది. ఈ వాహనదారులు 68.81 లక్షల డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఎక్కువ శాతం డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ పత్రాలు, ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఆ తరువాత పర్మిట్లు, ఫిట్నెస్ పత్రాలను ఎక్కువ మంది తమ మొబైల్ ఫోన్లలో ఎం–వాలెట్ యాప్ ద్వారా భద్రపరుచుకున్నారు. త్వరలో కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లను కూడా ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. మరోవైపు తమ వాహనాలపైన నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలను సైతం ఈ యాప్ ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో చెల్లించే సదుపాయం ఉంది. తెలంగాణతో పాటు దేశంలో ఎక్కడైనా సరే ఎం–వాలెట్లో ఉన్న ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లకు చట్టబద్ధతను కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో ఈ వాలెట్ వినియోగం బాగా పెరిగింది. ఆన్లైన్ సేవల వినియోగంలో రవాణాశాఖ దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రవాణాశాఖలో ఇటీవల కాలంలో స్మార్ట్‌కార్డులకు పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది, స్టేషనరీ మెటీరియల్ లేకపోవడంతో లక్షలాది స్మార్ట్ కార్డుల ముద్రణ నిలిచిపోయింది. దీంతో ఎం–వాలెట్ వినియోగం మరింత పెరిగిపోయింది. -
పర్సులో డబ్బులుంటే ఇచ్చేస్తారట
పర్సు పోయిందనుకోండి.. అందులో డబ్బు ఉంటే ఎవరైనా ఏం చేస్తారు.. ఆ డబ్బులు తీసుకుని పర్స్ పడేస్తారు. ఒకవేళ డబ్బులేమీ లేకపోతే.. ఆ ఏముంది.. ‘బ్రదర్ మీ పర్సు కింద పడింది.. తీసుకోండి అని తిరిగిచ్చేస్తారు’అంతే కదా.. మీరనుకునేది. పర్సులో డబ్బు ఎంత ఎక్కువ ఉంటే నిజాయితీ అంత తక్కువ ఉంటుందని మనం అనుకుంటాం. కానీ అది నిజం కాదట. పోగొట్టుకున్న పర్సులో ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత నిజాయితీ ఉంటుందట. దాదాపు 40 దేశాల్లో 355 నగరాల్లో జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. డబ్బులకు, మానవ సైకాలజీకి మధ్య సంబంధం గురించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరితో పాటు యూనివర్సిటీ ఆఫ్ జురిచ్, యూనివర్సిటీ ఆఫ్ ఉతాకు చెందిన పరిశోధకులు కూడా పాల్గొ న్నారు. నిజాయితీగా ఉన్న దేశాల్లో స్విట్జర్లాండ్, నార్వే టాప్‌లో ఉండగా, పెరూ, మొరాకో, చైనా చివరి స్థానంలో ఉన్నాయి. ఈ అన్ని దేశాల్లో మాత్రం ఒకే విషయం కామన్‌గా ఉందట. అదేంటంటే డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ పర్స్‌ను తిరిగి ఇచ్చేస్తారని తేలిందట. సాధారణంగా ఎవరైనా పర్స్ పోగొట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం మంది తిరిగి ఇస్తారట. అయితే అందులో డబ్బులు ఉంటే మాత్రం 51 శాతం మంది పర్స్ తిరిగిచ్చేస్తున్నారట. ఈ పరిశోధన నిర్వహించేందుకు చాలా డబ్బు వెచ్చించారట. బ్యాంకులు, థియేటర్లు, మ్యూజియంలు, పోస్ట్ ఆఫీస్‌లు, హోటల్స్, పోలీస్ స్టేషన్స్, కోర్టులు తదితర 17 వేలకు పైగా ప్రాంతాల్లో దాదాపు డబ్బులను పర్సులో పెట్టి జారవిడిచారట. అందుకోసం దాదాపు రూ.4 కోట్లకు పైగా డబ్బు వెచ్చించారట. అయితే చాలా మంది అందులో డబ్బు ఎక్కువగా ఉందని తిరిగిచ్చారట. అదండీ విషయం.. డబ్బు అందరినీ చెడ్డవారిని చేయదండోయ్! -
‘అతని వల్ల మర్చిపోలేని జ్ఞాపకంగా మారింది’
ముంబై : సాధరణంగా మొబైల్, వాలెట్ వంటివి పోతే దొరకడం చాలా కష్టం. మన అదృష్టం బాగుంటే తప్ప తిరిగి మన చేతికి రావు. క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డులు అన్ని ఆ వాలెట్‌లోనే ఉంటాయి. దొరికితే బాగుండని.. దొరకాలని కోరుకుంటాం. మనం కోరుకున్నట్లు జరిగితే.. ఇదిగో ఇలా ప్రచారం చేస్తాం. ట్విటర్ యూజర్ దర్థ్ సియర్ర తాను కలిసిన ఓ నిజాయితీపరుడైన క్యాబ్ డ్రైవర్ గురించి ట్విటర్ ద్వారా ఎంతో మందికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ స్టోరీ తెగ వైరలవుతోంది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి దర్థ్ సియర్ర ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఈ నెల 10న నా పుట్టిన రోజు సందర్భంగా నేను, నా భార్య పబ్‌కు వెళ్లి ఎంజాయ్ చెద్దామని భావించాము. అందుకోసం ఓలా క్యాబ్ బుక్ చేశాం. మిని హుండాయ్ ఎక్సెంట్ మా కోసం వచ్చింది. దాని డ్రైవర్ అసిఫ్ ఇక్బాల్ అబ్దుల్ గఫర్ పథాన్. మా ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి వర్షం ప్రారంభమైంది. దాంతో పథాన్ తన భార్యకు ఫోన్ చేసి.. పిల్లలన్ని బయకు పంపకుండా ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత మేం కబుర్లు చెప్పుకుంటూ మా ప్రయాణాన్ని కొనసాగించాం. వర్షం కారణంగా ట్రాఫిక్ దారుణంగా ఉంది. ఎలాగో అలా మేం వెళ్లాల్సిన పబ్‌కు చేరుకున్నాం. తర్వాత స్నేహితులను కలిసి పిచ్చాపాటి ప్రారంభించాం. ఓ గంట గడిచిన తర్వాత నా వాలెట్ మిస్సయిందని గుర్తించాను’ అన్నారు దర్థ్ సియర్ర. ‘ఓ నిమిషం పాటు నాకు కాళ్లు చేతులు ఆడలేదు. దాంతో క్యాబ్‌లో మర్చిపోయానేమో అని భావించి పథాన్కు కాల్ చేశాను. అతను చెప్పిన సమాధానం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను నా వాలెట్‌ను క్యాబ్‌లోనే మర్చిపోయానని.. అది గమనించిన పథాన్ దాన్ని తీసి భద్రం చేసినట్లు చెప్పాడు. అంతేకాక ఇంటికి వెళ్లేటప్పుడు.. నన్ను కలిసి వాలెట్ తిరిగి ఇవ్వాలని అనుకున్నట్లు చెప్పాడు. చెప్పడమే కాక సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు నా దగ్గరకు వచ్చి వాలెట్ ఇచ్చాడు. అంతేకాక పుట్టిన రోజు శుభకాంక్షలు కూడా తెలియజేశాడు. నా పుట్టిన రోజు నాడే తన పుట్టిన రోజు కూడా కావడం నిజంగా అద్భుతం. అలా విషాదంగా ముగియాల్సిన నా పుట్టిన రోజు కాస్త పథాన్ నిజాయితీ వల్ల నా జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోయింది’ అన్నారు దర్థ్ సియర్ర. ‘ఈ సోషల్ మీడియా వేదికగా మనం కోపాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూంటా. కానీ మంచి విషయాలను కూడా ఈ వేదిక మీదగా షేర్ చేసుకుందాం. దీని వల్ల కొందరైనా ప్రేరణ పొందుతారు’ అంటూ దర్థ్ సియర్ర ట్వీట్ చేసిన ఈ స్టోరీకి జనాలు ఫిదా అయి పోయారు. క్యాబ్ డ్రైవర్ నిజాయితీని తెగ మెచ్చుకుంటున్నారు. -
వైరల్ : చాలా అరుదైన సంఘటన
వాషింగ్టన్ పోస్ట్ : పోగోట్టుకున్న వస్తువులను తిరిగి పొందడం చాలా చాలా కష్టం. పోయిన వస్తువు కాస్తా ఏ పర్సు లాంటిదో అయితే మరిక దాని గురించి మర్చిపోవాల్సిందే. ఒకవేళ అదృష్టం బాగుండి దొరికినా.. అందులో డబ్బులుండటం మాత్ర కల్ల. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి మాత్రం వీటన్నింటికి కాస్తా భిన్నమైన అనుభవం ఎదురయ్యింది. పోయిన పర్సు దొరకడమేకాక.. దానిలో ఉన్న సొమ్ముకు మరికాస్తా జోడించి మరి చాలా భద్రంగా పార్శిల్ చేశాడు వివరాలు తెలియని ఓ వ్యక్తి. నమ్మడానికి కాస్తా కష్టంగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం. వివరాలు.. హంటర్ షమత్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి లాస్ వెగాస్‌లో జరుగుతున్న తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. అయితే తన పర్స్‌ను విమానంలోనే మర్చిపోయాడు. దానిలో 40 డాలర్ల సొమ్ముతో పాటు, 400 డాలర్ల విలువ చేసే చెక్, అన్నింటికంటే ముఖ్యమైన అతని ఐడీ కార్డ్ ఉన్నాయి. లాస్ వెగాస్‌లో దిగిన తరువాత తన పర్స్ మర్చిపోయినట్లు గుర్తించిన హంటర్ ఈ విషయం గురించి ఎయిర్‌లైన్స్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చాడు. కానీ ఎటువంటి లాభం లేకపోయింది. పెళ్లికెళ్లి బాగా ఎంజాయ్ చేయాలని భావించిన హంటర్.. తన పర్స్ పోగోట్టుకుని విషాదంలో మునిగి పోయాడు. కనీసం ఐడీ కార్డ్ దొరికిన బాగుండేదనుకున్నాడు హంటర్. ఎందుకంటే అది లేకపోతే అతని తిరిగి తన ఇంటికి వెళ్లలేడు. దాంతో ఈ విషయం గురించి తెగ ఆందోళన పడ్డాడు. వివాహనంతరం కుటుంబంతో కలిసి వెగాస్ నుంచి తన ఇళ్లు దక్షిణ డకోటాకు ప్రయాణమయ్యాడు హంటర్. ఎయిర్‌పోర్టులో దాదాపు ఓ గంటసేపు విచారించిన తరువాత ఎట్టకేలకు హంటర్ని లోనికి అనుమతించారు. గండం గడిచిందంటూ ఇంటికి చేరుకున్న హంటర్కోసం అప్పటికే ఓ సర్ఫ్రైజ్ ఎదరు చూస్తోంది. అదేంటంటే తాను విమానంలో పొగోట్టుకున్న పర్సు. హంటర్‌తో పాటే విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తి ఈ పర్సును గమనించి తిరిగి దాన్ని హంటర్‌కు చేర్చాడు. పర్సుతో పాటు ఓ ఉత్తరాన్ని కూడా పెట్టాడు సదరు వ్యక్తి. ‘హంటర్ ఈ పాటికే నువ్వు నీ పర్సు కోసం తెగ వెతికి ఉంటావని నాకు తెలుసు. ఈ పర్స్‌ని నువ్వు ఒమాహ నుంచి డెన్వర్‌కు ప్రయాణించిన విమానంలో.. 12 వరుసలో.. సీట్ ఎఫ్(F) వద్ద జారవిడుచుకున్నావ్. దీని కోసం నువ్వు వెతికి ఉంటావనే భావిస్తున్నాను. ఇక మీదటైన దీన్ని జాగ్రత్తగా ఉంచుకో ఆల్ ది బెస్ట్’ అంటూ హితవు పలికాడు. అంతేకాక పర్స్‌లో ఉన్న 40 డాలర్లకు మరో 60 డాలర్లను కలిపి మొత్తం 100 డాలర్లను హంటర్కిచ్చాడు. పర్స్ దొరికినందుకు గాను పార్టీ చేసుకునేదకు నేను మరి కొంత సొమ్మును ఇందులో ఉంచుతున్నానంటూ తెలిపాడు సదరు వ్యక్తి. పార్శల్‌ని చూసిన హంటర్ తొలుత నమ్మలేదు. కానీ తరువాతం సంతోషంతో ఉప్పొంగిపోయాడు. తనకు పార్శల్ పంపిన వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు హంటర్ ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకపోయింది. దాంతో తమకు సాయం చేసిన మంచి వ్యక్తి గురించి నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు హంటర్ తల్లి. దాంతో ఈ విషయం కాస్తా వైరల్ అవ్వడమే కాక.. సదరు ఆగంతకుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
అదృశ్యమవుతున్న ‘డిజిటల్ వాలెట్స్’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ‘డిజిటల్ వాలెట్ల’ వ్యాప్తికి దాదాపు తెరపడినట్లేనా? పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ‘డిజిటల్ ఇండియా’ స్ఫూర్తితో డిజిటల్ వాలెట్లు పురోగమించడం మానేసి తిరోగమించడం ఆశ్చర్యకరం. 2006లో ఒకే ఒక్క డిజిటల్ వాలెట్ ఉండగా, 2017 నాటికి వాటి సంఖ్య 60కి చేరుకున్నాయి. వివిధ కారణాల వల్ల ఇప్పుడు వాటి సంఖ్య 49కి పడిపోయాయని భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలియజేసింది. డిజిటల్ మార్కెట్ వ్యవస్థ స్థిరీకరణకు చేరుకోకపోవడం, పోటీ తత్వం పెరగడం, లాభాలు లేక పోవడంతోపాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలు సానుకూలంగా లేకపోవడమే ఈ మార్కెట్ పతనానికి కారణమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా చిన్న, మధ్య తరహా కంపెనీలు మూసుకుపోగా పెద్ద కంపెనీలు మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నాయని అ వర్గాలు అంటున్నాయి. తొలి డిజిటల్ వాలెట్ ‘వాలెట్ 365. కామ్’ ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ గ్రూపు ‘ఎస్ బ్యాంక్’తో కలిసి ఈ వాలెట్‌ను 2006లో తీసుకొచ్చింది. ఆ తర్వాత పలు బ్యాంకులు, పలు బ్యాంకేతర ఆర్థిక సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. బిగ్‌బాస్కెట్, గోవర్స్ అనే రిటేల్ సంస్థలు, అమెజాన్ లాంటి ఆన్లైన్ సంస్థలు, ప్రముఖ మెస్సేజింగ్ సంస్థ ‘వాట్సాప్’లు ఈ రంగంలోకి ప్రవేశించాయి. పేటీఎం, మోబిక్విక్ లాంటి డిజిటల్ వాలెట్ సంస్థలు మార్కెట్లో మంచి వాటాలను కూడా సంపాదించుకున్నాయి. స్మార్ట్ఫోన్ల విప్లవం ఈ మార్కెట్‌ను ముందుగా ప్రోత్సహించాయి. ఆ తర్వాత 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఈ మార్కెట్‌కు మంచి ఊపు వచ్చింది. 2015–2016 సంవత్సరంలోనే ఈ మార్కెట్ 154 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2021–2022 సంవత్సరానికి ఈ మార్కెట్ దేశంలో 30 వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఈ వాలెట్ పరిశ్రమ ఆశించింది. పతనం ప్రారంభం ‘చెల్లింపులేవో పెద్ద మొత్తాల్లో జరపాల్సి రావడం, వ్యాపారమేమో చాలా తక్కువగా ఉండడం వల్ల చిన్న కంపెనీలు నిలదొక్కుకోలేక మూతపడ్డాయి. పెద్ద కంపెనీలు ఇప్పటికీ క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి’ అని మోబిక్విక్ సహ వ్యవస్థాపకులు ఉపాసన తెలిపారు. ‘విస్తత స్థాయి కస్టమర్ నెట్వర్క్ లేకపోయినట్లయితే డబ్బులను తగలేసుకోవడం తప్ప, స్థిరత్వం ఎలా సాధించగలం’ అని మొబైల్ వాలెట్ ‘టీఎండబ్లూ’ వ్యవస్థాపకుడు వినయ్ కలాంత్రి చెప్పారు. పెద్ద కంపెనీలకు లాభాలు లేకపోవడంతో చిన్న కంపెనీల నెట్‌వర్క్‌లను కొనుక్కోవాల్సి వస్తోందని, అందుకనే ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘ట్రూపే’ను తాము కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కారణంగానే గత రెండేళ్లలో పలు పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలను కొనుగోలు చేశాయి. మొబైల్ ‘ఫర్మ్ ఫ్రీచార్జ్’ని ఆక్సిస్ బ్యాంక్, ఆన్లైన్ పేమెంట్ సంస్థ ‘ఎమ్వాంటేజ్’ను అమెజాన్, ‘ఫోన్‌పే’ను ఫ్లిప్‌కార్ట్ కంపెనీ, ఆఫ్‌లైన్ స్టోర్ల మొబైల్ వాలెట్ ‘మొమో’ను షాప్‌క్లూస్ కంపెనీలు కొనేశాయి. ఆర్బీఐ కొత్త రూల్ వల్ల కూడా డిజిటల్ వాలెట్ కంపెనీలు ఎల్లప్పుడు రెండు కోట్ల రూపాయల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలనే నిబంధనను ఐదు కోట్ల రూపాయలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ పెంచడం, మూడేళ్ల మొత్తానికి నెట్‌వర్త్ 15 కోట్ల రూపాయలు ఉండాలనే నిబంధన తేవడం వల్ల చాలా కంపెనీలు వెనకడుగు వేశాయి. ఇప్పటికే లైసెన్స్‌లు తీసుకున్న కంపెనీలు కూడా తమ డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభించలేదు. అక్రమ చెల్లింపులు జరుగకుండా ‘నో యువర్ కస్టమర్’ కింద స్పష్టమైన వెరిఫికేషన్ ఉండాలనడం, అందుకోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం అవడం కూడా డిజిటల్ వాలెట్ కంపెనీలను నిరుత్సాహ పరిచాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వల్ల కూడా సరకుల మార్పిడీ లేదా సర్వీసుల కోసం కార్పొరేట్ కంపెనీలు లేదా వ్యక్తులు ఆధార్ కార్డుల సమాచారాన్ని కోరరాదని సుప్రీం కోర్టు గత సెప్టెంబర్ నెలలో ఉత్తర్వులు జారీ చేయడం కూడా ఈ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ‘నో యువర్ కస్టమర్’ ప్రక్రియ క్లిష్టమైనప్పటికీ ఆధార్ కార్డుల ద్వారా అందులో ఉండే బయోమెట్రిక్ ముద్రలను తీసుకొని వినియోగదారులను సులభంగానే గుర్తుపట్టే వాళ్లమని, ఆధార్ కార్డు డేటాను ఉపయోగించ కూడదని సుప్రీం కోర్టు ఉత్తర్వులతో పెద్ద కంపెనీలకు కూడా ‘నో యువర్ కస్టమర్’ ప్రక్రియను అమలు చేయడం కష్టమైపోయిందని మరో వాలెట్ కంపెనీ ‘పేవరల్డ్’ కంపెనీ సీఈవో ప్రవీణ్ దాదాభాయ్ చెప్పారు. -
అరచేతిలోనే అన్ని సేవలు
సత్తెనపల్లి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీని) లాభాల బాట పట్టించేందుకు, ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అనేక చర్యలు చేపడుతోంది. బస్సు ఎక్కడుందో ప్రత్యేక ట్రాకింగ్ ద్వారా తెలుసుకునేందుకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి బస్సులు మరమ్మతులు చేసే నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ ఇప్పుడు ఇ–వాలెట్ (ఎలక్ట్రానిక్ పర్స్)ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు కంప్యూటర్ ద్వారా సెల్ఫోన్లోనూ సేవలు పొందవచ్చు. ఈ యాప్ ద్వారా త్వరితగతిన టికెట్ బుకింగ్, ప్రచార రాయితీలు, ఒక ఇ–వాలెట్ నుంచి వేరొక ఈ – వాలెట్‌కు అదనపు ఖర్చు లేకుండా వేగంగా నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ఇ–వాలెట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. అడ్వాన్సుడు రిజర్వేషన్, టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయడం, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ– వ్యాలెట్ ఇలా.. గూగుల్‌ప్లే స్టోర్ నుంచి వ్యాలెట్ యాప్నును డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ అయి మీ ఖాతాను ప్రారంభించాలి. జీరో బ్యాలెన్స్‌తో కూడా ఈ–వ్యాలెట్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. వ్యాలెట్ ఖాతా కలిగి టికెట్ కొనుగోలు చేస్తే టికెట్ ధరపై 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ప్రయాణికులు ఆర్టీసీకి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను తెలియజేయాలనుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్ పేజీల ద్వారా నేరుగా తెలియజేయవచ్చు. మొబైల్ యాప్ ఆర్టీసీ మొబైల్ యాప్ ఎంతో ముఖ్యమైంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆర్టీసీ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా సీటు రిజర్వేషన్, రద్దు, ప్రయాణ తేదీ మార్చుకునే అవకాశాలు ఉంటాయి. మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. లైవ్ ట్రాక్ ఆప్షన్లో ఎక్కాల్సిన బస్ సర్వీస్ నెంబర్ ప్రెస్ చేయడం ద్వారా ఆ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీ మొబైల్ యాప్ ఇలా.. n గూగుల్ ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. n ఈ యాప్ ద్వారా సీటు రిజర్వేషన్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, ప్రయాణ తేదీ మార్చుకోవడం తదితర సేవలు పొందవచ్చు. n బస్సుల నిజ సమయం తెలుసుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ లైవ్ ట్రాక్ (సిటి బస్సులు మినహా), ఏపీఎస్ ఆర్టీసీ సిటీ బస్సుల ట్రాక్‌లను ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ ఇన్స్టాల్ చేసుకోవాలి. n అత్యవసర సమయాల్లో మహిళా ప్రయాణికుల రక్షణ కోసం కూడా ఈ యాప్‌ను వినియోగించవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీ మొబైల్ యాప్ ఇలా.. n గూగుల్ ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. n ఈ యాప్ ద్వారా సీటు రిజర్వేషన్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, ప్రయాణ తేదీ మార్చుకోవడం తదితర సేవలు పొందవచ్చు. n బస్సుల నిజ సమయం తెలుసుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ లైవ్ ట్రాక్ (సిటి బస్సులు మినహా), ఏపీఎస్ ఆర్టీసీ సిటీ బస్సుల ట్రాక్‌లను ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ ఇన్స్టాల్ చేసుకోవాలి. n అత్యవసర సమయాల్లో మహిళా ప్రయాణికుల రక్షణ కోసం కూడా ఈ యాప్‌ను వినియోగించవచ్చు. -
పర్స్
ఉప్పల్ – కూకట్పల్లి సిటీ బస్ జనంతో కిటకిటలాడుతోంది. తన బ్యాక్ పాకెట్లో పెట్టుకున్న పర్సు తీయడం కోసం వెనుక జేబులో చేయి పెట్టిన శివ మొఖంలో రంగులు మారిపోయాయి. అసలు తాను ఇంటి నుంచి బయలుదేరే ముందు పర్సు తీసుకొచ్చానా లేదా? అని ఆలోచించాడు. ‘‘నో డౌట్.. బస్‌లో కండక్టర్ అడిగితే పాస్ చూపించాను. సో.. పర్సు బస్సులోనే మిస్ అయుండాలి? లేదా ఎవరైనా కొట్టేసైనా ఉండాలి?’’ నిర్ధారణకు వచ్చేశాడు శివ. వెంటనే ‘‘స్టాప్.. స్టాప్..’’ అంటూ అరిచాడు. అప్పటికే బస్సు ఖైరతాబాద్ సర్కిల్ దాటి నిమ్స్ హాస్పిటల్ దగ్గరకు వచ్చేసింది. విషయం కండక్టర్‌కు చెప్పి ప్రయాణీకులను వాకబు చేశాడు.‘‘ఎందుకైనా మంచిది.. పంజాగుట్ట పీఎస్‌లో కంప్లెంట్ ఇచ్చి చూడు’’ సలహా ఇచ్చాడు డ్రైవర్. బస్సు దిగి పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లిన శివకి ఎదురుగానే కనిపించాడు ఎస్ఐ చంద్రమౌళి. ‘‘ఏంటయ్య కేసు..’’ కాస్త కఠినమైన కంఠంతో ప్రశ్నించాడు ఎస్ఐ. ‘‘పర్సు పోయింది సార్..’’ అన్నాడు శివ. ‘‘ఎలా పోయింది? పోలీస్ స్టేషన్‌కు వచ్చేంత విషయం ఏం ఉంది అందులో?’’‘‘ఐదు వందల క్యాష్. ఆధార్ కార్డు. ఒక క్రెడిట్ కార్డ్.. ఉన్నాయి సార్’’ ‘‘ముష్టి ఐదొందలకు స్టేషన్‌కు రావాలా?’’‘‘పర్సు దొరక్కపోయినా.. ఐడీలు, బ్యాంక్ కార్డ్స్ కోసం ఎఫ్ఐఆర్ ఉపయోగ పడుతుందని..’’ శివ సమాధానంతో ఎస్ఐ ముఖంలో కాస్త తేడా వచ్చింది. ‘‘రైటర్.. ఎఫ్ఐఆర్ రెడీ చెయ్యి. సాయంత్రం వచ్చి కాపీ తీసుకోండి’’ అంటూ వెళ్లిపోయాడు ఎస్ఐ. బయటకు వచ్చిన శివ యూసఫ్‌గూడలోని తన బ్యాంక్‌కు నేరుగా ఆటోలో బయలుదేరాడు. మరో ఐదు నిమిషాల్లో బ్యాంకు వస్తుందనగా కొలిగ్ రఘుకు ఫోన్ చేసి అర్జంట్‌గా బయటకు రమ్మని చెప్పాడు. బ్యాంక్ దగ్గర దిగి, రఘు దగ్గర డబ్బులడిగి ఆటోకు ఇచ్చేశాడు.‘‘ఏం జరిగింది..’’ బ్యాంకులోకి వస్తూ అడిగాడు రఘు. ‘‘బస్సులో పర్సుపోయింది రా..’’‘‘అయ్యో! ఎంత పనైంది!! డబ్బులెన్ని ఉన్నాయిరా అందులో?’’ఎస్ఐకి చెప్పిన సమాధానమే రఘుకూ చెప్పాడు శివ. బ్యాంకులో కూర్చున్న మాటేగానీ శివకి మనసు కుదురుగా లేదు. ఏదో ఇష్టమైన వస్తువే కాదు.. తన వెంట ఉన్న ఒక ఆప్తుడిని మిస్ చేసుకున్నంతగా మథనంతో ఒత్తిడిలో పని చేయలేక ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాడు. మేనేర్ను కలిసి విషయం చెప్పి హాఫ్ డే లీవ్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు.వేళకాని వేళలో ఇంటికి వచ్చిన శివని చూసి ఆశ్చర్యపోయింది భార్య మమత. ‘‘ఏంటండీ అప్పుడే ఇంటికి వచ్చేశారు?’’ అంటూ చేతిలోని లంచ్ బాక్స్, బ్యాగ్ తీసుకుంది. ‘‘మనసు బాలేదు. కాసేపు పడుకుంటాను. ఇదిగో ఈ డబ్బు లోపల పెట్టు..’’ అంటూ అంతకుముందు బ్యాంకులో డ్రా చేసిన ఐదువేలు మమత∙చేతికిచ్చి బెడ్రూంలోకి వెళ్లాడు. కాసేపటికి కాఫీతో వచ్చిన మమత ‘‘ఏంటండి విషయం.. ఆఫీసులో ఏమన్నా ప్రాబ్లమా? ఎందుకిలా ఉన్నారు?’’ అని అడిగింది. కాఫీ తాగుతూ విషయం చెప్పాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ‘‘అయ్యో! దానికే ఇంత బాధపడిపోతు న్నారా? ఇందుకోసమేనా త్వరగా వచ్చేసింది?’’‘‘అదేంటి అలా అంటావ్? డబ్బులు, కార్డులు, ఐడీలు పోయాయి.’’‘‘పోతే? మళ్లీ సంపాదించుకుంటాం కదా? బాధపడడం ఎందుకు? వాటికి మించిన విలువైనవి ఏమైనా ఉన్నాయా అందులో?’’ మమత సమాధానాలతో శివకి మాటలు రాలేదు. ఏం చేయాలో తెలియక మంచంపై నడుం వాల్చాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న మమత.. మధ్యాహ్నం వచ్చే సీరియల్ చూడడానికి హాల్లోని టీవీ ముందు చేరింది. పడుకున్న మాటేగానీ.. శివకి నిద్ర పట్టడంలేదు. ఎస్ఐ, కొలిగ్ రఘు, మమత వీళ్ల మాటలే గుర్తుకు వస్తున్నాయి. ‘ఒక చిన్న పర్సు కోసం ఎందుకంత బాధపడిపోతున్నాను? అసలు ఆ పర్సులో ఏముంది? నిండైన జీవితాన్ని అది ఎందుకింత ప్రభావితం చేస్తోంది?’ అన్న ప్రశ్నలు అతణ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.అవును. అసలా పర్సులో ఏమున్నాయి? ప్రతిరోజూ ఉదయం లేవగానే పర్సులో ఉన్న ఫొటోను చూడడంతోనే శివ రోజు మొదలవు తుంది. రాత్రి ఆ ఫొటో చూడనిదే నిద్ర రాదు. ఎప్పుడన్నా జీవితంలో భయమేసినా, ఒత్తిడితో కోపం వచ్చినా, ఆ ఫొటోను చూస్తే చాలు.. వెయ్యి కష్టాలు కూడా దూరమైపోతాయి. ఎవరిదా ఫొటో?ఇంకెవరిది.. మమతదే. 13 ఏళ్ల క్రితం నాటి చిన్న పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో. శివ, మమతది ప్రేమ పెళ్లి. పుట్టిన ఊర్లు వేర్వేరు అయినా.. ఇద్దరూ ఒకే బస్సులో, ఒకే కాలేజీకి వెళ్లేవారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొదటి క్లాస్‌లో మమతను చూసి ఆమె మాయలో పడిపోయి నిత్యం ఆమెను ఆరాధించేవాడు. ఓరోజు బస్సులో మమత పుస్తకం దొరికింది. అందులో ఆమె ఫొటోలు కనిపించగానే ఒకటి తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నిత్యం ఆ ఫొటోతోనే మాటలు, ఊసులు. ఇక పర్సులో ఉన్న మరో విలువైన వస్తువు.. శివ తల్లి కొమురవ్వ ఇచ్చిన పాతబడిపోయిన రూపాయి నోటు. ఇంటర్లో కొత్తగా కొనుక్కున్న పర్సును తల్లి కొమురవ్వకు చూపినప్పుడు ఆమె ఒక రూపాయి నోటును అందులో పెడుతూ..‘‘ఇప్పుడిచ్చిన ఈ రూపాయి నోటు ఎప్పుడూ నీతోనే ఉండాలే! అప్పుడే నీ కాడికి పెద్ద పెద్ద నోట్లు వచ్చి చేరుతయి’’ అంది. ఆ మాట శివపై చాలా ప్రభావాన్ని చూపింది. ఆరోజు నుంచి అన్ని రకాల నోట్లను సేకరించడం మొదలుపెట్టాడు. అరుదైన నోట్లను దాచుకుంటూ వచ్చాడు. పోయిన పర్సులో అలాంటి పాత నోట్లు చాలానే ఉన్నాయి.ఇక పర్సులో ఉన్న మరో విలువైనది.. ఒక ప్రేమలేఖ. లేత వయసులో చిగురించిన ప్రేమను ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది ఆ ప్రేమలేఖ. శివ డిగ్రీ ఫైనల్ ఇయర్ చివరి రోజులు. మమతను ఆరాధించడం మొదలై నాలుగున్నరేళ్లు దాటుతోంది. తనను చూడడం దాదాపుగా సాధ్యంకాని పరిస్థితులు ఒక్కొక్కటిగా ఎదురవుతున్నాయి. ఒకరోజు మమతతో నేరుగా మాట్లాడడానికి ప్రయత్నించాడు. కాలేజ్ అయిపోగానే మమత వెనకే బస్టాండ్‌కి చేరాడు. ఆమెతో పాటు మరో ముగ్గురు క్లాస్ మేట్స్ ఉన్నారు. ‘ఇవాళ మమతతో నేరుగా మాట్లాడతా! లేదంటే లెటర్ ఇచ్చేస్తా. ఇది ఫైనల్’ అనుకున్నాడు. ప్రేమలేఖను చేతిలోకి తీసుకొని మమతను సమీపించాడు. ‘మమతా!’ అంటూ ఆర్తిగా పిలవబోయాడు. గుండె లోతుల్లోంచి వచ్చిన ఆ పిలుపు.. పెదవులు దాటనే లేదు.ఆశ్చర్యం! మమత ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ‘‘శివా..’’ అంటూ పిలిచింది. ఒక్కసారిగా అతడి గుండె ఆగిపోయినంత పనైంది. అక్షరాలా నాలుగున్నర సంవత్సరాలు. ఏ రోజూ వారిద్దరు మాట్లాడుకున్నది లేదు. ఐదు నిమిషాలు ఒకరికొకరు ఏమీ మాట్లాడుకోలేదు. మరో రెండు నిమిషాల్లో బస్సు వస్తుందనగా మమతే మాట్లాడడం ప్రారంభించింది. ‘‘పరీక్షలు మొదలవ్వడమే ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. సంబంధాలు కూడా చూస్తున్నారు’’ అంది. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించి పోయింది శివకి. తన ప్రేమలేఖను ఇవ్వడం వ్యర్థం అనుకున్నాడు. బస్సు రావడంతో ఇద్దరూ బస్సు ఎక్కేశారు. అరగంట తర్వాత శివ ఊరు వచ్చింది. శివ బస్సు దిగుతుండగా ఒక నోట్స్ అందించింది మమత. నోట్స్ అందుకున్న శివ ఎందుకిచ్చిందో కూడా ఆలోచించే స్థితిలో లేడు. కాళ్లు ఒక్క చోట నిలవడంలేదు. మనసును దు:ఖం ఆవహించింది. రాత్రి అన్నం కూడా తినకుండానే మంచంపై పొర్లుతున్నాడు. అర్ధరాత్రి మంచినీళ్ల కోసం లేచిన శివ చూపు ఎదురుగా ఉన్న పుస్తకాలపై పడింది. మమత ఇచ్చిన నోట్స్ మధ్య ఏదో గులాబీ రంగు కాగితం కనిపించింది. అందులో మమత చేతిరాత. చూడగానే గుర్తించాడు. చదవడం ప్రారంభించాడు. ‘‘శివా! కాలేజీలో చేరిన రోజు నుంచే మీరు నన్ను చూడడం గమనించా. మీకో విషయం చెప్పనా? అదే రోజు నుంచి నేనూ మిమ్మల్ని చూస్తున్నా. మీరు నా గురించి ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నారో గుర్తించగలను. ఎందుకంటే నేను కూడా మీ గురించి అంతే ఆలోచిస్తున్నా. ఈ నాలుగున్నరేళ్లుగా మీ వ్యక్తిత్వం గమనించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు నేరుగా చెప్పలేరు. నేను ఎలా రియాక్ట్ అవుతానో అన్న భయం. నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాను. మీకన్నా ముందుగా మా అమ్మానాన్నలకు చెప్పా. వాళ్లు ఒప్పుకోలేదు. కానీ నా ప్రయత్నాలు ఫలించాయి. రేపు మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడడానికి మా వాళ్లు వస్తున్నారు.’’ శివ ఆనందానికి హద్దులు లేవు. వెంటనే తన వాళ్లను నిద్రలేపి విషయం చెప్పి ఒప్పించాడు. మరుసటి రోజు ఇరువురి పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. అప్పటి నుంచి ఆ ఉత్తరాన్ని పర్సులోనే దాచుకున్నాడు. ఆ లేఖ అతడికి ప్రపంచంలోనే అత్యంత విలువైన బహుమతి. అందులోని ప్రతీ అక్షరం అతడికి ప్రాణప్రదం. సాయంత్రం 6 గంటలకు నిద్రలేపింది మమత. ‘‘ఇంట్లోకి వస్తువులు తీసుకోవాలి. బయటకు వెళదామా?’’ అంది. శివ రాలేననడంతో ఒక్కత్తే బయటకు వెళ్లి అరగంట తరువాత ఇంటికి చేరింది. శివను డిస్టర్బ్ చేయకుండా ఇంటి పనులన్నీ చేసుకుంటున్న మమతను చూసి ఏమీ మాట్లాడకుండా బెడ్ రూంలోకి వెళ్లి నిద్రపోయాడు శివ. మరుసటి రోజు నిద్రలేవగానే మమత ఫొటో చూడడం కోసం పర్సు తీసిన శివ.. అందులోని ఫొటోకు చిన్న స్మైల్ ఇచ్చి కళ్లు మూసుకున్నాడు. పది సెకన్లలో నిద్రమత్తు ఒదిలిపోయింది. ‘ఏంటిది! నేనింకా కల కంటున్నానా? పర్సు పోయింది కదా? అందులో ఉన్న ఫొటో, లెటర్, పాత నోట్లు అన్నీ పోయాయిగా? మరి ఇదంతా ఎలా?’ ఒక్కసారిగా పక్కనుంచి లేచాడు. అది కల కాదు నిజమే. మెత్త కింద పర్సు ఉంది. ఆత్రుతగా పర్సును చూడడం ప్రారంభించాడు. పర్సు కొత్తదే. కానీ అందులో ఉన్న ఫొటో, నోట్లు, గులాబీ రంగు కాగితం అన్నీ అలాగే ఉన్నాయి. లెటర్ తెరిచాడు. అవే అక్షరాలు. అవే పదాలు. అదే చేతిరాత. మమత కొత్త పర్సును పెట్టిందని అర్థమైపోయింది. వంటింట్లో ఉన్న మమత దగ్గరకు వెళ్లాడు. శివను చూస్తూనే నవ్వుల చిరుజల్లు కురిపించింది మమత.‘‘ఎలా ఇదంతా?’’ అన్నాడు. ‘‘మీకేం కావాలో నాకు తెలియదా?’’ సమాధానంలో ప్రశ్నను సంధించింది. ‘‘నిజమే కానీ.. ఫొటో, పాత నోట్లు?’’ అన్నాడు. ‘‘నోట్ల సేకరణ మీ ఇన్స్పిరేషన్తో పదేళ్ల క్రితమే మొదలైంది. ఇక ఫొటో సంగతా.. ఆరోజు మీరు ఒకటి తీసుకోగా మిగిలిన ఫొటోలు నా దగ్గరే జాగ్రత్తగా ఉన్నాయి.’’ అంటున్న మమతను చూస్తుంటే అసలైన పర్స్ దొరికినట్టయ్యింది. -
నో వాలెట్
పెద్ద పెద్ద రెస్టారెంట్లలో, హోటళ్లలో ‘వాలెట్ పార్కింగ్’ ఉంటుంది. కారు దిగగానే వాళ్లే వచ్చి కారుని పార్కింగ్ ప్లేస్‌లో పెట్టేస్తారు. దీన్నే వాలెట్ పార్కింగ్ అంటారు. అయితే ఇకముందు ఆ పనిని రోబోలు చేయబోతున్నాయి. ఫొటోలో ఉన్న రోబోను చూడండి. ఇదేం చేస్తుందో తెలుసా? షాపింగ్‌మాల్స్, ఎయిర్‌పోర్ట్‌లు, ఇతర ప్రాంతాల్లో ఆటోమేటిక్‌గా కార్లను పార్క్ చేస్తుంది. మాల్కెళితే లేదా ఎయిర్‌పోర్ట్‌కు వెళితే కారు పార్క్ చేసేందుకే బోలెడు సమయం పడుతుంది కదా.. పైగా ఒక్కో వాహనం ఒక్కో తీరుగా పార్క్ చేసి ఉండటం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఈ చికాకులన్నింటికీ విరుగుడుగా ఫ్రాన్స్‌కు చెందిన స్టాన్లీ రోబోటిక్స్ అనే సంస్థ ఈ వాలెట్ పార్కింగ్ రోబోను అభివృద్ధి చేసింది. పార్కింగ్ స్థలం ముఖద్వారం వద్ద మనం మన కారును వదిలేసి వచ్చేస్తే చాలు.. మిగిలిన పనంతా ఈ స్టాన్ రోబోనే చూసుకుంటుంది. శక్తిమంతమైన ప్లాట్‌ఫామ్ సాయంతో కారు చక్రాలను పైకిలేపడం.. వాహనం మొత్తాన్ని భద్రంగా ప్లాట్‌ఫామ్‌పైకి చేర్చి... ఖాళీ పార్కింగ్ స్థలం వరకూ మోసుకెళ్లడం.. పార్క్ చేసిన తరువాత ఇంకో కారును తీసుకొచ్చేందుకు వెళ్లడం ఇదీ స్టాన్ రోబో పనితీరు. వాహనం తాలూకూ వివరాలను స్కాన్ చేయడం ద్వారా మళ్లీ మన కారును మనకు తెచ్చిస్తుంది కూడా. ఫ్రాన్స్ రాజధాని పారిస్ విమానాశ్రయంలో ప్రస్తుతం దీన్ని పైలట్ పద్ధతిలో పరీక్షించి చూస్తున్నారు. ఇంకో విషయం. ఇతర వాలెట్ పార్కింగ్‌ల మాదిరిగా డ్రైవర్‌కు టిప్ ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హైక్‌లో వాలెట్, పేమెంట్
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ హైక్ తాజాగా వాలెట్, చెల్లింపు సేవల ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. యాప్ ద్వారానే మొబైల్ ఫోన్ బిల్లులు కట్టడం నుంచి నగదు బదిలీ దాకా వివిధ సర్వీసులకు ఇవి ఉపయోగపడగలవని సంస్థ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా నగదును వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసేందుకు హైక్ కొత్త అప్డేటెడ్ వెర్షన్ (5.0) తోడ్పడగలదని హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు కవిన్ భారతి మిట్టల్ తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు జూన్ 25 నాటికి, యాపిల్ ఫోన్ యూజర్లకు జూలై ఆఖరు నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి రాగలదని పేర్కొన్నారు. అలాగే యస్ బ్యాంక్‌తో కలిసి వాలెట్ సేవలు కూడా అందిస్తున్నట్లు కవిన్ వివరించారు. ప్రస్తుతం హైక్‌కు 10 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారు. హైక్ వేల్యుయేషన్ ప్రస్తుతం 1.4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. -
ఆన్లైన్కూ ఆదా మార్గాలు!
♦ సెర్చ్ నుంచి చెల్లింపు వరకూ అంతా పొదుపు మంత్రం ♦ కూపన్లు, వ్యాలెట్లతోనూ డిస్కౌంట్ల వర్షం ♦ సందర్భాన్ని బట్టి కూడా తగ్గింపు ధరలు ♦ కొనే ముందు కాస్తంత రీసెర్చ్ చేస్తే చాలు సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం : ఆన్లైన్ షాపింగ్ అంతకంతకూ పెరుగుతోంది. అందుకేనేమో!! కంపెనీలు సైతం ఇపుడు డిస్కౌంట్లు తగ్గించేస్తున్నాయి. దేశంలోని వినియోగదారులంతా ఇంటర్నెట్ షాపింగ్‌కు అలవాటుపడ్డారని, ఇపుడు వారు ఉత్పత్తుల్లో నాణ్యత, కొనుగోళ్లలో సౌఖ్యం మాత్రమే చూస్తున్నారని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలు చెబుతున్నాయి. అందుకే తాము డిస్కౌంట్లు తగ్గిస్తున్నా అమ్మకాలు మాత్రం తగ్గటం లేదని అవి చెబుతున్నాయి. మొబైల్ ఇంటర్నెట్ జోరందుకోవటంతో ఇపుడు అరచేతిలోనే షాపింగ్ జరిగిపోతోంది. సరే!! అవసరం ఉన్నా, లేకున్నా కనిపించింది కొనేయటం చాలామందే చేస్తున్నారు. మరి కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కాస్త ఆదా చేసుకునే పద్ధతులేంటి? అవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం... తక్కువ ధర ఎక్కడుంది? ఉదాహరణకు స్టోర్లకు వెళ్లేవారు జీన్స్ ప్యాంట్ కొనాలనుకుంటే ఎక్కడ తక్కువ ధరకు మంచి ఉత్పత్తులు దొరుకుతాయో కనుక్కుంటారు. షాపులోనూ వీలైతే బేరమాడతారు. ఆన్‌లైన్‌కు వచ్చేసరికి ఇవన్నీ మరిచిపోతారు. అలాం టివారు ఆన్‌లైన్‌లోనూ అదే చేస్తే బెటర్!. ఎలాగంటే... ఉదాహరణకు క్రోమ్ బ్రౌజర్లో ఈ కామర్స్ సైట్లో జీన్స్ ప్యాంట్ చూస్తున్నారు. ధర రూ.1999. సరిగ్గా అదే కంపెనీ అదే మోడల్ జీన్స్ ప్యాంట్ తక్కువధరకు ఏ సైట్లో విక్రయిస్తోందో ‘బైహట్కే.కామ్’ క్షణాల్లో చెప్పేస్తుంది. క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌గా బైహట్కే అందించే ప్లగ్ ఇన్ను ఇన్స్టాల్ చేసుకుంటే సరి. ఆ తర్వాత ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటే నోటిఫికేషన్ రూపంలో తక్కువ ధర ఎక్కడున్నదీ ఆటోమేటిక్‌గా చెప్పేస్తుంది. జంగ్లీ డాట్ కామ్, మైస్మార్ట్ ప్రైస్ డాట్ కామ్, షాప్ మానియా డాట్ కామ్, ప్రైస్ బాబా వంటి పోర్టళ్లు సైతం ఒక ఉత్పత్తి ఎక్కడెక్కడ ఎంత ధరలో ఉన్నదీ తెలియజేస్తున్నాయి. డిస్కౌంట్ కూపన్లు వెతకండి... ఆన్లైన్లో కొనుగోలు మొత్తం పూర్తయి... బిల్లు చెల్లించేటపుడు మీ దగ్గర కూపన్లేమైనా ఉంటే వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకని మీరు కొంటున్న సైట్లకు సంబంధించి కూపన్లేమైనా లభిస్తున్నాయేమో ముందే చూడాలి. కొనుగోళ్లను ప్రోత్సహించడానికి, తక్కువ సమయంలో భారీ అమ్మకాలను నమోదు చేసుకునేందుకు ఈ కామర్స్ సైట్లు పోటా పోటీగా ఆఫర్లు ఇస్తుంటాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఈబే సంస్థ 365 రోజులూ రకరకాల ఆఫర్లు ఇస్తుంటుంది. ఒకవేళ ఎలాంటి కూపన్లు కనిపించకుంటే... ప్రత్యేకంగా డిస్కౌంట్ కూపన్లను అందించే కూపన్ దునియా వంటి వెబ్సైట్లు కూడా ఉన్నాయి. గూగుల్‌లో కాస్త శోధిస్తే మంచి కూపన్ పట్టుకోవడం ఏమంత కష్టం కాదు. పండుగల బొనాంజా పండగ రోజుల్లో కొనడం కూడా ఆదా చేసుకునే మార్గాల్లో ఒకటి. ఆఫ్‌లైన్ సంస్థల మాదిరిగానే దసరా, దీపావళి, నూతన సంవత్సరం, స్వాతంత్య్ర దినోత్సవం, వాలంటైన్స్ డే, గ్రేట్ ఇండియన్ షాపింగ్ ఫెస్టివల్ తదితర రోజుల్లో ఆఫర్లు వెల్లువెత్తుతుంటాయి. ధర తగ్గినప్పుడే కొంటారా..? మనం కొంటున్నపుడు గనక ఒక వస్తువు ధర ఎక్కువుందని మనం భావిస్తే... దాన్ని తగ్గాకే కొనొచ్చు. ఉదాహరణకు రమేష్‌కు శామ్సంగ్ అల్ట్రా యూహెచ్డీ టీవీ కొనాలని కోరిక. అన్నింటి కంటే ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువగా రూ.80,999 ఉంది. కానీ రమేష్ బడ్జెట్ 70 వేలే. అప్పుడు రమేష్ ఏం చేశాడంటే... చీపాస్ డాట్ ఇన్ సైట్‌కు వెళ్లి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లోని ఉత్పత్తికి సంబంధించిన పేజీ యూఆర్ఎల్ను పేస్ట్ చేశాడు. ప్రైస్ అలర్ట్ పెట్టుకున్నాడు. నెల రోజుల తర్వాత పండుగ ఆఫర్లో భాగంగా అదే టీవీ ధరను ఫ్లిప్‌కార్ట్ రూ.66 వేలకు అందిస్తోందంటూ రమేష్‌కు చీపాస్ నుంచి మెయిల్ వచ్చింది. మనం కూడా ఇలా చేయొచ్చు కదా! అలాగే, జంగ్లీ, మైస్మార్ట్ ప్రైస్ వంటి సైట్లలోనూ కొనాలనుకుంటున్న ఉత్పత్తిని ఎంపిక చేసుకుని ‘ప్రైస్ అలర్ట్’ సెట్ చేసుకుంటే ధర తగ్గినప్పుడు తెలియజేస్తుంది. కొత్త మెయిల్ ఐడీతో కొనేస్తే సరి ఎంత మంది కస్టమర్లుంటే అంత పెద్ద సంస్థ అనే గుర్తింపు వస్తుంది. అందుకే ఈ కామర్స్ పోర్టళ్లు కొత్తగా నమోదైన కస్టమర్లకు మొదటి కొనుగోలుపై 20 నుంచి 30 శాతం వరకు, కొన్ని 50 శాతం వరకు కూడా డిస్కౌంట్ ఇస్తుంటాయి. తగ్గింపు పొందాలంటే కొత్త మెయిల్ ఐడీతో కొత్త కస్టమర్ అవతారం ధరించాల్సిందే. ఓఎల్ఎక్స్, క్వికర్ చంద్రశేఖర్ నెల క్రితమే ముచ్చటపడి బజాజ్ వీ బైక్ కొన్నాడు. రూ.72వేలు అయింది. నెల తర్వాత ఓ రోజు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బైక్‌కు చిన్న గీత పడలేదు. శేఖర్‌కు సైతం చిన్న గాయం కాలేదు. కానీ, బైక్ వల్లే ఇలా జరిగిందని శేఖర్‌లో అనుమానం మొదలైంది. దీంతో 60వేలకే వీ బైక్ అంటూ క్వికర్‌లో క్లిక్ మనిపించాడు. అదే రోజు ఓ తెలివైన కుర్రాడు చంద్రశేఖర్ చేతిలో రూ.58 వేలే పెట్టి ఆ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. కొన్న కుర్రాడి లాజిక్ ఏంటో తెలుసా... ‘నిజంగా ఇది లక్కీ బైక్. అందుకే ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు’ అనుకున్నాడు. రూ.14వేలు ఆదా చేసుకున్నాడు. ఈ రోజుల్లో వాడినవే కాదు. వాడనివి కూడా ఓఎల్ఎక్స్, క్వికర్‌లో తక్కువ ధరకు లభిస్తుంటాయి. తరచి చూస్తే, కొంచెం సమయం వెచ్చిస్తే ఆన్లైన్ షాపింగ్‌లో ఆదా చేసుకునే మార్గాలు బోలెడు ఉన్నాయి. వ్యాలెట్ వాడితే తగ్గుతుంది పేటీఎం, మొబీక్విక్, ఫ్రీచార్జ్, ఎయిర్టెల్ మనీ, వొడాఫోన్ ఎం పెసా ఇలా వ్యాలట్ సేవలు అందించే సంస్థలు చాలానే ఉన్నాయి. ఐఆర్సీటీసీలో రైలు టికెట్ కొంటే రూపాయి తగ్గింపు రాదు. కానీ, టికెట్ ధరను చెల్లించేటప్పుడు మొబీక్విక్ లేదా పేటీఎం నుంచి డబ్బులు చెల్లిస్తే ప్రమోషన్లలో భాగంగా ఆయా సైట్లు తగ్గింపు ఇస్తుంటాయి. వ్యాలెట్ సైట్లను చూస్తే ఆఫర్ల గురించి తెలుస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డుతో షాపింగ్! ఈ కామర్స్ పోర్టళ్లు తరచుగా వివిధ బ్యాంకుల సహకారంతో తమ వినియోగదారులకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంటాయి. ఆయా బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే 5 నుంచి 15 శాతం వరకు డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుంటాయి. కాకపోతే దీనికి గరిష్ట పరిమితి ఉంటుంది. మీరు రూ.50వేల వస్తువు కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ అన్నారు కదా అని రూ.5వేలు వెనక్కి రాదు. షరతులుగా... ముందే గరిష్టంగా ఎంత డిస్కౌంట్ ఇస్తారో చెబుతారు. అదే లభిస్తుందని గుర్తుంచుకోవాలి. కార్ట్‌లో ఉంచితే కలిసొస్తుంది! ఉదాహరణకు అమెజాన్ సైట్లో ఫిలిప్స్ కంపెనీ హెడ్సెట్ ధర రూ.489 ఉంది. ధర ఫర్వాలేదనుకున్న మహేందర్ సైట్లోకి లాగిన్ అయి హెడ్‌సెట్‌ను షాపింగ్ కార్ట్‌కు యాడ్ చేసుకున్నాడు. కొనే లోపే నెట్ డిస్కనెక్ట్ అయింది. ఓ వారం తర్వాత అమెజాన్ నుంచి వచ్చిన మెయిల్ చూసి మహేందర్ ఎగిరి గంతేశాడు. వారం కిందట కొనాలనుకున్న ఫిలిప్స్ హెడ్‌సెట్‌పై 20% డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేసింది. ఈ కామర్స్ పోర్టళ్లలోని కార్ట్‌లలో పెండింగ్‌లో ఉన్న వస్తువులను విక్రయించుకునేందుకు కొన్ని సంస్థలు అప్పుడప్పుడు ఇలా డిస్కౌంట్‌ను ఇస్తుంటాయి. కార్ట్‌కు యాడ్ చేసుకుని కొనకుండా వేచి చూస్తే తెలుస్తుంది. -
బటన్ నొక్కండి.. లోన్ పట్టండి!
న్యూఢిల్లీ: మీకు డబ్బు అత్యవసరమా..? ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, అందుకు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ లోని వాలెట్ నుంచి లోన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను జరిపే ప్రముఖ కంపెనీలు పే వరల్డ్, పేటీఎమ్, వన్ మొబీక్విక్ లు ఈ పద్దతికి పచ్చజెండా ఊపేశాయి. త్వరలో ఈ పద్ధతిలో చిన్న మొత్తాల్లో రుణాలు అందించనున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. మే తొలి అర్ధ భాగంలో ఈ పద్దతిని యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్లు మొబీవిక్ వ్యవస్థాపపకుడు బిపిన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మొదట రూ.100 నుంచి రూ.500 ఎలిజిబుల్ యూజర్ వాలెట్‌కు చేరుతుందని చెప్పారు. తర్వాత రూ.5000/- వరకు రుణం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని, మామూలు బ్యాంకింగ్ రంగంలో ఎటువంటి రుణబాకీలు లేనివారికే వాలెట్ లోన్ అందిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పేటీఎమ్ మాత్రం తాను కొత్తగా ఏర్పాటు చేయబోతున్న బ్యాంకుల్లో ఖాతా తెరిచినవారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుందని తెలిపింది. ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్న కారణంగా వాలెట్ రుణాలు అందించేముందు కంపెనీలు కఠినతరమైన నిబంధనలను పాటించనున్నట్లు తెలిపాయి. కాగా, టెక్ సైన్స్ రీసెర్చ్ అనే కన్సల్టెన్సీ తాజాగా చేసిన పరిశోధనలో 2020 కల్లా మొబైల్ మార్కెట్ 6.6 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు 145 బ్యాంకులకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం కల్పించింది. -
హీరో పర్సును తిరిగిచ్చినందుకు.. భారీ నజరానా!
మనకు నచ్చిన హీరో కనబడితేనే.. ఎగిరి గంతేస్తాం. సెల్ఫీ, ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడతాం. అలాంటిది మనకు ఆరాధ్యుడైన సూపర్ స్టార్ హీరో పర్సు దొరికితే ఆ అభిమాని ఆనందానికి హద్దే ఉండదు. అలాంటి ఆనందమే హాలీవుడ్ సూపర్ స్టార్ క్రిస్ హేమ్స్‌వర్త్ అభిమానికి లభించింది. 'థోర్', 'అవెంజర్స్' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు హేమ్స్‌వర్త్. అతనికి యువతలోనూ మంచి క్రేజ్ ఉంది. ఇటీవల ఈ స్టార్ హీరో లాస్ ఏంజిల్స్‌లోని ఓ హోటల్లో భోజనం చేసిన తర్వాత అక్కడే తన పర్సు మరిచిపోయి.. ఇంటికి వెళ్లిపోయాడు. అదే సమయంలో హోటల్‌కు వచ్చిన అతని అభిమాని ట్రిస్టిన్ బడ్జిన్ బేకర్‌కు ఆ పర్సు లభించింది. అది తన అభిమాన హీరో పర్సు గుర్తించిన బేకర్.. ఆ విషయాన్ని వెంటనే హేమ్స్‌వర్త్‌కు తెలియజేశాడు. తానే స్వయంగా వెళ్లి పర్సును అందజేశాడు. అభిమాని నిజాయితీకి మురిసిపోయిన హేమ్స్‌వర్త్ నిజానికి తన పర్సులో పెద్దగా డబ్బులేమీ లేకపోయినా.. బేకర్‌కు భారీగా నజరానా ఇచ్చాడు. అంతేకాకుండా అతన్ని 'థాంక్స్' చెప్తూ ఓ లేఖ కూడా రాశాడు. ప్రస్తుతం 'బాయ్ స్కౌట్' లో ఉన్న అతను భవిష్యత్తులో ఉన్నతమైన హోదాలో ఉండాలని శుభాశీస్సులు తెలిపాడు. ఇక, స్టార్ హీరోకు పర్సు తిరిగి ఇచ్చినందుకు ఇమేజ్ పబ్లిషర్స్ షట్టర్ ఫ్లై సంస్థ ఏకంగా 10వేల డాలర్లు (రూ. 6.7 లక్షలు) బేకర్‌కు బహుమతిగా ప్రకటించింది. తన అభిమాని బేకర్‌తో కలిసి 'ద ఎలెన్ డిజెనర్స్' అనే టీవీ షోలో కనిపించి.. తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు హేమ్స్‌వర్త్. మొత్తానికి హీరో పర్సు దొరికిన ఆనందం బేకర్ కు డబుల్ ధమాకా మిగిలించింది.