చాలాసార్లు పొరపాటునో లేక హడావిడిగా వెళ్లాల్సిరావడం వల్లనో మనం వ్యాలెట్ లేదా సెల్‌పోన్ వంటి విలువైన వస్తువులను మరిచిపోవడం జరుగుతోంది. ఇక ఒకవేళ ఏదైన వస్తువు పోతే ఇక అంతే! దొరికితే మాత్రం అదృష్టంగానే భావిస్తాం. చాలా మటుకు ఎవరో మంచివాళ్లయితే గానీ అంతలా పనిగట్టుకుని తీసుకురారు. అచ్చం అలాంటి ఒక మంచి పని అమెరికాలోని ఒక వ్యక్తి చేసి అందరిచే ప్రశంలందుకున్నాడు.
(చదవండి: అమెరికాలో కాల్పులు... ఐదుగురికి గాయాలు)
అసలు విషయంలోకెళ్లితే..యూఎస్‌లోని ఒక వ్యక్తి మేడమ్ మీ పర్స్ పోయింది అంటూ కిమ్ అనే మహిళ ఇంటి తలుపుకొడతాడు. ఆమె ఎవరీ కొత్త వ్యక్తి అన్నట్లుగా చూస్తూ.. అది తన పర్సు కాదని చెబుతూ తలుపు వేసేయాలనుకుంటుంది. కానీ అతను పర్సు ఓపెన్ చేసి మేడం ఇది మీదే అంటూ అందులోని బ్యాంక్ కార్డులు అవి చూపిస్తాడు. ఇక అంతే కిమ్ ఒక్కసారిగా ఓ మై గాడ్ అని అరుస్తూ అది తన కూతురి వ్యాలెట్ అని ఒప్పుకోవడమే కాక ఆశ్చర్యంగా ఫీలవుతుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ప్రపంచంలో ఇంకా ఇంత మంచి మనుషులు ఉన్నారంటూ రకరకాలుగా కిమ్‌ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
(చదవండి: భారత్, పాకిస్తాన్ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు)
Comments
Please login to add a commentAdd a comment