kim
-
నేడు ఉత్తర కొరియాకు పుతిన్
సియోల్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఉత్తర కొరియాకు వెళ్లనున్నారు. కిమ్ ఆహా్వనం మేరకు పుతిన్ మంగళ, బుధవారాల్లో తమ దేశంలో పర్యటించనున్నట్టు కొరియన్ సెంట్రల్ అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రకటనను ఇరు దేశాలు ««ధ్రువీకరించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, ఉత్తర కొరియా ప్యాంగ్యాంగ్ క్షిపణుల పరీక్షల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది చివరలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించడం సంచలనమైంది. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్రమైన దాడులు చేస్తుండటంతో రష్యాకు అవసరమైన ఆయుధ సంపత్తిని ఉత్తర కొరియా సరఫరా చేస్తోందని, అందుకు బదులుగా రష్యా నుంచి అణు సాంకేతికతను పొందుతోందని దక్షిణ కొరియాతోపాటు అమెరికా ఆరోపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న రష్యా.. ఉత్తర కొరియాతో ఆయుధ వాణిజ్యం చేస్తే యూఎన్ తీర్మానాలను ఉల్లంఘించడమేనని అంటున్నాయి. అయితే, ఉత్తర కొరియా, రష్యా ఈ కథనాలను ఖండించాయి. కాగా, రష్యా అధ్యక్షుడు ఉత్తర కొరియాలో పర్యటించడం 24 ఏళ్లలో ఇది ప్రథమం. పుతిన్ మొదటిసారి జూలై 2000లో ఉత్తర కొరియాలో పర్యటించారు. మొదటి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత, అప్పుడు ఉత్తర కొరియాను పాలిస్తున్న కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌తో సమావేశమయ్యారు. పుతిన్ కోసం విలాసవంతమైన వేడుక 1991లో సోవియట్ పతనం తర్వాత ఉత్తర కొరియాతో రష్యా సంబంధాలు బలహీనపడ్డాయి. కిమ్ జోంగ్ ఉన్ తొలిసారిగా 2019లో రష్యాలోని తూర్పు నౌకాశ్రయం వ్లాడివోస్టాక్‌లో పుతిన్‌తో సమావేశమయ్యారు. మళ్లీ పుతిన్, కిమ్‌లు ఇరుదేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పుతిన్.. కిమ్‌కు హై–ఎండ్ ఆరస్సెనాట్ కారును పంపారు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య అనుబంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపేందుకు పుతిన్ కోసం విలాసవంతమైన వేడుకను కిమ్ సిద్ధం చేస్తున్నారు. రాజధాని ప్యాంగ్యాంగ్లోని ఒక చౌరస్తాలో భారీ కవాతు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు తెలుపుతున్నాయని ఓ న్యూస్ వెబ్సైట్ విశ్లేíÙంచింది. ఉక్రెయిన్‌పై యుద్ధం తరువాత పుతిన్‌ను స్వాగతించే దేశాలు తక్కువగా ఉన్నా.. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటన కిమ్ విజయం అంటున్నారు ఉత్తరకొరియా రాజకీయ విశ్లేషకులు. మాస్కోతో ఆర్థిక, ఇతర సహకారాలను పెంపొందించుకోవడానికి ఈ పర్యటనలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. -
కిమ్ కంట కన్నీరు.. ఎందుకంటే..?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దేశంలో జననాల రేటు దారుణంగా క్షీణించడమే ఇందుకు కారణం. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. దయచేసి ఎక్కువ పిల్లల్ని కనండి అంటూ కన్నీరు కార్చారు. Kim Jong Un CRIES while telling North Korean women to have more babies. The dictator shed tears while speaking at the National Mothers Meeting as he urged women to boost the countries birth rate. pic.twitter.com/J354CyVnln — Oli London (@OliLondonTV) December 5, 2023 ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికితోడు 1990లో తీవ్ర కరువు ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాభా రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. ఉత్తరకొరియాలో జననాల సంఖ్య భారీ స్థాయిలో క్షీణించింది. 2023లో జననాల రేటు 1.8 ఉంది. ఉత్తర కొరియా జనాభా 2034 నుండి ఘణనీయంగా తగ్గిపోతుందని హ్యుందాయ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. 2070 నాటికి జనాభా 23.7 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది. పక్కనే ఉన్న దక్షిణ కొరియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉంది. పిల్లల సంరక్షణ, పిల్లల చదువులు, కార్పొరేట్ సంస్కృతి వంటి కారణాలు జననాల రేటుపై ప్రభావం చూపుతున్నాయి. జననాల సంఖ్యను పెంచడానికి కిమ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది పిల్లల కోసం ప్రిఫరెన్షియల్ ఉచిత హౌసింగ్ ఏర్పాట్లు, సబ్సిడీలు, ఉచిత ఆహారం, వైద్యం, గృహోపకరణాలు, విద్యాపరమైన ప్రోత్సాహకాలను అందిస్తోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేక రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: అదే రోజున పార్లమెంట్‌పై దాడి.! భారత్‌కు పన్నూ బెదిరింపులు -
కిమ్ సోదరి యో జోంగ్ ఎందుకంత డేంజర్? ‘ది సిస్టర్’లో ఏముంది?
ఈ మధ్యనే ‘ది సిస్టర్’ అనే పుస్తకం వెలువడింది. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళగా ఎలా మారిందో ఈ పుస్తకంలో రాశారు. కిమ్ యో జోంగ్ అత్యంత క్రూరమైన మహిళ అని, ఆమెను చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన మహిళ అని పిలవడం తప్పు కాదని కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరికి సంబంధించిన మొదటి ఫొటో 90వ దశకం ప్రారంభంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే సమయంలో బయటకు వచ్చింది. అప్పుడు ఆమె వయసు 10 సంవత్సరాలు. తాజాగా నార్త్ కొరియా మూలాలు కలిగి, అమెరికాలో ఉంటున్న రచయిత్రి సంగ్ యూన్ లీ ఓ పుస్తకం రాసి, దానిలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళగా కిమ్ యో జోంగ్ ఎలా మారిందో తెలియజేశారు. ఆ పుస్తకం పేరు ‘ది సిస్టర్’ ట్యాగ్ లైన్‌గా ‘నార్త్ కొరియా కిమ్ యో జోంగ్, ది మోస్ట్ డేంజరస్ ఉమెన్’ అని రాశారు. ప్రస్తుతం ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఆరోగ్యం క్షీణించడంతో సోదరి కిమ్ యో జోంగ్కు పాలనా పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ తరచూ వినిపిస్తోంది. కిమ్ జోంగ్ ఉన్‌కు ఆమె ఏకైక చెల్లెలు. కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియా పాలనలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. నిరంతరం సోదరుడిని పక్కనే కనిపిస్తారు. ఇటీవల ఆమె సోదరుడు కిమ్ జోంగ్‌తో కలిసి రష్యా వెళ్లారు. అక్కడ రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడంలో సోదరునికి సహాయం చేశారు. పుస్తకం రచయిత, వుడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ సభ్యులు సుంగ్-యున్ లీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కొరియా పాలకుని సింహాసనం ఎప్పుడైనా ఖాళీ అయితే, వెంటనే ఆమె ఈ పదవిని చేపట్టి నిరంకుశంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా ఆమె తన సోదరునికి అడుగడుగునా అండగా నిలిచారని పుస్తకంలో రాశారు. ఆమెకు తన సోదరుని ప్రతి రహస్యం తెలుసని, అతని మామ హత్యలో కనికరం లేకుండా తన సోదరునికి అండగా నిలిచారని పుస్తకంలో పేర్కొన్నారు. ఉత్తర కొరియా ఒక క్లోజ్డ్ సొసైటీ. దేశంలో నమ్మదగిన సమాచారాన్ని పొందడం దాదాపు అసాధ్యం. కానీ ఈ పుస్తకంలో నియంత సోదరి గురించి పరిశోధించిన అంశాలను పేర్కొన్నారు. 2020లో కిమ్ జోంగ్ ఉన్ తన సోదరికి కీలక బాధ్యతలు అప్పగించారని, ఆమె దేశంలోని అన్ని వ్యవహారాలను చూసుకుంటుంటున్నారని ఆ పుస్తకం తెలియజేసింది. దక్షిణ కొరియాలోని గాంగ్నెంగ్లో జరిగిన 2018 వింటర్ ఒలింపిక్స్‌లో కిమ్ యో జోంగ్ మహిళల ఐస్ హాకీ గేమ్‌లో పోటీ పడింది. దక్షిణ కొరియాలో ఆమె స్నేహపూర్వక ప్రవర్తనను చూపినప్పుడు జనం ఆమెను చూసి గర్వపడ్డారు. ఈ నేపధ్యంలో ఆమెను అందరూ రాజకుమారి అని ప్రశంసించారు. అయితే అధికార పాలనలో భాగస్వామ్యం దక్కాక ఆమె తన ‘పవర్’ను పెంచుకుంటూ వస్తోంది. కాగా ఆమె పాంపర్డ్ లగ్జరీలో పెరిగిందని పుస్తకంలో రాశారు. ఆమెను మొదటి నుంచి నిబంధనలకు అతీతంగా పెంచారు. సోదరునిలాగే ఆమె స్విస్ బోర్డింగ్ స్కూల్లో కొన్నేళ్లు చదువుకున్నారు. ఆమెకు కంప్యూటర్‌పై మంచి పరిజ్ఞానం ఉందని పుస్తకంలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి కిమ్ జోంగ్ సింగపూర్ వచ్చినప్పుడు, ఆమె తన సోదరునితో పాటు అక్కడే ఉంది. కిమ్ నుంచి ఆమెకు క్రూరత్వం వారసత్వంగా వచ్చిందని పుస్తకంలో పేర్కొన్నారు. ఆమెను దేశంలోని కొందరు ‘దెయ్యం మహిళ’, ‘అహంకార యువరాణి’,‘సహ నియంత’ అని పిలుస్తుంటారు. ఉత్తర కొరియాలోని 25 మిలియన్ల మంది పౌరులు కిమ్ కుటుంబాన్ని ఆరాధిస్తుంటారని, వారు సాగించే అవినీతి గురించి ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తారని పుస్తకంలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పైసా లేకుండా జీవించడం ఎలా? 15 ఏళ్లుగా ‘మార్క్ బాయిల్’ ఏం చేస్తున్నాడు? -
కూతురిని ప్రపంచానికి పరిచయం చేసిన కిమ్..
-
మేడం..! ఈ పర్స్ మీదేనా.. పో..పోవయ్యా నాది కాదు!!.. ట్విస్ట్ అదే..
చాలాసార్లు పొరపాటునో లేక హడావిడిగా వెళ్లాల్సిరావడం వల్లనో మనం వ్యాలెట్ లేదా సెల్‌పోన్ వంటి విలువైన వస్తువులను మరిచిపోవడం జరుగుతోంది. ఇక ఒకవేళ ఏదైన వస్తువు పోతే ఇక అంతే! దొరికితే మాత్రం అదృష్టంగానే భావిస్తాం. చాలా మటుకు ఎవరో మంచివాళ్లయితే గానీ అంతలా పనిగట్టుకుని తీసుకురారు. అచ్చం అలాంటి ఒక మంచి పని అమెరికాలోని ఒక వ్యక్తి చేసి అందరిచే ప్రశంలందుకున్నాడు. (చదవండి: అమెరికాలో కాల్పులు... ఐదుగురికి గాయాలు) అసలు విషయంలోకెళ్లితే..యూఎస్‌లోని ఒక వ్యక్తి మేడమ్ మీ పర్స్ పోయింది అంటూ కిమ్ అనే మహిళ ఇంటి తలుపుకొడతాడు. ఆమె ఎవరీ కొత్త వ్యక్తి అన్నట్లుగా చూస్తూ.. అది తన పర్సు కాదని చెబుతూ తలుపు వేసేయాలనుకుంటుంది. కానీ అతను పర్సు ఓపెన్ చేసి మేడం ఇది మీదే అంటూ అందులోని బ్యాంక్ కార్డులు అవి చూపిస్తాడు. ఇక అంతే కిమ్ ఒక్కసారిగా ఓ మై గాడ్ అని అరుస్తూ అది తన కూతురి వ్యాలెట్ అని ఒప్పుకోవడమే కాక ఆశ్చర్యంగా ఫీలవుతుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ప్రపంచంలో ఇంకా ఇంత మంచి మనుషులు ఉన్నారంటూ రకరకాలుగా కిమ్‌ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: భారత్, పాకిస్తాన్ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు) View this post on Instagram A post shared by Ring (@ring) -
ట్రంపొకరు కిమ్మొకరు
ఎవరి లాంగ్వేజ్ వారిది. ఎవరి స్టెయిల్ వారిది. ఎవరి ఫాలోయింగ్ వాళ్లది. ఇద్దరూ కుర్రాళ్లు. ఒకరు యూట్యూబ్ ట్రంప్. ఇంకొకరు టిక్‌టాక్ కిమ్. కిమ్ చేతి వేళ్ల మధ్య సిగరెట్! నాకే పోజ్ కొడతాడా.. అని ట్రంప్. ట్రంప్ మెడలో పొడవాటి ఎర్ర్రటి టయ్! నాకే డేంజర్ సిగ్నలా.. అని కిమ్. యుద్ధం మొదలైంది. క్యారీమినాటీ. ఏంటిది! పేరా? ఊరా? ఆంగ్లమా? ద్విభాషా పద బంధనమా? ఉఫ్.. క్యారీమినాటీ.. మనిషి పేరు. ట్వెంటీ ఇయర్స్ న్యూల్డ్. ఎవరు వారు? వాడో పెద్ద ఎదవ. ఓమై.. గాడ్! ఏంటిది రెస్పెక్ట్ లేకుండా!! అవును. అలానే చెప్పాలి క్యారీమినాటీ గురించి. లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వలేదని ఫీలైపోతాడు. ఏం చేస్తాడు? చేస్తాడు కాదు. చేస్తూ.. స్తూ...స్తూ.. ఉంటాడు. అతడిని యూత్ చూస్తూ.. స్తూ.. స్తూ.. ఉంటుంది. యూట్యూబర్ క్యారీమినాటీ. అతడికో చానెల్ ఉంది యూట్యూబ్‌లో.. ‘క్యారీమినాటీ’ అని. ఆ చానల్లో రెగ్యులర్‌గా దుర్భాషాభూయిష్టమైన కామెడీ స్కిట్స్ ఇస్తుంటాడు హిందీలో. ‘డిస్’ సాంగ్స్, సెటైరికల్ ప్యారడీలు క్రియేట్ చేస్తుంటాడు. ‘డిస్’ అంటే డిస్రెస్పెక్ట్. ఎవర్నీ రెస్పెక్ట్ చెయ్యడు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాడు. వ్యూయర్లు పడి చస్తారు... ఆ తొక్కలో ఎక్స్‌ప్రెషన్‌కి! తొక్క అనేమాట కూడా అతడిదే. మాటలు కోటలు దాటుతుంటే ‘వ్యూ’స్ కోట్లు దాటడంలో వింతేముంది!! ఎందుకు పుట్టుకొచ్చాడు క్యారీమినాటీ అకస్మాత్తుగా ఇప్పుడు! ఇప్పుడు పుట్టడమేంటి! 1999లో పుట్టాడు. ఢిల్లీ దగ్గర ఫరీదాబాద్‌లో. అసలు పేరు అజయ్ నాగర్. పదేళ్ల వయసు నుంచి యూట్యూబ్‌కి అతుక్కుపోయాడు. అతడు అతుక్కున్నాడే కానీ ఎవరూ అతణ్ణి అతుక్కోలా. ఈ పెద్దోళ్లున్నారే.. ‘ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్ బేటా’ అన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు బండిని లాగించాడు. సెకండ్ ఇయర్లో ఎకనమిక్స్ ఫైనల్ ఎగ్జామ్. కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు ఒక్క లైన్ కూడా రాయలేనని. ఎగ్జామ్కే వెళ్లలేదు. తర్వాత దూరవిద్యలో గట్టెక్కి, యూట్యూబ్‌నే తన ఇల్లు వాకిలి చేసుకున్నాడు. ఇంట్లోంచి వచ్చేసి ఒక ఆఫీస్ కూడా పెట్టుకున్నాడు. ఆఫీస్ పెట్టుకుంటే అయిపోతుందా! ఎవరు దేకుతారు? (ఇదీ మినాటీ లాంగ్వేజీనే. మనం ఇలా చెప్పుకుంటే కానీ మినాటీ దేహం శాంతించదు). ఎంతకూ పేరు రావడం లేదు. ఏం చేయాలి? ఎవర్నైనా ఏకాలి! (రోస్ట్). ‘ఎస్. ఏకాలి..’ అనుకుని యూట్యూబ్‌లో ఏడు లోకాలు గాలించి ‘ప్యూడీపీ’ ని పట్టుకున్నాడు. ప్యూడీపీ స్వీడిష్ యూట్యూబర్. చాట్ ట్రాక్‌లతో యువలోకాన్ని దున్నేస్తూ ఉన్న జగదేకవీరుడు. మినాటీ కన్నా పదేళ్లు పెద్దవాడు. ‘బై ప్యూడీపీ’ అని అతడి మీద ఒక ‘డిస్’ ట్రాక్ చేసి వదిలాడు మినాటీ. ‘నీకంత సీన్ లేదు. పోటీకొచ్చే తూటా నీ దగ్గర లేదు’ అని నాలుగైదు డైలాగ్స్ కొట్టాడు. అది చూసి ‘ఐ లవ్ మై కంట్రీ’ అని మన యూత్ ఫ్లాట్ అయి మినాటీని హీరోను చేసేసింది. నిన్నమొన్ననే అతడు హీరో అయింది. హీరోకు కొమ్ములొచ్చాయి. కుమ్మడానికి ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాడు. ఆమిర్ సిద్ధిఖీ దొరికాడు. ముంబై అతడిది. క్యారీమినాటీ యూట్యూబ్ హీరో అయితే, ఆమిర్ సిద్ధిఖీ టిక్‌టాక్ హీరో. ఆ హీరో మే మొదటివారంలో ఓ టిక్‌టాక్ వీడియో వదిలాడు. అందులో యూట్యూబర్లపై సెటైర్లు ఉన్నాయి. ఒక్కడికీ అక్కడ (యూట్యూబ్‌లో) వాక్శుద్ధి లేదు అన్నాడు. చెత్త మాట్లాడతారు అన్నాడు. టిక్‌టాక్‌ని కాపీకొడతారు అన్నాడు. దమ్ముంటే నన్ను కొట్టమనండి అన్నాడు. ఆ వీడియోను పట్టుకున్నాడు కొమ్ముల క్యారీ మినాటీ. అతడిని ‘రోస్ట్’ చేస్తూ మే 8న ‘యూట్యూబ్ వర్సెన్ టిక్‌టాక్ – ది ఎండ్’ అని ఒక వీడియోను రిలీజ్ చేశాడు. దాన్నిండా మితిమీరిన వెటకారం. ఒకళ్లను తిడుతుంటే అనుకోకుండా ఇంకొళ్లకు తగుల్తుంది. అలాంటి మాటలు వాడాడు క్యారీమినాటీ. ‘మీఠా’ అన్నాడు. ‘చెక్కా’అన్నాడు. ‘మిథాయి దుకాన్ మే లే జావూంగాతో 200 మే బిక్ జాయేగా’ అన్నాడు. ‘స్వీట్‌షాప్ దగ్గర 200 రూపాయలకు అమ్ముడుపోయే వాళ్లలాంటి వాడివి నువ్వు’ అన్నాడు. ఆ మాటకు ‘హోమో’ కమ్యూనిటీ నొచ్చుకుంది. చివరికి ఆ వీడియోను యూట్యూబ్ మే 14న తొలగించింది. ‘టెర్మ్స్ ఆఫ్ యూసేజ్’ని మీరినప్పుడే ఇలా డిలీట్ చేస్తుంది యూట్యూబ్. క్యారీమినాటీ ఎక్కడ టెర్మ్స్ ఆఫ్ యూసేజ్ తప్పాడన్న దానిపై ఇప్పుడు ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో డిబేట్ నడుస్తోంది. క్యారీ మాత్రం తనెవర్నీ కించపరచలేదని అంటున్నాడు. మొదట టిక్టాకర్లకు, యూట్యూబర్లకు జరిగిన ఫైట్.. మధ్యలో దిశ మార్చుకుని ఆమిర్ సిద్ధిఖీ, క్యారీమినాటీ మధ్య మొదలైంది. క్యారీ వీడియోను యూట్యూబ్ తొలగించగానే, క్యారీ అభిమానులు యూట్యూబ్ మీదకు యుద్ధానికి వెళ్లారు. అయితే యూట్యూబ్ యుద్ధాలు చెయ్యదు. చెయ్యనివ్వదు. యుద్ధనివారణకు మాత్రం చర్యలు తీసుకుంటుంది. మాటలో, పాటలో, చూపులో ఏ కొంచెం ద్వేషం ఉన్నా డిలీట్ బటన్ కొట్టేస్తుంది. నిన్ను మించినవాడు లేడని క్యారీమినాటీకి సిల్వర్ బటన్లు, గోల్డెన్ బటన్లు, ౖyð మండ్ బటన్లు అవార్డుగా ఇచ్చిన యూట్యూబ్ ఇప్పడు డిలీట్ బటన్ వాడవలసి వచ్చిందంటే కారణం లేకుండా ఉంటుందా, ఆ కారణం వెనుక క్యారీమినాటీ లేకుండా ఉంటాడా? మమ్మల్నెందుకు లాగుతారు? మిమ్మల్ని ఉల్లాసపరచడానికి మేమిక్కడ లేము. మా మీద జోకులు వేసుకోవడం ఏమిటి? మిమ్మల్ని మీరు కించపరచుకోడానికి, అవమానించుకోడానికి, అసహ్యించుకోడానికి మమ్మల్ని పోలుస్తారెందుకు? నిత్యం మేము జీవించడానికి పోరాటం చేస్తూ ఉంటాం. మనుగడ కోసం మేము ఉద్యమిస్తున్నాం. మా ఉద్యమం ఆగేది కాదు. – రిషి వ్యాస్, ‘క్వీర్’ హక్కుల కార్యకర్త రోస్ట్ చేస్తే ఊరుకోం యూట్యూబర్స్‌ని రెచ్చగొట్టే ఉద్దేశం లేదు. టిక్‌టాకర్స్ అంతా కలిసికట్టుగా ఉండాలి అన్నాను అంతే. విమర్శను మేము పాజిటివ్‌గా తీసుకుంటాం. అయితే సైబర్ బుల్లీయింVŠ ని సహించం. అతడి (క్యారీమినాటీ) వీడియోను యూట్యూబ్ ఎందుకు తొలగించిందో అతడికే తెలియాలి. మమ్మల్ని రోస్ట్ చేసినవాళ్లను మేము రోస్ట్ చేయకుండా వదలం. – ఆమిర్ సిద్ధిఖీ, టిక్‌టాకర్ అపార్థం చేసుకున్నారు యూట్యూబ్ నా వీడియోను ఎందుకు డిలీట్ చేసిందో అర్థం కావడం లేదు. నన్ను అపార్థం చేసుకున్నారు. నేను హిందీలో మాట్లాడతాను. దానిని ఇంగ్లిష్‌లోకి సరిగా తర్జుమా చెయ్యకపోతే అపార్థాలే వస్తాయి. ఒక వరసలో మాట్లాడుతున్నప్పుడు ఆ వరసలోని ఒక మాటనో, కొన్ని మాటల్నో పట్టుకుని జడ్జ్ చెయ్యడం కరెక్టు కాదు. – క్యారీమినాటీ, యూట్యూబర్ -
బాప్ ఆఫ్ ఆల్ బాంబ్స్
ఆ వార్త విన్నప్పటి నుంచి ఉత్తర కొరియా పెసిడెంటు కిమ్ జోంగ్ మనసు మనసులో లేదు. దినపత్రికను నూటా రెండోసారి తిరిగేశాడు.... ఆ వార్తను మళ్లీ చదివాడు. అది ఇలా ఉంది: ‘అగ్రదేశాలు చైనా, అమెరికాలు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరుతో ఒక బాంబును తయారుచేశాయి. ప్రపంచంలోనే నంబర్‌వన్ బాంబు ఇది. దీని ప్రత్యేకతలు ఏమిటంటే...’’\ అసహనంగా పేపర్ గిరాటు వేశాడు కిమ్. ‘‘అయ్యా!ఏమిటి డల్‌గా ఉన్నారు?’’ అని చుట్ట చేతికిస్తూ అడిగాడు కిమ్ పీయే కుమ్ డాంగ్. ‘‘నా పేరు చెప్పగానే హైట్రోజన్బాంబు, అణుబాంబు... ఎక్సెట్రా ఎక్సెట్రా బాంబులు గుర్తుకువచ్చేవి. దేశదేశాలు గజగజా వణికేవి. కానీ ఇప్పుడు చైనా, అమెరికాలు ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ తయారుచేశాయట. ఇక నాకెందుకు భయపడతారు. ఇలా చుట్టలు తాగుతూ ఒక మూలన కూర్చోవల్సిందే’’ గాద్గదిక స్వరంతో నిట్టూర్చాడు కిమ్. ‘‘మీరు అధైర్యపడవద్దు... ప్రపంచమంతా ఒక ఎత్తు మీరు ఒక ఎత్తు. ఎవరు మీకు సాటిలేరు...నీ దూకుడు సాటెవ్వడూ’’ అని పొగడ్తల మద్దెల మోగించాడు కుమ్ డాంగ్. ఈ పొగడ్తలతో కాస్త పైకి లేచాడు కిమ్. దేశంలోని ముఖ్యమైన శాస్త్రవేత్తలందరికీ ఫోన్లు చేశాడు. అందరూ భయంభయంగా కిమ్ ఇంటికి పరుగులు తీశారు. వారిని ఉద్దేశించి కిమ్ ఇలా ప్రసంగించాడు:‘‘గజగజా వణకాల్సింది మీరు కాదు.... ప్రపంచం. మీకు తెలుసు కదా...చైనా,అమెరికాలు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరుతో సరికొత్త బాంబును తయారుచేసి ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయి. నేను బతికున్నంత వరకు అది జరగని పని. డియర్ కామ్రేడ్స్.... మీకు ఒక నెల టైమ్ ఇస్తున్నాను. ఏంచేస్తారో ఏమిటో నాకు తెలియదు. ఆ బాంబును మించిన బాంబును తయారుచేయాలి. దాని పేరు కూడా ఇప్పుడే పెట్టేస్తున్నాను.... బాప్ ఆఫ్ ఆల్ బాంబ్స్! ఓకే...ఇక పనిలోకి దిగండి...’’నెల రోజుల పాటు శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేశారు.జుత్తు పీక్కున్నారు. పక్కోడి జుట్టు కూడా పీకారు.అసహనం, ఆగ్రహం, అసంతృప్తి తప్ప కొత్త బాంబేదీ రాలేదు.‘‘అయ్యా మమ్మల్ని క్షమించండి.నిద్రాహారాలు మాని ఎన్నో ప్రయోగాలు చేశాం. ఎంత చేసినా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ సమీపంలోకి కూడా వెళ్లలేకపోతున్నాం’’ అని పెద్ద పెట్టున ఏడ్చారు శాస్త్రవేత్తలు.‘‘మీరు ఏడ్వడానికి తప్ప ఎందుకు పనికిరారు. వెళ్లి చావండి’’ అని తిట్టి చుట్ట వెలిగించాడు కిమ్.ఈలోపు ‘బ్రేకింగ్ న్యూస్’ అంటూ టీవీలో హడావుడి మొదలైంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు...‘‘ప్రపంచ ప్రజలారా... మీకు కోడి పందేల గురించి తెలుసు... కానీ బాంబుల పందేలా గురించి తెలియదు. తొలిసారిగా ప్రపంచచరిత్రలో ఇండియాలోని సికింద్రాబాద్ జింఖాన గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిదేశం ఇక్కడ తమ బాంబులను ప్రదర్శించవచ్చు.... ఎవరి బాంబు స్ట్రాంగో వారికి అమెరికాను, చైనాను రెండు సంవత్సరాలు పాలించే బంపర్ ఆఫ్ ఇస్తున్నాం. ఎవరూ గెలవకపోతే...అందరూ కలిసి మెక్సికో–యూఎస్ గోడకట్టివ్వాలి’’ అన్నాడు. ‘‘మంచి చాన్సు. తాడో పేడో తేల్చుకుంటాను’’ మీసానికి బదులు తల దువ్వాడు కిమ్. ఆరోజు జంటనగరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.ఎటు చూసినా జనాలే జనాలు! బాంబుల పోటీలో పాల్గొనడానికి దేశదేశాల వాళ్లు వచ్చారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాయంత్రం రిజల్ట్ వచ్చింది. ‘విజేత కిమ్..... జొంగ్!’ అని ప్రకటించారు.‘‘నార్త్ కొరియా పెసిడెంట్‌గారి బాప్ ఆఫ్ ఆల్బాంబ్స్కు మొదటి బహుమతి వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం’’ అని ఏడుస్తూ ప్రకటించాడు ట్రంప్.‘‘విక్రమార్కామదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌కు దీటుగా బాంబు తయారుచేయలేమని శాస్త్రవేత్తలు చేతులు కాళ్లెత్తేసిన తరువాత కూడా కిమ్ అంత పెద్ద బాంబును ఎలా తయారుచేయగలిగాడు?! నిజానికి కిమ్‌కు దీపావళి టపాసులు కూడా తయారుచేసే పరిజ్ఞానం లేదు. హౌ ఇట్ ఈజ్ పాజిబుల్!’’ అడిగాడు బేతాళుడు.‘‘కిమ్ తన నోరును నమ్ముకున్నాడు. అదే...బాప్ ఆఫ్ ఆల్‌బాంబ్స్’’ కూల్‌గా చెప్పాడు విక్రమార్కుడు.‘‘నువ్వు చెబుతున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు... నోరేమిటి? బాంబేమిటి!’’ ఆశ్చర్యంగా అరిచాడు భేతాళుడు.‘‘అయితే చెబుతా విను’’ అంటూ ఇలా చెప్పాడు విక్రమార్కుడు:‘‘సంగీతం అనేది మంచినోళ్లలో ఉంటే మహాశక్తి జనిస్తుంది. అరుదైన రోగాలు కూడా నయమవుతాయి. అదే చెడునోట్లో పడితే విధ్వంస శక్తి జనిస్తుంది. అరుదైన రోగాలు వస్తాయి...బాంబును బాంబుతో ఎదుర్కోవడం అనేది పాత మాట...బాంబును మ్యూజిక్‌తో ఎదుర్కోవడం నా బాట అంటూ.... ప్రపంచంలోని రకరకాల మ్యూజిక్‌ను నెలరోజుల్లో నేర్చుకునే ప్రయత్నం చేశాడు కిమ్. గాత్రసంగీతానికి ప్రాధాన్యత ఇచ్చాడు. చివరికి ఒకరోజు ఆయనకు గొప్ప ఆలోచన వచ్చింది.సకల సంగీతాలను మిక్స్ చేసి తన గొంతుతో ఆలపిస్తే గొప్పశక్తి విడుదల అవుతుందని కల కన్నాడు. ఆ కల అక్షరాలా నిజమైంది. ఆరోజు జింఖాన గ్రౌండ్లో అన్ని దేశాల బాంబుల ప్రదర్శన జరిగిన తరువాత....‘‘మీ బాంబు ఎక్కడ?’’ అని అడిగారు నిర్వాహకులు.‘‘నా నోరే నా బాంబు అంటూ.... అటు ఆఫ్రికన్ ఫోక్ జిమ్–బో–ల నుంచి ఇటు హిందుస్థానీ, కర్నాటక సంగీతం వరకు అన్నీ కలగలిపి...గొంతు విప్పాడు ఇలా....‘సికుయో యెలిజివి లోబోమినోయన నోయన నితినిసారజవర గమన సారజవరగమన.... ఎన్నియెళ్లు ఎన్నియెళ్లో ఎన్నియేళ్లు...దొర ఏందిరో వాని జులుము ఎందిరో...’అంతే..... భారీ విస్ఫోటం. చెల్లాచెదురుగా ఎటు వాళ్లు అటు పరుగులు తీశారు.‘‘నేను...గొంతు విప్పి రెండు నిమిషాలు కూడా పాడకముందే ఇంత విధ్వంసం జరిగితే....పదినిమిషాలు ఏకధాటిగా పాడితే.... నా నోటి ముందు ఏ బాంబు సరిపోదు...’’ అన్నాడు కిమ్.‘‘నిజమే’’ అని ఏకగ్రీవంగా ఒప్పుకొని కిమ్‌ను విజేతగా ప్రకటించి ఆయన నోటికి ‘బాప్ ఆఫ్ ఆల్‌బాంబ్స్’ అనే నామకరణం చేశారు దేశాధీశులు. – యాకుబ్ పాషా -
ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రముఖ నేతలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వార్షిక సమావేశాలు వచ్చే నెల 21 నుంచి 25వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పట్టణంలో జరగనున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ కిమ్ సహా ఆరుగురు సంయుక్తంగా అధ్యక్షత వహిచనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాధిపతులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, పౌర సమాజం ప్రముఖులు కలసి 3,000 మంది వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ‘ప్రపంచీకరణ 4.0: నాలుగో పారిశ్రామిక విప్లవం దశలో ప్రపంచ స్వరూపం’ ఈ కార్యక్రమం ప్రధాన అంశంగా ఉంటుంది. వాతావరణం మార్పులు, జీవ వైవిధ్యం, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల నష్టం అంశాలను పరిష్కరించాల్సి ఉందని ప్రపంచ ఆర్థిక ఫోరం వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లౌస్ ష్వాబ్ పేర్కొన్నారు. కేటీఆర్, లోకేశ్ సైతం...: భారత్ నుంచి పాల్గొనే వారిలో అరుణ్ జైట్లీతోపాటు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్‌నాథ్, చంద్రబాబునాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, కేటీఆర్ సైతం హాజరు కానున్నారు. వ్యాపార ప్రముఖులు అజీమ్ ప్రేమ్‌జీ, ముకేశ్ అంబానీ దంపతులు, ఉదయ్ కోటక్, గౌతం అదానీ, లక్ష్మీ మిట్టల్, నందన్ నీలేకని, ఆనంద్ మహీంద్రా, అజయ్ పిరమల్ కూడా పాలు పంచుకోనున్నారు. -
డప్పులగూడెం నుంచి ప్రత్యక్ష ప్రసారం!
ప్రపంచ దృష్టంతా జూన్ 12 మీదే ఉంది. ఎందుకంటే నిప్పు–ఉప్పులాంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తొలిసారిగా సింగపూర్‌లో భేటీ అవుతున్నారు. ఈ భేటీ కోసం, ఇచ్చిన మాట ప్రకారం అంతర్జాతీయ జర్నలిస్ట్‌ల సమక్షంలో తమ దేశంలోని అణుకేంద్రాన్ని ధ్వంసం చేశాడు కిమ్. ఆ తరువాత ట్రంప్ ప్లేటు, చిప్ప మరియు గిన్నె ఫిరాయించి... ‘భేటీ లేదు గీటీ లేదు’ అని ప్రకటించాడు. ట్రంప్ ప్రకటన సంచలనం సృష్టించింది. కిమ్‌తో భేటీని ట్రంప్ అర్ధంతరంగా ఎందుకు రద్దు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాలేదు. ఈలోపే ట్రంప్ మరో ప్రకటన జారీ చేశాడు.‘మేము సింగపూర్‌లో భేటీ కావాలనుకున్న విషయం ప్రపంచానికి తెలిసిందే. నాలుగు గోడల మధ్య, ఏ.సీ రూముల్లో కూర్చోవడం అనేది పరమ రోటిన్ వ్యవహారం. అందుకే నేను సింగపూర్ భేటీని రద్దు చేశాను. ఏసీ రూముల్లో కాకుండా పచ్చటి ప్రకృతి మధ్య అక్కడి ప్రజలతో మమేకం అవుతూ చర్చలు జరపడం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీనికి కిమ్ ఓకే అంటే... ఎప్పుడైనా నేను భేటీకి రెడీ’‘ట్రంప్‌కు మంచి టేస్ట్ ఉంది. ఆయన ప్రతిపాదనకు నేను ఓకే చెబుతున్నాను’ అని ప్రకటించాడు కిమ్.తమ భేటీకి ‘డప్పులగూడెం’ను ఎంచుకున్నారు ట్రంప్–కిమ్.మన నల్లమల అడవిని ఆనుకొని చాలా అందంగా ఉండేడప్పులగూడెం పేరు ఆ జిల్లా వాసులకు కూడా తెలియదు. అలాంటి మారుమూల గూడెం పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆరోజు డప్పులగూడేనికి మొదట ట్రంప్ వచ్చాడు. ఆ తరువాత కిమ్ వచ్చాడు.డప్పులు కొడుతూ ఇద్దరు ప్రముఖులకు స్వాగతం పలికారు గూడెంవాసులు.‘జుంబారే యే జుంబరే’ అని పాట కూడా పాడారు. ఆ తరువాత...‘‘కిమ్... ఈ మామిడిచెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందాం సరేనా!’’ అన్నాడు ట్రంప్.‘‘ఓకే అంకల్...’’ అని తన సీట్లో కూర్చొని చుట్ట వెలిగించాడు కిమ్.‘‘ఒరే సచ్చినోడా... నీ చుట్ట కంపునంతా నేను పీల్చాలా? చుట్ట పక్కనెయ్యి’’ గద్దించాడు ట్రంప్.‘‘ఏమయ్యో... మాటలు మర్యాదగా రానివ్వు. నేనేమన్నా నీకు సర్వెంట్‌ను అనుకుంటున్నావా? నేను కూడా నీలాగే ప్రెసిడెంట్‌ని. నేనసలే కరాటేలో బ్లాక్‌బెల్ట్... మూతి మీద ఒక్కట్టిస్తే... ముప్పై రెండు పళ్లు రాలిపోవాలి’’ అని పళ్లు పటపట కొరికాడు కిమ్.ఈలోపు ఐక్యరాజ్యసమితి వాళ్లు పరుగెత్తుకు వచ్చారు.‘ఏమండీ పెద్దమనుషులు... ఇలా చిన్న పిల్లల్లా కీచులాడుకోవడానికేనా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చింది. ప్రపంచం ముందు మీ పరువుపోతుంది’’ అని చివాట్లు పెట్టారు.దీంతో ఇద్దరు సర్దుకున్నారు.‘ట్రంప్–కిమ్ భాయి భాయి’ అని పెద్దగా నినాదాలు కూడా ఇచ్చుకున్నారు.టేబుల్ మీద ఉన్న చర్చల ఎజెండా కాపీని చేతుల్లోకి తీసుకున్నాడు ట్రంప్.ఈలోపు అక్కడికి గూడెం పెద్ద బండన్నదొర వచ్చాడు.‘‘ఇద్దరు సార్లకు నమస్తే అయ్యా... నన్ను బండన్నదొర అంటారు. మీరు మీ దేశాలకు ఎలా పెద్దో... నేను మా గూడానికి అలా పెద్ద. నాకు ముగ్గురు కొడుకులయ్యా... చిన్న కొడుకైతే మహా చిలిపి నా కొడుకు... ఎప్పుడూ ఏదో ఒక కొంటెపని చేస్తూనే ఉంటాడు... ఒకప్పుడు వాడి వయసులో నేను కూడా అంతే అనుకో’’ నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉన్నాడు బండన్నదొర. ‘‘మధ్యలా నీ లొల్లి ఏంద్వయ్య... అటు బో’’ కంఠం ఎర్ర చేశాడు కిమ్.‘‘అతిథ్యం ఇచ్చిన వాళ్లను అలా కసురుకోకూడదు నాన్నా... తప్పు కదా’’ హితవు పలికాడు ట్రంప్.‘‘ఏది తప్పు... ఏది పప్పు అని డిసైడ్ చేయడానికి నువ్వెవడివయ్యా.... ఎండకు ఆరేసిన ప్యాంట్లు ఎత్తుకుపోయి అమ్ముకునే ఫేసూ... నువ్వూనూ... బస్తీమే సవాల్.... ఇది అమెరికా కాదు... డప్పులగూడెం...ఇక్కడ నీ డామినేషన్ ఏంద్వయ్య’’ అని నాలిక మడతేశాడు కిమ్.మళ్లీ ఐక్యరాజ్య సమితి వాళ్లు పరుగెత్తుకు వచ్చారు.ఇద్దరికి సర్ది చెప్పడంతో సైలెంటైపోయారు.‘స్నేహాని కన్నా మిన్నా లోకాన లేదురా’ అని పాట అందుకున్నారు.‘‘ఈ పెద్దమనుషులిద్దరిని ఏకాంతంలో వదిలేద్దాం... ఇక్కడ ఒక్క పురుగు కూడా కనిపించడానికి వీలులేదు’’ అనడంతో ఎటు వాళ్లు అటు వెళ్లిపోయారు. ఇద్దరు మాత్రమే మిగిలిపోయారు.‘‘అంకల్... మీకెంత మంది పిల్లలు?’’ అడిగాడు కిమ్.‘‘నాకెంతమంది పిల్లలు, నీకెంతమంది భార్యలు అని తెలుసుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. ప్రపంచశాంతి గురించి మాట్లాడుకోవడానికి వచ్చాం. అవసరమైతే ఈ ప్రపంచం కోసం మన ప్రాణాలనుతృణప్రాయంగా అర్పిద్దాం. భయం అనేది మన డిక్షనరీలోనే ఉండకూడదు’’ ఉపదేశించాడు ట్రంప్.‘‘భయం గురించి నువ్వు నాకు చెబుతున్నావా? నా పేరు వింటే చాలు భయానికి నాన్‌స్టాప్‌గా మోషన్స్ అవుతాయి.... నేను నీలా పిరికి గొడ్డును కాదు’’ అంటూ మూతి మీద చెయ్యి వేసి తిప్పబోయాడుకిమ్.‘‘లేని మీసాన్ని ఏం తిప్పుతావుగాని... నువ్వొక పిరికి సన్నాసివి, ఎలుక చప్పుడుకు కూడా భయపడతావు. నా ధైర్యం గురించి ఇక్కడ ఏ చెట్టును అడిగినా చెబుతుంది’’ అన్నాడు ట్రంప్.‘నువ్వు పిరికి వాడివి అంటే... కాదు నువ్వు పిరికి వాడివి’ అని ఒకరినొకరుతిట్టుకుంటున్న సమయంలో...‘గాండ్రు... గాండ్రు’ అని శబ్దం వినిపించింది.భయంతో ఇద్దరికీ ఊపిరాడలేదు.‘గాండ్రు... గాండ్రు’ అనే శబ్దం మరింత పెద్దదైంది.అంతే!‘ఓరి నాయనో పులి’ అంటూ చెరో దిక్కు పారిపోయారు.‘ఎందుకైనా మంచిది’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా చెరో చెట్టు ఎక్కే ప్రయత్నం చేశారు. వారి బరువు ధాటికి ఆ చెట్లు వేళ్లతో సహా కుప్పకూలిపోయాయి.పాపం చెట్లు!‘పులిలా అరిస్తే... భయపడి పారిపోయారు’ అని కడుపు పట్టుకుని తెగ నవ్వుతున్నాడు బండన్నదొర చిన్నకొడుకు!! – యాకుబ్ పాషా -
తల్లి హోదా తర్వాత ‘గ్రాండ్’ విక్టరీలు...
సాక్షి క్రీడావిభాగం: తల్లి కాబోతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భవిష్యత్‌లో మళ్లీ రాకెట్ పడుతుందో లేదో తెలియదుకానీ... అమ్మతనం ఆటకు అడ్డంకి కాదని గతంలో పలువురు టెన్నిస్ స్టార్లు నిరూపించారు. ప్రసవానంతరం బరిలోకి దిగి గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన సందర్భాలున్నాయి. ఆ వివరాలు... ►2008లో రిటైర్మెంట్ ప్రకటించిన కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం) కుమార్తెకు జన్మనిచ్చిన ఏడాది తర్వాత పునరాగమనం చేసింది. 2009, 2010లలో యూఎస్ ఓపెన్; 2011లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ కూడా సాధించింది. ► మహిళల టెన్నిస్‌లో అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన మార్గరెట్ కోర్ట్ తల్లి హోదా వచ్చాక ఒకే ఏడాది ఏకంగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం విశేషం. తొలి సంతానం కోసం 1971, 1972లో ఆటకు విరామం చెప్పిన మార్గరెట్ తల్లి అయ్యాక 1973లో పునరాగమనం చేసి ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకుంది. ►ఆస్ట్రేలియాకే చెందిన ఇవాన్ గూలాగాంగ్ 1977 మేలో పాపకు జన్మనిచ్చాక ఆ ఏడాది డిసెంబర్లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తోపాటు 1980లో వింబుల్డన్ టైటిల్‌నూ సాధించింది. ►గతేడాది అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ వారాల గర్భంతోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచింది. ఇప్పుడు కుమార్తె కలిగాక నెలల వ్యవధిలోనే సెరెనా పోటీల్లో పాల్గొంటోంది. ఇప్పటికి 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన సెరెనా వచ్చేనెలలో ఫ్రెంచ్ ఓపెన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ►రెండుసార్లు (2012, 2013) ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అజరెంకా (బెలారస్) 2016 డిసెంబర్లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2017 జూలైలో వింబుల్డన్ టోర్నీ లో రాకెట్ పట్టి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఏడాది మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలోనూ సెమీఫైనల్‌కు చేరుకుంది. -
ఆయన రావద్దొంటూ దక్షిణ కొరియాలో నిరసనలు
సియోల్ : ఉత్తర కొరియా జాతీయ నిఘా విభాగం అధ్యక్షుడు కిమ్ యోంగ్ చోల్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టవద్దంటూ అక్కడ నిరసనకారులు ఆందోళనకు దిగారు. పియాంగ్‌చాంగ్‌లో జరిగే శీతాకాల ఒలంపిక్స్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉత్తర కొరియా నుంచి కిమ్ యోంగ్ చోల్ నేతృత్వంలో 8 మంది ఉన్నతస్థాయి అధికారుల బృందం ఆదివారం దక్షిణ కొరియాకు చేరుకుంది. 2010 సంవత్సరంలో దక్షిణ కొరియాకు చెందిన యుద్ధనౌకను అకారణంగా పేల్చివేసిన ఘటనలో 46 మంది సైనికులు చనిపోయారు. ఈ సంఘటనకు ప్రధాన సూత్రధారిగా కిమ్ యోంగ్ చోల్‌ను భావిస్తున్నారు. దీంతో ఆయన రాకను నిరసిస్తూ పాజులో అప్పుడు చనిపోయిన సైనికుల కుటుంబాలు, కొంత మంది చట్టసభ్యులు ఆందోళనకు దిగారు. కిమ్ యోంగ్ చోల్ పర్యటనపై ప్రజలు అసహనం ప్రదర్శిస్తున్నప్పటికీ రెండు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు, శాంతి భద్రతలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయన పర్యటనను ఆహ్వానించింది. ఫిభ్రవరి 9న జరిగిన ప్రారంభోత్సవానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్, ఉన్ ప్రభుత్వంలో కీలక అధికారి కిమ్ యోంగ్ నామ్ హాజరైన సంగతి తెల్సిందే. -
ముట్టుకుంటే మటాష్...!
-
ఆమె మహిళ.. అందుకే హత్య చేశా!
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు కిమ్(34) అనే హంతకుడు షాకింగ్ విషయం చెప్పాడు. 23 ఏళ్ల ఓ యువతిని హత్య చేసిన కిమ్.. ఆమె మహిళ అయినందుకే హత్య చేశానని విచారణలో తాపీగా చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు. వివరాల్లోకి వెళ్తే.. సియోల్‌లోని సియోచో ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లోని బాత్ రూంలో ఇటీవల ఓ మహిళ(23) దారుణంగా హత్యకు గురైంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ సహాయంతో హత్యకు పాల్పడింది ఆ అపార్ట్మెంట్లో పనిచేసే కిమ్‌గా గుర్తించారు. కిమ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అతడు మహిళా ద్వేషి అని, ఎటువంటి కారణం లేకుండానే.. ఆమె మహిళ అయినందునే హత్య చేశాడని తేలింది. పధకం ప్రకారం యువతి ఫ్లాట్‌లోకి కత్తితో ప్రవేశించిన కిమ్.. ఆమెను విచక్షణారహితంగా పొడిచిచంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల అక్కడ ఇదే తరహాలో లిఫ్టులో వెళ్తున్న ఓ మహిళను అకారణంగా ఓ యువకుడు చితకబాదాడు. -
జస్టిస్ వెంకట్రామిరెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అడపా వెంకట్రామిరెడ్డి (84) కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఎర్రగడ్డలోని హిందూ శ్మశాన వాటికలో గురువారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, మెల్లంపూడిలో ఆయన జన్మించారు. 1987 నుంచి 1993 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
వైల్డ్‌కార్డ్ ఎంట్రీ!
మరాఠీ స్క్రిప్ట్ రైటర్‌కు బంపర్ ఆఫర్ తగిలినట్టుంది. బిగ్‌బాస్ 8లో అతడికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ దక్కింది. అది కూడా అలా ఇలా కాదు... రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌తో కలసి నడుస్తూ..! ఇతగాడిని ఈ స్టారే పరిచయం చేస్తుందట. బిగ్ బాస్ హౌస్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వస్తున్న కిమ్... తాను ఎంతో ఉత్సుకతకు లోనవుతున్నానని చెబుతోంది. ‘నమస్తే ఇండియా. నా పేరు కిమ్ కర్దాషియన్. భారత్‌కు వస్తున్నా’ అంటూ ఓ సందర్భంలో వ్యాఖ్యానించింది. ఆ క్రమంలోనే ఫైజల్‌ను ఆమె పరిచయం చేయబుతున్నట్టు సమాచారం. -
అత్యంత శక్తిమంతమైన తల్లులుగా షకీరా, కిమ్
లండన్: అమెరికన్ నటీమణులు కిమ్ కర్దాషియన్, బియాన్స్ నావెల్స్, బ్రిటన్ మోడల్ విక్టోరియా బెక్‌హామ్, పాప్ గాయని షకీరా ఈ ఏడాది అత్యంత శక్తిమంతమైన 50 మంది తల్లుల జాబితాలో నిలిచారు. ‘మోస్ట్ పవర్ఫుల్ మామ్స్-2014’ పేరుతో ‘వర్కింగ్ మదర్’ మ్యాగజైన్ రూపొందించిన ఈ జాబితాలో క్రిస్టినా ఆగ్వీలిరా, కెర్రీ వాషింగ్టన్, టీనా ఫే, అమీ పోలర్, శాండ్రా బులాక్ వంటి సెలబ్రిటీలూ చోటు దక్కించుకున్నారు. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే వృత్తిపరంగా అత్యుత్తమ సామర్థ్యం చాటడం, వృత్తి జీవితాన్ని, మాతత్వ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రతిభ కనపర్చడం వంటి అంశాల ఆధారంగా స్ఫూర్తిదాయకమైన మహిళలతో ఈ జాబితాను రూపొందించినట్లు మ్యాగజైన్ వర్గాలు వెల్లడించాయి.