ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దేశంలో జననాల రేటు దారుణంగా క్షీణించడమే ఇందుకు కారణం. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. దయచేసి ఎక్కువ పిల్లల్ని కనండి అంటూ కన్నీరు కార్చారు.
Kim Jong Un CRIES while telling North Korean women to have more babies.
— Oli London (@OliLondonTV) December 5, 2023
The dictator shed tears while speaking at the National Mothers Meeting as he urged women to boost the countries birth rate. pic.twitter.com/J354CyVnln
ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికితోడు 1990లో తీవ్ర కరువు ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాభా రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. ఉత్తరకొరియాలో జననాల సంఖ్య భారీ స్థాయిలో క్షీణించింది. 2023లో జననాల రేటు 1.8 ఉంది. ఉత్తర కొరియా జనాభా 2034 నుండి ఘణనీయంగా తగ్గిపోతుందని హ్యుందాయ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. 2070 నాటికి జనాభా 23.7 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది. పక్కనే ఉన్న దక్షిణ కొరియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉంది. పిల్లల సంరక్షణ, పిల్లల చదువులు, కార్పొరేట్ సంస్కృతి వంటి కారణాలు జననాల రేటుపై ప్రభావం చూపుతున్నాయి.
జననాల సంఖ్యను పెంచడానికి కిమ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది పిల్లల కోసం ప్రిఫరెన్షియల్ ఉచిత హౌసింగ్ ఏర్పాట్లు, సబ్సిడీలు, ఉచిత ఆహారం, వైద్యం, గృహోపకరణాలు, విద్యాపరమైన ప్రోత్సాహకాలను అందిస్తోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేక రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
ఇదీ చదవండి: అదే రోజున పార్లమెంట్‌పై దాడి.! భారత్‌కు పన్నూ బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment