papulation
-
కిమ్ కంట కన్నీరు.. ఎందుకంటే..?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దేశంలో జననాల రేటు దారుణంగా క్షీణించడమే ఇందుకు కారణం. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. దయచేసి ఎక్కువ పిల్లల్ని కనండి అంటూ కన్నీరు కార్చారు. Kim Jong Un CRIES while telling North Korean women to have more babies. The dictator shed tears while speaking at the National Mothers Meeting as he urged women to boost the countries birth rate. pic.twitter.com/J354CyVnln — Oli London (@OliLondonTV) December 5, 2023 ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికితోడు 1990లో తీవ్ర కరువు ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాభా రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. ఉత్తరకొరియాలో జననాల సంఖ్య భారీ స్థాయిలో క్షీణించింది. 2023లో జననాల రేటు 1.8 ఉంది. ఉత్తర కొరియా జనాభా 2034 నుండి ఘణనీయంగా తగ్గిపోతుందని హ్యుందాయ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. 2070 నాటికి జనాభా 23.7 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది. పక్కనే ఉన్న దక్షిణ కొరియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉంది. పిల్లల సంరక్షణ, పిల్లల చదువులు, కార్పొరేట్ సంస్కృతి వంటి కారణాలు జననాల రేటుపై ప్రభావం చూపుతున్నాయి. జననాల సంఖ్యను పెంచడానికి కిమ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది పిల్లల కోసం ప్రిఫరెన్షియల్ ఉచిత హౌసింగ్ ఏర్పాట్లు, సబ్సిడీలు, ఉచిత ఆహారం, వైద్యం, గృహోపకరణాలు, విద్యాపరమైన ప్రోత్సాహకాలను అందిస్తోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేక రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: అదే రోజున పార్లమెంట్‌పై దాడి.! భారత్‌కు పన్నూ బెదిరింపులు -
ఎనిమిది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి: పుతిన్
మాస్కో: రష్యా జనాభాను పెంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. మహిళలు ఎనిమిది మంది అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కనాలని, పెద్ద కుటుంబాలను ఏర్పరచాలని కోరారు. మంగళవారం మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్లో ప్రసంగించారు. "మన పూర్వికులు చాలా మంది పిల్లలను కలిగి ఉండేవారు. మన అమ్మమ్మలు, ముత్తాతలలో చాలా మంది ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి. వారంతా సాంప్రదాయక వారసత్వాన్ని కాపాడుకున్నారు. పెద్ద కుటుంబాలను ఏర్పరచడం మనకు ప్రస్తుతం తప్పనిసరి అవసరం. మన జాతి పునాదులకే గాక ఆద్యాత్మిక వారసత్వానికి ఇది ఎంతో ముఖ్యం" అని పుతిన్ అన్నారు. రష్యాలో గత కొన్ని ఏళ్లుగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్ధంలోనూ భారీ సంఖ్యలోనే మృతి చెందారు. ఈ వివరాలను పుతిన్ ప్రస్తావించలేదు కానీ ప్రస్తుతం జనాభా ఆవశ్యకతకు ఇది కూడా ముడిపడి ఉంది. రష్యా జననాల రేటు 1990ల నుండి గణనీయంగా పడిపోతోంది. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 3,00,000 వరకు ఉండవచ్చని నిపుణుల అంచానా. రష్యా విధానాలు నచ్చక 8,20,000-9,20,000 మంది ప్రజలు రష్యాను వీడి పారిపోయారని సమాచారం. ఇదీ చదవండి: 'పన్నూ హత్య కుట్ర కేసుపై అమెరికా సీరియస్' -
యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత?
ఇజ్రాయెల్- తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు వేలాది మంది మరణించారు. ఆకస్మిక దాడి నేపధ్యంలో ఇజ్రాయెల్ ఈసారి హమాస్‌ను ఉనికిని నాశనం చేయనున్నామని ప్రకటించింది. అదే సమయంలో హమాస్ కూడా అలుపెరగని దాడి కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడం ఇది మొదటిది కాదు. ఇంతకు ముందు కూడా హమాస్ ఇటువంటి దాడులకు పాల్పడింది. ఈ దాడులకు ఇజ్రాయెల్ కూడా తగిన సమాధానం ఇస్తూనే వస్తోంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యూదులు నివసించే ఏకైక దేశం ఇజ్రాయెల్. 1948లో యూదులు తమకంటూ ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో ముస్లిం పొరుగు దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు శత్రువులుగా మారాయి. ఇజ్రాయెల్ పలుమార్లు దాడులకు గురయ్యింది. కానీ ఈ చిన్న దేశం తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. దీంతో శత్రువులు ఇజ్రాయెల్‌ను దెబ్బతీయలేకపోతున్నారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 70 లక్షల మంది యూదులు ఉన్నారు. ఇది ఇక్కడి మొత్తం జనాభాలో దాదాపు 74%. ఇక ప్రపంచంలోని మొత్తం యూదుల జనాభా విషయానికొస్తే దాదాపు ఒక కోటి 74 లక్షలు. అంటే ప్రపంచంలోని యూదు జనాభాలో 43 శాతం మంది ఇజ్రాయెల్‌లోనే నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ కాకుండా ప్రపంచంలోని ఏ దేశాలలో యూదులు నివసిస్తున్నారనే విషయానికొస్తే అమెరికాతో పాటు కెనడాలో అత్యధిక సంఖ్యలో యూదులు నివసిస్తున్నారు. ఈ రెండు దేశాల్లో దాదాపు 43 శాతం యూదులు నివసిస్తున్నారు. మిగిలిన 24 శాతం యూదులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ, ముంబైలలో ‘ఇజ్రాయెల్ అడ్డా’? యూదులకు ప్రత్యేక రక్షణ ఎందుకు? -
‘సోలో బతుకే సో బెటరూ’.. ఇపుడిదే ట్రెండ్ బాసూ!
ప్రపంచవ్యాప్తంగా జనాభా గడచిన రెండు శతాబ్దాల్లో 8 రెట్లు పెరిగింది. వైద్య, సాంకేతిక, శాస్త్ర రంగాల్లో మానవుడు సాధించిన ప్రగతి సంపదను పెంచింది. దారిద్య్రాన్ని గణనీయంగా తగ్గించింది. మనిషి సగటు ఆయుప్రమాణాలు కూడా అంతటా పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం అందించిన స్వేచ్ఛా స్వాతంత్య్రాల ఫలితంగా నేడు కొందరు స్త్రీపురుషులు పెళ్లిచేసుకున్నాక విడాకులు తీసుకునో లేక వివాహం జోలికి పోకుండానో ఒంటరిగా తమ ఇళ్లలో జీవిస్తున్నారు. ఇలాంటి ఏకాకి బతుకులు లేదా కుటుంబాల సంఖ్య మంచి ప్రగతి సాధించిన దేశాల్లో ఓ మోస్తరు వేగంతో పెరుగుతోంది. అన్ని రంగాల్లో ఎదురులేని అభివృద్ధి సాధించిన అమెరికాలో ‘ఏకసభ్య’ కుటుంబాలు మన ఊహకు అందని స్థాయిలో ఉన్నాయి. దాదాపు 30 శాతం అమెరికా కుటుంబాల్లో ఒక్కొక్కరే సభ్యులు. ఈ ‘ఒంటరి బతుకులు’ ఒక్క అమెరికాలో మాత్రమే కనిపించే విలక్షణ ధోరణి కాదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తమ నివాసాల్లో ఒంటరిగా బతుకుతున్న మనుషుల లేదా ‘కుటుంబాల’ సంఖ్య చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎక్కువ ఉంది. అమెరికా జనాభా లెక్కల ప్రకారం–1940లో ఇలాంటి ‘ఏకాకి కుటుంబాలు’ 8శాతం ఉండగా, 1970 నాటికి రెట్టింపయి 18శాతానికి పెరిగాయి. 2022 కల్లా ఏకసభ్య అమెరికా కుటుంబాల సంఖ్య మూడు రెట్లకు పెరిగి 29 శాతానికి చేరింది. ‘ఇది దిగ్భ్రాంతి కలిగించే సామాజిక మార్పు. కిందటి శతాబ్దంలో జనాభాకు సంబంధించి ఇది అతి పెద్ద మార్పు. దీన్ని మనం అప్పుడు గుర్తించలేకపోయాం,’ అని ఈ అంశంపై ‘గోయింగ్ సోలో’ అనే గ్రంథం రాసిన న్యూయార్క్ యూనివర్సిటీ సామాజికశాస్త్రవేత్త ఎరిక్ క్లినెన్ బర్గ్ వ్యాఖ్యానించారు. ‘సోలో బతుకే సో బెటరూ’ అనే తెలుగు సినిమా పాట చెప్పిన విధంగా అమెరికాలో కొందరు జీవించడంతోపాటు అక్కడ ఆలస్యంగా పెళ్లిచేసుకోవడమనే ధోరణి ఈమధ్య పెరిగింది. దేశంలో మహిళా సాధికారత పెరగడం తమ జీవితాల్లోని అన్ని విషయాల్లో వారు స్వయంగా నిర్ణయం తీసుకునే దశకు ఎదగడం కూడా అమెరికాలో స్త్రీ, పురుషుల్లో మూడో వంతు ఒంటరిగా జీవించడానికి ప్రధాన కారణమని క్లినెన్ బర్గ్ వివరించారు. ఆధునిక పాశ్యాత్య పారిశ్రామిక దేశాల్లో ఇదే ట్రెండ్! ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఐరోపాలో బాగా సంపన్న, సంక్షేమ దేశాల్లో ఒంటరి జీవితాలు లేదా కుటుంబాలు వేగంగా పెరుగుతున్నాయి. డెన్మార్క్ లో 39శాతం, ఫిన్లాండ్ లో 45శాతం , నెదర్లాండ్స్ లో 38శాతం, నార్వేలో 39శాతం, స్వీడన్ లో 40శాతం కుటుంబాల్లో ఒక్కొక్కరే సభ్యులు. సంపద, విద్య, జ్ఞానం పెరిగే మంచి ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి ఒంటరి బతుకులు సామాజిక శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఐరోపా దేశాల్లోనే అమెరికాలో కన్నా ‘సోలో బతుకులు’ ఎక్కువ. అమెరికాలో ఇంకా వివాహ వ్యవస్థకు గొప్ప గౌరవం ఉంది. ఒంటరిగా జీవిస్తున్న వారిపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనం ఆందోళన కలిగించే అంశాలు వెల్లడించింది. ఒంటరిగా బతుకుతూ వృద్ధాప్యం మీదపడుతున్న వ్యక్తుల శారీరక ఆరోగ్యం, మానసిక స్థితిగతులు త్వరగా క్షీణించడమేగాక వారు అల్పాయుష్కులవు తున్నారని ఈ పత్రిక తెలిపింది. గతంలో ఉమ్మడి కుటుంబాలకు ఇప్పుడు చిన్న కుటుంబ వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చే భారతదేశంలో సైతం ఆధునిక అభివృద్ధితో పాటు ‘సోలో కుటుంబాల’ సంఖ్య కొద్ది కొద్దిగా పెరగడాన్ని సామాజికవేత్తలు గుర్తిస్తున్నారు. 2019-2020 ఐరాస మహిళా విభాగం నివేదిక ప్రకారం-ఇండియాలో పైన వివరించిన ఏకసభ్య కుటుంబాలు 12 శాతం వరకూ ఉన్నాయి. దేశంలో మొదటి నుంచీ పెళ్లి చేసుకోవడాన్ని ప్రోత్సహించే సంప్రదాయం ఉంది. వివాహితులకు అదనపు గౌరవం సమాజంలో లభిస్తుంది. పెళ్లిచేసుకోనివారికి లేదా జీవిత భాగస్వామి లేని ఒంటరి వ్యక్తులకు అద్దె ఇళ్లు కూడా తేలికగా దొరకవు. ప్రభుత్వాలు తక్కువ మంది పిల్లలను కనాలని చెబుతాయేగాని, అసలు పెళ్లే చేసుకోవద్దని సలహా ఇవ్వవు. అయినా స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడిన జీవనశైలి కారణంగా భారతదేశంలోనూ సోలో కుటుంబాలు నెమ్మదిగా పెరగడం ప్రపంచీకరణకు సంకేతమని కొందరు నిపుణులు అభిప్రాయపడు తున్నారు. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
కేంద్రం మరో సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ఒకవైపు దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీ ప్రకంపనల తీవ్రత కొనసాగుతుండగానే కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నవీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8700 కోట్లను కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ ప్రతిపాదనను ఆమోదించిందిందని పీటీఐ నివేదించింది. మొదట ఎన్పీఆర్ను రూపొందించి ఆ తర్వాత ఎన్ఆర్సీ అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ భావిస్తోంది. ఒకసారి ఎన్పీఆర్ తయారైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్-ఎన్ఆర్సీ)ని రూపొందించనుంది.దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్పీఆర్ లక్ష్యం. ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇస్తారు. అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2020 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య ఎన్పీఆర్ ప్రక్రియ జరగనుంది. దేశంలోని ప్రతి "సాధారణ నివాసి" సమగ్ర గుర్తింపు డేటాబేస్‌ను రూపొందించడం ఎన్పీఆర్ లక్ష్యం అని సెన్సస్ కమిషన్ తెలిపింది. -
జనాభా పట్ల మోదీకి ఎందుకు ఆందోళన?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న అధిక జనాభాను అరికట్టాల్సిన అవసరం ఉందని, అధిక జనాభా అభివద్ధికి ఆటంకం అని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు. అంతేకాకుండా చిన్న కుటుంబం కలిగి ఉండటం దేశభక్తిలో భాగమే అని కూడా చాటి చెప్పారు. ఆరేడు దశాబ్దాల అనంతరం దేశంలో పెరుగుతున్న జనాభా గురించి ప్రధాన మంత్రి మాట్లాడడం మొదటి సారి అవడం వల్ల జనాభా నియంత్రణకు జాతీయ స్థాయిలో ఓ చట్టాన్ని తీసుకొస్తారన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు నేడు దేశం అధిక జనాభా సమస్యను ఎదుర్కొంటుందా ? 1981 జనాభా (సెన్సెస్) లెక్కల నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సెన్సెస్లలోనూ జనాభా వద్ధి రేటు తగ్గుతూ వస్తోందన్న విషయమే స్పష్టమైంది. 1991 నుంచి 2001 మధ్య దేశ జనాభా 21.5 శాతం పెరగ్గా, 2001 నుంచి 2011 సంవత్సరాల మధ్య జనాభా 17.7 శాతం పెరిగింది. ఆ తర్వాత సెన్సెస్ జరగలేదు. కానీ 2018–2019 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆర్థిక సర్వేలో జనాభా వద్ధి రేటు 2021 నుంచి 2041 మధ్య 12. 1 శాతం ఉంటుందని అంచనా వేశారు. భారత్‌లో దేశ జనాభా వృద్ధి రేటు ఏడాదికి ఒక్క శాతం మాత్రమే ఉందని ఐక్యరాజ్య సమితిలోని జనాభా విభాగం లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇరాన్, చీలీ, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ దేశాల కన్నా భారత్‌లో జనాభా వృద్ధి రేటు తక్కువ ఉందని ఆ లెక్కలు పేర్కొన్నాయి. దేశంలో జనాభా వద్ధి రేటు తగ్గడానికి ప్రజల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడమే ప్రధాన కారణం. 1971లో భారతీయ మహిళ సగటున 5.2 శాతం పిల్లలను కలిగి ఉండగా, అది 2017 నాటికి 2.1 శాతానికి పడిపోయింది. ఒకప్పుడు దేశ జనాభా వద్ధి రేటును సగటున 2.1 నియంత్రించాలని, అందుకు భారీ ఎత్తున కుటుంబ నియంత్రణా ఆపరేషన్లను నిర్వహించాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ఎలాంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అవసరం లేకుండా ప్రకతి సిద్ధంగా జనాభా వృద్ధి రేటు పడిపోయింది. జనాభా వృద్ధి రేటు తగ్గడం వల్ల నేడు మగవారితో పోలిస్తే మహిళల సంఖ్య బాగా తగ్గింది. ఈ కారణంగా జనాభా వృద్ధి ‘రిప్లేస్మెంట్ (ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన)’ రేటు కనీసం 2.2 ఉండాలని భావించారు. అంతకన్నా తగ్గి పోవడం వల్లనే దేశంలో మహిళల సంఖ్య బాగా తగ్గిందన్నది నిపుణుల అంచనా. ఐక్యరాజ్య సమితి కూడా భారత్‌లో జనాభా వృద్ధి రేటును కనీసంగా 2.2 ఉండాలని కోరుకుంటోంది. 2021 సంవత్సరం నాటికి దేశంలో జనాభా వృద్ధి రేటు 1.8 శాతానికి పడిపోతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనాలు తెలియజేస్తున్నాయి. ఆ లెక్కన దేశానికి కావాల్సిన జనాభా కన్నా బాగా పడిపోతోంది. దీనివల్ల స్త్రీ, పురుషుల సంఖ్య మధ్య కూడా వ్యత్యాసం మరింత పెరిగి కల్లోల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండే యూపీ, బీహార్లలో కూడా ఆడపిల్లల సంతానం తగ్గిపోవడం ఆందోళనకరమైన విషయం. చైనాలో కూడా ఇప్పుడు సంతోనోత్పత్తి రేటు 1.7 శాతానికి పడిపోయింది. అందుకని వారు కూడా ఇప్పుడు ‘కుటుంబానికి ఒక్కటే సంతానం’ అనే విధానాన్ని పునర్ పరిశీలించాలని భావిస్తున్నారు. తమ దేశాల్లో తక్కువ సంతాన వృద్ధి రేటు పట్ల బెల్జియం, డెన్మార్క్, నార్వే దేశాలు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత దేశంలోని ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించక పోవడం పట్ల వారి జనాభా నానాటికి పెరుగుతోందని, హిందువుల సంఖ్య తగ్గుతోందని సంఘ్ పరివార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. హిందూ కుటుంబాలు నలుగురేసి పిల్లలను కనాలని కూడా సంఘ్ నాయకులు పిలుపునిచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ జనాభా నియంత్రణ గురించి ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. తన ప్రభుత్వం హయాంలో నానాటికి పడిపోతున్న ఆర్థిక వృద్ధి రేటును జనాభా నియంత్రణతోని సమతౌల్యం చేయాలనుకుంటున్నారా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలోని ముస్లింలలో కూడా జనాభా వృద్ధి రేటు పడిపోతోంది. 1992–93 సంవత్సరంలో ముస్లిం మహిళల్లో సంతానోత్పత్తి రేటు సగటున 4.41 శాతం ఉండగా, ఇప్పుడది 1.17 శాతానికి పడిపోయింది. -
ఒక్క మగాడూ లేడు!
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే కేవలం మహిళలే ముందుకు వస్తున్నారు. దీనికి పురుషులు ఆమడ దూరం ఉంటున్నారు. జిల్లాలో వేసక్టమీ ఆపరేషన్ చేయించుకునే మగవారి సంఖ్య కనీసం నమోదు కూడా కావడం లేదు. ఆరేళ్లలో ఒక్క మగాడూ ఈ ఆపరేషన్ చేయించుకోలేదంటే పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ప్రస్తుత అంచనా ప్రకారం 44లక్షలకు పైగా జనాభా ఉంది. 2001లో 40లక్షలు ఉన్న జనాభా 2011 జనాభా లెక్కల నాటికి 44లక్షలకు చేరుకుంది. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రోత్సహిస్తోంది. 30 ఏళ్ల క్రితం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు చాలంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత పదేళ్లకు ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలే ముద్దంటూ ప్రచారం తెచ్చింది. ఈ మేరకు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పీపీ యూనిట్లతో పాటు ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, బేతంచర్ల, డోన్, నందికొట్కూరు, గూడూరు, గార్గేయపురం, డోన్‌తో పాటు కర్నూలులోని గడియారం ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి పీహెచ్సీలో కు.ని. ఆపరేషన్లు నిర్వహించాలి. ప్రస్తుతం కోసిగి, దేవనకొండ, కల్లూరు, బండి ఆత్మకూరు, గోనెగండ్ల పీహెచ్‌సీల్లో మాత్రమే చేస్తున్నారు. కొన్ని పీహెచ్‌సీల్లో మత్తుమందు డాక్టర్ల కొరత ఉంది. క్యాంపుల ఊసే లేదు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు గాను గతంలో ప్రత్యేకంగా జిల్లాలో క్యాంపులు నిర్వహించేవారు. ప్రతి సంవత్సరం 35వేల మందికి కు.ని. ఆపరేషన్లు చేయాలని లక్ష్యంగా ఉండేది. ఆపరేషన్ చేయించుకునే వారికి ప్రోత్సాహక నగదుతోపాటు వారికి రాను, పోను రవాణా ఛార్జీలు, పసుపు, కుంకుమ, చీర ఇచ్చి సత్కరించేవారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక లక్ష్యం ఎత్తేశారు. ఎవ్వరైనా కు.ని. ఆపరేషన్ చేయించుకోవడానికి ముందుకు వస్తే వారికి మాత్రమే శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో ఆసుపత్రులకు వచ్చిన వారికి మాత్రమే ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. అయితే కోత, కుట్టు తక్కువగా ఉన్నా బటన్హోల్ ఆపరేషన్లు చేయించుకునేందుకు ఎక్కువ మంది మహిళలు ముందుకు రావడం లేదు. మగవాళ్లలో అపోహ.. జిల్లాలో 2013 నుంచి ఇప్పటి వరకు ఒక్క మగాడూ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్(వేసక్టమీ) చేయించుకోలేదు. ఇప్పటి వరకు మహిళలే ఆపరేషన్ చేయించుకుంటూ వచ్చారు. కోత, కుట్టు లేకపోయినా, రక్తస్రావం రాకపోయినా, ఆపరేషన్ అనంతరం సంసార జీవితానికి ఎలాంటి ఢోకా లేకపోయినా, మగవారు ఈ ఆపరేషన్ చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ ఆపరేషన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను తొలగించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మరో 40 కోట్ల మందికి తిండెట్లా?
న్యూఢిల్లీ: భారత జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 సంవత్సరం నాటికి దేశ జనాభా 170 కోట్లకు చేరుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం 129 కోట్లతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగా ఉంది. 132 కోట్ల జనాభాతో చైనా మొదటి స్థానంలో ఉంది. 2050 నాటికి భారత దేశమే జనాభాలో నెంబర్ వన్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ విషయంలో భారత్ ఇప్పటికే నెంబర్ వన్ అని, 128 కోట్ల జనాభాతో చైనానే రెండవ స్థానంలో ఉందన్న వాదన కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనా అంత జనాభాకు, అంటే అదనంగా పెరిగే 41 కోట్ల మందికి ఆహారాన్ని సమకూర్చడం ఎలా అన్నది అసలు సమస్య. ఈ అంశంపై ఇప్పటి నుంచి దృష్టి సారిస్తే తప్పా రానున్న సమస్యను అధిగమించలేం. రానున్న కాలంలో మరో 40 కోట్ల మందికి ఆహారాన్ని అందించాలంటే దేశంలో తృణ ధాన్యాల ఉత్పత్తి 4.6 శాతం పెరగాలని వృవసాయ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉత్పత్తవుతున్న తృణ ధాన్యాలు రెట్టింపు కావాలి. రోజు రోజుకు సాగు భూములు తరగిపోతున్న నేపథ్యంలో అధిగ దిగుబడి ఒక్కటే మార్గం. ఆ అధిక దిగుబడికి ఏం చేయాలన్నది కీలకమైన ప్రశ్న. పాశ్చాత్య దేశాల్లో లాగా కాకుండా భారత్ ఇప్పటికే వ్యవసాయాధారిత దేశమే. దేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో కూడా వ్యయసాయ ఉత్పత్తులే 18 శాతం ఆక్రమిస్తున్నాయి. 2000–01 సంవత్సరం సెన్సెస్ ప్రకారం దేశంలో 5.81 కోట్ల హెక్టార్ల భూమి మాత్రమే సాగయింది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం దేశంలో వ్యవసాయ యోగ్యమైన భూమి దేశంలో 16 కోట్ల హెక్టార్లు ఉంది. అంటే ఇంకా మూడింతలు వ్యవసాయాన్ని పెంచవచ్చన్న మాట. వాటికి జల వనరులు అవసరం. జల వనరులు అందుబాటులో లేకనే ఎక్కువ భూములు నిరుపయోగంగా పడి ఉన్నాయి. దేశంలో చాలా కాలం నుంచి భూసంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు చోటు చేసుకోకపోవడం వల్ల పేద, సన్నకారు, మధ్యకారు రైతులే ఎక్కువ ఉన్నారు. ఒకటి, రెండు ఎకరాలున్న రైతులు దిగుబడి పెంచేందుకు ఆధునిక వ్యవసాయం చేయలేరు. సహకార వ్యవసాయమన్నది మన దేశంలో ఎక్కడోగాని లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. దానికి అనుగుణంగా అవసరమైతే భూ సంస్కరణలు తీసుక రావాలి. దిగుబడిని పెంచేందుకు కొత్త దారులు అన్వేషించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. -
సర్వే చిత్రం - జనమే జనం
ఉద్యోగం కోసం... ఉపాధి కోసం వలస వచ్చేవారికి మేమున్నానంటూ గ్రేటర్‌లోని శివారు ప్రాంతాలు ఆశ్రయమిస్తున్నాయి. అక్కున చేర్చుకుంటున్నాయి. గూడు కల్పిస్తున్నాయి... ఫలితంగా ఆ ప్రాంతాల్లో జనాభా పెరుగుతోంది. అదీ మామూలుగా కాదు... జెట్ స్పీడుతో. ఇదేదో అంచనాతో చెబుతున్న మాట కాదు.. సమగ్ర కుటుంబ సర్వే సాక్షిగా వెల్లడైన వాస్తవం. నగరంలో భారమైన అద్దెలు...పెరుగుతున్న కాలుష్యం...వెరసి జనాలను శివారు బాట పట్టిస్తున్నాయి. హైదరాబాద్: గ్రేటర్‌లోని శివారు ప్రాంతాల్లో గడచిన మూడేళ్లలో జనాభా విపరీతంగా పెరిగింది. అనేక ప్రాంతాల్లో దాదాపు రెండింతలైంది. కోర్ సిటీ కంటే శివార్లలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. ఎల్బీనగర్లో మూడేళ్ల క్రితం 1,39,419 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం అవి 2,26,796కు చేరాయి. కుత్బుల్లాపూర్, కూకట్పల్లిల్లోనూ గణనీయంగా కుటుంబాలు పెరిగాయి. కుత్బుల్లాపూర్‌లో గతంలో 94,875 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 1.80 లక్షలకు చేరాయి. అంటే సంఖ్య దాదాపు రెట్టిం పైంది. కూకట్‌పల్లిలో 1,27,655 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 2,10, 343కు పెరిగాయి. సగటున కుటుంబానికి నలుగురిని లెక్కేసుకున్నా నాలుగు లక్షల జనాభా పెరిగింది. ఉప్పల్ సర్కిల్లో మాత్రం పెరుగుదల స్వల్పంగా నమోదైంది. గతంలో 41,188 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 6,441 కుటుంబాలు పెరిగి, మొత్తం 47, 629కు చేరుకున్నాయి. శేరిలింగంపల్లి-2, మల్కాజిగిరి సర్కిళ్లలో 40 వేలకు పైగా పెరిగాయి. చాలా కుటుంబాల వారు ఉమ్మడిగా ఉంటున్నప్పటికీ.. జనగణనలో విడివిడిగా నమోదు చేయించుకున్నా రు. సమగ్ర కుటుంబ సర్వేలో పేరు నమోదు చేయించుకోని పక్షంలో భవిష్యత్‌లో గ్యాస్, పాస్‌పోర్టు వంటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతాయేమోననే తలంపుతో ప్రజలు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు. కోర్‌సిటీలోని ఖైరతాబాద్, అబిడ్స్ వంటి సర్కిళ్లలో పెరుగుదల పెద్దగా లేదు. వలస వచ్చే కుటుంబాలు.. జీవనోపాధి కోసం వచ్చేవారు శివారుల్లోనేఎక్కువగా ఉంటుండటం తో ఈ పరిస్థితి నెలకొంది. శివార్లలో లెక్కకు మిక్కిలి ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు కూడా అక్కడ జనా భా పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. పిల్ల ల చదువుల కోసం పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వారు శివార్లలో నివాసం ఏర్పాటు చేసుకోవడం ఇం దుకు కారణంగా చెబుతున్నారు. కోర్‌సిటీలో అద్దెల భారంతో పాటు కొత్త నిర్మాణాలు లేనందున అద్దెకు ఇళ్లు దొరకడం కూడా కష్టం కావడంతో నగరానికి వలస వచ్చేవారు శివార్లకే మొగ్గు చూపుతున్నారు.