లక్నో: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పలు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో గల రామ్‌గఢ్, యూపీలోని మొరాదాబాద్ జిల్లాలోని కుందర్కి సీటు ఒక ప్రత్యేకతను దక్కించుకున్నాయి. ముస్లింల ప్రాబల్యం కలిగిన ఈ స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది.
ఈ పరిణామంపై పలువురు రాజకీయ నిపుణులు పలు విధాలుగా విశ్లేషణ చేస్తున్నారు. ఇది దేశంలో మారుతున్న ఓటర్ల సెంటిమెంట్‌ను తెలియజేసే విజయమని వారంటున్నారు. అలాగే రానున్న కాలంలో ఎన్నికల రాజకీయాలు శరవేగంగా మారబోతున్నాయనడానికి ఇది ఉదాహరణ అని చెబుతున్నారు. రామ్‌గఢ్ సీటు మేవాట్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ముస్లిం జనాభా అత్యధికం. అలాగే పంజాబీ, రాజ్‌పుత్, బనియా, సిక్కు, ఎస్సీలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడి రాజకీయాలన్నీ హిందూ-ముస్లిం వాదనపైనే ఆధారపడి ఉన్నాయి. ఇక కుందర్కి కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఇక్కడ జనాభాలో 60 శాతం ముస్లింలు ఉన్నారు. ఈ సీటును చివరిసారిగా 1993లో బీజేపీ గెలుచుకుంది. ముస్లిం మహిళల్లో గణనీయమైన వర్గం బీజేపీకి ఓటు వేస్తున్నట్లు అనేక సర్వేలు పేర్కొన్నాయి.
దేశ రాజకీయాల్లో అఖిలేష్ యాదవ్, లాలూ యాదవ్, మమతా బెనర్జీలు తమ తమ రాష్ట్రాల్లోని ముస్లిం ఓటు బ్యాంకుపై గుత్తాధిపత్యం కలిగిన నాయకులుగా గుర్తింపు పొందారు. ఈ ముగ్గురు నేతలు ఉంటున్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ముస్లిం జనాభా అధికంగానే ఉంది. కాగా యూపీ, బీహార్‌లో అఖిలేష్, లాలూ యాదవ్‌ల పార్టీలు చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాల ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలేష్, లాలూ యాదవ్‌ల రాజకీయాలకు అడ్డుకట్ట పడినట్లయ్యింది. మైనారిటీ ఆధిపత్య స్థానాలపై బీజేపీ సాధించిన విజయాన్ని చూస్తుంటే భవిష్యత్తులో అఖిలేష్, లాలూల రాజకీయాలకు తాళం పడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ
Comments
Please login to add a commentAdd a comment