మైనారిటీలకు మేడిపండు సంక్షేమం! | all the glitters are not gold | Sakshi
Sakshi News home page

మైనారిటీలకు మేడిపండు సంక్షేమం!

Published Sun, Nov 10 2013 12:13 AM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

మైనారిటీలకు మేడిపండు సంక్షేమం! - Sakshi

మైనారిటీలకు మేడిపండు సంక్షేమం!

 ముస్లిం మైనారిటీలు జాగృతం కావడం నేటి అవసరం. వారు తమ సంక్షేమాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు పణంగా పెట్టవలసిన అవసరం లేదు. హక్కులు సాధించుకునే దిశగా జ్రసంకల్పులు కావాలి. తమను సరిగా అర్థం చేసుకోగలిగి, న్యాయమైన వాటాను షరతుల్లే కుండా అంగీకరించే ప్రజాస్వామ్య, లౌకికవాద పార్టీలలకు చేయూతనివ్వాలి.
 
 స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు గడిచాయి. అయినా ముస్లిం మైనారిటీల స్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న సామెతను తలపిస్తోంది. ఈ కాలంలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిన మాట వాస్తవం. కాని స్వాతంత్య్ర ఫలాలు మైనారిటీలకు అందని ద్రాక్షలే. స్వాతంత్య్రానికి పూర్వం ఈ సముదాయం స్థితిగతులు ఎలా ఉండేవో, ఈ నాటికీ అలాగే ఉన్నాయి. నేటికీ ఎక్కువ శాతం మైనారిటీలు  సైకిళ్లకు పంచర్లు, బిందెలకు మాట్లు, గొడుగులూ తాళాల మరమ్మతులు, హమాలీ, రిక్షా కార్మికులుగా, ఫుట్‌పాత్ వ్యాపారాలు వం టి చిన్న చిన్న వృత్తులకే పరిమితమై ఉన్నారు. సొంత వ్యవ సాయాలు లేవు. మురికివాడల్లో, గుడిసెల్లోనే నివాసం. అత్యధిక శాతం మందికి అలాంటి గూళ్లు కూడా లేవు. వేళ్ల పైనే లెక్కించగలిగే కొద్ది మందికి సొంత వ్యవసాయాలు, వ్యాపారాలు, ఇళ్లు ఉన్నాయి.
 
 విద్య, ఉద్యోగావకాశాలలో అయితే చివరి బంతే. ఏ సంక్షేమ పథకాలూ అందవు. అందుకొనే చైతన్యమూ వారిలో లేదు. విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో ముస్లిం మైనారిటీలు ఏ విధంగానూ మెరు గ్గాలేరని అనేక సర్వేలు తేటతెల్లం చేశాయి.ఇక్కడి ముస్లిం జనాభాలో 63.7 శాతం మంది దారి ద్య్రరేఖకు దిగువనే జీవిస్తున్నారు. దీనికి కారణం విద్య లేమి. 5-9 ఏళ్ల పిల్లల్లో 49 శాతం మాత్రమే పాఠశాలకు వెళుతున్నారు. మధ్యలో మానేస్తున్న పిల్లల జాబితాలో కూడా ముస్లింల పిల్లలే అధికం. ముస్లిం మైనారిటీల వెను కబాటుకు, దుర్భర దారిద్య్రానికి, తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోలేకపోవడానికి ఆర్థిక వెనుకబాటే కారణం. సర్కారు బడులు బాధ్యతాయుతంగా పనిచే యవు. కార్పొరేట్ పాఠశాలల్లో చేర్చడానికి ఆర్థిక స్థోమత సహకరించదు. ఇదీ పరిస్థితి.
 ఉద్యోగాల విషయమూ అంతే. 2004-05లో హిం దూ సోదరులు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35.3 శాతం, ప్రైవేట్ సెక్టార్‌లో 13.9 శాతం ఉన్నారు. ముస్లింలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 23.7 శాతం, ప్రైవేట్ సెక్టార్‌లో 9.5 శాతం ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 39.4 శాతం, ప్రైవేట్ సెక్టార్‌లో 9.5 శాతం ఉన్నారు.
 
  ఓబీసీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30.4 శాతం, ప్రైవేట్‌రంగంలో 12.8, ఇతరు లు 37.4 శాతం ఉన్నారు.  సచార్ కమిటీ నివేదిక ప్రకారం ఉన్నత స్థాయి ఉద్యోగాలలో ముస్లింలకు  ఐఏఎస్‌లలో 3.0 శాతం, ఐఎఫ్‌ఎస్‌లలో 1.8 శాతం, ఐపీఎస్‌లలో  4.0 శాతం, రైల్వేలో 4.5 శాతం, పోలీస్‌శాఖలో 6.0 శాతం, ఆరోగ్యశాఖలో 4 శాతం, రవాణాశాఖలో 6.5 శాతం, న్యాయశాఖలో 7.8 శాతం ప్రాతినిధ్యం ఉంది. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ముస్లిం మైనారిటీలకు తగిన అవకాశాలు ఇప్పటికీ లేవు. లోక్‌సభ, రాజ్యసభలలో ఉండే 776 సభ్యులలో ముస్లింలు కేవలం యాభై మూడు మంది. 233 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో ఇరవై నాలుగు మంది, 543 మంది లోక్‌సభ సభ్యులకు కేవలం ఇరవై తొమ్మిది మంది ముస్లిం మైనారిటీలున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే మొత్తం శాసనసభ్యుల సంఖ్య 4,120 కాగా, అందులో 357 మంది మాత్రమే ముస్లింలు. ఒడిశా శాసనసభలో ఒకే ఒక్క ముస్లిం సభ్యుడు ఉన్నారు. పదిహేను రాష్ట్రాల శాసన సభలలో ఒక్క ముస్లిం సభ్యుడు కూడా లేడు.
 
 ఏ దేశ అభివృద్ధి ఫలాలైనా, వికాసమైనా అన్ని వర్గా లకు సమంగా అందాలి. మైనారిటీల పట్ల వివక్ష నాగరిక సమాజానికి, అందునా భారత్‌వంటి లౌకిక, ప్రజాస్వామ్య దేశానికి శోభించదు. దేశంలో రెండవ పెద్ద సామాజికవర్గం ఇంతటి దుస్థితిలో ఉంటే, స్వాతంత్య్రానికి,  నాగరికతకు, ప్రగతి వికాసాలకు అర్థమూ, పరమార్థమూ ఉండవు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబే ద్కర్ 1948 నవంబర్ 4న ఒక ప్రకటన చేశారు.  ‘ప్రస్తుతం ఈ దేశంలో ముస్లింలు అల్పసంఖ్యాక వర్గంగా ఉన్నారు. ఒకవేళ అధిక సంఖ్యాకులు అల్ప సంఖ్యాకులకు వ్యతిరేకం గా విద్వేష వాతావరణాన్ని సృష్టించి, వారి పట్ల మతపర మైన, రాజకీయపరమైన వివక్షను అవలంబిస్తే, అల్ప సం ఖ్యాకులు విస్ఫోటక పదార్థంలా భగ్గుమంటారన్న విష యాన్ని గుర్తుంచుకోవాలి’ అన్నారాయన. ఈ సూచన లను, హితవచనాలను ఆరున్నర దశాబ్దాలుగా ఏ పాలక వర్గమూ పట్టించుకోలేదు. రాజకీయ పార్టీలన్నీ మైనారిటీ లను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. ఎన్నికలలో తాయి లాలను ప్రకటించి ఓట్లు కొల్లగొడుతున్నాయి. తాయిలా లకు లొంగకుంటే వేరే ‘మార్గాలు’ ఎంచుకుంటున్నాయి.
 
 స్వతంత్ర భారతంలోముస్లింల సమస్యలను తెలుసు కుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాలు కొన్ని కమి షన్లను నియమించాయి. జస్టిస్ గోపాల్‌సింగ్ కమిషన్, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్, జస్టిస్ రాజేందర్ సచార్ కమిషన్- ఇవన్నీ అందుకు నియమించినవే. కానీ ఇవి ఇచ్చిన ఏ నివేదికా, సిఫారసూ ఆచరణకు నోచుకోలేదు. జస్టిస్ సచార్ కమిషన్ (2005) ముస్లిం సముదాయం సమస్యలు, వారి పట్ల ఉన్న వివక్షలను కళ్లకు కట్టింది.
 
 ముస్లిం మైనారిటీలు జాగృతం కావడం నేటి అవస రం. వారు తమ సంక్షేమాన్ని ఓటు బ్యాంకు రాజకీయా లకు  పణంగా పెట్టవలసిన అవసరం లేదు. హక్కులు సాధించుకునే దిశగా వజ్రసంకల్పులు కావాలి. తమను సరిగా అర్థం చేసుకోగలిగి, న్యాయమైన వాటాను షరతుల్లే కుండా అంగీకరించే ప్రజాస్వామ్య, లౌకికవాద పార్టీలలకు చేయూతనివ్వాలి. ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో తమ వాటా ను పొందడానికి ప్రయత్నించాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల రక్షణతో పాటు సమాన ప్రాతినిధ్యం, ముస్లింల వ్యక్తిగత చట్టాల రక్షణ, వక్ఫ్ ఆస్తుల రక్షణ, రెండో అధి కార భాషగా ఉర్దూ, జనాభా ప్రతిపదికన రాజకీయ రిజ ర్వేషన్లు కల్పన నేటి ప్రభుత్వాల బాధ్యత. ఇంత పెద్ద ప్రజాస్వామ్య, లౌకిక దేశమైన భారతావనిలో ఒక పెద్ద వర్గం అణిచివేతకు, పక్షపాతానికి గురైందన్న మచ్చ పడకూడదని భావిస్తే ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.
 ఎం.డి.ఉస్మాన్‌ఖాన్
 (నవంబర్ 11 అబుల్ కలాం ఆజాద్ జయంతి, మైనారిటీ హక్కుల దినోత్సవం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement