దాదాపు సగం సీట్లు ఆ వర్గాలకే..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధిక శాతం ఉన్న దళితులు, ముస్లింల ఓటు బ్యాంక్‌ను పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగా దాదాపు సగం సీట్లను ఆయా వర్గాలకు కేటాయించింది. 300 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ.. ఆదివారం మరో 101 స్థానాల్లో పోటీ చేసే వారి జాబితాను విడుదల చేసింది. ఇందు లోనూ 12 మంది ముస్లింలే కావడం గమ నార్హం.
మిగిలిన రెండు స్థానాలను జనరల్ లేదా ఎస్టీలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం 403 స్థానాల్లో 97 ముస్లింలకు, 87 దళితులకు కేటాయిం చారు. ముస్లిం ఓటర్లు 20% ఉండటం.. 2012లో వీరు ఎస్పీ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఎస్పీలో రగడ నేపథ్యంలో ఇప్పుడు ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని బీఎస్పీ ఎత్తు వేస్తోంది.