యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? | In Which Countries Of World Do Most Jews Live? | Sakshi
Sakshi News home page

Israel Hamas War: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది?

Published Wed, Oct 11 2023 11:11 AM | Last Updated on Wed, Oct 11 2023 12:37 PM

Israel in which Countries of World do Most Jews Live - Sakshi

ఇజ్రాయెల్- తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు వేలాది మంది మరణించారు. ఆకస్మిక దాడి నేపధ్యంలో ఇజ్రాయెల్ ఈసారి హమాస్‌ను ఉనికిని నాశనం చేయనున్నామని ప్రకటించింది. అదే సమయంలో హమాస్ కూడా అలుపెరగని దాడి కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడం ఇది మొదటిది కాదు. ఇంతకు ముందు కూడా హమాస్ ఇటువంటి దాడులకు పాల్పడింది. ఈ దాడులకు ఇజ్రాయెల్ కూడా తగిన సమాధానం ఇస్తూనే వస్తోంది.

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యూదులు నివసించే ఏకైక దేశం ఇజ్రాయెల్. 1948లో యూదులు తమకంటూ ప్రత్యేకంగా ఇజ్రాయెల్‌ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో ముస్లిం పొరుగు దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు శత్రువులుగా మారాయి. ఇజ్రాయెల్ పలుమార్లు దాడులకు గురయ్యింది. కానీ ఈ చిన్న దేశం తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. దీంతో శత్రువులు ఇజ్రాయెల్‌ను దెబ్బతీయలేకపోతున్నారు.

ఇజ్రాయెల్‌లో దాదాపు 70 లక్షల మంది యూదులు ఉన్నారు. ఇది ఇక్కడి మొత్తం జనాభాలో దాదాపు 74%. ఇక ప్రపంచంలోని మొత్తం యూదుల జనాభా విషయానికొస్తే దాదాపు ఒక కోటి 74 లక్షలు. అంటే ప్రపంచంలోని యూదు జనాభాలో 43 శాతం మంది ఇజ్రాయెల్‌లోనే నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ కాకుండా ప్రపంచంలోని ఏ దేశాలలో యూదులు నివసిస్తున్నారనే విషయానికొస్తే అమెరికాతో పాటు కెనడాలో అత్యధిక సంఖ్యలో యూదులు నివసిస్తున్నారు. ఈ రెండు దేశాల్లో దాదాపు 43 శాతం యూదులు నివసిస్తున్నారు. మిగిలిన 24 శాతం యూదులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడ్డారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ, ముంబైలలో ‘ఇజ్రాయెల్ అడ్డా’? యూదులకు ప్రత్యేక రక్షణ ఎందుకు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement