సాక్షి, న్యూఢిల్లీ : ఒకవైపు దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ప్రకంపనల తీవ్రత కొనసాగుతుండగానే కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్‌పీఆర్) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) నవీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8700 కోట్లను కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ ప్రతిపాదనను ఆమోదించిందిందని పీటీఐ నివేదించింది.
మొదట ఎన్పీఆర్ను రూపొందించి ఆ తర్వాత ఎన్‌ఆర్‌సీ అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ భావిస్తోంది. ఒకసారి ఎన్‌పీఆర్ తయారైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్-ఎన్‌ఆర్‌సీ)ని రూపొందించనుంది.దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్‌పీఆర్ లక్ష్యం. ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇస్తారు. అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2020 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య ఎన్‌పీఆర్ ప్రక్రియ జరగనుంది. దేశంలోని ప్రతి "సాధారణ నివాసి" సమగ్ర గుర్తింపు డేటాబేస్‌ను రూపొందించడం ఎన్‌పీఆర్ లక్ష్యం అని సెన్సస్ కమిషన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment