సాక్షి,విజయవాడ:ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. భారీగా అప్పుల సేకరణకు ఏపీ కేబినెట్ గురువారం(డిసెంబర్ 19) ఆమోదం తెలిపింది.పెద్ద ఎత్తున రూ.17 వేల కోట్ల రుణాలు సేకరించాలని కేబినెట్ నిర్ణయించింది.
మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 1000 కోట్ల అప్పులు సమీకరించేందుకు ఆమోద ముద్ర వేశారు.కెఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా రూ. 5 వేల కోట్లు,హడ్కో ద్వారా రూ. 11 వేల కోట్ల రుణాలను సేకరించేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
కాగా, వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నపుడు ఏపీ ప్రభుత్వ అప్పులు పెరిగిపోతున్నాయని, ఏపీ శ్రీలంకలా మారిపోతోందని ప్రస్తుత కూటమి ప్రభుత్వ పెద్దలు, అప్పటి ప్రతిపక్షనేతలు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. వారే ఇప్పుడు ఎడాపెడా అప్పులు తీసుకుంటుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment