database
-
కుల ధ్రువీకరణ పత్రాలు రెడీ..
సాక్షి, అమరావతి: పదో తరగతి విద్యార్థులు అడక్కుండానే.. వారికి కుల ధ్రువీకరణ సర్టీఫికెట్లు జారీచేసే కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో మెరుగైన సేవల్ని అందించే క్రమంలో ఎక్కడా, ఎప్పుడూ లేనివిధంగా సరికొత్తగా రాష్ట్రంలో ఈ విధానాన్ని తీసుకువచ్చారు. సాధారణంగా పదో తరగతి పూర్తయిన విద్యార్థులు.. ఇంటర్, ఆపై చదువుల కోసం తప్పనిసరిగా కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంతకుముందు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు తీసుకున్నా.. పదో తరగతి ఉత్తీర్ణులయ్యాక తాజా సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ సర్టిఫికెట్ల కోసం గతంలో మీసేవ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ విద్యార్థులు తిరిగేవారు. దీంతో ఆయా కార్యాలయాలు విద్యార్థులతో కిటకిటలాడేవి. దీనిని గమనించిన ప్రభుత్వం విద్యార్థులు అడక్కుండానే కుల ధ్రువీకరణ పత్రాల జారీని చేపట్టింది. ఇందుకోసం ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసిన 10 లక్షల మంది విద్యార్థుల వివరాల డేటాను విద్యా శాఖ ద్వారా తీసుకున్నారు. ఆ డేటా మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయం డేటాబేస్కు అనుసంధానించారు. వీఆర్వోల ద్వారా తనిఖీ చేయించి.. సేకరించిన డేటాను రెవెన్యూ శాఖ గ్రామాల వారీగా విభజించి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వీఆర్వో లాగిన్లకు పంపించింది. వీఆర్వోలు తమ పరిధిలోని పదో తరగతి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి కుల ధ్రువీకరణను పరిశీలించి నివేదికలు రూపొందించారు. విద్యార్థితోపాటు వారి కుటుంబ సభ్యులందరి సామాజిక వర్గాన్ని కూడా నిర్ధారించారు. అంటే ఒక్కో కుటుంబానికి నలుగురు సభ్యుల లెక్కన దాదాపు 40 లక్షల మంది సామాజిక వర్గాన్ని ధ్రువీకరించారు. ఈ సర్టిఫికెట్లు వీఆర్వో లాగిన్ నుంచి తహసీల్దార్లకు పంపించారు. అక్కడి నుంచి సర్టీఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇప్పుడు పదో తరగతి విద్యార్థి ఎవరైనా తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి.. వెంటనే తమ కుల ధ్రువీకరణ పత్రం పొందే అవకాశం కల్పించారు. దరఖాస్తులతో పని లేదు గతంలో మాదిరిగా విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. వెరిఫికేషన్ చేయాల్సిన పని లేకుండా నేరుగా విద్యార్థులకు సర్టీఫికెట్లు జారీ చేస్తారు. ప్రస్తుతం సేకరించిన 40 లక్షల మంది వివరాలు గ్రామ, వార్డు సచివాలయ డేటాబేస్‌లో నిక్షిప్తమై ఉంటాయి. భవిష్యత్‌లో 40 లక్షల మందిలో ఎవరికైనా కుల ధ్రువీకరణ పత్రం కావాల్సి వస్తే.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే తక్షణం జారీ చేస్తారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పల్లె ముంగిటకు వచ్చిన పరిపాలన, సాంకేతికతను అనుసంధానించి సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం సులభతరం చేసింది. తద్వారా 10 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చిపెట్టింది. -
మెడికల్ కౌన్సిల్’ కేసులో ముగ్గురి అరెస్ట్
సాక్షి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి, అనర్హులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ కందుకూరి అనంతకుమార్ సూత్రధారిగా తేలింది. చైనాలో మెడిసిన్ పూర్తి చేసిన వారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పరీక్ష పాస్ అయితేనే రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం ఉంటుందని, పాస్ కాని వారి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన కుమార్ సర్టిఫికెట్లు జారీ చేశాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇబ్రహీంపట్నానికి చెందిన కసరమోని శివానంద్, కర్మన్‌ఘాట్ వాసి తోట దిలీప్ కుమార్ స్నేహితులు. వీరు చైనాలో ఎంబీబీఎస్ చదివారు. 2012లో సర్టిఫికెట్ పొంది తిరిగి వచ్చారు. ఇలా విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారు ఇక్కడ ప్రాక్టీసు చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) ఉత్తీర్ణులు కావాలి. అత్యంత కఠినంగా ఉండే ఈ పరీక్షను ఎంసీఐ ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ ద్వయం 2012–14 మధ్య రెండుసార్లు పరీక్షకు హాజరైనా ఉత్తీర్ణులు కాలేదు. పాస్ అయితే కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు. దీంతో వీళ్లిద్దరూ ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేషించారు. వీరికి ఓ స్నేహితుడు (ప్రస్తుతం దుబాయ్‌లో) ద్వారా టీఎస్‌ఎంసీలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అనంతకుమార్‌తో పరిచయమైంది. 2017లో అతడిని కలిసి తమ అవసరాన్ని చెప్పారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన అనంతకుమార్ 2016లో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల రిజిస్ట్రేషన్ నంబర్లు వీరికి కేటాయించాడు. ఈ మేరకు టీఎస్ఎంసీ డేటాబేస్‌లో మార్పుచేర్పులు చేసి, వీరిద్దరికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించాడు. ఇటీవల అసలు వైద్యులు రెన్యువల్, అర్హతలు అప్డేట్ కోసం టీఎస్ఎంసీకి రావడంతో విషయం తెలిసింది. టీఎస్ఎంసీ ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుల కోసం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని టీమ్ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుంది. వీరి వద్ద నకిలీ టీఎస్ఎంసీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ... ఎంసీఐ సర్వర్‌లో మాత్రం ఎంటర్ కాలేదు. దీంతో అందులో అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలే కనిపిస్తున్నాయి. చిక్కుతామని భయపడిన వీరు ప్రాక్టీసు చేయకుండా వైద్య సంబంధ ఉద్యోగాలు చేస్తున్నారు. అనంతకుమార్ వీరిద్దరితో పాటు శ్రీనివాస్, నాగమణిలకు ఈ తరహాలో సహకరించినట్లు అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న వారి వివరాలు ఆరా తీస్తున్నామన్నారు. శివానందం 2012–16 మధ్య, దిలీప్ 2016 –18 మధ్య సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో డ్యూ టీ డాక్టర్లుగా పని చేశారు. టీఎస్ఎంసీ సర్టిఫికెట్ లేని శివానందంకు ఉద్యోగం ఎలా వచ్చిందనేది ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వీరిలో ఒకరు మెడికల్ కంపెనీలో, మరొకరు వైద్యులకు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. (చదవండి: తమ్ముడి ఇంట్లో తుపాకీ పెట్టాడు!) -
అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు
We Beat The Americans: Talibans: అమెరికా సైనిక దళాలపై తాలిబాన్లు విజయాన్ని సూచించే అనధికారిక ప్రదర్శనలు అఫ్గనిస్తాన్‌లోని ఘజ్నీ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్నాయి. అమెరికన్లు ప్రపంచంలోనే తమని తాము గొప్ప శక్తిగా చెప్పుకుంటున్నప్పటికీ, మేము అమెరికన్లను ఓడించగలమని అఫ్గన్లు, ప్రపంచం, భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా మేము దీన్ని చూపిస్తున్నామని తాలిబన్ ప్రావిన్షియల్ కల్చర్ చీఫ్ ముల్లా హబీబుల్లా ముజాహిద్ మీడియాకు తెలిపాడు. చారిత్రకంగా అమెరికా సుదీర్ఘ యుద్ధాల్లో సేవలందించిన సైనిక దళాల పేర్లను, వారు ఆక్రమించిన స్థావరాలను కాంక్రీట్ గోడపై క్రమం తప్పకుండా చెక్కడం పరిపాటి. ఐతే అమెరికా సైన్యానికి, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణల్లో అవి ధ్వంసమయ్యాయి. అఫ్గన్ నుంచి అమెరికా సైన్యం స్వచ్ఛంద నిష్క్రమణ తర్వాత వారికి సంబంధించిన యుద్ధసామగ్రిని రోడ్లపై ప్రదర్శనకు ఉంచి తాలిబన్లు ప్రగల్భాలు పలకడం గమనార్హం. 19వ శతాబ్దంలో బ్రిటిష్ దళాల ఓటమితో పాటు ప్రస్తుతం మూడు విదేశీ సామ్రాజ్యాలపై అఫ్గనిస్తాన్ విజయం సాధించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ విజయం సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నామని తాలిబన్ పోరాట యోధుడు ఓజైర్ (18) తెలిపాడు. ఇక్కడ జన్మించిన అఫ్గన్లు శక్తివంతమైన అమెరికా దేశాన్ని ఓడించగలరని నిరూపించేందుకే వీటిని ప్రదర్శిస్తున్నామన్నాడు. ముల్లా హబీబుల్లా ముజాహిద్ పేలుడు గోడల ముందు నిలబడి యుద్ధాల్లో మరణించిన 20, అంతకంటే ఎక్కువ మంది ముఖ్యమైన కమాండర్లు, జనరల్స్ పేర్లు వీటిమీద ఉన్నాయని ప్రగల్భాలు పలికాడు. మరోవైపు అఫ్గనిస్తాన్ కొత్త పాలకుల సమక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని, అక్కడి జనాభాలో సగానికి పైగా ప్రజలు ఆకలి బాధను ఎదుర్కొంటున్నట్లు యూఎస్ అభిప్రాయపడింది. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. -
డిజిటల్ తెరపై తెలుగు వెలుగులు
‘డిజిటల్ హ్యుమానిటీస్’ రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పెరిగింది. ఆ దిశగా చాలా పరిశోధనలూ ఫలితాలూ అందుబాటులోకి వచ్చాయి. భారతీయ భాషలు వీటిని అందుకోవడంలో కాస్త వెనుకబడే ఉన్నాయి. డిజిటల్ రంగంపై కరోనా విశేష ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో తెలుగు భాగస్వామ్యాన్ని అంతర్జాలంలో మరింత పెంచాల్సివుంది. కరోనా కల్పించిన అనివార్యత వల్ల సమాచారం కోసం, మొదట్లో మృదు ప్రతుల్ని కంప్యూ టర్, ఫోన్ స్క్రీన్ల మీద చదవడం కొంత ఇబ్బంది కలిగిం చినా, తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడు ‘ఫలానా బుక్ సాఫ్ట్ కాపీ ఏ వెబ్సైట్లో దొరుకుతుంది’ అనే అలవాటు లోకి వచ్చేశాం. అందుకే డిజిటల్ వేదికపై సాహిత్యం, కళలువంటి మానవీయశాస్త్రాలతోపాటు వాణిజ్య, వైద్య, సైన్స్, రాజకీయ మొదలైన సకల శాస్త్రాల సమాచారాన్ని పరిశోధకుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరికీ అందుబాటులో ఉంచాలి. భారతదేశంలాంటి అభివృద్ధి చెందుతోన్న సమాజాల్లో సమాచార లభ్యత ప్రధాన సమస్య. దీన్ని అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల తక్షణావసరం. సమాచారంపై కొందరి గుత్తాధిపత్యాన్ని తొలగించేలా రచయితలు, ప్రభుత్వాలు, ముద్రణాసంస్థలు పరస్పరావగాహనతో ముందు కెళ్ళాలి. తెలుగు ప్రభుత్వాలు దీన్ని లాభసాటి కార్యక్రమంగానో, సమాజోద్ధరణగానో చూడకుండా ఇవాళ్టి పోటీ ప్రపంచంలో అనివార్యంగా దాటవలసిన మైలురాయిగా పరిగణించాలి. ప్రభుత్వరంగ సంస్థలే పూనుకొని ఆయా రచయితలతో, ముద్రణాసంస్థలతో చర్చలు జరిపి, వారికి కావలసిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక వెసులుబాట్లకు సంబంధించిన ‘ఒప్పందాన్ని’ కుదుర్చుకోవాలి. దీనికోసం అవసరమయ్యే కొత్త చట్టాలను తేవాల్సిన, సర్దుబాటు చర్యలను చేపట్టాల్సిన పెద్దన్న పాత్రను ప్రభుత్వాలు పోషించక తప్పదు. (చదవండి: బడా వ్యాపారులకే ‘బ్యాడ్ బ్యాంక్’) ప్రజలకు తక్షణం వినియోగపడటానికి కావలసిన సమాచారం మొదట కనీసం పీడీఎఫ్ రూపంలోనైనా ఉంచాలి. యూనికోడ్లో ఉంచగలిగితే మరింత ప్రయోజనకరం. ఈ రూపంలో ఉంచడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రాజ్యమేలుతున్న పేజ్మేకర్ సాఫ్ట్వేర్ స్థానంలో యునికోడ్ ఫాంట్స్ వాడేలా రచయితలను, ముద్రణారంగాన్ని ప్రోత్సహించాలి. పేజ్మేకర్లో ఉండే అనేకరకాల వెసులుబాట్లను యునికోడ్‌లో కూడా జోడించడానికి ఐఐటీ, ఐఐఐటీ, వికీపీడియా, తెలుగు ఫాంట్స్ లాంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో పని చేయాల్సి ఉంటుంది. దాంతోబాటు ఇంగ్లిష్‌కు ఉన్నట్టు తెలుగుకు కూడా ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్)ను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తెస్తే మరో అద్భుతం చేసినవాళ్ళవు తారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు పీడీఎఫ్ రూపంలో కోట్లాది పుటల్లో ఉన్న సమాచారాన్ని ఒక్క మీట నొక్కుతో ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి మార్చుకునే వెసులు బాటు ఉంటుంది. తమ సంస్థల్లో ముద్రితమవుతోన్న ప్రతి పుస్తకానికి సంబంధించిన వివరాల్ని విధిగా ఆ సంస్థలచేత ఆధునిక పద్ధతుల్లో ‘సమాచార నిధి’(డేటా బేస్) తయారు చేయించాలి. తెలుగు పుస్తకాల సమాచారం ఒక దగ్గరకు తీసుకురావాలి. ఆ పుస్తక సంబంధిత పీడీఎఫ్, ఎలక్ట్రానిక్ ఫార్మాట్ కాపీని అంతర్జాలంలో పెట్టడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటుచేయాలి. అంతర్జాలంలో పుస్తకాల్ని చదవడం ద్వారా వచ్చే ఆదాయం రచయితకు అందేలా చూడాలి. ప్రతి ముద్రిత ప్రతికి సంబంధించిన కొన్ని పుస్తకాల్ని ప్రభుత్వ ప్రాతినిధ్య సంస్థలకు పంపేలా చూడాలి. (చదవండి: రైతు ఆదాయంపై అర్ధసత్యాలు) ఇప్పటికే యంత్రానువాదం (మిషన్ ట్రాన్స్లేషన్) అందుబాటులోకి వచ్చింది. దీన్ని మరింత అభివృద్ధి చేసి మెరుగ్గా అందించాలి. ముఖ్యంగా యూజర్ ఫ్రీ అప్లికేషన్స్ రావడం ఈనాటి సాంకేతిక రంగంలో పెనువిప్లవం. జ్ఞానాన్ని డిజిటల్ మాధ్యమంలో ఉంచే ప్రక్రియ నిరంతరం చేయగలిగితే ప్రజల్లో విషయ సంబంధిత అవగాహన పెరుగుతుంది. తెలుగులో రాస్తోన్న సకల శాస్త్రాల సమా చారం అందుబాటులో ఉండటం వల్ల పరిశోధనలు వేగ వంతమవుతాయి. తెలుగు పరిశోధనల్లో ముఖ్యంగా భాషా పరిశోధనల్లో కొత్తశకం ప్రారంభమౌతుంది. తెలుగు భాషలో ఏ అక్షరం ఎవరు రాశారు? ఏ అక్షరాలను ఎవరు, ఎక్కడి నుంచి, ఎంతశాతంలో వాడుకొన్నారు మొదలైన విషయాలు ఇట్టే తెలిసిపోతాయి. తద్వారా పరిశోధనల్లో కచ్చితత్వం, నిర్దిష్టత, నిర్దుష్టత సాధ్యమై సారవంతమైన ఫలితాలు వస్తాయి. – డా. ఎస్. చంద్రయ్య, టి. సతీశ్ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం -
‘వ్యాక్సిన్’ కోసం లక్షమంది వివరాలు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఒకపక్క యంత్రాంగం, ప్రజలు దీనితో పోరాడుతుండగా.. మరో పక్క దీనికి చెక్‌పెట్టే వ్యాక్సిన్ తయారీలో దేశవ్యాప్తంగా 9 ఫార్మా కంపెనీలు నిమగ్నమయ్యాయి. టీకాలు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఈక్రమంలో కరోనా ను ఖాతరు చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలుత ఈ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో హెల్త్‌కేర్ వర్కర్స్ డేటాబేస్‌ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ తదితర సిబ్బంది సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సేకరిస్తున్నారు. మొత్తంగా తొమ్మిది కేటగిరీల్లో వివిధ క్యాడర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్లలో కలిపి సుమారు లక్ష మంది వివరాలను సేకరించారు. జనరల్, జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, డిస్పెన్సరీలు, ఆయుష్ ఆస్పత్రులు, మథర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లు తదితరాల్లో పనిచేస్తున్న వీరందరి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ డేటాను వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఇక ప్రైవేటు రంగంలోని వివిధ స్థాయిల ఆస్పత్రులు, మెడికల్ కళాశాలలు, నర్సింగ్ హోంలు, పాలిక్లినిక్‌లు, ఎన్జీఓ వసతి కేం ద్రాల్లోని స్టాఫ్ వివరాల సేకరణ కొనసాగు తోంది. ఈ ప్రక్రియను వచ్చేనెల 10లోపు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. (చదవండి: కీలక దశకు దేశీయ కరోనా వ్యాక్సిన్) నాలుగంచెల్లో సమన్వయం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, పారా మెడికల్ తదితర కేటగిరీల్లోని మొత్తం 7 లక్షల మంది వివరాలను వైద్య ఆరోగ్యశాఖ సేకరిస్తోంది. ఇందులో ప్రైవేటు రంగంలోనే అత్యధికంగా 6 లక్షల మంది ఉండొచ్చని అంచనా. వివరాల సేకరణ ప్రక్రియ సమన్వయానికి 4 అంచెల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. నేషనల్ స్టీరింగ్ కమిటీ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, స్టేట్ టాస్క్‌ఫోర్స్, జిల్లా టాస్క్‌ఫోర్స్.. ఇవి సమన్వయం చేస్తున్నాయి. ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్ అయిన ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, నర్సులు/సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, పారామెడికల్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్, మెడికల్ విద్యార్థులు, సైంటిస్టులు/రిసెర్చ్ స్టాఫ్, క్లరికల్/అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఇతర ఆరోగ్య వైద్య సిబ్బంది కేటగిరీల్లో పనిచేస్తున్న వారినీ పరిగణనలోకి తీసుకున్నారు. ఒక్కో మెడికల్ స్టాఫ్‌కు సంబంధించి 24 అంశాల్లో వివరాలు సేకరిస్తున్నారు. వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్, పోస్టల్ కోడ్, గుర్తింపు కార్డు, పనిచేస్తున్న ఆస్పత్రి పేరు, ఏరియా, కేటగిరీ తదితర సమాచారాన్ని తీసుకుంటున్నారు. -
బిగ్‌బాస్కెట్‌పై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ బిగ్‌బాస్కెట్ డేటాబేస్ చోరీకి గురైందని సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబల్ వెల్లడించింది. సంస్థ నుంచి తస్కరించిన 2 కోట్ల మంది పైగా యూజర్ల డేటాను హ్యాకర్లు సుమారు రూ. 30 లక్షలకు అమ్మకానికి ఉంచారని పేర్కొంది. ‘విధుల్లో భాగంగా డార్క్ వెబ్‌ను పరిశీలిస్తుండగా సైబర్ క్రైమ్ మార్కెట్లో బిగ్ బాస్కెట్ డేటాబేస్‌ను 40,000 డాలర్లకు హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు మా రీసెర్చి విభాగం గుర్తించింది. సుమారు 15 జీబీ పరిమాణం ఉన్న ఎస్‌క్యూఎల్ ఫైల్లో దాదాపు 2 కోట్ల మంది పైగా యూజర్ల డేటా ఉంది. ఇందులో పేర్లు, ఈమెయిల్ ఐడీలు, మొబైల్ నంబర్లు, చిరునామాలు, పుట్టిన తేదీ, ఐపీ అడ్రస్‌లు మొదలైన వివరాలు ఈ డేటాలో ఉన్నాయి‘ అని సైబల్ తెలిపింది. అక్టోబర్ 30న సైబర్ దాడి జరిగినట్లు తాము గుర్తించామని, అదే విషయం బిగ్‌బాస్కెట్‌కు సత్వరం తెలియజేశామని సైబల్ తెలిపింది. మరోవైపు, డేటా చౌర్యం అవకాశాలపై వార్తలొచ్చిన నేపథ్యంలో దీన్ని కట్టడి చేయడానికి సైబర్‌సెక్యూరిటీ నిపుణులతో కలిసి పనిచేస్తున్నామని, బెంగళూరులోని సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు కూడా చేశామని బిగ్‌బాస్కెట్ తెలిపింది. యూజర్లకు సంబంధించిన క్రెడిట్ కార్డు నంబర్లు తదితర వివరాలేమీ తమ దగ్గర ఉండవని, అలాంటి డేటాకు వచ్చిన ముప్పేమీ ఉండబోదని పేర్కొంది. -
మహమ్మారిపై పోరుకు ‘కోవిడ్ వారియర్స్’
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో రాష్టాలకు సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డేటాబేస్‌ను ఏర్పాటు చేసింది. ఆయుష్ వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు, నెహ్రూ యువకేంద్ర సభ్యులు, మాజీ సైనికులు, ఎన్సీసీ సభ్యులు, ప్రధానమంత్రి కౌషల్ వికాస్ యోజన సభ్యుల, వాలంటీర్ల పేర్లు, వివరాలతో ఈ డేటాబేస్ సిద్ధమైంది. కోవిడ్ వారియర్స్ అని పిలిచే వీరి సేవలను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులు, రేషన్ దుకాణాలు, కూరగాయల మార్కెట్లలో భౌతిక దూరాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, అనాథలకు సేవలందించేందుకు వాడుకోవచ్చు. https:// covidwarriors.gov.in వెబ్సైట్లో కొవిడ్ యోధుల సమాచారం అందుబాటులో ఉంటుందని కేంద్ర సర్కారు వెల్లడించింది. అలాగే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, సాంకేతిక సిబ్బంది, స్వచ్ఛంద సేవలకు శిక్షణ ఇచ్చేందుకు https://igot.gov.in/ igot అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
కేంద్రం మరో సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ఒకవైపు దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీ ప్రకంపనల తీవ్రత కొనసాగుతుండగానే కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నవీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8700 కోట్లను కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ ప్రతిపాదనను ఆమోదించిందిందని పీటీఐ నివేదించింది. మొదట ఎన్పీఆర్ను రూపొందించి ఆ తర్వాత ఎన్ఆర్సీ అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ భావిస్తోంది. ఒకసారి ఎన్పీఆర్ తయారైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్-ఎన్ఆర్సీ)ని రూపొందించనుంది.దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్పీఆర్ లక్ష్యం. ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇస్తారు. అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2020 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య ఎన్పీఆర్ ప్రక్రియ జరగనుంది. దేశంలోని ప్రతి "సాధారణ నివాసి" సమగ్ర గుర్తింపు డేటాబేస్‌ను రూపొందించడం ఎన్పీఆర్ లక్ష్యం అని సెన్సస్ కమిషన్ తెలిపింది. -
దేశమంతటా పౌర రిజిస్టర్
న్యూఢిల్లీ: 2020 కల్లా జాతీయ ప్రజా రిజిస్టర్(ఎన్పీఆర్)ను రూపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీని ఆధారంగానే దేశవ్యాప్త పౌరసత్వ రిజిస్టర్‌ను తయారు చేయనుంది. ఎన్పీఆర్ పూర్తయి, అధికారికంగా ముద్రించాక ప్రభుత్వం దీనినే భారత జాతీయ పౌరసత్వ(ఎన్ఆర్ఐసీ) రిజిస్టర్‌కు ఆధారంగా చేసుకుంటుంది. అంటే, ఇది అస్సాంలో చేపట్టిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్నార్సీ)కి అఖిల భారత రూపమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీల మధ్య ఈ కార్యక్రమం అస్సాం మినహా దేశవ్యాప్తంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆ ప్రాంతంలో ఆరు నెలలుగా నివాసం ఉంటున్న లేదా మరో ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం అక్కడే ఉండాలనుకున్న వ్యక్తుల పేర్లను నమోదు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. -
తుపాకీ లైసెన్సుదారుల డేటాబేస్
న్యూఢిల్లీ: దేశంలో తుపాకీ లైసెన్స్‌లు కలిగిన వారందరికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించి వారి పేర్లతో జాతీయ స్థాయిలో డేటాబేస్‌ను రూపొందించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. వచ్చే ఏప్రిల్ కల్లా ఈ డేటాబేస్ అందుబాటులోకి వస్తుందంది. ఏప్రిల్ నుంచి అధికారులు కొత్తగా లైసెన్సులు జారీచేసేటప్పుడు లేదా పాత లైసెన్సును పునరుద్ధరించేటప్పుడు ఆయుధం యజమాని వివరాలను ఈ డేటాబేస్‌లో నమోదు చేయాల్సిందేనని వెల్లడించింది. -
అరచేతిలో నేరస్తుల చిట్టా
ఆదిలాబాద్: 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే అందరికీ గుర్తుండే విషయమే. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు తెలంగాణలోని అన్ని కుటుంబాల వివరాలను ఇంటింటికీ తిరిగి సేకరించారు. అదే మాదిరిగా ఈనెల 18న ఒకే రోజు నేరస్తుల సమగ్ర సర్వేను నిర్వహించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ఎస్పీకి ఉత్తర్వులు అందాయి. నేరస్తుల సమగ్ర వివరాల సేకరణ కోసం పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. నేరగాళ్లతో పాటు వారింట్లోని ఇతర కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా తమవద్ద ఉన్న ట్యాబ్‌లలో చిత్రీకరిస్తారు. 2008 జనవరి 1 నుంచి జరిగిన అన్ని నేరాలకు సంబంధించిన నేరగాళ్ల రికార్డులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు బయటకు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత ఫైళ్ల దుమ్ము దులిపి రికార్డులన్నిటినీ క్రోడీకరించే పనిలో తలామునకలై ఉన్నారు. ఈ రికార్డుల ఆధారంగా నేరగాళ్లందరినీ గుర్తించి, వారి పేర్లతో ఓ జాబితా రూపొందించనున్నారు. 18న ఒకే రోజు సమగ్ర సర్వే చేపట్టి, ఆ తర్వాత వారం రోజుల పాటు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నేరస్తుల వివరాల సేకరణ పూర్తయిన తర్వాత పోలీసు అధికారులు ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. వివరాల సేకరణ ఇలా.. గతంలో దొంగతనాలు, దోపిడీ, హత్యలు, కిడ్నాప్‌లు, ఆయుధాలు, పేలుడు పదార్థాల అక్రమరవాణా వంటి తదితర నేరాలకు పాల్పడిన నేరస్తుల పూర్తి వివరాలను సేకరించడానికి ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ నేరస్తుల సమగ్ర సర్వేను నిర్వహిస్తోంది. పోలీసులు సదరు నేరస్తుల ఇళ్లకు వెళ్తారు. రేషన్, ఓటరు, పాన్, ఆధార్‌కార్డు, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి ఇతర సామాజిక ఖాతాల వివరాలు సేకరిస్తారు. వేలిముద్రలు, ఇంటి నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుంటారు. ఇలా సేకరించిన వివరాలను పోలీసు శాఖకు ఉన్న డాటాబేస్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా.. దొంగతనానికి పాల్పడింది పాతవాళ్లు అయితే వెంటనే ఈ విధానం ద్వారా పట్టుకునే వీలుంటుంది. ఇప్పటికే జిల్లాలోని పోలీస్ స్టేషన్ల నుంచి నేరాలు, నేరస్తుల వివరాలను జిల్లా పోలీసు ఉన్నత అధికారులు తీసుకుంటున్నారు. ఈ సర్వే భవిష్యత్‌లో నేరాల సంఖ్యను తగ్గించేందుకు ఉపయోగపడనుంది. సర్వర్‌తో అనుసంధానం.. జిల్లా పోలీసు శాఖ సేకరించిన నేరస్తుల సమాచారం మొత్తాన్ని పోలీసు శాఖలోని డేటాబేస్ సర్వర్‌తో అనుసంధానం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లా పోలీసులైనా సర్వర్ ఆధారంగా నేరగాళ్ల గుట్టు కనిపెట్టవచ్చు. ఎక్కువ నేరాలు పాత నేరగాళ్లే పాల్పడుతుంటారని పోలీసు శాఖ అంచనా. ఎక్కడైనా, ఏదైనా నేరం జరిగితే ఈ డేటా బేస్ ఆధారంగానే నిందితులను గుర్తిస్తారు. దీంతో విచారణ వేగవంతమవుతుంది. నేర రహిత సమాజ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర పోలీసు ఉన్నత అధికారుల ఆలోచన మేరకు ప్రతీ కేసుకు సంబంధించిన వివరాలు ఇకపై ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. గృహాలకు జియో ట్యాగింగ్.. జిల్లాలో ఉన్న నేరస్తుల గృహాలకు సైతం గూగుల్ మ్యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ సర్వేలో ప్రధానంగా దొంగతనాలు చేసే నేరస్తులపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపనుంది. నేరస్తుల ఇళ్లకు జియో ట్యాగింగ్ చేసి పెట్రోలింగ్, బ్లూకోట్స్ వాహనాల, సిబ్బంది వద్దనున్న ట్యాబ్‌లలో పొందుపర్చనున్నారు. దీని వల్ల దొంగతనాలు జరిగిన సందర్భాల్లో కదలికలు కనిపెట్టడం సులభతరమవుతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. గతంలో రాష్ట్రంలోని హైదరాబాద్, సైబర్‌బాద్ ప్రాంతాల్లోని నేరస్తుల ఇళ్లకు జియోట్యాగింగ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టేందుకు పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రకు ఆనుకొని ఉండడంతో ఇక్కడ దొంగల ప్రాబల్యం ఎక్కువ. ఇతర రాష్ట్రాల దొంగలే కాకుండా జిల్లాలో సైతం దొంగలు ఎక్కువగానే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రతీ దొంగతనం కేసుల్లో పోలీసులకు పట్టుబడ్డ వారిలో జిల్లాకు చెందిన వారు సగం, మహారాష్ట్రకు చెందిన వారు కొంత మంది ఉంటారు. ఈ సర్వే తర్వాత జిల్లాలకు చెందిన నేరస్తుల వివరాలు పూర్తిగా తెలియనున్నాయి. జిల్లాలో ఎలాంటి దొంగతనం జరిగినా వెంటనే తెలిసిపోయే అవకాశం ఉంటుంది. సర్వే చేపడుతున్నాం.. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 18న నేరస్తుల సమగ్ర సర్వే చేపట్టనున్నాం. ఇప్పటికే ప్రతి పోలీసు స్టేషన్ నుంచి వివరాలు సేకరిస్తున్నాం. 18న జిల్లా వ్యాప్తంగా సర్వే చేసి నేరస్తుల పూర్తి వివరాలు తెలుసుకుంటాం. ఆ తర్వాత వారం రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వివరాలన్నీ పోలీసు డాటేబేస్లో అనుసంధానం చేస్తాం. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా నేరస్తుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు నేరస్తుడి కదలికలు తెలుసుకోవచ్చు. – విష్ణు ఎస్ వారియర్, ఎస్పీ, ఆదిలాబాద్ -
ఆధార్ గోప్యతపై స్నోడెన్ సంచలన వ్యాఖ్యలు
ఒకవైపు ఆధార్ డేటాను ఎవరూ హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ.. రోజుకో సంచలన నివేదికలు బహిర్గతం కావడం దేశ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్పై అమెరికా పెట్టిన నిఘా గుట్టును రట్టుచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఆధార్ గోప్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వంద కోట్ల భారతీయుల ఆధార్ డేటాను హ్యాక్ చేయడం చాలా సులువని శుక్రవారం వెల్లడించారు. అమెరికా సెక్యూర్టీకి చెందిన అనేక రహస్య పత్రాలను బయటపెట్టిన స్నోడెన్ వ్యాఖ్య ప్రకంపనలు పుట్టిస్తోంది. భారతదేశం పరిచయం చేసిన ఆధార్ డేటాబేస్ అక్రమ వినియోగానికి, (మిస్ యూజ్, అబ్యూజ్) అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ మాజీ ఉద్యోగి , విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించారు. ప్రజల డేటాను సురక్షితంగా ఉంచామని ప్రభుత్వాలు చెబుతుంటాయి, కానీ ఆ డేటాహ్యాకింగ్‌కు గురి కావడం సాధారణ విషయమే అన్నారు. చట్టాలు ఉన్నా, దుర్వినియోగాన్ని ఆపలేకపోయిందని చర్రిత చెబుతోందన్నారు. భారతదేశంలో ఆధార్ డాటాబేస్ ఉల్లంఘనపై సీబీఎస్ విలేఖరి జాక్ విట్టేకర్ వ్యాఖ్యలకు స్నోడెన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. వ్యక్తిగత జీవితాల సంపూర్ణ రికార్డులను తెలుసుకోవడం ప్రభుత్వాల సహజ ధోరణి అని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆధార్ డేటా సెక్యూరిటీ దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనలతో ఆధార్ డేటా గోప్యత చర్చనీయాంశమైనంది. దీనిపై సుప్రీంకోర్టులో నిర్ణయం కూడా పెండింగ్‌లో ఉంది. ఇది ఇలా ఉండగానే కేవలం రూ.500 లకే ఆధార్ కార్డు వివరాలు లభ్యం అంటూ వచ్చిన నివేదికలు మరింత కలవరం పుట్టించాయి. ఇటీవల ట్రిబ్యూన్ నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో చాలాసులువుగా ఆధార్ డేటా వచ్చేస్తుందని ఆ పత్రిక బుధవారం ఒక కథనంలో పేర్కొన్నది. దీన్ని ప్రభుత్వం, యూఐడీఏఐ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. It is the natural tendency of government to desire perfect records of private lives. History shows that no matter the laws, the result is abuse. https://t.co/7HSQSZ4T3f — Edward Snowden (@Snowden) January 4, 2018 -
ల్యాండ్ డేటాబేస్లు సిద్ధం చేయండి: కేంద్రం
న్యూఢిల్లీ: తక్కువ ధరల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడానికి వీలుగా సమగ్ర భూవివరాలతో ల్యాండ్ డేటాబేస్లను సిద్ధం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం సమర్థంగా అమలు చేయడానికి మురికివాడల అభివృద్ధి ప్రణాళికల్ని తమతో పంచుకోవాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ల్యాండ్ డాక్యుమెంట్లతో పాటు లేఅవుట్ అప్రూవల్, నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని అనుసరించాలని సూచించింది. రుణ అనుసంధానిత సబ్సిడీ పథకాలను పోత్సహించడంతో పాటు పర్యవేక్షించాలనీ.. టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు తదితర వర్గాల గృహనిర్మాణ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొంది. -
ఏరివేత కొలిక్కి!
♦ నెలాఖరులోగా రెండు కార్డులున్న వారి జాబితా రెడీ డేటాబేస్ ఆధారంగా నిర్ధారణ ♦ తొలగింపు ఇక్కడినుంచే ఆగస్టులో కొత్త రేషన్ కార్డులు! రేషన్ కార్డుల్లో అక్రమార్కులపై సర్కారు కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులు, వారిపై ఆధారపడినవారు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారికిచ్చిన రేషన్ కార్డులను తొలగించిన పౌరసరఫరాల శాఖ.. తాజాగా డూప్లికేట్లపై దృష్టి సారించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో కార్డులున్నవారి తొలగింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండు రాష్ట్రాల్లో కార్డులున్నవారు స్వచ్ఛందంగా కార్డులు సరెండర్ చేయాలని గతంలో స్పష్టం చేసింది. కానీ అప్పట్లో స్పందన కరువు కావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా ఆగస్టు నెలాఖరునుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్న సర్కారు.. నకిలీలను ఏరివేసిన తర్వాత కొత్తవి పంపిణీ చేయాలని నిర్ణయించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో1953 రేషన్ దుకాణాల పరిధిలో 11.69 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. వీరికి నెలకు 24,677.41 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కిలో బియ్యం రూపాయికే ఇస్తుండడం.. అందుకు సంబంధించి రాయితీ ప్రభుత్వం భరిస్తున్న నేపథ్యంలో నకిలీ కార్డుదారులతో సర్కారు ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఈక్రమంలో వాటిని అరిక డితే కొత్తవాటిని ఇవ్వడం సులభతరం కావడంతోపాటు ఖజానాకు కలిసొస్తుంది. దీంతో పౌరసరఫరాల శాఖకు చర్యలు మొదలుపెట్టింది. డ్యూయల్ కార్డులు 28వేలు.. పౌరసరఫరాల నిబంధన ప్రకారం ఒక వ్యక్తి/ కుటుంబానికి ఒక కార్డు మాత్రమే ఉండాలి. రాష్ట్ర విభజన తర్వాత కొందరు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు చోట్ల కార్డులు పొందారు. రెండువైపులా లబ్ధిపొందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. ఇరు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖలు ఒప్పందానికి వస్తే తొలగింపు సులభతరం కానుంది. దీంతో ఇటీవల ఇరు రాష్ట్రాల శాఖలు సమావేశమై ఆధార్ కార్డుల అనుసంధానానికి సంబంధించి సమాచారాన్ని తీసుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అక్కడి సమాచారాన్ని రాష్ట్ర సమాచారాన్ని సరిపోలుస్తూ డేటాబేస్‌లో సెర్చ్ చేస్తే డ్యూయల్ కార్డుల భాగోతం బయటపడనుంది. జిల్లాలో నగర శివారు ప్రాంతాలు, జీహెచ్ఎంసీలోని మండలాల్లో డ్యూయల్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉంది. పౌరసరఫరాల శాఖ గణాంకాల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 28వేల కార్డులు డ్యూయల్గా ఉన్నట్లు అంచనా. తాజాగా కొత్త కార్డులు జారీ చేసేనాటికి వీటిపై అనర్హత వేటు వేయడం ఖాయమని అధికారవర్గాలు చెబుతున్నాయి.