న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో రాష్టాలకు సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డేటాబేస్‌ను ఏర్పాటు చేసింది. ఆయుష్ వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, నెహ్రూ యువకేంద్ర సభ్యులు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ సభ్యులు, ప్రధానమంత్రి కౌషల్ వికాస్ యోజన సభ్యుల, వాలంటీర్ల పేర్లు, వివరాలతో ఈ డేటాబేస్ సిద్ధమైంది. కోవిడ్ వారియర్స్ అని పిలిచే వీరి సేవలను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులు, రేషన్ దుకాణాలు, కూరగాయల మార్కెట్లలో భౌతిక దూరాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, అనాథలకు సేవలందించేందుకు వాడుకోవచ్చు. https:// covidwarriors.gov.in వెబ్‌సైట్‌లో కొవిడ్ యోధుల సమాచారం అందుబాటులో ఉంటుందని కేంద్ర సర్కారు వెల్లడించింది. అలాగే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, సాంకేతిక సిబ్బంది, స్వచ్ఛంద సేవలకు శిక్షణ ఇచ్చేందుకు https://igot.gov.in/ igot అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment