Birth baby
-
కిమ్ కంట కన్నీరు.. ఎందుకంటే..?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దేశంలో జననాల రేటు దారుణంగా క్షీణించడమే ఇందుకు కారణం. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. దయచేసి ఎక్కువ పిల్లల్ని కనండి అంటూ కన్నీరు కార్చారు. Kim Jong Un CRIES while telling North Korean women to have more babies. The dictator shed tears while speaking at the National Mothers Meeting as he urged women to boost the countries birth rate. pic.twitter.com/J354CyVnln — Oli London (@OliLondonTV) December 5, 2023 ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికితోడు 1990లో తీవ్ర కరువు ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాభా రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. ఉత్తరకొరియాలో జననాల సంఖ్య భారీ స్థాయిలో క్షీణించింది. 2023లో జననాల రేటు 1.8 ఉంది. ఉత్తర కొరియా జనాభా 2034 నుండి ఘణనీయంగా తగ్గిపోతుందని హ్యుందాయ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. 2070 నాటికి జనాభా 23.7 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది. పక్కనే ఉన్న దక్షిణ కొరియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉంది. పిల్లల సంరక్షణ, పిల్లల చదువులు, కార్పొరేట్ సంస్కృతి వంటి కారణాలు జననాల రేటుపై ప్రభావం చూపుతున్నాయి. జననాల సంఖ్యను పెంచడానికి కిమ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది పిల్లల కోసం ప్రిఫరెన్షియల్ ఉచిత హౌసింగ్ ఏర్పాట్లు, సబ్సిడీలు, ఉచిత ఆహారం, వైద్యం, గృహోపకరణాలు, విద్యాపరమైన ప్రోత్సాహకాలను అందిస్తోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేక రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: అదే రోజున పార్లమెంట్‌పై దాడి.! భారత్‌కు పన్నూ బెదిరింపులు -
ప్రభుత్వ వైద్యంపై భరోసా.. ఆచరణలో చూపుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): నాటి ఐటీడీఏ పీఓ, నేటి ఖమ్మం జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తదితర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. చిన్నపాటి జ్వరమొస్తేనే కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మెరుగైన వైద్యం అందుతుందని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లోనూ నిరూపిస్తున్నారు. తమ సతీమణులకు వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించడంపై అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే ఇప్పటికీ చాలా మందిలో తెలియని అపనమ్మకం, రిస్క్ చేస్తున్నామా అనే ఆందోళన వెంటాడుతుంటాయి. అందుకే అప్పు చేసైనా సరే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయాన ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు జరిగేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యంపై చిన్నచూపు చూస్తున్న ప్రజల్లో అపోహలు తొలగించేలా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కృషి చేస్తుండడం విశేషం. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసి ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్‌గా వీ.పీ. గౌతమ్ 2019 అక్టోబర్ 28న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తన సతీమణికి ప్రసవం చేయించారు. అలాగే, 2020 ఆగస్టు 27న ఎస్పీ సునీ ల్‌దత్ కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించారు. తాజాగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సైతం తన సతీమణి మాధవికి బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రస వం చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందాలంటూ చెబు తున్న మాటలను ఆచరణలో చూపించిన యువ అధికారులు ‘భేష్’ అనిపించుకున్నారు. ఖమ్మం అదనపు కలెక్టర్ కూడా.. ఖమ్మం అదనపు కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి స్నేహలత మొగిలి విధులు నిర్వర్తిస్తుండగా, ఆమె భర్త, ఐపీఎస్ అధికారి శబరీష్ భద్రాద్రి జిల్లా మణుగూరు ఏఎస్పీగా ఉన్నారు. ఈమేరకు స్నేహలత గతనెల 22న ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. ఆ మరుసటి రోజు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆస్పత్రికి వెళ్లి స్నేహలత శబరీష్ దంపతులను అభినందించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రత్యేకం ఏజెన్సీలో నిత్యం వందలాది మంది రోగులకు వైద్య సేవలను అందించే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి జిల్లాకే తలమానికంగా ఉంది. భద్రాచలం చుట్టు పక్కల ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సేవలందించటంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ముందంజలోనే నిలుస్తోంది. అత్యధికంగా సాధారణ ప్రసవాలు చేస్తుండడంతో పాటు నవజాత శిశువులు, ఇతరత్రా సేవలను అందించడానికి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. అదేవిధంగా నాలుగు మార్లు కాయకల్ప అవార్డు సొంతం చేసుకున్న ఘనత ఈ ఆస్పత్రి సొంతం. అలాంటి ఏరియా ఆస్పత్రిలో తమ కుటుంబీకులకు వైద్యం చేయించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా కల్పించటానికి యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కృషి చేస్తున్నారు. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసిన వీరపాండియన్ తల్లిదండ్రులు ఇదే ఆస్పత్రిలో వైద్య సేవలను పొందేవారు. ఇవన్నీ పక్కన పెడితే భద్రాద్రి రామయ్య సన్నిధిలో కుమార్తె లేదా కుమారుడు పుట్టాలనే ఆకాంక్ష కూడా పలువురు తల్లిదండ్రులను ఈ ఆస్పత్రికి నడిపిస్తోందని చెబుతారు. కార్పొరేట్ సౌకర్యాలు ఉన్నాయ్..వినియోగించుకోండి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రా ద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. తన సతీమణికి మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పురిటి నొప్పులు రాగా, భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, ఆస్పత్రి పర్యవేక్షకులు రామకృష్ణ పర్యవేక్షణలో వైద్యులు భార్గవి, దేవిక, నర్సులు కళ్యాణి, రాజ్యలక్ష్మి ప్రసవం చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో వసతులు, నిపుణులైన వైద్య సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. దీంతో తన సతీమణికి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవం చేయించినట్లు కలెక్టర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో వెల్లడించారు. -
ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చింది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంకు చెందిన నవ్య అనే మహిళ కాన్పు కోసం శుక్రవారం భద్రాచలంలోని సరోజిని ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. ఆమెకు నొప్పులు తీవ్ర స్థాయిలో రావడంతో వైద్యులు సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు. తొలుత కవలలు ఉన్నట్టు భావించినా.. ముగ్గురు మగ శిశువులు జన్మించారని, తల్లీ, ఇద్దరు బిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్ సరోజిని తెలిపారు. మరో బిడ్డ కొంత అస్వస్థతగా ఉండడంతో వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. అస్వస్థతగా ఉన్న శిశువుకి వైద్యం అందిస్తున్న దృశ్యం -
ఒకే రోజు తల్లులైన అనుష్క, బబిత
నటి అనుష్క, రెజ్లర్ బబిత ఇద్దరూ ఒకే రోజు తల్లులు అయ్యారు. అనుష్కకు అమ్మాయి. బబితకు అబ్బాయి. ఎవరు పుట్టినా ఈక్వల్ ఈక్వల్ అని ముందు నుంచీ ఇద్దరూ అంటూనే ఉన్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఉంటూ వచ్చారు. బబిత అసలు తన పెళ్లి రోజే ఆడబిడ్డ కోసం ‘ఎనిమిదో అడుగు’ వేసింది! ‘ఆడబిడ్డను సంరక్షిస్తాను, చదివిస్తాను, ఆడిస్తాను’ అని ప్రమాణం చేస్తూ అందుకు సంకేతంగా ఏడడుగుల తర్వాత ఎనిమిదో అడుగు వేసింది. అనుష్క అయితే ఆరో నెలలో.. ‘అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒకటే. అబ్బాయి పుట్టడం స్పెషలేం కాదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక శక్తిమంతమైన పోస్ట్ పెట్టారు. ఈ బెస్ట్ మమ్మీల జెండర్ ఈక్వాలిటీ ఆదర్శవంతమైనది. ‘ఎనిమిదో అడుగు’లాంటిది. జనవరి 11న ముంబైలో అనుష్కా శర్మ, బబితా ఫోగట్ తల్లులయ్యారు. సాధారణ వ్యక్తి అయినా, సెలబ్రిటీ అయినా తల్లి తల్లే. అయితే ఈ తల్లులు ప్రత్యేకమైనవారు. సమాజానికి ఆదర్శప్రాయంగా ఉన్నవారు. తల్లి కాబోతున్నట్లు తెలిసిన నాటి నుంచీ బబిత, అనుష్క ‘ఏ బిడ్డయినా ఒక్కటే’ అని ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. ‘ఆడపిల్ల తక్కువ కాదు, మగపిల్లాడు ఎక్కువా కాదు. ఇద్దర్నీ సమానంగా చూడాలి. సమానంగా పెంచాలి’ అని పోస్ట్‌లు పెడుతూ వస్తున్నారు. మరి ప్రముఖులు, డబ్బున్నవాళ్లు పెంచినట్లుగా సగటు తల్లిదండ్రులు ఆడపిల్లని మగపిల్లాడితో సమానంగా పెంచగలరా? అని సోషల్ మీడియాలో వీళ్లకు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ‘‘పెద్ద తల్లి అయినా, పేద తల్లి అయినా ఒకటే. తల్లి ప్రేమలో తేడా ఉండదు. తేడా చూపించకూడదు’’ అని బబిత, అనుష్కల సమాధానం. ఈ ప్రశ్నలూ సమాధానాల వరకూ ఎందుకు? ఆడపిల్ల అని ఇంట్లోనే ఉంచేస్తే బబిత రెజ్లర్ అయి ఉండేవారా? దేశానికి మెడల్స్ సాధించుకుని వచ్చేవారా? అనుష్క నటి, నిర్మాత అయి ఉండేవారా? బబిత (31), అనుష్క (32) ఇంచుమించు ఒక ఈడు వారు. పురుషాధిక్య ప్రపంచంలోని అవరోధాలను దాటుకుని తమకంటూ ఒక గుర్తింపుతో నిలబడినవారు. అనుష్క అయోధ్య అమ్మాయి. బబితది హర్యానా. బబిత పేదరికం గురించి తెలిసిందే. అనుష్క కూడా అంత తేలిగ్గా ఏమీ ఇప్పటి తన స్థానానికి చేరుకోలేదు. బాలీవుడ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. తండ్రి మిలటరీ ఆఫీసర్, తల్లి గృహిణి. ఇక చూడండి.. సంప్రదాయం నుంచి గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఎంత కష్టమో. అందుకే ఈ ఇద్దరి మాట విలువైనది. తొలిసారి తల్లులు కాబోతున్న వారికి, ఇప్పటికే తల్లులైనవారికీ శిరోధార్యమైనది. తల్లి సపోర్ట్ ఉంటేనే తండ్రీ ఆడపిల్లల్ని వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా పెంచగలడు. ∙∙∙ సీమంతం జరిగేటప్పుడు బబిత ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆ వేడుకలో ఆమె రెండు కేక్‌లను కట్ చేశారు. ఒకటి బ్లూ కలర్ కేక్. ఇంకొకటి పింక్ కలర్ కేక్. బ్లూ మగపిల్లవాడికి. పింక్ ఆడపిల్లలకు. ఎంత అందమైన భావన. పెళ్లిలో కూడా బిబిత, ఆమె భర్త సుహాగ్ ఏడడుగుల తర్వాత ఎనిమిదో అడుగు వేశారు! ఆ ఎనిమిదో అడుగును బబితే భర్త చేత వేయించింది. ఆడబిడ్డను చదివిస్తానని, సంరక్షిస్తానని, ఆడుకోనిస్తానని ఆ దంపతులు చేసిన ప్రమాణానికి సంకేతం ఆ ఎనిమిదో అడుగు. అనుష్కకు కూడా ఇంత అందంగానే ఆలోచించారు. తను ఆరో నెల గర్భిణిగా ఉన్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘ఎవర్ని కోరుకుంటున్నారు? మగబిడ్డనా, ఆడపిల్లనా?’ అని అభిమానులు ఆమెను అడుగుతుండేవారు. ఆ ప్రశ్నలకు సమాధానమే ఆ పోస్ట్. ‘‘మన సమాజంలో మగ బిడ్డ పుట్టడం ఒక ప్రత్యేక విషయం. ఈ దృష్టిని మనం వదులుకోవాలి. ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేసేలా మగపిల్లల్ని పెంచడం.. అదీ మనకు ఉండాల్సిన ప్రత్యేకత. తల్లిదండ్రుల బాధ్యత కూడా. మహిళలు సురక్షితంగా, భద్రంగా మసులుకునేలా అబ్బాయిని పెంచాలి. అప్పుడు మనకు అబ్బాయి ఉండటం గొప్ప అవుతుంది’’ అని ఆ పోస్ట్‌లో అనుష్క రాశారు. సందేహం లేదు అనుష్క ఆశించినట్లు బబిత కొడుకు పెరుగుతాడు. బబిత కోరుకున్నట్లు అనుష్క కూతురు ఈక్వల్ ఈక్వల్‌గా పెరుగుతుంది. -
బస్టాప్ వెనుక ప్రసవం
జనగామ: నిండు గర్భిణి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో రెండు గంటలు నరకయాతన అనుభ వించింది. నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు కనికరించలేదు. రక్తం తక్కువగా ఉందని... హన్మకొండకు తీసుకెళ్లమని చెప్పి చేతులెత్తేశారు. అంబులెన్స్ అందుబాటులో లేక ఆ గర్భిణి పురిటి నొప్పులతో విలవిల్లాడి పోయింది. చివరకు ప్రభుత్వాసుపత్రి పక్కనే రోడ్డుపైనున్న బస్టాప్ వెనుకకు వెళ్లి పడిపోయింది. అక్కడే ప్రసవించింది. మానవత్వానికి మచ్చ తెచ్చిన ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని చంపక్‌హిల్స్ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో జరిగింది. వైద్యసిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన షేక్ హుస్సేన్ తన భార్య షేక్ బీబీని నాలుగో కాన్పు కోసం ఆదివారం చంపక్‌హిల్స్ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాని(ఎంసీహెచ్)కి తీసుకు వచ్చాడు. అంతకు ముందు సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా, వైద్యుల సూచన మేరకు 108 అంబులెన్స్‌లో ఎంసీహెచ్‌కు తరలించారు. ఉదయం 10 గంటలకు డాక్టర్‌ను సంప్రదిం చగా, కాన్పు కోసం మెటర్నిటీ వార్డుకు తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యురాలు, గర్భిణికి రక్తం తక్కువగా ఉన్నట్లు గుర్తించి వెంటనే హన్మకొండ మెటర్నిటీ దవాఖానాకు రెఫర్ చేశారు. మరోవైపు బీబీకి నొప్పులు తీవ్రమ య్యాయి. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ‘కాన్పు చేయండి.. ఏం జరిగినా మాదే బాధ్యత’ అంటూ వేడుకున్నా వైద్యులు పట్టించుకోలేదు. అంబులెన్స్ కోసం నిరీక్షణ హన్మకొండకు వెళ్లేందుకు బయటకు వచ్చిన గర్భిణికి అంబులెన్స్ కనిపించక పోవడంతో అక్కడే నిరీక్షించింది. గంటసేపు ఎదురు చూసి ప్రైవేట్ వాహనంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యు లు సిద్ధమయ్యారు. అప్పటికే తీవ్ర నొప్పులతో బాధపడుతున్న షేక్బీబీ... ఆస్పత్రి గేటుబయట బస్టాప్ వెనకకు వెళ్లింది. నిమిషం వ్యవధిలోనే అరుపులు, కేకలు వినిపించడంతో తల్లీ, భర్త అటు వైపు వెళ్లారు. పండంటి కొడుకును చేతిలో పట్టు కుని, అలాగే గోడకు కూర్చుని ఉన్న బీబీని చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నా బిడ్డను కాపా డండి అంటూ తల్లి కన్నీటిపర్యంతం కావడంతో డాక్టర్, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. తల్లిబిడ్డను ఎమర్జెన్సీవార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఎంసీహెచ్ ఘటనపై ఎంపీ కోమటిరెడ్డి ఆరా జనగామలో గర్భిణి ఆస్పత్రి బయటనే ప్రసవించిన సంఘటనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరా తీశారు. ప్రసూతి కోసం ఆస్పత్రికి వచ్చే పేద కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎంపీ కోమటిరెడ్డి సూచించారు. ఎంపీ స్థానిక నాయకుల ద్వారా బాధిత మహిళ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గర్భిణికి అధిక రక్తస్రావం కావడం వల్లే... గర్భిణి షేక్ బీబీకి అధిక రక్తస్రావం జరి గింది. హన్మకొండ ఆస్పత్రికి వెళ్లాలని రెఫర్ చేశాం. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో రక్తం యూనిట్లు ఇక్కడ దొరికే పరిస్థితి లేదు. అందుకే డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంబులెన్స్ కూడా సిద్ధం చేయగా, కుటుంబ సభ్యులు హన్మకొండకు వెళ్లేందుకు విముఖత చూపించి సిద్దిపేటకు వెళ్తామని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలోనే ఆమె బయటకు వెళ్లడంతో కాన్పు జరిగిపోయింది. ఇందులో మా నిర్లక్ష్యం లేదు. – డాక్టర్ పజారి రఘు, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ -
ఏ తల్లి పాలోఈ ప్రాణధారలు
ప్రాణమిచ్చిన అమ్మ.. పాలు ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వడానికి ఆ తల్లి దగ్గర పాలు లేకపోవచ్చు. ఒక్కోసారి తల్లే లేకపోవచ్చు! అయినా సరే.. ఆకలితో డొక్కలు ఎగిరేలా బిడ్డ ఏడ్వకూడదు. ఏడ్చాడంటే.. పాలు లేవని కాదు. అమ్మ లేదని కాదు. ఆ బిడ్డ జీవించే హక్కును కాపాడేవారు లేరని! పాలిచ్చే తల్లి లేకపోయినా..పాలు పంచే తల్లులకు కొదవలేదని ‘ధాత్రి’ నిరూపిస్తోంది.అభాగ్య శిశువులకు ప్రాణధారలు పోస్తోంది. పుట్టిన ప్రతి బిడ్డా బతికి బట్టకట్టాలి. తల్లి గర్భంలో జీవం పోసుకున్నప్పుడే జీవించే హక్కుకు తనతో భూమ్మీదకు తెచ్చుకుంటుంది ప్రాణి. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత అమ్మానాన్నలదే కాదు, సమాజంలో అందరి మీదా ఉంటుంది. అయితే అందరూ అన్ని బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లే కనిపిస్తుంటుంది. అయినా చంటిబిడ్డల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు వైద్యం అందక ప్రాణాలు పోతున్న చంటిపిల్లల కంటే తల్లిపాలు లేక మరణాన్ని ఆశ్రయిస్తున్న వాళ్లే ఎక్కువ అంటే నమ్మడానికి బాధగానే ఉంటుంది. అయినా ఇది నిజం. ఇరవై ఒకటో శతాబ్దంలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ ఎంత గొప్ప హాస్పిటల్ అయినా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన బిడ్డలకు వైద్యం మాత్రమే చేయగలుగుతుంది. ఆ బిడ్డకు తల్లి పాలనివ్వడం ఇటు హాస్పిటల్ చేతిలోను, అటు వైద్యరంగం చేతిలోను లేని విషయం. బిడ్డకు తల్లిపాల కొరతను తీర్చే టానిక్‌ను ఇవ్వడం వైద్యరంగం చేయలేని పని. ఇది కేవలం మరో తల్లి మాత్రమే చేయగలిగిన పని. అందుకే పుట్టే బిడ్డల కోసం తల్లిపాల బ్యాంకులు కూడా పుట్టాయి. ‘ధాత్రి’ కూడా అలాగే పుట్టింది. ధాత్రి అంటే పెంపుడు తల్లి. ‘‘తల్లికి దూరమైన బిడ్డను కన్నతల్లిలా పెంచే మరో మహిళను ధాత్రి అంటారు. అందుకే తల్లిపాలకు దూరమైన బిడ్డలకు తన పాలిచ్చి కాపాడే తల్లి పాల బ్యాంకుకు ధాత్రి అని పేరు పెట్టాం’’ అని చెప్పారు హైదరాబాద్, నీలోఫర్ హాస్పిటల్‌లోని తల్లిపాల బ్యాంకు నిర్వహకులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్. పాలిచ్చే అమ్మ ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తూ... తల్లి పాలు లేక తల్లడిల్లుతున్న మరో బిడ్డకు ఒక పూట పాలివ్వడం మనకు పూర్వం నుంచి ఉన్న సంప్రదాయమే. ఒక అవసరం నుంచి ఆర్ద్రతతో పుట్టుకొచ్చిన సహాయం ఇది. పురిటిలోనే తల్లి ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ తల్లిలేని బిడ్డకు మరో బాలింత తన మాతృత్వాన్ని పంచేది. తన బిడ్డతోపాటు తల్లిలేని బిడ్డకు కూడా ప్రాణం పోసేది. ఒక తల్లి అనారోగ్యం పాలైనప్పుడు కూడా ఆమె కోలుకునే వరకు ఆ బిడ్డను మరో తల్లి ఆదుకునేది. విదేశాల్లో ‘వెట్ నర్సింగ్’ పేరుతో పిలిచినా, మనదేశంలో దాదమ్మ అని, పాల దాది అని, పాలమ్మ అనీ పిలిచినా... ఆ పాలిచ్చిన తల్లిని కన్నతల్లితో సమానంగా ప్రేమించేవాళ్లు పిల్లలు. పాలిచ్చిన తల్లులు... ఆ బిడ్డకు తన కన్నబిడ్డతో సమానంగా ప్రేమను పంచేవాళ్లు. ఇప్పుడూ ఉన్నారు ‘‘కెరీర్ కోసం పరుగులు తీసే క్రమంలో తల్లులు తమ బిడ్డలకు పాలివ్వడానికి కూడా టైమ్ లేకుండా ఉంటున్నారు. ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి చేసిన మా ప్రయత్నం సఫలమైంది. మా హాస్పిటల్‌కి వచ్చే మహిళలు తమ బిడ్డలకు పాలిస్తూ, మరో తల్లి బిడ్డకు కూడా పాలిస్తున్నారు’’ అంటున్నారు ధాత్రి మదర్ మిల్క్ బ్యాంకు స్థాపకులు డాక్టర్ సంతోష్‌కుమార్. ‘‘నెలలు నిండక ముందే పుట్టే పిల్లలను, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స చేస్తాం. ఇతర అనారోగ్యాలతో పుట్టిన పిల్లలు కూడా ఉంటారు. ట్రీట్మెంట్ సమయంలో బిడ్డకు పాలు పట్టాల్సిన ప్రతిసారీ తల్లి అందుబాటులో ఉండడం సాధ్యం కాదు. మా హాస్పిటల్‌కి వైద్యం కోసం వచ్చే చంటిపిల్లలు రోజూ మూడు వందల మందికి తగ్గరు. అంతకుముందు వాళ్లందరికీ ఫార్ములా పాలు, ఇతర పోతపాలు పట్టేవాళ్లం. అయితే రోజుల బిడ్డకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. తల్లిపాలలో ఉండే హెచ్ఎమ్వో బిడ్డ పేగును రక్షిస్తుంది. ఇతర ఏ పాలు పట్టినా జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపించేది. దాంతో ఒక సమస్య నుంచి బయటపడిన బిడ్డ మరో సమస్యతో బాధపడాల్సి వచ్చేది. దీనికి పరిష్కారం తల్లిపాల బ్యాంకును స్థాపించడమే అనుకున్నాం. మా ప్రయత్నం విజయవంతమైంది. శిశు మరణాలను తగ్గించగలిగాం. నీలోఫర్ హాస్పిటల్లో రోజుకు నాలుగున్నర లీటర్ల పాలను ప్రాసెస్ చేసి అనారోగ్యంతో ఉన్న చంటిబిడ్డలకు, అనాథ బిడ్డలకు అందించగలుగుతున్నాం. రోజుకు తొమ్మిది లీటర్ల పాలను సేకరించగలిగితే తల్లిపాల కోసం తపించే బయటి పిల్లలకు కూడా ఇవ్వడం సాధ్యమవుతుంది’’ అన్నారాయన. వచ్చి ఇస్తున్నారు నీలోఫర్ హాస్పిటల్‌కి రోజూ యాభై మంది వరకు పాలిచ్చే తల్లులు వస్తున్నారు. వచ్చేవారిలో ఓ ఇరవై మంది కేవలం పాలను డొనేషన్ ఇవ్వడానికే ఇస్తున్నారు. తన బిడ్డ తాగిన తర్వాత అదనంగా ఉన్న పాలను మరో బిడ్డకు ఇవ్వడం కోసమే హాస్పిటల్‌కి వస్తున్న తల్లులు వాళ్లు. మరికొంత మంది హాస్పిటల్లో పంప్ సహాయంతో పాలు తీసి తమ బిడ్డకు అవసరమైనన్ని తమతో ఇంటికి తీసుకువెళ్తారు, కొన్ని పాలను హాస్పిటల్లో ఉన్న పిల్లలకు ఇస్తారు. బ్రెస్ట్ పంప్ సహాయంతో పాలను బాటిల్స్‌లోకి సేకరిస్తారు. అలా అందరి పాలను కలిపేసి పాశ్చరైజ్ చేస్తారు. పాశ్చరైజేషన్ ప్రక్రియకు సుమారు రెండున్నర గంటల సమయం పడుతుంది. పాశ్చరైజేషన్ తర్వాత పాలను కొత్త బాటిల్స్‌లో నింపుతారు. అవి పిల్లలు తాగడానికి సిద్ధంగా ఉన్న పాలు. ఈ పాలను మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే ఏడాది పాటు తాజాగా ఉంటాయి. – డాక్టర్ సంతోష్ కుమార్,ఫౌండర్ డైరెక్టర్, ధాత్రి లాక్టేషన్ సెంటర్ ఇంట్లో నిల్వ చేసిన పాలు ఉద్యోగాలకు వెళ్లే తల్లులు ఇంట్లోనే బ్రెస్ట్ పంప్‌తో పాలను తీసి బిడ్డకు తాగించవచ్చు. తల్లి నుంచి తీసిన పాలను మన వాతావరణంలో గది ఉష్ణోగ్రతలో ఉంచినా కూడా నాలుగు గంటల వరకు తాజాగా ఉంటాయి. అంతకంటే ఎక్కువ సేపు నిల్వ చేయాల్సి వస్తే ఫ్రిజ్‌లో పెట్టి 24 గంటల వరకు వాడుకోవచ్చు. డీప్ ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పాలు 72 గంటల వరకు తాజాగా ఉంటాయి. వీటికి పాశ్చరైజేషన్ అవసరం లేదు. బ్యాంకులు పెరగాలి బాలింతలున్నారు, చంటిబిడ్డలూ ఉన్నారు. ఆ ఇద్దరినీ కలిపే వార«ధులే తల్లి పాల బ్యాంకులు. మనదేశంలో ఈ మదర్ మిల్క్ బ్యాంకులు పద్దెనిమిది మాత్రమే ఉన్నాయి. అది కూడా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పూనా, ఉదయ్‌పూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒకతల్లి పాల బ్యాంకును స్థాపించగలిగితే శిశుమరణాలనేవి లేకుండా చేయవచ్చు. మా హాస్పిటల్లో మిల్క్ బ్యాంకు స్థాపించడానికి ఎనభై లక్షలైంది. నిర్వహణ వ్యయం నెలకు లక్షన్నర వరకు అవుతోంది. పుట్టిన ప్రతి బిడ్డా ఆరోగ్యంగా పెరగాలంటే తల్లి పాలు తప్పని సరి. హెల్దీ నేషన్ బిల్డింగ్‌లో ప్రధానమైన వాళ్లు చంటిబిడ్డలే. అందుకే ఈ మాత్రం ఖర్చుకు ప్రభుత్వాలు వెనుకాడకూడదు.– డాక్టర్ శ్రీనివాస్ గౌడ్,డైరెక్టర్, ధాత్రి కాంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్,నీలోఫర్ హాస్పిటల్, హైదరాబాద్ కంటిరెప్ప కంటే ఎక్కువే ‘‘ధాత్రి అనే పాపాయి 900 గ్రాముల బరువుతో పుట్టింది. నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి రెండున్నర నెలల పాటు పాశ్చరైజ్ చేసిన మదర్ బ్యాంకు పాలను పట్టాం. పాపాయి బరువు రెండున్నర కేజీలకు పెరిగే వరకు అలా కాపాడాం. కేజీ బరువు కూడా లేకుండా భూమ్మీదకొచ్చిన బిడ్డలను బతికించడం చిన్నసంగతి కాదు. కంటికి రెప్పలా కాపాడాం అనేది చాలా చిన్న మాటే అవుతుంది. అలాంటి సంక్లిష్ట స్థితిని ధైర్యంగా దాట గలిగింది తల్లి పాల ఆసరాతోనే. తల్లి పాలను పాశ్చరైజ్ చేసి, మైనస్ 20 డిగ్రీలలో నిల్వ చేస్తే ఏడాది వరకు నిల్వ ఉంటాయి. తల్లిపాలంటే ద్రవరూపంలో ఉన్న బంగారం. బిడ్డకు ఒంటి నిండా బంగారంతో నింపడం కంటే బంగారంలాంటి తల్లిపాలనిచ్చి బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేద్దాం’’ అన్నారు డాక్టర్లు.– వాకా మంజులారెడ్డి -
18మంది పిల్లలు పుట్టాకే కుటుంబ నియంత్రణ..
మనోహరాబాద్ (తూప్రాన్) : 18 మంది బిడ్డలు పుట్టాకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటానని భీష్మించుకుంది ఓ బాలింత. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో నివసిస్తున్న జార్ఖండ్‌కు చెందిన ప్యారేలాల్, మహంతి దేవి దంపతులకు ఇప్పటికే ఏడుగురు పిల్లలు. జూలై 28న మహంతి దేవి ఎనిమిదో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటికైనా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించగా ఆమె నో అంటూ మొండికేసింది. కారణమేంటని అడగ్గా తమ గ్రామానికి చెందిన ఓ దంపతులకు 18 మంది సంతానం ఉన్నారని, వారికంటే ఒక బిడ్డ ఎక్కువ పుట్టేవరకు ఆపరేషన్ చేయించుకోమని ఆ దంపతులు చెప్పారు. ఈ సమాధానంతో అవాక్కయిన వైద్యులు బుధవారం వారి ఇంటికి వచ్చి నచ్చజెప్పారు. ఇప్పటికే ఉన్న పిల్లల భవిష్యత్‌పై దృష్టి పెట్టాలని కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఎట్టకేలకు వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు ఒప్పుకున్నారు. -
ఆస్పత్రిలో పురిటిబిడ్డ మృతి
హిందూపురం అర్బన్: హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో పురిటిబిడ్డ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందంటూ బాధితులు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట రాస్తారోకో చేశారు. మడకశిర సమీపంలోని చీపులేటి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ భార్య నాగలక్ష్మి రెండవ కాన్పుకోసం ఆదివారం సాయంత్రం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. వైద్య సిబ్బంది పరీక్షలు చేసి గర్భంలో బిడ్డ బాగుందని, రేపటి వరకు ఆగితే సాధారణ కాన్పు అవుతుందన్నారు. మొదటి బిడ్డకు సిజెరేషన్ చేయగా నాలుగేళ్లు తర్వాత జాగ్రత్తగా ఉంటూ రెండవకాన్పుకు ఆస్పత్రిలో చేరింది. తెల్లవారుజామున నొప్పులు రావడంతో ఉదయం సిజేరియన్ చేసి కాన్పు చేశారు. అయితే బిడ్డ చనిపోయిందని డాక్టర్ తెలిపారు. దీంతో నాగలక్ష్మి బంధువులు ఆగ్రహించారు. నిన్నటివరకు కడుపులో బిడ్డ బాగుందన్న వైద్యులు.. ఇప్పుడు ప్రాణం లేని బిడ్డను చేతికి ఇస్తారా అంటూ వైద్యులతో వాగ్వాదానికి దిగారు. బాధితులకు అండగా సీపీఎం నాయకులు నిలిచి మృతశిశువుతో ఇందిరమ్మ సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను పక్కకు తీసుకొచ్చారు. అనంతరం ఆందోళనకారులు ఆస్పత్రి గేటు వద్ద బైఠాయించారు. సీపీఎం నాయకులు వినోద్, రాము, రాజప్పలు మాట్లాడుతూ రూ.23 కోట్లతో మాతాశిశు ఆస్పత్రి కట్టారే గానీ సరిపడునంతమంది వైద్యులు లేరని, ఎమ్మెల్యే కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. -
పీహెచ్సీ ఎదుట మహిళ ప్రసవం
మహదేవపూర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఓ గిరిజన మహిళ పీహెచ్సీ ఎదుట రోడ్డుపైన ప్రసవించింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి పీహెచ్సీ ఎదుట మంగళవారం జరిగింది. ప్రస్తుతం మహదేవపూర్ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో తల్లీపాప చికిత్స పొందుతున్నారు. బాధితురాలు సమ్మక్క భర్త ఎర్రయ్య కథనం ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కిష్టరావుపేట గ్రామానికి చెందిన గిరిజన మహిళ సమ్మక్క ఏడు నెలల గర్భిణి. రోజు మాదిరిగానే కూలీ పనికి వెళ్లింది. పని చేసే చోటనే సమ్మక్కకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో తోటి కూలీలు, భర్త సమ్మక్కను సమీపంలోని అంబట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పీహెచ్సీలో ఉండాల్సిన ఇద్దరు డాక్టర్లు లేరు. దీంతో సిబ్బంది కూడా విధులకు ఎగనామం పెట్టారు. స్టాఫ్ నర్స్‌స్రవంతి సెలవులో ఉన్నారు. దీంతో పురిటి నొప్పులతో వచ్చిన సమ్మక్కకు వైద్య సేవలు అందలేదు. దీంతో అక్కడి నుంచి మహదేవపూర్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సమ్మక్కను పీహెచ్సీ ముందుకు తీసుకురాగా రోడ్డుపైనే ప్రసవించింది. చికిత్స కోసం మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా విధులకు డుమ్మా కొట్టిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
ఏం కష్టమొచ్చిందో...!
ఆ కన్నతల్లికి ఏం కష్టమొచ్చిందో...అప్పుడే జన్మించిన శిశువును చెరువు సమీపంలో ఉన్న తుప్పల్లో విడిచి వెళ్లిపోయింది. అంతలోనే శిశువు ప్రాణం పోయింది. ముక్కుపచ్చలారని ఆ శిశువుకు నిండు నూరేళ్లు తల్లి గర్భం నుంచి వచ్చిన రోజే నిండిపోయాయి. చూపరులను కంటతడి పెట్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... విజయనగరం, చీపురుపల్లి రూరల్: మండలంలోని గొల్లలములగాం గ్రామంలో ఓ శిశువు మృతదేహం చెరువు సమీపంలోని తుప్పల్లో లభ్యమైంది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. స్థానికులు అందించిన వివరాలు...గ్రామానికి ఆనుకొని ఉన్న పెద్ద చెరువు సమీప తుప్పల్లో గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఓ శిశువు మృతదేహాం నిర్జీవంగా పడి ఉండడాన్ని పాఠశాల విద్యార్థుల కంట పడింది. పాఠశాలలకు గురువారం బంద్ కావడంతో చెరువుకు ఆటల కోసం పలువురు విద్యార్థులు వెళ్లారు. విద్యార్థులు ఆడుకునే క్రమంలో బంతి చెరువు ఒడ్డున ఉన్న తుప్పల సమీపానికి వెళ్లడంతో విద్యార్థులు బంతి కోసం అటుగా వెళ్లగా అక్కడ తుప్పల్లో శిశువు మృతదేహాన్ని చూశారు. ఒక్కసారిగా ఆందోళనకు గురై గ్రామంలోకి పరుగులు తీశారు. చూసిన ఘటనను గ్రామస్తులకు చెప్పారు. గ్రామస్తులు ఘటన స్థలానికి వెళ్లి చూడగా అప్పుడే జన్మించిన మగ శిశువు మృతదేహం తుప్పల్లో పడి ఉండడాన్ని గుర్తించారు. దీంతో గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. తమ గ్రామంలో ఎప్పుడూ ఇటువంటి ఘటన ఎదురు కాకపోవడంతో అంతా ఆవేదనకు గురై కంటతడి పెట్టుకున్నారు. ఏ తల్లి బిడ్డో ఇలా తుప్పల పాలైందని కన్నీరుమున్నీరయ్యారు. వేరే గ్రామానికి చెందిన వారెవరో ఇక్కడ ఇలా శిశువును పడేసి ఉంటారని స్థానికులు ఆవేదనగా చెప్పారు. చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అనంతరం శిశువు మృతదేహాన్ని గ్రామస్తులు ఖననం చేశారు. ఇదిలా ఉండగా స్థానిక ఏఎన్ఎం గీతారాణి వద్ద ఈ విషయం ప్రస్తావించగా ఇటీవల కాలంలో జన్మించిన చిన్నారులంతా ఆరోగ్యంగా ఉన్నారని, ఒకటి రెండు రోజుల్లో ఎలాంటి జననాలు జరగలేదని వెల్లడించారు. -
మనిషి ఆకారంలో జన్మించిన గొర్రె పిల్ల
ప్రకాశం, ఉలవపాడు: చాకిచర్ల పల్లెపాలెం గ్రామంలో మనిషి ఆకారంలో ఆదివారం ఓ వింత గొర్రె పిల్ల జన్మించింది. దీనికి వీపు, తల, కాళ్లు, చేతులు ఉండటంతో గ్రామస్తులు చూడటానికి ఎగబడ్డారు. కాసేపటికే గొర్రె పిల్ల మరణించడంతో గ్రామస్తులు దాన్ని పూడ్చివేశారు. -
కుక్క నోట శిశువు చేయి
ప్రకాశం, కనిగిరి: కుక్క నోట శిశువు చేయి కనిపించడం పట్టణంలో శుక్రవారం కలకలం రేగింది. వివరాలు.. పట్టణంలోని సాయిబాబా థియేటర్ పక్కన చెత్త కుప్ప నుంచి ఓ కుక్క మోచేయి భాగాన్ని నోట కరుచుకుని కనిపించింది. అక్కడే ఉన్న యువకులు దాన్ని చూసి తొలుత రబ్బరు చేయిగా భావించారు. కుక్క చేయిని తన పిల్లలకు పీకి పెడుతుండగా రక్తం వస్తోంది. యువకులు అది శిశువు చేయిగా గుర్తించి కుక్కను తరిమి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి చెయ్యి భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెత్త కుప్పలో ఓ డబ్బా.. ఆస్పత్రులో ఉపయోగించే ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్ వంటి అనవాళ్లు ఉన్నాయి. ఆస్పత్రిల్లో జన్మించి మృతి చెందిన శిశువు మృతదేహం చేయి భాగంగా తెలుస్తోంది. శిశువు మృతదేహాన్ని ఖననం చేయకుండా చెత్త కుప్పలో పారేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మేరకు ఆస్పత్రుల్లో ఇటీవల జరిగిన డెలివరీల వివరాలు సేకరిస్తున్నారు. -
పుట్టిన గంటకే రోడ్డుపాలు
అమ్మ ఒడిలో ఊగనైతిని.. ముర్రుపాలు తాగనైతిని.. కన్నతల్లిని చూడనైతిని.. కటిక నేలపైకి జారుకుంటిని.. జాలిలేని ఓ బ్రహ్మ.. నా రాతిట్లా రాశావేందమ్మా.. ఆడపిల్లగా పుట్టడం శపమా.. అమ్మకు నేనంటే కోపమా.. ఏమో.. నేనూ ఓ పీవీ సింధులా విజయం సాధిస్తానేమో.. ఎందుకమ్మా.. నన్ను చీకట్లో విసిరేశావ్.. కాళరాత్రి మిగిల్చావ్.. పొత్తిళ్ల బంధం తెంచేశావ్.. వెక్కివెక్కి ఏడ్చేలా చేశావ్.. అంటూ అప్పుడే పుట్టిన ఓ శిశువు గుండెపగిలేలా రోదించింది. కైకలూరు : అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డుపై విసిరేసిన హృదయ విధారకరమైన సంఘటన కైకలూరులో బుధవారం అర్ధరాత్రి వెలుగుచూసింది. పోలీసు స్టేషన్‌కు కూతవేట దూరంలో ఆడ శిశువును ఇసుక దిబ్బపై పడేశారు. రెండో ఆట సినిమా నుంచి వస్తున్న వ్యక్తికి శిశువు ఏడుపు వినిపించింది. సెల్‌ఫోన్ లైట్లో చూసి ఆశ్చర్యపోయాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ షబ్బిర్ అహ్మద్, 108 సిబ్బంది శిశువును ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శిశువుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. జన్మించి గంట సమయం అవుతోందని వైద్య సిబ్బంది తెలిపారు. కైకలూరు ఆస్పత్రిలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కన్నతల్లి మనసు మార్చుకుని బిడ్డను అక్కున చేర్చుకోవాలని మనస్నువారంతా ఆశిస్తున్నారు. -
తాడిచర్లలో భ్రూణ హత్య?
మల్హర్(మంథని) : ఇంకా నెలలు నిండని పసిగుడ్డును తల్లి గర్భంలోనే చిదిమేశారు. లోకం చూడకముందే పరలోకానికి పంపేచేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గర్భస్థ శిశువును మురికికాల్వలో పడేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచెర్లలో శుక్రవారం వెలుగు చూసింది. తాడిచెర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలోని మురుగుకాల్వలో మృతశిశువు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆరు నెలల గర్భంలోనే శిశువును చిందిమేసినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతశిశువును పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ఆస్పత్రికి శిశువు మృతదేహాన్ని తరలించారు. కాగా పసికందు ఆడపిల్ల కావడంతో ఓ మహిళ గర్భం తొలిగించుకున్నట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం మండలంలోని వలెంకుంట శివారులోని బావిలో శిశువు మృతదేహాన్ని పడవేసిన ఘటన మరవకముందే మరో ఘటన చోటు దారుణం. -
పేగు బంధం తెగిందా..తెంచేశారా?
పుట్టిన బిడ్డ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆ కన్నతల్లికి ఆస్పత్రి సిబ్బంది చల్లగా చావు కబురు అందించారు. దీంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. నాకు పుట్టింది ఆడ బిడ్డా?మగ బిడ్డా? అని ఆత్రంగా అడిగిన ఆ తల్లికి నీ బిడ్డ ఉమ్మ నీరు తాగి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో భోరుమంది. నవమోసాలు మోసి అమ్మా.. అని పిలుపు కోసం ఎదురు చూసిన తల్లికి పుట్టెడు కష్టం వచ్చి పడింది. దీనిని భరించలేని బాలింత బంధువులు తమ బాబును తమకు అప్పగించాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు తన పేగు బంధం నిజంగానే తెగిందా.. వైద్యులే తెంచేశారా? అంటూ ఆ తల్లి రోదన అందరినీ కంటతడి పెట్టించింది. శ్రీకాకుళం పట్టణంలోని ఓ మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం సిటీ : బిహార్‌కు చెందిన సంజయ్సాహు, రీనాదేవి దంపతులు. వీరికి ఐదేళ్ల కాజల్, మూడేళ్ల మస్కాన్ ఉన్నారు. పట్టణంలో కలెక్టర్ బంగ్లా సమీపంలో నివాసం ఉంటున్న ఈ దంపతులు మూడో కాన్పు కోసం పట్టణంలోని కమల ఆస్పత్రిలో వైద్యుల సలహాలు తీసుకుంటున్నారు. ఈ నెల 12న రీనాదేవి ప్రసవం నిమిత్తం ఇలిసిపురం వద్ద ఉన్న కమల ఆస్పత్రి(మల్టీ స్పెషాల్టీ)లో చేరారు. అదే రోజు సాయంత్రం ఆమెకు గైనకాలజిస్ట్ శాంతిలత శస్త్రచికిత్స చేశారు. బిడ్డ పరిస్థితి ఆరోగ్యకరంగా లేనందున చికిత్స చేస్తున్నామని చెప్పి అప్పటి నుంచి బుధవారం వరకు పిల్లాడిని తల్లికి చూపించని వైద్యులు మృతి చెందాడని తరువాత చెప్పడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంధువులు ఆస్పత్రి వైద్యులను నిలదీశారు. ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. వైద్యుల తీరుపై ధ్వజమెత్తారు. తమ బిడ్డను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు ఆస్పత్రి వద్ద పరిస్థితిని చక్కదిద్దారు. గైనకాలజిస్ట్ శాంతిలత బుధవారం విధులకు హాజరు కాకపోవడంతో కమల ఆస్పత్రి ఎండీ రామకృష్ణ బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. బాబును అప్పగించాలి... నాకు రెండుసార్లు సాధారణ ప్రసవం జరిగింది. మూడోసారి ఆపరేషన్ గదిలో తనకు సాధారణ ప్రసవం జరుగుతుండగా బిడ్డ తలపై వైద్యులు నొక్కిపెట్టి బిడ్డ బయటకు రాకుండా శస్త్రచికిత్సను చేశారు. సిజేరియన్ జరిగిన తర్వాత బాబు పుట్టినట్లుగా తనకు వైద్యులు చెప్పారు. ఇప్పుడు పాప పుట్టిందని, ఉమ్మ నీరు తాగడం వల్ల చనిపోయిందని తమతో వాదిస్తున్నారు. - రీనాదేవి, తల్లి -
మూడోసారీ ఆడిపిల్లే పుట్టిందని..
వరంగల్: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టినందుకు తల్లిదండ్రులే పసికందును చంపేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రి సిబ్బంది శిశువు ప్రాణాలు కాపాడారు. వరంగల్ జిల్లాలో నెల్లికుదురు మండలం జామతండాలో ఈ సంఘటన జరిగింది. పసికందును హతమార్చేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు ఐసీడీఎస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినా మారని తల్లిదండ్రులు బిడ్డను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. అధికారులు పసికందును బాలికల సంరక్షణ గృహానికి తరలించారు.