కుక్క నోట శిశువు చేయి | Dog caught with Baby arm In prakasam district | Sakshi
Sakshi News home page

కుక్క నోట శిశువు చేయి

Published Sat, Dec 16 2017 12:24 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

Dog caught with Baby arm In prakasam district - Sakshi

సంఘటన స్థలం వద్ద పోలీసులు, గుమిగూడిన స్థానికులు ,శిశువు చెయ్యి భాగం

ప్రకాశం, కనిగిరి: కుక్క నోట శిశువు చేయి కనిపించడం పట్టణంలో శుక్రవారం కలకలం రేగింది. వివరాలు.. పట్టణంలోని సాయిబాబా థియేటర్‌ పక్కన చెత్త కుప్ప నుంచి ఓ కుక్క మోచేయి భాగాన్ని నోట కరుచుకుని కనిపించింది. అక్కడే ఉన్న యువకులు దాన్ని చూసి తొలుత రబ్బరు చేయిగా భావించారు. కుక్క చేయిని తన పిల్లలకు పీకి పెడుతుండగా రక్తం వస్తోంది. యువకులు అది శిశువు చేయిగా గుర్తించి కుక్కను తరిమి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి చెయ్యి భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చెత్త కుప్పలో ఓ డబ్బా.. ఆస్పత్రులో ఉపయోగించే ఓ పెద్ద ప్లాస్టిక్‌ కవర్‌ వంటి అనవాళ్లు ఉన్నాయి. ఆస్పత్రిల్లో జన్మించి మృతి చెందిన శిశువు మృతదేహం చేయి భాగంగా తెలుస్తోంది. శిశువు మృతదేహాన్ని ఖననం చేయకుండా చెత్త కుప్పలో పారేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మేరకు ఆస్పత్రుల్లో ఇటీవల జరిగిన డెలివరీల వివరాలు సేకరిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement