Dust Bin
-
కైపులో.. రాత్రంతా చెత్తకుండీలో
మైసూరు: మద్యం మత్తులో చెత్తకుండీలో పడిపోయి రాత్రంతా అందులోని పడుకున్న వ్యక్తిని బుధవారం పారిశుధ్య కార్మికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. డీడి మొహల్లాలోని ఓ చెత్తకుండీని లారీలో ఎక్కించడానికి కార్మికులు ప్రయత్నిస్తున్న సమయంలో చెత్తకుండీలో నుంచి వ్యక్తి కాలు బయటకు రావడాన్ని చూసి భయపడ్డారు. నిదానంగా చెత్తను మొత్తం తొలగించి చూడగా అందులో వ్యక్తి అచేతనంగా పడి ఉన్నాడు. ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. మద్యం కైపులో అతడు చెత్తకుండీ లోపలికి పడిపోయాడు. జనం అలాగే చెత్త వేశారు. ఎలాగో ఊపిరి ఆడడంతో ప్రాణాలు మిగిలే ఉన్నాయి. -
చెత్తబుట్టలో కాఫీ పొడి టీ ఆకులు పడేస్తున్నారా?!
చాలా మందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ చుక్క గొంతులో పడందే పనులు మొదలవ్వవు. టీ లేదా కాఫీ డికాషన్‌ను వడకట్టాక అడుగున పొడి/ఆకులు మిగిలిపోతాయి. దీనిని చాలా వరకు చెత్తబుట్టలోనే పడేస్తుంటారు. అలా కాకుండా ఇక నుంచి వాడేసిన ఆ టీ ఆకులు లేదా పొడి పదార్థాలను చర్మ పోషణకు, ఇంటి అందానికి ఉపయోగించవచ్చు. అదెలాగో చూద్దాం... మొటిమల నివారణ ఒకసారి ఉపయోగించిన టీ ఆకులను వేడి నీటిలో వేసి చల్లారేవరకు ఉంచాలి. ఆ నీళ్లను ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శభ్రపరుచుకోవాలి. దీని వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. పాదాలకు టీ నీళ్లు ఈ టీ ఆకుల నీటిలో పాదాలను ఉంచాలి. పావుగంట సేపు అలాగే ఉంచి, తర్వాత బయటకు తీసి పాదాలను తడి లేకుండా తుడవాలి. దీంతో పాదాలపై ఉన్న ట్యాన్ సమస్య తగ్గిపోతుంది. దురద, పాదాల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉంటే తగ్గుతాయి. కాలిన కొద్దిపాటి గాయాలకు మందులా పనిచేస్తుంది. దుర్వాసన కూడా దరిచేరదు. కాబట్టి వేడి టీ రుచిని ఆస్వాదించినప్పుడు దాని అవశేషాన్ని పడేయకుండా ఇలా వాడుకోవచ్చు. బాడీ స్క్రబ్ కాఫీ పొడిని బాడీ స్క్రబ్‌గా ఉపయోగిస్తే చర్మంపై మలినాలు, ట్యాన్ సమస్య తగ్గుతుంది. ఫ్రిజ్ దుర్వాసన దూరం ప్రిజ్‌లో రకరకాల పదార్థాల వల్ల దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే వాడిన టీ లేదా కాఫీ పొడి వేసి మరిగించిన నీటిలో మెత్తటి క్లాత్ ముంచి, లోపలి భాగమంతా తుడవాలి. ఒక చిన్న గిన్నెలో వాడిన కాఫీ పొడిని వేసి ఫ్రిజ్‌లో ఓ మూలన ఉంచాలి. దుర్వాసన దరిచేరదు. ఫర్నీచర్ కొత్తగా! చెక్క ఫర్నీచర్ తరచూ గీతలు పడే అవకాశం ఉంది. ఆ గీతలు మీకు నచ్చకపోతే వాడిన కాఫీ పేస్ట్‌ను గీతల మీద రాసి 15 నిమిషాల తర్వాత మెత్తటి క్లా™Œ తో తుడవాలి. గీతలు కనిపించవు. చెక్క ఫర్నీచర్‌ని ఈ కాఫీ నీళ్లతో తుడిచేస్తే కొత్తగానూ కనిపిస్తాయి. సేంద్రీయ ఎరువు ఇతరత్రా వాడకం కుదరకపోతే ఒక కుండీలో వాడిన కాఫీ లేదా టీ పొడులను వేస్తూ పైన మట్టి వేస్తూ ఉండండి. కొన్ని రోజుల్లోనే ఇది మొక్కలకు సేంద్రీయ ఎరువులా ఉపయోగపడుతుంది. ఈ ఎరువు వల్ల మొక్కలకు పోషకాలు అంది వాటి పెరుగుదల బాగుంటుంది. ఫలితంగా మీ ఇంటి గార్డెన్లో పచ్చని మార్పులు వస్తాయి. -
తల్లి శవాన్ని చెత్తకుండిలో వేశాడు
ఆతనో ఆలయ పూజారి.. చాలీచాలని ఆదాయంతో బతుకు బండిని లాగిస్తున్నాడు. వృద్దురాలైన తల్లి ఆతని వద్దే ఉంటోంది. ఇంతలో హఠాత్తుగా అనారోగ్యంతో తల్లి మృతి చెందింది.ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి అతడి వద్ద డబ్బులు లేవు. దిక్కుతోచని స్థితిలో గుండెని రాయి చేసుకుని తల్లి మృతదేహాన్ని చెత్తకుప్పలో వేశాడు. కనీసం అలా అయిన పారిశుద్ధ్య సిబ్బంది తీసుకుని వెళ్లి పాతిపెడతారని ఆ అభాగ్యుడు భావించాడు. హృదయవిదారకమైన ఈ సంఘటన తూత్తుక్కుడిలో చోటుచేసుకుంది. చెన్నై, అన్నానగర్: తూత్తుక్కుడిలో సోమవారం కన్న తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చెయ్యలేక ఆమె కుమారుడే చెత్త కుప్పలో విసిరేశాడు. తూత్తుక్కుడి ధనశేఖరన్‌నగర్ ప్రాంతంలో చెత్తకుండిలో ఉన్న వ్యర్థాలను సేకరించటానికి సోమవారం కార్మికులు అక్కడికి వచ్చారు. అప్పుడు చెత్తకుండికి పక్కన చెల్లాచెదరుగా పడి ఉన్న చెత్త వ్యర్థాల్లో ఓ మహిళ మృతదేహం ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. వెంటనే వారు సిబ్‌కాట్ పోలీసుస్టేషన్‌కి సమాచారం అందించారు. పోలీసుల విచారణలో తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి డబ్బు లేకపోవటం వలన ఆమె కుమారుడే చెత్త కుప్పలో విసిరేసినట్లు తెలిసింది. మృతురాలి పేరు వసంతి (50). ఈమె భర్త నారాయణ స్వామి. వీరికి ముత్తు లక్ష్మణన్ (29) అనే కుమారుడు ఉన్నాడు. నారాయణ స్వామి కొన్ని సంవత్సరాల క్రితం చెన్నైకి వెళ్లి అక్కడ ఉన్న ఓ ఆశ్రమంలో ఉంటున్నాడు. వసంతి తన కుమారుడు ముత్తు లక్ష్మణన్ వద్ద ఉంటూ వచ్చింది. ముత్తు లక్ష్మణన్ ఆలయ పూజారిగా ఉన్నాడు. అంతంత మాత్రం ఆదాయంతో కఠిన పేదరికంలో నివశిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో వసంతి అనారోగ్యంతో ఆదివారం రాత్రి హఠాత్తుగా మృతి చెందింది. తల్లికి అంత్యక్రియలు చెయ్యటానికి డబ్బులు లేకపోవడంతో ముత్తు లక్ష్మణన్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. తర్వాత మనస్సుని రాయి చేసుకుని తన ఇంటికి సమీపంలో ఉన్న చెత్తకుండి పక్కన తల్లి మృతదేహం విసిరేస్తే కార్పొరేషన్ కార్మికులు తీసుకుని వెళ్లి పాతిపెడతారని భావించి తల్లి మృతదేహాన్ని అక్కడ విసిరేశాడు అని పోలీసుల విచారణలో తెలిసింది. మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు తూత్తుక్కుడి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి అతని కుమారుడికి అప్పగించారు. తర్వాత కొద్ది మంది దాతల సహాకారంతో అంత్యక్రియలు నిర్వహించాడు లక్ష్మణన్. -
దారుణం: చెత్తకుప్పలో పసికందు
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా బంటారంలో దారుణం జరిగింది. చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన పసికందును పడేసిన ఘటన మండల కేంద్రంలో కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు పసికందును చెత్తకుప్పలో పడేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. పసికందును గుర్తించిన అక్కడి వారు బయటకు తీశారు. చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నవజాత శిశువు గొంతుపై బలంగా కొట్టినట్లు, తీవ్రంగా గాయపరిచినట్లు డాక్టర్లు చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
కుక్క నోట శిశువు చేయి
ప్రకాశం, కనిగిరి: కుక్క నోట శిశువు చేయి కనిపించడం పట్టణంలో శుక్రవారం కలకలం రేగింది. వివరాలు.. పట్టణంలోని సాయిబాబా థియేటర్ పక్కన చెత్త కుప్ప నుంచి ఓ కుక్క మోచేయి భాగాన్ని నోట కరుచుకుని కనిపించింది. అక్కడే ఉన్న యువకులు దాన్ని చూసి తొలుత రబ్బరు చేయిగా భావించారు. కుక్క చేయిని తన పిల్లలకు పీకి పెడుతుండగా రక్తం వస్తోంది. యువకులు అది శిశువు చేయిగా గుర్తించి కుక్కను తరిమి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి చెయ్యి భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెత్త కుప్పలో ఓ డబ్బా.. ఆస్పత్రులో ఉపయోగించే ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్ వంటి అనవాళ్లు ఉన్నాయి. ఆస్పత్రిల్లో జన్మించి మృతి చెందిన శిశువు మృతదేహం చేయి భాగంగా తెలుస్తోంది. శిశువు మృతదేహాన్ని ఖననం చేయకుండా చెత్త కుప్పలో పారేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మేరకు ఆస్పత్రుల్లో ఇటీవల జరిగిన డెలివరీల వివరాలు సేకరిస్తున్నారు. -
ఎవరిదీ ‘పాపం'!
♦ చెత్త కుప్పలో ఏడు నెలల గర్భస్థ శిశువు ♦ మంథన్‌దేవునిపల్లిలో ఘటన మాచారెడ్డి : ఎవరి ‘పాప’మో.. ఏమో! కళ్లైనా తెరవని పసిగుడ్డుపై కాఠిన్యం చూపిందో కఠినాత్మురాలు!! కన్నపేగు బంధానికే కళంకం తెచ్చింది. ఏడు నెలల గర్భస్థ శిశువును చెత్తకుప్పలో పడేసింది. మండలంలోని మంథన్‌దేవునిపల్లిలో శనివారం ఈ ఉదంతం వెలుగు చూసింది. ఏ తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డో.. కనికరం లేకుండా కడుపులోనే తుంచేశారు.. మృత శిశువును తీసుకొచ్చి గ్రామానికి చెందిన కామటి భూమయ్య ఇంటి వెనుక చెత్తకుప్పల్లో పడేశారు. శనివారం అటువైపు వచ్చిన గ్రామస్తులకు శిశువు మృతదేహం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రొబేషనరీ ఎస్సై హరీశ్‌రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ బుజ్జి అక్కడకు చేరుకున్నారు. మృత శిశువుకు కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గ్రామానికి తీసుకొచి, ఖననం చేశారు. అవివాహిత లేక వివాహేతర సంబంధం ఉన్న మహిళే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవునిపల్లిలో మొత్తం 18 మంది గర్భిణులు ఉన్నారని, వారిలో ఎవరూ ప్రసవించలేదని తెలిపారు. ఈ శిశువు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. -
చెత్తకుండీలో ఆడశిశువు
హైదరాబాద్‌సిటీ: హైదరాబాద్‌లోని చంపాపేట ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి ఓ ఆడశిశువు లభ్యమైంది. కనికరంలేని వ్యక్తులు సుమారు మూడు నెలల శిశువును వదిలివెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న వారికి ఏడుపు వినిపించటంతో గమనించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న కంచన్‌భాగ్ పోలీసులు 108 వాహనంలో శిశువును ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెత్తకుప్పలో ఆడ శిశువు
విజయవాడ (కృష్ణా జిల్లా) : రోజుల వయసున్న ఓ ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో వదిలి వెళ్లారు. విజయవాడ బాలాజీ పేటలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. శిశువును ఓ కవర్లో ఉంచి బాలాజీపేటలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న చెత్త కుప్పలో పడేసి వెళ్లారు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును.. శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చెత్తకుప్పలో ఆడ శిశువు
మహబూబ్‌నగర్ : ఐదు రోజుల వయసున్న ఓ ఆడ శిశువును చెత్తకుప్పలో వదిలేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బస్టాండ్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న చెత్తకుప్పలో ఐదు రోజుల ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం వదిలి వెళ్లారు. కాగా బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణీకులకు శిశువు ఏడుపు వినిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చెత్తకుండీలో పసికందు మృతదేహం
ప్రకాశం: ఓ పసివాడు చెత్తకుండీలో నిర్జీవంగా పడి ఉన్న సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం లో వెలుగు చూసింది. నగరంలోని విజయటాకీస్ పక్కన చెత్తకుండీలో వారం రోజుల వయసున్న మగ శిశువు మృతదేహాన్ని స్థానికులు మంగళవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శిశువు మృతదేహాన్ని ఎవరో పడేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. -
విజయవాడలో పెరుగుతున్న గన్ కల్చర్
విజయవాడ: నగరంలో గన్ కల్చర్ క్రమేపీ పెరుగుతోంది. ఆదివారం ఓ చెత్తకుప్పలో గన్ దొరకడంతో కాస్తా విజయవాడ వాసుల్ని మరింత కలవరానికి గురి చేస్తోంది. 13 వ డివిజన్ రెవిన్యూ కాలనీ లో గన్ లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ గన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి ఆంధ్రాకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గత నెల్లో ఇదే తరహాలో గుంటూరు జిల్లాలో హేమంత్ అనే యువకుడు వద్ద తుపాకీ దొరికిన సంగతి తెలిసిందే. -
‘చెత్తశుద్ధి’ లేని వీఐపీలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం స్వచ్ఛభారత్. దేశాన్ని పరిశుభ్రమైన భారత్‌గా తీర్చిదిద్దాలనేది ఆయన లక్ష్యం. అయితే ఇండియా గేట్ వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వీఐపీలకు స్వచ్ఛ భారత్ స్ఫూర్తి అర్థం అయినట్టు కనిపించలేదు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం వీరంతా తమ సీట్ల వద్దే ఖాళీ వాటర్ బాటిళ్లు, కరపత్రాలను వదిలేశారు. వారికి సమీపంలోనే భారీ డస్ట్ బిన్ను నిర్వాహకులు ఏర్పాటు చేసినా ఎవరూ దానిని పట్టించుకోలేదు. కార్యక్రమం పూర్తయిన వెంటనే మోదీ వెంట వెళ్లేందుకు తొందరపడిన వీఐపీలు చెత్తను అక్కడే వదిలేశారు. చెత్తను వేసేందుకు ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ కిందపడి.. అందులోని వ్యర్థాలు, ఖాళీ వాటర్ బాటిళ్లు బయటపడి ఆ ప్రదేశమంతా చిందరవందరగా తయారైంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మద్దతిచ్చేందుకు బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ వచ్చిన సమయంలో వీవీఐపీ, మీడియా ఎన్‌క్లోజర్‌లో గందరగోళం చెలరేగింది. ఆమిర్‌ను కలిసేందుకు మీడియా ప్రతినిధులు, సీనియర్ అధికారులు ప్రయత్నించడంతో ఒక దశలో తొక్కిసలాట జరుగుతుందేమో అన్న పరిస్థితి నెలకొంది. స్వచ్ఛ భారత్ ప్రారంభోత్సవంలో స్కూలు విద్యార్థులే ప్రత్యేక ఆకర్షణ. వివిధ ప్రభుత్వ పాఠశాలల నుంచి 5 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరంతా మోదీతో పాటు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయడమే కాక.. ఆయన చెప్పిన పరిశుభ్రతా సూచనలను పాటిస్తూ అందరినీ ఆకర్షించారు. కార్యక్రమం సాగినంత సేపూ విద్యార్థులు మూడు రంగుల బెలూన్లు, రంగురంగుల పోస్టర్లు చేత పట్టుకుని హంగామా చేశారు. దక్షిణాది నుంచి వచ్చినవారికి హిందీలో చెప్పిన స్వచ్ఛతా సందేశం అర్థం కాలేదని, అందువల్ల తాను ఇంగ్లిష్‌లో ప్రసంగిస్తానని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు చెప్పడంతో సభికులంతా చప్పట్లు కొట్టారు. స్వచ్ఛ భారత్... యూపీఏ పథకమే: స్వచ్ఛ భారత్ పథకం కొత్తదేమీ కాదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పుకొచ్చారు. యూపీఏ హయాంలో చేపట్టిన నిర్మల్ భారత్ అభియాన్ పేరు మార్చి మోదీ సర్కారు స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించిందన్నారు. ఈ పథకాన్ని కేంద్రం వాస్తవిక కోణంలో అమలు చేయాలని లేకుంటే ఇది ఫొటో ప్రదర్శనగా మారవచ్చని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. -
ఖాదీ, మోదీలకు లైక్ కొట్టేస్తున్న రాఖీ సావంత్
ఖాదీకి కాలం చెల్లిపోయిందని అంతా అంటున్నారు. కానీ ఖాదీ మళ్లీ ఫేషనబుల్ అయిపోతోంది. ఎందుకంటే సంచలన ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ ఇప్పుడు ఖాదీ కట్టుకుంటోంది. తెల్లని ఖాదీ కుర్తా, ఖాదీ చుడీదార్, ఖాదీ ఓవర్ కోట్ వేసుకున్న రాఖీ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. రాజకీయనాయకులకు దీటుగా ట్వీట్ చేస్తోంది. తాజాగా తన అభిమానమంతా నరేంద్ర మోదీపై కురిపిస్తోంది రాఖీ. ట్విట్టర్ లో మోడీపై ఈగ కూడా వాలనీయడం లేదు. ఆమె ట్వీట్లన్నీ మోదీ పొగడ్తలతో నిండిపోతున్నాయి. అంతటితో ఆగకుండా ఆమె ఫక్తు రాజకీయ నేతలా పోజులిస్తోంది. అంతే కాదు. మరో అడుగు ముందుకెళ్లి ఇంటింటికీ వెళ్లి చెత్త కుండీలను ఉచితంగా ఇస్తోంది. ముంబాయి మురికివాడల్లో తిరుగుతూ కుటుంబానికో చెత్త డబ్బా ఇస్తోంది. పారిశుధ్యం గురించి మచ్చ లేని తెల్ల ఖాదీలో వివరించేస్తోంది. "ఇదేదో పబ్లిసిటీ కోసం చేయడం లేదు. నేను నిజాయితీగానే పని చేస్తున్నాను" అంటోంది రాఖీ సావంత్. చెత్త రాజకీయాలకన్నా చెత్త కుండీ రాజకీయాలు ఎంతో మంచివని సెలవిస్తోంది. మొత్తానికి అటు ఖాదీ, ఇటు మోదీలను సపోర్టు చేస్తూ రాఖీ సావంత్ వార్తలకెక్కుతోంది.