ఓ పసివాడు చెత్తకుండీలో నిర్జీవంగా పడి ఉన్న సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం లో వెలుగు చూసింది.
ప్రకాశం: ఓ పసివాడు చెత్తకుండీలో నిర్జీవంగా పడి ఉన్న సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం లో వెలుగు చూసింది. నగరంలోని విజయటాకీస్ పక్కన చెత్తకుండీలో వారం రోజుల వయసున్న మగ శిశువు మృతదేహాన్ని స్థానికులు మంగళవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శిశువు మృతదేహాన్ని ఎవరో పడేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.