అమెరికాలో ఊహకందని అద్భుతం జరిగింది. దీనిని విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలోని టెన్నెస్సీని తాకిన తీవ్ర తుఫానులో ఊయలతోపాటు ఎగిరిపోయిన నాలుగు నెలల చిన్నారి ఊహించని రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దేవుని దయతో తమ చిన్నారి సజీవంగా తమకు దొరికాడని తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు.
టెన్నెన్సీలో వచ్చిన బలమైన సుడిగాలి తమ ఇంటిని ధ్వంసం చేసిందని ఆ దంపతులు తెలిపారు. ఆ సమయంలో తమ ఇంటి పైకప్పు ఎగిరిపోగా, వారి పిల్లాడు ఊగుతున్న ఊయల కూడా ఎగిరిపోయింది. దీంతో ఆ చిన్నారి కుండపోత వర్షంలో.. పడిపోయిన చెట్ల మధ్య చిక్కకుపోయాడు. ఈ తుఫానులో ఆ చిన్నారితో పాటు అతని ఏడాది వయసున్న సోదరుడు, తల్లిదండ్రులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఇద్దరు పిల్లల తల్లి అయిన సిడ్నీ మూర్ (22) మీడియాతో తమకు ఎదురైన అనుభవాన్ని తెలియజేశారు. తుఫాను తాకిడికి తమ ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని, ఊయలతోపాటు తమ కుమారుడు కూడా ఎగిరిపోయాడని తెలిపారు. దీనిని చూసిన తన భర్త కుమారుడిని రక్షించేందుకు పరిగెత్తారని, అయితే తుపాను తాకిడి కారణంగా కుమారుడిని రక్షించలేకపోయారని తెలిపారు. ఈ సమయంలో మూర్ తన మరో కుమారుడు ప్రిన్స్‌టన్‌కు ఎలాంటి అపాయం కలుగకుండా గట్టిగా పట్టుకుంది. పది నిమిషాల పాటు చిన్న కొడుకు కోసం ఆ దంపతులు వెదకగా.. కూలిన చెట్ల మధ్య కుమారుడు ఉండటాన్ని వారు గమనించారు. మొదట కుమారుడు చనిపోయాడని వారు అనుకున్నారు. అయితే పిల్లాడు బతికే ఉండటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: ప్రభుత్వం మారగానే సీఎం కార్లకు కొత్త నంబర్లు!
Comments
Please login to add a commentAdd a comment