swept
-
శిశువును ఈడ్చుకుపోయిన సుడిగాలి.. తరువాత?
అమెరికాలో ఊహకందని అద్భుతం జరిగింది. దీనిని విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలోని టెన్నెస్సీని తాకిన తీవ్ర తుఫానులో ఊయలతోపాటు ఎగిరిపోయిన నాలుగు నెలల చిన్నారి ఊహించని రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దేవుని దయతో తమ చిన్నారి సజీవంగా తమకు దొరికాడని తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. టెన్నెన్సీలో వచ్చిన బలమైన సుడిగాలి తమ ఇంటిని ధ్వంసం చేసిందని ఆ దంపతులు తెలిపారు. ఆ సమయంలో తమ ఇంటి పైకప్పు ఎగిరిపోగా, వారి పిల్లాడు ఊగుతున్న ఊయల కూడా ఎగిరిపోయింది. దీంతో ఆ చిన్నారి కుండపోత వర్షంలో.. పడిపోయిన చెట్ల మధ్య చిక్కకుపోయాడు. ఈ తుఫానులో ఆ చిన్నారితో పాటు అతని ఏడాది వయసున్న సోదరుడు, తల్లిదండ్రులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన సిడ్నీ మూర్ (22) మీడియాతో తమకు ఎదురైన అనుభవాన్ని తెలియజేశారు. తుఫాను తాకిడికి తమ ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని, ఊయలతోపాటు తమ కుమారుడు కూడా ఎగిరిపోయాడని తెలిపారు. దీనిని చూసిన తన భర్త కుమారుడిని రక్షించేందుకు పరిగెత్తారని, అయితే తుపాను తాకిడి కారణంగా కుమారుడిని రక్షించలేకపోయారని తెలిపారు. ఈ సమయంలో మూర్ తన మరో కుమారుడు ప్రిన్స్టన్కు ఎలాంటి అపాయం కలుగకుండా గట్టిగా పట్టుకుంది. పది నిమిషాల పాటు చిన్న కొడుకు కోసం ఆ దంపతులు వెదకగా.. కూలిన చెట్ల మధ్య కుమారుడు ఉండటాన్ని వారు గమనించారు. మొదట కుమారుడు చనిపోయాడని వారు అనుకున్నారు. అయితే పిల్లాడు బతికే ఉండటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రభుత్వం మారగానే సీఎం కార్లకు కొత్త నంబర్లు! -
గుజరాత్లో వరద బీభత్సం.. బొమ్మల్లా కొట్టుకుపోతున్న కార్లు
జునాగఢ్: గుజరాత్‌ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు నగరాలను సైతం నీట ముంచుతున్నాయి. వరద నీటితో నదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. నవసారి, జునాగఢ్, ద్వారక, భావనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్షం కుంభవృష్టి సంభవించింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కాలనీల్లో ప్రవహించే వరద నీరు నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది. వరదల్లో వస్తువులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. जूनागढ़ : मेघ तांडव… खिलौने की तरफ़ पानी में डूबती तैरती कारें, मुख्य सड़क पर पानी का ज़बरदस्त बहाव,#JunagadhRain pic.twitter.com/T7lesOoh86 — Janak Dave (@dave_janak) July 22, 2023 నవసారి జిల్లాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. కాలనీలు వరద నీటితో బురదమయంగా మారాయి. జునాగఢ్‌లోనూ అదే పరిస్థితి. నవసారిలో 30.3 సెంటీమీటర్ల వర్షం సంభవించగా.. జునాగఢ్‌లో 21.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జులై 24 వరకు సౌరాష్ట్రలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ పక్కనే ఉన్న మహారాష్ట్రలోనూ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. మహారాష్ట్రాను కుంభవృష్టి అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. #WATCH | Maharashtra: Severe waterlogging witnessed in Yavatmal due to incessant rain in the region. pic.twitter.com/3iARiiBfbI — ANI (@ANI) July 22, 2023 ఇదీ చదవండి: నదిలో చిక్కుకున్న బస్సు.. 40 మంది అందులోనే.. వీడియో వైరల్.. -
హఠాత్తుగా పెరిగిన నది ఉధృతి... ఏకంగా 14 కార్లు గల్లంతు
మధ్యప్రదేశ్: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో సుక్ది నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఐతే కొన్ని కుటుంబాలు ఆదివారం కదా అని సరదాగా గడుపుదామని సుక్ది నదికి సమీపంలోని కట్కూట్ అడవికి వచ్చారు. అకస్మాత్తుగా నది ఉప్పెనలా ప్రవహించడంతో దాదాపు 50 మంది ఈ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఆ నది ప్రవాహధాటికి సుమారు 14 కార్లు కొట్టకుపోయాయి. దీంతో మహిళలు పిల్లలతో సహ 50 మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లి అక్కడ తలదాచుకున్నారు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు వ్యక్తులను రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు ఈ నది అకస్మాత్తుగా ఉధృతంగా ప్రవహించడం మొదలైందని పోలీస్ అధికారి జితేందర సింగ్ పవార్ పేర్కొన్నారు. ఎస్యూవీ కార్లతో సహా సుమారు 14 కార్లు ఈ నది ఉదృతికి కొట్టుకుపోయాయిని చెప్పారు. అంతేకాదు వాటిలో ఒక ఎస్యూవీ కారుతో సహ దాదాపు 10 కార్లను ట్రాక్టర్ సాయంతో బయటకు తీశామని చెప్పారు. అంతేకాదు మూడు కార్లు సుదూర ప్రాంతాలకు కొట్టుకుపోయాయని, మరో కారు వంతెన వద్ద ఉన్న హోలులో ఇరుక్కుపోయిందని చెప్పారు. ఐతే ఆ కార్ల లోపలికి నీళ్లు చేరిపోవడంతో పనిచేయకుండా మోరాయించాయిని తెలిపారు. దీంతో తాము వారిని వేరే వాహనాల్లో ఇళ్లకు పంపించినట్లు వెళ్లడించారు. అంతేకాదు సదరు పర్యాటకులు ఇలాంటి ప్రదేశాల్లో ఈ సుక్ది నది ఉప్పెనలా ముంచేస్తుందని హెచ్చరిక బోర్డులను కూడా పెట్టాల్సిందిగా స్థానిక పోలీసులను కోరినట్లు అదికారులు తెలిపారు. (చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో?) -
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వాహనాలు.. ముగ్గురు మృతి..
జైపూర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రాజస్థాన్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కాగా, కుండ పోత వర్షం కారణంగా.. సవాయిమాధోపూర్ జిల్లాలో రెండు వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ విషాదం సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సవాయి మాధోపూర్ జిల్లాకు చెందిన పప్పూలాల్ తన పిల్లలు, బంధువులతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో వర్షం ప్రారంభమైంది. దీంతో ఇంటికి తిరుగుప్రయాణమయ్యేటప్పుడు నీటి ప్రవాహం పెరిగింది. కారు అదుపుతప్పి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మాన్సింగ్ (13), రౌనక్ (9) నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. వారికోసం ఎంత వెతికిన లాభం లేకుండా పోయింది. అయితే, పప్పూలాల్, అతని బంధువులను విపత్తు నిర్వహణ అధికారులు రక్షించారు. ఆ తర్వాత వారు కొంత దూరంలో పొదల్లో మైనర్ బాలలు చిక్కుకుని విగత జీవులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా, మరోఘటనలో.. జైరా నుంచి టాంక్కు గీతాదేవి (42) అనే మహిళ మృత దేహన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్‌లో గీతాదేవి కొడుకు అంకిత్ (12), ఆమె భర్త రామ్జీలాల్ (45) ప్రయాణిస్తున్నారు. నీటి ఉధృతి కారణంగా అంబులెన్స్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీనిలో ఆమె కుమారుడు అంకిత్ మరణించగా, ఆమె భర్త గల్లంతయ్యారు. కాగా, అంబులెన్స్ డ్రైవర్, ఆమె బంధులువులు అద్దాలు పగులకొట్టి ప్రాణాలతో బయటపడ్డారని బరౌని పోలీస్ అధికారి దాతర్ సింగ్ పేర్కొన్నారు. -
ఫేస్ బుక్ లో షాకింగ్ వీడియో..
చెన్నైః సామర్థ్యానికి మించి.. భారీగా ప్రయాణీకులను ఎక్కించుకున్న ఓ బస్సు వరదల్లో కొట్టుకుపోవడం తమిళనాడు ప్రాంతంలో షాకింగ్ కు గురిచేస్తోంది. ప్రయాణీకులతోపాటు వరదల్లో చిక్కుకున్న బస్సును వీడియోగా చిత్రించిన వ్యక్తి.. దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడా వీడియో ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా అటు వాహనదారులు, ఇటు ప్రయాణీకులూ అప్రమత్తం కావడం లేదు. వర్షాలు, వరదలూ వచ్చిన సమయంలోనైనా కనీస జాగ్రత్తలు పాటించకుండా ప్రయాణాలు సాగించడం పరిపాటిగా మారిపోయింది. బస్సులోపలే కాక.. టాప్ మీద సైతం ప్రయాణీకులను భారీగా ఎక్కించుకుని ఓవర్ లోడ్ తో వెడుతున్నఓ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్లలో ఆందోళన రేపుతున్నాయి. వరద బీభత్సంతో కొట్టుకుపోతున్న బస్సులోని కొందరు ప్రయాణీకులు ప్రాణాలు కాపాడుకునేందుకు నీటిలో దూకగా.. మిగిలినవారు బస్సుతోపాటు నదిలో కొట్టుకుపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కళ్ళెదుట కనిపించిన దృశ్యాలను వీడియోలో బంధించిన ఓ వినియోగదారుడు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. తమిళనాడు ప్రాంతంలో ఈ బస్సు ప్రమాదం జరిగినట్లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ షాకింగ్ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వేలకొద్దీ వ్యూస్ తో పాటు.. వందలసార్లు షేర్ కూడా అయ్యింది. కాగా ప్రమాదం ప్రస్తుత వర్షాల కారణంగా వచ్చిన వరదలకు సంబంధించినదా, గతంలో చెన్నైలో సంభవించిన వరదలకు చెందినదా అన్న వివరాలు మాత్రం తెలియలేదు. -
ఫేస్ బుక్ లో షాకింగ్ వీడియో..
-
భయంకర ఇసుక తుఫాను!
చైనాః హాలీవుడ్ సన్నివేశాలను తలపించే భయంకర ఇసుక తుఫాను కస్గర్ నగరాన్ని వణికిస్తోంది. చైనా జిన్జియాంగ్ ఇగూర్ అటనమస్ ప్రాంతంలోని కాష్గర్ ఫ్రిఫెక్చర్ లో సంభవించిన ఇసుక తుఫానుతో అక్కడి గృహాలన్నీ కప్పడిపోయాయి. 100 మీటర్ల ఎత్తులో పైకి లేస్తున్న ఇసుక... అతి పెద్ద భవనానలను సైతం కప్పేస్తుండటంతో పరిస్థితి అతి భయానకంగా మారిపోయింది. కాష్గర్ పరిస్థితిని సమీక్షించిన స్థానిక వాతావరణ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికగా అరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. వాయువ్య చైనా జిన్జియాంగ్ ఇగూర్ ప్రాంతంలో ఏర్పడ్డ తీవ్ర ఇసుక తుపానుతో.. టంగ్జంక్ నగరం, మిన్ ఫెంగ్ కౌంటీలు భారీ ఇసుక కెరటాల్లో చిక్కుకుపోయాయి. ఆ రెండు ప్రాంతాలూ ఇసుక కెరటాలతో తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో అధికారులు స్థానికులను ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళనుంచి బయటకు రావద్దని హెచ్చిరికలు జారీ చేశారు. అక్కడి పరిస్థితిపై స్థానికులు చిత్రించిన వీడియో ఇప్పడు యూట్యూబ్ వినియోగదారుల్లో ఆత్రుతను నింపుతోంది. తుఫాన్లతో నీటికి కొట్టుకుపోయే నగరాలను చూసేందుకే అలవాటు పడ్డ జనం... ఇసుక తుఫానుతో ఏకంగా నగరాలకు నగరాలనే కప్పేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. -
మృత్యువును కళ్లారా చూసి బయటపడ్డారు!
లాహోర్: అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్డు. పాకిస్థాన్, చైనా మధ్య ఉంటుంది. కారాకోరమ్ పర్వత శ్రేణులకు ఆనుకొని ఈ రోడ్డు ఉంది. కొండచరియలు, వర్షాలు పడితే భారీ వరదలు ఈ రోడ్డుపై నిత్యం కనిపించే దృశ్యాలు. బ్రిడ్జీలు కూడా కొట్టుకుపోయేంత ఉధృతంగా ఇక్కడ వరదలు వస్తుంటాయి. గత కొద్ది రోజులుగా ఈ కారాకోరం పర్వత శ్రేణుల్లో వర్షం పడుతోంది. దీంతో ఈ రోడ్డుపై వరద పోటెత్తింది. అదే సమయంలో కొందరుపాకిస్థాన్ వాసులు ఒక బస్సులో ఆ మార్గం గుండా వచ్చి ఆ వరదల్లో చిక్కుకుపోయారు. పక్కనే పెద్ద లోయ. కాసేపట్లోనే ఆ వరద బస్సును కబళించింది. దీంతో అందులో ఉన్నవారికి గుండెలు జారినంత పనైంది. ధైర్యం చేసి బస్సు కిటికీల అద్దాలు తెరిచి గబగబా అందులో నుంచి ఒడ్డుకు దూకేశారు. ఒక వ్యక్తి మాత్రం బస్సులోని చిక్కుకుపోయాడు. వరద బస్సును అమాంతం ఈడ్చుకెళుతుండటంతో అతడు మెల్లగా బస్సు చివరి అంచునుంచి ముందు టైరువరకు పాక్కుంటూ వచ్చి ఏదో ఒకలా ఊపిరంతా కూడబబట్టుకొని ఒక్క ఉదుటన దూకగా అప్పటికే ఒడ్డున ఉన్నవారు అతడిని బయటకు లాగారు. దీంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది క్షణాల తేడాతో అంతా మృత్యువు నుంచి తప్పించుకోగలిగారు.