Tornado
-
USA:హాలిడే సీజన్‌పై టోర్నడోల ఎఫెక్ట్
కాలిఫోర్నియా:క్రిస్మస్,న్యూఇయర్ సెలవులను ఎంజాయ్ చేద్దామనుకున్న అమెరికా(America) వాసులను వాతావరణం ఇబ్బందులకు గురిచేస్తోంది. టోర్నడోలు, భారీ మంచు కారణంగా ఏకంగా 7వేల దాకా విమానాలు శనివారం(డిసెంబర్28) ఆలస్యంగా నడిచాయి. దీంతో బంధు,మిత్రులతో కలిసి సెలవులు సరదాగా గడుపుదామనుకున్నవారికి నిరాశే ఎదురైంది.అట్లాంటా,హూస్టన్లలోని విమానాశ్రయాల నుంచి విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఆగ్నేయ రాష్ట్రాలైన టెక్సాస్,లూసియానా,మిసిస్సిపిలలో కనీసం పది టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడోల ధాటికి ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు.కాలిఫోర్నియాలోని టాహో బేసిన్లో భారీ వర్షాలతో పాటు మంచు కురవనుందని వాతావరణశాఖ తెలిపింది.కాగా ఇయర్ ఎండింగ్లో అమెరికాలో కక్రిస్మస్తో పాటు న్యూఇయర్‌ను పురస్కరించుకుని ఉద్యోగులకు వరుస సెలవులు వస్తాయి. దీంతో సెలవుల్లో సరదాగా పర్యటనలకు వెళ్లడంతో పాటు బంధు,మిత్రులను కలిసేందుకు అమెరికా వాసులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. దీంతో ప్రస్తుతం అక్కడి విమానాశ్రయాలన్నీ కిటకిటలాడుతుంటాయి. -
అడవిని మింగిన సుడిగాలి
పచ్చని అడవులు సుడిగాలి బీభత్సానికి అతలాకుతలం అయ్యాయి. మహావృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుపోయి, నేలకొరిగాయి. ఇదివరకు ఎన్నడూ కనివిని ఎరుగని ఈ బీభత్సం ములుగు జిల్లా తాడ్వాయి– మేడారం అభయారణ్యంలో జరిగింది. దాదాపు టోర్నడోను తలపించే ఈ ఉత్పాతం ఎందుకు జరిగిందనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) శాస్త్రవేత్తలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ బీభత్సానికి కారణాలు కనుగొనేందుకు అధ్యయనం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్న వేళ ఆగస్టు 31న సాయంత్రం సుమారు 4.30 నుంచి 7 గంటల సమయంలో మేడారం అటవీ ప్రాంతం ఈ ఆకస్మిక ఉపద్రవానికి గురైంది. హఠాత్తుగా సుడిగాలులు పెనువేగంతో చుట్టుముట్టాయి. సుడిగాలుల తాకిడికి దాదాపు 78 వేలకు పైగా భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుపోయి నేలకూలాయి. తాడ్వాయి–మేడారం అభయారణ్యంలోని 204.30 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ విధ్వంసం జరిగింది. నేలకొరిగిన వృక్షాల్లో మద్ది, పెద్దేగి, జిట్రేగి, నల్లమద్ది, ఎజిత, నారవేప, రావి, గుంపెన, పచ్చగంధం వంటి భారీ వృక్షాలు ఉన్నాయి. మరెన్నో ఔషధ వృక్షాలు ఉన్నాయి. ఇదివరకు ఎన్నోసార్లు భారీ వర్షాలు కురిసినా, ఇలాంటి సుడిగాలి బీభత్సం మాత్రం ఎన్నడూ సంభవించలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఈ అడవి చరిత్రలోనే కనివిని ఎరుగని బీభత్సమని వారంటున్నారు.కారణాలపై అన్వేషణఆకస్మిక సుడిగాలి బీభత్సానికి గల కారణాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు జాతీయ స్థాయి సంస్థలైన ఐఎండీ, ఎన్ఆర్ఎస్సీ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మెట్రియలాజికల్ డేటా వచ్చిన తర్వాత మరింత అధ్యయనం చేసేందుకు వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రకృతి విలయం ఈ ప్రాంతానికి పూర్తిగా కొత్త. ఇదివరకు 1996లో మధ్యప్రదేశ్‌లోని నౌరదేవి అభయారణ్యంలో చెలరేగిన గాలిదుమారానికి చెట్లు నేలకూలాయి. అయితే, తాడ్వాయి–మేడారం అభయారణ్యంలో జరిగినంత తీవ్రనష్టం ఇప్పటి వరకు ఇంకెక్కడా చోటు చేసుకోలేదని పర్యావరణవేత్త పురుషోత్తం చెబుతున్నారు. టోర్నడో తరహా బీభత్సంఒకేసారి వేలాది మహావృక్షాలను నేలకూల్చేసిన సుడిగాలిని టోర్నడో తరహా బీభత్సంగా అటవీ శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సుడిగాలి బీభత్సాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వర్షానికి తోడు దట్టమైన మేఘాలు, గాలి దగ్గరగా రావడంతో సుడిగాలి చెలరేగి ఇంతటి విధ్వంసానికి దారితీసి ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, భారతదేశంలో టోర్నడోలు చెలరేగే అవకాశమే లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంలోని హిమాలయాలు సహా పర్వతాలు, కొండలు సుడిగాలులు చెలరేగకుండా అడ్డుకుంటున్నాయని, అందువల్ల టోర్నడోలు రావని చెబుతున్నారు. పైగా, మన దేశంలోని వేడి, ఉక్కపోత వాతావరణంలో టోర్నడోలకు అవకాశమే ఉండదని అంటున్నారు. విపరీతమైన వాతావరణ మార్పులు చోటుచేసుకునే ప్రదేశాల్లో టోర్నడోలు చెలరేగుతుంటాయి. ఉత్తర అమెరికా, అగ్నేయ–దక్షిణ అమెరికా, యూరోప్‌లోని పలు దేశాలు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో టోర్నడోలు అప్పుడప్పుడు విధ్వంసాన్ని సృష్టిస్తుంటాయి. గడ్డం రాజిరెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్అడవి పునరుజ్జీవానికి మరో పదేళ్లుభారీ విధ్వంసానికి గురైన ఈ అడవి పునరుజ్జీవనానికి కనీసం మరో పదేళ్లు పడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు చెబుతున్నారు. అడవిలో ఎలాంటి మొక్కలు నాటవద్దని, దానంతట అదే పునరుజ్జీవనం పొందుతుందని అంటున్నారు. కూలిన చెట్ల కొమ్మలను నరికివేసేందుకు, నిప్పు పెట్టేందుకు కొందరు ప్రయత్నించవచ్చని, అలాంటి చర్యలను నివారించాలని చెబుతున్నారు. ఏటూరునాగారం లేదా ములుగు ప్రాంతంలో భారత వాతావరణ శాఖ ఒక వాతావరణ పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఇలాంటి కేంద్రమేదీ లేకపోవడం వల్లనే జరిగిన విధ్వంసాన్ని అటవీశాఖ ముందుగా తెలుసుకునేందుకు వీలు లేకపోయిందని అధికారులు చెబుతున్నారు.అధ్యయనం తప్పనిసరిప్రకృతి కన్నెర్రచేస్తే దేవుడు కూడా కాపాడలేడనడానికి నిదర్శనం ఈ బీభత్సమని వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ కె.వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆకస్మిక ప్రకృతి బీభత్సాలపై తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెరిపిలేని వర్షం, ఈదురు గాలుల వల్ల టోర్నడో స్థాయి విధ్వంసం ఇక్కడి అడవిలో జరిగిందని, దేశంలో ఎక్కడా ఇదివరకు ఇలాంటి విధ్వంసం జరగలేదని అన్నారు. దాదాపు 78 వేల మహావృక్షాలు నేలకూలిపోయాయంటే, ఆ ప్రభావం పర్యావరణంపై చాలానే ఉంటుందని, ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా ప్రత్యేక అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు.∙కె.వెంకట్‌రెడ్డి,ప్రొఫెసర్, ఎన్ఐటీ, వరంగల్ఇది టోర్నడో కాదుములుగు జిల్లా అటవీప్రాంతంలో వచ్చినది టోర్నడో కాదని పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడు కె.పురుషోత్తం అంటున్నారు. ఇక్కడ ఒకేసారి దట్టమైన మేఘాలు కమ్ముకుని, ఒకేసారి వర్షించడంతో కొమ్మలు బాగా తడిసిపోయి, విరిగిపోయాయని, గురుత్వాకర్షణ మూలంగా ఒకేచోట గాలి అంతా కేంద్రీకృతం కావడంతో ఈ అటవీ ప్రాంతం భారీ విధ్వంసాన్ని ఎదుర్కొందని ఆయన వివరించారు. దీనిని టోర్నడోగా కాదు, డౌన్బరస్ట్గా భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే సుడిగాలి చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించి ఉంటే, భారీ స్థాయిలో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించి ఉండేదని అన్నారు. ఈ బీభత్సాన్ని వాతావరణ మార్పుల కారణంగా తలెత్తిన ప్రకృతి ప్రకోపంగానే భావించాల్సి ఉంటుందని పురుషోత్తం అన్నారు. దట్టమైన అడవి కారణంగానే ఈ సుడిగాలి బీభత్సం చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించకుండా ఉందని, విధ్వంసం తాకిడి మొత్తాన్ని అడవి భరించిందని తెలిపారు. ఈ అటవీ ప్రాంతంలోనిది ఇసుక నేల కావడంతో భారీవృక్షాల వేళ్లు కూడా ఎక్కువ లోతుకు వెళ్లలేదని, అందుకే అవి కూలిపోయాయని వివరించారు. ∙కె.పురుషోత్తం, అధ్యక్షుడు, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక -
సుడిగాలి మిస్టరీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, ఏటూరునాగారం/తాడ్వాయి: రాష్ట్రంలో.. ఆ మాటకొస్తే దేశంలోనే అరుదుగా జరిగే బీభత్సం ములుగు అడవుల్లో చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు.. దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలో 200 హెక్టార్ల (దాదాపు 500 ఎకరాల) విస్తీర్ణంలో 50వేలకుపైగా చెట్లు నేలకూలాయి. ఇది ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. 4,5 రోజులు ఆగకుండా కురిసిన వర్షాలకు తోడు భారీ సుడిగాలుల (టోర్నడోల)తోనే ఈ ఘటన జరిగినట్టు అంచనా వేస్తున్నారు. లోతుగా అధ్యయనం అవసరం: టోర్నడోలు చాలా వరకు బహిరంగ ప్రదేశాల్లోనే వస్తాయని.. ఇంత పెద్ద ఎత్తున చెట్లతో నిండి ఉన్న అటవీప్రాంతంలో వచ్చే వీలు లేదని వాతావరణ, నీటి వనరుల నిపుణుడు బీవీ సుబ్బారావు తెలిపారు. ములుగు ప్రాంతంలో ఈ పరిణామం చాలా విచిత్రంగా ఉందని.. అయితే మూడేళ్ల క్రితం నల్లగొండ జిల్లాలో ఇలాంటి స్వల్పస్థాయిలో చోటుచేసుకుందని చెప్పారు. వాతావరణ మార్పులతోనే ఇలా జరిగిందని భావిస్తున్నామని.. అడవుల్లో ఇలా జరగడంపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అతివేగమైన గాలి.. తడిసిన నేలతో..: అత్యంత వేగంగా, బలంగా వీచిన గాలులతోనే ములుగు అడవిలో విధ్వంసం జరిగి ఉంటుందని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి (మాజీ పీసీసీఎఫ్ ర్యాంక్ అధికారి) రఘువీర్ అంచనా వేస్తున్నారు. నాలుగైదు రోజులు ఆగకుండా కురిసిన వానతో నేల తడిసి, డొల్లగా అవుతుందని.. దీనికితోడు ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కొమ్మలు కొట్టేయడంతో చెట్లు బలహీనమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇలాంటప్పుడు అతివేగంగా వీచే గాలులతో చెట్లు కూలిపోయే చాన్స్ ఉంటుందని వివరించారు. 1996లో మధ్యప్రదేశ్‌లోని ఓ అభయారణ్యంలో ఇలాంటి ఘటన జరిగిందని.. ములుగులో జరిగిన దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో చెట్లు పడిపోయాయని నిపుణులు చెప్తున్నారని రఘువీర్ వెల్లడించారు. ములుగులో పెద్ద సంఖ్యలో చెట్లు కూలినా.. చాలా వరకు వేళ్లతో సహా పెకిలింతకు గురికాలేదన్నారు. మధ్యకు విరిగిన, కొమ్మలన్నీ పోయి కాండం మిగిలిన చెట్లు త్వరలోనే కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక టోర్నడో వృత్తాకారంలోఒకేచోట తిరుగుతుందని.. కానీ ములుగు అడవిలో అలాకాకుండా ఒకేవైపు నుంచి ప్రభావం పడిందని తెలిపారు. అందరిలోనూ విస్మయం ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో 50వేల చెట్లు నేలకూలడం అటవీశాఖ అధికార యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది. దీనికి కారణమేంటన్న దానిపై పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియల్, జిల్లా అధికారులు రాహుల్‌కిషన్ జాదవ్, ఇతర అధికారులు పరిశీలన జరుపుతున్నారు. డ్రోన్ కెమెరా ద్వారా కూలిన చెట్లను పరిశీలించారు. మరోవైపు పెనుగాలులతో నేలకూలిన చెట్లపై కలప స్మగ్లర్ల కన్నుపడిందని స్థానికులు అంటున్నారు. చెట్ల దుంగలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. తల్లుల దీవెనలతోనే బయటపడ్డాం: మంత్రి సీతక్క సుడిగాలి గ్రామాలపైకి మళ్లితే పెను విధ్వంసం జరిగేదని రెండు రోజుల క్రితమే చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించినా.. ఇలా వేలాది చెట్లు కూలిపోయాయని ఊహించలేదని మంత్రి సీతక్క చెప్పారు. డ్రోన్ కెమెరాల సాయంతో పరిశీలించినప్పుడు విధ్వంసం బయటపడిందన్నారు. బుధవారం సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓ, స్థానిక అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదని.. అలా మళ్లి ఉంటే పెను విధ్వంసం జరిగి ఉండేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక బృందాలను పంపి చెట్లు కూలిన ఘటనపై పరిశోధన జరిపించాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను కోరారు. సుడిగాలితో నేలకొరిగి ఉంటాయి! సుడిగాలి, మేఘాలు రెండూ కలిసినపుడు ఇటువంటి వర్షాలు కురుస్తాయి. సాధారణంగా చెట్ల వేళ్లు భూమిలో ఎక్కువ లోతుకు వెళితే గట్టి పట్టు ఉంటుంది. కానీ ఇక్కడి ఆకులు రాలుతూ అక్కడే చెట్టుకు అవసరమై ఎరువు తయారవుతూ ఉంటుంది. దీనితో వేర్లు లోతుగా కాకుండా పక్కలకు విస్తరించి పట్టులేకుండా ఉంటాయి. ఇలాంటి చెట్లు సుడిగాలితో పట్టుకోల్పోయి నేలకొరిగి ఉంటాయి. ఇలాంటి ఘటనను నా 35 ఏళ్ల సర్వీస్‌లో ఎప్పుడూ చూడలేదు. – ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ -
పశ్చిమ బెంగాల్లో పుంజుకున్న రాజకీయ తుపాను
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ వైపు తుపాను బీభత్సం సృష్టించింది. మరో వైపు రాజకీయ తుఫాన్ చెలరేంగింది. తుపాను కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు, సుమారు 500 మంది గాయాలపాలయ్యారు. కొంతమంది ఆవాసాలు కోల్పోయారు, మరి కొందరు ఆసుపత్రి పాలయ్యారు. ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు జల్పైగురిలోని ఆసుపత్రికి చేరుకున్నారు. మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. చాలామంది సర్వస్వం కోల్పోయారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఆవాసాలు కోల్పోయిన వారిలోని కొందరు జనం తాప్సిఖాతా పాఠశాలలోని సహాయ శిబిరంలో ఉన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ.. విపత్తు సంభవిస్తే.. ప్రభుత్వం సహాయక చర్యలు చేయడంలో ముందడుగు వేయొచ్చని ఆమె స్పష్టం చేశారు. దాదాపు నాలుగు నిమిషాల పాటు సాగిన గాలివానలో వందలాది మంది గాయపడ్డారు. జల్పాయిగురి పట్టణం, మేనాగురిలోని కొన్ని ప్రాంతాలు, అలీపుర్దువార్లోని కొన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. తుఫాన్ అనేక ఇళ్ళను నేలకూల్చింది. పంటలను నాశనం చేసింది. పెద్ద సంఖ్యలో పశువులు మరణించాయి. ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష నేత సువేందు అధికారి, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా తుపాను ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రిని సందర్శించడానికి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై స్పందించిన సువేందు అధికారి.. ముఖ్యమంత్రి మాదిరి చార్టర్డ్ ఫ్లైట్లు మా దగ్గర లేవు. తృణమూల్ కాంగ్రెస్ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా చాలా డబ్బును పొందిందని అన్నారు. మేము సాధారణ వాహనాల కోసం వేచి ఉండాలి అని ఎద్దేవా చేశారు. సువేందు అధికారి వ్యాఖ్యలపై.. ముఖ్యమంత్రి మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిధుల నిలిపివేత అంశాన్ని కూడా లేవనెత్తారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌కు ఆవాస్ యోజన నిధులను విడుదల చేసి ఉంటే, ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా గాయపడేవారు కాదని అన్నారు. తుపాను ప్రభావిత జిల్లాలైన జల్పైగురి, అలీపుర్దువార్, కూచ్‌బెహార్ జిల్లాల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తుపాను కారణంగా జల్పాయిగురి లోక్‌సభ స్థానంతో పాటు కూచ్‌బెహార్‌లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసీవింగ్ సెంటర్ దెబ్బతిన్నాయి. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీటిని మళ్ళీ పునర్నిర్మించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. -
America: ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఫోర్ట్లాడర్డేల్ నగరంలో శనివారం టోర్నడో బీభత్సం సృష్టించింది. భారీ విధ్వంసం సృష్టించిన ఈ టోర్నడో చివరకు ఫోర్ట్ లాడర్డేల్లోనే ముగిసింది. టోర్నడో దాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కరెంటు స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నాయి. వీధుల నిండా చెత్త నిండిపోయింది. టోర్నడో విధ్వంసంలో స్థానికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ గాయపడలేదు. టోర్నడో బీభత్సాన్ని పలువురు స్థానికులు తమ సెల్ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రారంభమైన టోర్నడో వేగంగా బలం పుంజుకొని పలు భవనాలను, విద్యుత్ వైర్లను, తీరంలో నిలిచి ఉన్న నౌకలను ఢీ కొట్టిందని ఫోర్ట్ లాడర్డేల్ అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. 🚨#UPDATE: Here is additional footage as the City of Fort Lauderdale reports that there are currently no injuries and only minor damage after a tornado touched down. They are urging citizens to be cautious of downed power lines. pic.twitter.com/wno3qonwxP — R A W S A L E R T S (@rawsalerts) January 7, 2024 ఇదీచదవండి..అమెరికా రక్షణ మంత్రికి అనారోగ్యం -
శిశువును ఈడ్చుకుపోయిన సుడిగాలి.. తరువాత?
అమెరికాలో ఊహకందని అద్భుతం జరిగింది. దీనిని విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలోని టెన్నెస్సీని తాకిన తీవ్ర తుఫానులో ఊయలతోపాటు ఎగిరిపోయిన నాలుగు నెలల చిన్నారి ఊహించని రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దేవుని దయతో తమ చిన్నారి సజీవంగా తమకు దొరికాడని తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. టెన్నెన్సీలో వచ్చిన బలమైన సుడిగాలి తమ ఇంటిని ధ్వంసం చేసిందని ఆ దంపతులు తెలిపారు. ఆ సమయంలో తమ ఇంటి పైకప్పు ఎగిరిపోగా, వారి పిల్లాడు ఊగుతున్న ఊయల కూడా ఎగిరిపోయింది. దీంతో ఆ చిన్నారి కుండపోత వర్షంలో.. పడిపోయిన చెట్ల మధ్య చిక్కకుపోయాడు. ఈ తుఫానులో ఆ చిన్నారితో పాటు అతని ఏడాది వయసున్న సోదరుడు, తల్లిదండ్రులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన సిడ్నీ మూర్ (22) మీడియాతో తమకు ఎదురైన అనుభవాన్ని తెలియజేశారు. తుఫాను తాకిడికి తమ ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని, ఊయలతోపాటు తమ కుమారుడు కూడా ఎగిరిపోయాడని తెలిపారు. దీనిని చూసిన తన భర్త కుమారుడిని రక్షించేందుకు పరిగెత్తారని, అయితే తుపాను తాకిడి కారణంగా కుమారుడిని రక్షించలేకపోయారని తెలిపారు. ఈ సమయంలో మూర్ తన మరో కుమారుడు ప్రిన్స్టన్కు ఎలాంటి అపాయం కలుగకుండా గట్టిగా పట్టుకుంది. పది నిమిషాల పాటు చిన్న కొడుకు కోసం ఆ దంపతులు వెదకగా.. కూలిన చెట్ల మధ్య కుమారుడు ఉండటాన్ని వారు గమనించారు. మొదట కుమారుడు చనిపోయాడని వారు అనుకున్నారు. అయితే పిల్లాడు బతికే ఉండటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రభుత్వం మారగానే సీఎం కార్లకు కొత్త నంబర్లు! -
బెంబేలెత్తించిన టోర్నడో
సాక్షి, భీమవరం/ఆకివీడు: మిచాంగ్ తుపాను తీరం దాటే సమయంలో సముద్ర తీరంపైకి దూసుకొచ్చిన టోర్నడో (సుడిగాలులు) సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో టోర్నడో ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని తీరప్రాంత సమీప గ్రామాలపై విరుచుకుపడి బీభత్సం సృష్టించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. టోర్నడోలు అమెరికాను వణికిస్తుంటాయని వినడమే తప్ప.. మన ప్రాంతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. వాహనాలను సైతం ఎగరేశాయి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో మంగళవారం రాత్రి టోర్నడో బీభత్సం సష్టించింది. ట్రాక్టర్లు, వరి కోత మెషిన్లు, ఇతర వాహనాలు సుడిగాలుల్లో చిక్కుకుని పైకి ఎగిరి కొంతసేపటికి నేలపై పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, వీరవాసరం, పాలకొల్లు, ఆచంట, ఆకివీడు మండలాల్లో టోర్నడో బీభత్సం సృష్టించి భారీగా ఆస్తి నష్టం కలగజేసింది. దాని ధాటికి నరసాపురం మండలం లిఖితపూడి, సరిపల్లి, మల్లవరంలంక గ్రామాల్లో 20 వరకు విద్యుత్ స్తంభాలు పడిపోగా.. 200కు పైగా కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. రోడ్ల వెంబడి చెట్లు నేలకొరిగాయి. వీరవాసరం, అదే మండలంలోని వడ్డిగూడెం, తోలేరు గ్రామాల్లో 40 విద్యుత్ స్తంభాలు, 250 వరకు కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. 40 ఎకరాల్లో అరటి పంట ధ్వంసమైంది. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల, పరిసర గ్రామాల్లో 200 కొబ్బరి చెట్లు, 41 విద్యుత్ స్తంభాలు, 4 ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. ఆచంట మండలం పెదమల్లం, సిద్ధాంతం గ్రామాల మధ్య ఏర్పడిన టోర్నడో వృక్షాలను నేలకూల్చింది. ఆకివీడు మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు సైతం పక్కకు పడిపోయాయి. కాగా.. కాకినాడ జిల్లాలోనూ టోర్నడో బీభత్సం సృష్టించింది. గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ ఎదురుగా సుడిగాలి ధాటికి హైవేపై వెళ్తున్న ఆటోలు గాలిలో ఎగిరాయి. సుడిగాలి రావడంతో బంక్‌లోని ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అన్నవరం రైల్వే గేటు సమీపంలో ఆగివున్న వాహనాలు ఎగిరిపడ్డాయి. ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గేటుపక్కనే ఉన్న ఓ ఇంటి రేకులు ఎగిరిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. అన్నవరం క్షేత్రంలోనూ సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఘాట్రోడ్లో వృక్షాలు నేల కూలాయి. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వై.జంక్షన్, వీఎల్ పురం, మోరంపూడి, హుకుంపేట, ప్రకాశం నగర్, దానవాయిపేట, ఆర్ట్స్ కళాశాల పరిసరాల్లో టోర్నడో కలకలం సృష్టించింది. నివాసాలు, దుకాణాలపై రేకులు గాల్లోకి ఎగిరాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. పీడన వ్యత్యాసమే కారణం తుపాను భూమికి చేరువగా తీరం దాటడం వల్ల టోర్నడో ఏర్పడేందుకు కారణమైందని నిపుణులు అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తీరప్రాంతం వెంబడి పెద్దఎత్తున ఆక్వా చెరువుల విస్తరించి ఉన్నాయి. సాధారణంగా నీరు, నేల ఉన్న ప్రదేశాల్లో ఉష్ట వ్యత్యాసాల వల్ల పీడన వ్యత్యాసం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. వాతావరణంలో అసాధారణ మార్పులు ఏర్పడినప్పుడు గాలి పొరలు విరూపణం (షియర్) చెంది పీడనంలో కదలికలు వచ్చి సుడులు (ఎడ్డీ ఫ్లో) ఏర్పడుతుంటాయి. ఇవి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి. చుట్టుపక్కల పీడన పరిస్థితులను బట్టి 150 కిలోమీటర్లు వేగంతోనూ కదులుతుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. మిచాంగ్ తుపాను భూమికి చేరువగా తీరం దాటడం, తీరం వెంబడి ఉన్న అనుకూల పరిస్థితులతో టోర్నడో (సుడిగాలులు) ఏర్పడ్డాయని చెబుతున్నారు. వాతావరణంలో అసాధారణ మార్పులతో.. సముద్ర తీర ప్రాంతానికి ఆనుకొని తుపాను పయనించి తీరం దాటడంతో వాతావరణంలో అసాధారణ మార్పులు తలెత్తి టోర్నడోలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో గాలుల వేగం గంటకు 90 నుంచి 110 కిలోమీటర్లు వరకు ఉంది. గతంలో కొల్లేరు సరస్సులో సుడిగాలులు వచ్చాయి. – డాక్టర్ పి.రఘురామ్, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం -
భయంకర టోర్నడో బీభత్సం.. పదుల సంఖ్యలో మరణాలు..
బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో ధాటికి దాదాపు 10 మంది మృత్యువాతపడగా.. పదుల సంఖ్యలో జనాలు తీవ్రంగా గాయపడ్డారు. టోర్నడో ధాటికి వాహనాలు సైతం ఎగిరిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లోని సుకియాన్ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం టోర్నడో ఒక్కసారిగా విరుచుకుపడింది. వాతావరణ మార్పుల్లో భాగంగా మెల్లగా ప్రారంభమైన సుడిగాలి క్షణాల్లోనే వేగాన్ని అందుకొని ఒక్కసారిగా పట్టణాన్ని చుట్టేసింది. ఈ క్రమంలో భారీ శబ్దంతో పాటు అధిక వేగంతో గాలి వీచింది. దీంతో, ఇళ్ల పైకప్పులు గాలిలోకి ఎగిరి పరిస్థితి భయానకంగా మారింది. అనంతరం.. కొన్ని చోట్లు భారీ వర్షం కురసింది. ఒక్కసారిగా ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. Horrific tornado in Suqian, Jiangsu Province of China kills 10, hundreds relocated pic.twitter.com/xarV3ywJip — maria larsson (@marialarsson201) September 20, 2023 Deadliest tornado strike in #China in 2 years. Atleast 4 tornadoes hit Suqian and Yancheng in #Jiangsu province. Death toll reported to be 10 so far VC: @Ericwang1101#tornado #storm #weather #climate #viral #Suqian #Yancheng pic.twitter.com/CrIYhMWGOo — Earth42morrow (@Earth42morrow) September 20, 2023 మరోవైపు.. సుడిగాలి ధాటికి 137 ఇళ్లు నేలమట్టం కాగా, 5,500 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 400 మంది వారి నివాసాలను ఖాళీ చేసి వెళ్లారు. టోర్నడో విధ్వంసం అనంతరం వాహనాలు ఎక్కడికక్కడ చెల్లచెదురుగా పడ్డాయి. పలు ఇళ్లు రూపురేఖలు మారాయి. సుడిగాలి ధాటికి ఇళ్ల శకలాలు, ఇతర వస్తువులు మీదపడడంతో పలువురు రోడ్లపైనే విగతజీవులుగా మారారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #SevereWeather 📹 Schockierender Tornado 🌪️ verursacht Chaos in der Stadt #Suqian, China. Ein beeindruckender Tornado hat in den letzten Stunden in der Provinz Jiangsu Verwüstungen angerichtet, bei denen mehrere Menschen verletzt und getötet wurden. pic.twitter.com/9v8N0ibNXf — Meteored | daswetter (@MeteoredDE) September 20, 2023 -
అమెరికాలో టోర్నడో విధ్వంసం.. అయిదుగురి మృతి
అమెరికాలో టోర్నడో తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. టెక్సాస్ రాష్ట్రంలోని పాన్‌హ్యాండిల్ పట్టణం పెర్రిటన్‌లో టోర్నడో ధాటికి అయిదుగురు మృతి చెందారు. దాదాపు 100 మంది స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మృతుల్లో 11 బాలుడు, 60 ఏళ్ల వయస్సున ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. అక్కడి కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత టోర్నడో తుపాను టెక్సాస్, ఫ్లోరిడా ప్రాంతాన్ని తాకినట్లు అమరిల్లోలోని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. సమాచారం అందుకున్న అత్యవసర సేవల అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ సేవలు ముమ్మరంగా సాగుతున్నాయని పెర్రిటన్ ఫైర్ చీఫ్ పాల్ డచర్ తెలిపారు. సుడిగాలి కారణంగా టెక్సాస్‌లో 200 ఇళ్లు ధ్వంసమవ్వగా.. మొబైల్ హోమ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. దీంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వృక్షాలు నెలకొరిగాయి. వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టెక్సాస్, లూసియానా, మిస్సిస్సిప్పి, ఫ్లోరిడా, ఓక్లహోమాలో సుమారు 50 వేల గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో మగ్గుతున్నారు. పెర్రిటన్‌లో ముగ్గురు వ్యక్తులు మరణించారని, పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. సుడిగాలి తీవ్రతకు గురువారం ఫ్లోరిడా పాన్హ్యండిల్లో ఇంటిపై చెట్టు కూలడంతో ఒకరు మరణించారని తెలిపింది. చదవండి: ఐరాసలో యోగా వైట్‌హౌస్‌లో విందు -
అమెరికాలో టోర్నడోల విధ్వంసం..23 మంది మృతి
అమెరికాలో కనివినీ ఎరుగని విధంగా టోర్నోడోలు పెను విధ్వంసం సృష్టించాయి. ఈ మేరకు మిస్సిస్సిపిలో శుక్రవారం అర్థరాత్రి బలమైన గాలులు, ఉరుములతో కూడిన తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో పరిసర ప్రాంతాలన్ని చిగురుటాకులా వణికిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 23 మంది దాక ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది జనాలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ టోర్నోడోల కారణంగా భారీ నష్టం జరిగిందని సుమారు 160 కి.మీ వరకు ప్రభావం చూపిందని అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ టోర్నడో విధ్వంసం అనంతరం రెస్క్యూ బృందాలు, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ వెస్ట్రన్ మిస్సిస్పిప్పిలోని సిల్వర్సిటీలో దాదాపు 200 మంది నివశిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ తుపాను తర్వాత ప్రాణాలతో బయటపడిన వారి ఆచూకి కోసం రెస్కూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఐతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని చెప్పారు. మరోవైపు ఈ విధ్వంసం తర్వాత సుమారు నలుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు మిస్సిస్సిప్పి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ వరుస ట్వీట్లలో తెలిపింది. అలాగే సమీపంలోని మరోప్రాంతం.. సుమారు 17 వందల మంది జనాభా ఉన్న రోలింగ్ ఫోర్క్ కూడ తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ కూడా సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే స్థానికులు మాత్రం ఇలాంటి టోర్నడోలను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శుక్రవారం రాత్రంతా జనం అంధకారంలోనే మగ్గిపోయారు. అలాగే ఈ ఘటనలో గాయపడ్డవారిని అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ టోర్నడాల కారణంగా పలు భవనాలు, వాహనాలు దారుణంగా దెబ్బతిన్నాయి. F5 tornado strikes Rolling Fork, Mississippi, seven dead reported, but toll likely to rise pic.twitter.com/N6GUl2NcVz — Malinda 🇺🇸🇺🇦🇵🇱🇨🇦🇮🇹🇦🇺🇬🇧🇬🇪🇩🇪🇸🇪 (@TreasChest) March 25, 2023 (చదవండి: గర్లఫ్రెండ్‌కి సాయం చేయాలన్న ఇంటెన్షనే పోలీసులకు పట్టించింది..చివరికి..) -
టోర్నడో విధ్వంసం.. ఇళ్లు, భవనాలు నేలమట్టం.. దృశ్యాలు వైరల్
పారిస్: ఉత్తర ఫ్రాన్స్ ప్రాంతంలోని బిహుకోర్ట్ అనే గ్రామంలో మినీ టోర్నడో బీభత్సం సృష్టించింది. సుడిగాలి ధాటికి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇళ్లు, భవనాలు ధ్వంసంమయ్యాయి. ఆ ప్రాంతంలో అకాలంగా వేడి వాతావరణం ఏర్పడి ఆ తర్వాత టోర్నడోగా మార్పు చెందినట్లు అధికారులు తెలిపారు. టోర్నడో విధ్వంసం దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బిహుకోర్టు గ్రామంపై గగనంలో ఆదివారం సాయంత్రం నల్లటి మేఘాలు కమ్ముకుని ఆ తర్వాత సుడిగాలి వీచినట్లు పలువురు సోషల్ మీడియాల్లో వీడియోలు షేర్ చేశారు. ఈ టోర్నడో బీభత్సంలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు పాస్ డీ కలాయిస్ ప్రాంత అధికార యంత్రాంగం తెలిపినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. కొన్ని సంవత్సరాలుగా టోర్నడోలు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Moment of the impact of the strong #tornado yesterday that hit the town #Bihucourt in Northern France, caused by a long-lived tornadic supercell. Video was taken by local resident Clèment Devulder (Link: https://t.co/EGTwl28C6a…)@KeraunosObs @pgroenemeijer @ReedTimmerAccu pic.twitter.com/vHK8urORLC — Unwetter-Freaks (@unwetterfreaks) October 24, 2022 A significant tornado hit northern France today causing major damage as Western Europe gets slammed by a substantial severe weather outbreak. 🎥 Credit: Robin Gpic.twitter.com/O7kfjQt85m — Colin McCarthy (@US_Stormwatch) October 23, 2022 ఇదీ చదవండి: పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో వధువు పరార్.. వరుడికి ఫోన్ చేసి..! -
గాలివాన బీభత్సం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిడుగుపాట్లకు ముగ్గురు మృతి
రాజాపూర్/మాగనూర్/కల్వకుర్తి రూరల్/సూర్యాపేట: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిడుగుపాట్లకు ముగ్గురు మృతిచెందగా సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలుల తీవ్రతకు భారీ స్థాయిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం మర్రిబాయితండాకు చెందిన శత్రునాయక్ (60) ఆదివారం సాయంత్రం శివారులోని తన పొలంలో ఉండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగుపడి ఆయన మృతి చెందాడు. నారాయణపేట జిల్లా మాగనూర్‌లోని కొత్త రైల్వేస్టేషన్ సమీపంలో కుర్వ పరమేశ్ అలియాస్ లింగప్ప (20) గొర్రెలను మేపుతుండగా పిడుగు పడటంతో మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం కురుమిద్దకు చెందిన సాంబశివ (8) తల్లిదండ్రులతో కలసి పొలం వద్దకు వెళ్లగా పిడుగు పడి అక్కడికక్కడే చనిపోయాడు. మరోవైపు సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు చివ్వెంల, ఆత్మకూర్(ఎస్), నూతనకల్, మద్దిరాల, మోతె మండలాల్లో ఆదివారం సాయంత్రం నుంచి వీచిన ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంటు తీగలు తెగిపోయాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. జిల్లా కేంద్రంలో హోర్డింగులు నేలకూలాయి. చివ్వెంల మండలం వట్టిఖమ్మం పహాడ్‌లో చెట్టు విరిగి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంపై పడింది. పలు గ్రామాల్లో మామిడి, నిమ్మ, సపోట తోటల్లో కాయలు నేలరాలాయి. నూతనకల్‌లో వడగండ్ల వర్షం కురిసింది. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సుమారు వందవరకు విద్యుత్ స్తంభాలు కూలి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
అమెజాన్ తీరుపై సర్వత్రా విమర్శ
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. డెలివరీ ఎంప్లాయిస్ విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న తీరు తాజాగా వెలుగు చూసింది. తుపానుల సమయంలోనూ డెలివరీలు చేయాలంటూ డెలివరీ పార్ట్నర్ను బెదిరించిన వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఇల్లినాయిస్లో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. భీకరమైన తుపాను నేపథ్యంలో హెచ్చరికలు జారీకాగా, అది కేవలం హెచ్చరికే కదా అంటూ డెలివరీ పార్ట్నర్కు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు అమెజాన్ ఎగ్జిక్యూటివ్స్. డెలివరీ కోసం వెళ్లాల్సిన ఓ యువతికి ఈ అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. తుపాను లేదు గిఫాను లేదు. అది కేవలం హెచ్చరిక మాత్రమే. ఆర్డర్లు డెలివరీ చేయకుండా వెనుదిరిగితే ఉద్యోగం ఊడుతుందని ఆ డెలివరీ గర్ల్‌ను అమెజాన్ ప్రతినిధులు బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ ఛాటింగ్‌కు సంబంధించి స్క్రీన్ షాట్లను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అమెజాన్‌పై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు అమెజాన్‌లో డెలివరీ ఎంప్లాయిస్ల పట్ల మేనేజ్మెంట్ తీరు ఇలాగే ఉంటుందని, ప్రతికూల వాతావరణంలో తమ కోసం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టరంటూ పలువురు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేయడం విశేషం. చదవండి: అమెజాన్‌కు భారత్‌లో షాక్.. 200 కోట్ల జరిమానా -
విధి వికృత ఆట
సిడ్నీ: విద్యా సంవత్సరం ముగింపు రోజు.. చిన్నారుల ఆటపాటలు, నవ్వులు, కేరింతలతో స్కూలు ప్రాంగణమంతా సందడిగా ఉంది. అంతలోనే చోటు చేసుకున్న అనూహ్య ఘటన వారందరినీ షాక్‌కు గురి చేసింది. తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారులు ఎక్కి ఆడుకుంటున్న బౌన్సీ క్యాజిల్ (కోట ఆకారంలో ఉండే గాలి నింపిన దళసరి బెలూన్‌తో చేసిన నిర్మాణం)ను అకస్మాత్తుగా వీచిన బలమైన సుడిగాలి పైకి లాక్కెళ్లిపోయింది. దీంతో, అందులో ఆడుకుంటున్న 9 మంది చిన్నారులు కిందపడిపోయారు. సుమారు 33 అడుగుల ఎత్తు నుంచి వారు పడిపోవడంతో నలుగురు అక్కడికక్కడే తుదిశ్వాస విడవగా, మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. క్షతగాత్రులైన మరో నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా 10, 11 ఏళ్ల ఆరో గ్రేడ్ చదువుకుంటున్న బాలబాలికలని సమాచారం. ఆస్ట్రేలియాలోని టాస్మేనియా రాష్ట్రం డేవన్పోర్ట్లోని ఓ స్కూల్లో గురువారం ఉదయం ‘ఫన్డే’ ఉత్సవాల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, తీవ్ర ఆందోళనతో హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకుని, తమ చిన్నారుల క్షేమ సమాచారం గురించి వాకబు చేశారు. ఇది అనూహ్యంగా చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పేర్కొన్నారు. -
అమెరికాలో టోర్నడో బీభత్సం..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పలు రాష్ట్రాలను భీకర తుపాను వణికిస్తోంది. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల ధాటికి ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. సుడిగాలు లు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీలో పరిస్థితి భీతావహంగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన తుపాను అని కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ శనివారం చెప్పారు. మేఫీల్డ్ నగరంలో ఓ క్యాండిల్ ఫ్యాక్టరీ ధ్వంసమయ్యిందని, శిథిలాల కింద 110 మంది చిక్కుకుపోయారని, వారిలో 70 మందికిపైగా మరణించినట్లు భావిస్తున్నామని తెలిపారు. మృతుల సంఖ్య 100దాటవచ్చన్నారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించామన్నారు. 227 మైళ్ల మేర తుపాను ప్రభావం కనిపించిందని గవర్నర్ తెలిపారు. 10 కౌంటీల్లో మరణాలు సంభవించే ప్రమాదం కనిపిస్తోందన్నారు. స్థానిక అధికారులు, నేషనల్ గార్డు సభ్యులు, ఎమర్జెన్సీ వర్కర్స్ మేఫీల్డ్ సిటీలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇల్లినాయిస్ రాష్ట్రం ఎడ్వర్డ్స్‌విల్లేలోని అమెజాన్ సంస్థ గోదాము శుక్రవారం ధ్వంసమయ్యిందని అధికారులు చెప్పారు. పైకప్పుతోపాటు ఒక గోడ కూలిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో తుపాను హెచ్చరిక అమల్లోనే ఉంది. 100 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. క్రిస్మస్ పండగ సందర్భంగా ఆర్డర్లు అధికంగా ఉండడంతో వారంతా రాత్రిపూట కూడా పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు చర్యలు చేపట్టారు. ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనేది ఇంకా తెలియరాలేదు. ఎడ్వర్డ్స్‌విల్లే ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జర్ అన్నారు. రాష్ట్ర పోలీసులు, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ స్థానిక అధికారులతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదంలో చిక్కుకున్న తమ కార్మికులను రక్షించుకోవడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అమెజాన్ అధికార ప్రతినిధి రిచర్డ్ రోచా చెప్పారు. ఆర్కాన్సస్ రాష్ట్రంలో తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. మోనెట్టి మానర్ నర్సింగ్ హోమ్ ధ్వంసం కావడంతో ఒకరు మరణించారు. మరో 20 మంది లోపలే ఉండిపోగా వారిని రక్షించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. టెన్నెస్సీ రాష్ట్రంలో తుపాను కారణంగా ముగ్గురు మృతిచెందారు. లేక్ కౌంటీలో ఇద్దరు, ఒబియోన్ కౌంటీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తుపాను బీభత్సంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. -
చైనాలో విరుచుకుపడ్డ టోర్నడోలు, 12 మంది మృతి
బీజింగ్: చైనాలో శుక్రవారం రాత్రి రెండు శక్తిమంతమైన టోర్నడోలు విరుచుకుపడ్డాయి. వుహాన్, సుజోవ్ ప్రావిన్సులను తాకిన ఈ టోర్నడోల (భీకరమైన సుడిగాలుల) కారణం గా 12 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారని జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. వుహాన్‌లోని కైడియన్ జిల్లాలో వచ్చిన టోర్నడోలో గాలి వేగం సెకనుకు 29.3 మీటర్లు ఉన్నట్లు తెలిపింది. అక్కడే 8 మంది మరణించగా 230 మంది గాయపడ్డారని చెప్పింది. 27 ఇళ్లు కూలిపోగా, 130 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని పేర్కొంది. దీని కారణంగా వుహాన్‌లో 26.6 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొంది. సుజోవ్‌లో వచ్చిన టోర్నడోలో నలుగురు మరణించగా, 19 మంది గాయపడ్డారు. 84 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతాల్లో సాధారణంగా టోర్నడోలు సంభవించే అవకాశం లేకపోయినప్పటికీ, భారీ టోర్నడోలు రావడం గమనార్హం. Two #tornadoes with winds of more than 200 km/hr wreaked havoc in central & eastern #China on Friday night. 🌪️#EastAsia Further thunderstorms to come this week.⛈️ pic.twitter.com/Yt1N9NlLqv — BBC Weather (@bbcweather) May 15, 2021 -
యానాంలో టోర్నడో
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం తీరంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. అమెరికాలో వచ్చేంత స్థాయిలో కాకపోయినా.. చిన్నపాటి టోర్నడో అరగంట పాటు ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. 11 ఎకరాల రొయ్యల చెరువుల్లోకి ప్రవేశించడంతో మోటార్లు, ఏరియేటర్స్, వలలు, బర్డ్ ఫెన్సింగ్, వివిధ నిర్మాణాలు నాశనమయ్యాయి. యానాం: అమెరికాలో ఏదో ఒకచోట నిత్యం సుడులు తిరుగుతూ విధ్వంసం సృష్టించే టోర్నడో కాకినాడ సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతమైన యానాం తీరంలో అరగంట పాటు ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. సుడులు తిరుగుతూ.. ► యానాం శివారు అయ్యన్న నగర్, పరంపేట సముద్ర తీర గ్రామాల్లో శుక్రవారం విపరీతమైన వేగంతో సుడులు తిరుగుతూ బీభత్సం సృష్టించింది. ► తీరం నుంచి పక్కనే ఉన్న పెన్మెత్స సత్తిరాజు అనే రైతుకు చెందిన 11 ఎకరాల రొయ్యల చెరువుల్లోకి ప్రవేశించడంతో మోటార్లు, ఏరియేటర్స్, వలలు, బర్డ్ ఫెన్సింగ్‌లు ధ్వంసం అవడంతో భారీ నష్టం సంభవించింది. ► తీరాన్ని ఆనుకుని ఉన్న అయ్యన్న నగర్, పరంపేట, నీలపల్లి తదితర గ్రామాల్లోనూ కలకలం రేపింది. దీని ప్రభావంతో భారీ రేకుల పందిరి ఎగిరిపడింది. పలుచోట్ల ఇళ్ల ముందున్న కొబ్బరాకు దడులు, గుడిసెలు టోర్నడో సుడిగాలికి ధ్వంసమయ్యాయి. ► ఈ ప్రాంతంలో టోర్నడోలు గతంలో ఎప్పుడూ ఏర్పడకపోవడంతో చాలామంది మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ► యానాం పరిపాలనాధికారి శివరాజ్ మీనా ఘటనా స్థలానికి వచ్చి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ► తూర్పు తీరంలో.. ఇది రెండో టోర్నడోగా చెబుతున్నారు. గత నెల 4న కాకినాడ తీరంలోని భైరవపాలెం ప్రాంతంలో సముద్రం వెలుపల 4 కిలోమీటర్ల దూరంలో తొలి టోర్నడో ఏర్పడింది. ► వేటకు వెళ్లిన మత్స్యకారులు తప్ప ఇతరులెవరూ దానిని చూడలేదు. టోర్నడోలు ఎందుకొస్తాయంటే.. ► టోర్నడోలను మధ్య అక్షాంశాలలో ఏర్పడే తీవ్రమైన సుడి గాలులుగా చెబుతారు. వీటిలో గాలి ఉత్తరార్ధ గోళంలో అపసవ్యంగా తిరుగుతుంది. ► పరిసర ఖండాల నుంచి వీచే చలి గాలి, సముద్రపు వెచ్చని గాలి కలిసినపుడు టోర్నడోలు ఏర్పడతాయి. ► మేఘాలు గరాటు ఆకారంలో ఏర్పడతాయి. ఒక్కోసారి భూమిని కూడా చేరుతాయి. వీటివల్ల విపరీతమైన నష్టం సంభవిస్తుంది. ► సాధారణంగా టోర్నడోలు ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని మిస్సిసిపీ, మిస్సోరీ లోయల ప్రాంతాల్లో ఏర్పడుతుంటాయి. చైనా, జపాను తీరాలకు ఆవల కూడా ఇవి సంభవిస్తుంటాయి. -
యానాంలో అద్భుత దృశ్యం
-
యానాంలో అద్భుత దృశ్యం
తూర్పుగోదావరి జిల్లా యానాంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. మనకు పెద్దగా పరిచయం లేని టోర్నడో యానాంకు సమీపంలో చెరువుల వద్ద శుక్రవారం కనిపించింది. ఆకాశంతో భూమి కలిసిపోయిందా అన్నట్లుగా ఉన్న ఆ దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. తమ సెల్ ఫోన్లో బంధించడమే కాకుండా వైరల్ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ టోర్నడో వీడియో చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. మరొకవైపు ఇది స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. (హృదయాన్ని తాకే వీడియో: నీళ్ల కోసం ఉడత..) -
టోర్నడో విధ్వంసం
నాష్విల్లే: అమెరికాలోని నాష్‌విల్లేలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఉదయం టెన్నెస్సీలో వచ్చిన టోర్నడోల కారణంగా 22 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరికొంత మంది గల్లంతయినట్లు చెప్పారు. దాదాపు 40 భవనాలు నేలమట్టమయినట్లు చెప్పారు. నష్టాన్ని అంచనా వేసేందుకు హెలికాప్టర్ల ద్వారా సర్వే చేస్తున్నారు. స్కూళ్లు, కోర్టులు, విమానాశ్రయాలు మూతబడ్డాయి. -
కొండ అంచులకు చేరిన నీరు
-
అద్భుత దృశ్యం.. గాలిలో చిక్కుకున్న నీరు..!
కోపెన్హాగన్: నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అనే సామెత తెలిసే ఉంటుంది. అయితే, డెన్మార్క్‌లోని ఫారో ఐలాండ్స్‌లో మాత్రం దీనికి విరుద్ధమైన సన్నివేశమొకటి వెలుగు చూసింది. సముద్రపు అలల నుంచి నీరు అంతెత్తుతున్న కొండపైకి ప్రవహించింది. గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా పనిచేసిన ఈ దృశ్యాన్ని జాకొబ్సేన్ అనే వ్యక్తి గత సోమవారం కెమెరాలో బంధించాడు. సుడిగాలితో పాటు కొండ అంచులకు చేరుతున్న నీటి ప్రవాహపు వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ విశేషంపై వాతావరణ నిపుణులు మాట్లాడుతూ.. ‘టోర్నడోలు ఏర్పడే క్రమంలో నలువైపులా ఒత్తిడికి గురైన గాలి భూమిపై ఉన్న చెత్త చెదారంతో గొట్టంలా మారి విధ్వంసం సృష్టిస్తుంది. అతి వేగంగా కదులుతూ సుమారు మేఘాలను తాకేటంత ఎత్తులో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. తాజా ఘటన కూడా ఈ కోవలోకి చెందినదే. టోర్నడో మాదిరిగానే ఇక్కడ గాలి గొట్టం ఏర్పడింది. అయితే, దానిలో వస్తువులు, చెత్తా చెదారం బదులు నీరు చేరింది. పక్కనే ఎత్తయిన కొండ ఉండటంతో అదే వేగంతో నీరు పైకి ప్రవహించింది. సాధారణంగా నీటితో ఏర్పడే గాలి గొట్టాలను నీటి చిమ్ములు అంటాం. అవి కాస్త ఎత్తు వరకు కదిలి బలహీనమవుతాయి. ఫారో ఐలాండ్స్‌లో బయటపడిన నీటి ప్రవాహాం సంఘటన మాత్రం అద్భుతమైందే..!’అని అన్నారు. -
సుడిగాలి వీచి చిన్నారి మృతి
సాక్షి, వరదయ్యపాళెం(చిత్తూరు) : బతుకు తెరువు కోసం రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చిన వలస కూలీ ఇంట సుడిగాలి విషాదాన్ని నింపింది. శనివారం సుడిగాలి బీభత్సానికి సత్యవేడు మండలం పాలగుంట సమీపంలోని కాప్రికార్న్ జ్యూస్ పరిశ్రమ వద్ద వలస కూలీలు నివాసమున్న రేకుల షెడ్డు కుప్పకూలింది. అందులో ఉన్న 7 ఏళ్ల చిన్నారి అక్కడి కక్కడే మృతి చెందగా మరో 9 మంది పిల్లలు గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బడేయం జిల్లా, సానఫర్ గ్రామానికి చెందిన 300 మంది వలస కూలీలు కాప్రికార్న్ పరిశ్రమలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి పరిశ్రమ సమీపంలో నివాసం ఉండడానికి తాత్కాలిక రేకుల షెడ్డులను ఏర్పాటు చేశారు. అయితే కూలీలు మాత్రం రోజు లాగానే పరిశ్రమలోనికి పనులకు వెళ్లగా వారి పిల్లలు తాత్కాలిక రేకుల షెడ్డుల వద్ద ఉండగా, ఒక్కసారిగా వచ్చిన సుడిగాలికి రేకుల షెడ్డు కుప్పకూలింది. అందులో ఉన్న ఇరిఫన్ కుమార్తె నిషా (7) తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. అభిషేక్ ఖాన్ (5), సోల్ ఖాన్ (3), ఆకాష్ (16), అస్లాం (11), యాష్మీ (10), దీపక్ చౌదరి (36), సహానా (11), సతీష్ (27), జుపేదా (8) గాయపడ్డారు. క్షతగాత్రులను సత్యవేడు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి, వైద్యసేవలు అందించారు. గాయపడిన వారందరూ క్షేమంగానే ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం..బాధాకరం: ఎమ్మెల్యే ఆదిమూలం కాప్రికార్న్ జ్యూస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం బాధాకరమని స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం విచారం వ్యక్తం చేశారు. వలస కూలీలల కుటుంబ సభ్యులు 9 మంది గాయపడడం, మరో చిన్నారి మృతి చెందడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సత్యవేడు ప్రభుత్వాస్పత్రి వైద్యులను ఆదేశించారు. -
సుడిగాలి ... ప్రచారం
సాక్షి, నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను కలిసేందుకు, వారిని ఆకట్టుకునేందుకు పోటీ పడి ప్రచారం చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకుంటూనే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతుంది. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, ఇక ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అంటూ కొత్త పల్లవి అందుకుంది. టీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో పోటీ చేస్తున్నాయని, టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని కాంగ్రెస్ తన ప్రచారంలో ప్రధాన అంశంగా చేర్చింది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లతో జరిగే మేలు ఏమీ లేదని, ప్రజాగొంతుకను పార్లమెంట్లో వినిపించాలంటే తమనే గెలిపించాలని సీపీఎం ప్రచారం చేస్తుంది. మరో మారు మోదీ ప్రధాని కావాలని, ఆయన సారథ్యంలోనే దేశం సురక్షితంగా ఉంటుందని, అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ ప్రచారం చేస్తుంది. మొత్తంగా నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో వ్యూహాత్మక అంశాలను ఎంచుకుని ప్రచారం చేశాయి. కాంగ్రెస్.. కాంగ్రెస్ ప్రచారం ప్రధానంగా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. కొంత నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఫర్వాలేదనిపించేలా సాగింది. నల్లగొండలో మాత్రం ఒక రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో పాల్గొనగా జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బైక్‌ర్యాలీ జరిపి, సభ నిర్వహించారు. ఒక విధంగా కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రచారంలో ఒంటరి పోరాటమే చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం హుజూర్‌నగర్‌లో మాత్రమే ఎమ్మెల్యే ఉన్నారు. ఆ ఎమ్మెల్యేనే పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కావడంతో అన్నీ తానై ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ఇతర నాయకులు ఎవరూ బయట నుంచి ప్రచారం చేయలేదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి వెళ్లారు. దేవరకొండలో జెడ్పీ చైర్మన్ బాలునాయక్, నాగార్జునసాగర్‌లో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మిర్యాలగూడెంలో పార్టీ నాయకుడు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, కోదాడలో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ప్రచారం చేస్తున్నారు. నల్లగొండలో అంతంత మాత్రంగానే ప్రచారం జరగగా, సూర్యాపేట సెగ్మెంటులో నామ మాత్రంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం జరగడంలేదు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్పై విమర్శలనే ఎక్కువగా నమ్ముకుని ప్రచారం చేసింది. చివరకు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో కూడా ఈ రెండు పార్టీలనే టార్గెట్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీలు ఒకటేనన్న అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువ తీసుకుపోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. టీఆర్ఎస్.. ఈ ఎన్నికల ప్రచార పర్వంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ దూకుడును ప్రదర్శిస్తుంది. ఆ పార్టీకి నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు చోట్ల పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థికి ప్రచారం చేసుకోవడం చాలా తేలికైంది. ఎన్ని కల ప్రచార బాధ్యతను జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డిపై పెట్టిన పార్టీ అధినేత , సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలనూ ఉరుకులు పెట్టిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కాకముందే నియోజకవర్గ స్థాయిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నల్లగొండలో బహిరంగ సభలో పాల్గొని వెళ్లారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ జిల్లా మంత్రికే బాధ్యత అప్పజెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఓ మారు సీఎం కేసీఆర్ మిర్యాలగూడెంలో బహిరంగ సభలో పాల్గొని వెళ్లారు. ప్రతి రోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు అన్ని మండల కేంద్రాలను కవర్ చేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి ప్రచారం చేస్తున్నారు. గ్రామ ప్రచారాల జోలికి వెళ్లకుండా ఆయా మండలాల పరిధిలోని గ్రామాల నుంచి జనాన్ని సమీకరించి మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించడం, ప్రధాన కూడలిలో ప్రసంగాలతో ప్రచారం చేశారు. అభ్యర్థి వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి ఖచ్చితంగా ఉండగా, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కోసం మంత్రితో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒ క నియోజకవర్గ ఇ న్చార్జి, రాష్ట్ర రైతు స మన్వయ సమితి చైర్మన్ గు త్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యా దవ్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మ న్ బండా నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు విధిగా ఆయా సెగ్మెంట్లలో ప్రచారంలో పాల్గొం టున్నారు. సూర్యాపేట, నాగార్జునసాగర్, నల్లగొం డ వంటి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంతో పాటు ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను గు లాబీ గూటికిందకు తీ సుకువచ్చారు. సీపీఎం.. జిల్లా పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో రెండో సారి మహిళా అభ్యర్థిని పోటీకి పెట్టిన సీపీఎం తమ అభ్యర్థి కోసం అందుబాటులో ఉన్న తమ శ్రేణులను అన్నింటినీ రంగంలోకి దింపింది. సీపీఎం అనుబంధ సంఘాలన్నీ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారంలో పాల్గొంటున్నాయి. సీపీఎం అభ్యర్థి మల్లు లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నియోజకవర్గంలో పర్యటించి వెళ్లారు. సీపీఎం అభ్యర్థి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కూడా కావడంతో ఐద్వా జాతీయ నాయకత్వం కూడా ప్రచారంలో పాల్గొంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థి ప్రచారానికి వెళ్తుండగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారం సాగిస్తున్నారు. సీపీఎం అభ్యర్థి కోసం బృందకారత్, పుణ్యవతి వంటి మహిళా నేతలూ ప్రచారం చేశారు. సీపీఎం తన ప్రచారంలో తనకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటోంది. బీజేపీ.. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో రెండు సార్లు రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఈ సారి ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి ప్రచారం చేస్తోంది. రెండో సారి మోదీ ప్రధాని కావాలన్న అంశంపైనే ఎక్కువగా కేంద్రీకరించి ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తోంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థి ప్రచారం చేయగా, ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి విధిగా ఉంటున్నారు. నామినేషన్ దాఖలు రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొనగా ఇతర ముఖ్య నాయకులు ఎవరూ ప్రచారానికి రాలేకపోయారు. పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక రోజు జిల్లా కేంద్రంలో రోడ్ షోలో మాత్రం పాల్గొని వెళ్లారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించకున్నా, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో రోడ్ షోలు నిర్వహిస్తూనే, ప్రధాన కూడళ్లలో సభలు ఏర్పాటు చేసింది. బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేంద్రకుమార్ స్వచ్ఛభారత్ రాష్ట్ర కన్వీనర్‌గా ఉండడంతోపాటు, గతంలో లైన్క్లబ్ ద్వారా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉంటేనే సాధ్యమవుతుందని ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ ప్రతీ మండలానికి ఒక ప్రచార రథాన్ని కేటాయించి వ్యూహాత్మకంగా గ్రామాల్లోనూ ప్రచారం చేసింది. మొత్తంగా నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలు తమదైన ఎజెండాతో ఓటర్లను ప్రసన్నం చేసుకుని ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు నానా తంటాలు పడుతున్నాయి. -
అమెరికాలో టోర్నెడో బీభత్సం