బీజింగ్: చైనాలో శుక్రవారం రాత్రి రెండు శక్తిమంతమైన టోర్నడోలు విరుచుకుపడ్డాయి. వుహాన్, సుజోవ్ ప్రావిన్సులను తాకిన ఈ టోర్నడోల (భీకరమైన సుడిగాలుల) కారణం గా 12 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారని జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. వుహాన్‌లోని కైడియన్ జిల్లాలో వచ్చిన టోర్నడోలో గాలి వేగం సెకనుకు 29.3 మీటర్లు ఉన్నట్లు తెలిపింది. అక్కడే 8 మంది మరణించగా 230 మంది గాయపడ్డారని చెప్పింది.
27 ఇళ్లు కూలిపోగా, 130 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని పేర్కొంది. దీని కారణంగా వుహాన్‌లో 26.6 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొంది. సుజోవ్‌లో వచ్చిన టోర్నడోలో నలుగురు మరణించగా, 19 మంది గాయపడ్డారు. 84 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతాల్లో సాధారణంగా టోర్నడోలు సంభవించే అవకాశం లేకపోయినప్పటికీ, భారీ టోర్నడోలు రావడం గమనార్హం.
Two #tornadoes with winds of more than 200 km/hr wreaked havoc in central & eastern #China on Friday night. 🌪️#EastAsia
— BBC Weather (@bbcweather) May 15, 2021
Further thunderstorms to come this week.⛈️ pic.twitter.com/Yt1N9NlLqv
Comments
Please login to add a commentAdd a comment