Wuhan
-
HKU5-CoV-2: చైనాలో మరో మహమ్మారి!
బీజింగ్: ఐదేళ్ల క్రితం కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం గుర్తుంది కదా! చైనాలో పుట్టినట్లుగా భావిస్తున్న కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. అలాంటి మహమ్మారి మరొకటి చైనాలో పుట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గబ్బిలాల నుంచి హెచ్‌కేయూ5–కోవ్–2 అనే కొత్త వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరి, మాస్కులు ధరించి చికిత్స పొందుతున్న బాధితుల ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. హెచ్‌కేయూ5–కోవ్–2 వైరస్ క్రమంగా మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తుండగా, అలాంటిదేమీ లేదని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు సూచిస్తున్నారు. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్(హెచ్ఎంపీవీ) కేసులు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఇవి హెచ్‌కేయూ5–కోవ్–2కు సంబంధించిన కేసులని భావిస్తున్నారు. ఈ కొత్త వైరస్ సరిగ్గా ఎక్కడ పుట్టిందన్నది స్పష్టంగా తెలియనప్పటికీ గబ్బిలాల నుంచి వచ్చినట్లు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గబ్బిలాల నుంచి తొలుత మరో జంతువుకు, అక్కడి నుంచి మనుషులకు సోకినట్లు అంచనా వేస్తున్నాయి. గాంగ్జౌ లేబోరేటరీ, గాంగ్జౌ అకాడమీ అఫ్ సైన్సెస్, వూహాన్ యూనివర్సిటీ, వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఐదేళ్ల క్రితం సార్స్–కోవ్–2 వైరస్ మనుషుల్లోని హ్యూమన్ యాంజియోటెన్సిన్–కోవర్టింగ్ ఎంజైమ్(ఏసీఈ2) అనే రిసెప్టర్‌ను ఉపయోగించుకొని కణాలపై దాడి చేసింది. ఫలితంగా కోవిడ్–19 పంజా విసరింది. గబ్బిలాల నుంచి పుట్టిన హెచ్‌కేయూ5–కోవ్–2 వైరస్ సైతం ఇదే రిసెప్టర్ ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అంటే కోవిడ్–19 తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్–19 నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలే ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
'కరోనా వైరస్ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు..
చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదని అమెరికా నిఘా సంస్థలు తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వుహాన్ ల్యాబ్ పరిశోధకుడిగా పనిచేసిన చావో షాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను చైనానే ఉద్దేశపూర్వకంగా తయారు చేసిందని చెప్పారు. బయోవెపన్‌గా ఉపయోగించుకోవాలని చైనా కరోనాను సృష్టించిందని అన్నారు. మనుషులతో సహా అన్ని జీవులకు వ్యాప్తి చెందగల కరోనా రకాలను గుర్తించే బాధ్యతను తమ పరిశోధక బృంధానికే అప్పగించినట్లు చెప్పారు. మానవ హక్కుల కార్యకర్త జెన్నీఫర్ జంగ్‌తో జరిగిన ఇంటర్వూలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. ప్రభావవంతమైన కరోనా రకాలను గుర్తించాలని చావో షాన్‌తో సహా తమ సహచర పరిశోధకులకు బాధ్యతను అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. 2019లో నంజిన్ నగరంలో చావో షాన్‌కు స్వయంగా నాలుగు రకాల కరోనాలను పరిశోధనల నిమిత్తం ఇచ్చారని చెప్పారు. అందులో ఓ రకం అత్యంత వ్యాప్తి చెందగల శక్తి ఉన్నది గుర్తించినట్లు వెల్లడించారు. చావో కరోనా వైరస్‌ను ఓ బయోవెపన్‌గా వ్యాఖ్యానించారు. 2019 నుంచి తమ సహచర పరిశోధకులు కనిపించకుండా పోయారని చెప్పారు. పరిశోధనల కోసం మరికొందర్ని అతర దేశాలకు పంపించినట్లు పేర్కొన్నారు. అయితే.. వైరస్ వ్యాప్తి చేయడానికే తమ సహచరులను ఇతర దేశాలకు పంపించినట్లు చావో అనుమానించారు. ఇదీ చదవండి: ‘వుహాన్ ల్యాబ్’ నివేదికలో అదిరిపోయే ట్విస్ట్ -
‘వుహాన్ ల్యాబ్’ నివేదికలో అదిరిపోయే ట్విస్ట్
వాషింగ్టన్: చైనా వుహాన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ పుట్టింది!. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఇవే. అంతేకాదు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కోవిడ్-19 జబ్బు వ్యాప్తి వెనుక కుట్ర కోణం కూడా ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే చైనా వాటిని ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ.. కౌంటర్ విమర్శలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో చైనాకు కరోనా విషయంలో దాదాపుగా క్లీన్చిట్ లభించేసినట్లయ్యింది. కోవిడ్ మహమ్మారి వుహాన్ ల్యాబ్ నుంచి పుట్టిందనడానికి ఆధారాలు దొరకలేదు.. ఇది తాజాగా అమెరికా నిఘా సంస్థలు రూపొందించిన నివేదికలోని సారాంశం. అలాగే.. కరోనా పుట్టుక ఎక్కడి నుంచి అనేదానిపైనా స్పష్టత ఇవ్వలేకపోయాయి కూడా. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతోపాటు మరో సంస్థ కూడా ఈ దర్యాప్తును చేపట్టగా.. తాజాగా నాలుగుపేజీల నివేదిక బయటకు వచ్చింది. వుహాన్ ఇనిస్టిట్యూట్‌లో(WIV) కరోనావైరస్పై విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. కానీ, వ్యాప్తికి అక్కడి నుంచే మొదలైందనడానికి ఆధారాలు మాత్రం లభించలేదు. ప్రత్యక్షంగా ఆ ల్యాబ్ నుంచి పుట్టిందని చెప్పడానికి ఆనవాలు ఏం దొరకలేదు.. అని ఏజెన్సీలు తమ నాలుగు పేజీల నివేదికలో పేర్కొన్నాయి. కరోనా టైంలో ఇనిస్ట్యూట్లోని ల్యాబ్‌లో కరోనా పరిశోధనలు జరిగాయి. కానీ, ప్రీ కోవిడ్ టైంలో అలాంటి వైరస్ల మీద పరిశోధనలు జరిగినట్లు ఆధారాలు దొరకలేదు అని నిఘా నివేదిక వెల్లడించింది. గతంలో పలు అధ్యయనాలు.. కరోనా పుట్టుకకు చైనానే కారణమంటూ ఆరోపిస్తూ వచ్చాయి. అగ్రరాజ్యం సంస్థల ఆరోపణల నేపథ్యంలో.. వుహాన్‌లోని పరిశోధనా కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బృందం 2021 ఫిబ్రవరిలో సందర్శించింది కూడా. కానీ, ఎటూ తేల్చలేకపోయింది. ఇక ఇప్పుడు అమెరికా నిఘా సంస్థలు సైతం ఏం లేదని తేల్చడంతో.. దాదాపుగా వుహాన్ ల్యాబ్ థియరీకి ముగింపు దొరికిందనే చెప్పొచ్చు. చైనాలో అత్యున్నత వైరస్ పరిశోధాన కేంద్రాల్లో ఒకటైన ఈ వుహాన్ కేంద్రాన్ని 2003లో సార్స్ వైరస్ విజృంభణ తరువాత నిర్మించారు. ఇదీ చదవండి: హిందూ సంప్రదాయం ప్రకారం బైడెన్‌కు.. -
కోవిడ్ డేటాను చైనా తొక్కిపెడుతోంది
ఐరాస/జెనీవా: 2020లో వూహాన్ మార్కెట్లో సేకరించిన శాంపిళ్ల డేటాను చైనా తొక్కిపెడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆరోపించింది. కరోనా మూలాలను అంచనా వేయడంలో ఈ సమాచారమే కీలకమని పేర్కొంది. కోవిడ్ పరిశోధనల ఫలితాలను అంతర్జాతీయ సంస్థలతో పంచుకుంటూ పారదర్శకంగా వ్యవహరించాలని హితవు పలికింది. మహమ్మారి పుట్టుకను అర్థం చేసుకోవడం నైతిక, శాస్త్రీయ అవసరమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెసియస్ అన్నారు. ‘‘వూహాన్‌లోని హునాన్ మార్కెట్లో సేకరించిన నమూనాల డేటాను ఈ ఏడాది జనవరి చివర్లో ఆన్లైన్ నుంచి తొలగించారు. దాన్ని తిరిగి అందరికీ అందుబాటులో ఉంచాలని చైనాకు చెప్పాం’’ అన్నారు. చైనాలోని వూహాన్ నగరంలో 2019 ఆఖరులో పుట్టిన కరోనా వైరస్ సార్స్–కోవ్–2 ప్రపంచమంతటా వ్యాపించి, లక్షలాది మరణాలకు కారణంగా మారడం తెలిసిందే. -
కరోనా వైరస్ పుట్టుకపై మరో షాకింగ్ కోణం..
న్యూయార్క్: కరోనా వైరస్ పుట్టుకపై ఇది మరో కొత్త విశ్లేషణ. ఇన్నాళ్లూ గబ్బిలాల నుంచి ఈ వైరస్ సంక్రమించిందని భావిస్తూ ఉంటే కొందరు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం శునకాల నుంచి వచ్చిందని తమ పరిశోధనల్లో వెల్లడైనట్టు చెప్పారు. చైనాలోని వూహాన్ సీఫుడ్ మార్కెట్లో సేకరించిన జన్యు నమూనాలను అధ్యయనం చేస్తే వూహాన్ మార్కెట్లో అమ్ముతున్న రకూన్ డాగ్స్ నుంచే వైరస్ వ్యాప్తి చెందిందని తేల్చారు. ఈ కొత్త విశ్లేషణను న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. జనవరి 2020లో కొందరు శాస్త్రవేత్తలు వూహాన్ మార్కెట్లో శాంపిల్స్ సేకరించారు. అప్పటికే కొత్త వైరస్ ఆందోళనతో వూహాన్ మార్కెట్ అంతా ఖాళీ చేయించారు. ఆ మార్కెట్ గోడలపైన, నేలపైన, జంతువుల్ని ఉంచే పంజరాల్లోనూ జన్యు నమూనాలు సేకరించి అధ్యయనం చేశారు. ఆ నమూనాల్లో అత్యధిక భాగం రకూన్ డాగ్స్‌తో సరిపోలాయని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. ఈ వివరాలను చైనా శాస్త్రవేత్తలతోనూ వారు పంచుకున్నారు. అయితే ఆ తర్వాత గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్ఏఐడీ) నుంచి ఈ డేటా మాయం అయిపోయిందని ఆ శాస్త్రవేత్తలు చెప్పారు. అరిజోనా యూనివర్సిటీ, కాలిఫోర్నియాలో స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిడ్నీ యూనివర్సిటీ వైరాలజిస్టులు ఈ బృందంలో ఉన్నారు. రకూన్ డాగ్స్ నుంచే మనుషులకి సంక్రమించిందా లేదా అన్నది శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పలేకపోయారు. శునకాల నుంచి మనుషులకే నేరుగా సోకొచ్చు లేదా ఆ డాగ్స్ నుంచి వేరే జంతువుకి వెళ్లి మనుషులకి సోకి ఉండొచ్చని అన్నారు. -
కరోనా మూలాల్ని తేల్చాలి: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: కరోనా మూలాలను కనుగొనడం నైతికావసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడింది. అప్పుడు మున్ముందు ఇతర వైరస్లు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయగలమని తెలిపింది. కోవిడ్–19ని మహమ్మారిగా ప్రకటించి మూడేళ్లు అవుతున్న సందర్భంగా డబ్ల్యూహెచ్ఒ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసెస్ మాట్లాడారు. కరోనాతో లక్షలాది మంది మరణించారని, కొన్ని కోట్ల మంది లాంగ్ కోవిడ్‌తో ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలను కనుగొనాల్సిన నైతిక బాధ్యత ఉందని అన్నారు. కరోనా తొలి కేసు వెలుగులోకి వచ్చిన చైనాలోని వూహాన్లో డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం 2021లోనే కొన్ని వారాలు గడిపి గబ్బిలాల నుంచి మనుషులకి ఈ వైరస్ సోకిందని నివేదిక సమర్పించింది. మరోవైపు అమెరికా అధ్యయనంలో ఈ వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని తేలింది. ఇలా రెండు పరస్పర విరుద్ధమైన వాదనలు ప్రచారంలో ఉండడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంది.అందుకే అసలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ చెప్పారు. అత్యంత ప్రమాదకర వైరస్‌లపై అధ్యయనానికి డబ్ల్యూహెచ్ఒ ఏర్పాటు చేసిన సైంటిఫిక్ అడ్వయిజరీ గ్రూప్ కూడా ఇప్పటివరకు కరోనా వైరస్ పుట్టుకపై ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయింది. కీలకమైన డేటా కనిపించడం లేదని కమిటీ అంటోంది. భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 113 రోజుల తర్వాత ఒకే రోజు 524 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,618కి చేరుకుంది. -
సమాచారం దాచి.. సంక్షోభం పెంచి
బీజింగ్: తొలిసారిగా వూహాన్లో కరోనా వైరస్ ఉద్భవించిన నాటి నుంచి చైనా అంతటా కోవిడ్ కరాళనృత్యం కొనసాగేవరకూ ఏ విషయాన్నీ స్పష్టంగా ప్రపంచదేశాలతో పంచుకోని చైనా మళ్లీ అదే పంథాలో వెళ్తోంది. దాంతో ఈసారీ ఇంకా ఎలాంటి వేరియంట్లు పడగవిప్పుతాయో తెలీక ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. చైనా హఠాత్తుగా జీరో కోవిడ్ పాలసీ ఎత్తేశాక అక్కడ విజృంభించిన కరోనా కేసులు, కోవిడ్ మరణాల సంఖ్యపై ఎలాంటి సమగ్ర వివరాలను అధికారికంగా బయటపెట్టకపోవడంతో ప్రపంచ దేశాలను ఆందోళన చెందుతున్నాయి. దీంతో ముందస్తుచర్యగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ టెస్ట్‌ను తప్పనిసరి చేస్తూ కొన్ని దేశాలు నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. అమెరికా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, ఇటలీ, మలేసియా ఇప్పటికే చైనా ప్రయాణికులపై కోవిడ్ నిబంధనలను అమలుచేస్తున్నాయి. ‘ చాంద్రమాన నూతన సంవత్సరం సందర్భంగా 30,000 మంది తైవానీయులు చైనా నుంచి స్వదేశం వస్తున్నారు. ప్రతీ ఒక్కరినీ టెస్ట్ చేయాల్సిందే. చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పారదర్శకత లోపించింది. చైనా ఇతరదేశాలతో సమాచారం పంచుకోకపోవడమే ఇక్కడ అసలు సమస్య’ అని తైవాన్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్ అధినేత వాంగ్ పీ షెంగ్ అన్నారు. అప్పుడే సమగ్ర వ్యూహరచన సాధ్యం ఎప్పటికప్పుడు డాటా ఇస్తున్నామని చైనా తెలిపింది. కాగా,‘ఐసీయూలో చేరికలు, ఆస్పత్రుల్లో ఆందోళనకర పరిస్థితిపై పూర్తి సమాచారం అందాలి. అప్పుడే ప్రపంచదేశాల్లో క్షేత్రస్థాయిలో సన్నద్ధతపై సమగ్ర వ్యూహరచన సాధ్యమవుతుంది’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనోమ్ ఘెబ్రియేసెస్ అన్నారు. ‘కరోనాను అంతం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన చైనా హఠాత్తుగా కోవిడ్ పాలసీని ఎత్తేయడం ఆందోళనకరం. చైనా దేశీయ పరిస్థితిని చక్కదిద్దాల్సిందిపోయి కోవిడ్ నిబంధనలను గాలికొదిలేయడంతో పశ్చిమదేశాలు ఆగ్రహంతో ఉన్నాయి’ అని వాషింగ్టన్‌లోని మేథో సంస్థ హాడ్సన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైల్స్ యూ వ్యాఖ్యానించారు. -
యురేకా! హెల్ప్.. హెల్ప్!!
యురేకా! హెల్ప్.. హెల్ప్!! -
కరోనా పుట్టుకకు అగ్రరాజ్యమే కారణం...వెలుగులోకి షాకింగ్ నిజాలు
కరోనా పుట్టినిల్లు చైనా అంటూ అంతా డ్రాగన్ దేశాన్ని ఆడిపోసుకున్నారు. కానీ అసలు కారణం అగ్రరాజ్యం అని యూఎస్‌కి చెందిన ఒక పరిశోధకుడు తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నాడు. చైనాలోని ప్రుభుత్వ నిధులతో నిర్వహిస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధన కేంద్రం నుంచే కరోనా వైరస్ లీకైందని పేర్కొంది కూడా ఈ శాస్త్రవేత్తే. ఈ మేరకు యూఎస్ పరిశోధకుడు ఆండ్రూ హఫ్ తాను రాసిన 'దిట్రూత్ అబౌట్ వ్యూహాన్' అనే పుస్తకంలో ఈ విషయాల గురించి వెల్లడించాడు. చైనాలో రిసెర్చ్ సెంటర్లోని కరోనా వైరస్ పరిశోధనలకు యూఎస్ ప్రభుత్వమే నిధులందిస్తోందని చెప్పారు. ఐతే చైనా ల్యాబ్‌లో పరిశోధనలకు తగినంత భద్రత లేకపోవడంతోనే ఈ వైరస్ లీక్ అయినట్లు తెలిపారు. ఇది మానవ నిర్మిత వైరస్ అని తేల్చి చెప్పారు. ఈ పరిశోధనలు అత్యంత రిస్క్‌తో కూడినవని, వీటికి సరైన భద్రత తోపాటు ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే నియంత్రించ గలిగేలా ల్యాబ్‌లో తగినంత కట్టుదిట్టమైన చర్యలు లేవన్నారు. అంతేగాదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) అనేది అమెరికా ప్రభుత్వం ప్రాథమిక ఏజెన్సీ. ఈ ఎన్ఐహెచ్ అంటువ్యాధులపై అధ్యయనం చేసే లాభప్రేక్ష లేని ఎకోహెల్త్ అలియన్స్ అనే సంస్థకు గబ్బిలాలతో వివిధ కరోనా వైరస్‌లపై అధ్యయనం చేసేందుకు దశాబ్దాలకుపైగా నిధులు సమకూర్చిందని చెప్పారు. పైగా ఈ సంస్థ వ్యూహాన్ ల్యాబ్‌తో టైఅప్ అయ్యి ఈ కరోనా వైరస్‌పై మరింతగా పరిశోధనలు చేసిందని, ఫలితంగానే ఈ వైరస్ లీక్ అయ్యిందని చెప్పారు. శాస్త్రవేత్త హాఫ్ 2014 నుంచి 2016 వరకు ఈ ఎకోహెల్త్ అలియన్స్ సంస్థ మాజీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ ఎకోహెల్త్ సంస్థ ఈ కరోనా వైరస్‌ను సృష్టించే పరిశోధన పద్ధతులను మరింతగా అభివృద్ధి చేయడంలో వ్యూహాన్ ల్యాబ్‌కు సాయం చేసినట్లు తెలిపారు. ఇది జన్యు పరంగా సృష్టించిన వైరస్ అని చైనాకు ముందు నుంచే తెలుసునని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రమాదకరమైన బయోటెక్నాలజీ చైనాకు అందించింది యూఎస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చైనా అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పరిశోధనలకు నిలయంగా మారింది. ఐతే వ్యూహాన్ పరిశోధన సంస్థకు వనరుల కొరత ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయిని పెంచుకునేలా అధికస్థాయిలో శాస్త్రీయ పరిశోధనలు జరగాలంటూ చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ విపరీతమైన ఒత్తిడిని తీసుకొచ్చినట్లు శాస్త్రవేత్త హాఫ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. (చదవండి: చైనా మంకుపట్టుతో అల్లాడుతున్న జనాలు.. బలవంతంగా ఈడ్చుకెళ్తూ..) -
డౌట్ లేదు కరోనా పుట్టింది అక్కడే.. తేల్చిన అధ్యయనం
బీజింగ్: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దాని మూలలపై తీవ్ర చర్చ జరిగింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చిందనే ప్రచారమూ జరిగింది. చైనా మాత్రం దీన్ని ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్-19 ఎక్కడ పుట్టిందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా కరోనా మూలాలపై అధ్యయనం చేసిన రెండు నివేదికలు వైరస్ వ్యాప్తి వుహాన్‌లోనే మొదలైందని స్పష్టం చేశాయి. అయితే ఇది కచ్చితంగా వుహాన్ ల్యాబ్‌లో పుట్టలేదని, అదే నగరంలోని సీఫుడ్ మార్కెట్ నుంచే దీని వ్యాప్తి మొదలైందని పేర్కొన్నాయి. అడవి జంతువులు, క్షీరదాల విక్రయాలు జరిగే సమయంలో వైరస్ ఉత్పరివర్తనం చెంది మనుషులకు వ్యాపించి ఉంటుందని స్పష్టం చేశాయి. రెండు నివేదికలు అడవిలోని క్షీరదాల్లోనూ సార్స్ కోవ్-2 వైరస్ ఉన్నట్లు వెల్లడించాయి. 2019 నవంబర్ ముందు వరకు సార్స్ కోవ్-2 మనుషులకు వ్యాపించలేదని అధ్యయనం స్పష్టం చేసింది. 2019 డిసెంబర్ 20 నాటికి వెలుగు చూసిన తొలి 8 కరోనా కేసులు వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ ఉన్న పశ్చిమ ప్రాంతంలోనే నమోదయ్యాయని అధ్యయానాలు పేర్కొన్నాయి. చైనాలో వెలుగుచూసిన కరోనా ఆ తర్వాత ప్రపంచ దేశాలకు విస్తరించి అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా 60లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పాయరు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాయి. చదవండి: మంకీపాక్స్ అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్ఓ -
ఇది కుట్రలో భాగమేనా?.. అనుమానాస్పదంగా చైనా చర్యలు
Covid Leak From Wuhan Lab: ఈ కరోనా మహమ్మారికి కారణం చైనా అంటూ ప్రపంచ దేశాలన్ని వేలెత్తి చూపించిన వేటిని లక్ష్యపెట్టక ఇప్పటికీ తనదైన శైలిలో దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది. అంతేకాదు కోవిడ్ మూలాలుపై స్వతంత్ర దర్యాప్తు కోసం కాన్బెర్రా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయిన డ్రాగన్ కంట్రీ వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించింది. మరోవైపు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వుహాన్ ల్యాబ్ భాద్యతలు తీసుకునే నిమత్తం చుట్టూ ఆర్మీ జనరల్‌ను మోహరించడం, కరోనా వైరస్‌కి సంబంధించిన విషయంలో ఎప్పుడూ పారదర్శకంగా వ్యవహరించకుండా తప్పుడూ కథనాలను ఇచ్చేందుకు ప్రయత్నించిందని ప్రోవిడెన్స్ నివేదిక వెల్లడించింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) మీడియా వుహాన్ లాక్‌డౌన్‌ను డాక్యుమెంట్ చేసినందుకు ఒక చైనీస్ జర్నలిస్టును జైలులో పెట్టారు. పైగా ఈ కరోనా మహమ్మారీ వచ్చి అప్పుడే రెండేళ్లు గడిచిందని ఈ మహమ్మారీతో అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూశామని ఇక దీనిపై విచారించాల్సింది, రుజువు చేయాల్సింది ఏమి లేదంటూ చైనా బుకాయిస్తోంది. అంతేకాదు కోవిడ్ -19 మూలానికి సంబంధించిన ప్రచురణలపై కూడా ఆంక్షలు జారీ చేసింది. మరోవైపు ల్యాబ్ లీక్‌లు జరుగుతాయని, దేశంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం అని అడ్డకోలుగా మాట్లాడుతోంది. అంతేకాదు డిసెంబర్ 2021లో తైవాన్ అధికారికంగా SARS-COV-2 ల్యాబ్ లీక్‌ను ధృవీకరించింది కూడా. అయితే చైనా సీసీపీ మీడియా అధికారికంగా ఈ విషయం పై నోరు మెదపటం లేదు. దీంతో వ్యూహాన్ ల్యాబ్ లీక్ అనేది అనుకోకుండా జరిగిన ప్రమాదమా ? లేక కావాలని చేసిన పనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ పాశాత్య వైరాలజీ శాస్త్రవేత్తలు, జర్నలిస్ట్‌లు ఇది కుట్రగా అభివర్ణించడం గమనార్హం. (చదవండి: మహిళకు అరుదైన శస్త్ర చికిత్స.. కంటి నుంచి బొట్‌ఫ్లైస్ తొలగింపు!) -
మరో బాంబు పేల్చిన చైనా.. ఆ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి
Wuhan Scientists Warn, New Corona NeoCov Found in South Africa: కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్లతో సతమతమై ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ చైనా మరో బాంబ్ పేల్చింది. కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలే ఈ కొత్త మహమ్మారి గురించి వార్నింగ్ బెల్స్ మోగించారు. కొత్తరకం కరోనా వైరస్ నియోకోవ్తో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇది అత్యంత వేగంగా వ్యాపించగలదని, మరణాలు రేటు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టుల వార్నింగ్ ఇచ్చారు. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, నియో కోవ్ వైరస్ కొత్తదేమీ కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2012-15 పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్సికోవ్కు నియోకోవ్‌కు సంబంధం ఉందని వెల్లడించారు. నియోకోవ్‌ను తొలుత దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో గుర్తించారని ఇప్పటివరకు మనుషులకు సోకలేదని వివరించారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతున్న వైరస్‌గా గుర్తించినట్లు తెలిపారు. అయితే ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వ్యూహాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో నిర్ధారణ అయింది. సార్స్కో-2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్‌తో కలిసి వ్యూహాన్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం బయో ఆర్షయోలో ప్రచురితమైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్ రివ్యూ చేయలేదు. చదవండి: (తరోన్‌ను భారత ఆర్మీకి అప్పగించిన చైనా ఆర్మీ) -
ఒమిక్రాన్ కేసులు జీరో.. అయినా భారీ లాక్డౌన్!
China Impose Huge Lockdown In Xian: ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణలో కరోనా పుట్టుక- వుహాన్ ల్యాబ్ థియరీ మరోసారి తెర మీదకు వచ్చింది. వైరస్ వెనుక డ్రాగన్ కంట్రీ హస్తమే ఉందన్న ఆరోపణను మరోసారి బలంగా లేవనెత్తుతోంది అమెరికా. ఈ తరుణంలో చైనాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒమిక్రాన్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాకపోయినా.. భారీ లాక్‌డౌన్‌కు చైనా సిద్ధపడింది. కోటికి పైగా జనాభా ఉన్న చైనా వుహాన్ నగరాన్ని.. కరోనా వైరస్ పుట్టినిల్లుగా అనుమానిస్తున్న విషయం తెలిసిందే. అయితే వుహాన్‌లో గతంలో విధించిన లాక్‌డౌన్‌ను ప్రపంచమంతా భారీగా భావించించింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ జనాభే ఉన్న నగరాన్ని లాక్‌డౌన్‌తో దిగ్భంధించింది చైనా ప్రభుత్వం. పశ్చిమ చైనా నగరం జియాన్‌లో గురువారం నుంచి లాక్డౌన్ అమలు అవుతోంది. మరికొన్ని నగరాలకు లాక్డౌన్ విధించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. కోటిన్నరకి పైగా జనాభా ఉన్న జియాన్‌లో అనవసరమైన ప్రయాణాల్ని నిషేధించారు. నిత్యావరసరాలకు ఒక్కరే బయటకు వెళ్లాలన్న నిబంధనను విధించారు. మరోవైపు డొమెస్టిక్ విమానాల్ని సైతం రద్దు చేసింది. కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు తమ దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని చైనా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో చైనా లాక్డౌన్ ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు డెల్టా వేరియెంట్ కేసులు మాత్రం ఉన్నాయి. 14 జిల్లాల్లో 127 కేసులు బయటపడ్డాయి తాజాగా. అయితే ఇవేవీ స్థానికంగా వచ్చినవి కావని, బయటి నుంచి వచ్చినవాళ్లవేనని ప్రకటించుకుంది ప్రభుత్వం. ఈ తరుణంలో వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో లాక్డౌన్ ప్రకటించినట్లు చైనా మీడియా కథనాలు వెలువరుస్తోంది. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ ప్రభావంతో ఇమ్యూనిటీ ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉన్నందునే.. చైనీస్ వైస్ ప్రీమియర్ సన్ చున్లాన్ ఆదేశాల మేరకు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. తద్వారా లోకల్ ట్రాన్స్మిషన్ తగ్గించే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం పని చేస్తోంది. ఇక సెలవుల ప్రయాణాలు, ఫిబ్రవరి నుంచి జరగబోయే వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలోనే కరోనా కేసుల్ని కట్టడి చేసే దిశగా చైనా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. 2021లో చైనాలో తొమ్మిది సార్లు కరోనా విజృంభించింది. అయితే అధికారిక లెక్కలు చెప్పడానికి చైనా ఇష్టపడడం లేదు. మొత్తంగా కరోనా మొదలైనప్పటికీ లక్షకి పైగా కేసులు, 4 వేల మరణాలు మాత్రమే ప్రకటించుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యాన్ని గురి చేసింది డ్రాగన్ కంట్రీ. అంతేకాదు కరోనా విజృంభణ తర్వాత ‘జీరో’ కేసులుగా ప్రకటించుకున్న దేశాల్లో చైనా మొదటిది కావడం కొసమెరుపు. చదవండి: ఒమిక్రాన్ విజృంభణ.. రాబోయే మూడు నెలలు గడ్డుకాలమేనా? -
కరోనా తొలిసారిగా సోకింది ఆమెకే..
బీజింగ్: చైనాలోని వూహాన్ మార్కెట్లో సీఫుడ్ అమ్మే ఒక మహిళ కరోనా వైరస్ సోకిన మొట్ట మొదటి వ్యక్తి అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వూహాన్‌కి దూరంగా నివసించే ఒక అకౌంటెంట్ కోవిడ్–19 తొలి రోగి అని ఇన్నాళ్లు భావిస్తున్నది తప్పని జర్నల్ సైన్స్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కరోనా వైరస్ మూలాలు కనుక్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) చేసిన విచారణ కూడా తప్పుదారిలోనే నడిచిందని అభిప్రాయపడింది. వూహాన్‌లోని మాంసం అమ్మే హోల్‌సేల్ ఫుడ్ మార్కెట్లో మహిళే మొట్టమొదటి కరోనా రోగి అని ఆ అధ్యయనం తేల్చింది. 2019 డిసెంబర్ 11న సీఫుడ్ అమ్మే ఒక మహిళలో లక్షణాలు బయటపడ్డాయని వెల్లడించింది. -
చావుబతుకుల్లో ఆమె.. చైనాపై ఒత్తిడి పెంచండి
బీజింగ్: కరోనా మహమ్మారి వ్యాప్తి గురించి ప్రపంచానికి వెల్లడించిన చైనా సిటిజన్ జర్నలిస్ట్ జాంగ్ జాన్.. చావుబతుకుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. న్యాయవాదిగా పనిచేసిన 38 ఏళ్ల జాంగ్ జాన్.. గతేడాది ఫిబ్రవరిలో వుహాన్ వెళ్లారు. కరోనా వ్యాప్తి గురించి అక్కడి అధికారులను నిలదీశారు. తన స్మార్ట్‌ఫోన్ ద్వారా తీసిన ఈ వీడియోలు బయటకు రావడంతో గత సంవత్సరం మే నెలలో ఆమెను అరెస్ట్ చేశారు. ఘర్షణలు రేకెత్తించడానికి ప్రయత్నించారన్న అభియోగాలతో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అసమ్మతి వాదులను అణచివేసేందుకు చైనాలో సాధారణంగా ఇలాంటి అభియోగాలు మోపుతారన్న ఆరోపణలు ఉన్నాయి. జైల్లో నిరాహారదీక్ష కాగా, షాంఘై జైలులో జాంగ్ జాన్.. నిరాహారదీక్షకు దిగినట్టు ఆమె తరపు న్యాయబృందం ఈ సంవత్సరం ప్రారంభంలో వెల్లడించింది. నాసికా రంధ్రాల ద్వారా బలవంతంగా ఆమెకు ఆహారం అందిస్తున్నారని, జాంగ్ జాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని ‘ఏఎఫ్‌పీ’ వార్తా సంస్థకు న్యాయబృందం తెలిపింది. ఎక్కువ కాలం బతక్కపోవచ్చు ‘ఆమె ఇప్పుడు చాలా తక్కువ బరువుతో ఉంది. ఎక్కువ కాలం జీవించకపోవచ్చు. చలికాలంలో ఆమె జీవించడం కష్టం. తన ఆరోగ్యాన్ని తానే కాపాడుకోవాలని ఆమె రాసిన ఉత్తరాల్లో కోరాను. తాను నమ్మిన దేవుడు, విశ్వాసాలను తప్పా మిగతా వాటిని నా సోదరి లెక్కచేయద’ని ఆమె సోదరుడు జాంగ్ జు గత వారం ట్విటర్లో పేర్కొన్నారు. అవమానకర దాడి జాంగ్ జాన్‌కు తక్షణమే వైద్య చికిత్స అవసరమని, ఆమెను వెంటనే విడుదల చేయాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ గురువారం చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జాంగ్ జాన్ అరెస్ట్‌ను ‘మానవ హక్కులపై అవమానకర దాడి’గా అమ్నెస్టీ ప్రచారకర్త గ్వెన్ లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. (చదవండి: చైనా దుశ్చర్య: అరుణాచల్ ప్రదేశ్‌లో 100 ఇళ్ల నిర్మాణం) సమాధానం లేదు షాంఘై మహిళా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న జాంగ్‌ను కలిసేందుకు మూడు వారాల క్రితం కుటుంబ సభ్యులు ప్రయత్నించినా అధికారుల నుంచి స్పందన రాలేదని పేరు వెల్లడించడానికి భయపడిన ఆమె సన్నిహితుడొకరు ‘ఏఎఫ్‌పీ’కి చెప్పారు. ఈ విషయంపై మాట్లాడేందుకు జాంగ్ తల్లి నిరాకరించారని.. షాంఘై జైలు నుంచి కూడా సమాధానం రాలేదని ‘ఏఎఫ్‌పీ’తెలిపింది. చైనా వ్యతిరేక రాజకీయ కుట్ర జాంగ్ జాన్ ఆరోగ్య పరిస్థితిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. అయితే ఆమె విడుదల కోసం మానవ హక్కుల సంఘాలు చేస్తున్న ప్రయత్నాలను ‘చైనా వ్యతిరేక రాజకీయ కుట్రలు’గా వర్ణించింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారు చట్టప్రకారం శిక్షకు గురికాక తప్పదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్.. మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. (చదవండి: మీది గొప్ప మనసు ...ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!) చైనాపై ఒత్తిడి తేవాలి జాంగ్ జాన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. మరొకరి సహాయం కూడా ఆమె నడవలేకపోతున్నారని, కనీసం తల కూడా కదపలేకపోతున్నారని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) వెల్లడించింది. పరిస్థితి మరింత విషమించక ముందే చైనాపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొచ్చి జాంగ్ జాన్‌ను విడుదలయ్యేలా చూడాలని ఆర్ఎస్ఎఫ్ విజ్ఞప్తి చేసింది. కాగా, వుహాన్‌లో కరోనా వ్యాప్తి గురించి ప్రపంచానికి వెల్లడించిన మరో ముగ్గురు పౌర పాత్రికేయులు చెన్ క్యుషి, ఫాంగ్ బిన్, లి జెహువా కూడా నిర్బంధానికి గురయ్యారు. (చదవండి: బరువు తగ్గించే ఔషధానికి ఆమోదం.. షాపులకు క్యూ కట్టిన జనాలు) -
మూలం కనిపెట్టడంలో అమెరికా విఫలం
వాషింగ్టన్: కరోనా వైరస్ పుట్టుకపై విచారణ జరిపిన అమెరికా ఇంటెలిజెన్స్ ఎటూ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఆ వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీకయిందా లేదంటే సహజసిద్ధంగానే పుట్టుకొచ్చిందా అనే అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమయ్యారు. అయితే కరోనా వైరస్‌ని జీవాయుధంగా అభివృద్ధి చేశారని తాము భావించడం లేదని ఇంటెలిజెన్స్ తన నివేదికలో స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ అధికారులు వైరస్ పుట్టుకపై విచారణ జరిపి శుక్రవారం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో వ్యాప్తి చాలా స్వల్పంగా ఉందని రాను రాను అది పెద్ద ఎత్తున విస్తరించిందని ఇంటెలిజెన్స్ డైరెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. వూహాన్లో ఈ వ్యాధి లక్షణాలు 2019 నవంబర్లోనే కనిపించాయని, డిసెంబర్ నాటికి చైనా వ్యాప్తంగా విస్తరించాయని చెప్పారు. ‘వైరస్‌ని ఒక జీవాయుధంగా ఎవరూ అభివృద్ధి చేయలేదు. విచారణలో పాల్గొన్న ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ దీనిపై ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. అయితే ఈ వైరస్ జన్యుమార్పిడి ద్వారా సృష్టించిన ఆయుధం కాదు అని మాత్రం గట్టిగా నిర్ధారణకు రాలేకపోయాయి. రెండు సంస్థలు మాత్రం దేని పైనా స్పష్టమైన నిర్ణయం రావడానికి తగిన ఆధా రాల్లేవని తెలిపాయి’ అని ఆ నివేదిక వివరిం చింది. కానీ ఆ ఇంటెలిజెన్స్ సంస్థల వివరాలేవీ అమెరికా వెల్లడించలేదు. కరోనా వైరస్ వ్యాప్తి వెలుగులోకి రాక ముందు చైనాలో శాస్త్రవేత్తలకు సైతం దీనిపై కనీస పరిజ్ఞానం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అన్ని విధాల అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించిన తర్వాత ఇంటెలిజెన్స్ సంస్థలు ఈ వైరస్ సహజ సిద్ధంగా అయినా వచ్చి ఉండాలని లేదంటే ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తూ లీక్ అయి ఉండాలని భావి స్తున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది సరైనదో చెప్పడానికి వారికి తగిన ఆధారాలైతే లభించలేదు. అమెరికావన్నీ రాజకీయాలే: చైనా మరోవైపు చైనా ఈ నివేదికపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అమెరికా ఇంకా దీనిపై రాజకీయం చేయాలనుకుంటోందని ఆరోపించింది. వైరస్ పుట్టుకకు కారణాలు వెతికే పని శాస్త్రవేత్తలదే తప్ప ఇంటెలిజెన్స్‌ది కాదని వాషింగ్టన్లో చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా ఇంటెలిజెన్స్ తప్పుల తడక నివేదిక ఇచ్చిందని అభిప్రాయపడింది. కీలక సమాచారం చైనా దగ్గరే ఉంది : బైడెన్ అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికతో పాటు అధ్యక్షుడు జో బైడెన్ ఒక ప్రకటనను విడుదల చేస్తూ కరోనా మూలాలు కనుక్కోవడానికి తమ పాలనా యంత్రాంగం చేయాల్సిన కృషి అంతా చేసిందని అన్నారు. కీలకమైన సమాచారం అంతా చైనా తన గుప్పిట్లో పెట్టుకొని ఉందని, మొదట్నుంచి చైనా అధికారులు అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రపంచ దేశాలను కరోనా అల్లకల్లోలం చేస్తూ మరణాల సంఖ్య పెరిగిపోతున్నా చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని బైడెన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ విచారణలో ఈ వైరస్ వూహాన్లో జంతు మార్కెట్ నుంచి విడుదలైనట్టుగా నివేదిక ఇచ్చినప్పటికీ ఎందరో శాస్త్రవేత్తలకి దానిపై నమ్మకం కుదరలేదు. -
ఏడాది దాటినా లక్షణాలు
బీజింగ్: కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన వారిలో.. వ్యాధి తగ్గిన ఏడాది తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింంది. చైనాలోని వుహాన్‌లో జరిగిన ఈ అధ్యయనం శుక్రవారం ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా సోకినప్పటి నుంచి 12 నెలల పాటు 1,276 మందిపై ఈ అధ్యయనం చేసినట్లు వుహాన్‌లోని చైనా–జపాన్ ప్రెండ్షిప్ హాస్పిటల్ ప్రొఫెసర్ బిన్ కావ్ తెలిపారు. అధ్యయనంలో ఉన్న చాలా మంది కరోనా నుంచి బాగానే కోలుకున్నప్పటికీ, వ్యాధి ముదిరి ఐసీయూ వరకు వెళ్లిన రోగులకు మాత్రం ఏడాది తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. 2020 జనవరి 7 నుంచి మే 29 మధ్య డిశ్చార్జ్ అయిన వారిపై ఈ ప్రయోగం జరిగిందని పేర్కొన్నారు. ఆరోగ్యంగా లేరు.. కరోనా సోకిన వారిని, సోకని వారిని పోల్చి చూస్తే వ్యాధి సోకిన వారు ఏడాది తర్వాత కూడా వ్యాధి సోకని వారిలా ఆరోగ్యంగా లేరని లాన్సెట్ జర్నల్ తెలిపింది. కరోనా నుంచి కోలుకోవడానికి కొందరికి ఏడాదికి పైగా పడుతుందని ఈ అధ్యయనంద్వారా వెల్లడైనందున, కోవిడ్ అనంతరం ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగులకు సంబంధించిన ఆరోగ్య వివరాలను ఆరు నెలల తర్వాత మొదటి సారి, పన్నెండు నెలల తర్వాత రెండో సారి సేకరించినట్లు వెల్లడించింది. లక్షణాలేవంటే.. కరోనా సోకి నయమైన వారిలో చాలా మందికి ఏ లక్షణాలు లేకుండా పోగా, సగం మందిలో మాత్రం పలు లక్షణాలు అధ్యయనకర్తలు గుర్తించినట్లు లాన్సెట్ వెల్లడించింది. నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు అత్యంత ఎక్కువగా కనిపించినట్లు లక్షణాలని తెలిపింది. ఆరు నెలల తర్వాత సగం మందిలో ఈ లక్షణాలు కనిపించగా, ఏడాది తర్వాత ఇవి ప్రతి అయిదు మందిలో ఒకరికి పరిమితమయ్యాయని పేర్కొంది. పన్నెండు నెలల తర్వాత కూడా ప్రతి ముగ్గురిలో ఒకరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. లక్షణాలు కనిపించిన వారిలో.. కరోనా సోకిన సమయంలో ఐసీయూ వరకు వెళ్లి ఆక్సిజన్ ట్రీట్మెంట్ పొందిన వారు అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. పరీక్షలివే.. 349 మందికి లంగ్ ఫంక్షన్ టెస్టు (ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష) నిర్వహించామని, వారిలో 244 మందికి 12 నెలల తర్వాత కూడా అదే పరీక్షను తిరిగి నిర్వహించినట్లు పరిశోధకులు తెలిపారు. ఆరు నెలల సమయంలో నిర్వహించిన పరీక్షలో వచ్చిన ఫలితాలే సంవత్సరం తర్వాత కూడా వచ్చాయని, ఏ మాత్రం మెరుగు పడలేదని తాము గుర్తించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మరో 353 మందికి ఆరు నెలల తర్వాత సీటీ స్కాన్ చేయగా, వారిలో సగం మంది ఊపిరితిత్తులు అసహజ పనితీరును చూపినట్లు తెలిపారు. అనంతరం 12 నెలల తర్వాత 118 మందికి సీటీ స్కాన్ నిర్వహించగా, అసహజ పనితీరు తగ్గినట్లు గుర్తించామని తెలిపారు. మహిళల్లోనే ఎక్కువ.. పురుషులతో పోలిస్తే మహిళల్లో నీరసం, కండరాల బలహీనత 1.4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని లాన్సెట్ జర్నల్ తెలిపింది. ఆందోళన, కుంగుబాటు వంటివి కూడా పురుషులతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా మహిళల్లో నమోదైందని చెప్పింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ పురుషులతో పోలిస్తే మహిళల్లో 12 నెలల తర్వాత కూడా ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా నమోదైందని పేర్కొంది. స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో కూడా 1.5 రెట్లు ఎక్కువ లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. అయితే ఈ పరిశోధన మొత్తం ఒకే ఆస్పత్రిలో చేరిన వారిపై జరిగిందని, అందువల్ల అన్ని ప్రాంతాలకు దీన్ని వర్తింపజేయలేమని పరిశోధనలో పాల్గొన్న జియోయింగ్ గున్ అభిప్రాయపడ్డారు. అధ్యయనం సాగిందిలా.. అధ్యయనంలో భాగంగా ఆస్పత్రికి చెందిన నిపుణులు కరోనా నుంచి కోలుకున్న వారితో రెండు సార్లు ముఖాముఖి సమావేశాలను నిర్వహించారు. భౌతిక పరీక్షలు, ల్యాబ్ పరీక్షలు, ఆరు నిమిషాల నడక పరీక్ష వంటి పలు టెస్టులను జరిపారు. కరోనా తగ్గిన 185, 349వ రోజున ఈ ముఖాముఖిలను, పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. అధ్యయనంలో పాల్గొన్న వారి సగటు వయసు 57 ఏళ్లుగా ఉందని స్పష్టం చేశారు. కరోనా తగ్గిన తర్వాత ఆరు నెలలకు 68 శాతం మందిలో కరోనా లక్షణాలు కొనసాగాయని, ఏడాది తర్వాత అది 49 శాతానికి తగ్గిందన్నారు. అంటే ఏడాది తర్వాత కూడా సగం మందికి కరోనా లక్షణాలు కొనసాగినట్లు తేలిందని పరిశోధనలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. -
కరోనా లీక్: డబ్ల్యుహెచ్ఓ నిపుణుడి వ్యాఖ్యల కలకలం
లండన్: కరోనా కేసులు తొలిసారి గుర్తించిన ప్రాంతంలోని ఒక ల్యాబ్ భద్రతా ప్రమాణాలపై అప్పట్లోనే అనుమానాలు వచ్చాయని డబ్ల్యుహెచ్ఓ నిపుణుడు పీటర్ బెన్ ఎంబరెక్ చెప్పారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై చైనాలో పరిశోధనకు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందంలో ఆయన పనిచేశారు. ఆ సమయంలోనే సదరు ల్యాబ్ ప్రమాణాలపై తనకు అనుమానాలు వచ్చాయని డానిష్ టీవీ డాక్యుమెంటరీలో బెన్ తెలిపారు. వూహాన్‌లోని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ల్యాబ్‌లో కరోనా వైరస్‌లను ఉంచారని, కానీ ఆ ల్యాబ్ భద్రతా ప్రమాణాలు కరోనా వైరస్ కట్టడి చేసే స్థాయిలో లేవని బెన్ తెలిపారు. చైనా అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి తెచ్చి, మహమ్మారి మూలాలపై విచారణ సమయంలో లీక్ సిద్ధాంతాన్నివిరమించుకోవాలని ఒత్తిడి తెచ్చారని బెన్ మాటమార్చడం సంచలనంగా మారింది. సదరు బృందం మాత్రం అప్పట్లో వూహాన్ నుంచి కరోనా విడుదల కాలేదంటూ నివేదికనిచ్చింది. ఈ బృందానికి నాయకత్వం వహించిన బెన్ తాజాగా అనుమానాలు వ్యక్తం చేయడంపై కలకలం రేగుతోంది. ‘‘ది వైరస్ మిస్టరీ" పేరుతో వచ్చిన తాజా డాక్యుమెంటరీలో బెన్ చైనాకు పోవడం, వూహాన్ మార్కెట్లో స్టాల్స్‌ను పరిశీలించడం, తన అనుమానాలు వ్యక్తం చేయడం తదితర దృశ్యాలున్నాయి. కరోనా వైరస్ ఏదో ఒక ప్రాణి నుంచి మనిషికి ఈ మార్కెట్లోనే వచ్చిఉంటుందని బెన్ అనుమానపడ్డారు. అలాగే వూహాన్‌లోని చైనా ల్యాబ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్‌కు దగ్గరలో ఉన్న సీడీసీ చైనా ల్యాబ్‌పై తనకు చాలా అనుమానాలున్నాయన్నారు. గబ్బిలాల నుంచి శాంపిళ్లు తీస్తున్న ల్యాబ్ వర్కర్‌కు కరోనా తొలిసారి సోకి ఉండే ప్రమాదం ఉందని గతంలో బెన్ అభిప్రాయపడ్డారు. బెన్ వ్యాఖ్యలు అనుమానాలను బలపరుస్తున్నాయని, చైనా ల్యాబ్‌పై స్వతంత్ర పరిశోధన జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చైనా నుంచి మరింత పారదర్శకతను ఆశిస్తున్నామని సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు. ల్యాబుల్లో ప్రమాదాలు జరగడం సహజమన్నారు. డబ్ల్యుహెచ్ఓ మాత్రం ఇంకా పరిశోధనలు జరగాల్సిఉందంటూ ఒక ప్రకటనతో సరిపుచ్చింది. (corona virus: పండుగ ఊరేగింపులపై నిషేధం!) -
143 కేసులు: జనాలను ఇళ్లలో పెట్టి తాళం వేస్తున్న అధికారులు
బీజింగ్: కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిన చైనాను ఇప్పుడు డెల్టా వేరియంట్ బెంబెలెత్తిస్తోంది. తాజాగా డ్రాగన్ దేశంలో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో పోలిస్తే డెల్టా వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా, ప్రమాదకరంగా ఉండటంతో.. వైరస్ కట్టడి కోసం అధికారులు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ జనాలను బయటకు రానివ్వకుండా.. ఇళ్లలో పెట్టి తాళం వేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలో చైనా సోషల్ మీడియా యాప్ వీబోలో కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. డెల్టా కేసులు ఎక్కువగా కనిపిస్తున్న వుహాన్‌లో ఈ తరహా చర్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయిని ఓ ట్విట్టర్ యూజర్ తెలిపారు. ఇక వీబో, ట్విట్టర్, యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోల్లో.. పీపీఈ కిట్లు ధరించిన కొందరు వ్యక్తులు.. జనాల ఇళ్ల దగ్గరకు వెళ్లి.. వారిని లోపలకి పంపి.. బయట నుంచి తాళం వేయడమే కాక ఇనుపరాడ్లు పెట్టి.. సీల్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘‘జనాలు రోజులో మూడుసార్లు మాత్రమే డోర్ తెరిచి బయటకు రావాలి. కాదని ఎక్కువసార్లు లాక్ ఓపెన్ చేయడం.. బయటకు రావడం చేస్తే వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తాం. ఇక ఏ అపార్ట్‌మెంట్‌లోనైనా కేసులు బయటపడితే.. దాన్ని మూడు వారాల పాటు సీల్ చేస్తాం’’ అని తెలిపారు. ఇక ఆగస్టు 9 చైనా ఆరోగ్యశాఖ అధికారులు ప్రస్తుతం తమ దేశంలోని 17 ప్రాంతాలలో 143 కొత్త కేసులు రికార్డయ్యాయని తెలిపారు. వీటిలో 35 కేసులు విదేశాల నుంచి వచ్చినవారిలో వెలుగు చూడగా.. 108 స్థానికంగా నమోదయిన కేసులని తెలిపారు. ఇవేకాక నాన్జింగ్ సిటీలో మరో 48 కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. -
డబ్ల్యూహెచ్ఓ నిర్ణయం షాక్‌కు గురి చేసింది: చైనా
బీజింగ్: ప్రపంచాన్ని ఒణికిస్తున్న కరోనా చైనాలోనే జన్మించిందని.. డ్రాగన్ దేశం వుహాన్ ల్యాబ్‌లో మహమ్మారిని తయారు చేసి ప్రపంచం మీదకు వదిలిందని పలు దేశాలు ఆరోపణలు చేశాయి. ఇక కరోనా గురించి హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) విఫలమయ్యిందని.. చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో డబ్ల్యూహెచ్ఓ బృందం కరోనా మూలాల గురించి పరిశోధించేందుకు చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీకైందన్న కొనసాగుతున్న అనుమానాల నివృత్తికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరోసారి విచారణకు సిద్ధమవడాన్ని చైనా పూర్తిగా వ్యతిరేకించింది. రెండోసారి విచారణకు అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వూహాన్ నగరం, ఆ తర్వాత ప్రపంచ దేశాలకు కరోనా వ్యాప్తి చెందడానికి ముందు వూహాన్ ల్యాబ్‌లో ఉద్యోగులకు కరోనా సోకిందని వచ్చిన వార్తల్ని తోసి పుచ్చింది. కోవిడ్–19 పుట్టుకపై రెండో విడత వూహాన్ ల్యాబ్‌లో విచారణకు అనుమతినివ్వబోమని నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) ఉప మంత్రి జెంగ్ ఇక్సిన్ గురువారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. తమ దేశం ల్యాబ్ నిబంధనలను ఉల్లంఘించిందని, అందుకే వైరస్ లీక్ అయిందంటూ జరుగుతున్న ప్రచారం తమని షాక్‌కి గురి చేస్తోందని జెండ్ అన్నారు. డబ్ల్యూహెచ్‌వో రెండోసారి విచారణకు సన్నాహాలు చేయడం సైన్స్‌ను అగౌరవపరిచేలా ఉందని ఆయన మండిపడ్డారు. శాస్త్రీయమైన ఆధారాలను అగౌరవ పరుస్తూ, రాజకీయ ఒత్తిళ్లకి తలొగ్గి డబ్ల్యూహెచ్‌వో మరోసారి ల్యాబ్ థియరీపై విచారణ జరుపుతానని అంటోందని ఆరోపించారు. ఈ ఏడాది మొదట్లో డబ్ల్యూహెచ్‌వో అ«ధికారులు అందరూ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లడానికి అంగీకరించామని, చైనాలో ఉండి వారంతా శాస్త్రవేత్తలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారని, ల్యాబ్ నుంచి వైరస్ లీకయినట్టు ఆధారాలు లభించలేదని గుర్తు చేశారు. -
భారత్‌లో తొలి కరోనా పేషెంట్‌కు మరోసారి పాజిటివ్..
తిరువనంతపురం: దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడిన తొలి పేషెంట్ మరో సారి వైరస్ బారిన పడ్డారు. ఇండియాలో కేరళకు చెందిన వైద్య విద్యార్థిని తొలిసారి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. త్రిసూర్‌కు చెందిన 20 ఏళ్ల సదరు మెడికల్ స్టూడెంట్ చైనా, వుహాన్‌లోని ఓ మెడికల్ యూనివర్సిటీలో చదువుకునేవారు. ఈ క్రమంలో జనవరి, 2020లో సెలవుల నిమిత్తం ఆ విద్యార్థిని స్వదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇదే దేశంలో నమోదైన తొలి కరోనా కేసు. వైరస్ జన్మస్థలంగా భావిస్తున్న వుహాన్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే ఆమెకు కరోనా వైరస్ సోకింది. భారత్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కోవిడ్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. సదరు విద్యార్థిని జనవరి 27 నుంచి ఫిబ్రవరి 20 వరకు 24 రోజుల పాటు త్రిసూర్‌లోని ఆసుప్రతిలో క్వారంటైన్లో ఉన్నారు. మూడు వారాల తర్వాత కరోనా బారి నుంచి కోలుకున్నారు. తాజాగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమవుతుండగా ఆ విద్యార్థిని మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆమెకు మరోసారి కరోనా పాజిటివ్‌గా వైద్యులు గుర్తించారు. యాంటీ జెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా వచ్చిందని త్రిసూర్ జిల్లా మెడికల్ అధికారి డాక్టర్ కేజీ రీనా తెలిపారు. అయితే ఆమెకు ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనిపించలేదని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. కోవిడ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలటంతో మళ్ళీ క్వారంటైన్లో ఉన్నారు. ఆ వైద్య విద్యార్ధిని ఇప్పటి వరకు ఒక్క డోస్ కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదని తెలుస్తోంది. ప్రసుత్తం ఆ విద్యార్ధిని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
Wuhan Lab Theory: కరోనా పుట్టుకపై ఫారిన్ సైంటిస్ట్ వివరణ
కరోనా.. ఎలా పుట్టిందో కూడా తెలియకుండా.. మనుషుల్ని ముప్పుతిప్పలు పెడుతున్న వైరస్. ఈ మహమ్మారి పుట్టుక మిస్టరీని చేధించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జంతువుల ద్వారా వ్యాపించిందనుకుని నిర్ధారణకు వచ్చేలోపు.. ల్యాబ్ థియరీ తెరపైకి వచ్చింది. అయితే కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్‌లో పుట్టిందన్న ఆరోపణలపై కీలక వ్యాఖ్యల చేసింది గతంలో అందులో పనిచేసిన ఓ ఫారిన్ సైంటిస్ట్. సిడ్నీ: డానియెల్లే ఆండర్సన్.. ఆస్ట్రేలియన్ సైంటిస్ట్. వయసు 42 ఏళ్లు. కరోనా విజృంభణ టైంలో వుహాన్ ల్యాబ్‌లో పనిచేసిన ఏకైక ఫారిన్ సైంటిస్ట్. ఆమె రిలీవ్ అయిన తర్వాత ఏ విదేశీ సైంటిస్ట్ అందులో చేరలేదు(కరోనా ఆరోపణల నేపథ్యంలో ఎవరూ ఆసక్తి చూపించడం లేదు). దాదాపు కొన్ని నెలలపాటు బీఎస్ఎల్-4 ల్యాబ్‌లో పనిచేసిన డానియెల్లే.. ప్రమాదకరమైన జబ్బులకు సంబంధించిన పరిశోధనల్లో భాగమైంది. ఆమె నవంబర్ 2019లో ఆమె విధుల నుంచి రిలీవ్ అయ్యింది. అయితే కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్‌లో పుట్టిందన్న ఆరోపణల్ని ఆమె ఇప్పుడు తోసిపుచ్చుతోంది. చదవండి: బెంగాలీ కుర్రాడి వల్లే వుహాన్ కుట్ర వెలుగులోకి! ‘‘ల్యాబ్‌లో ఆ సీజన్లో రోజూ నేను పని చేశా. కానీ, అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు కరోనా మూలాలేవీ ఆ ల్యాబ్‌లో నాకు కనిపించలేదు. ఏ సైంటిస్ట్ అలాంటి అనుమానాస్పద ప్రయోగాలు చేసినట్లు నా దృష్టికి రాలేదు. ఒకవేళ అనుమానాలే నిజమైతే.. రోజూ కంటెయిన్మెంట్ ల్యాబ్‌లో పని చేసిన నేను కొవిడ్ బారిన పడాలి కదా. కానీ, అలా జరగలేదు. ప్రతీరోజూ నేను అందరితో టచ్‌లో ఉన్నా. అందరం కలిసే తిన్నాం. కలిసే తిరిగాం. అందుకే ల్యాబ్ లీకేజీ థియరీని నేను ఖండిస్తున్నా. వైరస్ సహజంగా పుట్టిందే అని నేను నమ్ముతున్నా’’ అని బ్లూమరాంగ్ ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయం వెల్లడించారు. చదవండి: చైనాలో వయాగ్రా దోమల భయం! “I do not believe the virus was manmade.” Danielle Anderson, the Wuhan Institute of Virology's last foreign scientist, left just before the #Covid19 pandemic. For the first time, she shares her story on China’s infamous lab https://t.co/JIFTwDTiiC pic.twitter.com/Dc8yQQqLEq — Bloomberg Quicktake (@Quicktake) June 28, 2021 ఇక వుహాన్ ల్యాబ్‌లో పనిచేసిన సైంటిస్టులు ముక్తకంఠంతో ల్యాబ్ లీకేజీ థియరీని ఖండిస్తున్నారు. కాగా, అక్టోబర్‌లో సార్స్ కోవ్2 విజృంభణ మొదలైందని చైనా ప్రకటించాక.. వైరస్ అనుమానాలు కూడా డ్రాగన్ కంట్రీ మీదకే మళ్లాయి. అయితే తమప్రమేయం లేదని ఆరోపణల్ని తోసిపుచ్చినా.. కొందరు విదేశీ సైంటిస్టులు మాత్రం నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో డబ్ల్యూహెచ్‌వో బృందం వుహాన్ ల్యాబ్‌ను పరిశీలించడం.. నివేదిక కూడా దాదాపు చైనాకే అనుకూలంగానే ఇచ్చింది. కోల్డ్ చెయిన్ ప్రొడక్టుల(ఆస్ట్రేలియన్ బీఫ్ లాంటి ఉత్పత్తులు) ద్వారా వైరస్ వ్యాప్తి చెంద ఉండొచ్చని చైనా అనుమానాల్ని డబ్ల్యూహెచ్‌వో బృందం దగ్గర వ్యక్తం చేసింది. చదవండి: కరోనా.. వుహాన్ కంటే ముందు అక్కడ! -
ల్యాబ్ లీకేజ్ నిజమేనా?
కరోనా కాటు మనిషికే ఎక్కువ చేటు కలిగించేలా కోవిడ్ వైరస్ జన్యు నిర్మాణం ఉందా? గబ్బిలాల నుంచి మనిషి కరోనా సోకిందనే వాదనలో బలం లేదా? చైనా ల్యాబరేటరీ నుంచి వైరస్ లీకవడం నిజమేనా? వీటన్నింటికీ సమాధానమిచ్చే నూతన పరిశోధన ఆస్ట్రేలియాలో జరిగింది. ఇంతకీ కొత్త పరిశోధన ఏం చెబుతోంది? చూద్దాం.. సృష్టిలో ఇన్ని జీవరాసులున్నా మనిషిపైనే కరోనాకు మక్కువ ఎక్కువని మరోమారు తేలింది. కరోనాను కలిగించే సార్స్ సీఓవీ2(కోవిడ్–19) వైరస్ ఇతర జీవుల కన్నా మానవులకే అధికంగా సోకే సామర్థ్యం చూపిందని నూతన అధ్యయనం వెల్లడిస్తోంది. దీంతో ఈ వైరస్ పుట్టుకపై మరోమారు సంశయాలు పెరిగాయి. ఈ వైరస్ ల్యాబ్ నుంచి లీకైందన్న అనుమానాలకు బలం చేకూరింది. ఆస్ట్రేలియాకు చెందిన లాట్రోబె యూనివర్సిటీ, ఫ్లిండర్ వర్సిటీల పరిశోధకులు కరోనా వివిధ జీవుల్లో కలిగించే ఇన్ఫెక్షన్ సామర్థ్యంపై ప్రయోగాలు చేశారు. కంప్యూటర్ మోడలింగ్ ద్వారా కరోనా ఆవిర్భావరోజుల్లో వ్యా పించిన వైరస్‌ను అధ్యయనం చేశారు. ఈ వైరస్ మనిషితో పాటు మరో 12 రకాల జంతువుల్లో ఇన్ఫెక్షన్ కలిగించిన సామర్థ్యాన్ని పరిశీలించారు. గబ్బిలాల నుంచి మనిషికి ఈ వైరస్ సోకే క్రమంలో మరో అతిధేయి(వెక్టర్) ఉందా? లేక ఏదైనా ల్యాబ్ నుంచి లీకైందా అని పరిశీలించడమే అధ్యయన ఉద్దేశం. ఈ వివరాలు జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. ఇలా చేశారు.. రీసెర్చ్‌లో భాగంగా ఎంపిక చేసిన జంతువుల జీనోమ్ డేటానుంచి ప్రతి జీవికి సంబంధించిన కీలక ఏసీఈ2 ప్రొటీన్(జీవుల్లో ఈ ప్రోటీన్ కోవిడ్ వైరస్‌కు రిసెప్టార్‌గా పనిచేస్తుంది) కంప్యూటర్ మోడల్‌ను చాలా కష్టపడి సృష్టించారు. అనంతరం ఈ కంప్యూటర్ మోడల్స్‌తో కోవిడ్ వైరస్ స్పైక్ ప్రొటీన్ ఎంత బలంగా బంధం ఏర్పరుచుకుంటుందనే విషయాన్ని గమనించారు. ఆశ్చర్యకరంగా గబ్బిలాలు, పంగోలిన్లలాంటి ఇతర జీవుల ఏసీఈ2 కన్నా మానవ ఏసీఈ2 ప్రొటీన్‌తో కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ అత్యంత బలంగా బంధం ఏర్పరుచుకుందని వెల్లడైంది. పరీక్షకోసం ఎంచుకున్న ఇతర జీవుల్లో ఏదైనా కరోనా వైరస్ పుట్టుకకు కారణమై ఉంటే పరిశోధనలో సదరు జీవి కణజాలంలో కరోనా స్పైక్ ప్రొటీన్ బలమైన బంధం ఏర్పరిచి ఉండేదని సైంటిస్టులు చెప్పారు. ‘‘మానవ కణజాలంతో కోవిడ్ వైరస్ బలమైన బంధం చూపింది. ఇతర జీవుల నుంచి ప్రాథమికంగా వైరస్ మనిషికి సోకి ఉంటే తప్పక సదరు జీవుల కణజాలంలో కోవిడ్ ప్రోటీన్ మరింత బలమైన బంధం చూపిఉండేది. మనిషి ప్రోటీన్‌తో పోలిస్తే గబ్బిలం ప్రొటీన్‌తో కోవిడ్ ఏర్పరచిన బంధం చాలా బలహీనంగా ఉంది’’ అని ప్రొఫెసర్ డేవిడ్ వింక్లర్ చెప్పారు. గబ్బిలాల నుంచి మనిషికి ఈ వైరస్ సోకిందనే వాదనకు తాజా పరిశోధన భిన్నంగా ఉందన్నారు. ‘‘ఒకవేళ నిజంగానే ఈ వైరస్ ప్రకృతి సహజంగా వచ్చి ఉంటే మనిషి సోకే ముందు ఒక ఇంటర్మీడియెరీ వెక్టర్(మధ్యస్థ అతిధేయి) ఉండి ఉండాలి. అదేంటనేది తేలలేదు.’’ అని ప్రొఫెసర్ నికోలాయ్ పెట్రోవ్స్కీ అభిప్రాయపడ్డారు. అంతిమంగా కరోనా మనిషికి ఎలా సోకిందనే విషయమై రెండు వివరణలున్నాయని రీసెర్చ్‌లో పాల్గొన్న సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. గబ్బిలాల నుంచి మరో ఇంటర్మీడియెరీ వెక్టర్(ఇంకా కనుగొనలేదు) ద్వారా మనిషికి సోకడం లేదా వైరాలజీ ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు వైరస్ లీకై ఉండవచ్చనేవి ఈ రెండు ఆప్షన్లని వింక్లర్ తెలిపారు. లోతైన పరిశోధనలు జరిపితే మానవాళిపై కరోనా దాడికి అసలైన కారణాలు బహిర్గతమవుతాయన్నారు. పెంపుడు జంతువులు కుక్క, పిల్లి, ఆవుకు సైతం కరోనా సోకే అవకాశాలున్నాయన్నారు. పంగోలిన్స్తో సంబంధం? పరిశోధనలో తేలిన ఇంకో ఆశ్చర్యకరమైన అంశమేంటంటే కరోనా ప్రొటీన్ మనిషి కణజాలం తర్వాత అంత బలంగా పంగోలిన్స్(యాంట్ ఈటర్) కణజాలంతో బలమైన బంధం ఏర్పరిచింది. ఈ పంగోలిన్స్ చాలా అరుదైన జీవులు. ప్రపంచంలో చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. గబ్బిలాలు, పాములు, కోతుల కన్నా పంగోలిన్ కణజాలంతో కరోనా ప్రొటీన్ బంధం చాలా ధృఢంగా ఉందని వింక్లర్ చెప్పారు. కరోనా కొత్తలో కొందరు సైంటిస్టులు పంగోలిన్స్‌లో కరోనా వైరస్‌ను కనుగొన్నట్లు చెప్పారని, కానీ ఇది సమాచార లభ్యతాలోపం వల్ల జరిగిందని తెలిపారు. మనిషిలో కరోనా కలిగించే వైరస్ స్పైక్ ప్రొటీన్, పంగోలిన్స్‌లో కరోనా కలిగించే స్పైక్ ప్రొటీన్ దాదాపు ఒకేలా ఉంటాయన్నారు. అందువల్ల ప్రస్తుత పరిశోధనలో సైతం మనిషి తర్వాత పంగోలిన్ కణజాలంతో కరోనా ప్రొటీన్ బలమైన బంధం ఏర్పరిచిందని వివరించారు. పంగోలిన్ విషయం మినహాయించి ఇతర జీవులన్నింటి కన్నా మనిషి కణాలపైనే కరోనా ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగిస్తున్నది తమ రిసెర్చ్‌లో తేలిన విషయమని చెప్పారు. -
వుహాన్ ల్యాబ్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే: చైనా
బీజింగ్: కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి చైనా వుహాన్ ల్యాబ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. డ్రాగన్ దేశం వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను సృష్టించి.. ప్రపంచం మీదకు వదిలిందిని పలు దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా ఓ వింత ప్రతిపాదనను తెర మీదకు తీసుకు వచ్చింది. కరోనా వైరస్‌కు సంబంధించి వుహాన్ ల్యాబ్ ఎన్నో పరిశోధనలు చేస్తుందని.. దీన్ని పరిగణలోకి తీసుకుని.. వుహాన్ ల్యాబ్‌కు ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి జౌ లిజియాన్ మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్ అధ్యయనంలో వుహాన్ ల్యాబ్ కృషిని గుర్తిస్తూ మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. ఇప్పటికే చైనా ప్రభుత్వం వుహాన్ ల్యాబ్‌కి ఆ దేశ అత్యుత్తమ సైన్స్ అవార్డును ప్రధానం చేసింది. కరోనా వైరస్ జీనోమ్‌ని గుర్తించడంలో వుహాన్ ల్యాబ్ చేసిన కృషికి గాను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ దానికి అవుట్‌స్టాండింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్ ప్రైజ్ 2021ని ప్రకటించింది. ‘‘కోవిడ్ జీనోమ్ సిక్వేన్స్ని తొలుత వుహాన్ ల్యాబ్ గుర్తించింది. అంటే దానర్థం ఈ వైరస్ ఇక్కడ నుంచే వ్యాప్తి చెందిందని.. లేదంటే మా దేశ శాస్త్రవేత్తలే దానిని తయారు చేసినట్లు కాదు’’ అన్నారు లిజియాన్. డ్రాగన్ డిమాండ్‌పై చైనా వైరాలిజిస్ట్, డాక్టర్ లి మెంగ్ యాన్ స్పందించారు. వుహాన్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది అన్నారు. కరోనా వుహాన్ ల్యాబ్ నుంచి లీకైందని తెలిపిన వారిలో యాన్ కూడా ఒకరు. ఇక చైనా డిమాండ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు ఓ రేంజ్లో పేలుతున్నాయి. ‘‘ఒకవేళ వుహాన్ ల్యాబ్‌కి మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ ఇస్తే.. ఐసీస్‌కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సి ఉంటుంది’’.. ‘‘అవును మన జీవితాలను నాశనం చేయడానికి వుహాన్ ల్యాబ్ ఎంతో కష్టపడి కరోనాను అబివృద్ధి చేసింది. ఆ కృషిని గుర్తించి దానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే.. ప్రతి దేశం దీనికి మద్దతివ్వాల్సిందే’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. We must admit, the work of the Wuhan Institute of Virology really has touched all of our lives, hasn’t it? https://t.co/eicvXkz94v — Jim Geraghty (@jimgeraghty) June 21, 2021 If Wuhan Lab in China deserves Nobel Prize for Medicine according to China; then ISIS deserves the Nobel peace prize too. — Shining Star 🇮🇳 (@ShineHamesha) June 24, 2021 చదవండి: కరోనా గుట్టు.. చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు! -
23 దేశాలు.. 59 వైరాలజీ ల్యాబ్‌లు.. ఎంత భద్రం?
సాక్షి ,సెంట్రల్ డెస్క్: ఏడాదిన్నరగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే లీకైందన్న సందేహాలు ఉన్నాయి. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే వైరస్‌లపై ప్రయోగాలు చేసే ల్యాబ్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమేనన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఒక్క వూహాన్ ల్యాబ్ నుంచి బయటికొచ్చిన ఒక్క వైరస్ ఇంత ప్రమాదకరంగా మారితే.. ప్రపంచవ్యాప్తంగా అలాంటి ల్యాబ్‌లు ఎన్ని ఉన్నాయి? వాటిలో భద్రతాప్రమాణాల పరిస్థితి ఏమిటన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. దీనిపై ‘న్యూక్లియర్ త్రెట్ ఇనిషియేటివ్ (ఎన్టీఐ)’ విస్తృతంగా స్టడీచేసి నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందామా? ప్రపంచంలో పెద్దది.. వూహాన్ ల్యాబ్ బీఎస్ఎల్–4 ల్యాబ్‌ల పరిమాణం కూడా ఎంతో కీలకం. చిన్నస్థాయిలో ల్యాబ్‌లలో పరిశోధనలు తక్కువైనా, ప్రమాదకర సూక్ష్మజీవులు బయటికొచ్చే ప్రమాదమూ తక్కువగానే ఉంటుంది. పెద్ద ల్యాబ్‌లలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులపై, విస్తృత ప్రయోగాలు జరుగుతుంటాయి. లీకయ్యే ప్రమాదం కాస్త ఎక్కువే. ► చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ ప్రపంచంలోనే అతి పెద్దది. దాని విస్తీర్ణం 3 వేల చదరపు మీటర్ల (32 వేల చదరపు అడుగుల)కుపైనే ఉంటుంది. ► 11 ల్యాబ్‌లు వెయ్యి చదరపు మీటర్లపైన.. మరో 11 ల్యాబ్‌లు 200–1000 చదరపు మీటర్ల మధ్య.. 22 ల్యాబ్‌లు 200 చదరపు మీటర్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. మరికొన్ని ల్యాబ్‌ల వివరాలు అందుబాటులో లేవు. ప్రమాదంతో.. ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ల్యాబ్‌లలో వైరస్లు, సూక్ష్మజీవులపై పరిశోధనలు చేస్తుంటారు. అందులో మందులు, వ్యాక్సిన్లు లేని అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై ప్రయో గాలు చేసే ల్యాబ్‌లకు ‘బయో సేఫ్టీ లెవల్ 4 (బీఎస్ఎల్–4)’ భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. దీనికి అత్యంత కఠినమైన నిబంధనలు ఉంటాయి. ► బీఎస్ఎల్–4 ల్యాబ్‌లలో పరిశోధకులు మొత్తం శరీరాన్ని కప్పేసి, లోపలి నుంచే ఆక్సిజన్ అందించే ప్రెషరైజ్డ్ సూట్స్ ధరించాల్సి ఉంటుంది. భద్రత, రక్షణ ఎంతెంత? బీఎస్ఎల్–4 ల్యాబ్‌లు ఉన్న 22 దేశాల్లో (తైవాన్ మినహా) భద్రత, రక్షణ ప్రమాణాలపై ‘న్యూక్లియర్ త్రెట్ ఇనిషియేటివ్ (ఎన్టీఐ)’ ఆధ్వర్యంలో గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ఆయా దేశాల్లో పరిస్థితులు, చట్టాలు, విధానాలు, రక్షణ చర్యల ఆధారంగా అంచనాలు వేసింది. ► ప్రమాదకర సూక్ష్మజీవులు లీక్‌కాకుండా చేపట్టే కట్టుదిట్టమైన ‘బయోసేఫ్టీ’ చర్యలను పరిశీలిస్తే.. 6 దేశాల్లో ఉత్తమంగా, 11 దేశాల్లో మధ్యస్థంగా, 5 దేశాల్లో తక్కువగా ఉన్నాయి. ► ప్రమాదకర వైరస్‌లను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా (జీవాయుధంగా) విడుదల చేయకుండా తీసుకునే ‘బయోసెక్యూరిటీ’ చర్యలు.. ఐదు దేశాల్లోనే బాగుండగా, 8 దేశాల్లో మధ్యస్థంగా, 9 దేశాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. ► వైరాలజీ ల్యాబ్‌లు ఉన్నా, లేకున్నా మొత్తం గా 195 దేశాల్లో బయోసేఫ్టీ, బయోసెక్యూరిటీ పరిస్థితులను ఎన్టీఐ పరిశీలించింది. 60శాతం దేశాల్లో బయోసేఫ్టీ దారుణంగా ఉందని, బయో సెక్యూరిటీ చర్యలు అయితే 80 శాతం దేశాల్లో అతితక్కువగా ఉందని తేల్చింది. పట్టణ ప్రాంతాల్లోనే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర వైరస్‌లపై ప్రయోగాలు చేస్తున్న, నిర్మాణంలో ఉన్న ల్యాబ్‌లు 23 దేశాల్లో 59 చోట్ల ఉన్నాయి. ఖండాల వారీగా చూస్తే.. యూరప్‌లో 25, ఉత్తర అమెరికాలో 14, ఆసియాలో 13, ఆస్ట్రేలియాలో 4, ఆసియాలో 3 ల్యాబ్‌లు ఉన్నాయి. ► మొత్తం ల్యాబ్‌లలో 60 శాతం ప్రభుత్వ రంగంలో, 20 శాతం యూనివర్సిటీల ఆధ్వర్యంలో, మరో 20 శాతం ప్రైవేటు సంస్థల పరిధిలో కొనసాగుతున్నాయి. వైరస్లు, ఇతర సూక్ష్మజీవుల సామర్థ్యం, వ్యాప్తి,సోకితే వచ్చే లక్షణాలు, వాటి నిర్మాణ క్రమం, ఎదుర్కొనేందుకు తోడ్పడే అంశాలపై ప్రయోగాలు నిర్వహిస్తుంటారు. ► 59 ల్యాబ్లకుగాను 46 ల్యాబ్‌లు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఒకవేళ వైరస్ లీకైతే దా ని ప్రభావం వేగంగా, ఎక్కువగా ఉంటుంది. ల్యాబ్‌ల నియంత్రణ ఎలా? ► ‘బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్’, ఐక్యరాజ్యసమితి భద్రాతామండలి తీర్మానాల ప్రకారం.. బీఎస్ఎల్–4 ల్యాబ్‌లు ఉన్న దేశాన్నీ బయోసేఫ్టీ, సెక్యూరిటీ కోసం చట్టాలు చేసి, ల్యాబ్‌లపై నిఘా పెట్టాల్సి ఉంటుంది. ► ప్రమాదకర ల్యాబ్‌లు ఉన్న దేశాల్లో సగానికన్నా తక్కువ దేశాలు మాత్రమే ‘ఇంటర్నేషనల్ బయోసేఫ్టీ, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ గ్రూప్’లో సభ్యులుగా ఉండటం గమనార్హం. ► ల్యాబ్‌లలో చేసిన పరిశోధనలు దుర్వినియోగం కాకుండా కఠిన చట్టాలు, విధానాలను కేవలం మూడు (ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్) మాత్రమే అమలు చేస్తున్నాయి. మరో మూడు (జర్మనీ, స్విట్జర్లాండ్, బ్రిటన్) దేశాల్లో పలు నిబంధనలు ఉన్నాయి. మిగతా చోట్ల ఈ పరిస్థితి లేదు. చదవండి: కోవాగ్జిన్ ఒప్పందం.. బ్రెజిల్లో ప్రకంపనలు -
Wuhan Lab: వయాగ్రా దోమల లీక్.. కలకలం!
వుహాన్ ల్యాబ్ పరిశోధకుల తాజా పరిశోధన బెడిసి కొట్టింది. వయాగ్రా ఇంజెక్ట్ చేసిన వేల కొద్దీ దోమలు .. ల్యాబ్ నుంచి బయటపడ్డాయి. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్ నిర్వాహకులు ప్రకటించగా.. ఆ దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటు చేసుకున్నాయి. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతుండడంతో ఆందోళన మొదలైంది. వైరల్ వార్త.. చైనా నుంచి మరో షాక్. వయాగ్రా దోమల ప్రభావంతో చైనాలో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. పండు ముసళ్లోల్ల దగ్గరి నుంచి కుర్రాల దాకా కామ వాంఛతో రగిలిపోతున్నారు. వుహాన్కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు ఒకడు కోరికల్ని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాడు. మరో పేషెంట్ నగ్నంగా ఆస్పత్రిలో తిరుగుతూ.. పబ్లిక్‌గా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి కనిపించిన వాళ్లపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇది వుహాన్ కెచ్‌లీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక ఇది మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని వుహాన్ ల్యాబ్ హెడ్ రీసెర్చర్ డాక్టర్ వెంజి యింగ్ యిన్ జింగ్ భయపడుతున్నారని వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. One more shock from China. Wuhan: Thousands of mosquitoes inoculated with Viagra escape from high-security laboratory https://t.co/h4FAK7yp1g — किसान 🇮🇳 (@WadheshT) June 15, 2021 ఫ్యాక్ట్ చెక్.. వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనేది కంప్లీట్ సెటైరికల్ వెబ్సైట్. ‘‘నిజనిర్థారణలతో సంబంధం లేదు’’ అనేది ఆ వెబ్సైట్ క్యాప్షన్. అందులో కంటెంట్ మామూలుగా ఉండదు. కుక్కకు-పిల్లి తోకకు ముడిపెట్టి కథనాలు పబ్లిష్ చేస్తుంది. పైగా జనాలు అది నిజమని గుడ్డిగా నమ్మేంత పక్కాగా. అందులో ఉంది అధికారిక సమాచారమేమో అనేంతలా స్టోరీలు అల్లుతుంది. వుహాన్ ల్యాబ్ మీద సెటైరిక్‌గా పోయిన నెలలో రాసిన ఈ ఆర్టికల్.. ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఇందులో ఉన్న వృద్ధుడి ఫొటో అసలు చైనా వ్యక్తిదే కాదు. జపాన్ వ్యాపారవేత్త యుకిషి చుగంజి. 2003లో 114 వయసులో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆ టైంలో ప్రపంచంలో అత్యంత వృద్ధుడి రికార్డు ఆయన పేరు మీద ఉండేది. #CKMKB 😂😂 Good news “The effects of one mosquito bite can last up to forty-eight hours and symptoms include an increase in libido, sexual arousal, and possibly a very, very large erection,” Dr. Wenzi told the press during a press conference.https://t.co/iR5nHFIWBC — 🥃🚬 (@BeastOnDrive) June 15, 2021 -
సాక్షి కార్టూన్ 16-06-2021
-
ల్యాబ్ థియరీలో కొత్త కోణం.. ముందస్తుగానే చైనా వ్యాక్సిన్!?
బీజింగ్/ సిడ్నీ: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి లీకయిందన్న అనుమానాలు బలపడేలా రోజుకో కథనం బయటపడుతోంది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక పత్రిక ప్రచురించిన కథనం వైరస్ ల్యాబ్ నుంచి లీకయిందన్న వాదనకు ఊతమిచ్చేలా ఉంది. ఆ కథనం ప్రకారం.. చైనాలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)లో పనిచేసిన శాస్త్రవేత్త యుసెన్ జువూ 2020 ఫిబ్రవరి 24న కోవిడ్–19 వ్యాక్సిన్ పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కరోనాని గత ఏడాది మార్చి 11న మహమ్మారిగా ప్రకటించింది. అంతకుముందే కోవిడ్–19 వ్యాకిన్‌పై పేటెంట్ కావాలంటూ యుసెన్ పీఎల్ఏ తరఫున దరఖాస్తు చేయడం గమనార్హం. కరోనా వైరస్ మనుషులకి సోకిందని చైనా ప్రకటించిన అయిదు వారాలకే వ్యాక్సిన్ పేటెంట్ గురించి యుసెన్ సన్నాహాలు చేయడాన్ని బట్టి వైరస్ గురించి చైనాకు అప్పటికే సంపూర్ణ అవగాహన ఉందనేది తేటతెల్లమవుతోంది. వూహాన్ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌లో గబ్బిలాల్లో కరోనా వైరస్‌పై పరిశోధనలు నిర్వహిస్తూ బ్యాట్ వుమెన్‌గా ప్రసిద్ధురాలైన ఆ ల్యాబ్ డిప్యూటీ డైరెక్టర్ షి జెంగ్లీతో ఈయన కలిసి పని చేశారు. ముందస్తుగానే పేటెంట్ కోసం దరఖాస్తు చేయడం, బ్యాట్ వుమెన్‌తో చాలా సన్నిహితంగా మెలగడం చూస్తుంటే డ్రాగన్ దేశం కరోనాపై ప్రపంచదేశాల కళ్లు కప్పిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వూహాన్ ల్యాబ్‌లో పని చేసే ముగ్గురికి 2019 నవంబర్లోనే కరోనా లక్షణాలు కనిపించడం వంటి వార్తలు రావడంతో ల్యాబ్ థియరీపై ఆది నుంచి అనుమానాలే ఉన్నాయి. మూడునెలలకే అనుమానాస్పదంగా మృతి శాస్త్రవేత్త యుసెన్ జువూ కోవిడ్–19 వ్యాక్సిన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న మూడు నెలల్లోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. చైనాలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినప్పటికీ ఆయన మరణ వార్త చైనాలోని కేవలం ఒక మీడియాలో మాత్రమే వచ్చిందని అమెరికాకు చెందని న్యూయార్క్ టైమ్ పత్రిక వెల్లడించింది. అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీ, న్యూయార్క్ బ్లడ్ సెంటర్లో యుసెన్ శాస్త్రవేత్తగా పని చేశారని ఆ పత్రిక వివరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా కరోనా వైరస్ పుట్టుకపై నిజాలు నిగ్గు తేల్చాలని ఇంటెలిజెన్స్‌ను ఆదేశించడంతో దీనిపై సర్వత్రా మళ్లీ చర్చ మొదలైంది. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీక్ కావడంతో కోవిడ్–19 మహమ్మారి విజృంభించి ఉంటుందని ఏడాది క్రితమే అమెరికా నేషనల్ ల్యాబరెటరీ తన నివేదికలో పేర్కొన్నట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్‌జే) వెల్లడించింది. అయితే దీనిపై మరింత లోతుగా విచారణ చేయాలని నేషనల్ ల్యాబరేటరీ భావించినట్టుగా డబ్ల్యూఎస్‌జే తెలిసింది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడే కాలిఫోర్నియాలోని లారెన్స్ లివర్మోర్ నేషనల్ ల్యాబరెటరీ తన నివేదికని రూపొందించింది. కోవిడ్–19 వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించడం ద్వారా ఇది ల్యాబ్ నుంచి లీక్ అయి ఉంటుందని నిర్ణయానికి వచ్చి విదేశాంగ శాఖకు నివేదికను సమర్పించింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఇంటెలిజెన్స్ నివేదికను త్వరలోనే బైడెన్ విడుదల చేయనున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
వుహాన్ ల్యాబ్ గుట్టు.. ఫౌచీ దాచారా?
-
కరోనా పుట్టుక: చైనా పుట్టి ముంచింది మనోడే!
కరోనా వైరస్ పుట్టుకలో చైనా పాత్రపై అనుమానం మొదటి నుంచి ఉందే. అయితే మధ్యలో డబ్ల్యూహెచ్‌వో జోక్యం, ట్రంప్ హయాంలో యూఎస్ నిఘా వర్గాల నివేదికల్ని బయటకు రానివ్వకపోవడంతో ఆ ఆరోపణలు కొంత తగ్గుముఖం పట్టినట్లు అనిపించాయి. ఈ తరుణంలో ఉన్నట్లుండి ల్యాబ్ థియరీ ఒక్కసారిగా తెర మీదకు రావడం, మళ్లీ చైనాపై అమెరికా సహా కొన్ని దేశాలు ఆరోపణలతో విరుచుకుపడడం చూస్తున్నాం. ఇంతకీ ఇలా ఎందుకు జరిగింది.. గత నెలరోజుల పరిణామాలే ఇందుకు కారణమా? ఇందులో భారతదేశానికి చెందిన ఓ యువ అన్వేషకుడి పాత్రేంత అనేది పరిశీలిస్తే.. వెబ్‌డెస్క్: ‘‘కరోనా వైరస్ పుట్టుక వుహాన్ ల్యాబ్‌లోనే జరిగింది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’’.. ఇది డ్రాగన్ కంట్రీపై అగ్రదేశం అమెరికా చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఎదురుదాడి ప్రారంభించిన చైనా.. అమెరికాపైనే నిందలు వేయడంతో పాటు ఫౌఛీ మెయిల్స్ లీక్ వ్యవహారాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో గత నెలరోజుల ల్యాబ్ లీక్ థియరీ అంశం ఎలా ఉప్పెనలా ఎగిసిపడిందో చూద్దాం. డ్రాస్టిక్లో మనోడు! కరోనా పుట్టుక విషయంలో చాలామంది సైంటిస్టులకు, రీసెర్చర్లకు అనుమానాలున్నాయి. ఈ తరుణంలో ఆసక్తి ఉన్నవాళ్లంతా కలిసి డ్రాస్టిక్(DRASTIC) పేరుతో ఒక సైట్ క్రియేట్ చేశారు. కరోనా వైరస్ పుట్టుక తమ తమ అభిప్రాయాల్ని, రీసెర్చ్ ద్వారా తెలుసుకున్న విషయాల్ని ట్విట్టర్ ద్వారా ఆ పేజీలో తెలియజేస్తున్నారు. ఇందులో పలువురు భారతీయులూ ఉండగా, వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఇరవై ఏళ్ల వయసులో ఉన్న ఓ యువకుడు ‘ది సీకర్’(The seeker) పేరుతో తన అభిప్రాయాల్ని వెల్లడించారు. నిజానికి తొలుత ఈ యువకుడు కూడా మార్కెట్ ద్వారానే వైరస్ వ్యాపించిందని నమ్మాడంట. ఆ తర్వాత కొన్ని దర్యాప్తులను, రీసెర్చ్ పత్రాలను, మరికొందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ల్యాబ్ థియరీల వెనుక ఉన్న కథనాల్ని ఉటంకిస్తూ కొన్ని వ్యాసాలు రాశాడు. ఇది న్యూస్‌వీక్ పీస్ వెబ్‌సైట్‌ను ప్రముఖంగా ఆకర్షించడంతో అతని(సైంటిస్ట్/రీసెర్చర్/సాధారణ యువకుడు) ఉద్దేశాల్ని ప్రముఖంగా ప్రచురించింది. ఈ కథనం ఆధారంగానే ప్రధాన మీడియా హౌజ్‌లు ఒక్కసారిగా వుహాన్ ల్యాబ్ థియరీపై పడ్డాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం #WuhanLabLeak హ్యాష్‌ట్యాగ్‌తో మారుమోగింది. ఆపై సైంటిస్టులు ల్యాబ్ థియరీని పున:పరిశీలించగా, మరోవైపు యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ మూడు నెలల్లో వైరస్ పుట్టుక వ్యవహారం తేల్చాలని ఇంటెలిజెన్స్ విభాగాల్ని ఆదేశించడం, అమెరికా ఛీప్ సైంటిస్ట్ ఆంటోనీ ఫౌచీ ‘2019 వుహాన్ రీసెర్చర్ల అనారోగ్యం’ రికార్డులను బయటపెట్టాలని చైనాను డిమాండ్ చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. 2012 నుంచే.. చైనాలోని ఓ జంతువుల మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి మొదలైంది. ఇది అప్పట్లో వినిపించిన వాదన. కానీ, కోవిడ్ 19 పుట్టుక చైనాలోని ల్యాబ్(వుహాన్ పేరు తర్వాత తెరపైకి) పుట్టిందని, దీని వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపణలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఈ తరుణంలో నెలరోజులుగా(ముఖ్యంగా ఈ వారం నుంచి) వుహాన్ ల్యాబ్ థియరీపైనే ఎక్కువ ఫోకస్ అవుతోంది. 2012 నుంచే కరోనా వైరస్ పుట్టుకకు బీజం పడిందని, ఓ మైన్లలో పని చేసే ఆరుగురు అస్వస్థతకు గురి అయ్యారన్న వాదన బలంగా వినిపించింది. దీనికితోడు 2019లో యున్నన్ గుహాలను పరిశీలించిన వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ముగ్గురు రీసెర్చర్లు జబ్బు పడడం, వాళ్లకు గోప్యంగా చికిత్స అందించడం, ఆ తర్వాతే కరోనా విజృంభణ.. ఇలా వరుస ఆరోపణలతో చైనా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. చైనా ఎదురుదాడి.. అమెరికా గొంతులో వెలక్కాయ ‘‘2019లో వుహాన్ ల్యాబ్ లో అనారోగ్యానికి గురైన ముగ్గురు వ్యక్తుల మెడికల్ రికార్డులు చూపండి. వారు నిజంగా అనారోగ్యానికి గురయ్యారా? అయితే.. అనారోగ్యానికి కారణమేంటి?’’ అని చైనాను ఆంటోనీ ఫౌచీ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా లేదా అనే దానిపై కీలకమైన ఆధారాలు అందించే తొమ్మిది మంది మెడికల్ రికార్డులను రిలీజ్ చేయాలని కోరారు. అయితే ఇదే ఫౌచీ గతంలో ‘ల్యాబ్ థియరీ’ని కొట్టిపడేశాడు. దీనికితోడు వుహాన్ ల్యాబ్ తో సంబంధం ఉన్న ఎకో హెల్త్ అలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్.. థ్యాంక్స్ చెబుతూ ఫౌచీకి పంపిన ఈ మెయిల్ కూడా వివాదాస్పదమైంది. దీంతో ఇప్పుడు ఫౌచీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇక కరోనా వైరస్ పుట్టుక విషయంలో అమెరికా పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని, అక్కడి ల్యాబ్‌లను పరిశీలించాలని చైనా, డబ్ల్యూహెచ్‌వోను కోరడంతో అమెరికా గొంతులో వెలక్కాయపడ్డట్లయ్యింది. అంతేకాదు కరోనా వైరస్ పుట్టుకపై స్టడీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)ను ఆహ్వానించాలని అమెరికాకు చైనా పిలుపునిచ్చి గట్టి కౌంటరే ఇచ్చింది. అయితే అమెరికా మాత్రం ఆ పని చేయదని, ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200కు పైగా బయో ల్యాబ్‌ల్లో జరిగే అవకతవకలు బయటపడతాయని భయపడుతుందని చైనా గ్లోబల్ టైమ్స్ ప్రముఖంగా ఒక కథనం ప్రచురించింది. -
కరోనా చైనా శాస్త్రవేత్తల సృష్టే.. అందుకే ఆ మౌనం
లండన్: కరోనా వైరస్ సహజంగా వచ్చింది కాదని... దాన్ని చైనా శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో రూపొందించారని యూరప్ శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కృతిమంగా ల్యాబ్‌లో తయారు చేసి దాన్ని సహజంగా వచ్చినట్టు నమ్మించేందుకు రివర్స్ ఇంజనీరింగ్ పద్దతిని పాటించారంటూ వివరిస్తున్నారు. బ్రిటీష్ ప్రొఫెసర్ అంగూస్ డాల్‌గ్లైయిష్, నార్వేజియన్ సైంటిస్ట్ బిర్గెన్ సోరేన్‌సెన్ చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్టు డెయిల్ మెయిలపత్రికలో కథనం వచ్చింది. వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ సహజంగా వచ్చిందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని యూరోపియన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా వూహాన్‌లోని ల్యాబ్‌లో ఈ వైరస్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారని వారు ఆరోపిస్తున్నారు. చైనా గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి సేకరించిన కరోనా వైరస్‌తో తాము పరిశోధనలు చేశామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ను ల్యాబ్‌లోనే రూపొందించారని చెప్పడానికి తమ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు. డాటాను నాశనం చేశారు ఉద్దేశపూర్వకంగానే చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను తయారు చేశారని, దీనికి సంబంధించిన డాటాను సైతం మాయం చేశారని యూరప్ పరిశోధకులు ఆరోపిస్తున్నారు. వూహన్ ల్యాబ్‌లోనే వైరస్ తయారైందంటూ ఎన్ని ఆరోపణలు వచ్చినా చైనా సైంటిస్టులు మౌనం వహిస్తున్నారు తప్పితే ... సరైన వివరణ ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. 22 పేజీల తమ పరిశోధన పత్రాలు ఇప్పటికే సైంటిఫిక్ జర్నల్స్‌లో ప్రచురితమైనా చైనా నుంచి ఖండన లేదన్నారు. పాజిటివ్ ఛార్జీలు కరోనా వైరస్ స్పైక్స్‌కి పాజిటివ్ ఛార్జీతో ఉన్నాయని.. నెగటివ్ చార్జీతో ఉండే మానవ శరీర భాగాల వైపు ఇవి త్వరగా ఆకర్షితం అవుతున్నాయని, అందుకే వైరస్ వ్యాప్తి వేగం, శరీరంపై ప్రభావం ఎక్కుగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఒక్కో వైరస్‌పై పాజిటివ్ ఎనర్జీ ఉన్న స్పైక్‌లు నాలుగు వరకు ఉంటున్నాయని, సహజ సిద్ధంగా అయితే మూడుకు మించి పాజిటివ్ స్పైక్‌లు ఉండడానికి వీళ్లేదంటున్నారు. చైనా శాస్త్రవేత్తలే కృతిమంగా నాలుగు పాజిటివ్ ఛార్జీ స్పైకులు ఉండేలా కరోనా వైరస్‌కి మార్పులు చేశారని వెల్లడిస్తున్నారు. కరోనా వైరస్ చైనాలో బ్రేక్ అవుట్ అవగానే రెట్రో ఇంజనీరింగ్ ద్వారా ఆ వైరస్ సహజంగా వచ్చినట్టుగా నమ్మించే ప్రయత్నం చేసిందన్నారు. కరోనా వైరస్ సహజంగా వచ్చింది కాదని, వూహన్ ల్యాబ్ నుంచే పుట్టిందనే ఆరోపణలు ఏడాది కాలంగా వస్తున్నాయి. అయితే యూరోపియన్ శాస్త్రవేత్తలు గట్టి ఆధారాలతో చైనాపై విమర్శలు ఎక్కు పెట్టారు. -
Coronavirus: వైరస్ పుట్టుక మిస్టరీయేనా?
కరోనా వైరస్ పుట్టిందెక్కడ? మరోసారి చక్కర్లు కొడుతున్న ప్రశ్న ఇది. చైనాలోని వూహాన్ జంతు వధశాల నుంచే అంటిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తేల్చేసినా... అబ్బే కానేకాదు.. అదో కుట్ర అని అమెరికా అనడం తరువాయి.. వైరస్ జన్మ రహస్యం తేల్చాల్సిందే అని మళ్లీ తీర్మానాలు మొదలయ్యాయి. ఇంతకీ.. వైరస్‌ది సహజ జన్మమా... లేక టెస్ట్‌ట్యూబ్ జననమా? ప్రపంచానికి కరోనా వైరస్ పరిచయమై ఏడాదిన్నర కాలమవుతోంది. చైనాలోని వూహాన్లో మొదలైన మహమ్మారి ప్రస్థానం అతికొద్ది కాలంలో ప్రపంచం మొత్తాన్ని చుట్టేయడమే కాకుండా.. లక్షల మంది ప్రాణాలను హరించిం ది. ఇంత జరిగినా.. ఈ సార్స్–కోవ్–2 వైరస్ పుట్టుక ఎక్కడ? ఎలా జరిగిందన్న ప్రశ్నలకు ఇప్పటివరకూ సంతృప్తికరమైన సమాధానం లేదు. గత ఏడాది మొదట్లోనే వూహాన్‌లోని ఓ పరిశోధనశాల నుంచి ఈ వైరస్ కాకతాళీయంగా బయటపడిందన్న వాదన ప్రచారంలోకి రావడం.. దీనిపై విచారణ జరపాలని అప్పటి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేయడం మనం చూసే ఉంటాం. తీవ్ర చర్చోపచర్చల తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఒకటి వూహాన్‌కు వెళ్లి పరిశీలనలు జరిపింది. ఈ వైరస్ అడవి జంతువుల నుంచి.. జంతువధశాలల ద్వారా మనుషుల్లోకి ప్రవేశించి ఉండవచ్చునని, పరిశోధనశాలలో తయారయ్యే అవకాశాలు బాగా తక్కువని తెలిపింది. హమ్మయ్య.. ఒక వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకుంటూండగానే.. అమెరికా తాజా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఈ వైరస్ పుట్టుక తుట్టెను కదిపారు. మూడు నెలల కాలంలో ఈ అంశంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పరిశోధనశాల కుట్ర కోణం ఏమిటి? వూహాన్‌లోని ‘‘ద వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) నుంచి ఈ వైరస్ యాదృచ్ఛికంగానో లేదా ఉద్దేశపూర్వకంగానో బయటపడిందన్నది మొదటి నుంచి వినిపిస్తున్న ఒక కథనం. ఈ ఇన్స్టిట్యూట్ చైనాలోనే అతిపెద్ద బయలాజికల్ రీసెర్చ్ సెంటర్ కావడం గమనార్హం. కరోనా వైరస్‌ను మొట్టమొదటిసారి గుర్తించిన హునాన్ జంతు వధశాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ పరిశోధన కేంద్రం ఉంటుంది. పరిశోధనశాల నుంచి బయటపడ్డ వైరస్ ఈ వెట్మార్కెట్ (జంతువుల మల మూత్రాదులు నిండి ఉన్న సంత)లోని జంతువులకు చేరిందని ఈ కుట్రను నమ్మేవారు చెబుతారు. అడవి జంతువుల్లో ఉండే ఈ వైరస్‌ను వేరు చేసి మార్పుల్లేకుండా వ్యాప్తి చేశారని వీరు అంటున్నారు. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇది చైనీయులు కుట్రపూరితంగా తయారు చేసి ప్రపంచం మీదకు వదిలారని ఆరోపణలు చేశారు. కరోనా వైరస్‌ను చైనా జీవాయుధంగా ఉపయోగించిందని ఇంకొందరు వాదించారు. తాజా ఆరోపణల వెనుక...? ఇటీవలి కాలంలో అమెరికాలోని పలు వార్తా పత్రికలు ‘‘వూహాన్ పరిశోధన శాల కుట్ర’’కోణంలో పలు వార్తలు ప్రచురించడంతో మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది. వూహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ముగ్గురు 2019 నవంబర్‌లో కరోనా లక్షణాలతో చికిత్స పొందినట్లు అమెరికా నిఘా నివేదిక చెబుతున్నా ట్రంప్ ఆదేశించిన విచారణను ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ నిలిపివేశారన్న ఆరోపణలతో కథనాలు రావడం గమనార్హం. అప్పట్లో కుట్ర కోణాన్ని కొట్టిపారేసిన బైడెన్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథొనీ ఫాసీ లాంటి వారు కూడా ‘‘ఏమో.. కుట్ర జరిగిందేమో. పూర్తిస్థాయి విచారణ జరగాలి’’అనడం పరిస్థితిని మార్చేసింది. చైనా ఏమంటోంది? సహజంగానే.. ఠాట్! అమెరికా చెప్పేదంతా అబద్ధమని మొదట్నుంచీ వాదిస్తోంది. పరిశోధనశాల నుంచి తప్పించుకుందనడం తమపై బురద జల్లడమేనని అనడంతో ఆగిపోకుండా.. ఇతర దేశాల నుంచి ఆహారం ద్వారా తమ దేశంలోకి జొరబడి ఉండవచ్చీ మహమ్మారి అని ప్రత్యారోపణలు చేసింది కూడా. చైనాలోని ఓ మారుమూల గనిలో తాము 2015లోనే కరోనా వైరస్‌ను గుర్తించామని, ప్రొఫెసర్ షి ఝింగ్లీ గత వారమే ఓ పరిశోధన వ్యాసాన్ని ప్రచురించారని చైనా ప్రభుత్వం నమ్మబలుకుతోంది. ఆ గనిలోని గబ్బిలాల్లో 8 రకాల కరోనా వైరస్లు గుర్తించామని, దీనికంటే పాంగోలిన్ అనే అడవి జంతువులోని కరోనా వైరస్‌లతో ప్రమాదం ఎక్కువని కూడా ఈ వ్యాసంలో ఉండటం గమనార్హం. ఏతావాతా చైనా చెప్పొచ్చేదేమిటంటే.. ఈ వైరస్ సహజసిద్ధంగానైనా వచ్చి ఉండాలి. లేదంటే ఆహార పదార్థాల ద్వారా ఇతర దేశాల నుంచి దిగుమతి అయి ఉండాలి అని!! చైనా అధికారిక మీడియా సైతం అమెరికాలో వైరస్ పుట్టుకపై పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని సంపాదకీయాల ద్వారా ప్రకటిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే.. ఈ వైరస్ సహజసిద్ధంగానే ఒక జంతువు నుంచి మరో జంతువు మాధ్యమంగా మనిషిలోకి వచ్చిందన్న గత ఏడాది సిద్ధాంతం కూడా ఇప్పుడు అంతగా పనిచేయడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక కూడా ఈ సిద్ధాంతాన్నే బలపరిచింది. అయితే, కోవిడ్–19 కారక కరోనా వైరస్‌ను పోలిన వైరస్ అటు గబ్బిలాల్లో, ఇటు ఇతర జంతువుల్లోనూ ఇప్పటివరకూ గుర్తించకపోవడం గమనార్హం. శాస్త్రవేత్తల మాట? కరోనా వైరస్ పుట్టుకపై శాస్త్రవేత్తల్లో ఏకాభిప్రాయమైతే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల నివేదిక అస్పష్టంగా ఉందని పలువురు శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు. నిపుణుల బృందం విచారణను చాలా తేలికగా తీసుకున్నట్లు కనిపిస్తోందని, ప్రమాదవశాత్తూ బయటపడిందా? సహజసిద్ధంగా మనుషుల్లోకి ప్రవేశించిందా తేల్చే సమాచారాన్ని సేకరించి ఉండాల్సిందని కొందరు శాస్త్రవేత్తలు సైన్స్ మ్యాగజైన్‌కు లేఖ రాశారు. కుట్ర కోణాన్ని క్షుణ్ణంగా విచారించాలని వీరు కోరుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసిస్ స్వయంగా సరికొత్త విచారణ జరగాలని కోరడం విశేషం. కరోనా మూలాలు తెలియాల్సిందే ప్రపంచ దేశాల డిమాండ్‌కు భారత్ మద్దతు న్యూఢిల్లీ: కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సమగ్ర విచారణ జరపాలని అంతర్జాతీయంగా వస్తున్న డిమాండ్లకు భారత్ మద్దతు తెలిపింది. చైనాలో కరోనా వైరస్ ఎలా వచ్చిందో నిగ్గు తేల్చాలని అమెరికా నిఘా సంస్థలను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అమెరికా, ఆస్ట్రేలియాలతో పాటు పలు దేశాలు కరోనా వైరస్ మూలాలపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. వైరస్ మూలాలపై మార్చిలో డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదిక వెలువరించినప్పటికీ.. దానిపై ప్రపంచదేశాలు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆ నివేదిక పేర్కొన్న అంశాలపై మరింత అధ్యయనం, వైరస్ మూలాలపై ఒక స్పష్టత అవసరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరింధమ్ బాగ్చి తెలిపారు. – సాక్షి, హైదరాబాద్ -
కరోనా మూలాలను తేల్చండి: బైడెన్
వాషింగ్టన్: కరోనా పుట్టుకను కనుగొనే ప్రయత్నాలను వేగవంతం చేసి, 90 రోజుల్లోగా పూర్తి నివేదిక అందించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ దేశంలోని నిఘా విభాగాలను ఆదేశించారు. వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే పలువురు పరిశోధకులు 2019 నవంబర్‌లో అనారోగ్యం పాలై, ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు అమెరికా ప్రభుత్వ నిఘా నివేదిక వెల్లడించిన నేపథ్యంలో బైడెన్ ఈ ఆదేశాలిచ్చారు. ‘నిఘా వర్గాల ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు జాతీయ పరిశోధన శాలలు, ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా తోడుగా నిలవాలని కోరాను. చైనా నుంచి సమాధానం రావాల్సిన కొన్ని నిర్దిష్ట ప్రశ్నలతోపాటు తదుపరి విచారణ చేపట్టాల్సిన అంశాలను కూడా ఆ నివేదికలో పొందుపరచాలని సూచించాను’అని బైడెన్ ఒక ప్రకటన చేశారు. పారదర్శకంగా, సాక్ష్యాల ఆధారంగా సాగే అంతర్జాతీయ విచారణకు సహకరించి, అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని, ఆధారాలను అందించేలా చైనాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు భావసారూప్యం గల దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు. అబద్ధాల ప్రచారమే లక్ష్యం: చైనా అమెరికా చేస్తున్న ఆరోపణలను చైనా ఖండించింది. ‘నిజాలను, వాస్తవాలను అమెరికా అంగీకరించదు. మూలాలపై శాస్త్రీయత ఆధారిత అధ్యయనంపై ఆ దేశానికి నమ్మకమే లేదు’అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు. తమకు కళంకాన్ని ఆపాదించేందుకు, నిందలు వేసేందుకు ఈ మహమ్మారిని అమెరికా ఒక అవకాశంగా తీసుకుంటోందని ఆరోపించారు. -
కరోనా పుట్టుక అక్కడే.. 2019లోనే పరిశోధకులకు అనారోగ్యం
వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచ పాలిట పెనుగండంగా మారిన కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(వూహాన్ ల్యాబ్)లోనే పుట్టిందా? అది నిజం కాదని చైనా నమ్మబలుకుతున్నప్పటికీ వైరస్ అక్కడే పుట్టిందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. కరోనా వైరస్ జన్మస్థానం వూహాన్ ల్యాబ్ అని చెప్పడానికి మరో కీలక ఆధారం లభించింది. డ్రాగన్ దేశంలో కరోనా మహమ్మారి ఉనికిని చైనా ప్రభుత్వం 2019 ఆఖరులో బయటపెట్టిన సంగతి తెలిసందే. అప్పటికి కొన్ని వారాల ముందే.. అంటే 2019 నవంబర్‌లో వూహాన్ ల్యాబ్‌లో పనిచేసే ముగ్గురు పరిశోధకులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందారట. అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థ వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక ఈ విషయాన్ని సోమవారం వెల్లడించింది. ఇంకా బహిర్గతం చేయని అమెరికన్ ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్‌లోని అంశాలను ప్రస్తావిస్తూ వూహాన్ ల్యాబ్ పరిశోధకుల అనారోగ్యం, చికిత్స వివరాలను తెలిపింది. వారు కరోనా కారణంగానే అనారోగ్యం పాలై, ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు పేర్కొంది. వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆరోపించిన విషయం తెలిసిందే. కోవిడ్–19 పుట్టుకను తేల్చే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిమగ్నమయ్యింది. త్వరలో దీనిపై కీలక సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో అమెరికా మీడియా సంస్థ నివేదిక బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకు ఆధారాల్లేవ్: చైనా కరోనాపై వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజా నివేదికను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ఖండించారు. వూహాన్ ల్యాబ్‌లో సున్నా కోవిడ్–19 ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు అదే ల్యాబ్ మార్చి 23న విడుదల చేసిన ఒక నివేదికలో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లో పుట్టిందనడానికి ఆధారాల్లేవని పేర్కొన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదికలో ప్రస్తావించినట్లు ముగ్గురు పరిశోధకులు అనారోగ్యం పాలయ్యారనడం ఎంతమాత్రం నిజం కాదని వెల్లడించారు. వూహాన్ ల్యాబ్‌లో పనిచేసే వారిలో ఇప్పటిదాకా ఎవరికీ కరోనా సోకలేదని తేల్చి చెప్పారు. -
కరోనా గుట్టు.. చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు!
వెబ్‌డెస్క్: కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో చైనా చుట్టూ గట్టి ఉచ్చు బిగించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. సార్స్-సీవోవీ-2 వైరస్ కారకం వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా మరో కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్ ముందు అమెరికా ఉంచిది. కరోనా విజృంభణ మొదలుకాక ముందు.. నవంబర్ 2019లో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వాళ్లను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వాళ్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నవిషయాన్ని చాలా గోప్యంగా ఉంచింది ల్యాబ్. అంతేకాదు ఆ ఆస్పత్రి బయట గట్టి కాపలా ఉంచింది. అమెరికన్ నిఘా వర్గాలు ఈ వివరాలతో సమగ్రంగా ఒక రిపోర్ట్ తయారు చేశాయి. తాజాగా డబ్ల్యూహెచ్‌వో డెషిషన్ మేకింగ్ బాడీ మీటింగ్‌లో ఈ రిపోర్ట్ ప్రస్తావనకు వచ్చింది. దీంతో కరోనా పుట్టుక గురించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ రిపోర్ట్‌ను ప్రధానంగా పరిశీలించాలని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్ డిసైడ్ నిర్ణయించుకుంది. ఈ విషయాల్ని ప్రముఖ అమెరికన్ పత్రిక వాషింగ్టన్ డీసీ ప్రచురించింది. అమెరికా అతిచేస్తోంది వుహాన్ ల్యాబ్ సిబ్బంది ముగ్గురూ కోవిడ్19 లక్షణాలతో పాటు సీజనల్ జబ్బులతో ఆస్పత్రుల్లో చేరారని అమెరికన్ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ పేర్కొంది. అయితే వాళ్లు ఆస్పత్రుల్లో చేరిన సమయం, చికిత్సను గోప్యంగా ఉంచడం, కొన్నాళ్లకే కరోనా విజృంభించడం.. ఈ అనుమానాలన్నీ ‘కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్’ సృష్టే అనే వాదనను బలపరుస్తున్నాయని తెలిపింది. చైనా మాత్రం అమెరికా ఆరోపణలను మొదటి నుంచే ఖండిస్తోంది. ‘అమెరికా అతిచేస్తోందని, ఈ ఆరోపణలు దర్యాప్తును పక్కదారి పట్టించేలా ఉన్నాయ’ని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కరోనా తమ భూభాగంలో పుట్టలేదని, మేరీల్యాండ్‌లో ఫోర్ట్ డెట్రిక్ మిలిటరీ బేస్ మీదే తమకు అనుమానాలు ఉన్నాయని చైనా ఇది వరకే డబ్ల్యూహెచ్‌వోకి ఒక రిపోర్ట్ అందజేసింది కూడా. అయితే వుహాన్ ల్యాబ్ రీసెర్చర్ల ట్రీట్మెంట్ గురించి ట్రంప్ హయాంలోనే రిపోర్ట్ తయారైనప్పటికీ.. బైడెన్ కార్యాలయం మాత్రం ఈ ఇష్యూపై స్పందించట్లేదు. శాంపిల్స్ ఇవ్వట్లేదు శరదృతువు (సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్య) కాలంలో వుహాన్ రీసెర్చలు సీజనల్ జబ్బులు పడడం సర్వసాధారణమని డచ్ వైరాలజిస్ట్ మరియోన్ చెబుతోంది. ఆ ముగ్గురు కొవిడ్ లక్షణాలతోనే చేరారా? అనేది అనుమానం మాత్రమే అని ఆమె ఆంటోంది. ఇక 2019 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య డెబ్భై ఆరువేల మంది సీజనల్ జబ్బుల బారినపడ్డారు. వాళ్లలో యాంటీ బాడీస్ కోసం 92 మందిని మాత్రమే చైనా పరీక్షించింది. ఈ విషయం డబ్ల్యూహెచ్‌వో దృష్టికి రావడంతో వాళ్ల రిపోర్ట్లు కోరింది. అయితే గోప్యతను సాకుగా చూపెడుతూ చైనా అందుకు నిరాకరించింది. ఇక వుహాన్ ల్యాబ్ బ్లడ్ బ్యాంక్ రిపోర్ట్‌లను సైతం ఇచ్చేందుకు చైనా మొదట అంగీకరించకపోగా.. డబ్ల్యూహెచ్‌వో ఒత్తిడితో దిగొచ్చింది. కానీ, ఇప్పటిదాకా ఎలాంటి రిపోర్టులు సమర్పించలేదని తెలుస్తోంది. -
CoronaVirus: చైనా రహస్య పత్రం ఏం చెబుతోంది..?
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దానికదే వ్యాపించడం మొదలైందా? పరిశోధనలు చేస్తుండగా పొరపాటున లీకైందా? ఎవరైనా జన్యుమార్పిడి చేసి జీవాయుధంగా మార్చి వదిలారా? అన్నదానిపై మొదటి నుంచీ సందేహాలు ఉన్నాయి. అన్ని అనుమానాలూ చైనాపైనే ఉన్నాయి. ఈ సందేహాలను బలోపేతం చేసేలా.. చైనా మిలటరీ సైంటిస్టులకు చెందిన పరిశోధనా పత్రం లీకైంది. ఈ వివరాలతో ది ఆస్ట్రేలియన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వివరాలివి.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వూహాన్లో ఏం జరిగింది? కోవిడ్–19 ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పరిశోధన చేస్తున్న అమెరికన్ అధికారులకు చైనాకు చెందిన ఓ రహస్య పరిశోధనా పత్రం దొరికింది. ‘‘మనుషులు సృష్టించిన సార్స్, ఇతర కొత్త వైరస్‌లను జన్యు మార్పిడి చేసి జీవాయుధాలుగా వినియోగించడం (ది అన్నాచురల్ ఆరిజిన్ ఆఫ్ సార్స్ అండ్ న్యూ స్పీషీస్ ఆఫ్ మ్యాన్‌మేడ్ వైరసెస్ యాజ్ జెనెటిక్ బయో వెపన్స్)’’ అనే శీర్షికతో చైనా మిలటరీ సైంటిస్టులు, ఉన్నతాధికారులు రాసిన పత్రం అది. కరోనా ప్రబలడానికి ఐదేళ్ల ముందే అంటే 2015లోనే ఈ పత్రాన్ని రాయడం గమనార్హం. దీనికి సంబంధించి ది ఆస్ట్రేలియన్ పత్రిక ‘వాస్తవంగా వూహాన్లో జరిగిందేమిటి?’ అనే పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆ పేపర్లో ఏముంది? ‘సరికొత్త జెనెటిక్ ఆయుధాల శకంలో సార్స్ కరోనా వైరస్లు ఓ భాగం. మనుషులకు వ్యాధులు కలిగించే వైరస్‌లుగా వాటిలో కృత్రిమంగా మార్పులు చేయవచ్చు. తర్వాత బయో ఆయుధాలుగా మార్చి ప్రయోగించవచ్చు.’ ►చైనాకు చెందిన ఈ రహస్య పత్రాలను సిద్ధం చేసిన 18 మందిలో ఆ దేశ ఆర్మీ (పీఎల్ఏ) శాస్త్రవేత్తలు, ఆయుధ నిపుణులు, పబ్లిక్ హెల్త్ ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నాయి. జీవాయుధాలతోనే మూడో ప్రపంచ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే జీవాయుధాలతోనే జరుగుతుందని చైనా రహస్య పత్రంలో పేర్కొన్నారు. జీవాయుధాలను ప్రయోగించడం ద్వారా శత్రుదేశ వైద్యారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని చైనా ఆర్మీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సార్స్ కూడా జీవాయుధమే! 2003లో చైనాను, మరికొన్ని దేశాలను వణికించిన ‘సార్స్ (సీవర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)’ వైరస్ కచ్చితంగా మనుషులు తయారు చేసిన జీవాయుధమే అయి ఉంటుందని రహస్య పత్రంలో పేర్కొన్నారు. ఉగ్రవాదులు దానిని ఉద్దేశపూర్వకంగానే ప్రయోగించి ఉంటారని అంచనా వేశారు. ల్యాబ్ నుంచి లీకైందా.. కావాలనే వదిలారా? వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకైందని మొదటి నుంచీ అనుమానాలు ఉన్నాయి. అయితే ల్యాబ్ నుంచి లీకైందని గానీ, ఉద్దేశపూర్వకంగానే వదిలారని గానీ కచ్చితమైన ఆధారాలు ఏమీ ఇప్పటివరకు లభించలేదు. ►ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ కూడా వూహాన్ ల్యాబ్ లీకేజీ అంశాన్ని కొట్టిపారేయలేదు. ఆ కోణంలో మ రింత పరిశీలన జరగాల్సి ఉందని అన్నారు. ఎన్నో ఆందోళనలు చైనా కొన్నేళ్లుగా వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ప్రమాదకరమైన కొత్త వైరస్‌లను సృష్టించి, పరిశోధనలు చేస్తోంది. వేగంగా విస్తరించి, వేగంగా చంపేయగల సామర్థ్యం ఉన్న వైరస్‌లను సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ►లీకైన రహస్య పత్రాన్ని బట్టి జీవాయుధాల పట్ల చైనా తీరు ఏమిటో స్పష్టమవుతోందని, అందరూ దృష్టిసారించాల్సిన అంశం ఇది అని బ్రిటన్ ఎంపీ టామ్ టుగెండాట్ ఇటీవలే విమర్శించారు. మరెన్నో సందేహాలు కరోనా వైరస్ మూలాలపై అంతర్జాతీయ దర్యాప్తునకు చైనా ఎందుకు విముఖత చూపుతోందనే దానికి.. ఇప్పుడు బయటపడ్డ రహస్య పత్రమే సమాధానం చెప్తోందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీటర్ జెన్నింగ్స్ అన్నారు. ళీ రహస్య పత్రంలోని అంశాలు చైనాపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని బ్రిటన్ ఎంపీ టామ్, ఆస్ట్రేలియా రాజకీయ నాయకుడు జేమ్స్ పీటర్సన్ స్పష్టం చేస్తున్నారు. ఆ రిపోర్టు తప్పు: చైనా ది ఆస్ట్రేలియన్ ప్రచురించిన ఆర్టికల్‌ను చైనా అధికార వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ తప్పుపట్టింది. ‘కరోనా మూలాలపై చైనాను ఇరుకున పెట్టేందుకు వాస్తవాలను వక్రీకరించారు. అదొక కుట్ర సిద్ధాంతం’ అని పేర్కొంది. -
చైనాలో విరుచుకుపడ్డ టోర్నడోలు, 12 మంది మృతి
బీజింగ్: చైనాలో శుక్రవారం రాత్రి రెండు శక్తిమంతమైన టోర్నడోలు విరుచుకుపడ్డాయి. వుహాన్, సుజోవ్ ప్రావిన్సులను తాకిన ఈ టోర్నడోల (భీకరమైన సుడిగాలుల) కారణం గా 12 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారని జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. వుహాన్‌లోని కైడియన్ జిల్లాలో వచ్చిన టోర్నడోలో గాలి వేగం సెకనుకు 29.3 మీటర్లు ఉన్నట్లు తెలిపింది. అక్కడే 8 మంది మరణించగా 230 మంది గాయపడ్డారని చెప్పింది. 27 ఇళ్లు కూలిపోగా, 130 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని పేర్కొంది. దీని కారణంగా వుహాన్‌లో 26.6 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొంది. సుజోవ్‌లో వచ్చిన టోర్నడోలో నలుగురు మరణించగా, 19 మంది గాయపడ్డారు. 84 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతాల్లో సాధారణంగా టోర్నడోలు సంభవించే అవకాశం లేకపోయినప్పటికీ, భారీ టోర్నడోలు రావడం గమనార్హం. Two #tornadoes with winds of more than 200 km/hr wreaked havoc in central & eastern #China on Friday night. 🌪️#EastAsia Further thunderstorms to come this week.⛈️ pic.twitter.com/Yt1N9NlLqv — BBC Weather (@bbcweather) May 15, 2021 -
కరోనా పుట్టుక: వూహాన్‌కు ముందు యునాన్లో
సాక్షి, హైదరాబాద్: మానవజాతికి సార్స్ కోవ్–2 వైరస్ పరిచయమై పదహారు నెలలవుతోంది. వ్యాధి నియంత్రణకు వ్యాక్సిన్‌ను రికార్డు సమయంలో అభివృద్ధి చేసినప్పటికీ అమెరికాతో పాటు భారత్ లాంటి దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. గత ఏడాది మొదట్లో ఈ వైరస్ గురించి తెలిసిన తర్వాత అందరిలోనూ తలెత్తిన ప్రశ్న.. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అన్నదే. చైనాలో గబ్బిలాలు మొదలుకొని అన్ని రకాల జంతువులను ఆహారంగా తీసుకుంటారు కాబట్టి వాటి మాంసం నుంచి మనుషులకు సోకి ఉంటుందని కొందరు, ప్రపంచంపై అధిపత్యం చెలాయించే లక్ష్యంతో చైనా స్వయంగా దీన్ని అభివృద్ధి చేసిందని మరికొందరు ఆరోపణలు గుప్పించారు. వూహాన్‌లోని జంతు మార్కెట్ల నుంచే సోకి ఉండవచ్చునని చైనా అప్పట్లోనే చెప్పింది. అయితే అగ్రరాజ్యం అమెరికా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది చైనా వైరస్సే అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు గత ఏడాది జనవరిలో శాస్త్రవేత్తల బృందాన్ని చైనాకు పంపింది. దాదాపు నెలరోజులపాటు పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు చివరకు.. ఈ వైరస్ దక్షిణ చైనాలోని యునాన్ ప్రాంతం నుంచి వూహాన్‌లోని జంతు మార్కెట్లకు చేరి, అక్కడి నుంచి మనుషులకు సోకి ఉంటుందని నిర్ధారించింది. ఈ మేరకు త్వరలో నివేదిక విడుదల చేయనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందంలో సభ్యుడైన పీటర్ డస్జాక్ అమెరికా రేడియో కంపెనీ ఎన్పీఆర్కు చెప్పినదాని ప్రకారం.. కోవిడ్–19 కారక వైరస్ గబ్బిలాల నుంచి అడవి జంతువులకు.. వాటి నుంచి మనుషులకూ సోకింది. జంతు పోషణ కేంద్రాల్లో మొదలై.. గ్రామీణ ప్రాంతాల్లోని బడుగులకు ఉపాధి కల్పించి తద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు చైనా దాదాపు 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఓ కార్యక్రమం కోవిడ్–19 కారక వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పునుగు పిల్లులు, పొర్కుపైన్స్ (ముళ్లపందిని పోలిన జంతువు), పంగోలిన్, అడవి కుక్కలు, ఎలుకల వంటి రకరకాల అడవి జంతువులను అటవీ ప్రాంతాల్లోని చైనీయులు పెంచి పోషిస్తూంటారని, వూహాన్ హోల్‌సేల్ జంతుమార్కెట్‌లో వీటి విక్రయాలు జరుగుతూంటాయని పీటర్ చెబుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో చైనా ఈ జంతువుల ఫామ్‌లను మూసేసిన సంగతి తెలిసిందే. పెంచుతున్న జంతువులను ఎలా చంపేయాలి? ఏ ఏ జాగ్రత్తలు తీసుకుని వాటిని పూడ్చిపెట్టాలన్న మార్గదర్శకాలను కూడా చైనా అప్పట్లో జారీ చేసిందని పీటర్ వివరించారు. యునాన్ ప్రాంతంలోని అడవి జంతువుల్లో కోవిడ్ కారక కరోనా వైరస్ ఉండి ఉంటుందని, ఆ ప్రాంతంలోనే గబ్బిలాల్లో కోవిడ్ కారక వైరస్‌తో 96% పోలికలు ఉన్న ఇంకో వైరస్‌నూ చైనా శాస్త్రవేత్తలు గుర్తించారని పీటర్ గుర్తు చేశారు. అయితే చైనాలోనే ఇది మనుషులకు సోకి ఉంటుందని తాను అనుకోవడం లేదని.. కాకపోతే అలా కనిపిస్తోందని పీటర్ అభిప్రాయపడ్డారు. వూహాన్లో కోవిడ్–19 కేసులు బయటపడేందుకు కొంతకాలం ముందు నుంచే ఈ వైరస్ చైనా మొత్తమ్మీద వ్యాప్తి చెంది ఉండవచ్చునని పీటర్ చెబుతున్నారు. వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి అనుకోకుండా ఈ వైరస్ లీక్ అయ్యిందన్న వార్తల్లో వాస్తవం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలోనే స్పష్టం చేయడం గమనార్హం. చదవండి: చైనాలో కరోనా మూలాలు అక్కడి నుంచే..! మౌత్‌వాష్‌తో కరోనా కంట్రోల్ -
కరోనా మహమ్మారి కనుమరుగైనట్లేనా?
సాక్షి, హైదరాబాద్: కొంచెం అటు ఇటుగా భారతదేశానికి కరోనా అన్న పదం, మహమ్మారి వ్యాధి పరిచయమై ఏడాది దాటుతోంది. 2019 నవంబర్‌లో చైనాలోని వూహాన్లో తొలిసారి గుర్తించిన కరోనా వ్యాధి ఆ తర్వాత ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. వ్యాధి తాలూకు కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో 2020 జనవరి 23న వూహాన్ నగరం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు. జనవరి 30న కేరళలో తొలి కోవిడ్–19 కేసు నమోదైంది. మొదట్లో కేసుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా రోజులు గడుస్తున్న కొద్దీ మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లో వందల మంది వైరస్‌బారిన పడటం మొదలైంది. తొలి కేసు నమోదైన తరువాత సుమారు రెండు నెలలకు అంటే మార్చి నాలుగవ వారంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలయ్యే సమయానికి వ్యాధి అన్ని రాష్ట్రాలకూ విస్తరించింది. వ్యాధి గురించి తెలిసిన తొలినాళ్లలో దీని వ్యాప్తిపై కొన్ని పరిశోధనలు జరిగాయి. వాటి ప్రకారం ఒక దశలో రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షల వరకూ చేరుకోవచ్చునని, మరణాలు కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయని ఈ పరిశోధనలు తెలిపాయి. అదృష్టమో.. మరే ఇతర కారణమో స్పష్టంగా తెలియదు కానీ అంతటి విపత్తు మాత్రం రాలేదు. 2020 సెప్టెంబర్ నాటికి రోజువారీ కేసులు 99 వేల స్థాయికి చేరి ఆ తర్వాత నెమ్మదిగా తగ్గడం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కేసుల సంఖ్య తగ్గుతూనే ఉంది. చాలామంది ఊహించినట్లు అమెరికా, ఐరోపా దేశాల్లోలాగా సెకెండ్ వేవ్ మన దగ్గర కన్పించట్లేదు. శాస్త్రవేత్తలకూ అంతుచిక్కట్లే.. అమెరికా, ఐరోపా దేశాలు ప్రస్తుతం మూడు, నాలుగో సారి కోవిడ్ బారిన పడి కష్టాలు అనుభవిస్తున్నాయి. భారత్‌లో మాత్రం అందుకు విభిన్న పరిస్థితి ఉండటం శాస్త్రవేత్తలకూ అంతుచిక్కట్లేదు. సెప్టెంబర్‌లో కేసుల సంఖ్య రోజుకు లక్ష వరకు చేరిన దాంతో పోలిస్తే ప్రస్తుతం 90 శాతం వరకూ కేసులు తగ్గిపోయాయి. మరణాలు కూడా అంతే. సెప్టెంబర్‌లో రోజువారీ మరణాల సంఖ్య వెయ్యికిపైగా ఉంటే.. ఇప్పుడది వంద కంటే తక్కువ. ఇందుకు కారణం హెర్డ్ ఇమ్యూనిటీ సాధించామని కొందరు చెబుతున్నారు. భారత వైద్య పరిశోధన సమాఖ్య తాజా సీరో సర్వే ప్రకారం మాత్రం దేశవ్యాప్తంగా కోవిడ్–19 యాంటీబాడీలు 20 శాతం జనాభాలో ఉన్నాయి. అయితే 60 శాతం కంటే ఎక్కువ మంది జనాభాలో యాంటీబాడీస్ ఉన్నప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమనేది నిపుణుల మాట. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం కూడా దేశ జనాభాలో 25 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు లెక్కగట్టింది. యువత ఎక్కువగా ఉండటం వల్లే? భారత్‌లో ఎక్కువ శాతం మంది యువత కావడం సెకెండ్ వేవ్‌ను అడ్డుకుందన్న వాదన వినిపిస్తున్నారు. వేర్వేరు వ్యాధులకు ఇప్పటికే నిరోధకత సాధించడం కూడా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అంతా బాగుందనుకునేందుకు వీల్లేదని, మరికొన్ని నెలల పాటు జాగ్రత్తలు పాటించాల్సిందేనని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. యూకేలో బయటపడ్డ కొత్త రకం కోవిడ్–19 కారక వైరస్ భారత్‌పై పెద్దగా ప్రభావం చూపకపోయినా దక్షిణాఫ్రికా రకం వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. జనవరి 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కావడం, రెండో డోసు ఇస్తున్న నేపథ్యంలో సెకెండ్, థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని, కాకపోతే శాస్త్రీయంగా ఈ అంశాలను నిర్ధారించుకునేంత వరకు నిర్లక్ష్యంగా ఉండొద్దని చెబుతున్నారు. -
కరోనా వైరస్ పుట్టింది వూహాన్లో కాదు..
కరోనా మహమ్మారి పుట్టుకపై వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్(డబ్యూహెచ్ఓ) సంచలన ప్రకటన చేసింది. వైరస్ పుట్టింది వూహాన్లో కాదని, మహమ్మారి వైరస్ బీజాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయని డబ్యూహెచ్ఓ అనుమానాన్ని వ్యక్తం చేసింది. దీంతో పాటు డబ్యూహెచ్ఓ మరిన్ని అనుమానాలకు తెరలేపింది. కరోనా వైరస్ కచ్చితంగా ల్యాబ్‌లో తయారు చేసింది కాదని, ఆస్ట్రేలియా నుంచి ఎగుమతైన బీఫ్లో వైరస్ ఉండి వుండవచ్చని సందేహాలను వ్యక్తం చేసింది. కరోనా కేసులు చైనాలో కంటే ముందే కొన్నిదేశాల్లో వెలుగు చూసి ఉండే అవకాశముందన్న అనుమానాన్ని సైతం వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రకటనలను ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది. డబ్యూహెచ్ఓ.. చైనా ప్రభుత్వపు జేబు సంస్థగా మారిందని ఆరోపించింది. చైనా ప్రభుత్వం చేసిన ఆరోపణల వల్లె డబ్యూహెచ్ఓ ఇలాంటి ప్రకటనలను చేసివుంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. కాగా, కరోనా వైరస్ పుట్టుకపై ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలున్న నేపథ్యంలో డబ్యూహెచ్ఓ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
డబ్ల్యూహెచ్ఓ అరకొర నివేదిక
ప్రపంచాన్ని ఏడాదిపాటు ఊపిరాడకుండా చేసిన కరోనా వైరస్ మహమ్మారి పుట్టుపూర్వోత్తరాలు వెలికితీయటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్పష్టమైన విజయం సాధించలేక పోయింది. అయితే అది చైనాలోని వుహాన్ ప్రయోగశాల నుంచి లీకై వుండకపోవచ్చని మాత్రం తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తల బృందం పది పన్నెండు రోజులు చైనాలో పర్యటించి వచ్చాక ఈ నివేదిక వెలువరించింది. వారిని అనుమతించే విషయంలో చాన్నాళ్లు విముఖత ప్రదర్శించిన చైనా... నివేదిక వచ్చాక మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఏ రకమైన అడ్డంకులు కల్పించకుండా, మొదటే శాస్త్రవేత్తలను ఆహ్వానించివుంటే ఈ ఆనందం ఇప్పుడు మరిన్ని రెట్లుండేదేమో! నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడిచ్చిన నివేదిక ప్రాథమికమైనదే. పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలంటే నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. ఇంతకూ నివేదిక ఏం చెప్పింది? కరోనా వైరస్ జంతువులనుంచి గానీ, శీతలీకరించిన ఆహార ఉత్పత్తులనుంచిగానీ వ్యాప్తి చెంది వుండొచ్చని వివరించింది. అలాంటి ఉత్పత్తులు వెలుపలి దేశాలనుంచి చైనాకు వచ్చివుండొచ్చని కూడా అభిప్రాయపడింది. కరోనా జాడలు కనబడిన తొలినాళ్లలో ఏం జరిగిందో గుర్తుతెచ్చుకోవాలి. వుహాన్‌లో తొలి కరోనా వైరస్ కేసులు 2019 డిసెంబర్ 12–29 మధ్య బయటపడ్డాయి. ఈ కేసుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా ఆ నెల 31న మాత్రమే తెలియజేసింది. వుహాన్‌లో నిరుడు జనవరి 23న లాక్డౌన్ అమలు చేయడం ప్రారంభించిననాటికే ఆ వైరస్ జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, హాంకాంగ్, మెక్సికో, సౌదీ అరేబియా, అమెరికాలకు వ్యాపించింది. కరోనా తీవ్రత గ్రహించలేక చైనా మొదట్లో కొన్ని తప్పులు చేసిందని సరిపెట్టుకోవచ్చు. అలా మన దేశంతోపాటు అమెరికా తదితరచోట్లకూడా జరిగాయి. కానీ చైనాలో జరిగినవి కేవలం తప్పులు మాత్రమే కాదు... ఆ వైరస్ వైనాన్ని కప్పెట్టడానికి ప్రయత్నించారన్న సంగతి గుర్తుంచుకోవాలి. సార్స్‌ని పోలిన వైరస్ జనం ప్రాణాలు తోడేస్తున్న దని తొలిసారి గ్రహించి సహచరులకు చెప్పటంతోపాటు సామాజిక మాధ్యమాల ద్వారా అందరినీ అప్రమత్తం చేసిన వైద్యుడు డాక్టర్ లీ వెన్లియాంగ్కు పోలీసుల నుంచి ఎదురైన వేధిం పులు అన్నీ ఇన్నీ కాదు. ప్రశ్నించే పేరుతో గంటలకొద్దీ నిర్బంధించి, వదంతులు వ్యాపింపజేస్తే వైద్య పట్టా రద్దు చేయటంతోపాటు శిక్షపడేలా చూస్తామని హెచ్చరించారు. చివరకు ఆ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తూ ఆ క్రమంలోనే తానూ బాధితుడిగా మారి నిరుడు ఫిబ్రవరి 7న ఆ వైద్యుడు కన్నుమూశాడు. ఆ తర్వాతైనా చైనా తన ధోరణి మార్చుకుని వుంటే బాగుండేది. కానీ అది తప్పులు మీద తప్పులు చేస్తూ పోయింది. తమ దేశం నుంచి వచ్చే విమానాలను అనుమతించరాదని అమెరికా, యూరోప్ దేశాలు నిర్ణయించినప్పుడు అది విరుచుకుపడింది. తాము తీసుకుంటున్న ముందు జాగ్రత్తలేమిటో చెప్పలేదు. ప్రజారోగ్య వ్యవస్థను కదిలించి, పటిష్టమైన చర్యలు తీసుకోవటం, ఆ అనుభవాలను ప్రపంచ దేశాలతో పంచుకుంటూ, వాటితో కలిసి పనిచేయటానికి ప్రయత్నించటం వంటివి చేస్తే చైనాపై నింద పడేది కాదు. అలా చేయలేదు సరిగదా వైరస్ తీవ్రతనూ, వేగంగా వ్యాప్తిచెందే తీరునూ వెల్లడించి అప్రమత్తం చేయడానికి సిద్ధపడలేదు. తాను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా ఆపటానికే చైనా ఈ వైరస్‌ను సృష్టించిందని డోనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తే...అది అమెరికా ప్రయోగశాల సృష్టి అని చైనా మీడియా లంకించుకుంది. అసలు ప్రతి దేశంలోనూ జీవశాస్త్ర ప్రయోగశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం అమెరికాకు ఎందుకొచ్చిందని చైనా వ్యాధి నియంత్రణ కేంద్రాల చీఫ్ జెంగ్ గుయాంగ్ కొత్త వాదన లేవనెత్తారు. డబ్ల్యూహెచ్ఓ బృందం వస్తామన్నప్పుడు కూడా దాన్ని అనుమతించటానికి చైనా వెనకాడింది. ఇప్పుడైనా ఎన్నో పరిమితుల మధ్య శాస్త్రవేత్తలు దర్యాప్తు చేయాల్సివచ్చింది. నిరుడు అక్టోబర్‌లో తొలిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఆన్లైన్ భేటీకి చైనా సిద్ధపడింది. ఆ తర్వాత జనవరి వరకూ ఆ సంస్థ శాస్త్రవేత్తలను ఆన్లైన్లో కలిసే విషయంలో తాత్సారం చేసింది. చివరకు గత నెల రెండోవారంలో శాస్త్రవేత్తలను దేశంలోకి అనుమతించగా వారు క్వారంటైన్ లాంఛనాలు పూర్తి చేసుకుని 28న దర్యాప్తు ప్రారం భించారు. ఇన్నాళ్లయ్యాక, అంతా సర్దుకున్నాక వారు వెలికితీసేది పెద్దగా లేకపోవచ్చు. అలాగని వైరస్‌కు చైనాయే కారణమని నిందించటం కూడా తొందరపాటే అవుతుంది. ట్రంప్ చైనా వైరస్ అంటూ ప్రచారం చేస్తున్నప్పుడే, ఆయనకు ప్రపంచం నలుమూలలనుంచీ నిఘా నివేదికలు రోజూ అందించే జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ కార్యాలయం అది వుహాన్ ప్రయోగశాల సృష్టి కాదని స్పష్టంగా చెప్పింది. శాస్త్రవేత్తలు వుహాన్‌లో 2019 సంవత్సరంలో జబ్బుపడిన వేలాదిమందినుంచి సేకరించి వుంచిన నమూనాలను పరిశీలించారు. డిసెంబర్‌కు ముందు అక్కడ దాదాపుగా వ్యాధి జాడలేదన్న నిర్ణ యానికొచ్చారు. అలాగే గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందివుండొచ్చన్న అంచనా విషయం లోనూ ఎలాంటి ఆధారాలూ లభించలేదు. అయితే మరిన్ని దేశాల్లో, మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే తప్ప నిజాలేమిటో తెలిసే అవకాశం లేదు. చైనా తనకు అలవాటైన గోప్యతను కాస్త సడలించుకుని, సహకరించివుంటే...ముందే శాస్త్రవేత్తలను అనుమతించివుంటే ప్రపంచానికెంతో మేలు జరిగేది. చైనాపై వున్న నిందలు పటాపంచలయ్యేవి. -
‘2019, డిసెంబర్‌కు ముందు అక్కడ కరోనా లేదు’
బీజింగ్: ప్రపంచాన్ని విలవిల్లాడించిన కరోనా వైరస్‌ను డ్రాగన్ దేశం తయారు చేసి ప్రపంచం మీదకు వదిలిందని అమెరికాతో సహా పలు దేశాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ గురించి అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా అలసత్వం ప్రదరించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం డబ్ల్యూహెచ్ఓ బృందం కరోనా వైరస్ మూలాల్ని కనిపెట్టేందుకు వుహాన్‌కు బయలు దేరింది. ఈ బృందం మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ జంతువుల నుంచి వ్యాపించిందని.. కానీ అది ఏ జీవి అనేది మాత్రం తెలియడంలేదని ప్రకటించింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఫారిన్ ఎక్స్పర్ట్ బెన్ ఎంబరెక్ మాట్లాడుతూ.. ‘‘తొలి అధికారిక కరోనా కేసు నమోదయిన వుహాన్‌లో 2019, డిసెంబర్‌కు ముందు వైరస్ వ్యాప్తి ఉన్నట్లు మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు’’ అన్నారు. ఇక వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందనే వార్తలను ఆయన కొట్టి పారేశారు. ఇక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 106 మిలియన్ల మంది కోవిడ్ బారిన పడగా.. 2 మిలియన్లకు పైగా మరణాలు సంభవించాయి. చదవండి: వూహాన్ మార్కెట్లో డబ్ల్యూహెచ్ఓ బృందం -
వూహాన్ మార్కెట్లో డబ్ల్యూహెచ్ఓ బృందం
బీజింగ్/వూహాన్: కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందన్న విషయాన్ని నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల నిపుణుల బృందం ఆదివారం చైనాలోని వూహాన్లో ఉన్న హూనన్ సీఫుడ్ మార్కెట్‌ను పటిష్టమైన భద్రత మధ్య సందర్శించింది. 2019లో కరోనా వైరస్ ఇక్కడే తొలిసారిగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందన్న విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ మార్కెట్లో సముద్ర ఉత్పత్తులతోపాటు రకరకాల జంతువుల మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ విక్రయించే గబ్బిలాలు/పాంగోలిన్స్ నుంచే కరోనా వైరస్ పుట్టిందన్న వాదన ఉంది. అయితే, దీన్ని చైనా ప్రభుత్వం అంగీకరించడం లేదు. తాము ఈరోజు ముఖ్యమైన ప్రాంతాన్ని సందర్శించామని నిపుణుల బృందం తెలియజేసింది. కరోనా వ్యాప్తిని గుర్తించడానికి ఈ పర్యటన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. 2019 డిసెంబర్లో వూహాన్లో కరోనా కేసులు బయటపడిన తర్వాత ఈ మార్కెట్‌ను మూసివేసి, శుభ్రం చేశారు. -
కరోనా మూలాలు కనుక్కునే పనిలో డబ్ల్యూహెచ్ఓ
వూహాన్: చైనాలోని వూహాన్లో కరోనా వైరస్ మూలాలను కనుక్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యులు అధ్యయనం మొదలు పెట్టారు. కరోనా వైరస్ వచ్చిన తొలి రోజుల్లో రోగులకు చికిత్స చేసిన వూహాన్లో జిన్యింతన్ ఆస్పత్రిని శనివారం సందర్శించారు. చైనా శాస్త్రవేత్తలతో కలిసి మాట్లాడారు. జం తువుల ఆరోగ్యం, వైరాలజీ, ఫుడ్ సేఫ్టీ, ఎపిడిమాలజీలో నిపుణులతో కలిసి చర్చించారు. వైరస్ పుట్టుకకు గల కారణాలపై అన్ని వైపుల నుంచి అధ్యయనం చేస్తున్నారు. ఈ బృందంలో వివిధ రంగంలో నిష్ణాతులైన 10 మంది సభ్యులున్నారు. ‘కోవిడ్‌కి గల కారణమైన ఏ అంశాన్ని వదలకుండా అన్ని వైపుల నుంచి డబ్ల్యూహెచ్ఓ బృందం పరిశీలిస్తోంది’అని డబ్ల్యూహెచ్ఓ ట్వీట్ చేసింది.ఎన్నో రకాల గణాంకాలను పరిశీలించిన బృందం తొలుత వైరస్ సోకిన రోగులతో మాట్లాడనుంది. కరోనా వైరస్‌పై చైనా ముందస్తుగా ప్రపంచ దేశాల్ని హెచ్చరించలేదని, ఉద్దేశపూర్వకంగానే వైరస్‌ను వ్యాప్తి చేసిందని ఆరోపణలున్నాయి. -
కరోనాతో ఏడాది సావాసాన్ని చూస్తే...
కంటికి కనిపించని శత్రువు మనకి సవాల్ విసిరి ఏడాదైంది. కేరళలో తొలి కరోనా కేసు వెలుగులోకి వచ్చి ఇవాళ్టికి సరిగ్గా ఏడాదైంది. జనాభాతో కిటకిటలాడే భారత్‌లో కరోనా బాంబు విధ్వంసం సృష్టిస్తుందని అందరూ అంచనా వేశారు. ఆసియాలో అతి పెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో తొలికేసు నమోదు కాగానే భారత్ పనైపోయిందని భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. అగ్రరాజ్యాలే ఇంకా కరోనా పడగ నీడలో భయం భయంగా బతుకు వెళ్లదీస్తూ ఉంటే, మనం అన్నీ తట్టుకొని ఇప్పుడిప్పుడే నిలబడుతున్నాం. కరోనా మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ పాఠాలే గుణపాఠాలుగా మార్చుకొని పడిలేచిన కడలితరంగంలా పైకి లేస్తున్నాం. కరోనాతో కలిసి చేసిన ఈఏడాది ప్రయాణాన్ని ఒక్కసారి చూద్దాం.. కంటికి కనిపించని సూక్ష్మక్రిమి ఏడాదిలో మన జీవన చిత్రాన్ని మార్చేసింది. ఎంతలా అంటే కరోనాకి ముందు కరోనా తర్వాత అని నిర్వచించుకునేలా మారి పోయింది. అమెరికా, యూరప్ వంటి దేశాలు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌తో చిగురుటాకులా వణికిపోతూ ఇంకా ఇళ్లలోనే మగ్గిపోతూ ఉంటే మనం మాత్రం ఆర్థికంగా బలోపేతం కావడానికి అవసరమయ్యే వ్యూహరచనలో మునిగి ఉన్నాం. కరోనాపై పోరాటం తుది దశకు వచ్చేసింది. ఏడాదిలోనే దాని కొమ్ములు విరిచేసి ప్రపంచ దేశాల్లో రొమ్ము విరుచుకొని భారత్ ఠీవిగా నిలబడింది. రోజుకి దాదాపుగా లక్ష వరకు కేసులు చూసిన భారత్‌లో ఇప్పుడు రోజుకి 10 నుంచి 20 వేలు వరకు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. చైనా నుంచి కేరళకి చైనాలోని వూహాన్లో 2019 డిసెంబర్ 27న తొలిసారిగా కరోనా కేసు బట్టబయలైతే ఆ తర్వాత నెల రోజులకే అంటే జనవరి 30న చైనా నుంచి భారత్‌కి వచ్చిన కేరళ విద్యార్థినికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ఆ విద్యార్థినిని క్వారంటైన్‌కి తరలించడంతో భారత్ ఒక్కసారి ఉలిక్కిపడింది. కానీ మన ఉష్ణోగ్రతలకి వైరస్ బతకదన్న ధీమాతోనే మార్చి వరకు గడిపేశాం. అంతకంతకూ కేసులు పెరుగుతూ ఉండడంతో వైరస్ ముప్పుని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మార్చి 24న హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించడంతో అందరూ మేల్కొన్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతికదూరం వంటి మాటలే కొత్తగా విన్న ప్రజలకు ఈ వైరస్‌పై అవగాహన పెంచుకోవడానికి సమయం పట్టింది. ఆ కొద్దిపాటి సమయంలోనే కరోనా మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ప్రపంచ దేశాల పట్టికలో అమెరికా తర్వాత కోటి కేసులు దాటిన దేశంగా భారత్ నిలిచినప్పటికీ, జనసాంద్రత పరంగా చూస్తే కరోనా విసిరిన సవాళ్లను పకడ్బందీగా ఎదుర్కొన్నామనే చెప్పాలి. కరోనా విస్తరించిన తొలిరోజుల్లో ముంబై కరోనాకి రాజధానిగా మారింది. ఇప్పటికి కూడా మహారాష్ట్ర కోవిడ్–19 కేసుల్లో ముందు వరసలో ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల్లో కేరళ, మహారాష్ట్ర నుంచే 65శాతం నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 1.6శాతం మాత్రమే. సరైన సమయంలో లాక్డౌన్ వల్ల కోటి వరకు కేసులు, లక్ష వరకు మరణాలను నిరోధించగలిగామన్న అంచనాలున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించామా..? పశ్చిమ దేశాలు కరోనా వైరస్‌తో ఇంకా కష్టాలు పడుతూ ఉంటే మన దేశంలో అక్టోబర్ నుంచి కేసులు తగ్గుముఖం పట్టడం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. భారతీయుల్లో రోగనిరోధకత ఎక్కువగా ఉండడం, యువతరం ఎక్కువగా ఉండడం, చాలా మందిలోయాంటీ బాడీలు ఏర్పడడం వంటివి ఇందుకు కారణమని నిపుణుల అంచనా. భారత్‌లో ఎంత మందికి కరోనా వచ్చి తగ్గిందన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. పట్టణాల్లో థైరోకేర్ కంపెనీ నిర్వహించిన సర్వేలో 30 నుంచి 40 కోట్ల మందికి కరోనా వచ్చినట్టు తేలగా, 3నెలల క్రితం ఐసీఎంఆర్ సర్వేలో 10 కోట్ల మందికి సోకినట్టు తేలింది. దీంతో భారత్ హెర్డ్ ఇమ్యూనిటీ సాధించి ఉంటుందని అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. మరణాలు తక్కువే.! రికవరీలో భారత్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. మొత్తం కేసులు కోటీ 7 లక్షలు దాటితే మృతుల సంఖ్య లక్షా 50 వేలు దాటింది. రికవరీ అంశం భారత్‌కు మొదట్నుంచీ అతి పెద్ద రిలీఫ్. తాజాగా జాతీయ రికవరీ రేటు 96శాతంగా ఉండడం ఒక రికార్డు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మరణాల రేటు భారత్‌లో చాలా తక్కువ. 12 నెలల ప్రయాణం 2020 జనవరి 18: చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులకి విమానాశ్రయాల్లోనే థర్మల్ స్క్రీనింగ్ 30: కేరళలో తొలి కేసు నమోదు ఫిబ్రవరి 3,4: మరో రెండు కేసులువెల్లడి, వీరు కూడా చైనా నుంచి వచ్చిన విద్యార్థులే మార్చి 10: కరోనాతో తొలి మరణం 11: ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్–19న మహమ్మారిగా ప్రకటించింది. 24: భారత్‌లో 21 రోజుల లాక్డౌన్ విధింపు ఏప్రిల్ 14: లాక్డౌన్ మే 3వరకు పొడిగింపు మే1: మరో 2 వారాలు లాక్డౌన్ పొడిగింపు 7: 50 వేలు దాటిన కరోనా కేసులు జూన్ 1: అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం 27: భారత్‌లో 5 లక్షలు దాటిన కేసులు జూలై 1 : అన్‌లాక్ 2 ప్రారంభం 17: భారత్‌లో 10 లక్షలు దాటిన కేసులు ఆగస్టు 3: ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి 7:20 లక్షలు దాటిన కేసులు వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రణాళికలు సిద్ధం చేయడానికి జాతీయ నిపుణుల కమిటీ ఏర్పాటు సెప్టెంబర్ 5: కరోనా కేసుల్లో బ్రెజిల్‌ని దాటేసి రెండోస్థానంలోకి చేరుకున్న భారత్ 16 : 50 లక్షలు దాటిన కేసులు అక్టోబర్ 11: 80 లక్షలు దాటిన కేసులు నవంబర్16: భారత్ బయోటెక్ కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలు ప్రారంభం డిసెంబర్ 8: ఆక్స్ఫర్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అనుమతుల్ని పరిశీలిస్తున్నట్టుగా కేంద్రం వెల్లడి డిసెంబర్ 10 : కోటి దాటిన కేసులు 2021 జనవరి 2 : భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి 16: కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం. -
చైనాలో మళ్లీ లాక్డౌన్!
చైనా: కరోనా మహమ్మారి మరోసారి చైనా దేశాన్ని పట్టి పీడిస్తుంది. 2019లో వూహాన్ నగరంలో వైరస్ వ్యాపించిన తర్వాత పెద్ద ఎత్తున చైనా అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వైరస్ వ్యాపించిన ప్రాంతాల్లో భారీగా టెస్టింగులతో పాటు లాక్డౌన్లు విధించడంతో వైరస్ వ్యాప్తిని చాలా వరకు నియంత్రించారు. తాజాగా మళ్లీ చైనాలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. చైనా రాజధాని బీజింగ్‌కు దక్షిణంగా ఉన్న రెండు నగరాలలో లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆ నగర రహదారులను మూసివేయడంతో పాటు రవాణా సౌకర్యాలను నిలిపివేసింది.(చదవండి: మా వ్యాక్సిన్ చాలా డేంజర్: చైనా ఎక్స్పర్ట్) ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో గత వారంలో 127 కొత్త కోవిడ్-19కేసులు, అదనంగా 183 అసింప్టోమాటిక్ ఇన్ఫెక్షన్లు కనిపించాయి. 2019 తర్వాత చైనాలో ఇన్ని కేసులు ఒకేసారి వెలుగుచూడటం ఇదే తోలిసారి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు హెబై ప్రావిన్స్‌లోని షిజియాషాంగ్, జింగ్టాయ్ సిటీల్లో లాక్డౌన్ విధించారు. అత్యవసరం అయితే తప్ప బయటకి రాకూడదని ఆదేశించారు. హెబీ ప్రావిన్స్‌లోని నివాసితులు బీజింగ్‌లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల, ఆహార ప్యాకేజింగ్ ద్వారా చైనాలోకి ఈ ప్రవేశించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. -
వూహాన్లో అత్యవసర వ్యాక్సినేషన్
బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకకు స్థానమైన వూహాన్లో చైనా ప్రభుత్వం ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్ మొదలు పెట్టింది. కోటి మందికిపైగా జనాభా ఉన్న ఈ నగరంలోని 15 జిల్లాల్లో డిసెంబర్ 24వ తేదీ నుంచే ఈ కార్యక్రమం మొదలైనట్లు సమాచారం. నగరంలో 48 కేంద్రాలను ఏర్పాటు చేసి 18–59 మధ్య వయస్సు వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండు టీకా డోసులు ఇస్తున్నట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ హి ఝెన్యు తెలిపారని అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. -
చైనాపై మరోసారి అమెరికా మండిపాటు
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకకు చైనాదే బాధ్యతంటూ ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం అమెరికా ఇదే విషయమై మరోసారి పలు తీవ్ర ఆరోపణలు చేసింది. వూహాన్లో వైరస్ జాడను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చేపట్టిన విచారణకు కమ్యూనిస్టు ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చైనా తయారు చేస్తున్న వివిధ టీకాల సమర్థత కు సంబంధించి డేటాను బహిర్గతం చేయడం లేదు. క్లినికల్ ట్రయల్స్‌లో పారదర్శకత, ప్రమాణాలు పాటించడం లేదు. ఇటువంటి చర్యలతో చైనా పౌరులతోపాటు ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది’అని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. లక్షలాది మరణాలకు, కోట్లాదిగా ప్రజల జీవనోపాధి దెబ్బతినేందుకు కారణమైన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై పారదర్శకంగా వ్యవహరించేలా చైనాపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేయాలన్నారు. -
చైనా గుట్టు రట్టు చేసిన ‘వుహాన్ ఫైల్స్’
బీజింగ్: కరోనా వైరస్ ప్రపంచాన్నిగడగడలాడిస్తోంది. మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అభివృద్ధి మరో పదేళ్ల వెనక్కి వెళ్లింది. వైరస్ గురించి తెలిసిన నాటి నుంచి పలు దేశాలు చైనాలోనే ఈ వైరస్ జన్మించిందని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే కరోనా విషయంలో చైనాని, డబ్ల్యూహెచ్ఓని బాధ్యులను చేస్తూ.. అవకాశం దొరికిన ప్రతి సారి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నుంచి బయటపడటం కోసం నాలుగు రోజుల క్రితం చైనా ఓ కట్టు కథని ప్రచారంలోకి తెచ్చింది. భారత్‌లోనే కరోనా వైరస్ జన్మించిందని.. అక్కడ నుంచి వచ్చిన వస్తువుల మీద వైరస్‌ని గుర్తించామని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఈ ఆరోపణలను ఏ దేశం సీరియస్‌గా తీసుకోలేదు. పైగా చైనా ఆరోపణలు అవాస్తవాలు అని తెలిపే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ‘వుహాన్ ఫైల్స్’ పేరుతో తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ అంతర్గత పత్రాలు సీఎన్‌సీఎన్ చేతికి చిక్కాయి. 177 పేజీల ఈ డాక్యుమెంట్ మీద ‘అంతర్గత పత్రాలు.. రహస్యంగా ఉంచండి’ అని ఉంది. ఇక దీని ప్రకారం స్థానిక హుబే ప్రాంతంలో తొలుత వైరస్ వెలుగు చూసింది. ఫిబ్రవరి 10 నాటికి ఇక్కడ 5,918 కేసులు నమోదయ్యాయి. అయితే అదే రోజున చైనా అధ్యక్షుడు తమ దేశంలో నమోదైన కేసుల సంఖ్యను ఇందులో సగానికి సగం తగ్గించి చెప్పడం గమనార్హం. (చదవండి: ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌కి చైనా టీకా ) ఇక ఈ ఫైల్స్‌లో డిసెంబర్ 2019, ప్రారంభంలోనే గుర్తు తెలయని ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి మొదలైనట్లు, అయితే.. దీని గురించి ఎక్కడ ఎలాంటి సమాచారం బయటకు వెల్లడించలేదని ఈ వుహాన్ ఫైల్స్‌లో ఉంది. 2019 అక్టోబర్ నుంచి 2020 ఏప్రిల్ వరకు హుబేలో వైరస్‌ని కట్టడి చేయడం కోసం ఈ ప్రాంతం చేస్తున్న పోరాటాన్ని ఈ ఫైల్స్ వెల్లడించాయి. ఇదే సమయంలో కరోనా ప్రపంచం అంతా విస్తరించింది. ఇక హుబే ప్రావిన్షియల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నుంచి వచ్చిన అంతర్గత పత్రాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదికను ఆరుగురు నిపుణులు ధ్రువీకరించారు. అంతేకాక చైనా ప్రభుత్వం కేసుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పాజిటివ్ వచ్చినప్పటికి నెగిటివ్ అంటూ తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్లు ఈ నివేదక వెల్లడించింది. అంతేకాక జనవరి 10 వరకు కేసుల గురించి ఎలాంటి వివరాలను బయటకు వెల్లడికానివ్వలేదు. ఇక దీని గురించి శాస్త్రవేత్తలు జారీ చేసిన హెచ్చరికలను చైనా ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని నివేదిక తెలిపింది. (చదవండి: కరోనాపై చైనా మరో కథ) అంతేకాక గతేడాది డిసెంబరులో వుహాన్ హుబే ప్రాంతంలో తొలి కరోనా కేసులు వెలుగు చూసాయి. ఆ తర్వాత మహమ్మారి ప్రపంచం అంతటా వ్యాపించింది. ఇప్పటి వరకు 63.2 మిలియన్ల మందికి పైగా కోవిడ్ బారిన పడగా.. 1.45 మిలియన్ల మందికి పైగా మరణించారు. కరోనా వైరస్‌కు సంబంధించిన ఆధారాలను కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నిస్తుందటూ ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న ఊహాగానాలకు ఈ నివేదికతో బలం చేకూరినట్లయ్యింది. అయితే ఇప్పటివరకు కూడా వైరస్ ఎక్కడ పుట్టిందనే దానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం మాత్రం లభించలేదు. కానీ జంతు విక్రయాలు జరిపే వుహాన్ వెట్ మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి ప్రారంభమైనట్లు మెజారిటీ దేశాలు భావిస్తున్నాయి. పేషెంట్లందరిలో మార్కెట్‌కు చెందిన ఓ సాధారణ వైరస్ లక్షణాలు కనిపించాయి. కానీ జనవరి వరకు దీన్ని అంటువ్యాధిగా భావించలేదు. ఇటీవల చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్ 2019 వేసవిలో భారత్‌లోనే జన్మించిందని.. అక్కడి నుంచే ప్రపంచం అంతా వ్యాపించిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక అమెరికాతో పాటు ఇతర ప్రపంచదేశాలు తనపై చేస్తోన్నఆరోపణలన్నింటిని చైనా ఖండిస్తోన్న సంగతి తెలిసిందే. -
‘అప్పుడే నేను మరణించాను’
బీజింగ్: కోవిడ్ మహమ్మారి విజృంభణ మొదలై ఇప్పటికే ఏడాది పూర్తయ్యింది. ఎన్నో కుటుంబాల్లో కడుపుకోత మిగిల్చింది మహమ్మారి. నేటికి కూడా చాలా మంది ఆ బాధ నుంచి బయట పడలేకపోతున్నారు. ప్రేమించిన వారు దూరమవ్వడంతో వారిని మర్చిపోలేక.. ఒంటరిగా బతకలేక నరకం అనుభవిస్తున్నారు. వుహాన్ వాసి లియు పే తండ్రి కరోనా బారిన పడి మరణించాడు. తండ్రి చనిపోయిన నాటి నుంచి అతడు ఒంటరితనం అనుభవిస్తున్నాడు. ఇన్నాళ్లు లియు పేతో కలిసిన తిరిగిన స్నేహితులు, బంధువులు ప్రస్తుతం అతడిని తప్పించుకుతిరుగుతున్నారు. కారణం అతడి తండ్రి కరోనాతో చనిపోవడంతో.. లియుని కలవడం.. ఇంటికి ఆహ్వానించడం వంటివి చేస్తే.. తమకి కూడా ఇన్ఫెక్షన్ సోకుతుందనే అనుమానంతో వారు లియుకి దూరంగా ఉంటున్నారు. తండ్రి దూరమయ్యాడు.. బంధువులు, స్నేహితులు ఆదరించడం లేదు. దాంతో జీవితం పట్ల ఒక లాంటి నిర్లిప్తత భావం ఏర్పరుచుకున్నాడు లియు. ఇన్నాళ్ల నుంచి తాను చేస్తోన్న వ్యాపారాన్ని వదులుకున్నాడు. బుద్ధిజంలోకి మారాలని భావిస్తున్నాడు. కరోనా వైరస్ విజృంభణ మొదలై ఇప్పటికే ఏడాది పూర్తయ్యింది. మహమ్మారి వ్యాప్తి వుహాన్ నుంచి ప్రారంభమైంది. అయితే మొదట చైనా అధికారులు వైరస్ గురించి ఎలాంటి సమాచారాన్ని బయటకు రానివ్వలేదు. అన్నింటి కంటే ముఖ్యమైనది ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తిస్తుందనే విషయాన్ని దాచి పెట్టారు. దాంతో వుహాన్ వ్యప్తంగా దాదాపు 4 వేల మంది కోవిడ్ బారిన పడి మరణించారు. లియు పే తండ్రి కూడా కరోనా వైరస్ బారిన పడి చనిపోయాడు. లియు పే తండ్రి లియు ఓకింగ్ రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి కరోనా వైరస్‌గా నిర్థారించారు. అయితే మొదట్లో మహమ్మారి తీవ్రత గురించి తెలియకపోవడంతో.. ప్రభుత్వ సిబ్బంది.. ఆస్పత్రి యాజమాన్యం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఈ ఏడాది జనవరి 29న అతడు మరణించాడు. అదే రోజున తాను మరణించానంటున్నాడు లియు పే. ఇక తండ్రి మరణం తర్వాత తాను పిచ్చివాడిగా మారిపోయానన్నాడు. వైరస్ గురించి ప్రభుత్వం దాచి పెట్టడం వల్లే తాను తండ్రితో పాటు జీవితాన్ని కోల్పోయానని ఆవేదనం వ్యక్తం చేస్తున్నాడు. చైనా ప్రభుత్వం మీద తనకు ఎంతో కోపంగా ఉండేదని.. ఒకానొక సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలని భావించానని తెలిపాడు లియు. (చదవండి: కరోనాపై చైనా మరో కథ) లియు పేతో పాటు చాలా మంది వుహాన్ వాసులు సోషల్ మీడియా వేదికగా జిన్ పింగ్ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదం వల్ల తాము కుటుంబ సభ్యులను కోల్పోయి నరకం అనుభవిస్తున్నామని ఆరోపించారు. ఇక తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన లియు పే.. తన బాధను ఎవరు పట్టించుకోరు అని అర్థం చేసుకున్న తర్వాత తన కోపాన్ని బౌద్ధ మతం వైపు మళ్లించాడు. మందు, మాంసం, ఆల్కహాల్‌ను వదిలేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంతో తనకున్న సంబంధాలన్నింటిని తెంచుకున్నాడు. వ్యాపారన్ని కూడా త్యజించి.. బౌద్ధంలోకి మారాడు. ఇప్పడతని దృష్టిలో డబ్బుకి ఏ మాత్రం విలువలేదు. ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న లియు జీవిత రహస్యం తెలుసుకునే పనిలో ఉన్నాడు. (చదవండి: యుద్ధం చేయకపోతే 20 లక్షల మంది బలి) ఇక ప్రస్తుతం వుహాన్‌లో కరోనా కేసులు ఏవి వెలుగు చూడనప్పటికి జనాల్లో మాత్రం భయం పోవడం లేదు. గతంలో వైరస్ బారిన పడి.. కోలుకున్న వారితో మాట్లాడాలంటే సందేహిస్తున్నారు జనాలు. వారితో కలవడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యే వివాదాలు తలెత్తుతున్నాయి. వుహాన్‌కు చెందిన 36 ఏళ్ల యువతి తన తండ్రిని కోల్పోయింది. ఆ బాధ నుంచి కోలుకోలేకపోతుంది. ఇక వైరస్ గురించి.. చైనా ప్రభుత్వం దాన్ని కప్పిపెట్టిన విధానం గురించి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. బంధువులు, స్నేహితులు తనను దూరం పెట్టారనివాపోయింది. ‘జీవితం కొనసాగుతుంది.. కానీ అది మిగిల్చిన గాయాల తడి అలానే ఉంటుంది’. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. -
గతేడాది కరోనా.. ఇప్పుడు బ్రూసోల్లోసిస్
బీజింగ్: కరోనా వైరస్ ఈ ప్రపంచంలోకి ప్రవేశించి దాదాపు ఏడాది కావాస్తోంది. వుహాన్ ల్యాబ్ నుంచి బయటపడిందని భావిస్తున్న ఈ మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఇన్ఫెక్షన్ వెలుగులోకి వచ్చింది. చైనాలోని గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్‌జౌలో 6,000 మందికి పైగా బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి పాజిటివ్ వచ్చినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఇది కూడా స్థానికంగా ఉన్న ఓ వ్యాక్సిన్ ప్లాంట్ నుంచే ఏడాది క్రితం లీకైనట్లు సమాచారం. ఈ క్రమంలో లాన్జౌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణంలోని 55,725కి పరీక్షలు చేశాం. వీరిలో 6,620 మందికి పాజిటివ్‌గా తేలింది’ అని తెలిపారు. పశువుల మీద ఉండే బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 14 నాటికి కేసుల సంఖ్య 3,245 ఉండగా.. ప్రస్తుతం 6000 పైగా నమోదయ్యాయి. బ్రూసెల్లోసిస్ లక్షణాలు జంతువులతో ప్రత్యక్ష సంబంధం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, త్రాగటం ద్వారా లేదా గాలిలో ఉండే ఏజెంట్లను పీల్చడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో కూడా ఫ్లూలో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు దీర్ఘకాలికంగా మారి.. ఇక ఎన్నటికి తగ్గకపోవచ్చు అని వైద్యులు తెలిపారు. ఈ మేరకు లాన్జౌ హెల్త్ కమిషన్ సెప్టెంబర్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. (చదవండి: సెకండ్ వేవ్.. తస్మాత్ జాగ్రత్త! ) చైనా యానిమల్ హస్బండ్రీ ఇండస్ట్రీ కో యాజమాన్యంలోని బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి ఇది బయటకు వచ్చిందని ప్రకటనలో తెలిపింది. ‘కంపెనీ గత ఏడాది జూలై నుంచి ఆగస్టు మధ్యలో బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ల తయారీకి గడువు ముగిసిన క్రిమిసంహారక మందులను ఉపయోగించింది. ఆ తరువాత బ్యాక్టిరియాను కలుషితమైన వ్యర్థ వాయువులో వదిలివేయడంతో అవి ఏరోసోల్స్‌ని ఏర్పాటు చేశాయి. ఆ తరువాత గాలి ద్వారా అవి లాన్జౌ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిసర ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. దాంతో మొదటి సారి గత ఏడాది నవంబర్‌లో ఇక్కడ బ్రూసెల్లోసిస్ వ్యాప్తి వెలుగులోకి వచ్చింది’ అని ఆరోగ్య కమిషన్ తెలిపింది. గ్లోబల్ టైమ్స్ ప్రకారం, బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వర్క్‌షాప్‌ను గత ఏడాది డిసెంబర్లో మూసివేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో దీనిని కూల్చివేశారు.(చదవండి: పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది..) విదేశీ విమానాలపై బ్యాన్ వందేభారత్ మిషన్‌లో భాగాంగా తాజాగా భారత్ నుంచి చైనాకు వెళ్లిన ఎయిరిండియా విమానంలో 19 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. నిషేధం తాత్కలికమేనని.. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని చైనా ప్రకటించింది. -
చైనా వెళ్లిన భారతీయుల్లో 19 మందికి పాజిటివ్
బీజింగ్: వందే భారత్ మిషన్(వీబీఎం)లో భాగంగా ఢిల్లీ నుంచి చైనా సెంట్రల్ సిటీ వుహాన్కి వెళ్లిన ఏయిరిండియా విమానంలో 19 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో త్వరలో చైనా వెళ్లబోయే విమనాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. విమానంలోని మొత్తం 277 మంది ప్రయాణికుల్లో 39 మందికి చాలా తక్కువ లక్షణాలున్నట్లు తెలిసింది. వీరంతా గతంలో కోవిడ్ బారిన పడి కోలుకున్నట్లు సమాచారం. వీరిలో యాంటీబాడీలను కూడా గుర్తించారు. మొత్తం 58 మంది ప్రయాణికులను కోవిడ్-19 ఆస్పత్రులకు, క్వారంటైన్ల సెంటర్లకు తరలించారు. మిగిలిన ప్రయాణీకులు ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్లో భాగంగా ప్రభుత్వం సూచించిన హోటళ్లలో ఉన్నారు. ఇక ఇండియా నుంచి చైనా వెళ్లిన వందే భారత్ మిషన్‌లో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. (చదవండి: చైనాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన) ఇక శుక్రవారం చైనా చేరుకున్న విమానం ఆరవ వీబీఎం ఎయిర్ ఇండియా విమానం. ఇంకా 1500 మంది భారతీయులు చైనా వెళ్లడం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నేడు వీబీఎం విమానంలో పెద్ద మొత్తంలో కోవిడ్ కేసులు వెలుగు చూడటంతో నెలాఖరులో వుహాన్‌కు వెళ్లబోయే విమానాన్ని వాయిదా వేయడానికి దారితీయవచ్చు. ఇక నవంబరులో మరో విమానం పంపేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇండియా చైనాకు లేఖ రాసింది. కానీ ఇంకా స్పందన రాలేదు. అయితే అనుమతి పొందడం అంత సులభం కాదు. తూర్పు చైనా జెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింగ్బోలోని అధికారులు సెప్టెంబర్ 11 న మొదటి విమానంలో పాజిటివ్ రావటంతో రెండవ వీబీఎం విమానానికి అనుమతి నిరాకరించారు. (చదవండి: మహమ్మారి గురించి మీకేం తెలుసు!?) ఇక సెప్టెంబర్ 14న న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఇండియా నుంచి చైనా వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా డబుల్ యాసిడ్ టెస్ట్‌లు చేయించుకోవాల్సిందిగా ఆదేశించింది. ప్రయాణానికి 120 గంటల ముందు ఒకసారి.. తర్వాతిది 36 గంటలకు మరొక సారి తప్పక టెస్ట్‌లు చేయించుకోవాలని ఆదేశించారు. అది కూడా ఐసీఎంఆర్ ల్యాబ్‌ల్లో మాత్రమే అని తెలిపారు. -
కరోనాపై సీడీసీ వైఫల్యం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచం నుంచి స్మాల్ పాక్స్ (తట్టు), అమెరికాలో పోలియోను సమూలంగా నిర్మూలించి ప్రజారోగ్య వ్యవస్థలో స్వర్ణ ప్రమాణంగా నిలిచి ప్రపంచ దేశాల నీరాజనాలందుకున్న అమెరికాలోని ‘సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)’ సంస్థ నేడు కరోనా కట్టడి విషయంలో అబాసుపాలయింది. అమెరికాలో నేటికి కరోనా కేసులు దాదాపు 94 లక్షలకు చేరుకోగా మతుల సంఖ్య 2,35,000లకు చేరుకుంది. అట్లాంటా కేంద్రంగా పని చేస్తోన్న సీడీసీ ఈసారి ఎందుకు విఫలమైంది ? అందుకు బాధ్యులెవరు? సీడీసీలో 30 ఏళ్ల అనుభవం కలిగిన ప్రముఖ అంటు రోగాల నిపుణులు జాయ్ బట్లర్ ఏం చేస్తున్నారు? అంటు రోగాల ఆటకట్టించడంతోపాటు వాటి మూలాలను కనిపెట్టడంలో డెటిక్టివ్ తెలివి తేటలు కలిగిన బట్లర్ సేవలు ఎందుకు అందుబాటులో లేవు ? అమెరికాపై ఆంథ్రాక్స్ దాడి దర్యాప్తులో ఎఫ్‌బీఐ ఆయన అందించిన సహకారం, హెచ్1ఎన్1 ఫ్లూకు వ్యాక్సిన్ పంపిణీలో ఆయన సేవలు మరువ లేనివి. అలాంటి వ్యక్తి సీడీసీకి అందుబాటులో ఉండగా, కరోనా వైరస్ కట్టలుతెంచుకొని ఎందుకు విజంభిస్తోంది ? 74 ఏళ్ల సీడీసీ చరిత్రలో 2020 సంవత్సరం ఒక్కటే చీకటి అధ్యాయంగా సీడీసీ వర్గాలే చెబుతున్నాయంటే అందుకు బాధ్యులెవరు? (9 లక్షల వైరస్లు మానవులపై దాడి!) తమ కార్యకలాపాల్లో అణువణువున దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం జోక్యం చేసుకోవడం వల్లనే కరోనా వైరస్‌ను నిలువరించడంలో సీడీసీ ఏం చేయలేక చేతులెత్తేయాల్సి వచ్చిందని బట్లర్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో, వాటిని ఎత్తివేయడంలో సీడీసీ నిర్దేశించిన ప్రమాణాలను, ప్రతిపాదనలను అధ్యక్ష భవనం పూర్తిగా కాలరాసిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి నిబంధనలు లేకుండానే దేశంలోని ప్రార్థనా మందిరాలన్నింటినీ తెరచుకునేందుకు అధ్యక్ష భవనం అనుమతించిందని ఆరోపించాయి. (కరోనా వైరస్ మలి దశ పంజా!) కరోనా వైరస్ పట్ల మొదటి నుంచి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తు వచ్చినా ట్రంప్ ప్రవర్తనను, తాము వ్యక్తిగత వ్యవహారమని సరిపెట్టుకున్నామని, అదే చివరికి దేశం పాలిట ప్రాణాంతకం అవుతుందని భావించలేదని సీడీసీ వర్గాలు పేర్కొన్నాయి. ‘కరోనా నన్నేమీ చేయలేదు’ అంటూ మొదటి నుంచి మాస్క్ కూడా ధరించని ట్రంప్, చివరకు తనతోపాటు భార్యకు కూడా కరోనా రావడంతో తొలి సారిగా మాస్క్ ధరించిన విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం సీడీసీ డైరెక్టర్‌గా ట్రంప్ నియమించిన రాబర్ట్ రెడ్ ఫీల్డ్, ఆఫీసు రాకుండా రోజు అధ్యక్ష భవనంకు వెళ్లి అక్కడ హాజరు వేయించుకునేవారనే విమర్శలు కూడా గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. చైనాలోని వూహాన్ నగరంలో కొత్త రకం నిమోనియా కేసులు వచ్చిన విషయాన్ని చైనా తర్వాత గుర్తించిన శాస్త్రవేత్తల్లో సీడీసీ సీనియర్ శాస్త్రవేత్త అన్నే షూచాట్ ఒకరు. 2003లో సార్స్ మూలాలను కనుగొనేందుకు ఆమె చైనా వెళ్లారు. అంటు రోగాలపై ప్రజాదరణ పొందిన ‘కంటేజియస్’ హాలివుడ్ చిత్రంలో కేట్ విన్సిలేట్ పాత్రకు అన్నే షూచాట్యే స్ఫూర్తి. వుహాన్‌లో అంతు చిక్కని నిమోనియా కేసులను పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ 2019, డిసెంబర్ 31 ఉదయం 8.25 గంటలకు బట్లర్‌తోపాటు ఇతర సహచరులకు షూచాట్ ఈ మెయిల్ పంపించారు. (నేను సూపర్ మ్యాన్‌ను: ట్రంప్) ఆ తర్వాత వారంతా సమావేశమై కొత్త వైరస్ గురించి చర్చించారు. అప్పటికే చైనాలో 27 కేసులు బయట పడినట్లు గుర్తించారు. దేశాధ్యక్ష భవనాన్ని కూడా హెచ్చరించారు. అధ్యక్ష భవనం వారిని పట్టించుకోక పోవడమే కాకుండా, దాన్నో రాజకీయ వ్యవహారంగా చూసింది. పర్యవసానమే సీడీసీ వైఫల్యమని బట్లర్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను, విమర్శలను సీడీసీని పర్యవేక్షించే ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్’ అధికార ప్రతినిధి ఖండించారు. -
కరోనా చికిత్సతో నీలి రంగులోకి శరీరం.. తర్వాత..
బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా కరనా వైరస్ బారిన పడి ప్రజలు లక్షల్లో మరణించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో కరోనా రోగులకు వైద్యం అందిస్తూ వైద్యులు సైతం మహామ్మారికి బలైపోయారు. ఈ నేపథ్యంలో చైనాలోని వుహాన్‌కు చెందిన ఓ డాక్టర్ కోవిడ్ బారిన పడి మరణించగా మరికొంతమంది కోలుకుని తిరిగి పూర్వ స్థితికి చేరుకున్నారు. అదే విధంగా యీ ఫాన్ అనే హృద్రోగ నిపుణుడు కోవిడ్-19 బాధితులకు వైద్యం అందిస్తూ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఆయన 39 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సలో పోందారు. ఈ క్రమంలో ఆయన శరీరం నీలి రంగులోకి మారిపోయింది. ఆయనను చూసిన వైద్యులందరూ షాక్‌కు గురయ్యారు. చివరకు యాంటిబయాటిక్స్ మందుల వల్ల శరీరం నీలి రంగులోకి మారినట్లు గుర్తించారు. డాక్టర్ యీ ఫాన్ కూడా ఈ రంగు శాశ్వతంగా ఉండిపోతుందని భయాందోళనకు గురయ్యారు .(చదవండి: మళ్లీ లాక్డౌన్ దిశగా యూరప్ దేశాలు) ఆయన కోలుకుని డాశ్చార్జ్ అయిన అనంతరం కొన్ని నెలల తర్వాత డాక్టర్ తన మునుపటి రంగును తిరిగి పొందారు. దీంతో ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘కరోనా చికిత్సలో భాగంగా ఎక్కువ మోతాదులో యాంటిబయాటిక్స్ తీసుకోవడం వల్ల నా శరీరం డార్క్ బ్లూలోకి మారింది. అదే రంగు నాకు శాశ్వతంగా ఉండిపోతుందని ఆందోళన పడ్డాను. కానీ కోలుకున్న అనంతరం కొన్ని నెలల తర్వాత నా మునుపటి రంగును పొందాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారి చాలా ప్రమాదకరం’ అని ఆయన హెచ్చరించారు. (చదవండి: నవంబర్ 30 వరకూ అన్‌లాక్ 5.0 పొడిగింపు) -
మళ్లీ లాక్డౌన్ దిశగా యూరప్ దేశాలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనా విజృంభణ కొనసాగుతోంది. కంటికి కనిపించని ఆ వైరస్ సోకిన వారి సంఖ్య ఆదివారం నాలుగు కోట్లకు చేరింది. ఇప్పటిదాకా దీని బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 3 కోట్లు మించిపోగా, మృతి చెందిన వారి సంఖ్య 11 లక్షలు దాటింది. పది నెలల కాలంలోనే ఒక వైరస్ 200 పైగా దేశాల్లో నాలుగు కోట్ల మందికి సోకడం చరిత్రలో ఇదే తొలిసారి. అగ్రరాజ్యం అమెరికా అత్యధిక కేసులతో ముందుంటే ఆ తర్వాత స్థానం భారత్‌దే. బ్రెజిల్, రష్యా, స్పెయిన్ దేశాలు ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. గత ఏడాది చైనాలోని వూహాన్లో బట్టబయలైన కరోనా వైరస్ జన్యుపరంగా అధికంగా మార్పులు చెందుతూ వస్తోంది. దీంతో ఈ వైరస్‌కి వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే కరోనా జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో చాలా దేశాలు విజయవంతమయ్యాయి. అయినప్పటికీ ఆర్థిక రంగం, ఆరోగ్య రంగం మధ్య సమతుల్యత పాటించడంలోనూ, కలసికట్టుగా వైరస్‌పై పోరాడడంలోనూ ప్రపంచదేశాలు విఫలం అవుతున్నాయని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది దారిద్య్రరేఖ దిగువకి వెళ్లిపోయారని ప్రభుత్వాలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కేసుల్లోనే కాక మరణాల్లో కూడా అగ్రరాజ్యం అమెరికా పట్టికలో అగ్రభాగాన ఉంది. ఆ దేశంలో వైరస్ సోకిన ప్రతీ అయిదుగురిలో ఒకరు మరణించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. యూరప్‌లో సెకండ్ వేవ్ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్టే పట్టి యూరప్ దేశాల్లో మళ్లీ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. చలికాలంలో ఆ ప్రాంతంలో వైరస్ రెట్టింపు వేగంతో విజృంభిస్తోంది. యూకే, రష్యా, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, ఫ్రాన్స్, బెల్జియం, తదితర దేశాల్లో కొత్తగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. యూకేలో ఏకంగా 40శాతం కేసులు పెరిగిపోయాయి. ఈ శీతాకాలంలో లక్షా 20 వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటారని ఒక అంచనా. యూరప్ వ్యాప్తంగా సగటున రోజుకి లక్షా 50 వేల కేసులు నమోదవుతుంటే, ఒక్కో దేశంలో రోజుకి సగటున 7 వేల నుంచి 15 వేల వరకు కేసులు నమోదు కావడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో చాలా దేశాలు మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. లండన్, పారిస్ మహా నగరాల్లో కోవిడ్ ఆంక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు 4 లక్షల కేసులు నమోదు కావడంతో పాత రికార్డులన్నీ చెరిగిపోయాయి. చెక్ రిపబ్లిక్ కరోనాని జయించామన్న ఉత్సాహంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసింది. దీంతో అక్కడ కరోనా మళ్లీ విజృంభించి ప్రతీ లక్ష మందిలోనూ 400 మందికి వైరస్ సోకుతోంది. కరోనా ప్రభావం ఇలా.. ► కరోనా వైరస్ తగ్గిపోయాక కూడా శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. రెస్పిరేటర్ మెడ్‌ఆర్‌విక్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో వైరస్ తగ్గిన నాలుగు నెలల తర్వాత కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది. ► నిస్సత్తువ, కండరాల నొప్పులు, తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి శీతలీకరణ పదార్థాల ప్యాకేజీతోనూ కరోనా.. శీతలీకరించిన ఆహార పదార్థాలతోనూ కరోనా వ్యాపిస్తుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెల్లడించింది. ఇలా ఆహార పదార్థాల ప్యాకేజీతో కరోనా సోకుతుందని తేలడం ఇదే తొలిసారి. శీతలీకరించిన ఆహార పదార్థాలు వైరస్‌తో కలుషితమైతే వాటి ద్వారా కరోనా సోకుతుందని ప్రకటించిన చైనా 19 దేశాలకు చెందిన 56 కంపెనీల ఫ్రోజెన్ ఫుడ్ దిగుమతులపై నిషేధం విధించింది. గత వారం చైనా పోర్ట్ సిటీ కింగ్డావోలో కరోనా కేసులు వెలుగులోకి రావడానికి నౌకల్లో ఉన్న వారికి ఫుడ్ ప్యాకెట్ల ద్వారా వైరస్ సోకడమే కారణమని చైనా వివరించింది. అయితే మంచుతో గడ్డకట్టే ఆహార పదార్థాల్లో నిర్జీవంగా మారిపోయే వైరస్ నుంచి సోకే అవకాశం లేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. -
యుద్ధం చేయకపోతే 20 లక్షల మంది బలి
జెనీవా: కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు కలసికట్టుగా యుద్ధం చేయకపోతే 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. కరోనా వైరస్ చైనాలో వూహాన్లో ప్రబలిన తొమ్మిది నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలతో పాటు పౌరులు వ్యక్తిగత స్థాయిలో కరోనాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ అన్నారు. కరోనా తగ్గుముఖం పడుతోందన్న సూచనలు ఎక్కడా లేవని అభిప్రాయపడ్డారు. సింగిల్ డోసుతో యాంటీబాడీస్ ఒకే ఒక్క డోసుతో కోవిడ్ నుంచి రక్షణ కోసం అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌తో ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయి. ఏడీ26, కావ్2 ఎస్ అనే ఈ వ్యాక్సిన్‌తో యాంటీ బాడీలు అత్యధికంగా ఉత్పత్తి అయినట్టుగా ఆ సంస్థ తన మధ్యంతర నివేదికలో వెల్లడించింది. కరోనా నుంచి రక్షణ పొందాలంటే ఇప్పటివరకు అభివృద్ధిలో ఉన్న వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జాన్సన్ అండ్ జాన్సన్ పంపిణీని సులభతరం చేయడానికి ఒకే డోసుతో ప్రయోగాలు చేస్తోంది. అమెరికా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ వంటి దేశాలకు చెందిన 60 వేల మందికి ఈ వ్యాక్సిన్ డోసుల్ని ఇస్తున్నట్టుగా సంస్థ వెల్లడించింది. ఇష్టారాజ్యంగా చైనా వ్యాక్సిన్ వినియోగం కరోనా వ్యాక్సిన్‌ను చైనా అత్యవసరంగా అందుబాటులోకి తెచ్చి ఇష్టారాజ్యంగా రెండో డోసుల్ని ఇచ్చేస్తోంది. దీంతో చైనాలో ప్రజలపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి. శాస్త్రవేత్తల ఆందోళనల్ని లెక్క చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థ సినోఫార్మ్ ఇప్పటికే 3 లక్షల 50 వేల మందికి వ్యాక్సిన్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరో కంపెనీ సినోవాక్ తమ ఉద్యోగుల్లో 90శాతం మందికి బలవంతంగా వ్యాక్సిన్లు ఇచ్చింది. -
మహమ్మారి గురించి మీకేం తెలుసు!?
న్యూఢిల్లీ: గత 9 నెలలుగా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటివరకు 9,88,576 మంది ప్రాణాలను బలితీసుకుంది. సుమారు 75 లక్షల మంది వైరస్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వారిలో 63,402 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న తమవారు ప్రాణాలతో తిరిగిరావాలని కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక కంటికి కనిపించని కరోనా వైరస్ దెబ్బతో ఇదీ అదీ అని కాకుండా అన్ని దేశాలు తీవ్ర ఆర్థిక, ప్రాణ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈక్రమంలో చైనాలోని వుహాన్ నగరంలో ఓ ల్యాబ్ నుంచి పుట్టుకొచ్చినట్టు భావిస్తున్న కోవిడ్‌కు సంబంధించిన కొన్ని కీలక విషయాలపై మీకో క్విజ్! (చదవండి: త్వరలో రష్యా ప్రజలకు కరోనా టీకా) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1421317465.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1431317465.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1441317465.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1451317465.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కరోనా: డబ్ల్యూహెచ్‌వో కవర్ చేసింది
బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లోనే తయారయ్యిందంటూ సంచలన ప్రకటన చేసిన చైనా వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి చైనా ప్రభుత్వానికి తెలుసన్న యాన్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కవర్ చేయడానికి తెగ ప్రయత్నించిందని ఆరోపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాన్ మాట్లాడుతూ.. ‘ఈ వైరస్‌ను వూహాన్ ల్యాబ్‌లో సృష్టించారు. దీని వ్యాప్తి గురించి చైనాకు ముందే తెలుసు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాపై నింద పడకుండా కవర్ చేయడానికి తెగ ప్రయత్నించింది. ఈ విషయాన్ని నిరూపించడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను ఈ విషయాలను వెల్లడించడంతో చైనా ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా నన్ను బెదిరించాలని చూస్తోంది. నా కుటుంబాన్ని భయపెట్టడమేకాక.. నా మీద సైబర్ దాడులు చేయడానికి ప్రయత్నిస్తుంది’ అన్నారు. (చదవండి: కరోనా పుట్టిల్లు వూహాన్ ప్రయోగశాలే) అంతేకాక ‘ఈ వైరస్ ఫుడ్ మార్కెట్ నుంచి కాక ల్యాబ్ నుంచి వచ్చింది. అందుకు నా దగ్గర ఆధారాలున్నాయి. చైనా ప్రభుత్వం దీన్ని ఎందుకు సృష్టించిందో.. ఎందుకు బయటకు వదిలిందో ప్రజలకు తెలపాలనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఆధారాలు ఎవరైనా అర్థం చేసుకోగలరు. వైరస్ జన్యుశ్రేణి మానవవేలిముద్రలాగా ఉంటుంది’ అని యాన్ తెలిపారు. వూహాన్లో కొత్తగా న్యూమోనియా ప్రబలడంపై విచారించాల్సిందిగా తనని ప్రభుత్వం కోరిందనీ, ఆ విచారణలో భాగంగా ఈ వైరస్‌ను దాచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలు తన దృష్టికి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈమె హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వైరాలజీ, ఇమ్యునాలజీలో శాస్త్రవేత్త. డిసెంబర్– జనవరిలో తొలిసారి, జనవరి మధ్యలో మరోమారు డాక్టర్ లీ మెంగ్ చైనాలో న్యూమోనియాపై రెండు పరిశోధనలు చేశారు.(చదవండి: ఐరాసను సంస్కరించాల్సిన తరుణమిదే!) తరువాత యాన్ హాంకాంగ్ నుంచి అమెరికా పారిపోయారు. తన సూపర్వైజర్ అయిన డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌తో ఈ విషయం చెప్పాలని భావించాననీ, కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని ఆమె తెలిపారు. తన పరిధి దాటి వ్యవహరించడం సరికాదని, లేదంటే తాను అదృశ్యమవడం ఖాయమని, అంతా తనను హెచ్చరించినట్టు ఆమె వెల్లడించారు. ఆమె ట్విట్టర్ అకౌంట్‌ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
కరోనా పుట్టిల్లు వూహాన్ ప్రయోగశాలే
లండన్: ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న కరోనా వైరస్ పుట్టింది వూహాన్‌లోని ప్రభుత్వ ప్రయోగశాలలోనేనని చైనాకి చెందిన వైరాలజిస్టు సంచలన విషయాన్ని బయటపెట్టారు. దీనికి తన వద్ద శాస్త్రీయ ఆధారాలున్నాయని ఆమె వెల్లడించారు. బ్రిటిష్ టాక్ షో ‘లూస్ వుమన్’ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమంలో డాక్టర్ లి–మెంగ్ యాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వూహాన్లో కొత్తగా న్యూమోనియా ప్రబలడంపై విచారించాల్సిందిగా తనని ప్రభుత్వం కోరిందనీ, ఆ విచారణలో భాగంగా ఈ వైరస్‌ను దాచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలు తన దృష్టికి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈమె హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వైరాలజీ, ఇమ్యునాలజీలో శాస్త్రవేత్త. డిసెంబర్– జనవరిలో తొలిసారి, జనవరి మధ్యలో మరోమారు డాక్టర్ లీ –మెంగ్ చైనాలో న్యూమోనియాపై రెండు పరిశోధనలు చేశారు. తరువాత ఆమె హాంకాంగ్ నుంచి అమెరికా పారిపోయారు. తన సూపర్వైజర్ అయిన డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌తో ఈ విషయం చెప్పాలని భావించాననీ, కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని ఆమె తెలిపారు. తన పరిధి దాటి వ్యవహరించడం సరికాదని, లేదంటే తాను అదృశ్యమవడం ఖాయమని, అంతా తనను హెచ్చరించినట్టు ఆమె వెల్లడించారు. కరోనా వైరస్ ప్రకృతి నుంచి రాలేదని, చైనాలో మనిషి నుంచి మనిషికి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని, ఈ వైరస్ తన రూపాన్ని మార్చుకుంటుందని, మహమ్మారిగా విస్తరిస్తుందని, అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ విషయాన్ని బాహ్యప్రపంచానికి తెలియకుండా దాచిందని డాక్టర్ లీ–మెంగ్ తెలిపారు. కొందరు సైంటిస్టులతో కలిసి, దీనిపై రిపోర్టు తయారుచేస్తున్నామని, మొదటి రిపోర్టు విడుదలకు సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచానికి నిజం చెప్పకపోతే తానెంతో విచారించాల్సి ఉంటుందన్నారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఒక ఫౌండేషన్, తాను హాంకాంగ్ వదిలి వెళ్ళడానికి సహకరించినట్టు, ఈ ఫౌండేషన్ చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారికి సహాయం చేస్తుందని ఆమె తెలిపారు. 48 లక్షలు దాటిన కేసులు న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో 92,071 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 48,46,427 కు చేరుకుంది. ఇటీవల రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 1,136 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 79,722కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 37,80,107 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,86,598 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 78 శాతానికి పెరిగినట్లు తెలిపింది. మరణాల రేటు 1.64 శాతానికి పడింది. సెప్టెంబర్ 13 వరకు 5,72,39,428 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. -
‘వుహాన్’ పిల్లులకు కరోనా వైరస్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ పెంపుడు కుక్కలకు, పిల్లులకు సోకుతోందన్న వార్తలు ఆ మధ్యన వెలుగులోకి వచ్చాయి. అయితే మనుషుల నుంచి వాటికి వైరస్ సోకిందా లేదా వాటి నుంచే మనుషులకు వైరస్ సోకిందా ? అన్న వాదనలూ వినిపించాయి. అయితే వాటికి సరైన రుజువులు దొరకలేదు. కరోనా వైరస్ ఆవిర్భవించిన చైనాలోని వుహాన్ పట్టణంలో ప్రజలు పిల్లులను ఎక్కువగా పెంచుకుంటారు. అందుకని అక్కడి పిల్లులపై కోవిడ్ పరీక్షలు జరపాలని హువాఝంగ్ వ్యవసాయ యూనివర్శిటీ పరిశోధకులు నిర్ణయించారు. మూడు యానిమల్ షెల్టర్స్ నుంచి మూడు పెట్ హాస్పిటల్స్ నుంచి కరోనా సోకిన రోగుల ఇళ్ల నుంచి 141 పిల్లులను సేకరించి వాటి నుంచి అన్ని రకాల శాంపిల్స్ తీసి పరీక్షలు జరిపారు. వాటిలో 14.7 శాతం పిల్లుల్లో కరోనా యాంటీ బాడీస్ బయట పడగా, 10.8 శాతం పిల్లుల్లో స్థిరమైన యాంటీ బాడీస్ దొరికాయి. అత్యధిక యాంటీ బాడీస్ ఉన్న మూడు పిల్లులు కరోనా రోగుల ఇంట్ల నుంచి సేకరించినవని పరిశోధకులు తెలిపారు. కరోనా రోగుల్లోకెల్లా వారి నుంచి కరోనా సోకిన పెంపుడు పిల్లుల్లో ఆ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని వారు చెప్పారు. రోగుల నుంచి తుంపర్ల కారణంగానే పెంపుడు పిల్లులకు వైరస్ సోకిందని ల్యాబ్ పరీక్షల్లో తేలిందని, అందుకని పెంపుడు జంతువులతోని కూడా యజమానులు భౌతిక దూరం పాటించాలని పరిశోధకులు సూచించారు. జంతువుల నుంచి జంతువులకు అంటే పిల్లుల నుంచి పిల్లులకు లేదా కుక్కల నుంచి పిల్లులకు ఈ వైరస్ సోకుతుందా, లేదాఅన్న విషయాన్ని తేల్చుకోవాలంటే మరిన్ని పరిశోధనలు అవసరమని వారు చెప్పారు. ఇంతకుముందు అమెరికాలో కూడా 17 పెంపుడు పిల్లులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఈ అధ్యయనంకు సంబంధించిన పూర్తి వివరాలను ‘ఎమర్జింగ్ మ్రైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్’ జర్నల్‌లో ప్రచురించారు. (చదవండి: చెన్నైలో 21.5 శాతం మందికి కోవిడ్-19) -
వేలాది మంది చైనీయుల పార్టీ
-
సర్వ నాశనం చేసి ఎంజాయ్ చేస్తున్నారా?
వూహాన్: ఫేస్ మాస్కు ధరించైనా సరే, బయటకు వెళ్లాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. అలాంటిది పార్టీ అంటే.. ఎందుకొచ్చిన గొడవ! మళ్లీ ఎక్కడ ఆ వైరస్ అంటుతుందోనని జనాలు రద్దీగా ఉండే ఏ కార్యక్రమానికైనా సరే వెళ్లేది లేదని తేల్చి చెప్తున్నారు. మన దగ్గరే ఇలా ఉంటే కరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలోని వూహాన్లో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? కానీ అక్కడ అలాంటి భయాలేవీ కనిపించడం లేదు. అందుకు పైన కనిపిస్తున్న ఫొటోనే నిదర్శనం. వూహాన్‌లోని మాయా బీచ్ పార్క్‌లో ఆదివారం విద్యుత్ వెలుగుల మ్యూజిక్ పార్టీ జరిగింది. అనేకమంది నీళ్లలో ఆటలాడుతూ, భౌతిక దూరాన్ని బుగ్గి చేస్తూ, ఫేస్ మాస్క్ ఊసే మరుస్తూ జలకాలాడారు. ఒకరినొకరు ఆనుకుంటూ గుంపులు గుంపులుగా ఎంజాయ్ చేశారు. కరోనాను లైట్ తీసుకుంటూ మళ్లీ సాధారణ జీవనంలోకి తొంగి చూస్తున్నారు. వేలాదిమంది పాల్గొన్న ఈ పార్టీలో ఒక్కరు కూడా మాస్క్ ధరించకపోవడం గమనార్హం. (ఆ దెయ్యం బొమ్మ తిరిగి వచ్చేసిందా?) కాగా ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలను ఎదుర్కొంటున్నాయి. 'కరోనాను పరిచయం చేసి, ప్రపంచాన్ని నాశనం చేస్తూ మీరు మాత్రం ప్రశాంతంగా గడుపుతున్నారు' అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇదిలా వుండగా గతేడాది వూహాన్లో తొలిసారిగా కరోనా వైరస్ కేసు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి నెలల్లో కేసులు పెరిగిపోవడంతో అక్కడ లాక్డౌన్ విధించారు. ఈ క్రమంలో వాటర్ పార్క్‌పై కూడా నిషేధం విధించారు. అయితే లాక్డౌన్ ఎత్తివేసే క్రమంలో జూన్‌లో మళ్లీ ఈ పార్క్ తెరుచుకుంది. అయితే ప్రజలను మళ్లీ ఆకర్షితులను చేసేందుకు పార్క్ నిర్వాహకులు కొత్త పథకం వేశారు. మహిళా కస్టమర్లు సాధారణ రుసుములో సగం చెల్లిస్తే సరిపోతుందని ఆఫర్ ప్రకటించారు. ఇంకేముందీ.. జనాలు.. ఈ అవకాశం చేజారితే మళ్లీ దొరకదన్నట్టు పార్క్‌కు పెద్ద ఎత్తున క్యూ కట్టి కరోనా నిబంధనలకు మంగళం పాడారు. (మాస్క్ ధరించలేదని ఫోన్ లాక్కొని..) ('కోవిడ్'ను మనం వినక ముందే కోవిడ్‌ను చూసిన మనిషి) -
కోటికి చేరుకున్న కరోనా కేసులు
కంటికి కనిపించని సూక్ష్మ క్రిమి చైనాలో వూహాన్లో పుట్టి యూరప్ దేశాల మీదుగా విస్తరించి అమెరికాలో ఉగ్రరూపం దాల్చి భారత్‌ని కూడా భయపెడుతోంది. 6 నెలలు, 213 దేశాలు.. కోటి కేసులు, దాదాపు 5 లక్షల మృతులు.. ఇదీ కోవిడ్19 సృష్టిస్తున్న అల్లకల్లోలం. వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఒక వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఒక వైరస్ అందరికీ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ప్రపంచానికి తాళం వేసి ఆర్థికంగా అతలాకుతలం చేస్తోంది. 2019 డిసెంబర్ 31న సార్స్ తరహా వైరస్ కేసులు చైనాలోని వూహాన్లో వెలుగులోకి వస్తున్నాయని అందరికీ తెలిసినప్పుడు ఇదేదో మామూలు వైరస్ అనుకున్నారు. అంతకంతకూ ఆ వైరస్ శరవేగంగా విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికింది. తొలి రెండు, మూడు నెలలు చైనాలోని వూహాన్‌తో పాటుగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, యూకే దేశాలు అల్లాడిపోయాయి. ఆ తర్వాత యూరప్‌లో కొన్ని దేశాలు కోలుకున్నప్పటికీ అమెరికాను కేసుల భయం వెంటాడుతూనే ఉంది. శనివారం రాత్రికి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,00,418కు, బాధితుల మరణాల సంఖ్య 4,98,952కు చేరాయి. కరోనాతో వణుకుతున్న దేశాలు అగ్రరాజ్యం అమెరికాని కరోనా అసాధారణ రీతిలో కాటేసింది. 25 లక్షలకు పైగా కేసులు లక్షా 25 వేలకు పైగా మృతులతో ఆ దేశం అగ్రభాగంలో ఉంది. ఇప్పటికీ అమెరికాలో రోజుకి సగటున 40 వేల మందికి కోవిడ్ –19 సోకుతోంది. బ్రెజిల్, రష్యా, భారత్, ఇరాన్, మెక్సికో, చిలీ, పెరూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ , ఇండోనేసియా దేశాల్లోనూ కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. న్యూజిలాండ్ సహా 15 దేశాలు ఇప్పటివరకు కరోనాని జయించామని చెప్పుకుంటున్నప్పటికీ మళ్లీ ఆయా దేశాల్లో రాదని చెప్పలేని పరిస్థితి. చైనాని కూడా కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది. ప్రాణాపాయం లేదు కరోనా వైరస్ విస్తరణ దడ పుట్టించేలా ఉన్నప్పటికీ, వేరే ఇతర వ్యాధులు ఉన్నవారికే ఇది అత్యంత ప్రమాదకరం. మిగిలిన వారికి కేవలం ఇదొక ఫ్లూ లాంటి జ్వరం మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలతో ఈ వైరస్‌ను అరికట్టవచ్చునని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం మొత్తం కేసుల్లో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే వ్యాధి అదుపులోకి వచ్చే కేసులు 80% వరకు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరినా కోలుకున్న కేసులు 15 శాతం ఉంటే, వాటిలో విషమంగా మారిన కేసులు 5శాతం. ఆ 5శాతం కేసుల్లోనూ సగం మందికే ప్రాణాలకు ముప్పు ఉంటోంది. -
మళ్లీ పుట్టాడు
కోవిడ్ అనే మాటను మనం వినక ముందే కోవిడ్‌ను చూసిన మనిషి ఒకరు ఉన్నారు! ఆయనే లీ వెన్లియాంగ్ (34). వుహాన్ డాక్టర్. గత ఏడాది నవంబర్ లోనే కరోనా ఆయన కంట్లో పడింది. ఫిబ్రవరిలో అది ఆయన్ని పొట్టన పెట్టుకుంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ చనిపోయారు డాక్టర్ లీ. పోయేముందు ఆ కిల్లర్ క్రిమితో జాగ్రత్త అని చైనాను హెచ్చరించి మరీ పోయారు. ఆ సమయంలో ఆయన భార్య ఫ్యూ ష్వెజీ ఐదో నెల గర్భిణి. ఇప్పుడు ఆమెకు అబ్బాయి పుట్టాడు. ‘లీ.. నాకు ఇచ్చి వెళ్లిన చివరి కానుక’ అని బిడ్డ ఫొటోను చైనా మెసేజింగ్ యాప్ ’వియ్ చాట్’ లో షేర్ చేశారు ఫ్యూ. లీ వెన్లియాన్ వూహాన్ సెంట్రల్లో హాస్పిటల్లో నేత్ర వైద్యుడు. కరోనా విశ్వరూపంపై ఆయన ముందుచూపును విశ్వసించని చైనా ప్రభుత్వం వదంతులను వ్యాపింప జేస్తున్నాడన్న అనుమానంతో ఒక హెచ్చరికగా అరెస్ట్ చేసి వదిలేసింది. -
‘చివరి బహుమతి.. జాగ్రత్తగా చూసుకుంటా’
బీజింగ్: ప్రపంచాన్ని కలవర పెడుతున్న మహమ్మారి కరోనా వైరస్ గురించి ముందుగానే హెచ్చరించి.. చివరకు దానికే బలయిన కళ్ల డాక్టర్ లీ వెన్లియాంగ్ భార్య వారి రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీచాట్‌లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నువ్వు నాకిచ్చిన చివరి బహుమతి ఈ రోజు ప్రాణం పోసుకుంది. ఈ బహుమతిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. స్వర్గం నుంచి నువ్వు దీన్ని చూస్తున్నావా’ అంటూ రాసుకొచ్చింది. ఈ మెసేజ్‌తో తమ రెండో సంతానం అయిన పిల్లవాడి ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. వుహాన్ నగరంలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైనప్పుడు స్థానిక వైద్యుడైన వెన్లియాంగ్ సహచరులను దీని గురించి హెచ్చరించేందుకు ప్రయత్నించారు. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేశారు. వెన్లియాంగ్ పనిచేస్తున్న ఆసుపత్రిలో డిసెంబర్లో ఏడుగురు వైరల్ ఇన్ఫెక్షన్తో చేరారు. 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వ్యాధి తరహా లక్షణాలే వీరిలో ఉన్నట్లు వెన్లియాంగ్కు అనుమానం వచ్చింది. సార్స్ కూడా కరోనా వైరస్ కుటుంబానికి చెందిందే. దాంతో తన సహచర వైద్యులను హెచ్చరిస్తూ ఓ చాట్ గ్రూప్‌లో డిసెంబర్ 30న ఆయన మెసేజ్ పెట్టారు. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మాస్క్‌ల్లాంటివి ధరించాలని అందులో సూచించారు. అయితే, ఈ విషయం గురించి బయటకు మాట్లాడొద్దని, మౌనంగా ఉండాలని పోలీసులు ఆయనను హెచ్చరించారు. చివరకు లీ వెన్లియాంగ్ కూడా కరోనా వైరస్‌తో ఫిబ్రవరిలో మరణించారు.