Wuhan Mosquito Viagra News Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Fact Check: వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వయాగ్రా దోమల లీక్‌.. కలకలం!

Published Sun, Jun 20 2021 8:50 AM | Last Updated on Mon, Jun 21 2021 7:29 AM

Fact Check On Viagra Mosquitoes Injected  Escape Wuhan Lab Was Satire - Sakshi

వుహాన్‌ ల్యాబ్‌ పరిశోధకుల తాజా పరిశోధన బెడిసి కొట్టింది. వయాగ్రా ఇంజెక్ట్‌ చేసిన వేల కొద్దీ దోమలు .. ల్యాబ్‌ నుంచి బయటపడ్డాయి. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్‌ నిర్వాహకులు ప్రకటించగా.. ఆ దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటు చేసుకున్నాయి. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుండడంతో ఆందోళన మొదలైంది.

వైరల్‌ వార్త.. చైనా నుంచి మరో షాక్‌. వయాగ్రా దోమల ప్రభావంతో చైనాలో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. పండు ముసళ్లోల్ల దగ్గరి నుంచి కుర్రాల దాకా కామ వాంఛతో రగిలిపోతున్నారు. వుహాన్‌కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు ఒకడు కోరికల్ని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాడు. మరో పేషెంట్‌ నగ్నంగా ఆస్పత్రిలో తిరుగుతూ.. పబ్లిక్‌గా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి కనిపించిన వాళ్లపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇది వుహాన్‌ కెచ్‌లీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌. ఇక ఇది మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని వుహాన్‌ ల్యాబ్‌ హెడ్‌ రీసెర్చర్‌ డాక్టర్‌ వెంజి యింగ్‌ యిన్‌ జింగ్‌ భయపడుతున్నారని వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌ సైట్‌ ఒక కథనాన్ని ప్రచురించింది.

ఫ్యాక్ట్‌ చెక్‌.. వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్‌ డాట్‌ కామ్‌ అనేది కంప్లీట్‌ సెటైరికల్‌ వెబ్‌సైట్‌. ‘‘నిజనిర్థారణలతో సంబంధం లేదు’’ అనేది ఆ వెబ్‌సైట్‌ క్యాప్షన్‌. అందులో కంటెంట్‌ మామూలుగా ఉండదు. కుక్కకు-పిల్లి తోకకు ముడిపెట్టి కథనాలు పబ్లిష్‌ చేస్తుంది. పైగా జనాలు అది నిజమని గుడ్డిగా నమ్మేంత పక్కాగా. అందులో ఉంది అధికారిక సమాచారమేమో అనేంతలా స్టోరీలు అల్లుతుంది. వుహాన్‌ ల్యాబ్‌ మీద సెటైరిక్‌గా పోయిన నెలలో రాసిన ఈ ఆర్టికల్‌.. ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇక ఇందులో ఉన్న వృద్ధుడి ఫొటో అసలు చైనా వ్యక్తిదే కాదు. జపాన్‌ వ్యాపారవేత్త యుకిషి చుగంజి. 2003లో 114 వయసులో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆ టైంలో ప్రపంచంలో అత్యంత వృద్ధుడి రికార్డు ఆయన పేరు మీద ఉండేది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement