mosquitos
-
‘దోమలు బాబోయ్ దోమలు’.. రైల్వే మంత్రికి ప్రయాణికుని ఫిర్యాదు!
దేశంలోని కొన్ని రైళ్లలో ప్రయాణాలు సాగించే ప్రయాణికులు పలు సమస్యలను ఎదుర్కొంటుండటాన్ని మనం చూసే ఉంటాం. అయితే తొలి కార్పొరేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. దోమల బెడదతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్నో- ఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ (82501)లో ప్రయాణం సాగించిన ఒక ఒక ప్రయాణికుడు దోమల బెడద గురించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు సోషల్ సైట్ ‘ఎక్స్’ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో చలనం కలిగింది. ఈ ఘటనపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని తేజస్ రైలు నిర్వహణ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ శర్మ అనే ప్రయాణికుడు ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో ‘నేను లక్నో నుండి న్యూఢిల్లీకి తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్పప్పుడు రైలు దోమల నిలయంగా కనిపించింది. ఇది ప్రతిష్టాత్మక రైలులో తలెత్తిన సమస్య. ఈ రైలు ఛార్జీలు విమాన చార్జీలతో సమానంగా ఉన్నాయి’ అంటూ రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో కలకలం చెలరేగింది. దీనిపై వెంటనే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. -
రాజమౌళి ఈగలాగ.. దోమలు కూడా రివెంజ్ తీర్చుకుంటాయా?
వర్షాకాలం వచ్చేసింది.. ఈ సీజన్లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే దోమలు మనుషులనే ఎందుకు కుడతాయి? ఎంతమంది ఉన్నా అదేపనిగా కొందరినే ఎందుకు టార్గెట్ చేసి అటాక్ చేస్తాయి? మరికొందరిని మాత్రం అస్సలు కుట్టవు ఎందుకో? ఇలా మనలో మనమే చాలాసార్లు ప్రశ్నలు వేసుకుంటుంటాం. అయితే నిజానికి ఈ విషయంలో దోమలకేమీ పక్షపాతం ఉండదట. దీని వెనుక సైన్స్ ఉందంటున్నారు పరిశోధకులు. మనకు నచ్చిన ఆహారాన్ని తీసుకున్నట్లే దోమలు కూడా వాటికి నచ్చిన వాళ్ల రక్తం తాగేస్తాయి. అంతలా దోమలను ఆకర్షించే అంశాలేంటి? దీని వెనకున్న స్టోరీ ఏంటీ చదివేద్దాం. ► సాధారణంగా దోమల్లో మగదోగమలు మనిషిని కుట్టవు. ఇవి చెట్ల రసాలపై ఆధారపడి జీవిస్తాయి. ఆడదోమల్లోనే మనిషిని కుట్టేందుకు అవసరమైన ముఖ విన్యాసం ఉంటుంది. అందువల్ల ఇవే మనిషి రక్తాన్ని పీలుస్తాయి.అట్లాగని రక్తం వీటి ఆహారం అనుకోవద్దు. కేవలం గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్ దోమలకు మనిషి రక్తం ద్వారా లభిస్తుంది. దీనికోసమే అవి మనుషులను కుడతాయి. Yesterday, we visited Kyenjojo SS who are making mosquito repellent Vaseline.In 2021, Uganda had the 3rd highest global burden of malaria cases (5.1%) and the 7th highest level of deaths (3.2%). In creating this Vaseline, the students are looking to prevent rather than cure. pic.twitter.com/97EEujl6Tl— Investors Club Ltd Ug (@InvestorsClubUg) July 12, 2023 ► ఏ, బీ బ్లడ్ గ్రూపుల వారితో పాటు ఏబీ పాజిటివ్ ఉన్న బ్లడ్ గ్రూపుల వారిని దోమలు ఎక్కువగా కుడతాయని కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి. ఎందుకంటే వీరి శరీరం నుంచి వచ్చే ఒక రకమైన వాసనను పసిగట్టి దోమలు అటాక్ చేస్తాయట. ► చర్మంపై సహజంగా లభించే యాసిడ్ల వచ్చే వచ్చే వాసనకు దోమలు ఆకర్షితమం అవుతాయని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ► ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేవారి శరీర ఉష్ఱోగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు దోమ కాటుకు గురికాక తప్పదట. Imagine not killing a mosquito that is sitting on your arm sucking your blood pic.twitter.com/jv7ts5uSvt— greg (@greg16676935420) July 17, 2023 ► కార్బన్ డై ఆక్సైడ్ అంటే దోమలుకు అమితమైన ఇష్టం, ఎకువగా సిఓ2 వదిలేవాళ్ళ చుట్టూ దోమలు వాలిపోతుంటాయట. ► గర్బవతులు, ఒబేసిటీతో బాధపడేవారి రక్తంలో మెటబాలిక్ రేట్స్ అధికంగా ఉంటాయట. అందుకే వీరిని దోమలు టార్గెట్ చేస్తాయట. ► చెమట ఎక్కువగా వచ్చేవారిలో లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా రసాయనాల వల్ల దోమలు కుడతాయి. ► అంతేకాకుండా నల్లరంగు దుస్తులు ఎక్కువగా వేసుకుంటే దోమలు అట్రాక్ట్ అవుతాయట. దోమతెరల్లో ఎన్నో వినూత్న రకాలు, ఇవి ట్రై చేయండి The mosquitoes in Haiti would just fold it back https://t.co/RJi3hXsrQG— 💲LEX💲 (@Zoboylex) July 17, 2023 -
World Mosquito Day: ప్రాణి చిన్నది.. ప్రమాదం పెద్దది..!
సీతంపేట: మలేరియా, డెంగీ, చికున్ గున్యా పేర్లు వినని వారు ఉండరు. దోమవల్ల వ్యాపించే ప్రాణాంతకమైన జ్వరాలివి. చిన్నదోమ ఎంత పెద ప్రమాదాన్ని తీసుకువస్తుందో చెప్పడానికి ఈ జ్వరాలే ఉదాహరణ. మనుషుల రక్తాన్ని పీల్చి వ్యాధుల బారిన పడవేసే దోమల బెడద పట్టణాలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. దోమల బారిన పడకుండా వాటిని తరిమి కొట్టే జాగ్రత్తలు తీసుకుంటేనే అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలమని వైద్యులు సూచిస్తున్నారు. దోమల దినం ఎందుకంటే.. ప్రపంచానికి కామన్ శత్రువుగా మారిన దోమల ఆట కట్టించడానికి సర్ రోనాల్డ్ రాస్ శతాబ్దం క్రితమే రంగంలోకి దిగారు. 1897లో ఆయన దోమల ద్వారానే మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని నిర్ధారించారు. ఈ పరిశోధనకు గానూ ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లండన్ స్కూల్ ఆఫ్ హైజెనిక్ అండ్ ట్రాపికల్ మెడిసన్ ఆగస్టు 20వ తేదీని అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించింది. అరికట్టేదెలా.. దోమ ఎగురుతున్నపుడు పట్టుకోవడం, చంపడం చాలా కష్టం. ఒక్క దోమను పట్టుకోవాలంటే ఎంతో శ్రమించాలి. కాని దోమలు నీటిలో లార్వా, ప్యూపా దశలో పెరుగుతున్నపుడు నాశనం చేయడం సులువు. అవి ఇంటిలో నీటిని నిల్వ చేసే కుండీల్లో చిన్నచిన్న పురుగుల్లా కనిపిస్తుంటాయి. దోమ పిల్లలు (లార్వా) నిల్వ నీటిలో ఉన్నట్లయితే ఆ నీటిని మట్టి లేదా ఇసుకలో పారబోయాలి. ఇలా చేయడం వల్ల లార్వా, ప్యూపా దశల్లో ఉన్న వాటిని వందల సంఖ్యలో నాశనం చేయవచ్చు. నిలువ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. ఒక దోమ వంద నుంచి 200 వరకు గుడ్లను పెడుతుంది. ఇవన్నీ కేవలం 8 నుంచి 10 రోజుల్లో దోమలుగా మారిపోతాయి. గుడ్డు నుంచి లార్వా, ప్యూపా, అడల్ట్ మస్కిటోగా రూపాంతరం చెందుతాయి. దోమలదాడికి లక్షల్లో ఖర్చు.. దోమలు ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమల దాడిని తట్టుకునేందుకు ప్రతి నెల నిత్యావసర సామగ్రి మాదిరిగానే లిక్విడ్స్, మస్కిటో రీఫిల్స్, కాయిల్స్, మస్కిటో ధూప్‌స్టిక్స్ వంటి వాటికి నెలకు రూ.100 నుంచి రూ.500 వరకు ఒక్కో కుటుంబం ఖర్చు చేస్తోంది. ఇవి కాకుండా దోమల బ్యాట్స్, దోమతెరలు, యాంటీ మస్కిటోమెస్ వంటి వాటికోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించక తప్పడం లేదు. ఆడదోమలే ప్రమాదకరం.. మగ దోమలు చెట్ల రసాలను పీల్చి బతుకుతాయి. ఆడ దోమలు మాత్రం సంతానాభివృద్ధిలో భాగంగా గుడ్లు పెట్టడానికి మనిషి రక్తాన్ని పీల్చుతుంటాయి. ఈ క్రమంలో వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కుట్టిన దోమ ఆ వ్యక్తి రక్తాన్ని పీల్చినపుడు రక్తంతో పాటు వ్యాధి కారకమైన పారాసైట్ దోమ లాలాజల గ్రంధుల్లోకి చేరుతుంది. అక్కడ పారాసైట్‌లో కొన్ని మార్పులు జరుగుతాయి. మరో ఆరోగ్యవంతమైన వ్యక్తిని అదే దోమ కుట్టినపుడు దాని లాలాజలంతో పాటు పారసైట్ ఆ వ్యక్తి రక్తంలో చేరి వ్యాధులకు కారణమవుతుంది. అనార్థాలివే.. ► ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మలేరియా,డెంగీ, చికెన్‌గున్యా జ్వరాలు, ఈడిస్, క్యూలెక్స్ దోమలవల్ల బోదకాలు వస్తాయి. ► జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాల కారణంగా రోడ్లపైన కొబ్బరిబొండాలు, పాతటైర్లు, రుబ్బురోళ్లలో నిల్వ ఉన్న నీరు వీటి ఆవాస కేంద్రాలు. ► అవసరాల కోసం నీటిని కుండీలు, ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో నీటిని నిల్వ చేయడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. నివారణ ఇలా .. ► వేపనూనె దోమలను తరిమికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వాసన దోమలు భరించలేవు. వేప,కొబ్బరినూనెలను సమాన భాగాలుగా చేసుకుని బయటకు కనిపించే శరీర భాగాలపై రాసుకుంటే దోమలు దరిచేరవు. ► ఇళ్లలోకి దోమలు ప్రవేశించే కిటికీల వంటి ద్వారాల వద్ద తులసి మొక్కలను పెంచాలి. ఇవి దోమలను దూరం చేస్తాయి. దోమల వృద్ధి లేకుండా చూస్తాయి. ► లెమన్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ మిశ్రమం దోమలను తరిమికొడుతుంది. దోమలను తరిమికొట్టడంలో కర్పూరం మెరుగ్గా పనిచేస్తుంది. ఖాళీ ప్రదేశాలను మూసిన తర్వాత కర్పూరాన్ని వెలిగిస్తే దానినుంచి వచ్చే పొగకు దోమలు మాయమవుతాయి. తగ్గిన హైరిస్క్ గ్రామాలు దోమల నివారణకు మూడేళ్లుగా ప్రభుత్వ చేపట్టిన చర్యల వల్ల మలేరియా,డెంగీ, చికున్‌గున్యాలు దశలవారీగా తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో ఒకప్పుడు మలేరియా పాజిటివ్‌గా 100కు పైగా ఉన్న హైరిస్క్ మలేరియా గ్రామాలు ఇప్పుడు 45కు తగ్గుముఖం పట్టాయి. ఈనెల 16నుంచి 31 వరకు మొదటి రౌండ్ సింథటిక్ ఫైరాత్రిన్ జిల్లా వ్యాప్తంగా పిచికారీ చేశారు. 2 లక్షలకు పైగా దోమతెరలు పంపిణీ చేశారు. అలాగే 4లక్షలు పైగా గంబూషియా చేపలను నీటి కుంటల్లో వేశారు. దోమల నివారణకు విస్తృత చర్యలు దోమల నివారణకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నాం. దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నాం. గ్రామాల్లో దోమతెరల విని యోగంపై గిరిజనులకు చైత న్యం కలిగిస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడైనా మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలితే వెంటనే మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. ర్యాపిడ్ ఫీవర్, మలేరియా సర్వేలు చేస్తున్నాం. ఒకసారి ఏ గ్రామంలోనైనా జ్వరాలకు సంబంధించి పాజిటివ్ వస్తే మళ్లీ అక్కడ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. -కె.పైడిరాజు, జిల్లా మలేరియానివారణాధికారి -
Wuhan Lab: వయాగ్రా దోమల లీక్.. కలకలం!
వుహాన్ ల్యాబ్ పరిశోధకుల తాజా పరిశోధన బెడిసి కొట్టింది. వయాగ్రా ఇంజెక్ట్ చేసిన వేల కొద్దీ దోమలు .. ల్యాబ్ నుంచి బయటపడ్డాయి. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్ నిర్వాహకులు ప్రకటించగా.. ఆ దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటు చేసుకున్నాయి. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతుండడంతో ఆందోళన మొదలైంది. వైరల్ వార్త.. చైనా నుంచి మరో షాక్. వయాగ్రా దోమల ప్రభావంతో చైనాలో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. పండు ముసళ్లోల్ల దగ్గరి నుంచి కుర్రాల దాకా కామ వాంఛతో రగిలిపోతున్నారు. వుహాన్కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు ఒకడు కోరికల్ని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాడు. మరో పేషెంట్ నగ్నంగా ఆస్పత్రిలో తిరుగుతూ.. పబ్లిక్‌గా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి కనిపించిన వాళ్లపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇది వుహాన్ కెచ్‌లీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక ఇది మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని వుహాన్ ల్యాబ్ హెడ్ రీసెర్చర్ డాక్టర్ వెంజి యింగ్ యిన్ జింగ్ భయపడుతున్నారని వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. One more shock from China. Wuhan: Thousands of mosquitoes inoculated with Viagra escape from high-security laboratory https://t.co/h4FAK7yp1g — किसान 🇮🇳 (@WadheshT) June 15, 2021 ఫ్యాక్ట్ చెక్.. వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనేది కంప్లీట్ సెటైరికల్ వెబ్సైట్. ‘‘నిజనిర్థారణలతో సంబంధం లేదు’’ అనేది ఆ వెబ్సైట్ క్యాప్షన్. అందులో కంటెంట్ మామూలుగా ఉండదు. కుక్కకు-పిల్లి తోకకు ముడిపెట్టి కథనాలు పబ్లిష్ చేస్తుంది. పైగా జనాలు అది నిజమని గుడ్డిగా నమ్మేంత పక్కాగా. అందులో ఉంది అధికారిక సమాచారమేమో అనేంతలా స్టోరీలు అల్లుతుంది. వుహాన్ ల్యాబ్ మీద సెటైరిక్‌గా పోయిన నెలలో రాసిన ఈ ఆర్టికల్.. ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఇందులో ఉన్న వృద్ధుడి ఫొటో అసలు చైనా వ్యక్తిదే కాదు. జపాన్ వ్యాపారవేత్త యుకిషి చుగంజి. 2003లో 114 వయసులో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆ టైంలో ప్రపంచంలో అత్యంత వృద్ధుడి రికార్డు ఆయన పేరు మీద ఉండేది. #CKMKB 😂😂 Good news “The effects of one mosquito bite can last up to forty-eight hours and symptoms include an increase in libido, sexual arousal, and possibly a very, very large erection,” Dr. Wenzi told the press during a press conference.https://t.co/iR5nHFIWBC — 🥃🚬 (@BeastOnDrive) June 15, 2021 -
దోమల డెంగీయాత్ర
సాక్షి, అమరావతి: - గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సంజీవరావు అనే వ్యక్తి ఈనెల 25న తీవ్ర జ్వరంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించారు. అక్కడ గంటలోపే పరీక్షలు చేసి డెంగీగా నిర్ధారించారు. మూడు రోజులపాటు ఇన్‌పేషెంటుగా ఉంచి రూ.45 వేలు వసూలు చేశారు. - విశాఖపట్నం నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన లక్ష్మీదేవమ్మ జ్వరంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. డెంగీ సోకిందని, ప్లేట్లెట్స్ బాగా పడిపోయాయంటూ ఇన్‌పేషెంటుగా చేర్చారు. ప్లేట్లెట్స్ పేరుతో రెండ్రోజులు చికిత్స చేసి రూ.41వేలు బిల్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ వాసులను డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయనడానికి పైరెండు కేసులు చక్కటి ఉదాహరణలు. గత ఏడాది గ్రామీణ ప్రాం తాల్లో ఎక్కువగా ఇవి నమోదు కాగా ఈ ఏడాది పట్ట ణాలను భయకంపితులను చేస్తున్నాయి. తాజాగా గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ నగరపాలక సంస్థల పరిధిలో అత్యధిక డెంగీ కేసులు నమోదైనట్టు ప్రజారోగ్యశాఖ వెల్లడించింది. బాధితులు ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న కారణంగా ఇంకా ఆ కేసులు వెల్లడి కాలేదని, అవి కూడా కలుపుకుంటే కేసుల సంఖ్య భారీ స్థాయిలో ఉంటుందని ఆ శాఖకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. డెంగీ నివారణకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని అయినా నియంత్రణ కావడంలేదన్నారు. గతేడాది సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేసి ‘దోమలపై దండయాత్ర’ చేసినా అవి లొంగలేదని, ఈ ఏడాది మరిన్ని దోమకాటు జ్వరాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. బెంబేలెత్తిస్తున్న కేసులు గుంటూరు, విశాఖలోని నగర పాలక సంస్థల్లో డెంగీ జ్వరాలు నియంత్రణలోకి రావడంలేదని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది గుంటూరు నగరంలో కేవలం 70 కేసులు మాత్రమే నమోదు కాగా.. గడిచిన రెండు మాసాల్లో 400 పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో గత నెల రోజుల్లో 550 డెంగీ కేసులు పైనే నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలోనూ తక్కువేమీ కాదు. గత కొంతకాలంగా ఒంగోలులోని రిమ్స్‌తో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రులకు డెంగీతో వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 400కు పైగా కేసులు నమోదైనట్టు వెల్లడైంది. నెల్లూరు, తిరుపతి, కడప, విజయవాడ, కర్నూలు నగరాల్లో సైతం అనేక డెంగీ కేసులు నమోదైనట్లు సమాచారం. కాగా, గడిచిన రెండు మాసాల్లోనే వివిధ మున్సిపాలిటీల పరిధిలో 3వేల డెంగీ కేసులు నమోదైనట్టు ప్రజారోగ్యశాఖ పరిశీలనలో తేలింది. ప్లేట్లెట్ల పేరిట దోపిడీ ప్రైవేటు ఆస్పత్రుల్లో, డయాగ్నిస్టిక్స్ సెంటర్లలో ప్లేట్లెట్స్ పేరిట భారీ దోపిడీ మొదలైంది. ప్లేట్లెట్స్ ఎక్కించాలని.. లేదా పేషెంటు పరిస్థితి బాగోలేదంటూ రోగిని పిండేస్తున్నారు. జ్వరం లక్షణాలు పూర్తిగా తెలియకముందే ఇన్‌పేషెంటుగా చేర్చుకుని రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ బిల్లులు బాదేస్తున్నారు. వాస్తవానికి డెంగీ జ్వరం నిర్ధారించాలంటే రాపిడ్ టెస్ట్ కిట్ ఒక్కటే సరిపోదు. ఐజీజీ, ఐజీఎం, ఎలీశా టెస్టులు చేస్తేనే పూర్తిస్థాయిలో ఫలితం తేలుతుంది. ఇవన్నీ ఏమీ చేయకుండానే డెంగీ అని భయపెట్టి దోచుకుంటున్నారు. మూడు శాఖల మధ్య సమన్వయలోపం ఇదిలా ఉంటే.. పట్టణాల్లో ఎలాంటి కేసులు నమోదైనా దానికి ఆరోగ్యశాఖదే తప్పుగా చూపిస్తున్నారని, కానీ.. పురపాలక శాఖ ఈ విషయంలో తమకు సహకరించడంలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులు నమోదైనప్పుడు కేవలం ఆరోగ్యశాఖ మాత్రమే స్పందిస్తోందని, కనీస నివారణ, నియంత్రణ చర్యలకు మున్సిపల్ శాఖ ముందుకు రావడంలేదన్నది ఆరోగ్యశాఖ భావన. గ్రామీణాభివృద్ధి శాఖ కూడా తమతో కలిసి రావడంలేదని, మూడు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంవల్లే ఇలాంటి పరిస్థితి నెలకొని ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు.. మున్సిపాల్టీలు, గ్రామాల్లో పారిశుధ్యం దారుణంగా ఉంటోంది. గిరిజన ప్రాంతాల్లో సరేసరి. వర్షం పడితే చాలు పట్టణాలు చెరువుల్లా మారిపోతున్నాయి. దీంతో నీటి నిల్వ కారణంగా డెంగీ జ్వరాలకు కారణమయ్యే ఈడిస్ దోమల వ్యాప్తి ఎక్కువవుతోంది. ప్రధానంగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి నగరాల్లో అయితే సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే చాలు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లకు ఇరువైపులా రకరకాల పనులకు తవ్విన గోతుల్లో నీళ్లు నిల్వ ఉంటున్నాయి. దీంతో ఇవన్నీ దోమల వృద్ధికి నిలయాలుగా మారుతున్నాయి. ఉదాహరణకు విజయవాడ నగరంలో జరుగుతున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పనుల కారణంగా అనేక ప్రాంతాలు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఈ కారణంగానే జ్వరాలొస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పారిశుధ్య వారోత్సవాలు మొక్కుబడిగా సాగుతున్నాయి అనడానికి డెంగీ కేసులే ఉదాహరణ. అలాగే, గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు వస్తున్నా చిన్నచిన్న అవసరాలకు కూడా వాటిని వినియోగించుకోలేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనధికార ఆంక్షలు విధించిందని సర్పంచ్‌లు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెంగీ లక్షణాలు – ఈడిస్ రకం దోమ కుట్టిన 24 గంటల్లో విపరీతమైన తలనొప్పి వస్తుంది – జ్వర తీవ్రత పెరిగేకొద్దీ కళ్లు ఎర్రగా మారుతూంటాయి – మర్నాడు కండరాల నొప్పి తీవ్రమవుతుంది – అనంతరం కీళ్ల నొప్పులు తీవ్రస్థాయిలో వస్తాయి – ఒళ్లంతా దద్దుర్లు మాదిరి మొదలై, అవి ఎర్రగా మారుతూ ఉంటాయి – ఏమీ తినాలనిపించదు. పైగా తీసుకున్నా వాంతులవుతాయి – జ్వర తీవ్ర ఎక్కువగా ఉంటే డెంగీ హీమరోజిక్ ఫీవర్ (డీహెచ్ఎఫ్) అంటారు. – ఇక చివరి దశ అంటే డెంగీ షాక్ సిండ్రోమ్ (డీఎస్ఎస్) అంటారు. చికిత్సకు మార్గదర్శకాలు – డెంగీ వచ్చిందని నిర్ధారించగానే రోగిని ప్రత్యేక వార్డులో ఉంచాలి – ఫిజీషియన్ సూచనల మేరకు మాత్రమే యాంటీబయోటిక్స్ ఇవ్వాలి – ప్రస్తుత పరిస్థితుల్లో యాంటీవైరల్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవి ఇవ్వచ్చు. – ముందుగా జ్వర తీవ్రతను తగ్గించేందుకు తరచూ పారాసెటిమాల్ ఇవ్వాలి – రోగికి నాలుగైదు రోజులపాటు పళ్లు, పళ్ల రసాలు మాత్రమే ఆహారంగా ఇవ్వాలి – రోగి పరిస్థితిని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి – రోగికి వీలైనంత ఎక్కువ మోతాదులో నీళ్లు తాగించాలి – నాలుగైదు రోజుల్లోనే జ్వరం నియంత్రణలోకి వస్తుంది. ఆ తర్వాత రోగిని డిశ్చార్జి చేయచ్చు – ముఖ్య విషయం.. దోమల నివారణకు ఇంటి పరిసరాల్లో ఎలాంటి కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత బాటిళ్లు, కప్పులు వంటివి లేకుండా చూసుకోవాలి. ఉంటే.. వాటిల్లో నీళ్లు నిల్వ ఉండకుండా కూడా జాగ్రత్తపడాలి. లేదంటే వాటి ద్వారా దోమలు వృద్ధిచెందే ప్రమాదముంది. ప్లేట్లెట్ల సమస్య లేదు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డెంగీ జ్వరాలు ఉన్నాయి. బోధనాసుపత్రుల్లో ఎక్కడా ప్లేట్‌లెట్స్‌కు సమస్య లేదు. అన్నిచోట్లా అందుబాటులో ఉన్నాయి. అయినా, అనుకున్నంతగా డెంగీ కేసులేమీ బోధనాసుపత్రులకు రావడంలేదు. వైద్యానికి సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేవు. – డా. కె.బాబ్జీ, వైద్యవిద్యా సంచాలకులు -
వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం పిచికారీతో తెల్లదోమను అరికట్టవచ్చు
కొబ్బరి, పామాయిల్ తోటలను ఆశిస్తున్న వలయాకారపు తెల్లదోమను వేస్ట్ డీ కంపోజర్(డబ్లు్య.డి.సి.) ద్రావణం పిచికారీతో అరికట్టవచ్చు. 200 లీటర్ల నీటిలో డబ్లు్య.డి.సి. బాటిల్లోని 30 గ్రాముల పొడితోపాటు 2 కిలోల బెల్లం కలిపి.. రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం కలియదిప్పాలి. ఈ ద్రావణం ఐదారు రోజులకు వాడకానికి సిద్ధమవుతుంది. అదనంగా నీటిని కలపకుండా ఈ ద్రావణాన్ని కొబ్బరి/పామాయిల్ తోటలపై పిచికారీ చేయాలి. 3 రోజుల విరామంతో కనీసం 5 విడతలు పిచికారీ చేయాలి. చెట్టు తడిచేలా పిచికారీ చేయాలి. మునగ తదితర కూరగాయ తోటల్లో తెల్లదోమను డబ్లు్య.డి.సి. సమర్థవంతంగా అరికట్టింది. వలయాకారపు తెల్లదోమను సైతం అరికడుతుంది. వేస్ట్ డీ కంపోజర్’ సీసాలు ఎక్కడ దొరుకుతాయి? వేస్ట్ డీ కంపోజర్ సీసాలను హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని మార్క్ అగ్రి జెనెటిక్స్ ప్రై. లిమిటెడ్ కార్యాలయం నుంచి పొందవచ్చు. కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ప్రాంతీయ మండలిగా గుర్తింపు పొందిన సంస్థ ఇది. ఈ కార్యాలయం నుంచి (ఉదయం 10 గం. నుంచి 5 గం. వరకు) రూ. 20లకు వేస్ట్ డీ కంపోజర్ సీసాలను రైతులు స్వయంగా వచ్చి కొనుగోలు చేయవచ్చు. రైతులు ఆధార్ కార్డు నకలు, పట్టాదారు పాస్‌బుక్ నకలును వెంటతీసుకెళ్లాలి. వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: సేంద్రియ రైతుల సేవా కేంద్రం, మార్క్ ప్రోగ్రీన్ జెనెటిక్స్ ప్రై.లిమిటెడ్, 416/ఎ, బాబూఖాన్ ఎస్టేట్, బషీర్‌బాగ్, హైదరాబాద్. 040– 23235858, 91009 80757. వేస్ట్ డీ కంపోజర్ సీసాను ఒకసారి కొనుక్కుంటే చాలు. ద్రావణాన్ని 5 లీటర్లు పక్కన పెట్టుకుంటే.. మళ్లీ అవసరమైనప్పుడు 200 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లం కలిపి ఈ ద్రావణాన్ని పాలలో తోడు మాదిరిగా డ్రమ్ములో కలిపితే చాలు.. నాలుగైదు రోజుల్లో డ్రమ్ము ద్రావణం వాడకానికి సిద్ధమవుతుంది. – డా. వి. ప్రవీణ్‌కుమార్ (92478 09764), శాస్త్రవేత్త, జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎఫ్.), కేంద్ర వ్యవసాయ శాఖ, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ -
దోమల దండయాత్ర
జిల్లాలో దోమలు రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు జనం రక్తం తాగుతున్నాయి. కాయిల్స్, లిక్విడ్లు వాటిని కనీసం నిద్రlపుచ్చలేకపోతున్నాయి. ఇక ప్రభుత్వం చేపట్టిన దండయాత్ర వాటికి చీమకుట్టినట్టయినా అనిపించడం లేదు. ఈ దోమల రాజ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పట్టణాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఖాళీ జాగా.. దోమల పాగా భీమవరం టౌన్ : ఇటీవల నిర్వహిస్తున్న జన్మభూమి సభల్లో కౌన్సిలర్లు, ప్రజలు దోమల సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. భీమవరం 5వ వార్డు జన్మభూమి సభను ఆకస్మికంగా సందర్శించిన డీఎంఏ కె.కన్నబాబు దృష్టికి కూడా దోమల సమస్యను ప్రజలు తీసుకువచ్చారు. పట్టణంలో ఖాళీ స్థలాలు మురుకికూపాలుగా మారడంతో దోమల సమస్య పెరిగిందని అధికారులు గుర్తించారు. పట్టణంలో 2,300 ఖాళీ స్థలాలు ఉన్నాయి. మునిసిపాలిటీకి చెందిన 34 ఎకరాల మేర ఉన్న 72 రిజర్వుడు స్థలాల్లో 80 శాతం దోమలకు నిలయాలుగా మారాయి. ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలని వాటి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మునిసిపాలిటీ మాత్రం తమ స్థలాలను నిర్లక్ష్యంగా వదిలేసింది. కాగా స్థలాలకు ప్రహరీ నిర్మాణానికి రూ.50 లక్షలు, స్థలాల లెవెలింగ్‌కు రూ.20 లక్షలు బడ్జెట్లో కేటాయిస్తూ వస్తోంది. మలేరియా, ఫైరోసిన్ ఆయిల్‌కు ఏటా రూ.11 లక్షలు, ఫాగింగ్ నిర్వహణకు రూ.13 లక్షలు కేటాయిస్తోంది. దోమలపై దండయాత్రకు బడ్జెట్లో రూ.10 లక్షలు కేటాయించడం విశేషం. పేరుగాంచిన గూడెం తాడేపల్లిగూడెం :తాడేపల్లిగూడెంకు దోమలగూడెం అనే పేరు కొనసాగుతున్న దుస్థితి. స్మార్ట్‌వార్డు కార్యక్రమం అంటూ తీసుకున్న చర్యలు కొంత ఫలితాన్ని ఇచ్చినప్పటికీ మాస్ స్ప్రేయింగ్ ప్రయోగం ఫలించలేదు. ఖాళీ జాగాల యజమానులకు మున్సిపాలిటీ నోటీసులు ఇచ్చినా స్పందన కానరాలేదు. దోమల పునరుత్పత్తికి అనువైన సమయం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాలు కావడంతో మరింతగా వృద్ధి చెందుతున్నాయి. కాయిల్స్. కెమికల్ కాగితాలు, లిక్విడ్లు బలాదూర్. చేతిలో సత్తువ ఉంటే కునుకు పట్టేవరకూ రూ.360 దోమల బ్యాట్ వినియోగించాల్సిందే. సిబ్బంది కొరతతో ఇబ్బంది నరసాపురం : పట్టణంలో దోమల నివారణకు ఏటా రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు మునిసిపల్ రికార్డులు చెబుతున్నాయి. కానీ పట్టణంలో ఎక్కడ చూసినా దోమల బెడదే! ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ దోమలపై రగడ షరా మామూలే! 60 వేల జనాభా, 31 వార్డులతో విస్తరించి ఉన్న పట్టణంలో రెండు శానిటరీ డివిజన్లు ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఇన్స్పెక్టర్ల పోస్టులు 8 నెలలుగా ఖాళీగా ఉన్నాయి. హెల్త్ అసిస్టెంట్‌ను ఇన్చార్జిగా పెట్టి, శానిటరీ పనులు మమ అనిపిస్తున్నారు. ఇక డ్రెయినేజీలను శుభ్రం చేసే పనుల్లోనూ, ఎంఎల్ ఆయిల్ వినియోగంలోనూ జరుగుతున్న అవినీతి కూడా దోమల పెరుగుదలకు దోహదం చేస్తోంది. ఈ నగరానికి ఏమైంది? ఏలూరు (సెంట్రల్) : నగరంలోని వన్‌టౌన్ ప్రాంతంలోని తూర్పు వీధి, పంట కాలువ రోడ్డు, వీవర్స్ కాలనీ, ఫిల్ హౌస్పేట, నాలుగు కాలువల సెంటరు, మోటేపల్లివారి వీధి, కత్తేపువీధి, టూటౌన్‌లోని తంగెళ్లమూడి, దాదా పలావు సెంటరు, చాణ్యకపూరి కాలనీ, శివగోపాలపురం, పవర్‌పేట, కొత్తపేట, బాలయోగి వంతెన, చేపల తూము సెంటరు, గిలకల గేటు సెంటర్ తదితర ప్రాంతల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద డ్రెయి¯ŒSపై కల్వర్టు నిర్మాణ పనులు అధికారులు ఇటీవలే చేపట్టారు. అయితే మురుగు నీరు పోయేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో నీరు ఇళ్ల మధ్యనే నిలిచిపోతోంది. దీంతో దోమల బెడద ఎక్కువైందని స్థానికులు వాపోతున్నారు. కాగా దోమల నివారణకు ఏలూరు నగరపాలక సంస్థలో 10 హ్యండ్ ఫాగింగ్ మెషీన్లు, ఒక ఆటో మెషీన్ ఉన్నాయి. వీటిలో 4 హ్యాండ్ మెషీన్లు మరమ్మతులతో మూలనపడ్డాయి. చైర్మన్ వార్డులోనే అధ్వానం పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలో యడ్ల బజారు సెంటర్ అగ్నిమాపక కేంద్రం వద్ద చూస్తే పారిశుద్ధ్య పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. యడ్లబజారు, బ్రాడీపేట, చిత్రావి చెర్వుగట్టు, యినకొండవారి తోట, బంగారువారి చెర్వు గట్టు, గుత్తులవాని పేటల్లోని డ్రైన్లు దోమలకు నిలయాలుగా మారాయి. బ్రాడీపేట అల్లు వెంకట సత్యనారాయణ హైస్కూల్ వద్ద పరిస్థితి అధ్వానం. ఇది మునిసిపల్ చైర్మ¯ŒS వార్డు కావడం గమనార్హం. బంగారు వారి చెరువు గట్టు ఎస్కేపీ స్కూల్ వద్ద సైకిల్‌స్టాండ్ మురుగునీటితో నిండిపోయింది. ఇక్కడ విద్యార్థులు సైకిళ్లు పార్కింగ్ చేయడం మానేశారు. 16వ వార్డులో సుమారు రూ.25 లక్షలతో డ్రైనేజీ నిర్మించినా ప్రయోజనం కనిపించడం లేదు. స్ప్రేయింగ్ దాఖలాలు లేవు జంగారెడ్డిగూడెం :దోమలు, పందుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని ప్రతిసారి కౌన్సిల్ సమావేశంలో అధికారులు చెప్పడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మురుగునీరు పారుదల సక్రమంగా లేకపోవడంతో దోమలు పెరిగిపోయాయి. కచ్ఛాడ్రైన్ల పరిస్థితి సరేసరి. అప్పుడప్పుడు నామమాత్రంగా పట్టణంలో ఫాగింగ్ నిర్వహిస్తున్నా మలాథియన్ స్ప్రేయింగ్ చేసిన దాఖలాలు కానరావడం లేదు. రోజుకు రూ.లక్ష తణుకు : దోమల నియంత్రణకు రోజుకు పట్టణ ప్రజలు సుమారు రూ.లక్ష వెచ్చిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన దోమలపై దండయాత్ర కేవలం దండగయాత్రగానే ముగిసిందని పలువురు విమర్శిస్తున్నారు. పట్టణంలోని పాతవూరు, ఇరవగవరం కాలనీ, బ్యాంకు కాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీ తదితర ప్రాంతాలతో పాటు కొన్ని మురికివాడల్లో దోమల బెడద అధికంగా ఉంది. అటకెక్కిన ఫాగింగ్ యంత్రాలు నిడదవోలు : పట్టణంలోని స్లమ్ ఏరియాల్లో డ్రైన్లు లేకపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఖాళీ స్థలాలనైతే దోమలు కబ్జా చేశాయి. పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుదలకు ఏటా 1.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముగ్గు, ఆయిల్ బాల్స్, చీపుర్లకు రూ.10 లక్షలు, కార్మికుల జీతాలకు ఏటా రూ.కోటి వ్యయం. అయినా దోమల నివారణ సాధ్యం కావడం లేదు. ఉన్న మూడు ఫాగింగ్ యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. నిర్మూలనకు చర్యలు శూన్యం కొవ్వూరు : పురపాలక సంఘం ఏటా పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుదలకు ఏటా రూ.1.80 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తోంది. కేవలం దోమల నిర్మూలనకు ఏటా రూ.లక్షలు వెచ్చిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇటీవల ప్రయివేటు స్థలాలను శుభ్రం చేయించడంతో కాస్త పరిస్థితి మెరుగుపడింది. స్వయంగా మునిసిపల్ చైర్మన్ జొన్నలగడ్డ రాధారాణి ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పట్టణంలో పారిశుద్ధ ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ డ్రెయిన్ల శుభ్రత సంతృప్తికరంగా లేదని ఒప్పుకున్నారు. సిబ్బందిని ఇతర విధులకు వినియోగిస్తు న్నట్టు ఆరోపణలున్నాయి. ఫాగింగ్ యంత్రాలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. భారీ ఫాగింగ్ యంత్రం ఐదేళ్లుగా మూలనపడి ఉంది. దండయాత్ర కొనసాగిస్తున్నాం దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయలేదు. కంటిన్యూ చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలల సీజన్ కాబట్టి నిరంతరం దోమల నివారణకు ఎబెట్ ఆయిల్ పిచికారీ చేయించాం. ఇప్పుడు గురు, శుక్రవారం రెండు రోజులు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – మునిసిపల్ కమిషనర్, కె.సాయిరాం, పాలకొల్లు స్ప్రే చేయిస్తున్నాం దోమల నివారణకు పట్టణంలో ఇటీవల 300 ఆయిల్ బాల్స్ డ్రైయిన్లలో వేయించాం. 15 రోజుల క్రితం స్ప్రే చేయించాం. కొత్తగా పది స్ప్రేయర్లు కొనడానికి ప్రతిపాదనలు తయారు చేశాం. అవి రాగానే తిరిగి స్ప్రేయర్లు వినియోగిస్తాం. –సంగీతరావు. అసిస్టెంట్ కమిషనర్, తాడేపల్లిగూడెం -
దోమలపై పరీక్ష.. విద్యార్థులకు శిక్ష
– కలెక్టర్ ప్రకటనపై విస్మయం – వార్షిక పరీక్షల్లో మార్కులు కలపడం ఎలా సాధ్యం సాక్షి ప్రతినిధి, ఏలూరు : దోమలపై దండయాత్ర పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు నుంచి ప్రచార యాత్ర మొదలుపెడితే.. జిల్లా యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసింది. దోమలపై విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 50 మార్కులకు పరీక్ష నిర్వహించి, ఈ మార్కులను వార్షిక పరీక్షల్లో సైన్స్ సబ్జెక్ట్‌లో కలుపుతామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రకటించారు. నాలుగు రోజుల క్రితం విద్యాశాఖ ప్రచురించిన ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంలో కలెక్టర్ ఈ ప్రకటన చేశారు. నవంబర్ 1వ తేదీన విద్యార్థులకు దోమలపై పరీక్ష నిర్వహిస్తామని, దీనికోసం ప్రత్యేక పుస్తకాన్ని కూడా రూపొందిస్తామని ప్రకటించారు. దోమలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం మంచి కార్యక్రమమే అయినా దోమల్ని అంతమొందించేందుకు ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలను గాలికొదిలేసి విద్యార్థులకు అవగాహన కల్పించి చేతులు దులిపేసుకుంటే ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు దోమలపై దండయాత్ర కార్యక్రమం ప్రారంభించగా.. ఇప్పటికీ జిల్లాలో ఎక్కడా పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడలేదు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ఏలూరులో దోమలు తగ్గకపోగా.. బాగా పెరిగాయని నగరవాసులు గగ్గోలుపెడుతున్నారు. మార్కులు కలపడం సాధ్యమేనా! 1æనుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉందా.. అంటే లేదనే సమాధానం వస్తోంది. దోమలపై పరీక్ష నిర్వహించి.. వార్షిక పరీక్షల్లో 50 మార్కులు కలుపుతామని ప్రకటించారు. వార్షిక పరీక్షల్లో మార్కులు కలిపే అధికారం డీఈవోకు గాని, కలెక్టర్‌కు గాని ఉండదు. ఇలాంటప్పుడు ప్రచారం కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టడం.. మార్కుల పేరిట వారిని మోసగించటం సరికాదని విద్యావేత్తలు అంటున్నారు. వార్షిక పరీక్షల్లో మార్కులు కలపడం వీలు పడదని డీఈవో డి.మధుసూదనరావు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష పెడతారా.. లేక ఎప్పటిలా నాలుగు రోజులు హడావుడి చేసి ఊరుకుంటారా వేచి చూడాల్సిందే. -
డెంగ్యూ విస్తరణ
హైదరాబాద్‌ను అభివృద్ధి చెందిన, చెందుతున్న, చెందని ప్రాంతాలుగా ఇన్నాళ్లుగా పోల్చిచూస్తూ వచ్చారు. కాని విశ్వనగరమని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న భాగ్యనగరాన్ని డెంగ్యూ వ్యాధి ఉన్న, లేని ప్రాంతాలుగా విభజించి చూసే పరిస్థితి వచ్చిం దని తెలుస్తుంటే వణుకు పుడుతోంది. పగటిపూట కాటు వేయ డం ద్వారా దోమలు ఈ వ్యాధిని వ్యాపింపచేస్తున్న ప్రాంతాలు ప్రధానంగా బస్తీలేనని తేలుతోంది. అయితే సంపన్నులు తలుపులు బిగించుకున్నంత మాత్రాన, ఏసీల్లో గడిపినం త మాత్రాన డెంగ్యూ వ్యాధినుంచి బయటపడతారను కోవడం కల్లే. నిరుపేదల్లో విస్తరించి సంపన్నులను కూడా కబళించిన వ్యాధుల చరిత్ర మనందరికీ తెలుసు. ప్రజారోగ్యవ్యవస్థను పూర్తిగా ప్రక్షాళనచేస్తే తప్ప హైదరాబాద్‌ను డెంగ్యూ, స్వైన్‌ప్లూ వ్యాధులు వదలవుగాక వదలవు. ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నా పారిశుధ్యం విషయంలో తెలంగాణ రాజధాని నేటికీ అధ్వానంగా ఉంటోందన్నది వాస్తవం. వీధుల్లో రోజుల తరబడి నిండుగా కనిపిస్తున్న చెత్త కుండీలను చూస్తున్న ప్పుడు డెంగ్యూలు, స్వైన్‌ఫ్లూ కేసులు హైదరాబాద్‌లో ఇంత ఎక్కువగా ఎందుకుంటున్నాయో సులభంగా అర్థమవుతుంది. ప్రభుత్వం నగరంలో పరిశుభ్రతపై ఇకనైనా దృష్టి ఉంచాలి. మల్లేశం చింతలబస్తీ, ఖైరతాబాద్