
కొబ్బరి, పామాయిల్ తోటలను ఆశిస్తున్న వలయాకారపు తెల్లదోమను వేస్ట్ డీ కంపోజర్(డబ్లు్య.డి.సి.) ద్రావణం పిచికారీతో అరికట్టవచ్చు. 200 లీటర్ల నీటిలో డబ్లు్య.డి.సి. బాటిల్‌లోని 30 గ్రాముల పొడితోపాటు 2 కిలోల బెల్లం కలిపి.. రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం కలియదిప్పాలి. ఈ ద్రావణం ఐదారు రోజులకు వాడకానికి సిద్ధమవుతుంది. అదనంగా నీటిని కలపకుండా ఈ ద్రావణాన్ని కొబ్బరి/పామాయిల్ తోటలపై పిచికారీ చేయాలి. 3 రోజుల విరామంతో కనీసం 5 విడతలు పిచికారీ చేయాలి. చెట్టు తడిచేలా పిచికారీ చేయాలి. మునగ తదితర కూరగాయ తోటల్లో తెల్లదోమను డబ్లు్య.డి.సి. సమర్థవంతంగా అరికట్టింది. వలయాకారపు తెల్లదోమను సైతం అరికడుతుంది.
వేస్ట్ డీ కంపోజర్’ సీసాలు ఎక్కడ దొరుకుతాయి?
వేస్ట్ డీ కంపోజర్ సీసాలను హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని మార్క్ అగ్రి జెనెటిక్స్ ప్రై. లిమిటెడ్ కార్యాలయం నుంచి పొందవచ్చు. కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ప్రాంతీయ మండలిగా గుర్తింపు పొందిన సంస్థ ఇది. ఈ కార్యాలయం నుంచి (ఉదయం 10 గం. నుంచి 5 గం. వరకు) రూ. 20లకు వేస్ట్ డీ కంపోజర్ సీసాలను రైతులు స్వయంగా వచ్చి కొనుగోలు చేయవచ్చు. రైతులు ఆధార్ కార్డు నకలు, పట్టాదారు పాస్‌బుక్ నకలును వెంటతీసుకెళ్లాలి.
వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: సేంద్రియ రైతుల సేవా కేంద్రం, మార్క్ ప్రోగ్రీన్ జెనెటిక్స్ ప్రై.లిమిటెడ్, 416/ఎ, బాబూఖాన్ ఎస్టేట్, బషీర్‌బాగ్, హైదరాబాద్. 040– 23235858, 91009 80757. వేస్ట్ డీ కంపోజర్ సీసాను ఒకసారి కొనుక్కుంటే చాలు. ద్రావణాన్ని 5 లీటర్లు పక్కన పెట్టుకుంటే.. మళ్లీ అవసరమైనప్పుడు 200 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లం కలిపి ఈ ద్రావణాన్ని పాలలో తోడు మాదిరిగా డ్రమ్ములో కలిపితే చాలు.. నాలుగైదు రోజుల్లో డ్రమ్ము ద్రావణం వాడకానికి సిద్ధమవుతుంది.
– డా. వి. ప్రవీణ్‌కుమార్ (92478 09764), శాస్త్రవేత్త, జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎఫ్.), కేంద్ర వ్యవసాయ శాఖ, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment