దేశంలోని కొన్ని రైళ్లలో ప్రయాణాలు సాగించే ప్రయాణికులు పలు సమస్యలను ఎదుర్కొంటుండటాన్ని మనం చూసే ఉంటాం. అయితే తొలి కార్పొరేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. దోమల బెడదతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
లక్నో- ఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ (82501)లో ప్రయాణం సాగించిన ఒక ఒక ప్రయాణికుడు దోమల బెడద గురించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు సోషల్ సైట్ ‘ఎక్స్’ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో చలనం కలిగింది. ఈ ఘటనపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని తేజస్ రైలు నిర్వహణ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
రాజీవ్ శర్మ అనే ప్రయాణికుడు ‘ఎక్స్’ ప్లాట్‌ఫారంలో ‘నేను లక్నో నుండి న్యూఢిల్లీకి తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్పప్పుడు రైలు దోమల నిలయంగా కనిపించింది. ఇది ప్రతిష్టాత్మక రైలులో తలెత్తిన సమస్య. ఈ రైలు ఛార్జీలు విమాన చార్జీలతో సమానంగా ఉన్నాయి’ అంటూ రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల్లో కలకలం చెలరేగింది. దీనిపై వెంటనే దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment