వ్యాక్సిన్‌ తీసుకున్నవారు ఇతర పేషెంట్లను తింటున్నారు? | Fact Check: Covid Vaccine Turns People Into Zombies Is False | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌తో జాంబీలుగా మారిపోతున్నారా?

Published Sat, Dec 26 2020 6:39 PM | Last Updated on Sat, Dec 26 2020 7:50 PM

Fact Check: Covid Vaccine Turns People Into Zombies Is False - Sakshi

వాషింగ్టన్‌: ఓ వైపు కోవిడ్‌తో అల్లల్లాడిపోతున్న జనాలకు అతి త్వరగా కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు వైద్యులు విస్తృత ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు వ్యాక్సిన్‌తో ప్రమాదమంటూ ఫేక్‌ వార్తలు జనాలను కంగారుపెట్టిస్తున్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో ఓ అర్థం పర్థం లేని వార్త జనాలను ఆందోళనకు గురి చేస్తోంది. అందులో ఏముందంటే.. "బ్రేకింగ్‌ న్యూస్‌: తొలుత కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న రోగులు ఇతర పేషెంట్లను తింటున్నారు. దీంతో సదరు ఆస్పత్రులకు తాళాలు వేస్తున్నారు" అంటూ ఓ ఫొటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన లాస్‌ ఏంజెల్స్‌లో జరిగినట్లుగా ఫొటో మీద పొందుపరిచారు. దీన్ని ప్రముఖ మీడియా ప్రసారం చేసినట్లు మార్ఫింగ్‌ చేశారు. అయితే ఈ వార్తను నమ్మిన కొందరు నెటిజన్లు దాన్ని ఇతరులకు షేర్‌ చేస్తున్నారు. (చదవండి: టర్కీ వీధుల్లో అనుకోని అతిథుల హల్‌చల్‌)

వ్యాక్సిన్‌ తీసుకుంటే మనుషులు జాంబీలుగా మారి ఇతరులను తింటారని పలువురు భయపడుతున్నారు. కానీ అది పూర్తిగా అవాస్తవం. అసలు ఆ ప్రచారానికి, కరోనా వ్యాక్సిన్‌కు అసలు సంబంధమే లేదు. అమెరికాలోని ఉత్తర ఫిలడెల్ఫియాలో టెంపుల్‌ యూనివర్సిటీ ఆస్పత్రిలో బుల్లెట్ల వర్షానికి గురైన బాధితులకు వైద్యం అందిస్తుండగా తీసిన ఫోటోను మార్ఫింగ్‌ చేసి అలా ప్రచారం చేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో తీసిన ఈ ఫొటోను ప్రస్తుతం కరోనాతో కనెక్షన్‌ కలుపుతూ జనాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వ్యాక్సిన్‌ తీసుకుంటే నరమాంసం తినే జాంబీలుగా మారిపోతారనేది శుద్ధ అబద్ధం మాత్రమే! కాబట్టి ఇలాంటి ఫేక్‌ వార్తలను నమ్మకండి, ఇతరులకు షేర్‌ చేయకండి. (చదవండి: కరోనా : ఆ టీకా తీసుకున్న వైద్యుడికి అలర్జీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement