viagra
-
బీట్రూట్ వయాగ్రాలా పనిచేస్తుందా? మార్కెట్లో దొరకడం లేదట!?
బీట్రూట్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో సందేహంలేదు. ఈ దుంపకూరలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. దీన్ని ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. బీట్రూట్ తింటే మూత్రం ఎరుపు లేదా ఊదా రంగులో (బీటూరియా) వస్తుంది. కానీ ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు. బీట్రూట్ వల్లన పెద్దగా దుష్ప్రభావాలు పెద్దగా ఏమీలేవు. అయితే ఇటీవల ఒక న్యూస్ వైరల్‌గా మారింది. స్త్రీ పురుషుల లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంపొందిస్తుందనే వార్త వైరల్ అయింది. వయాగ్రాలా పనిచేస్తుందని వార్తలొచ్చాయి. దీంతో డిమాండ్ బాగా పెరిగింది. ఆస్ట్రేలియన్ సూపర్ మార్కెట్ బీట్రూట్ కొరత ఏర్పడింది. ఒక సమయంలో, ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఈబేలో ఎక్కువ ధరకు అమ్ముడైందిట. అయితే దీనిపై యూకే టీవీ డాక్టర్ మైఖేల్ స్పందించారు.ఇది వయాగ్రాలా పనిచేస్తుందనడానికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేశారు. కాని ఇది సహజ సిద్ధంగా లభించే సూపర్ ఫుడ్ అని ముఖ్యంగా విటమిన్ బీ, సీ, మినరల్స్, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. రక్త ప్రసరణకు బాగా ఉపయోగపడుతుందన్నారు. అయితే రోమన్లు బీట్రూట్ , దాని రసాన్ని కామోద్దీపనగా ఉపయోగించారని చెబుతారు.బీట్రూట్ తిన్నప్పుడు, బ్యాక్టరియా ఎంజైమ్లతో కూడిన రసాయన ప్రతిచర్యలు బీట్రూట్లోని నైట్రేట్‌ను నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తాయి ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. పలు అధయనాల ప్రకారం ఫుడ్ ఆధారిత నైట్రిక్ ఆక్సైడ్ పురుషులలో లైంగిక జీవితానికి అవసరమైన టెస్టోస్టెరాన్ హార్మోన్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా బీట్రూట్లోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే సామర్థ్యం గుండె, రక్తనాళాల ప్రసరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది దీన్ని జ్యూస్ చేసుకుని తాగినా, కూర చేసుకుని తిన్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి బీట్ రూట్ ఒక వరం లాంటిది. శరీరానికి అవసరమయిన నీటి శాతాన్ని బీట్రూట్ అందిస్తుంది. -
వయాగ్రా..! నవజాత శిశువుల పాలిట వరం!
గర్భస్థ శిశువు, నవజాత శిశువులు శ్వాస సంబధ సమస్యలు ఎదుర్కొటుంటారు. వారికి ట్రీట్మెంట్ అందించడం అనేది ఓ సవాలు. దీని వల్ల మెదడుకు సక్రమంగా ఆక్సిజన్ అందక బుద్ధిమాంద్య పిల్లల్లా లేదా మానసిక వికలాంగులులా మిగిలిపోతున్నారు. అలాంటి శిశువులకు వయాగ్రాతో చికిత్స అందిస్తే మెరుగైన ప్రయోజనం ఉంటుందని కెనడాలోని మాంట్రియల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. నిజానికి గర్భస్థ శిశువులు లేదా నవజాత శిశువులు ఎక్కువగా ఈ శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిని నియోనాటల్ ఎన్సెలోపతి అంటారు. నిజానికి ఇలాంటి సమస్యలతో బాధపడే చిన్నారులకు సాధారణంగా ఇప్పటి వరకు థెరప్యూటిక్ హైపోథెర్మీయా(అల్పోష్ణ స్థితి) చికిత్స మాత్రేమే అందిస్తున్నారు. ఇది శరీరాన్ని కూల్ చేసే పద్ధతి. దీన్ని కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యి వ్యక్తి గుండె మళ్లీ కొట్టుకునేలా చేసిన తర్వాత ఆ వ్యక్తి శరీరాన్ని కూల్ చేయడానికి ఈ థెరప్యూటిక్ హైపోథెర్మీయా(అల్పోష్ణ స్థితి) చికిత్స విధానాన్నే అందించడం జరుగుతుంది. అయితే ఈ చికిత్స విధానాన్ని శిశువులకు అందిస్తుంటే వారిలో సుమారు 29% మంది శిశువులు నరాల సంబంధిత సమస్యలు ఎదురయ్యి మెదడు డెవలప్ అవ్వకపోవడం లేదా దెబ్బతినడం జరుగుతోంది. ఈ సమస్యకు సిల్డెనాఫిల్(వయాగ్రా)తో చెక్‌పెట్టొచ్చని కెనడాలోని మాంట్రియల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇలా థెరప్యూటిక్ హైపోథెర్మీయా చికిత్స తీసుకుని మెదడు దెబ్బతిన్న చిన్నారులకు సిల్డెనాఫిల్(వయాగ్రా)తో చికిత్స అందించగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. వారిలో కేవలం 30 రోజుల్లో బూడిదరండు పదార్థం పెరిగింది. పైగా 18 నెలల్లోనే న్యూరో డెవలప్మెంట్లో మంచి ఫలితాలు చూపించాయి. ఈ మేరకు మాంట్రియల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం తీవ్రమైన నియోనాటల్ ఎన్సెఫలోపతితో బాధపడుతున్న మొత్తం 24 మంది శిశువులను తీసుకున్నారు. వారిలో ముగ్గురికి తప్పించి మిగతా అందరికి వయాగ్రాతో చికిత్స అందించారు. ఈ వయగ్రా తీసుకున్న శిశువులందరిలో మెదుడలోని గాయాలు నయమవ్వడం, వాల్యూమ్ కోల్పోయిన మెదడులో బూడిద రంగు పదార్థం పెరగడం వంటివి జరిగాయని అన్నారు. తక్కువ టైంలోనే వారిలో న్యూరో డెవలప్మెంట్ మెరగయ్యిందని, అలాగే ఇది వారికి సురక్షితమైనదేనని పేర్కొన్నారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా నియోనాటల్ ఎన్సెఫలోపతితో బాధపడుతున్న చిన్నారులకు ఈ చికిత్స విధానమే బెస్ట్ అని చెప్పారు. (చదవండి: గంట ఆగిన గుండె... మళ్లీ కొట్టుకుంది!) -
వయాగ్రాపై బ్యాన్.. ఉడుం నూనె కోసం ఎగబడుతున్న యువత..!
ఇస్లామాబాద్: వయాగ్రా వినియోగంపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో కామోద్ధీపన కోసం ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు అక్కడి యువకులు. ఈక్రమంలో ఉడుం కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఉడుములు వేటాడే ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లో రావల్పిండి యువకులు ఈ ఉడుం నూనె కోసం పరితపిస్తున్నారు. ఎంత డబ్బైనా వెచ్చింది దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉడుం నుంచి తీసిన కొవ్వును తేలు నూనెలో మేరినేట్ చేసి ఎరుపు రంగు మసాలలలో ఉపయోగిస్తారు. లేదా దీనితో సాందా తైలాన్ని తయారు చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్తే లైంగిక వాంఛ, సామర్థ్యం పెరిగి పడకగదిలొ రెచ్చిపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రావల్పిండిలోని రాజా బాజార్లో ఉడుం నూనె కోసం యువకుల తాకిడి పెరిగింది. పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో చాలా ముంది ఉడుముల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీటికి డిమాండ్ పెరగడంతో వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉడుములను చంపడం తమకు బాధగా అన్పిస్తోందని, కానీ జీవనోపాధి కోసం తప్పడం లేదని వారు చెబుతున్నారు. దశాబ్దాలుగా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నామని పేర్కొన్నారు. పాకిస్తాన్లో ఎక్కుమంది పిల్లల్ని కంటేనే సమాజంలో ఆ దంపతులను గౌరవం ఉంటుంది. పిల్లలు లేకపోతే పరువు పోతుందని చాలా మంది లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయాగ్రా ఉపయోగించేవారు. ఇప్పుడు దానిపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఉడుం నూనెకు డిమాండ్ పెరిగింది. అయితే దీని వల్ల లైంగిక వాంఛ, సామర్థ్యం, పటుత్వం పెరుగుతుందని ఇప్పటివరకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఉడుం వేటగాళ్లు మాత్రం నిజంగానే దీనిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలున్నాయని చెబుతున్నారు. చదవండి: ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో.. -
వయాగ్రా అంత డేంజరా? ట్యాబ్లెట్ వేసుకుని మందు తాగిన వ్యక్తి 24 గంటల్లోనే..
న్యూఢిల్లీ: వయగ్రా వేసుకుని మద్యం సేవించిన 41 ఏళ్ల వ్యక్తి 24 గంటల్లోనే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి భారత పరిశోధకులు రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అంగ స్తంభన సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి రెండు వయగ్రా ట్యాబ్లెట్లు వేసుకుని అదే సమయంలో ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. ఆరుగురు సభ్యులతో కూడిన ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు దీనిపై కేస్ రిపోర్ట్‌ను గతేడాది సెప్టెంబర్‌లో రూపొందించారు. దీన్ని ఈ వారమే ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఈ నివేదిక ప్రచురణకు కూడా ఆమోదం పొందింది. అయితే పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత జర్నల్‌లో ప్రచురించనున్నారు. వయగ్రా తీసుకుని మద్యం తాగడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయనే విషయంపై ఈ పరిశోధకులు పరిశోధనలు జరిపారు. ఈ ఘటనలో మరణించిన 41 ఏళ్ల వ్యక్తికి గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి శస్త్రచికిత్సలు కూడా జరగలేదని గుర్తించారు. ఇతడు చనిపోవడానికి ముందు రోజు తన స్నేహితురాలితో హోటల్లో ఉన్నాడు. రెండు వయాగ్రా ట్యాబ్లెట్లతో పాటు ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే తనకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో బ్రెయిన్లో బ్లీడింగ్ కావడం వల్లే అతను చనిపోయినట్లు తేలింది. మెదడులో గడ్డకట్టిన రక్తం 300 గ్రాములు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. అలాగే అతని హార్ట్ వాల్స్ గట్టిపడటంతో పాటు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినట్లు వెల్లడైంది. వైద్యుల సూచన అవసరం.. దీంతో వైద్యుల సూచన లేకుండా వయగ్రా వాడకూడదని పరిశోధకులు హెచ్చరించారు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయనే విషయంపైనా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చదవండి: ఆ బీజేపీ ఎమ్మెల్యేకు ఈ రేంజ్లో వెల్కం ఏంది నాయనా..? -
Wuhan Lab: వయాగ్రా దోమల లీక్.. కలకలం!
వుహాన్ ల్యాబ్ పరిశోధకుల తాజా పరిశోధన బెడిసి కొట్టింది. వయాగ్రా ఇంజెక్ట్ చేసిన వేల కొద్దీ దోమలు .. ల్యాబ్ నుంచి బయటపడ్డాయి. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్ నిర్వాహకులు ప్రకటించగా.. ఆ దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటు చేసుకున్నాయి. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతుండడంతో ఆందోళన మొదలైంది. వైరల్ వార్త.. చైనా నుంచి మరో షాక్. వయాగ్రా దోమల ప్రభావంతో చైనాలో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. పండు ముసళ్లోల్ల దగ్గరి నుంచి కుర్రాల దాకా కామ వాంఛతో రగిలిపోతున్నారు. వుహాన్కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు ఒకడు కోరికల్ని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాడు. మరో పేషెంట్ నగ్నంగా ఆస్పత్రిలో తిరుగుతూ.. పబ్లిక్‌గా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి కనిపించిన వాళ్లపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇది వుహాన్ కెచ్‌లీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక ఇది మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని వుహాన్ ల్యాబ్ హెడ్ రీసెర్చర్ డాక్టర్ వెంజి యింగ్ యిన్ జింగ్ భయపడుతున్నారని వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. One more shock from China. Wuhan: Thousands of mosquitoes inoculated with Viagra escape from high-security laboratory https://t.co/h4FAK7yp1g — किसान 🇮🇳 (@WadheshT) June 15, 2021 ఫ్యాక్ట్ చెక్.. వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనేది కంప్లీట్ సెటైరికల్ వెబ్సైట్. ‘‘నిజనిర్థారణలతో సంబంధం లేదు’’ అనేది ఆ వెబ్సైట్ క్యాప్షన్. అందులో కంటెంట్ మామూలుగా ఉండదు. కుక్కకు-పిల్లి తోకకు ముడిపెట్టి కథనాలు పబ్లిష్ చేస్తుంది. పైగా జనాలు అది నిజమని గుడ్డిగా నమ్మేంత పక్కాగా. అందులో ఉంది అధికారిక సమాచారమేమో అనేంతలా స్టోరీలు అల్లుతుంది. వుహాన్ ల్యాబ్ మీద సెటైరిక్‌గా పోయిన నెలలో రాసిన ఈ ఆర్టికల్.. ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఇందులో ఉన్న వృద్ధుడి ఫొటో అసలు చైనా వ్యక్తిదే కాదు. జపాన్ వ్యాపారవేత్త యుకిషి చుగంజి. 2003లో 114 వయసులో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆ టైంలో ప్రపంచంలో అత్యంత వృద్ధుడి రికార్డు ఆయన పేరు మీద ఉండేది. #CKMKB 😂😂 Good news “The effects of one mosquito bite can last up to forty-eight hours and symptoms include an increase in libido, sexual arousal, and possibly a very, very large erection,” Dr. Wenzi told the press during a press conference.https://t.co/iR5nHFIWBC — 🥃🚬 (@BeastOnDrive) June 15, 2021 -
ఖరీదైన వయాగ్రా.. ఇప్పుడు ఆ జాబితాలో
డెహ్రాడూన్: లైంగిక ఉద్దీపన కోసం వాడే, హిమాలయన్ వయాగ్రాగా గుర్తింపు పొందిన ‘యార్సాగుంబా’ను ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్) అంతరించి పోయే జాతుల జాబితాలో చేర్చింది. అత్యంత ఖరీదైన ఈ వన మూలిక త్వరలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు జూలై 9న విడుదల చేసిన నివేదికలో అంతరించే పోయే జీవ జాతుల(జంతువులు, మొక్కలు) జాబితాను పొందుపరిచింది. ఇందుకు సంబంధించిన తొమ్మిది కేటగిరీల్లో యార్సాగుంగాను ‘వల్నరబుల్’ కేటగిరీలో చేర్చింది. అధికంగా సేకరిస్తున్న కారణంగా గత 15 ఏళ్లుగా దీని విస్తరణ 30 శాతానికి పడిపోయిందని పేర్కొంది. ఈ విషయం గురించి ఐయూసీఎన్ భారత ప్రతినిధి వివేక్ సక్సేనా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. హిమాలయన్ వయాగ్రా కనుమరుగైపోకుండా ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకునేందుకు ముందుకు రావాలనే ఉద్దేశంతో తాము ఈ వనమూలికను రెడ్ లిస్టులో చేర్చినట్లు తెలిపారు. కాగా ఐయూసీఎన్ తాజా నివేదిక ఉత్తరాఖండ్‌లోని అనేక మంది గ్రామీణ ప్రజలు ఉపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కిలో రూ. 20 లక్షలు గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్‌ను యార్సాగుంబా అని పిలుస్తారు. శీతాకాలంలో ఇది పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడువు ఉంటుంది. టిబెట్ పీఠభూమి, నేపాల్, చైనా, భారత్, భూటాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. ఉత్తరాఖండ్‌లో దీనిని కీడా జాడీగా వ్యవహరిస్తారు. పితోరాఘర్, చమోలీ జిల్లాలో అత్యధిక మంది ప్రజలు జీవనోపాధి కోసం యార్సాగుంబా సేకరణపై ఆధారపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో కిలో యార్సాగుంబా ధర దాదాపు రూ. 20 లక్షలు పలుకుతుంది. అందుకే బంగారం కన్నా విలువైన ఈ మూలిక కోసం చిన్నాపెద్దా అంతా వేట సాగిస్తారు. ప్రాణాలు పణంగా పెట్టి మరీ యార్సాగుంబా సేకరణలో తలమునకలైపోతారు. ఏప్రిల్ నుంచి జూన్ రెండో వారం వరకు యార్సాగుంబాను సేకరిస్తారు. అయితే ప్రస్తుతం కేడా జాడీని కనుమరుగయ్యే జాబితాలో పెట్టినందున హార్వెస్టింగ్ పీరియడ్‌ను నెల రోజులకు కుదించినట్లు అల్మోరాలోని జీబీ పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ ఆర్ఎస్ రావల్ తెలిపారు. ఈ ఏడాది అస్సలు బాలేదు ఈ విషయం గురించి పితోఘర్ జిల్లాలోని గోల్ఫా వాన్ పంచాయతీ ప్రధాన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది పరిస్థితులు అస్సలు బాగాలేవు. కీడా జాడీని సేకరించేందుకు అనుమతి లభించలేదు. క్యాంపులు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడేమో ఈ రెడ్ లిస్టు. దీని వల్ల మా ఆ ఆదాయం దెబ్బతింటుంది. అనేక కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంటాయి’’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గతేడాది జిల్లా యంత్రాంగాలు ప్రజలకు పాసులు ఇచ్చి.. అటవీ అధికారుల పర్యవేక్షణలో కీడా జాడీని సేకరించే వీలు కల్పించింది. అయితే ఈ ఏడాది కోవిడ్-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో వారు ఆర్థికంగా నష్టపోయారు. ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్‌తో వల్ల హార్వెస్టింగ్‌కు ఇబ్బంది తలెత్తడం, ఈ ఏడాది తగినంతగా ఫంగస్ ఉత్పత్తి కాకపోవడంతో రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక అటవీ అధికారులు తెలిపారు. కాగా బురదలో పెరిగే ఈ పసుపు రంగు మూలికకు లైంగిక కోరికలు పెంచడం, నపుంసకత్వాన్ని నయం చేయడమే గాక.. కీళ్ల నొప్పులు, ఊబకాయం తగ్గించడంతో పాటుగా కేన్సర్ కణాలను నాశనం చేయగల గుణాలున్న ఔషధం అని చైనా పరిశోధకులు గతంలో పేర్కొన్నారు. -
వయాగ్రా కోసం వెళ్లి 8 మంది మృతి!
ఖాట్మాండు : అరుదుగా లభించే వనమూలిక, హిమాలయా వయాగ్రా పేరుగాంచిన ‘యార్సాగుంబా’ కోసం వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లోని డోప్లా జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యార్సాగుంబా కోసం హిమాలయాలు ఎక్కిన 8 మందిలో ఐదుగురు ఆనారోగ్యంతో మరణించారని, ఇద్దరు అత్యంత ఖరీదైన వనమూలిక పీకే క్రమంలో కొండపై నుంచి జారిపడి తుదిశ్వాస విడిచారన్నారు. ఇక తన తల్లితో వెళ్లిన ఓ చిన్నారి సైతం అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయడన్నారు. ఒక కిలో యార్సాగుంబా ధర రూ.60 లక్షల(లక్ష డాలర్ల) పైమాటే. గ్రామీణ నేపాల్‌లో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో మెజారిటీ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. చాలా విలువైన మూలికలు కావడంతో వీటి కోసం ప్రాణాలకు తెగించి మరీ ఈ కుటుంబాలు పోరాడుతున్నాయి. హిమాలయాల్లో వేసవి ప్రారంభమై మంచు కరగడం మొదలుపెడితే చాలు.. నేపాలీలు పచ్చిక బయళ్ల వైపు పరుగు తీస్తారు.. నెల రోజుల పాటు బంగారం కన్నా యార్సాగుంబా కోసం చిన్నాపెద్దా అంతా వేట సాగిస్తారు. పసుపు పచ్చ రంగులో ఉండే ఇది బురదలో పెరుగుతుంది. లైంగిక కోరికలను రేకెత్తించడంతో పాటు పుష్కలమైన ఔషధ గుణాలు ఈ మూలిక సొంతం. గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్సే ఈ యార్సాగుంబా. చైనాలో డాంగ్ ఛాంగ్ జియా కావో అనే రెండు తలల పురుగు ఉంటుంది. దీనిని వేసవి గడ్డి, చలికాలపు పురుగు అంటారు. శీతాకాలంలో యార్సాగుంబా పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది. యార్సాగుంబా సేకరించేవారి కోసం ప్రభుత్వం హెల్త్‌క్యాంప్‌లు కూడా ఏర్పాటు చేసింది. చాలామంది సేకరణదారులు ఈ హెల్త్‌క్యాంప్‌ల్లో చికిత్స పొందారని అధికారులు వెల్లడించారు. నేపాల్ రాజధాని ఖట్మాండుకు 600 కిలోమీటర్ల దూరంలో ఉండే డోప్లా జిల్లాలో యార్సాగుంబా సేకరణదారులు ఎక్కువగా ఉంటారు. -
కేన్సర్ కణితులను అడ్డుకునే వయాగ్రా?
జబ్బులకు కొత్త కొత్త మందులు కనుక్కోవడం భారీ ఖర్చుతో కూడుకున్న పని. కేన్సర్ విషయాన్నే తీసుకుంటే ఈ మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయలు దాటిపోతుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఇతర సమస్యలకు వాడుతున్న మందుల్లోనే కేన్సర్‌ను ఎదుర్కొనే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ అన్వేషణలో శాస్త్రవేత్తలు గుర్తించిన సరికొత్త మందు.. వయాగ్రా! ఇందులోని రసాయనం పీడీఈ5 రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దపేవు, కాలేయ కేన్సర్ కణితుల పెరుగుదలను అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నిజానికి వయగ్రాను శృంగార సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తయారు చేయలేదు. గుండెజబ్బులకు సంబంధించి వచ్చే చాతినొప్పిని నివారించడం ఈ మందు ఉద్దేశం. పీడీఈ5 రసాయనం నాడుల్లో రక్తం వేగంగా ప్రసారమయ్యేలా చేస్తుంది. ఈ క్రమంలోనే ఇతర అవయవాల్లోనూ రక్తప్రసరణ హెచ్చడంతో కంపెనీలు వయాగ్రాను ఇతర అవసరాల కోసం అమ్మడం మొదలుపెట్టి సొమ్ము చేసుకున్నాయి. అయితే పీడీఈ5ను నిశితంగా పరిశీలించినప్పుడు దీన్ని కేన్సర్ చికిత్సలోనూ వాడవచ్చునని స్పష్టమైంది. ఇప్పటికే దాదాపు 25 అధ్యయనాలు ఈ విషయాన్ని తెలిపాయి. ప్రస్తుతం దాదాపు 11 పరిశోధనలు కేన్సర్ విషయంలో వయాగ్రా పాత్ర ఏమిటన్నది పరిశీలిస్తున్నాయి. వీటన్నింటి ఫలితాల ఆధారంగా కేన్సర్ చికిత్సగా వయాగ్రా వాడకంపై ఒక స్పష్టమైన అంచనాకు రావచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే కేన్సర్ చికిత్స కోసం పీడీఈ5ను వాడేందుకు అనుమతులు లేవు. కాకపోతే భవిష్యత్తులో అందుబాటులోకి వస్తే మాత్రం చాలా చౌకగా కేన్సర్‌ను జయించేందుకు ఇదో మార్గమవుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. -
హిమాలయన్ వయాగ్రా..‘యార్సాగుంబా..
ఒక కిలో యార్సాగుంబా ధర రూ.60 లక్షల(లక్ష డాలర్ల) పైమాటే. గ్రామీణ నేపాల్‌లో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో మెజారిటీ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. చాలా విలువైన మూలికలు కావడంతో వీటి కోసం ప్రాణాలకు తెగించి మరీ ఈ కుటుంబాలు పోరాడుతున్నాయి. హిమాలయాల్లో వేసవి ప్రారంభమై మంచు కరగడం మొదలుపెడితే చాలు.. నేపాలీలు పచ్చిక బయళ్ల వైపు పరుగు తీస్తారు.. నెల రోజుల పాటు బంగారం కన్నా విలువైన వస్తువు కోసం చిన్నాపెద్దా అంతా వేట సాగిస్తారు. ఇంతకీ వీరి అన్వేషణ దేనికి అంటే.. యార్సాగుంబా కోసం.. ఇదే హిమాలయన్ వయాగ్రా. పసుపు పచ్చ రంగులో ఉండే యార్సాగుంబా బురదలో పెరుగుతుంది. లైంగిక కోరికలను రేకెత్తించడం తోపాటు పుష్కలమైన ఔషధ గుణాలున్న మూలిక. గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్సే ఈ యార్సాగుంబా. చైనాలో డాంగ్ ఛాంగ్ జియా కావో అనే రెండు తలల పురుగు ఉంటుంది. దీనిని వేసవి గడ్డి, చలికాలపు పురుగు అంటారు. శీతాకాలంలో యార్సాగుంబా పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది. ఎలా గుర్తించారు... వెయ్యేళ్ల క్రితం పశుపోషకులు యార్సాగుంబాను గుర్తించారు. దీనిని పశువులకు దాణాగా ఉపయోగించే వారు. వీటిని తిన్న తర్వాత పశువులు చాలా చురుకుగా మారిపోయేవి. దీంతో ఈ మూలికల్లో ప్రత్యేకత ఉందని గుర్తించారు. 1960ల్లో టీ, సూప్‌లు మొదలైన వాటిలో ఈ మూలికలను కలిపి తాగేవారు. బాతులను తినేందుకుగానూ ముందుగా వాటికి యార్సాగుంబా మూలికలను తినిపించేవారు. ఓ చైనీస్ రన్నర్ దీనిని తిని రెండు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టడంతో 1990ల్లో దీనికి ప్రపంచ గుర్తింపు లభించింది. పెరిగిన డిమాండ్.. తగ్గిపోతున్న ఉత్పత్తి.. ప్రస్తుతం చైనా ఔషధ పరిశోధకులు దీనిని లైంగిక కోరికలు పెంచే.. నపుంసకత్వాన్ని నయం చేసే మూలి కగానే కాక.. జాయింట్ పెయిన్స్‌ను తగ్గిస్తుందని, ఊబకా యం, కేన్సర్‌కు ఉపయోగపడుతుందని చెపుతున్నారు. యార్సాగుంబాకు ఉన్న వైద్య విలువపై హైప్ కారణంగా ఇటీవల డిమాండ్ పెరిగింది. ఈ ఉత్పత్తుల కోసం జనం ఎగబడుతున్నారు. దీంతో 2009–2011 తర్వాత యార్సాగుంబా ఉత్పత్తి సగానికిపైగా పడిపోయింది. సరైన నియంత్రణ లేకపోవడం, వాతావరణ మార్పులు, ఉత్పత్తికి మించి డిమాండే దీనికి కారణం. -
వయగ్రాతో గుండె జబ్బులు దూరం
లండన్: లైంగిక ఉద్దీపన కోసం వాడే వయగ్రా మాత్రలను హృద్రోగులు, అధికరక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడరాదంటూ ఇంతకాలం వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. వయగ్రా వాడడం వల్ల గుండె రక్తనాళాల్లో రక్త ప్రవాహం ఒత్తిడి పెరిగి గుండెపోటు వస్తుందనే అభిప్రాయమే అందుకు కారణం. వాస్తవానికి వయగ్రా మాత్రలు వాడడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని తమ తాజా పరిశోధనల్లో వెల్లడైనట్లు ఇంగ్లండ్‌లోని మాన్చెస్టర్ యూనివర్శిటీకి చెందిన వైద్య నిపుణులు తెలిపారు. మధుమేహంతో బాధపడుతున్న ఆరువేల మందిపై తాము జరిపిన పరిశోధనల్లో ఈ సరికొత్త విషయం తేలిందని చెప్పారు. మధుమేహంలేనివారికే ఎక్కువగా హృద్రోగ సమస్యలు వచ్చాయని, కొంత మందికి గుండెపోటు కూడా వచ్చిందని, మధుమేహం ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు బాగా తగ్గిపోయాయని వారు చెప్పారు. మధుమేహం ఉన్నవారికి ఎక్కువగా హృద్రోగ సమస్యలు వస్తాయికనుక వారినే ప్రధాన ప్రాతిపదికగా తీసుకొని తాము అధ్యయనం జరిపామని వారన్నారు. మధుమేహగ్రస్థుల్లో గుండె కండరాలు బిగుసుకుపోతాయని, రక్తనాళాలు కుంచించుకుపోతాయని, పర్యవసానంగా గుండె సమస్యలు వస్తాయని వారు చెప్పారు. మధుమేహులకు వయగ్రా మాత్రలు ఇవ్వడం వల్ల వారి గుండె రక్తనాళాల్లో రక్త ప్రవాహం పెరగడంతో వాటిలో ఉండే కండరాల కణజాలం క్రియాశీలకంగా మారిందని, వయగ్రా మాత్రల్లో ఉండే ‘పీడీఈ5ఐ’ రసాయనం కారణంగా ఇలా జరిగిందని ప్రొఫెసర్ ఆండ్రీ ట్రాఫోర్డ్ ఆధ్వర్యంలో అధ్యయనం జరిపిన బృందం పేర్కొంది. వయగ్రా వల్ల గుండె కొట్టుకునే వేగం కూడా నియంత్రణలోనికి వచ్చిందని తెలిపింది. ఈ కారణంగా గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా వయగ్రా మాత్రలను ఇవ్వొచ్చన్నది తమ అధ్యయనంలో తేలిన అంశమని బ్రిటన్ హార్ట్ ఫౌండేషన్ తరఫున అధ్యయనం జరిపిన వైద్య బృందం స్పష్టం చేసింది. తాము ఎంపిక చేసుకున్న ఆరువేల మంది మధుమేహగ్రస్థుల్లో వయగ్రా వాడడం వల్ల ఎవరికీ హృద్రోగ సమస్యలు రాలేదని, వాడని వారికే వచ్చాయని తెలిపింది. వారు అధ్యయనం వివరాలను ‘జర్నల్ బీఎంజే హార్ట్’లో ప్రచురించారు. వాస్తవానికి ఆంజినా అనే గుండె జబ్బును నయం చేయడంలో భాగంగానే 20 ఏళ్ల క్రితం వయగ్రా మాత్రను కనుగొన్నారు. దానివల్ల లైంగిక ఉద్దీపన ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గ్రహించి దీన్ని సెక్స్ డ్రగ్‌గా ముద్రవేశారని వైద్య నిపుణులు ఇంతకుముందు కూడా చెబుతూ వచ్చారు. తాజా పరిశోధనతో వయగ్రా గుండె జబ్బులు రాకుండానే ఎక్కువ ఉపయోగపడుతుందని గ్రహించారు. -
వయాగ్రాతో జర జాగ్రత్త!
వాషింగ్టన్; పురుషుల్లో లైంగిక పటుత్వం మెరుగవటానికి వాడే వయాగ్రాతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మాత్రలు తీసుకునే వారిలో స్కిన్ క్యాన్సర్ సంభవించే అవకాశాలు ఉన్నాయి అని తాజా పరిశోధనల్లో తేలింది. జంతు, మానవ కణాలపై దీనిలోని మెడిసిన్ సిడెన్ఫిల్ చూపించే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ట్యుబింజెన్ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. చర్మంలోని మాలిగ్నెంట్ మెలనోమా కణాలను వయాగ్రా ప్రేరేపిస్తుందని, దీంతో చర్మ క్యాన్సర్ అవకాశాలు ఉన్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన రాబర్ట్ ఫీల్ తెలిపారు. ఎవరు పడితే వాళ్లు స్వయం నిర్ణయం తీసుకుని వేసుకోడానికి వయాగ్రా అన్నది జ్వరం తగ్గడానికి వేసుకునే పారాసిటమాల్ లాంటి మందు కాదని, దీనితో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక గుండెజబ్బు లాంటి వ్యాధులకు మందులు వేసుకునే వారిలో ఇది ప్రమాదకరం అంటున్నారు. వయాగ్రాను సరైన స్పెషలిస్ట్‌ల ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. -
ఆ మందులు నేనే కొని వాడొచ్చా?
పురుషుల సందేహాలకు సమాధానాలు ప్రైవేట్ కౌన్సెలింగ్ నా వయసు 37 ఏళ్లు. నాకు ఇటీవల అంగస్తంభనలు తగ్గాయి. నా అంతట నేనే మెడికల్ షాపుకు వెళ్లి వయాగ్రా టాబ్లెట్లు కొనుక్కోవచ్చా. అలా వయాగ్రా వాడితే ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదమా? నాకు తగిన సలహా ఇవ్వండి. - జె.వి.ఆర్., హైదరాబాద్ సాధారణంగా మీరు యుక్తవయసులోనే ఉన్నప్పటికీ మీ వయసు వారిలో అప్పుడప్పుడు అంగస్తంభన లోపాలు రావడం చాలా సాధారణం. కొన్నిసార్లు ఇలా కావడానికి నిర్దిష్టంగా కారణం కూడా ఏమీ కనిపించకపోవచ్చు. ఇటువంటి వారిలో వయాగ్రా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వాళ్లలో ఆత్మవిశ్వాసం కలిగి తమంతట తామే ఎలాంటి టాబ్లెట్ల సహాయం లేకుండానే సెక్స్ చేయగలుగుతారు. కాని ఎవరు పడితే వాళ్లు స్వయం నిర్ణయం తీసుకుని వేసుకోడానికి ఉపయోగింమే సాధారణ మందు కాదు. ఈ మందు చాలా ప్రమాదకరం కాకపోయినప్పటికీ, కొద్దిమందిలో సైడ్ ఎఫెక్ట్స్ అవకాశాలు ఉంటాయి. అంతేకాదు... సెక్స్‌ను ఉద్దీపన కలిగించే మందులను సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం చట్టబద్ధంగా నేరం. కొన్ని కాంబినేషన్లలో వయాగ్రా వాడకూడదు. అది స్పెషలిస్ట్‌లు నిర్ధారణ చేస్తారు. ఈ మందులకు వారి ప్రిస్క్రిప్షన్ అవసరం. అందువల్ల మీ ఆరోగ్యం కోసమే యూరాలజిస్ట్‌ను / మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి ఆ మందు వాడటం మీకే శ్రేయస్కరం. నాకు పెళ్లయి మూడు నెలలు అయ్యింది. అంగస్తంభన బాగానే జరుగుతోంది. కానీ నా భార్య యోనిలోకి పురుషాంగం ప్రవేశించే సమయంలో, దాని చివరన ఉన్న చర్మం వెనక్కు పోలేక విపరీతమైన నొప్పి వచ్చి వెంటనే అంగస్తంభన తగ్గిపోతోంది. ఈ సమస్య వల్ల గత మూడు నెలల్లో ఒక్కసారి కూడా అంగప్రవేశం చేయలేకపోయాను. మామూలుగా చర్మం వెనక్కు వెళ్లినా అంగస్తంభన జరిగినా కింది భాగంలో ఏదో పట్టుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. - డి.కె.వి.ఆర్., అమలాపురం అంగం మీద ఉన్న చర్మం ఫ్రెన్యులమ్ అనే పొర ద్వారా అంగం కింది భాగంలో అతుక్కుని ఉంటుంది. ఇది కొందరిలో బిగుతుగా ఉంటుంది. అందువల్ల అంగస్తంభన జరిగినప్పుడు అది వెనక్కు రాదు. ఒక్కోసారి బలవంతంగా సెక్స్ చేసినప్పుడు ఫ్రెన్యులమ్ చిట్లిపోయి తీవ్రంగా రక్తస్రావం కూడా జరగవచ్చు. దీన్ని ఫ్రెన్యులోప్లాస్టీ అనే కేవలం 15 నిమిషాల ప్రొసీజర్‌తో నయం చేయవచ్చు. దీనికి మత్తుమందు కూడా అవసరం లేదు. లోకల్ అనస్థీషియా ఇస్తే చాలు. ఒక గంటలో ఇంటికి వెళ్లిపోవచ్చు. (అంటే ఇది డే కేర్ సర్జరీ అన్నమాట). అందువల్ల మీరు నిశ్చితంగా ఈ ఫ్రెన్యులోప్లాస్టీ చేయించుకుని నిరాటంకంగా సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయండి. నా వయసు 38 ఏళ్లు. హైడ్రోసిల్ ఉన్నట్లు తెలిస్తే గతంలో రెండువైపులా ఆపరేషన్ చేయించుకున్నాను. కానీ ఏడాదిలోనే మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. ఆరేళ్ల తర్వాత మరోమారు ఆపరేషన్ చేయించుకున్నాను. ఎలాంటి మార్పూ రాలేదు. అదే డాక్టర్‌ను కలిస్తే ఫైలేరియా అని మందులు రాశారు. మరో ఇంకోమారు సర్జరీ చేయించుకోవాలంటే భయంగా ఉంది. ఆపరేషన్ లేకుండా దీన్ని తగ్గిస్తామని అడ్వర్టయిజ్‌మెంట్స్ చూస్తున్నాను. ఇది ఎంతవరకు సాధ్యం? దయచేసి రెండుసార్లు ఆపరేషన్ చేయించుకున్నా ప్రయోజనం కనిపించలేదు. నాకు మంచి సలహా ఇవ్వండి. - జీ.ఎస్.ఆర్., రావికాంపాడు హైడ్రోసిల్ అంటే వృషణం చుట్టూ నీరు చేరడం. ఈ నీరు ఎంత ఎక్కువగా ఉంటే అంత పెద్దగా వాపు కనిపిస్తుంది. దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఇందులో అక్కడి నీరు మొత్తం తీసివేసి, వృషణాల చుట్టూ ఉండే పొరను తొలగించడం చేస్తారు. ఈ సర్జరీ తర్వాత సాధారణంగా మళ్లీ అది రాకూడదు. మీ విషయంలో రెండు సార్లు ఆపరేషన్ చేశారంటే మొదట అది హైడ్రోసీలా కాదా అని సందేహం వస్తోంది. ఇక ఫైలేరియాసిస్‌లో చర్మం బాగా మందం కావడం వల్ల వాపులా అనిపించినా - వృషణానికి గాని, వృషణం చుట్టూ ఉండే పొరకు గాని దాంతో సంబంధం ఉండకపోవచ్చు. దీన్ని ఫైలేరియల్ స్క్రోటమ్ అంటారు గాని హైడ్రోసిల్ అనరు. ఈ వాపు చాలా పెద్దదిగా ఉండి ఇబ్బంది పెడుతుంటే, మందంగా మారిన చర్మాన్ని తీసేసి, లోపల ఉండే వృషణాన్ని తొడ భాగంలో అమర్చడం ఒక ప్రక్రియ. మీ సమస్యను విశ్లేషించి, తగిన పరిష్కారం ఇవ్వడానికి మీకు దగ్గర్లోని యూరో సర్జన్‌ను సంప్రదించండి. మా అబ్బాయికి పదేళ్లు ఏళ్లు. పుట్టుకతోనే ఒక వృషణం సంచిలోకి జారకుండా కడుపులోనే ఉండిపోయింది. మా బాబు విషయంలో ఏమి చేయాలో తగిన సూచన ఇవ్వగలరు. - డీఎమ్ఆర్., గుంటూరు పుట్టుకతోనే వృషణాలు సంచిలోకి రాకపోవడాన్ని అన్‌డిసెండెడ్ టెస్టిస్ అంటారు. ఇలా జారని వృషణాలు సాధారణంగా గజ్జెల్లో ఉండిపోతాయి. సాధారణంగా బాబు పుట్టినప్పుడు డాక్టర్లు వృషణాల పొజిషన్‌ను గమనిస్తుంటారు. ఒకవేళ ఆ సమయంలో వృషణాలు చేతిస్పర్షకు తగలకపోతే ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు అవి వృషణాల సంచిలోకి జారడం కోసం వేచిచూడవచ్చు. అప్పటికీ వాటంతట అవే రాకపోతే ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోపు ఆపరేషన్ చేసి వాటిని కిందికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్సనే ఆర్కిడోపెక్సీ అంటారు. ఒకవేళ రెండేళ్ల తర్వాత కూడా ఆపరేషన్ చేయించకపోతే లోపల ఉండిపోయిన టెస్టిస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ బాబు విషయంలో యూరాలజిస్ట్‌ను సంప్రదించి ఇప్పటికైనా ఆర్కిడోపెక్సీ లేదా ఆర్కిడెక్టమీ సర్జరీ చేయించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం యూరాలజిస్ట్‌ను వీలైనంత త్వరగా సంప్రదించండి. నా వయస్సు 28 ఏళ్లు. నాకు రెండేళ్ల క్రితం టీబీ పాజిటివ్ వచ్చింది. ఆర్నెల్లు డాట్స్ చికిత్స తీసుకున్నాను. పూర్తిగా తగ్గిందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో నా సెక్స్ జీవితానికి ఏమైనా సమస్యలు వస్తాయా? నేను పెళ్లిచేసుకోవచ్చా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే దీనిల్ల నా భార్యకు, పిల్లలకు ఏమైనా సమస్యలు వస్తాయా? - ఎస్.ఎస్.ఆర్.ఎమ్., వరంగల్ టీబీ వచ్చిన వారు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ పూర్తి కోర్సు తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే మందులు ఆపకుండా డాక్టర్లు సూచించిన విధంగా వ్యాధి నయమయ్యేవరకు తీసుకోవాలి. అలా ఒకసారి పూర్తిగా నయం అయితే ఆ వ్యాధి వల్ల మీ సెక్స్ సామర్థ్యం ఎంతమాత్రమూ దెబ్బతినదు. వృషణాలకు టీబీ రాకుండా ఉంటే వీర్యం ఉత్పత్తి మీద కూడా దాని ప్రభావం ఉండదు. కాబట్టి మీ సెక్స్ సామర్థ్యం విషయంలో మీకు ఎలాంటి ఆందోళన, సంకోచం అక్కర్లేదు. పెళ్లికిగాని, భవిష్యత్తులో బిడ్డలను కనడానికి గాని మీకు వచ్చి తగ్గిపోయిన జబ్బు ఎంతమాత్రమూ ఆటకం కాదు. మీరు ప్రస్తావించిన అంశాలకూ మీకు వచ్చి తగ్గిన టీబీతో ఎంతమాత్రమూ సంబంధం లేదు. మీరు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు. నా వయుస్సు 37 ఏళ్లు. నాకు వివాహం జరిగి 12 ఏళ్లు. వూకింకా సంతానం లేదు. నాకు గత నాలుగేళ్లుగా వీర్యంలో ‘ప్లెంటీ ఆఫ్ పస్ సెల్స్’ ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నారుు. వుందులు వాడుతున్నంత కాలం ఈ పస్ సెల్స్ తగ్గినా... వుళ్లీ వుందులు వూనేయుగానే పెరుగుతున్నారుు. పస్ సెల్స్ ఉన్నందువల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందా? - ఎఎమ్డి., రాయదుర్గం పిల్లలు పుట్టనివారిలో వుగవారికి చేసే మొట్టమొదటి పరీక్ష సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేసినప్పుడు వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఫలితంగా సెమెన్ క్వాలిటీ తగ్గుతుంది. దాంతో పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ తగ్గడం వల్ల సెమెన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ టాబ్లెట్లు కూడా వాడాల్సి ఉంటుంది. యూంటిబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ సెమెన్ అనాలిసిస్లో వీర్యం క్వాలిటీ వూవుూలుగా ఉంటే అప్పుడు పిల్లలు పుట్టే అవకాశాలు మెరుగవుతారుు. మీరు యూరాలజిస్ట్‌ను కలిసి వారు సూచించిన విధంగా సరైన యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు తీసుకోండి. రెండు సార్లు ఆపరేషన్ చేశారంటే మొదట అది హైడ్రోసీలా కాదా అని సందేహం వస్తోంది. ఇక ఫైలేరియాసిస్‌లో చర్మం బాగా మందం కావడం వల్ల వాపులా అనిపించినా - వృషణానికి గాని, వృషణం చుట్టూ ఉండే పొరకు గాని దాంతో సంబంధం ఉండకపోవచ్చు. దీన్ని ఫైలేరియల్ స్క్రోటమ్ అంటారు గాని హైడ్రోసిల్ అనరు. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
వయాగ్రాతో మలేరియాకు చెక్!
లండన్: నపుంసకత్వాన్ని నిరోధించేందుకు సామర్థవంతమైన జౌషధంగా పరిగణించబడుతున్న 'వయాగ్రా' మలేరియాకు చెక్ పెట్టగలదట. మలేరియాను వ్యాపింపజేసే పరాన్నజీవిని అడ్డుకునే శక్తి వయాగ్రాకు ఉందని పరిశోధనలో తేలింది. మలేరియా వ్యాధి కారకం ఎరిత్రోసైట్ ను పెడసరంగా మార్చడం ద్వారా రక్తంలో దాన్ని చలనాన్ని తగ్గిస్తుందని వెల్లడైంది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ భాగస్వామ్యంతో పారీస్ లోని కొచిన్ ఇన్ స్టిట్యూట్, పాశ్చర్ ఇన్ స్టిట్యూట్ సైంటిస్టులు ఈ ఆశ్చర్యకర పరిశోధన చేశారు. మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం పాల్సిపేరం పరాన్నజీవి.. మనుషులు, ఆడ అనాఫిలిస్ దోమలో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. అనాఫిలిస్ దోమ కుట్టినప్పుడు ఇది మనిషి రక్తంలోకి ప్రవేశిస్తుంది. అయితే మలేరియా పరాన్నజీవిని అడ్డుకునే శక్తి వయాగ్రాకు ఉందని పరిశోధనలో తేలడంతో భవిష్యత్ లో దీన్ని మలేరియా నివారణ ఔషధంగా వాడే అవకాశాలున్నాయి. -
దోపిడి దొంగలు... వయాగ్రా టాబ్లెట్లు
న్యూఢిల్లీ: దొడ్డి దారుల్లో సంపాదన కోసం ఆ ముగ్గురు దోపిడి దొంగలు ఓ ముఠాగా ఏర్పాడ్డారు. జాతీయ రహదారిపై ఉండే దాబాల వద్ద ఆగి ఉన్న వాహనాలనే లక్ష్యంగా చేసుకుని దోపిడిలు ప్రారంభించారు. ఆ క్రమంలో దాబా వద్ద సరుకుతో ఆగి ఉన్న లారీతో ఉడాయించారు. న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని జరోదా పుస్తా రహదారిపై బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ సదరు వాహనాన్ని ఆపారు. లారీలో లోడ్ ఏమిటని ప్రశ్నించగా... గుటకలు మింగారు. పోలీసులకు సీన్ అర్థమైంది. అంతే లారీలోని లోడ్‌ను తనిఖీ చేయగా... అగరబత్తులు, షాంపు ప్యాకెట్ల బాక్స్‌ల కింద వయాగ్రా టాబ్లెట్లు ఉన్న 20 అట్టపెట్టలను పోలీసులు కనుగొన్నారు. దీంతో పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకుని... లారీని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన వయాగ్రా టాబ్లెట్ల విలువ దాదాపు 35 లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు దొంగలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు చెందిన సలీం, ఖలీద్, షాజద్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. షాంపు, సబ్బుల విలువ రూ. 5 లక్షలు ఉంటుందని తెలిపారు. -
వయాగ్రా వాడితే కళ్లు పోతాయి!
శృంగార సమస్యలకు ఏకైక పరిష్కారంగా వచ్చిన అద్భుతమైన మందు వయాగ్రా. కానీ, ఇది ఎక్కువ కాలం వాడితే.. కంటి చూపు దెబ్బతింటుందట. ఈ విషయం తాజా పరిశోధనలలో వెల్లడైంది. అయితే ఇది అందరికీ కాదు. ఒక రకమైన మ్యుటేషన్ ఉన్నవాళ్లకు మాత్రమే ఇలా జరుగుతుందట. రెటీనా నుంచి మెదడుకు కాంతి సంకేతాలను పంపే ఒక ఎంజైమును సిల్డెనాఫిల్ అడ్డుకుంటుంది. వయాగ్రాను మరీ ఎక్కువ డోసుల్లో ఉపయోగించేవాళ్లకు కంటి పరమైన సమస్యలు రావచ్చన్న విషయం ఇంతకుముందు ఔషధ ప్రయోగాలలో కూడా తేలింది. బాగా ఎక్కువ కాంతిని చూడలేకపోవడం, చూపు మందగించడం, రంగులు కూడా వేరేగా కనపడటం లాంటి సమస్యలు వీళ్లకు రావచ్చని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన లీసా నివిజన్ స్మిత్ తెలిపారు. రెటినైటిస్ పిగ్మెంటోసా అనే కంటి వ్యాధికి సంబంధించి మ్యుటెంట్ జన్యువు కాపీ ఒక్కటే ఉన్నవాళ్ల విషయంలోనే తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామన్నారు. ఇందుకోసం ముందుగా ఇలా జన్యువు ఒకే కాపీ ఉన్న ఎలుకలకు సిల్డెనాఫిల్ మందు ఇచ్చి చూశారు. ఆ ఎలుకకు చూపు మందగించడం స్పష్టంగా తేలింది. రెటినైటిస్ పిగ్మెంటోసా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. దీనివల్ల చివరకు అంధత్వం వస్తుంది. -
అమ్మకాల కోసం లిక్కర్ లో 'వయాగ్రా'!
బీజింగ్: మద్యం సేల్స్ ను పెంచుకునేందుకు సరికొత్త బాట పట్టాడు చైనా వ్యాపారవేత్త. వయాగ్రా తరహాలో పనిచేసే ఒక రసాయన పదర్థాన్ని మద్యంలో కలుపుతూ వ్యాపారం చేపట్టాడు. చైనాకు చెందిన హంగ్ అనే వ్యాపారవేత్తకు ఒక మద్యం ఫ్యాక్టరీ ఉంది. ఆ క్రమంలో అతనికి తన వ్యాపారాన్ని పెంచాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు మగతానాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడే వయాగ్రా తరహాలో పనిచేసే ఒక రసాయన పదార్థాన్ని లిక్కర్ లో కలపాలని నిశ్చయించాడు. అందుకు అనుగుణంగానే ఇంగ్లిష్ మందుల్లో కలిపే సిల్డినఫీ అనే రసాయనాన్ని మద్యంలో వాడటం మొదలు పెట్టాడు. ఈ రకంగా సరికొత్త వ్యాపారానికి తెరలేపిన అతను వాన్ రాష్ట్ర రాజధానితో పాటు పలు ప్రాంతాల్లో విక్రయం మొదలు పెట్టాడు. గత ఫిబ్రవరిలో లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టిని అతనికి ఈ వ్యాపారం బానే ఉందనుకుని మరింత విస్తరించాడు. 100 మిల్లీ లీటర్ల మద్యంలో 130 మిల్లీ గ్రాముల ప్రభావిత పదార్థాన్ని కలపసాగాడు. అది కాస్తా 750 లీటర్ల లిక్కర్ ద్రావకంగా మారుతుంది. ఈ క్రమంలోనే 1000 పైగా బాటిళ్లను అమ్మాడు. ఇక్కడ కూడా వాంగ్ తన స్నేహితులపై ప్రేమ కురిపించాడు. వారికి 810 బాటిళ్లను కానుకగా ఇచ్చాడు. ఈ రసాయనం రోగులపై అధిక దుష్ర ప్రభావం చూపడమే కాకుండా, అక్రమం కావడంతో వాంగ్ చేసే వ్యాపారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. -
ఆస్ట్రాజెనెకా కోసం ఫైజర్ మెగా బిడ్!
లండన్: ఫైజర్ కంపెనీ ఇంగ్లాండ్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా కంపెనీని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోందని లండన్ నుంచి వెలువడే సండే టైమ్స్ పత్రిక పేర్కొంది. ఆస్ట్రాజెనెకాను కొనుగోలు చేయడానికి ఫైజర్ 101 బిలియన్ డాలర్లు(రూ.6.16 లక్షల కోట్లు) ఆఫర్ చేసిందని ఆ పత్రిక పేర్కొంది. కాగా వాటాదారుల విలువ పెంచడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామని ఫైజర్ ప్రతినిధి జువాన్ కాంపియాన్ పేర్కొన్నారు. మార్కెట్ ఊహాగానాలు, వదంతులపై వ్యాఖ్యానించబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ విషయమై వ్యాఖ్యానించడానికి ఆస్ట్రాజెనెకా ప్రతినిధి నిరాకరించారు. కాగా ఫైజర్ కంపెనీ 2000లో వార్నర్-లాంబర్ట్ కంపెనీని 87 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఔషధ పరిశ్రమలో ఇదే అత్యంత పెద్ద డీల్. కాగా గత 20 ఏళ్లలో 30 బిలియన్ డాలర్లకు పైబడి కంపెనీల కొనుగోళ్లు 10 వరకూ జరిగాయి. వీటిల్లో ఫైజర్ ఖాతాలో 3 ఉన్నాయి. -
మహిళలకూ వయాగ్రా!!
మగవారికే కాదు.. మగువలకు కూడా ఓ వయాగ్రా పిల్ తయారుచేశారు శాస్త్రవేత్తలు. అది కేవలం వారి శృంగార వాంఛలను పెంచడమే కాదు, బరువు కూడా తగ్గిస్తుందట. అయితే ప్రస్తుతం ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న ఈ మాత్ర వచ్చే సంవత్సరాంతం నాటికి మార్కెట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 శాతం మంది మహిళలు తమకు శృంగార జీవితం మీద అనురక్తి తగ్గుతోందని చెబుతున్నారు. అలాంటి వారికి కూడా ఉపయోగపడేలా, గతంలో వయాగ్రా టాబ్లెట్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలే ఇప్పుడు మగువల వయాగ్రాపైనా పరిశోధనలు చేస్తున్నారు. అయితే.. ఇది మాత్రం కొంత ఖరీదు ఎక్కువే ఉండబోతోంది. ఒక్కో టాబ్లెట్ సుమారుగా 1200 రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మగవారి కోసం రూపొందించిన వయాగ్రా అమ్మకాలు ఏడాదికి దాదాపు 15 వేల కోట్ల రూపాయల మేర ఉన్నాయి. అందుకే ఆడాళ్ల వయాగ్రాను కూడా రూపొందించాలని చాలా ఔషధ కంపెనీలు ప్రయత్నించాయి గానీ, వయాగ్రా రూపొందించిన 'ఆర్లిబిడ్' అనే బ్రిటిష్ సంస్థకే అది సాధ్యమైంది. శృంగార వాంఛలను పెంచేందుకు మెదడు మీద పనిచేసే ఈ మందు ఉపయోగిస్తే, శరీర బరువు కూడా కొంతవరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.