ఆస్ట్రాజెనెకా కోసం ఫైజర్ మెగా బిడ్! | Pfizer mulls $100 billion bid for AstraZeneca: Report | Sakshi
Sakshi News home page

ఆస్ట్రాజెనెకా కోసం ఫైజర్ మెగా బిడ్!

Published Mon, Apr 21 2014 1:22 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

ఆస్ట్రాజెనెకా కోసం ఫైజర్ మెగా బిడ్! - Sakshi

ఆస్ట్రాజెనెకా కోసం ఫైజర్ మెగా బిడ్!

లండన్: ఫైజర్ కంపెనీ ఇంగ్లాండ్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా కంపెనీని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోందని లండన్ నుంచి వెలువడే  సండే టైమ్స్ పత్రిక పేర్కొంది. ఆస్ట్రాజెనెకాను కొనుగోలు చేయడానికి ఫైజర్ 101 బిలియన్ డాలర్లు(రూ.6.16 లక్షల కోట్లు) ఆఫర్ చేసిందని ఆ పత్రిక పేర్కొంది. కాగా వాటాదారుల విలువ పెంచడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామని ఫైజర్ ప్రతినిధి జువాన్ కాంపియాన్ పేర్కొన్నారు. మార్కెట్ ఊహాగానాలు, వదంతులపై వ్యాఖ్యానించబోమని ఆయన స్పష్టం చేశారు.

 కాగా ఈ విషయమై వ్యాఖ్యానించడానికి ఆస్ట్రాజెనెకా ప్రతినిధి  నిరాకరించారు. కాగా ఫైజర్ కంపెనీ 2000లో వార్నర్-లాంబర్ట్ కంపెనీని 87 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఔషధ పరిశ్రమలో ఇదే అత్యంత పెద్ద డీల్. కాగా గత 20 ఏళ్లలో 30 బిలియన్ డాలర్లకు పైబడి కంపెనీల కొనుగోళ్లు 10 వరకూ జరిగాయి. వీటిల్లో ఫైజర్ ఖాతాలో 3 ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement