
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు విదేశీయుల రాకపోకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశంలో ఉంటూ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఓ ఓప్పందం వరంగా మారనుంది. ఎయిర్ బబుల్ ఒప్పందంతో పాటు దృవీకరించిన వీసా ఉంటే అమెరికా, యూకే, కెనడా తదితర దేశాలకు వెళ్లొచ్చని సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు.
ఇటీవల ఎయిర్ బబుల్ ఒప్పందంతో భారతీయులు అత్యధికంగా ఫిలిప్పైన్స్‌కు వెళ్లారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. కాగా విదేశాలలో ఎలాంటి నిబంధనలు ఉన్న దేశంలో మాత్రం వీసాల మంజూరులో కఠినమైన నిబంధనలు ఉన్నాయని హోంశాఖ వర్గాలు పేర్కొన్నారు.
చదవండి: ‘రష్యా టీకా అడ్వాన్స్ స్టేజ్‌లో లేదు’
Comments
Please login to add a commentAdd a comment