Pfizer
-
వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా!
ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన షేన్ వార్న్ గతేడాది థాయ్‌లాండ్ వెకేషన్లో ఉన్నప్పుడు విల్లాలోనే గుండెపోటుతో చనిపోయాడు. అతని మరణం అప్పట్లో మిస్టరీగా ఉండిపోయింది. పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించిన వైద్యులు వార్న్ గుండెపోటు వల్ల మరణించాడని ద్రువీకరించారు. ఇక వార్న్ మరణం వెనుక ఉన్న మిస్టరీ తాజాగా వీడినట్లు తెలుస్తోంది. వార్న్ మరణానికి కారణం గుండెపోటు అయినప్పటికి పరోక్షంగా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడమేనని భారత సంతతికి చెందిన డాక్టర్ ఆసీమ్ మల్హోత్రా తాజాగా మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. డాక్టర్ ఆసీమ్ మల్హోత్రాతో పాటు ఆస్ట్రేలియా మెడికల్ ప్రొఫెషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్ నిల్ షేన్ వార్న్ మరణం వెనుక ఉన్న కారణంపై రీసెర్చీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ''వార్న్ మరణించడానికి తొమ్మిది నెలల ముందు కోవిడ్ వ్యాక్సిన్ అయిన పీ-ఫైజర్(PFizer mRNA) వ్యాక్సిన్‌ను రెండు డోసులు తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వార్న్ తన ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకపోగా.. మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడంతో పాటు స్మోకింగ్ చేసినట్లు తేలింది. దీనివల్ల వ్యాక్సిన్ ప్రభావం మందగించింది. అందువల్ల గుండెల్లో రక్తనాళాలు మూసుకుపోయాయి. దీనివల్లే అతను కార్డియాక్ అరెస్టుకు గురయ్యి చనిపోయాడు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు కూడా ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అతని బాడీలో బయోమెకానిజమ్ సరిగ్గా లేదు. ఇది కూడా వార్న్ మరణానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ నిబంధనలు సరిగ్గా పాటించి ఉంటే మాత్రం వార్న్ చనిపోయే అవకాశాలు తక్కువగా ఉండేవని'' అభిప్రాయపడ్డారు. కాగా టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఈ స్పిన్ మాంత్రికుడు 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 194 వన్డేల్లో 293 వికెట్లు.. ఓవరాల్‌గా వెయ్యి వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం. చదవండి: #ShaneWarne: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
వ్యాక్సిన్‌తో తగ్గని కరోనా.. ఫైజర్ సీఈవోకి చుక్కలు చూపించిన జర్నలిస్ట్‌లు!
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయిన ఫైజర్ సీఈవో అల్బర్ట్ బౌర్లకు చేదు అనుభవం ఎదురయింది. కరోనా కట్టడి విషయంలో .. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నా.. ఫలితం మాత్రం అంత గొప్పగా లేదంటూ కొందరు మీడియా ప్రతినిధులు అల్బర్ట్‌ను ప్రశ్నించారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సు నుంచి బయటకు వచ్చి రూం వైపు అడుగులు వేస్తుండగా అల్బర్ట్‌ను చుట్టుముట్టారు మీడియా ప్రతినిధులు. మానవాళిని తప్పుదోవ పట్టించి.. అసత్యాలు, అబద్దాలతో తప్పుడు ప్రచారం చేశారని, వ్యాక్సిన్ల విక్రయించేముందు ఎంతో భరోసా ఇచ్చినా అవేవీ అమలు కాలేదని ప్రశ్నించారు. ఫైజర్ కంపెనీని నమ్మి వ్యాక్సిన్లు తీసుకున్న ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా.. అల్బర్ట్ మాత్రం నోరు మెదపలేదు. వ్యాక్సిన్ వల్ల వైరస్ సంక్రమణ పూర్తిగా ఉండదని ముందుగానే తెలిసినా.. దాన్ని రహస్యంగా ఉంచారా అని విలేకరులు ప్రశ్నించారు. కరోనా వల్ల చనిపోయిన వారికి ఏం సమాధానం చెబుతావని నిలదీశారు.నీ మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదని అడిగినా..అల్బర్ట్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. కరోనా విక్రయాల ద్వారా 2.3 బిలియన్ డాలర్లు ఫైజర్‌కు వచ్చాయని, అసలు ఈ మొత్తం వ్యాక్సిన్ తతంగం వెనక ఎవరు కమీషన్లు ఇచ్చారని అడిగారు. కరోనా వ్యాప్తిని అడ్డుకుని మానవుల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశ్యంతో 2020 ఏప్రిల్‌లో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది ఫైజర్. అమెరికా ప్రభుత్వం ఆమోదించిన తొలి కోవిడ్ కట్టడి వ్యాక్సిన్ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఫైజర్‌ను మాత్రమే ఎంపిక చేసుకున్నాయి. దాదాపు ఒకటిన్నర బిలియన్ డోసులను ఫైజర్ విక్రయించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యాక్సిన్లు తీసుకున్న కొందరిలో గుండెపోటు సమస్యలు తలెత్తాయని ఫిర్యాదులు వచ్చినా.. అవి వ్యాక్సిన్ వల్లే వచ్చాయని శాస్త్రీయంగా పూర్తి స్థాయిలో నిరూపితం కాలేదు. 🚨WE CAUGHT HIM! Watch what happened when @ezralevant and I spotted Albert Bourla, the CEO of Pfizer, on the street in Davos today. We finally asked him all the questions the mainstream media refuses to ask. Full story: https://t.co/wHl204orrX SUPPORT: https://t.co/uvbDgOk19N pic.twitter.com/c3STW8EGH3 — Avi Yemini (@OzraeliAvi) January 18, 2023 -
కరోనా టీకాలపై వివాదం.. కోర్టుకెక్కిన మోడెర్నా..
వాషింగ్టన్: కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం విలవిల్లాలాడినప్పుడు వ్యాక్సిన్లు సంజీవనిలా మారిన విషయం తెలిసిందే. ఈ టీకాల వల్ల కోట్ల మంది ప్రాణాలు నిలిచాయి. అయితే తమ టీకా సాంకేతికతను కాపీ కొట్టారాని మోడెర్నా సంస్థ ఆరోపించింది. ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫైజర్, బయోఎన్‌టెక్ ఏంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను ఉపయోగించి తొలి కరోనా టీకాను తయారు చేశాయి. అయితే ఈ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ హక్కులు తమవని, 2010-2016 మధ్యే దీన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు మోడెర్నా చెబుతోంది. ఈ విషయంపై కోర్టుకెక్కింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే.. ఫైజర్, బయోఎన్‌టెక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఎన్ఏ అనేది ప్రతి కణం ప్రోటీన్ తయారీకి డీఎన్ఏ సూచనలను కలిగి ఉండే జన్యు స్క్రిప్ట్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల తయారీలో ఈ సాంకేతికతనే ఉపయోగించారు. ఈ అధునాతన టెక్నాలజీతో తక్కువ సమయంలోనే వ్యాక్సిన్లను అభివృద్ధి చేయవచ్చు. చదవండి: లండన్‌లో గోమాతకు పూజలు.. రిషి సునాక్‌పై నెటిజెన్ల ప్రశంసలు.. -
మోల్నుపిరావిర్ వైరస్‌ను ఏమార్చి, హతమారుస్తుంది.. ఇంతకూ ఆ పేరెలా వచ్చింది?
కల్లోల కరోనా సోకకుండా టీకాలు చాలావరకు అడ్డుకుంటాయి. కానీ కరోనా సోకిన వారికి నిర్ధిష్టమైన వైద్యం పూర్తిస్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులో ఉన్న వివిధ రకాల ఔషధాల కాంబినేషన్లను, యాంటీ వైరల్ మందులను వాడి కరోనా రోగులను కాపాడే యత్నాలు జరుగుతున్నాయి. తాజాగా కరోనా సోకిన వారి చికిత్స కోసం ఫైజర్, మెర్క్ సంస్థలు మాత్రలు తయారుచేశాయి. మెర్క్ తయారీ మోల్నుపిరావిర్ మాత్ర (‘EIDD 2801’’) కు భారత్‌లో తాజాగా అనుమతులు లభించాయి. కరోనాకు కళ్లెం వేయడంలో ఇది ఉపయోగపడుతుందని, కరోనా వల్ల ఆస్పత్రి పాలవకుండా చాలావరకు కాపాడుతుందని కంపెనీ చెబుతోంది. భారత్‌లో దీన్ని సిప్లా తదితర సంస్థలతో కూడిన కన్సార్టియం వేర్వేరు పేర్లతో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో కొత్త మాత్ర కథా కమామీషు చూద్దాం.. ఎవరికి మంచిది? ఎవరికి వద్దు? కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి దీన్ని వాడే వీలు లేదు. కరోనా లక్షణాలు కనిపిస్తూ, ఇవి బాగా ముదిరి మరింత అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉన్న(హైరిస్కు) వ్యక్తులకు మాత్రమే డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఉదాహరణకు వృద్దులు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి కరోనా సోకితే వీటిని సిఫార్సు చేస్తారు. ఇక 18 ఏళ్లలోపు పిల్లలకు ఈ మందు వాడకూడదు. ఇది వారిలో ఎముకల వృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అలాగే గర్భిణులకు కూడా దీన్ని సిఫార్సు చేయరు. వీరికి ఇది అత్యంత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిపాలై చికిత్స పొందేవారికి దీని వాడకం కూడదు. ఎప్పుడు ఆరంభించాలి? కరోనా పాజిటివ్ వచ్చాక లక్షణాలు బయటపడుతున్న ఐదురోజుల్లోపు దీని వాడకం ఆరంభించాలి. దగ్గు, తలనొప్పి, జ్వరం, వాసన లేకపోవడం, నొప్పుల్లాంటి సంకేతాలు కరోనా తొలిరోజుల్లో ఉంటాయి. ఈ దశలోనే వీటని డాక్టర్ సిఫార్సుతో వాడాల్సి ఉంటుంది. ఎంత డోసేజ్? ఈ మాత్రలు 200 ఎంజీ రూపంలో లభిస్తాయి. ప్రతి 12 గంటలకు ఒకసారి నాలుగు మాత్రల చొప్పున ఐదు రోజుల పాటు తీసుకోవడంతో కోర్సు పూర్తవుతుంది. అంటే మొత్తం కోర్సులో 40 క్యాప్సుల్స్ (ఐదు రోజులు– రోజుకు 8 మాత్రలు) వాడాల్సి ఉంటుంది. వరుసగా ఐదు రోజులకు మించి దీన్ని వాడకూడదని యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ సహా దాదాపు అన్ని కోవిడ్ వేరియంట్లపై ఇది ప్రభావం చూపగలదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నాయి? కరోనా లక్షణాలు బయటపడ్డవారు (ఇంతవరకు వ్యాక్సిన్ తీసుకోనివారు) ఆస్పత్రి పాలయ్యే రిస్కును, చనిపోయే ప్రమాదాన్ని ఈ మందు వాడకంతో దాదాపు 30– 50 శాతం తగ్గించవచ్చని క్లినికల్ డేటా ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. దీన్ని కేవలం కరోనా సోకిన తర్వాత మాత్రమే వాడాలని, టీకాలకు బదులు దీన్ని తీసుకుంటే సరిపోతుందని భావించవద్దని నిపుణుల హెచ్చరిక. ప్రతికూలతలు ఈ మాత్ర వాడకానికి ఎఫ్‌డీఏ అనుమతినివ్వడంపై పలువురు నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేమీ మ్యాజిక్ పిల్ కాదని, దీనివల్ల జరిగే మేలు పరిమితమని ప్రొఫెసర్ విలియం షాఫ్నర్ హెచ్చరించారు. దీని వాడకం వల్ల కొన్నిసార్లు డయేరియా, వికారం, వాంతులు, తలతిరగడం వంటి ప్రతికూలతలు కనిపించవచ్చు. అదేవిధంగా ఎట్టిపరిస్థితుల్లో దీన్ని 18 ఏళ్లు లోపువారికి, గర్భిణులకు, ఆస్పత్రిపాలైనవారికి వాడకూడదు. ఈ ఔషధానికి వైరస్ కణాల్లో ఉత్పరివర్తనాలను ప్రేరేపించే శక్తి ఉంది. ఈ శక్తి మానవ కణాలపై కూడా చూపే ప్రమాదం ఉందని, దీనివల్ల మానవ కణాల్లో అనవసర మార్పులు వచ్చి క్యాన్సర్లకు కారణమయ్యే ప్రమాదం ఉందన్న వాదనలు ఉన్నాయి. కానీ దీన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాల్లేవు. ఏ దేశాల్లో అనుమతించారు? ఇప్పటివరకు ఈ ఔషధానికి యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, భారత్‌లో అనుమతి లభించింది. ధ్వంస రచన... ► ఉత్పరివర్తనాల్లో ఈ మందు కలగజేసే మార్పులతో వైరస్‌లోని మొత్తం మ్యుటేషన్ ప్రక్రియ తప్పులతడకగా మారడాన్ని ‘‘ఎర్రర్ కెటాస్ట్రోఫ్’’ లేదా ‘‘లీథల్ మ్యుటాజెనిసిస్’’ అంటా రు. ఈ విధ్వంసం కారణంగా అతిధేయి శరీరంలో వైరల్ లోడు క్రమంగా తగ్గిపోతుంది. ► సాధారణంగా రెమిడెసివిర్ లాంటి యాంటీ వైరల్ మందులు సదరు వైరస్‌లో పత్రికృతి (రిప్లికేషన్) ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా దాని వ్యాప్తిని నివారిస్తాయి. టీకాలు అతిధేయి శరీరంలో యాంటీబాడీ రెస్పాన్స్‌ను పెంచడం ద్వారా వైరస్‌ను అడ్డుకుంటాయి. వీటితో పోలిస్తే మోల్నుపిరావిర్ పనిచేసే తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ► ఇది వైరస్ రిప్లికేషన్ ప్రక్రియలో అవసరపడే ఎంజైములను తప్పుదోవ పట్టిస్తుంది. దీంతో వైరస్ కణాల్లో తప్పుడు ఉత్పరివర్తనాలు ఆరంభమవుతాయి. వీటివల్ల రోగి శరీరంలో వైరస్ సంఖ్య పెరగడం ఆగిపోతుంది, ప్రతికృతి చెందిన వైరస్లు బతికినా అవి బలహీనంగా ఉండి వెంటనే నశించిపోవడం జరుగుతుంది. ► సింపుల్‌గా చెప్పాలంటే ఒక యంత్రంలో కీలక భాగాన్ని మారిస్తే దాని పనితీరు పూర్తిగా ధ్వం సమైనట్లే ఈ ఔషధం వైరస్‌పై పనిచేస్తుంది. ► శాస్త్రీయ భాషలో చెప్పుకుంటే ఈ ఔషధం వైరస్‌లోని ఆర్‌డీఆర్‌ఏ (ఆర్ఎన్ఏ డైరెక్టెడ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్) ఎంజైమ్‌ను ప్రేరేపించి వైరల్ ఆర్ఎన్ఏలో పలు తప్పుడు మ్యుటేషన్లను కలిగిస్తుంది. ► ఆర్ఎన్ఏ నిర్మాణంలో అడినైన్, గ్వానైన్, యురాసిల్ (యురిడిన్), సైటోసిన్ అవసరమవుతాయి. వీటిని ఆర్ఎన్ఏ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. ► మోల్న్యుపిరావిర్కు ఈ బిల్డింగ్ బ్లాక్స్‌లోని సైటిడిన్ (ఎన్‌హెచ్‌సీ– టీపీ) లేదా యురిడిన్ లాగా కనిపించే శక్తి ఉంది. దీంతో ఆర్‌డీఆర్‌ఏ ఎంజైమ్ దీన్ని వైరస్ ఆర్ఎన్ఏలో నిజమైన సైటిడిన్ లేదా యురిడిన్ బదులు ప్రవేశపెడుతుంది. ► వైరస్ రిప్లికేషన్‌ను ప్రూఫ్ రీడింగ్ చేసే ఎక్సో న్యూక్లియేజ్ ఎంజైమ్‌లు కూడా ఈ తప్పును గ్రహించలేవు. దీంతో నిజమైన బిల్డింగ్ బ్లాక్స్ ఉన్న ఆర్ఎన్ఏ బదులు మోల్నుపిరావిర్ ఉన్న ఆర్ఎన్ఏ ఉత్పత్తి అవుతుంది. ► ఇలా మారిన ఆర్ఎన్ఏ పలు తప్పుడు ఉత్పరివర్తనాలకు కారణమై పైన చెప్పుకున్న ఎర్రర్ కెటాస్ట్రోఫ్కు దారి తీస్తుంది. ఆ పేరే ఎందుకంటే.. అవెంజర్స్ సినిమాలు చూసినవారికి అందులో థోర్ పాత్ర, ఆ హీరో చేతిలోని శక్తులున్న ఆయుధం.. సుత్తి గుర్తుండే ఉంటాయి. ఈ సుత్తికి మొల్నిర్ అని పేరు. అలాగే యాంటీ వైరల్ మందులకు చివర ‘అవిర్’ అంత్య ప్రత్యయం (సఫిక్స్) పెడతారు. కోవిడ్ వేరియంట్లపై థోర్ ఆయుధం లాగా విరుచుకుపడుతుందన్న ఉద్దేశంతో కొత్త మాత్రకు మోల్నుపిరావిర్ అని పేరు పెట్టినట్లు మెర్క్ కంపెనీ ఆర్ అండ్ డి అధిపతి డీన్ లీ చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
గుడ్‌న్యూస్: కోవిడ్ సోకితే ఇక ఇంట్లోనే మాత్రలు వేసుకుంటే చాలు!
లండన్/వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలమందికిపైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారికి చికిత్స అందుబాటులోకి వచ్చేసింది. కరోనా వైరస్‌కి చికిత్స లేదు నివారణే మార్గం అనుకుంటున్న సమయంలో ఒక గేమ్‌ఛేంజర్‌గా యాంటీవైరల్ మాత్రలు మార్కెట్లోకి రాబోతున్నాయి. బ్రిటన్, అమెరికాలు ఈ దిశగా ముందడుగు వేశాయి. ప్రపంచంలోనే కరోనా చికిత్స కోసం యాంటీ వైరల్ మాత్రకి ఆమోద ముద్ర వేసిన తొలి దేశంగా యూకే నిలిస్తే, అమెరికాలో ఫైజర్ కంపెనీ తయారు చేసిన మాత్ర 90శాతం మరణాలను నివారిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. ఫ్లూ జ్వరం చికిత్సలో వాడే యాంటీ వైరల్ లాగెవ్రియో (మోల్నూపిరావిర్)ని కోవిడ్ చికిత్సకి అనుమతినిస్తూ బ్రిటన్‌కు చెందిన ది మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) గురువారం అనుమతులు మంజూరు చేసింది. రిడ్జ్‌బ్యాక్ బయోథెరపిటిక్స్, మెర్క్ షార్ప్ అండ్ ధోమె (ఎంఎస్డీ) కంపెనీలు సంయుక్తంగా ఈ మాత్రను రూపొందించాయి. ‘కరోనా సోకితే ఇక ఆస్పత్రుల్లో చేరాల్సిన పని లేదు. ఇంట్లోనే ట్యాబ్లెట్ మింగొచ్చు. ప్రపంచంలోనే అలాంటి మాత్రకు అనుమతులిచ్చిన మొదటి దేశం మాదే’అని యూకే ఆరోగ్య శాఖ మంత్రి సజీద్ జావిద్ ప్రకటించారు. కరోనా వైరస్ లోడు స్వల్పంగా, ఓ మోస్తరుగా సోకిన వారిలో తీవ్రతరం కాకుండా ఈ మాత్ర నిరోధిస్తుంది. ఊబకాయం, 60 ఏళ్ల పైబడిన వయసు, షుగర్, గుండెకు సంబంధించిన సమస్యల్లో ఏ ఒక్కటి ఉన్న వారిలో అయినా ఈ టాబ్లెట్ బాగా పని చేస్తుందని ఇప్పటికే ప్రయోగాల్లో తేలింది. కరోనా సోకిన వెంటనే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే అత్యంత శక్తిమంతంగా పని చేస్తున్నట్టుగా ఎంహెచ్ఆర్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జునె రెయిన్ వెల్లడించారు. త్వరలో మార్కెట్లోకి ఫైజర్ మాత్ర కోవిడ్–19 మాత్రకు బ్రిటన్ ఆమోద ముద్ర వేసిన ఒక్క రోజులోనే అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్ తమ కంపెనీ తయారు చేసిన యాంటీవైరల్ మాత్ర కూడా పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్టుగా వెల్లడించింది. కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ 90% మరణాలను ఆ మాత్ర నిరోధిస్తుందని తెలిపింది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో చేర్పించి ఇంజెక్షన్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇంట్లోనే అత్యంత సులభంగా వాడే మాత్రను తయారు చేసినట్టుగా ఫైజర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ మైకేల్ డోల్‌స్టెన్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ మాత్ర అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) పరిశీలనలో ఉందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోకుండా ఊబకాయం, మధుమేహం, గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్న 775 మందిపై ఫైజర్ ఈ టాబ్లెట్ ఇచ్చి చూస్తే 89% మందికి ఆస్పత్రి అవసరం రాలేదని వెల్లడించింది. ఒక్క శాతం మందిని ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం వచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ టాబ్లెట్ ఇచ్చిన వారెవరూ మరణించలేదని ఆ కంపెనీ తెలిపింది. 90% సామర్థ్యంతో, 100 శాతం మరణాలను అరికట్టేలా ఈ మాత్ర పని చేస్తున్నట్టుగా మైకేల్ వివరించారు. ఈ కొత్త మాత్ర అనుమతులు ఇవ్వడానికి ఎఫ్‌డీఏ సన్నాహాలు చేస్తున్నప్పటికీ కరోనాపై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని అభిప్రాయపడుతోంది. మాత్రలు అందుబాటులోకి వస్తే ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్య రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
Covid Pill: కోవిడ్‌కు మరో కొత్త మందు.. 90 శాతం మెరుగైన ఫలితాలు..
వాషింగ్టన్: కోవిడ్‌కు ఫైజర్ కంపెనీ కొత్త మందును అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయిన వెంటను ఫైజర్ తయారు చేసిన పిల్ వేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉన్నాయని పేర్కొంది. తాము తయారు చేసిన పిల్ తీసుకున్నవాళ్లలో 90 శాతం క్రిటికల్ పరిస్థితికి వెళ్లలేదని తెలిపింది. దీంతో కరోనా పిల్ ఆమెదం కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల సంబంధించిన నివేదికను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చదవండి: సీఎం ట్వీట్‌పై విమర్శలు: ‘దీపావళికి, హోలీకి తేడా తెలియదా’ అత్యవస వినియోగం కోసం పాత రిటోనావిర్ కాంబినేషన్‌తో కూడిన ఈ టాబ్లెట్‌ను అమెరికా డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌కు అక్టోబర్‌లోనే కోరినట్లు పేర్కొన్నారు. రిటోనావిర్ కాంబీనేషన్తో కూడిన పాక్స్లోవిడ్ కరోనా చికిత్స మాత్రను రోజుకు మూడుసార్లు తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. సుమారు 1219 మంది కరోనా పేషంట్లపై చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో ఆస్పత్రిపాలు కావటం, మృతి చెందటం వంటివి జరగలేదని తమ అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు. -
డెల్టా వేరియంట్‌పై కోవిషీల్డ్ 90% రక్షణ
లండన్: కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌పై రెండు డోసుల కోవిషీల్డ్, ఫైజర్ టీకాలు 90% సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఈవ్–2 అనే సంస్థ స్కాట్లాండ్ వ్యాప్తంగా అందిన డేటా ఆధారంగా చేపట్టిన అధ్యయనం ఫలితాలు గురువారం న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. ఎడిన్‌బరో, స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీలు, పబ్లిక్ హెల్త్ స్కాంట్లాండ్ కలిసి ఏప్రిల్ 1– సెప్టెంబర్ 27వ తేదీల మధ్య స్కాట్లాండ్లోని 54 లక్షల మంది డేటాను విశ్లేషించాయి. వ్యాక్సినేషన్ జరుగుతున్న ఈ సమయంలోనే 1,15,000 మంది కరోనా బారినపడగా, వీరిలో 201 మంది చనిపోయారు. బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడటంలో ఫైజర్ టీకా 90 శాతం, కోవిషీల్డ్ 91% సమర్థవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. -
బూస్టర్ డోస్ తీసుకున్న బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్-19 బూస్టర్ డోస్ తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారు, 65 ఏళ్లు పైబడిన అమెరికన్లందరు తప్పనిసరిగా ఫైజర్ మూడో డోసు తీసుకోవాల్సిందిగా కొన్ని రోజుల క్రితం అమెరికా ఆరోగ్యశాఖ సూచించింది. ఈ క్రమంలో బైడెన్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. వైట్ హౌజ్‌లో ఆయన ఫైజర్ టీకా మూడో డోసు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి విముఖత చూపుతున్న ప్రజలు దేశానికి నష్టం కలిగిస్తున్నారని బైడెన్ విమర్శించారు. (చదవండి: పరస్పరం గుర్తించాలి: వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ) మొదటి రెండు డోసులు తీసుకున్న తర్వాత తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని జో బైడెన్ తెలిపారు. అర్హత ఉన్న వారు బూస్టర్ డోస్ తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. అమెరికాలో ఇప్పటివరకు కనీసం ఒక్కడోసు తీసుకున్న వారు 77 శాతంగా ఉన్నారన్నారు. మరో పావు శాతం మంది ప్రజలు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారని.. ఇలాంటి వారి వల్లే దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోందని బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: ఇజ్రాయెల్ ప్రధాని భేటీలో బైడెన్ కునికి పాట్లు!) సీడీసీ నివేదిక ప్రకారం, ఆగస్టు మధ్య నుంచి ఇప్పటివరకు కనీసం 2.66 మిలియన్ల మంది అమెరికన్లు ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులను తీసుకున్నారు. దాదాపు 100 మిలియన్ల మంది అమెరికన్లకు ఫైజర్ టీకాలు వేశారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసులు వేయించుకోవాలని అమెరికా అధికారులు సూచించారు. ఇక అమెరికాలో బూస్టర్ డోసులు ఇవ్వడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఓ వైపు పేద దేశాలు కనీసం ఒక్క డోసు టీకా కూడా అందక ఇబ్బంది పడుతుంటే.. మీరు మూడో డోస్ వేసుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. చదవండి: వలసదారుల ఇక్కట్లు.. బైడెన్ ప్రభుత్వ కీలక ప్రకటన -
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని మహిళ మృతి
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి ఆందోళనకరంగా విస్తరిస్తోంది. మరోవైపు వ్యాక్సిన్ తీసుకొని మహిళ మరణించిన ఘటన ఆందోళన రేపింది. పైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత గుండె సంబంధిత సమస్యలతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. దేశంలో ఫైజర్ టీకా కారణంగా దేశంలో తొలి మరణమని న్యూజిలాండ్ ఆరోగ్య అధికారులు ప్రకటించారు. టీకా కారణంగా ఉత్పన్నమైన మయోకార్డిటిస్ సమస్యతో ఆమె చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. టీకా స్వీకరించిన తర్వాత అనారోగ్యంతో మహిళ మరణించిందని కోవిడ్ భద్రతా పర్యవేక్షణ బోర్డు సమీక్ష అనంతరం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే బాధిత మహిళ వయస్సును ప్రకటించ లేదు. ఫైజర్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించి అరుదైన సైడ్ఎఫెక్ట్ మయోకార్డిటిస్ కారణంగా మహిళ మరణం సంభవించిందని ఈ ప్రకటన పేర్కొంది. అయితే ఈ పరిణామంపై ఫైజర్ ఇంకా స్పందించాల్సి ఉంది. మయోకార్డిటిస్ అనేది గుండె కండరాల వాపు. ఇది రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. హృదయ స్పందనల తీరులో మార్పులకు కారణమవుతుంది. కాగా కరోనాను పూర్తిగా కట్టడి చేసిన దాదాపు ఆరు నెలల తర్వాత న్యూజిలాండ్‌లో డెల్టా వేరియంట్ భారీగా వ్యాప్తిస్తోంది. సోమవారం 53 కొత్త కేసులను నివేదించింది, ప్రస్తుత వ్యాప్తితో మొత్తం సంఖ్య 562 కి చేరుకుంది. డెల్టా వేరియంట్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ నెల ప్రారంభంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. కాగా దేశంలో ఫైజర్/బయోఎన్‌టెక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకా టీకాలను న్యూజిలాండ్ అధికారులు తాత్కాలికంగా ఆమోదించారు. -
ఫైజర్, ఆస్ట్రాజెనెకా సామర్థ్యం ఆరునెలలే!
లండన్: అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్, బ్రిటన్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ల సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత అయిదు నుంచి ఆరు నెలల్లోగా దాని సామర్థ్యం 88% నుంచి 74 శాతానికి పడిపోయినట్టు బ్రిటన్‌కు చెందిన జోయి కోవిడ్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ఇక ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సామర్థ్యం నాలుగైదు నెలల్లోనే 77 శాతం నుంచి 67 శాతానికి పడిపోయినట్టుగా ఆ అధ్యయనం తెలిపింది. చదవండి: ‘టార్గెట్‌లో ఉన్నారు జాగ్రత్త!’ ఆగష్టు 31 డెడ్‌లైన్‌పై బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. 12 లక్షలకిపైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించి, దాని డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. అంతకు ముందు జరిగిన అధ్యయనాల్లో కరోనా వ్యాక్సిన్ సామర్థ్యం కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుందని వెల్లడైంది. వయసులో పెద్దవారు, ఆరోగ్య రంగంలో పని చేస్తున్న వారిలో వ్యాక్సిన్ సామర్థ్యం 50 శాతానికి కూడా పడిపోవచ్చునని ఆ అధ్యయనం తెలిపింది. ‘‘మనం ఇక చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఒకవైపు వ్యాక్సిన్ సామర్థ్యం పడిపోతుంటే మరోవైపు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టిమ్ స్పెక్టర్ అన్నారు. చదవండి: అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్ బూస్టర్ డోసులు అత్యవసరం కరోనా రెండు డోసుల వ్యాక్సిన్లతో పాటు కొంత విరామంలో బూస్టర్ డోసు ఇవ్వాలని ఇప్పటికే ఎందరో శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. తాజాగా వీటి సామర్థ్యం ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తేలిన నేపథ్యంలో బూస్టర్ డోసుల ఆవశ్యకత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బూస్టర్ డోసులు ఇవ్వడం అత్యవసరమని ప్రొఫెసర్ స్పెక్టర్ అన్నారు. -
తగ్గుతున్న టీకా యాంటీబాడీలు
లండన్: ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల వల్ల ఏర్పడిన యాంటీబాడీలు 10 వారాల్లో 50 శాతానికి పడిపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నా యాంటీబాడీలు తగ్గిపోవడం గమనార్హం. యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు యూకేలో జరిపిన ఈ పరిశోధన వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కాలం గడిచేకొద్దీ యాంటీబాడీలు తగ్గిపోతుండడంతో, భవిష్యత్తులో వచ్చే కొత్త వేరియంట్లను ఎదుర్కోవడానికి సమస్యలు ఎదురుకావచ్చనే ఆందోళన వెల్లడవుతోంది. బూస్టర్ డోస్‌తో సానుకూల ఫలితం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా (భారత్‌లో కోవిషీల్డ్) వ్యాక్సిన్లు తీసుకున్న 600 మందిపై ఈ ప్రయోగం నిర్వహించినట్లు యూసీఎల్ పరిశోధకులు తెలిపారు. ఇందులో 18 ఏళ్లు దాటిన అన్నిరకాల గ్రూపులవారు ఉన్నట్లు వెల్లడించారు. వీరిపై చేసిన పరిశోధనలో రోజులు గడిచే కొద్దీ యాంటీబాడీలు తగ్గిపోవడాన్ని గుర్తించారు. ఫైజర్ వ్యాక్సిన్ విషయంలో.. వ్యాక్సినేషన్ జరిగిన 21–41 రోజులకు యాంటీబాడీ లెవెల్స్ ప్రతి మిల్లీలీటర్‌కు 7506 యూనిట్లకు తగ్గిపోయాయి. అదే 70 రోజులు దాటే సమయానికి 3320 యూనిట్లకు తగ్గిపోయాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ విషయంలో వ్యాక్సినేషన్ జరిగిన 20 రోజుల్లోపు యాంటీబాడీ లెవెల్స్ 1201కి తగ్గాయి. 70 రోజులు దాటే సరికి ఆ సంఖ్య 190కి పడిపోయింది. అంటే దాదాపు అయిదు రెట్ల వేగంతో యాంటీబాడీలు తగ్గిపోయాయి. కోవిషీల్డ్ 93 శాతం రక్షిస్తుంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ కరోనా సోకకుండా 93 శాతం రక్షణ కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది. 98 శాతం మరణాలను తగ్గించినట్లు తాజా పరిశోధనలో తేలిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో ఆర్మ్›్డ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపారు. దాదాపు 15 లక్షల మంది డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై జరిగిన పరిశోధనలో ఈ మేరకు ఫలితాలు వచ్చాయని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అత్యంత ముఖ్యమని అన్నారు. -
ఫైజర్ ట్రైల్స్ : చావు బతుకుల మధ్య బాలిక
ఓహియో : ఫైజర్ ట్రైల్స్‌లో వాలంటీర్‌గా పాల్గొన్న ఓ బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వీల్ ఛైర్‌కు పరిమితమై అల్లాడిపోతోంది. అమెరికాలో చోటుచేసుకున్న ఈ సంఘటన గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఓహియోకు చెందిన స్టెఫినీ డి గ్రే కూతురు 12 ఏళ్ల మ్యాడీ డీ గ్రే ఫైజర్ ట్రైల్స్‌లో వాలంటీర్‌గా పాల్గొంది. కొద్ది రోజుల క్రితం ఫైజర్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకుంది. ఆ తర్వాతి నుంచి కడుపులో, రొమ్ము భాగంలో నొప్పి రావటం మొదలైంది. ‘‘ అమ్మా! నాగుండె గొంతులోంచి బయటకు వస్తున్నట్లు ఉంది’ అంటూ తన బాధను తల్లికి చెప్పుకుంది. ఆ తర్వాత గ్యాస్ట్రోపారెసిస్, న్యూసియా, వాంతులు రక్తపోటు వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తాయి. దీనిపై స్టెఫినీ మాట్లాడుతూ.. ‘‘ తనకు తిన్న ఆహారం అరగటం లేదు. ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాము. కనీసం ఒక్క అడుగు కూడా నడవలేని స్థితిలో ఉంది. వీల్ ఛైర్‌కు పరిమితమైంది. మెడ పైకెత్తడానికి వీలులేకుండా ఉంది. ప్రభుత్వ అధికారులు కానీ, ఫైజర్ యాజమాన్యం కానీ, దీనిపై స్పందించలేదు. నా కూతురికి ఎందుకిలా జరుగుతోందో వాళ్లు కనిపెట్టాలి. ఈ మేరకు పరిశోధనలు జరగాలి. ముఖ్యంగా ట్రైల్స్‌లో పాల్గొంటున్న వారి విషయంలో. ట్రైల్స్‌లో భాగంగా అనారోగ్యం పాలవుతున్న వారికి సరైన చికిత్స అందేలా ఉండాలి. లేదంటే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది’’ అని పేర్కొంది. -
Corona Vaccination:జో బైడెన్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యాభై కోట్ల ఫైజర్ వ్యాకిన్ డోసులను కొనుగోలు చేసి.. పేద దేశాలకు ఉచితంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంపై ఇప్పటికే కసరత్తులు పూర్తయ్యానని, బైడెన్ నోటి నుంచి అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అని వైట్‌హౌజ్ ఉటంకించినట్లు అమెరికాలోని ప్రముఖ వెబ్‌సైట్స్ ఒక కథనం ప్రచురించాయి. కాగా, ఫైజర్ బయోఎన్‌టెక్ కొవిడ్ 19 వ్యాక్సిన్ 500 మిలియన్ల డోసులు కొనుగోలు చేయాలని బైడెన్ పాలనా విభాగం ప్రణాళిక వేసింది. వీటిని వంద పేద దేశాలకు వీటిని పంచబోతోంది. ఈ ఏడాది చివరికల్లా 200 మిలియన్ డోసులు, మిగిలిన 300 మిలియన్ డోసులు వచ్చే ఏడాది కల్లా అందించాలని నిర్ణయించుకుంది. ఇక ఈ భారీ సాయంపై పోయిన నెలలోనే బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ‘‘కరోనాను అంతం చేయాల్సిన అవసరం ఉంది. అది అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో నలుమూలలా. వ్యాక్సిన్ డోసుల డొనేషన్లో మీరు పాల్గొనండి. ముందుకు రండి’’ అని ప్రపంచదేశాలను ఉద్దేశించి బైడెన్ వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెబ్ సైట్ పేర్కొంది. ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో బైడెన్ భారీ సాయంపై హర్షం వ్యక్తం అవుతోంది. కాగా, అమెరికా ఇదివరకే 300 మిలియన్ల ఫైజర్ డోసుల కోసం ఒప్పందం చేసుకోగా.. ఇప్పుడు సాయం ప్రకటన నేపథ్యంలో అదనంగా 500 మిలియన్ల డోసుల కొనుగోలు కోసం మరో ఒప్పందం చేసుకుంది. యూఎస్, యూకేలో 42 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తికాగా, ఆఫ్రికాదేశాల్లో ఒక్క శాతం కంటే తక్కువ జనాభాకు వ్యాకినేషన్ జరిగింది. దీంతో ముందుగా ఆఫ్రికన్ దేశాలకే అందించాలని బైడెన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోవాక్స్ ద్వారా 75 శాతం డోసుల్ని పంపిణీ చేయనున్నట్లు వైట్‌హౌజ్ ప్రకటించింది. ఇక ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్ కొరత తీరాలంటే పదకొండు బిలియన్ల డోసులు అవసరమని డబ్ల్యూహెచ్‌వో భావిస్తుండగా.. బైడెన్ సాయం ప్రకటన కొంతలో కొంత ఊరట ఇచ్చేదే. జీ7 సమ్మిట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చదవండి: ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి ఏకైక పరిష్కారమిదే -
విదేశీ టీకాలకు నో ట్రయల్స్!
న్యూఢిల్లీ: కోవిడ్–19పై అత్యధిక సామర్థ్యంతో పని చేస్తున్న ఫైజర్, మోడెర్నా వంటి విదేశీ వ్యాక్సిన్లు భారత్‌కు రావడానికి గల అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. భారత్‌లో అందరికీ కోవిడ్–19 వ్యాక్సిన్ ఇవ్వాలంటే విదేశాల్లోని వివిధ కంపెనీలకు చెందిన టీకాలకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్న కేంద్రం ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదించిన టీకాలు, అమెరికా, యూరోపినయన్ యూనియన్, యూకే, జపాన్లలో లక్షలాది మందిలో విజయవంతంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్న కోవిడ్–19 టీకాలను తిరిగి భారత్‌లో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆప్ ఇండియా (డీసీజీఐ) వెల్లడించింది. అయితే భారత్ దిగుమతి చేసుకునే వ్యాక్సిన్లకు ఆయా దేశాల నేషనల్ కంట్రోల్ లేబొరేటరీల ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలని డీజీసీఐ చీఫ్ వి.జి. సోమాని పేర్కొన్నారు. నష్టపరిహారంలోనూ సానుకూలంగా కేంద్రం మరోవైపు టీకాల వినియోగం తర్వాత నష్టపరిహారానికి సంబంధించిన కేసులన్నీ భారత ప్రభుత్వమే చూసుకోవాలని ఫైజర్, మోడెర్నా కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో టీకాలకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో ఆ టీకాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు ఏమైనా ఉంటే తాము బాధ్యత వహించలేమని, న్యాయపరమైన అంశాలపై కూడా భారత్ ప్రభుత్వమే చూసుకోవాలని టీకా అభివృద్ధి కంపెనీలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 25కి పైగా దేశాలు ఇలాంటి షరతులకు అంగీకరించే టీకాలను దిగుమతి చేసుకున్నాయి. భారత్‌కు కూడా దీనికి అంగీకరిస్తే ఫైజర్, మోడెర్నా సహా విదేశీ టీకాలెన్నో భారత్‌కు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఫైజర్ ఈ ఏడాది డిసెంబరు నాటికి 5 కోట్ల డోసులను అందిస్తామని చెబుతోంది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి మాత్రమే తాము భారత్‌కు టీకాలు ఇవ్వగలమని మోడెర్నా స్పష్టం చేసింది. -
Vaccination : గుడ్‌న్యూస్ చెప్పిన డీసీజీఐ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న సమయంలో మహమ్మారి అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విదేశీ టీకాలకు అనుమతి ప్రక్రియల్లో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఉన్న ఆంక్షలను సవరించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో )ఆమోదించిన అన్ని టీకాలకు దేశంలో వర్తించేలా చేసింది. దీనికి ప్రకారం ఇప్పటికే వివిధ దేశాలు, డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన వ్యాక్సిన్లకు ఇండియాలో మళ్లీ ట్రయల్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఫైజర్, మోడెర్నాలాంటి విదేశీ కంపెనీల వ్యాక్సిన్లకు ఇండియాలో మార్గం సుగమం చేసింది. దేశంలో వ్యాక్సిన్ల భారీ డిమాండ్, కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీసీజీఐ చీఫ్ వీజీ సోమానీ వెల్లడించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ల కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం డీసీజీఐకి ఈ సిఫారసు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తీసుకున్న వ్యాక్సిన్లు, యూఎస్ ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ, జపాన్ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ యూజ్ లిస్ట్‌లో ఉన్న వ్యాక్సిన్లకు ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని నిర్ణయించినట్లు సోమానీ ఒక లేఖలో తెలిపారు. గతంలో విదేశాల్లో ట్రయల్స్ పూర్తి చేసి అనుమతి పొందిన వ్యాక్సిన్లు కూడా ఇండియాలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ లేదా పరిమిత స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడా నిబంధనను ఎత్తివేయడం విశేషం. భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశలో ఫైజర్, మోడెర్నా టీకాల ఆమోదాన్ని వేగవంతం చేయనున్నామనీ, ప్రభుత్వం వారు కోరిన ప్రధాన రాయితీని కూడా ఇచ్చేందుకు సిద్ధమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీలు భారతదేశంలో అత్యవసర వినియోగ అధికారం కోసం దరఖాస్తు చేసుకుంటే తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్నందున ఫైజర్, మోడెర్నా భారత్‌కు చేరడానికి కొంత సమయం పడుతుందని అంచనా. జూలై , అక్టోబర్ మధ్య భారతదేశానికి 5 కోట్ల మోతాదులను అందించడానికి ఫైజర్, సిద్ధంగా ఉంది. చదవండి: Coronavirus: మమ్మీ, డాడీ.. ఎప్పుడొస్తారు? -
‘‘ఆ వ్యాక్సిన్ గురించి అసత్యాలు ప్రచారం చేయమన్నారు’’
వాషింగ్టన్: ప్రపంచం కరోనాతో పోరాడుతుంది.. జనాలు వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పలు దేశాలు టీకాల కొరతతో ఇబ్బంది పడుతుండగా.. కొన్న ఫార్మ కంపెనీలు మాత్రం వ్యాక్సిన్ల గురించి అసత్యాలు ప్రచారం చేసే పనిలో ఉన్నాయి. ఈక్రమంలో రష్యాతో సంబంధం ఉన్న ఓ పీఆర్ ఏజెన్సీ పైజర్ బయో ఎన్‌టెక్ వ్యాక్సిన్ గురించి అసత్యాలు ప్రచారం చేయాల్సిందిగా యూరోప్‌కు చెందిన పలు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, బ్లాగర్స్ను కాంటాక్ట్ అయినట్లు తెలిసింది. రష్యాతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఈ పీఆర్ ఏజెన్సీ ఫైజర్ వ్యాక్సిన్ గురించి ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్‌లో తప్పుడు వార్తలు పోస్ట్ చేయాల్సిందిగా పలువురు బ్లాగర్స్‌ని కోరినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ‘‘ఆస్ట్రాజెనికాతో పోల్చితే.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మరణాలు 3 రెట్లు అధికంగా ఉన్నట్లు ప్రచారం చేయాల్సిందిగా ఓ పీఆర్ ఏజెన్సీ నన్ను కోరింది. అంతేకాక పైజర్ వ్యాక్సిన్‌ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వాలని ప్రశ్నించాల్సిందిగా మమ్మల్ని అభ్యర్థించింది’’ అని తెలిపాడు. పలువురు ఇన్ఫ్లూయెన్సర్ పైజర్ గురించి పుకార్లు వ్యాప్తి చేయాల్సిందిగా ఏజెన్సీ తమను సంప్రదించాయని వెల్లడించడమే కాక ఇందుకు సంబంధించిన రుజువులను కూడా తమ సోషల్‌మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ కలిగిన ప్రసిద్ధ పోడ్కాస్ట్ హోస్ట్ అయిన మిర్కో డ్రోట్ష్మాన్ తనకు వచ్చిన ఇమెయిల్ స్క్రీన్ షాట్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్‌లో భాగంగా ఫైజర్ వ్యాక్సిన్ వల్ల అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని ప్రచారం చేయాల్సిందిగా తనను కోరారని మిర్కో డ్రోట్ష్మాన్ ట్వీట్ చేశాడు. అంతేకాక పోడ్కాస్ట్ సబ్‌స్క్రైబర్స్‌లో ఎక్కువ మంది ఏ వయసు వారు ఉన్నారు..ఈ పని చేయడానికి ఎంత డబ్బు తీసుకుంటారో తెలపాల్సిందిగా కోరినట్లు మిర్కో తెలిపాడు. Sehr interessant: Eine Agentur meldet sich und fragt, ob ich Teil einer „Informationskampagne“ sein will. Es geht darum, einen Link zu angeblich geleakten Dokumenten zu Todesfällen bei Corona-Impfungen zu teilen. Gegen Geld. Sitz der Agentur: London. Wohnort des CEO: Moskau. pic.twitter.com/5x0Wqx79oZ — Mirko Drotschmann (@MrWissen2Go) May 18, 2021 సదరు పీఆర్ ఏజెన్సీ రష్యాకు చెందిన ఫాజ్ అని.. దీన్ని ఒక రష్యన్ పారిశ్రామికవేత్త చేత స్థాపించాడని స్థానిక మీడియా తెలిపింది. ఈ వార్తలు వెలువడిన వెంటనే సదరు జెన్సీ తన వెబ్‌సైట్‌ను నిలిపివేయడమే కాకా దాని ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్‌గా చేసింది. ఏజెన్సీ లండన్‌లో ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ, ఇందుకు సంబంధించి రిజిస్టర్డ్ చిరునామా గుర్తించలేదని మీడియా తెలిపింది. చదవండి: పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అమెరికా కీలక నిర్ణయం -
రెండు వేర్వేరు టీకాలు కలిపి తీసుకోవచ్చా..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం పలు దేశాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే సరిపడా టీకాలు లేకపోవడంతో అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న టీకాల్లో రెండు వేర్వేరు డోసులు తీసుకోవచ్చా.. అనే కోణంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగానే ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తెలిసింది. ఇలా రెండు వేర్వేరు టీకా డోసులు తీసుకోవడం వల్ల తీవ్ర ప్రమాదం లేనప్పటికీ.. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నందున రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను తీసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేర్వేరు వ్యాక్సిన్లకు చెందిన రెండు డోసులను తీసుకున్న వారిలో తక్కువ నుంచి ఓ మోస్తరుగా దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా నివేదిక వెల్లడించింది. ఇవి తొలిడోసు తీసుకున్నప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చని పేర్కొంది. రెండు టీకాలు కలిసినప్పుడు కనిపించే లక్షణాలపై ఇవి ఆధారపడి ఉంటాయని వెల్లడించింది. ఇలాంటి దుష్ప్రభావాలు తరచుగా కనిపిస్తున్నాయని.. కాకపోతే ఇవి తర్వగానే తగ్గిపోతున్నట్లు ఈ వ్యాక్సిన్ మిక్సింగ్ ప్రయోగాలకు అధ్యక్షత వహించిన డాక్టర్ మాథ్యూ స్నేప్ పేర్కొన్నారు. 830 మందిపై ప్రయోగాలు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అందుబాటులోకి వచ్చిన టీకాలు అన్ని రెండు డోసులుగా తీసుకోవాల్సినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు మోతాదుల్లో తీసుకోవడంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను మొదటి డోసులో ఒకటి, రెండో డోసులో మరో వ్యాక్సిన్‌ను ఇచ్చి పరీక్షిస్తోంది. ఇలా 830 మంది వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో వేర్వేరు డోసులను ఇచ్చింది. ఈ ప్రయోగాలను తొలుత ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలపై మొదలుపెట్టగా.. ఈ రెండు టీకాలను నాలుగు కాంబినేషన్లలో ఇచ్చి ప్రయోగాలు చేసింది. వేర్వేరు టీకాలతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ.. ఇలా రెండు వ్యాక్సిన్లను నాలుగు కాంబినేషన్లలో ఇవ్వగా.. ఒకేరకమైనా టీకా రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే రెండు వేర్వేరు టీకాలు తీసుకున్న వారిలో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడం గుర్తించామని తాజా నివేదిక వెల్లడించింది. వారిలో తీవ్ర జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించాయి అని తెలిపింది. ఆస్ట్రాజెనికా తొలి డోసు, ఫైజర్ రెండో డోసు తీసుకున్న వారిలో 34 శాతం మందిలో జ్వరం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. రెండు డోసులు ఆస్ట్రాజెనికా తీసుకున్నవారిలో కేవలం 10శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఇక ఫైజర్ తొలిడోసు, ఆస్ట్రాజెనెకా రెండో డోసు తీసుకున్న 41 శాతం మందిలో ప్రతికూల ప్రభావాలు కనిపించగా.. ఫైజర్‌లో రెండు డోసులు తీసుకున్న వారిలో కేవలం 21శాతం దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే, ఇవి ఆసుపత్రుల్లో చేరేంత తీవ్రంగా లేవని పరిశోధకులు స్పష్టం చేశారు. వీటిపై మరింత విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. టీకాలను మార్చి తీసుకోవద్దు.. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేర్వేరు టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు ఎటువంటి నిబంధనలూ లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఒకే వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కూడా రెండు డోసులూ ఒకే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తోంది. వేర్వేరు వ్యాక్సిన్ డోసులు కేవలం ప్రయోగాల దశల్లోనే ఉన్నాయి. అవి కూడా కేవలం ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలపై మాత్రమే ఇలాంటి ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేర్వేరు వ్యాక్సిన్లను కాంబినేషన్‌తో తీసుకోకూడదని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వ్యక్తులు రెండో డోసు ఇతర రాష్ట్రాలు/జిల్లాల్లో తీసుకోవాల్సి వస్తే తప్పకుండా అదే వ్యాక్సిన్ తీసుకోవాలని భారత ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. చదవండి: కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల! -
Corona Vaccine: గర్భంలోని మాయకు నష్టం లేదు
న్యూఢిల్లీ: కరోనా టీకాపై ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. ప్రధానంగా గర్భిణులు ఈ టీకా తీసుకోవచ్చా? లేదా? అనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్‌తో గర్భానికి ఎలాంటి నష్టం వాటిల్లదని అమెరికా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. గర్భంలోని మాయకు (ప్లాసెంటా) ఏమాత్రం ఇబ్బంది ఉండదని, అనుమానాలు అక్కర్లేదని వెల్లడించింది. ఈ వివరాలను అబ్స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. ‘ప్లాసెంటా అనేది విమానంలోని బ్లాక్‌బాక్స్ లాంటిది. గర్భంలో ఏవైనా పొరపాట్లు జరిగితే మాయలో మార్పులను గమనించవచ్చు. తద్వారా అసలేం జరిగిందో కనిపెట్టవచ్చు’ అని అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ ఫీన్‌బర్గ్ స్కూల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెఫ్రీ గోల్ట్‌స్టీన్ చెప్పారు. కోవిడ్ టీకా ప్లాసెంటాను దెబ్బతీయదని అన్నారు. గర్భిణులు నిరభ్యంతరంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని సూచించారు. తమ అధ్యయనం గర్భిణుల్లో కరోనా వ్యాక్సిన్ల పట్ల భయాందోళనలను దూరం చేస్తుందని భావిస్తున్నట్లు పరిశోధకుడు ఎమిలీ మిల్లర్ చెప్పారు. అధ్యయనంలో భాగంగా 84 మంది కరోనా టీకా (మోడెర్నా లేదా ఫైజర్ టీకా) తీసుకున్న గర్భిణులు, 116 మంది టీకా కోసం తీసుకోని గర్భిణుల్లోని ప్లాసెంటాను పరిశీలించారు. టీకా తీసుకున్న గర్భిణుల్లో ప్రతిరక్షకాలు (యాంటీ బాడీలు) వృద్ధి చెంది, మాయలోని పిండానికి కూడా బదిలీ అయినట్లు గుర్తించారు. అంటే కరోనా టీకాతో మాయలోని పిండానికి కూడా పూర్తి రక్షణ కలుగుతున్నట్లు నిర్ణయానికొచ్చారు. ఇక గర్భంతో ఉన్నప్పుడు కరోనా వైరస్ సోకితే తల్లికి, గర్భంలోని బిడ్డకు మధ్య అసా«ధారణంగా రక్తప్రసారం జరుగుతున్నట్లు గమనించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందితే, రక్తప్రసారం సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు తేల్చారు. కరోనా వ్యాక్సిన్‌తో తల్లికి, బిడ్డకు.. ఇద్దరికీ రక్షణే. సురక్షితమైన గర్భానికి వ్యాక్సిన్ దోహదపడుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. (చదవండి: మీ వద్ద కరోనా మందులు ఉన్నాయా.. మేము తీసుకుంటాం!) -
ఒకే మహిళకు 6 డోసుల టీకా.. తర్వాత ఏమైందంటే!
రోమ్: ప్రపంచంలో ఎక్కడ చూసిన కరోనా ప్రభావమే కనిపిస్తోంది. మహమ్మారి అడుగు పెట్టిన ప్రతి చోటా అల్లకల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకునే ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓ మహిళకు ఆరు డోసుల టీకా ఇవ్వడంతో అస్పస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. 24 గంటల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జి అయ్యింది. ఈ సంఘటన ఇటలీలో చోటుచేసుకుంది. ఇటలీలో 23 ఏళ్ల మహిళ కరోనా వ్యాక్సిన్ కోసం ఆదివారం టుస్కనీలోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ హస్పిటల్‌లోని హెల్త్ వర్కర్ అనుకోకుండా ఫైజర్ వ్యాక్సిన్ బాటల్లోని మొత్తం డోసులను మహిళకు ఇచ్చింది. అందులో ఆరు డోసులు ఉన్నాయి. కాసేపటి తరువాత మిగతా అయిదు సిరంజ్‌లు ఖాళీగా ఉండటాన్ని చూసి తను చేసిన తప్పుని గ్రహించింది. మరోవైపు ఆరు డోసులు తీసుకున్న మహిళ అనారోగ్యానికి గురవ్వడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకపోవడంతో దవాఖాన నుంచి సోమవారం ఉదయం డిశ్చార్జీ చేశారు. అయితే ఓ డాక్టర్ ఆమెను నిత్యం పర్యవేక్షిస్తారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించారు. మానవ తప్పిదం వల్లే ఈ పొరపాటు ఇది జరిగిందని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని పేర్కొన్నారు. చదవండి: రియల్ వారియర్స్: మా కష్టం కన్నా రోగుల ప్రాణాలే ముఖ్యం -
పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: కరోనా సృష్టిస్తున్న మరణ మృదంగం నుంచి పిల్లల్ని రక్షించేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 15 ఏళ్ల వయస్సు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) అనుమతి ఇచ్చింది. కరోనా మహమ్మారిని నిర్మూలించే దిశగా తాము సాగిస్తోన్న పోరాటంలో మరో కొత్త దశ ప్రారంభమైందని ఎఫ్‌డీఏ కమిషనర్ జెనెట్ వుడ్‌కాక్ పేర్కొన్నారు. దీంతో పిల్లల పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపే వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నాల్ని అధికారులు ముమ్మరం చేశారు. ఫెడరల్ వ్యాక్సిన్ అడ్వైజరీ కమిటీ మార్గదర్శకాల ప్రకారం..12 నుండి 15 సంవత్సరాల పిల్లలకు రెండు మోతాదుల వ్యాక్సిన్‌ను వేయాలని సిఫారసు చేసిన తరువాతనే అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రపంచంలోనే తొలిదేశంగా కెనడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా సైతం పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు 12 నుంచి 15 ఏళ్ల వయస్సున్న 2 వేల మంది పిల్లలపై ఫైజర్ కరోనా వ్యాక్సిన్ వేశారు. గతంలో కంటే వ్యాక్సిన్ వేసిన తర్వాత పిల్లలో కోవిడ్ పై పోరాటం చేసే ప్రతిరోధకాలు ఉత్పత్తి అయినట్లు గుర్తించామని చిల్డన్ స్పెషలిస్ట్, ఫైజర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బిల్ గ్రుబెర్ తెలిపారు. కాగా, ఫైజర్-జర్మన్ బయోఎంటెక్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను వినియోగించాలని ఇటీవల యూరోపియన్ యూనియన్‌తోపాటు ఇతర దేశాలు వినియోగించుకోవాలని కోరాయి. చదవండి: కరోనా: ఐవర్‌మెక్టిన్‌తో తగ్గుతున్న మరణాల ముప్పు! -
కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల!
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే పలు దేశాలు టీకాలు పంపిణీ చేస్తూ కరోనా కట్టడికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్‌తో 80 శాతం మరణాలు తగ్గే అవకాశం ఉందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాడ్ పేర్కొంది. అంతే కాకుండా ఫైజర్ బయోటెక్ ఫస్ట్ డోస్‌తో 80శాతం, రెండో డోస్‌తో 97శాతం కోవిడ్ మరణాలు తగ్గుతాయని వెల్లడించింది. ఏప్రిల్ నెలలో కరోనా సోకి 28 రోజుల అనంతరం మృతి చెందిన బాధితులపై బ్రిటన్‌లో రియల్ వరల్డ్ సెట్టింగ్ సంస్థ అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనం ప్రకారం.. ఎటువంటి టీకా తీసుకోని వారితో పోల్చితే ఒక డోసు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 55 శాతం, ఒక డోసు ఫైజర్ టీకా తీసుకున్న వారిలో 44 శాతం మంది మరణించకుండా సురక్షితంగా కోవిడ్ నుంచి బయటపడినట్లు తెలిపింది. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 80 శాతం మరణాలు తగ్గుతాయని కూడా పేర్కొంది. అదేవిధంగా ఫైజర్-బయోటెక్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవడం వల్ల 69శాతం మరణాలు తగ్గడంతో పాటు 97 శాతం సురక్షితమని ఈ అధ్యయనం వివరించింది. ఫైజర్-బయోటెక్ రెండు డోస్‌లు తీసుకున్న 80సంవత్సరాల వయసు వారిలో 93శాతం ఆస్పత్రిలో చేరే అవసరం ఉండదని తెలిపింది. ఇక ఇంగ్లండ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ దేశంలో లాక్డౌన్ ఆంక్షలను మరింత సడలించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు వేగంగా అందిస్తే కోవిడ్ నియంత్రణ మెరుగవుతుందని రియల్ వరల్డ్ సెట్టింగ్ అధ్యయన సంస్థ అభిప్రాయపడింది. (చదవండి: కోవిడ్ సంక్షోభం: భారత్‌కు మద్దతుగా ట్విటర్ భారీ విరాళం) -
12 ఏళ్లు దాటిన పిల్లలకూ ఫైజర్ వ్యాక్సిన్
ఒట్టావ: ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ను 12 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలకు టీకా వేసేందుకు కెనడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. వాస్తవానికి కరోనా వ్యాక్సిన్లను 18 ఏళ్ల లోపు పిల్లలకు వేయించుకునేందుకు అనుమతి లేదు. కానీ కెనడా ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయంగా మారింది. ఈ సందర్భంగా కెనడియన్ ఫెడరల్ హెల్త్ మినిస్ట్రీలోని సీనియర్ సలహాదారు సుప్రియ శర్మ మాట్లాడుతూ. జర్మన్ భాగస్వామి బయోఎన్‌టెక్‌తో తయారు చేసిన ఫైజర్ వ్యాక్సిన్ చిన్న పిల్లలకు సురక్షితమైందని, కరోనాను అరికడుతుందని అన్నారు. 18 ఏళ్ల లోపు వయసువారికి కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతినిచ్చిన తొలిదేశం కెనడాయేనని సుప్రియ శర్మ వెల్లడించారు. కెనడాతో పాటు అమెరికా కూడా చిన్న పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేలా అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు జర్మనీకి చెందిన ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకా 18 ఏళ్ల వారితో పోల్చుకుంటే 12 నుంచి 15 ఏళ్ల వయసు వాళ్లలో టీకా తీసుకొన్న తర్వాత దుష్ప్రభావాలు ఏమీ కనిపించలేదని ఈ మార్చిలో విడుదల చేసిన నివేదికలో ఫైజర్ తెలిపిన సంగతి విదితమే. మరోవైపు ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల రక్తం గడ్డకట్టి మరణించినట్లు తెలుస్తోంది. అయినా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని కొన సాగిస్తామని ఆరోగ్యశాఖ అధికారి జెన్నిఫర్ రస్సెల్ తెలిపారు. వ్యాక్సిన్ వల్ల ఎదురయ్యే సమస్యల కంటే వ్యాక్సిన్ వేయించుకోక పోవడం వల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కాగా, కెనడాలో ఇప్పటి వరకు 12 లక్షల 60 వేల మందికి కరోనా సోకింది. వారిలో 20% మంది 19 ఏళ్ల వయస్సు వారే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక కరోనా నుంచి 11లక్షల 50వేల మంది కోలుకోగా 24,450 మంది మరణించారు. -
ఫైజర్ ఔదార్యం: కంపెనీ చరిత్రలో అతిపెద్ద సాయం
సాక్షి న్యూఢిల్లీ: గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఫైజర్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారత్‌కు భారీ సాయం అందించేందుకు నిర్ణయించింది. 70 మిలియన్ డాలర్ల (రూ.510 కోట్లకు పైన) విలువైన మందులను ఇండియాకు అందివ్వనుంది. కంపెనీ చరిత్రలో మానవతా దృక్పథంతో అందించిన అతిపెద్ద సాయమని ఫైజర్ ఛైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా సోమవారం వెల్లడించారు. ఈ మేరకు ఫైజర్ ఇండియా ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారాన్ని అందించారు. అలాగే తమ కరోనా వ్యాక్సిన్‌ను తొందరగా ఆమోదించుకునేలా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా తమకు అవకాశం రాలేదని తెలిపారు. దేశంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు ఫైజర్ మందులు ఉచితంగా అందాలన్న ఉద్దేశంతోనే తామీ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్బర్ట్ తెలిపారు. అవసరమైన వారికి ఆ మందులు అందలా ప్రభుత్వం, ఎన్జీవోలతో కలిసి పని చేస్తామన్నారు. అమెరికాతోపాటు యూరప్, ఆసియాలలోని తమ పంపిణీ కేంద్రాల నుంచి ఈ మందులను వెంటనే ఇండియాకు పంపనున్నట్లు ఫైజర్ చైర్మన్ ఆల్బర్ట్ బౌర్లా వెల్లడించారు. భారత్‌లో కరోనా కల్లోలం తమను ఆందోళనకు గురిచేస్తోందని, ఈ సమయంలో ప్రజల సంక్షేమం కోసం తాము ప్రార్థిస్తున్నామని ఆల్బర్ట్ అన్నారు. చదవండి : కరోనా ఉధృతి: 6వ రోజూ 3 వేలకు పైగా మరణాలు -
ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు.. కీలక విషయాలు వెల్లడి
న్యూఢిల్లీ: ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ గురించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా పాజిటివ్ బాధితులు ఒక్క డోస్ ఫైజర్ లేదా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వేయించుకుంటే వారినుంచి ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని తేలింది. దాదాపు 50 శాతం వరకు ఈ రెండు వ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయని ది పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ రీసెర్చ్ (పీహెచ్ఈ) అనే జర్నల్ తన కథనంలో పేర్కొంది. ది పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ రీసెర్చ్ (పీహెచ్ఈ) కథనం ప్రకారం.. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల్లో ఏదైనా ఒక్కడోస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారు మూడు వారాల తర్వాత కోవిడ్ బారినపడితే.. ఈ రెండు వ్యాక్సిన్లు వేసుకున్న కారణంగా వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి 38 నుంచి 49 శాతం మేర తక్కువగా ఉన్నట్లు పీహెచ్ఈ రీసెర్చ్ సైంటిస్ట్‌లు వెల్లడించారు. ‘ఇది అద్భుతం. ఇప్పటికే మేం చేసిన పరిశోధనల్లో వ్యాక్సిన్ ప్రాణాల్ని కాపాడుతుందని గుర్తించాం. తాజా పరిశోధనల్లో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని మరోసారి నిరూపితమైంది’ అని బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ అన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న 57 వేల మందికి చెందిన 24 వేల కుటుంబాల ఆరోగ్య స్థితిగతులు, సంబంధిత డేటా ఆధారంగా తాము చేసిన పరిశోధనల్లో ఈ ఫలితాలు వెలుగులోకి వచ్చాయని మాట్ హాన్కాక్ చెప్పారు. అంతేకాదు ఒక్కడోస్ వ్యాక్సిన్ వేయించుకున్నవారు నాలుగు వారాల తర్వాత వైరస్‌బారిన పడితే 65 శాతం వరకు వైరస్ వ్యాప్తి చెందడం తగ్గుతుందని గతంలో తేలిందన్నారు. -
చైనా వ్యాక్సిన్‌కు అంత సీన్ లేదు, అసలు విషయమిదే!
బీజింగ్: చైనా సరుకులోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఆ దేశం తయారు చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్లు సరిగా పని చేయడం లేదని అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారే అంగీకరించారు. అందుకే ఆ వ్యాక్సిన్లన్నింటినీ కలగలిపి, దాని సామర్థ్యం పెంచేలా కొత్త వ్యాక్సిన్ తయారు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చైనా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ గావూ ఫూ వెల్లడించారు. చైనాలో తయారైన వ్యాక్సిన్లకు కరోనా నుంచి అత్యధిక రక్షణ కల్పించే సామర్థ్యం లేదని గావూ విలేకరుల సమావేశంలో బాహాటంగానే వెల్లడించారు. ఇన్నాళ్లు పశ్చిమాది దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్ల పనితీరుపై విషం గక్కిన చైనా, తమ దేశంలో తయారైన టీకా డోసుల్ని భారీగా వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. ఇప్పుడు ఆ దేశమే తమ దేశంలో తయారైన వ్యాక్సిన్లు సరిగ్గా పని చేయడం లేదని అంటోంది. చైనాలో తయారైన సినోవాక్ వ్యాక్సిన్ సామర్థ్యం 50.4శాతం మాత్రమేనని బ్రెజిల్లో పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది. అదే అమెరికాలో తయారైన ఫైజర్ వ్యాక్సిన్ 97శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. చైనా ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతుల్లోనే వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అదే పశ్చిమాది దేశాలు ఎంఆర్ఎన్ఏ అనే ఆధునిక పద్ధతిలో వ్యాక్సిన్‌ను రూపొందించాయి. ఇదే విధానంలో రూపొందించిన అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ రక్షణ, సామర్థ్యంపై ఇన్నాళ్లూ డ్రాగన్ దేశం సందేహాలు లేవనెత్తింది. గావూ కూడా ఎంఆర్ఎన్ఏ విధానంలో చేసే వ్యాక్సిన్లకి దుష్ప్రభావాలు ఉంటాయని గతంలో వ్యాఖ్యానిం చారు. కానీ ఇప్పుడు రూటు మార్చుకొని ఆ పద్ధతుల్లోనే టీకా తయారు చేయాలని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. చైనాలో ఇప్పటివరకు 3.4 కోట్ల మంది రెండు టీకా డోసుల్ని తీసుకోగా, 6.5 కోట్ల మంది సింగిల్ డోసుని తీసుకున్నారు. (చదవండి: వెంట్రుకలపై క్రేజ్: చైనాకు జుట్టు అక్రమ రవాణా ) -
వ్యాక్సిన్ల పనితీరుపై సీడీసీ స్టడీ, కీలక విషయాలు వెల్లడి
వాషింగ్టన్: ఫైజర్, మోడర్నా టీకాలు మొదటి డోస్‌తోనే అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనంలో తేలింది. మొదటి సారి రెండు షాట్స్ తీసుకున్న తరువాత వ్యాధి సంక్రమణ ప్రమాదం 80 శాతానికి పడిపోయిందని సీడీసీ రిపోర్టు వెల్లడించింది. ఇటీవల అమెరికాలోని మెడికల్ సిబ్బందికి ఇచ్చిన మొదటి డోస్‌లో ఈ విషయం స్పష్టమైంది. రెండు వారాల తరువాత ఇచ్చిన రెండో డోస్‌తో వ్యాధి సంక్రమణ ప్రమాదం 90 శాతానికి పడిపోయిందని పరిశోధకులు గుర్తించారు. లక్షణాలు లేకుండా కరోనాబారిన పడుతున్నవారికి వ్యాధి సంక్రమణ జరగకుండా ఈ టీకాలు రక్షిస్తున్నాయని పేర్కొంది. టీకాలు తీసుకున్న నాలుగు వేల మందిపై జరిపిన అధ్యయనంలో ఈ కీలక విషయాలపై పరిశోధకులు సోమవారం నివేదిక విడుదల చేశారు. ఈ అధ్యయనంతో పలు కంపెనీలు చేస్తున్న టీకా ప్రయత్నాలు మరింత సఫలమౌతున్నట్లు సీడీసీ డైరెక్టర్ రోషెల్ వాలెన్స్కీ ఒక ప్రకటనలో తెలిపారు. 2020 డిసెంబర్ 14 నుంచి మార్చి 13, 2021 వరకు, 13 వారాల వ్యవధిలో ఆరు రాష్ట్రాల్లో వాక్సినేషన్లో పాల్గొన్న 3,950మందిలో ఈ ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ల మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయని కనుగొన్నారు. ఈ అధీకృత mRNA కోవిడ్-19 వ్యాక్సిన్లు దేశ ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఇతర ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాధి సంక్రమణకు వ్యతిరేకంగా ప్రారంభంలోనే, గణనీయమైన రక్షణను అందించాయని వాలెన్స్కీ చెప్పారు.కొత్త mRNA సాంకేతికత ఒక సహజ రసాయన మెసెంజర్ సింథటిక్ రూపం, కరోనావైరస్ నుంచి రక్షించడానికి, రోగ నిరోధక శక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్ధితుల్లో ఈ టీకాలను వాడుకోడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: జంతువుల నుంచే కరోనా! -
ఆ టీకా ఒక్క డోసు చాలు
వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యం అమెరికా మూడో వ్యాక్సిన్‌కి అనుమతులు మంజూరు చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన టీకా వినియోగానికి శనివారం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతినిచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా ఒక్క డోసు ఇస్తే సరిపోతుందని, రెండు డోసులు అవసరం లేదని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు అనుమతిచ్చింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పుడు మూడో కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌కి ఎఫ్‌డీఏ అనుమతులు రావడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటం ఇక తుది దశకు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలందరికీ ఇది అత్యంత ఉత్సాహాన్నిచ్చే వార్తని బైడెన్ వ్యాఖ్యానించారు. ‘‘జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ను అన్ని విధాలుగా పరీక్షించి, రకరకాలుగా ప్రయోగాలు నిర్వహించి సంతృప్తి చెందిన తర్వాతే ఎఫ్‌డీఏ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. కరోనాని తరిమికొట్టడానికి ఈ వ్యాక్సిన్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది’’అని బైడెన్ చెప్పారు. వీలైనంత తొందరగా దేశంలో అత్యధిక మందికి వ్యాక్సిన్ డోసులు ఇస్తేనే కరోనా ఉధృతిని కట్టడి చేయగలమని అన్నారు. ప్రపంచంలోనే కరోనా వైరస్‌తో అత్యధికంగా అమెరికాలోనే 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ను అడ్డుకోగలదు అమెరికా, లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రయోగాల్లో జేఅండ్‌జే వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది, సామర్థ్యమైనదని తేలింది. కరోనా వైరస్‌పై 85% సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని వివిధ ప్రయోగాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికా వేరియెంట్‌పైన కూడా ఈ టీకా అద్భుతంగా పని చేస్తోందని ప్రాథమికంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది చివరి నాటికి కోటి డోసుల్ని ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది. జాన్సన్ వ్యాక్సిన్ నిల్వ చేయడం కూడా చాలా సులభం. ఫైజర్, మోడెర్నా మాదిరిగా అత్యంత శీతల వాతావరణంలో ఉంచాల్సిన పని లేదు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో కూడా మూడు నెలల పాటు ఈ టీకా నిల్వ ఉంటుంది. -
ఫైజర్ ‘వ్యాక్సిన్’ దరఖాస్తు వెనక్కి
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ తాను చేసిన దరఖాస్తును వెనక్కి తీసుకుంది. మన దేశంలో వ్యాక్సిన్ వినియోగానికి తొలిసారిగా దరఖాస్తు చేసుకున్న కంపెనీ ఫైజరే. ఈ నెల 3న భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఏ)తో చర్చించిన అనంతరం దరఖాస్తుని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఫైజర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘డీసీజీఏతో సమావేశం తర్వాత వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి చేసుకున్న దరఖాస్తుని ప్రస్తుతానికి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. డీసీజీఏ కోరిన అదనపు సమాచారాన్ని అందించిన తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకుంటాం’ అని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది. చదవండి: రాష్ట్రానికి కోవిడ్ సాయం రూ.353 కోట్లు భారత్‌లో ఎలాంటి ప్రయోగాలు నిర్వహించకుండా, స్థానిక ప్రజలకు ఈ టీకా ఎంత భద్రమైనదో తెలీకుండా వ్యాక్సిన్ వినియోగానికి అవకాశం ఇవ్వలేమని డీసీజీఏ కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేసినట్టుగా సమాచారం. పశ్చిమాది దేశాలకు, మనకు జన్యుపరంగా ఎన్నో మార్పులున్న నేపథ్యంలో స్థానిక ప్రయోగాలు నిర్వహించకుండా అనుమతులు ఇవ్వలేమని డీసీజీఏ వర్గాలు వెల్లడించడంతో ఫైజర్ కంపెనీ అనుమతుల కోసం చేసిన దరఖాస్తుని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ 95శాతం సురక్షితమైనట్లు తేలిందని అంటోంది. ఈ వ్యాక్సిన్‌ను మైనస్ 70డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచవలసి ఉంచాల్సి ఉండడంతో భారత్‌లో ఆచరణలో ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ సాధ్యం కాదన్న అభిప్రాయాలున్నాయి. -
కరోనా వ్యాక్సిన్: ఫైజర్ కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: ఫార్మా మేజర్ ఫైజర్ సంచలన విషయాన్ని ప్రకటించింది. భారతదేశంలో తన కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ) దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఫిబ్రవరి 3న జరిగిన భారత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశంలో ఫైజర్ ఈ విషయాన్ని ప్రకటించింది. (షాకింగ్: కరోనాలో 4 వేల రకాలు) భారత్‌లో అనుమతి కోసం అధికారులను సంప్రదించిన దాదాపు రెండు నెలల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో తన కోవిడ్ -19 వ్యాక్సిన్ రెగ్యులేటరీ ఆమోద దరఖాస్తును ఉపసంహరించుకోవాలని ఫైజర్ నిర్ణయించినట్లు అమెరికన్ డ్రగ్ దిగ్గజం శుక్రవారం తెలిపింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశంలో రెగ్యులేటరీ వ్యాక్సిన్ అదనపు సమాచారాన్ని కోరడంతో ఫైజర్ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సిన్ అతితక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మరింత అదనపు సమాచారంతో ఇండియాలో అత్యవసర వినియోగ ఆమోదం కోసం మరోసారి దరఖాస్తు చేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. -
వ్యాక్సిన్ కోసం టాటా, మోడరానా ఇంక్ జట్టు
ముంబై: టాటా గ్రూప్ యొక్క హెల్త్‌కేర్ వెంచర్ మోడరానా ఇంక్‌తో కలిసి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను భారతదేశంలో తీసుకురావడానికి భాగస్వామ్యం కోసం చర్చలు ప్రారంభించినట్లు ఎకనామిక్ టైమ్స్ నేడు తెలిపింది. టాటా మెడికల్ & డయాగ్నోస్టిక్స్, మోడరనా యొక్క వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తో జతకట్టిన్నట్లు కొందరు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై మోడెర్నా, టాటా మెడికల్ & డయాగ్నోస్టిక్స్ స్పందించలేదు.(చదవండి: వ్యాక్సిన్ రేస్‌లో టాప్‌టెన్‌లో భారత్) ఫైజర్ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలి. కానీ మోడెర్నాను సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు. ఇది భారతదేశం వంటి పేద దేశాలకు మరింత అనుకూలంగా ఉంటుంది వారు పేర్కొన్నారు. మోడరనా యొక్క వ్యాక్సిన్ చివరి పరీక్ష దశలో 94.1శాతం మందికి ఎలాంటి తీవ్రమైన భద్రతా సమస్యలు తలెత్తలేదు. ఈ వ్యాక్సిన్ ఈ నెల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్, ఐరోపాలో ఉపయోగించడానికి ఆమోదించబడింది అని మోడరనా సంస్థ పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమంలో ఏ వాక్సిన్ ను పరిగణనలోకి తీసుకోవాలంటే ప్రతి టీకా తయారిదారి కంపెనీ తప్పనిసరిగా స్థానికంగా పరీక్షలు జరపాలని భారతదేశం ఆదేశించింది. -
ఫైజర్ ఎఫెక్ట్: 12 వేల మందికి కరోనా పాజిటివ్
జెరూసలెం: భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సుమారు 12 వేల మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. గతేడాది డిసెంబర్ 19న ఇజ్రాయెల్‌లో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించారు. వృద్ధులకు, హెల్త్ రిస్క్ ఎక్కువ ఉన్నవారికి, అత్యవసర సిబ్బందికి ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో మొత్తం 1,89,000 మందికి మరో సారి కోవిడ్ టెస్ట్ నిర్వహించగా.. 12,400 మందికి అనగా 6.6 శాతం జనాభాకి కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పాజిటివ్ వచ్చిన వారిలో 69 మందికి వ్యాక్సిన్ సెకండ్ డోస్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో తాము ఊహించిన దాని కన్నా ఫైజర్ వ్యాక్సిన్ సామార్థ్యం చాలా తక్కువగా ఉందని నేషనల్ కో ఆర్డినేటర్ ఆన్ పాండమిక్ అభిప్రాయపడ్డారు. (చదవండి: మా వ్యాక్సిన్ చాలా డేంజర్: చైనా ఎక్స్పర్ట్) ఇక నెల క్రితం ఇక్కడ తొమ్మిది మిలియన్ల మంది నివాసితులలో 2.2 మిలియన్లకు పైగా టీకాలు వేసినట్లు ఆరోగ్య మంత్రి యులి ఎడెల్స్టెయిన్ తెలిపారు. వీరిలో 3.5 జనాభాకి సెకండ్ డోస్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ, వైరస్ వ్యాప్తి కంట్రోల్ కాలేదు. దాంతో ప్రస్తుతం దేశంలో మూడో సారి లాక్డౌన్ విధించారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌లో అర మిలియన్‌కు పైగా కేసులు నమోదయ్యాయి.. 4,005 మంది మరణించారు. -
నార్వేలో ‘టీకా’ విషాదం
ఓస్లో: కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం నార్వేలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇటీవల ఫైజర్వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి చెందారు. వీరితోపాటు అస్వస్థతకు గురైన 16 మందిలో 9 మంది టీకా తీసుకున్న వెంటనే తీవ్రమైన బాధతో ఇబ్బంది పడ్డారని, వీరికి అలెర్జీ లక్షణాలు, తీవ్ర జ్వరం కనిపించాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనతో టీకా భద్రతపై ఉన్న అనుమానాలు మరింత బలపడ్డట్టయిందని పరిశీలకులు అంటున్నారు. అయితే, 80 ఏళ్లు పైబడి, వయో భారంతో బలహీనంగా ఉండటంతో వ్యాక్సిన్‌తో సాధారణంగా తలెత్తే దుష్పరిణామాలు వీరిపై తీవ్ర ప్రభావం చూపినట్లు పరీక్షల్లో తేలిందని ప్రభుత్వం తెలిపింది. మరణించిన 23 మందికిగాను 13 మందిలో వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సాధారణ లక్షణాలే కనిపించాయంది. కోవిడ్ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్న ఆరోగ్య శాఖ సిబ్బంది, వృద్ధులకు డిసెంబర్ నుంచి ఫైజర్–బయోఎన్‌టెక్ తయారీ టీకాను నార్వే ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటి వరకు 33 వేల మందికి మొదటి డోసుగా ఈ వ్యాక్సిన్ వేశారు. ఈ ఉదంతం నేపథ్యంలో కోవిడ్ టీకా ఎవరికి ఇవ్వాలనే విషయంలో వైద్యులు మరింత జాగ్రత్తగా పరిశీలన జరపాలని, 80 ఏళ్లు పైబడిన వారి మిగిలిన జీవిత కాలం చాలా స్వల్పంగా ఉండటంతో, వారికి టీకా ఇవ్వడం ద్వారా పెద్దగా లాభమేమీ కూడా ఉండదని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసినట్లు ‘బ్లూమ్‌బర్గ్’తెలిపింది. యువజనులు, ఆరోగ్యంతో ఉన్న వారికి మాత్రం వ్యాక్సినేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో నార్వే ప్రభుత్వానికి సహకరిస్తామని సదరు టీకా తయారీ సంస్థ ఫైజర్ తెలిపింది. -
నార్వేలో టీకా విషాదం.. 23 మంది మృతి
ఓస్లో: నార్వేలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. దాంతో నార్వే ప్రభుత్వం బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది. వివరాలు.. ఫైజర్ ఎన్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. వీరిలో 13 మందికి శవపరీక్షలు నిర్వహించగా.. టీకా తీసుకున్న తర్వాత వచ్చే సాధారణమైన దుష్ర్పభావాలు తలెత్తి.. అవి తీవ్రంగా మారి మరణించారని నార్వేజియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది. అంతేకాక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనిపించే సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా బలహీనంగా ఉన్న వారిలో తీవ్రంగా మారాయన్నారు. (చదవండి: ‘వ్యాక్సిన్ వేసుకోవడానికి బలవంతం లేదు’) బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలతో ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని సూచించారు నార్వే అధికారులు. అతి తక్కువ జీవితకాలం ఉన్నవారు టీకా తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. వారికి టీకా అనవసరం అన్న అభిప్రాయాన్ని నార్వే ఆరోగ్య శాఖ వ్యక్తం చేసింది. ఆరోగ్యవంతులు, యువకులు టీకాను తీసుకోవచ్చు అని నార్వే ప్రభుత్వం తెలిపింది. ఇక తమ వ్యాక్సిన్ తీసుకుని 23 మంది మరణించిన ఘటనపై ఫైజర్ కంపెనీ విచారణ చేపడుతున్నది. టీకా వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య తక్కువగానే ఉందని, తాము ముదుగా అనుకున్న రీతిలో సంఘటనలు జరుగుతున్నట్లు ఫైజర్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇక ఇప్పటి వరకు నార్వేలో వైరస్ వల్ల రిస్క్ ఉన్న సుమారు 33 వేల మందికి టీకా ఇచ్చారు. 29 కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఉండగా.. దాంట్లో మూడో వంతు మంది 80 ఏళ్లు దాటినవారే ఉన్నారు. -
మా వ్యాక్సిన్ చాలా డేంజర్: చైనా ఎక్స్పర్ట్
బీజింగ్: ఇన్ని రోజులు ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌ని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూశాయి. అయితే టీకా అందుబాటులోని వచ్చిన ప్రస్తుత తరుణంలో వ్యాక్సిన్‌కు సంబంధించి అనేక అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు నర్స్‌లు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా అభివృద్ధి చేస్తోన్న సినోఫామ్ వ్యాక్సిన్ గురించి సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చైనాకు చెందిన వ్యాక్సిన్ ఎక్స్పర్ట్ సినోఫామ్ గురించి ఈ వ్యతిరేక ఆరోపణలు చేశారు. ఆ తర్వత గంటల వ్యవధిలోనే వాటిని డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. (చదవండి: భయంతో కరోనా వ్యాక్సిన్‌ను ఖతం చేశాడు!) డాక్టర్ తావో లినా అనే వ్యాక్సిన్ ఎక్స్పర్ట్ తన సోషల్ మీడియా అకౌంట్ వీబోలో ‘చైనా అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ సినోఫామ్ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది. దీని వల్ల 73 సైడ్ ఎఫెక్ట్లు కలుగుతున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకున్న ప్రాంతంలో విపరీతమైన నొప్పి, బీపీ పెరగడం, చూపు కోల్పోవడం, తల నొప్పి, మూత్ర సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాక్సిన్ వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతున్నాయి’ అని తెలిపారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆయన ఈ కామెంట్స్‌ని డిలీట్ చేయడమే కాక క్షమాపణలు చెప్పారు. విచక్షణారహిత వ్యాఖ్యలు చేసి.. నా సహోదరులను అవమానించాను అన్నారు. ఇక తావోని బెదిరించి ఇలా క్షమాపణలు చెప్పించారని ప్రపంచ మీడియా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంతో బీజింగ్ అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ తావో లినా వ్యాఖ్యలని వీఓఏ వక్రీకరించిందని.. చైనా వ్యాక్సిన్ సురక్షితం అని తెలియజేసింది. తావో లినా సినోఫార్మ్ వ్యాక్సిన్‌పై వ్యంగ్య వ్యాఖ్యలను పోస్ట్ చేసినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కాని వీఓఏ ఈ వ్యాఖ్యలని వక్రీకరించి.. తమ వ్యాక్సిన్ గురించి తప్పుడు ప్రచారం చేసిందని మండిపడింది. ఇక తావో తన వీబో అకౌంట్లో చేసిన వ్యాఖ్యలని డిలీట్ చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ దుమారం సద్దుమణగకముందే చైనా మీడియాలో తావో లినా ‘చైనాలో అభివృద్ధి దశలో ఉన్న ఈ వ్యాక్సిన్లు క్షేమం, సురక్షితం కాదని నేను ఎప్పుడు చెప్పలేదు. మరో విషయం ఏంటంటే చైనా వ్యాక్సిన్ల సామర్థ్యం గురించి ఇప్పటికే నేను పలు ఆర్టికల్స్ ప్రచురించాను. వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాను’ అన్నారు. ఇక గురువారం వీబోలో చేసిన మరో పోస్ట్‌లో తావో లినా సినోఫామ్ వ్యాక్సిన్ గురించి ఆయన చేసిన ఆరోపణలని స్వయంగా స్వయంగా తనే తిరస్కరించారు. ఇక సినోఫామ్ వ్యాక్సిన్ 79 శాతం సామర్థ్యం కలిగి ఉందని.. చైనా దానికి అనుమతి ఇచ్చింది.(చదవండి: వ్యాక్సిన్ పంపుతున్నాం.. ఏర్పాట్లు చేసుకోండి!) -
కరోనా వ్యాక్సిన్‌కు ఇద్దరు నర్సులు బలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్న ఊరటపై ఇద్దరు నర్సులు మరణించారన్న వార్తలు ఆందోళన రేపుతున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత పోర్చుగీసుకు చెందిన నర్సు కన్ను మూసిందన్న భయంనుంచి ఇంకా కోలుకోకముందే మరో నర్సు ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నార్వేలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల తర్వాత వీరు హఠాత్తుగా కన్నుమూసారు. దీనిపై మెడికల్ డైరెక్టర్ ఆఫ్ ద నార్వేజియన్ ఏజెన్సీ, నార్వే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విచారణ మొదలుపెట్టింది. అయితే ఈమరణానికి వ్యాక్సినే కారణమా లేక యాదృచ్ఛికంగా ఈ ఘటన జరిగిందా అన్నదానిపై విచారణ జరుపుతామని నార్వేజియన్ మెడిసిన్స్ ఏజెన్సీ మెడికల్ డైరెక్టర్ స్టీనర్ మాడ్సెన్ వెల్లడించారు. ప్రస్తుతం పెద్ద వయసు ఉన్న వ్యక్తులు మొదట వ్యాక్సిన్ తీసుకుంటుడం వల్ల మరణాలు యాదృచ్చికంగా సంభవించే అవకాశం ఉందని, ఎక్కువగా ఉందని మాడ్సెన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఫైజర్ వ్యాక్సిన్ వల్ల తాము కూడా ఇబ్బంది పడినట్లు గతంలో కొంతమంది వలంటీర్లు చెప్పినట్టు సమాచారం. కాగా పోర్టోలోని పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలోని పీడియాట్రిక్ విభాగంలో పనిచేసే నర్సు సోనియా అసెవెడో (41) అనూహ్యంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. మరో ఘనటలో ఫైజర్ వ్యాక్సిన్ అందుకున్న 32 ఏళ్ల మహిళా వైద్యురాలు ఆసుపత్రిలో చేరినట్టు మెక్సికన్ అధికారులు ఇటీవల వెల్లడించారు. -
భయంతో కరోనా వ్యాక్సిన్‌ను ఖతం చేశాడు!
వాషింగ్టన్: ఓ వైపు కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ వచ్చిందని సంతోషిస్తుండగా.. మరోపక్క టీకా సామార్థ్యం మీద జనాల్లో రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ ఫార్మసిస్ట్ మోడర్నా వ్యాక్సిన్ 500 డోసులను పనికి రాకుండా చేశాడు. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక విచారణలో సదరు ఫార్మసిస్ట్ మోడర్నా వ్యాక్సిన్ వల్ల డీఎన్ఏలో మార్పులు వస్తాయని తెలిసి.. వాటిని నేలపాలు చేశానని వెల్లడించాడు. వివరాలు.. స్టీవెన్ బ్రాండెన్‌బర్గ్‌గా గుర్తించబడిన ఫార్మసిస్ట్ విస్కాన్సిన్లోని గ్రాఫ్టన్‌లోని అరోరా మెడికల్ సెంటర్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆ మెడికల్ సెంటర్లో మోడర్నా వ్యాక్సిన్‌ని భద్రపరిచారు. ఈ క్రమంలో స్టీవెన్ మోడర్నా వ్యాక్సిన్ తీసుకుంటే డీఎన్ఏలో మార్పులు చోటు చేసుకుంటాయని విన్నాడు. ఆ భయంతో ఫ్రిజ్‌లో ఉన్న వ్యాక్సిన్ డోసులను బయటపెట్టి.. వాటిని పనికి రాకుండా చేశాడు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నర్స్ మృతి) విషయం తెలుసుకున్న పోలీసులు బ్రాండెన్‌బర్గ్‌ని అరెస్ట్ చేశారు. తొలుత అతడు కేవలం 57 వ్యాక్సిన్ డోసులను మాత్రమే పనికి రాకుండా చేశాడని భావించినప్పటికి తర్వాత ఆ సంఖ్య 500కు చేరింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు, డిటెక్టివ్లు బ్రాండెన్‌బర్గ్ అపనమ్మకంతోనే కావాలనే వ్యాక్సిన్ డోసులను నాశనం చేశాడని వెల్లడించారు. మరో ముఖ్యమైన అంశం ఎంటంటే బ్రాండెన్‌బర్గ్ ఫ్రిజ్ నుంచి తీసి బయటపడేసిన వ్యాక్సిన్ డోసుల్లో నుంచి 60 డోసులను వైద్యులు ప్రజలకు పంపిణీ చేశారు. ఆ తర్వాత విషయం తెలియడంతో మిగతా వాటిని వదిలేశారు. (చదవండి: మూఢ నమ్మకాలు.. కరోనా వ్యాక్సిన్ వద్దు) ఇదిలా ఉండగా కరోనాను కట్టడి చేయడానికి మోడర్నా వ్యాక్సిన్ హాఫ్ డోస్ సరిపోతుందా లేదా అనే దాని గురించి తెలుసుకునేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మోడర్నా ఇంక్స్ శాస్త్రవేత్తలు టెస్ట్‌లు జరుపుతున్నారు. మరో రెండు నెలల్లో ఈ ఫలితాలు వెలువడతాయి. దాన్ని బట్టి వ్యాక్పిన్ డోసులను సగానికి తగ్గించాలా లేక రెట్టింపు చేయాలా అనే నిర్ణయం తీసుకోన్నుట్లు తెలిపారు. ఇక అమెరికాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. -
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నర్స్ మృతి
లిస్బన్/పోర్టో/పోర్చుగీసు : సాధారణంగా 100 శాతం సామార్థ్యం గల వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే రెండుమూడేళ్ల సమయం పడుతుంది. అయితే కరోనావైరస్ వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వాలు కొన్ని నిబంధనలను పక్కకు పెట్టి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మూడు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతిచ్చారు. మన దేశంలో డీసీజీఐ భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటి సామార్థ్యం పట్ల ఇప్పటికే జనాల్లో పలు అనుమానాలు తలెత్తుతుండగా.. వీటిని మరింత పెంచే సంఘటన ఒకటి పోర్చుగల్‌లో చోటు చేసుకుంది. ఓ నర్స్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తర్వాత చనిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడమే కాక వ్యాక్సిన్ పనితీరు పట్ల మరిన్ని అనుమానాలను, భయాలను పెంచుతుంది. వివరాలు.. సోనియా అసేవెడో(41) అనే మహిళ పోర్టోలోని పోర్చుగీసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీలో పిడియాట్రిక్ అసిస్టెంట్ నర్స్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైజర్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగంలో భాగంగా సోనియా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మృత్యువాత పడ్డారు. (చదవండి: వివాదంలో ‘అనుమతులు’) ఈ సందర్భంగా సోనియా తండ్రి అబిలియో అసేవెడో మాట్లాడుతూ.. ‘నా కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. రెండు రోజుల క్రితం తను కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకుంది. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. కానీ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా తను మరణించింది. నా కుమార్తె ఎందువల్ల మరణించిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. అంతేకాక సోనియాకు మద్యం అలవాటు లేదని.. ఈ మధ్య కాలంలో ఎలాంటి కొత్త ఆహార పదార్థాలను తీసుకోలేదని.. అంతా సాధారణంగానే ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఇక పోర్చుగీసు ఆరోగ్య శాఖ అధికారులు సోనియా మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోర్చుగీసులో 538 ఆరోగ్య కార్యకర్తలు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక పది మిలియన్ల జనాభా గల పోర్చుగీసులో 4,27,000 కరోనా కేసులు నమోదు కాగా.. 7,118 మంది మరణించారు. -
వ్యాక్సిన్ ఫస్ట్ మోదీనే తీసుకోవాలి: కాంగ్రెస్
పట్నా: కరోనా వైరస్ పని పట్టే వ్యాక్సిన్ అభివృద్ధిలో ప్రపంచ దేశాలు తలమునకలయ్యి ఉన్నాయి. ఇప్పటికే స్పూత్నిక్ వి, ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మన దగ్గర కూడా డీసీజీఐ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆదివారం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు డీసీజీఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత త్వరగా వ్యాక్సిన్ వినియోగానికి అనుమతివ్వడం సరైంది కాదని.. వ్యాక్సిన్ సామార్థ్యం పట్ల జనాల్లో సందేహాలున్నాయని తెలిపాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. (చదవండి: వచ్చే వారం నుంచీ మనకూ వ్యాక్సిన్! ) ఈ సందర్భంగా బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజీత్ శర్మ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనావైరస్ వ్యాక్సిన్‌కి అత్యవసర అనుమతివ్వడంతో.. ప్రజల్లో తలెత్తిన సందేహాలు తొలగించడానికి రష్యా, అమెరికా ప్రధానులు బహిరంగంగా తొలి డోస్ వ్యాక్సిన్‌ని తీసుకున్నారు. వారిలానే మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా కోవాగ్జిన్ తొలి డోస్‌ని జనం మధ్యలో తీసుకోవాలి. అప్పుడే వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో నెలకొన్న సందేహాలు తొలగిపోతాయి’ అన్నారు. అంతేకాక మోదీతో పాటు మరి కొందరు సీనియర్ బీజేపీ నాయకులు తొలుత వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
కోవిడ్-19కు చెక్: మరో వ్యాక్సిన్ రెడీ
న్యూఢిల్లీ, సాక్షి: ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్, స్వీడిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ కోవీషీల్డ్‌కు యూకే ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో కరోనా వైరస్ కట్టడికి కొత్త ఏడాది(2021)లో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. వచ్చే వారం నుంచీ ఎమర్జెన్సీ ప్రాతిపదికన కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను యూకేలో వినియోగించనున్నారు. ఔషధాలు, ఆరోగ్య పరిక్షణ నియంత్రణ సంస్థ(ఎంహెచ్ఆర్ఏ) సలహామేరకు యూకే ప్రభుత్వం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించింది. కోవిడ్-19 కట్టడికి ఇప్పటికే యూకేలో యూఎస్ దిగ్గజం ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్న విషయం విదితమే. యూఎస్‌లో అయితే ఫైజర్ వ్యాక్సిన్‌తోపాటు, మోడర్నా ఇంక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సైతం అందుబాటులోకి వచ్చాయి. యూకే ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఏప్రిల్‌కల్లా 10 కోట్ల డోసేజీలను అందించవలసి ఉన్నట్లు ఆస్ట్రాజెనెకా ఈ సందర్భంగా తెలియజేసింది. (కొత్త ఏడాదిలో కరోనాకు కోవీషీల్డ్) ప్రమాణాలకు ఓకే కోవీషీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలపై ఆస్ట్రాజెనెకా దాఖలు చేసిన డేటాను విశ్లేషించిన ఎంహెచ్ఆర్ఏ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నట్లు అభిప్రాయపడింది. భద్రత, నాణ్యత తదితర అంశాలలో ప్రమాణాలను అందుకున్నట్లు పేర్కొంది. కాగా.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను దేశీయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను సైతం నిర్వహిస్తోంది. కాగా.. కోవీషీల్డ్ వ్యాక్సిన్‌కు యూకే ఎంహెచ్ఆర్ఏ ఓకే చెప్పడంతో దేశీయంగానూ ప్రభుత్వం వేగంగా అనుమతించే వీలున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది దేశయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్కు జోష్‌నివ్వనున్నట్లు ఫార్మా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అత్యవసర వినియోగానికి అనుమతించమంటూ సీరమ్ డీజీసీఏకు క్లినికల్ పరీక్షల డేటాను దాఖలు చేయడం ద్వారా అభ్యర్థించింది. ఇందుకు అనుగుణంగా ఇటీవల 5 కోట్ల డోసీజీలను సిద్ధం చేస్తున్నట్లు తెలియజేసింది. సాధారణ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతల్లో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి వీలుండటంతోపాటు.. ధర కూడా అందుబాటులో ఉండటంతో ఈ వ్యాక్సిన్‌పట్ల పలు దేశాలు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు ఫార్మా రంగ నిపుణులు తెలియజేశారు. (వచ్చే వారం నుంచీ మనకూ వ్యాక్సిన్! ) -
ఈయూలో టీకా షురూ
లండన్/రోమ్: ఐరోపా దేశాల సమాఖ్య(ఈయూ)లో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. డాక్టర్లు, నర్సులు, వృద్ధులకు ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చారు. వీరికి మూడు వారాల్లో మరో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈయూలో 27 సభ్య దేశాలు ఉండగా, జర్మనీ, హంగేరి, స్లోవేకియా తదితర దేశాలు ఒకరోజు ముందే అంటే శనివారం వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టాయి. కరోనా బారినపడే ప్రమాదం అధికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇచ్చారు. స్పెయిన్‌లో 96 ఏళ్ల వ్యక్తికి తొలి డోసు ఇచ్చారు. చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి అండ్రెజ్ బబీస్ కూడా ఆదివారం వ్యాక్సిన్ తీసుకున్నారు. జర్మనీలో 101 ఏళ్ల మహిళ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈయూలో ఇప్పటివరకు 1.60 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,36,000 మంది బాధితులు మరణించారు. వారికే మొదటి ప్రాధాన్యత.. ఆక్స్ఫర్డ్, అస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు గురువారంలోగా యూకే ప్రభుత్వం అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ సోకితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న 1.2 కోట్ల నుంచి 1.5 కోట్ల మందికి తొలుత వ్యాక్సిన్ అందజేస్తామని, వారే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం తెలిపింది. ఒక్కో డోసు కేవలం 2 పౌండ్లు ఫైజర్, మోడెర్నా టీకాల తరహాలోనే ఆక్స్ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా కూడా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో తేలిందని అస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కాల్ సొరియొట్ చెప్పారు. కరోనా బాధితులపై 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని, ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారికి 100 శాతం రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. ఈ టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయవచ్చు. ధర ఒక్కో డోసుకు కేవలం 2 పౌండ్లు. 10 కోట్ల ఆక్స్ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా డోసుల కోసం యూకే ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మార్చికల్లా 4 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయి. -
ప్రజల సమక్షంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న బైడెన్
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మాట నిలబెట్టుకున్నారు. ప్రజల మధ్యలో కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకుంటాను అన్న బైడెన్ దాన్ని నిజం చేసి చూపారు. బైడెన్ సోమవారం క్రిస్టియానాకేర్ ఆస్పత్రిలో ప్రజల సమక్షంలో ఫైజర్ బయోఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రజలు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా దాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇలా ప్రజల సమక్షంలో వ్యాక్సిన్ తీసుకున్నాను’ అన్నారు. క్రిస్టియానాకేర్ ఆసుపత్రిలో నర్సు ప్రాక్టీషనర్, ఎంప్లాయీ హెల్త్ సర్వీసెస్ హెడ్ తబే మాసా బైడెన్‌కి వ్యాక్సిన్ వేశారు. నూతన అధ్యక్షుడి భార్య డాక్టర్ జిల్ బిడెన్ ఇప్పటికే వ్యాక్సిన్ మొదటి కోర్సును తీసుకున్నారు. బైడెన్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్లగా ఆమె కూడా హాజరయ్యారు. (చదవండి: వ్యాక్సిన్ పంపిణీ.. మార్గదర్శకాలు) Today, I received the COVID-19 vaccine. To the scientists and researchers who worked tirelessly to make this possible — thank you. We owe you an awful lot. And to the American people — know there is nothing to worry about. When the vaccine is available, I urge you to take it. pic.twitter.com/QBtB620i2V — Joe Biden (@JoeBiden) December 22, 2020 ఈ నేపథ్యంలో బైడెన్ "ఈ రోజు నేను కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నాను. ఈ వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన శాస్త్రవేత్తలు, వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము మీకు చాలా రుణపడి ఉన్నాము. ఇక అమెరికా ప్రజలు ఒక విషయం తెలుసుకొండి. దీనిలో భయపడాల్సిన విషయం ఏం లేదు. ఇక జనాలందరికి సరిపడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నాడు మీరు దాన్ని తీసుకోవడానకి సిద్ధంగా ఉండండి" అని ట్విట్టర్ వేదికగా జనాలను కోరారు. బైడెన్ చర్యని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రశంసించారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ మెచ్చుకున్నారు. ఇక వచ్చే వారం కమలా బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. -
టీకా తీసుకుంటే మొసళ్లుగా మారతారు!
బ్రెసీలియా: కరోనాపై తొలి నుంచి నిర్లక్ష్య ధోరణి ప్రదరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో మరోమారు తన వ్యంగ్య ధోరణిని ప్రదర్శించారు. బ్రెజిల్లో భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన ఆయన.. ఫైజర్ ఇచ్చిన కాంట్రాక్టులో స్పష్టంగా కంపెనీ ఏ సైడ్ ఎఫెక్ట్స్‌కు బాధ్యత వహించదని ఉందని, అందువల్ల టీకా తీసుకున్న తర్వాత ఎవరైనా మొసలిగా మారితే అది వారి సమస్యని హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు సూపర్ హ్యూమన్‌గా మారినా, మహిళలకు గడ్డాలు వచ్చినా, మొగవాళ్ల గొంతులు మారినా, ఫైజర్ పట్టించుకోదని గుర్తు చేశారు. సోమవారం బైడెన్‌కు వాక్సిన్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ఆయన భార్య జిల్ బైడెన్‌కు సోమవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇస్తారని అధికారులు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు, నమ్మ కం కలిగించేందుకు బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుంటానని ఇప్పటికే బైడెన్ చెప్పారు. శుక్రవారం ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కరెన్‌కు, హౌస్ స్పీకర్ నాన్సీపెలోసికి తొలిడోసు ఇచ్చారు. తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదని పెన్స్ చెప్పారు. -
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే అంతేనట!
కరోనావైరస్కు సంబంధించి సంచలన వ్యాఖ్యలతో మొదటినుంచీ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారిపోవచ్చంటూ సరికొత్త వివాదానికి తెర తీసారు. అంతేకాదు ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలున్నాయంటూ కోవిడ్ వ్యాక్సిన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. అమెరికా ఆమోదం తెలిపిన ఫైజర్ టీకాపై ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. (టీకా భద్రత : బైడైన్ దంపతుల ముందడుగు) ఒకవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అంతానికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పలు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బోల్సనారో వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి. కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఆయన ఫైజర్ టీకా తయారీ కంపెనీలపై తన దాడిని ఎక్కుపెట్టారు. ఈ టీకా తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇలాంటి దుష్ప్రభావాలకు తాము బాధ్యత వహించమనీ, మీరు (ప్రజలు) మొసళ్లుగా మారితే, అది మీ సమస్య అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సూపర్ హూమన్‌గా మారినా, మహిళలకు గడ్డం మొలిచినా, పురుషులు వేరేవిధంగా మాట్లాడినా ఔషధ తయారీదారులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ వారిపై దాడిచేశారు. టీకా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది కానీ తాను మాత్రం కరోనా టీకా వేసుకొనేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే తనకు కరోనా సోకిన కారణంగా ఇప్పటికే తన శరీరంలో యాంటిబాడీస్ ఉన్నాయి.. ఇక తానెందుకు టీకా తీసుకోవాలంటూ ప్రశ్నించారు. అలాగే టీకాను తాము ఉచితంగా ఇవ్వబోతున్నామని, అలాగని టీకా తప్పనిసరి కాదన్నారు. టీకా తీసుకోని వారికి జరిమానాలు విధించబోమని, ఒత్తిడి చేసే ప్రసక్తే ఉండదని బోల్సనారో స్పష్టం చేశారు. (వ్యాక్సిన్ షాట్: కుప్పకూలిన నర్సు : వీడియో వైరల్) కాగా బ్రెజిల్లో ఇప్పటి వరకు 7.1 మిలియన్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షా 85 వేల మంది మృతి చెందారు. గతంలో కరోనా వైరస్, లాక్‌డౌన్‌పై విభిన్నంగా స్పందించిన బ్రిజిల్ అధ్యక్షుడు కరోనా సాధారణ ఫ్లూమాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. మాస్క్ ధరించేందుకు నిరాకరించి వివాదంలో నిలిచారు. ఆ తరువాత ఆయన కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. -
వ్యాక్సిన్ షాట్: కుప్పకూలిన నర్సు : వీడియో వైరల్
వాషింగ్టన్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఊరట కల్పిస్తోంది. అమెరికాలో ఫైజర్-బయోఎన్‌టెక్, మెడర్నా వ్యాక్సిన్లకు రెగ్యులేటరీ అనుమతి లభించింది. అయితే క్లినికల్ ట్రయల్స్ నుండి సేకరించిన భద్రతా డేటాను విశ్లేషించిన తరువాత మాత్రమే వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ టీకాల భద్రత సమర్ధతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టెనస్సీలోని ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ షాట్ అందుకున్న హెడ్ నర్సు టిఫనీ డోవర్ ప్రెస్ ప్రశ్నలకు సమాధానాలిస్తూ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . దీంతో వ్యాక్సిన్ భద్రత, సమర్థతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తించింది. (వ్యాక్సిన్.. మీ ఇష్టమే) (టీకా భద్రత : బైడైన్ దంపతుల ముందడుగు) టేనస్సీలోని సీహెచ్ఐ మెమోరియల్ హాస్పిటల్ ఎన్ చత్తనూగలో విలేకరుల సమావేశంలో టిఫనీ డోవర్ మాట్లాడుతూ, టీకా తీసుకోవడం సంతోషిస్తున్నానని ప్రకటించారు. తర్వాత విలేకరుల సమావేశంలోనే మూర్ఛపోవడం కలకలం రేపింది. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. క్షమించండి, మైకం కమ్ముతోందంటూ ఆమె మూర్ఛపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్ గామారింది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం. (చదవండి : చైనాకు చెక్: ట్రంప్ మరో కీలక ఆర్డర్) -
ఫైజర్ టీకాతో అలర్జీ
అలాస్కా/వాషింగ్టన్: అమెరికాలో కోవిడ్–19ను నిరోధించే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లో అలర్జీ లక్షణాలు కనిపించాయి. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌లో కూడా ఫైజర్ వ్యాక్సిన్‌తో అలర్జీకి సంబంధించిన రెండు కేసులు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని అలాస్కాలోనూ టీకా డోసు తీసుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు అనారోగ్యానికి గురి కావడంపై ఆందోళన నెలకొంది. అమెరికాలో అలర్జీ లక్షణాలు కనిపించిన ఆరోగ్య కార్యకర్తలకు గతం లో ఎప్పుడూ అలర్జీ రాలేదు. ఫైజర్ టీకా డోసు తీసుకున్న వెంటనే వారిలో కొన్ని నిమిషాల పాటు శ్వాస తీసుకోవడంలో ఇ బ్బందులు, కళ్ల కింద వాపు, తలనొప్పి, గొం తు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. అమెరికన్లలో ఫైజర్ వ్యాక్సిన్ బాగా పని చేస్తోందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చని భరోసా ఇచ్చింది. నేడు పైన్స్కు.. వచ్చేవారంలో బైడెన్‌కు వ్యాక్సిన్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నేడు వ్యాక్సిన్ తీసుకోనున్నారు. వచ్చే వారంలో బైడెన్ కూడా టీకా తీసుకుంటారని ఆరోగ్య శాఖ అధికారు లు వెల్లడించారు. అందరి ఎదుట వ్యాక్సిన్ తీసుకుంటానని బైడెన్ చెప్పిన సంగతి తెలిసిందే. -
కరోనా వ్యాక్సిన్ ధరలు ఎందుకెక్కువ?
న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోనేందుకు వస్తున్న ఐదారు వ్యాక్సిన్లలో అగ్రగామిగా నిలుస్తున్న ఫైజర్ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు ఓ దశలో భారత్‌కు కూడా సిద్ధపడింది. అత్యంత శీతల కేంద్రాల్లో ఫైజర్‌ను నిల్వ చేయాల్సిన అవసరం ఉండడంతో అందుకు తగిన విధంగా ముంబై, అంతర్జాతీయ విమానాశ్రంలోని మందుల నిల్వ చేసే శీతల గిడ్డంగిలో ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదిక చేపట్టింది. అయితే ఫైజర్ వ్యాక్సిన్ ఒక్క డోసుకు 40 డాలర్లు, దాదాపు 2,900 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని తెలిసి ఏర్పాట్లకు స్వస్తి చెప్పింది. మామూలు శీతల కేంద్రాల్లో భద్రపరిచే మోడొర్నా వ్యాక్సిన్ డోసు ధర కూడా 40 డాలర్లకన్నా ఎక్కువేనని తెలియడంతో ఆ ప్రయత్నాలను భారత ప్రభుత్వం విరమించుకుంది. (చదవండి : కరోనా ఎఫెక్ట్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు) ఫైజర్ వ్యాక్సిన్ డోసులను అమెరికా, బ్రిటన్ దేశాలు ఇప్పటికే కొనుగోలు చేయగా, మరికొన్ని ధనిక దేశాలు కూడా ఆ డోసుల కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నాయి. మన దేశంలోని ధనిక వర్గాలు కొనుగోలు చేసుకోవాలనుకున్నా ఇప్పటికే కుదరిని ఒప్పందాల మేరకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి ఫైజర్ కంపెనీకి దాదాపు ఏడాది పడుతుంది. అమెరికా ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ డోసుల సరఫరాకు మోడొర్నా కంపెనీ కోట్లాది డాలర్లను ముందస్తు ఒప్పందం కిందనే తీసుకుంది. ఫైజర్, మోడొర్నా కంపెనీలు దాదాపు 70 నుంచి 80 శాతం లాభాలను చూసుకోవడం వల్లనే వాటి వ్యాక్సిన్ల ధరలు అంత ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ప్రస్తుతం భారత్‌తోపాటు వర్ధమాన దేశాలకు అందుబాటులో ఉంది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కోసం గేట్స్ ఫౌండేషన్ ముందస్తు ఒప్పందం చేసుకున్నందున భారత్‌కు మూడు, నాలుగు వందలకు ఓ డోస్ చొప్పున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తాము పెద్దగా లాభాలు చూసుకోవడం లేదని ఆస్ట్రాజెనికా చెప్పినప్పటికీ వంద మిలియన్ డాలర్ల లాభాలు, దాదాపు 736 కోట్ల రూపాయలు వచ్చేలాగానే అని ధరలను నిర్ణయిస్తోంది. ఆ కంపెనీ తక్కువ మొత్తాలకు ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల ఆ కంపెనీ షేర్ల విలువలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో పడిపోయాయి. ఫైజర్, మోడొర్నా షేర్ల విలువలు అనూహ్యంగా పెరగి పోయాయి. భారత్ దరఖాస్తుకు వ్యతిరేకత ఫైజర్, మోడొర్నా లాంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలు అధిక లాభాలు చూసుకోకుండా నియంత్రించేందుకు వాక్సిన్లపై అంతర్జాతీయ ప్రాపర్టీ హక్కులను ఎత్తివేయాలంటూ దక్షణాఫ్రికాతో కలిసి భారత్ పెట్టిన దరఖాస్తును అమెరికా, బ్రిటన్, ఐరోపా కూటమి తిరస్కరించాయి. చైనా, రష్యా దేశాలు సొంతంగా వ్యాక్సిన్లు రూపొందించాయి. ఫైజర్, మోడొర్నా వ్యాక్సిన్లు ధనిక దేశాలపై తమ దష్టిని కేంద్రీకరించగా, చైనా, రష్యాలకు చెందిన వ్యాక్సిన్ కంపెనీలు ప్రపంచంలోని అన్ని దేశాలపై దష్టిని కేంద్రీకరించి, ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రష్యా నుంచి ఇప్పటికే అక్కడి మార్కెట్లోకి వచ్చిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు మన దేశానికి కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌కు చెందిన హెటరో డ్రగ్స్, స్పుత్నిక్ వీ తయారు చేస్తోన్న కంపెనీతో ముందస్తు ఒప్పందం చేసుకోవడమే అందుకు కారణం. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 92 శాతం పనిచేస్తోందని దాన్ని ఉత్పత్తి చేస్తోన్న కంపెనీ చెప్పుకుంటోంది. -
ఫైజర్ టీకా ఖరీదెక్కువే..
ముంబై: కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ విషయంలో అమెరికాలోని ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్, జర్మనీలోని బయోఎన్‌టెక్ సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కరోనా టీకాను అభివృద్ధి చేశాయి. తమ టీకా 95 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు పరీక్షల్లో తేలిందని ఆయా సంస్థలు ప్రకటించాయి. కొన్ని దేశాలు కరోనా బాధితులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ఇప్పటికే మొదలుపెట్టాయి. మరోవైపు భారత్‌లోనూ కోవిడ్–19 ఇమ్యూనైజేషన్ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అదిపెద్ద టీకా కార్యక్రమం కానుంది. అయితే, ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ఇండియాలోని కరోనా బాధితులకు దక్కే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ అధిక ధరే ఇందుకు ప్రధాన కారణం. ఎందుకంత అధిక వ్యయం? ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ వ్యయం అధికంగా ఉండడానికి కారణం. దాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలకు విపరీతంగా పెట్టుబడి పెట్టాల్సి రావడం. ఇతర టీకాల మాదిరిగా కాకుండా ఫైజర్ టీకాను మైనస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. 68 కోట్ల కరోనా టీకాల డోసులను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రూ.13,870 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయానికి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఒక్కో డోసుకు రూ.220 వ్యయం కానుంది. కాబట్టి ప్రభుత్వం ఒక్కో డోసుకు రూ.2,725 చొప్పున వెచ్చింది, ఫైజర్ టీకాను కొనుగోలు చేసి, ప్రజలకు అందించడం అసాధ్యమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలోని ప్రజలందరికీ కరోనా టీకా ఇవ్వాలంటే రూ.43,800 కోట్లు(ఒక్కో డోసు రూ.220 చొప్పున) అవసరం. ఈ మేరకు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడితేనే ప్రజలందరికీ టీకా ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. కేవలం ప్రభుత్వం ద్వారానే తమ వ్యాక్సిన్ విక్రయిస్తామని ఫైజర్ సంస్థ చెబుతోంది. అత్యవసర వినియోగ అనుమతి కోసం భారత ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసింది. ఇండియాలో ఇప్పటికిప్పుడు ఫైజర్ టీకాను ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాలన్నా కుదరదు. కాగా, ఫైజర్–బయోఎన్టెక్లు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు సింగపూర్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల చివరికల్లా వ్యాక్సిన్ డోసులు తమ దేశానికి చేరతాయని ఆ దేశ ప్రధాని లీ హెయిన్ లూంగ్ సోమవారం ప్రకటించారు. కోవిషీల్డ్ చాలా చౌక ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.2,725 (37 డాలర్లు) పలుకుతోంది. అక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవిషీల్డ్’ ఒక్కో డోసు ధర కేవలం రూ.221 (3 డాలర్లు). ఇక రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–5 వ్యాక్సిన్ ధర కూడా తక్కువే. అది ఒక్కో డోసు రూ.736కు (10 డాలర్లు) లభ్యమవుతోంది. హైదరాబాద్‌లోని భారత్ బయో టెక్ సంస్థ భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.220 నుంచి రూ.440(3–6 డాలర్లు) ధరకు లభించే అవకాశం ఉంది. జైడస్ కాడిలా సంస్థ టీకా ధర కూడా ఇదే రేంజ్లో ఉండనుంది. భారత్‌లో తగ్గిన కేసులు న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 27,071 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ నెలలో మూడో సారి ఒక రోజులో 30 వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,52,586గా ఉంది. మరోవైపు మొత్తం కేసుల సంఖ్య 98,84,100కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 336 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,43,355కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య సోమవారానికి 93,88,159కు చేరుకుంది. వ్యాక్సిన్ ధర(రూ.లో) ఫైజర్ 2,725 స్పుత్నిక్ వీ 736 ఆస్ట్రాజెనెకా 221 భారత్ బయోటెక్ 220–440 జైడస్ కాడిలా 220–440 -
ఈసారి లాక్డౌన్.. మరింత కఠినం!
బెర్లిన్: కరోనా మహమ్మారి విజృంభణ మొదలయ్యి ఏడాది పూర్తయ్యింది. వైరస్ మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు.. ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కానీ పూర్తిస్థాయిలో సమర్థవంతమైన వ్యాక్సిన్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. పైగా ప్రస్తుతం పలు ప్రపంచ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యింది. కొన్ని దేశాలు మరోసారి లాక్డౌన్ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీలో బుధవారం నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఈ సారి నియమాలు మరింత కఠినంగా ఉండనున్నాయి. ఈ మేరకు జర్మనీ చాన్సిలర్ ఏంజెలా మెర్కెల్ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. గత ఆరు వారాలుగా జర్మనీలో పాక్షిక లాక్డౌన్ అమల్లో ఉంది. కానీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆదివారం ఒక్క రోజు 20,209 కేసులు నమోదు కాగా.. 321 మంది మరణించారు. దాంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో.. మరింత కఠినంగా లాక్డౌన్ విధించాలని భావిస్తోంది. జర్మనీతో పాటు ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు రెండోసారి లాక్డౌన్ విధించాయి.. ఆ దేశాలేవంటే... కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో జర్మనీతో పాటు ఫ్రాన్స్, బెల్జియం, గ్రీకు, బార్సిలోనా, యూకే, ఆస్ట్రియా, స్కాట్లాండ్, బెల్జియం, ఇజ్రాయెల్, స్పెయిన్, నెదర్లాండ్స్, అమెరికా వంటి దేశాల్లో రెండో సారి లాక్డౌన్ విధించారు. కొన్ని దేశాల్లో మొత్తం అంతటా కాకుండా.. తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రల్లోనే లాక్డౌన్ విధించారు. వ్యాక్సిన్ వచ్చాక కూడా లాక్డౌన్ ఎందుకు? కరోనాని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫైజర్ ఎన్ బయోటెక్, స్పూత్నిక్ వి అందుబాటులోకి రాగా.. మరి కొద్ది రోజుల్లో ఆక్స్ఫర్డ్, కోవాక్సిన్ వంటి వ్యాక్సిన్లు రానున్నాయి. ఒకటి, రెండు నెలల వ్యవధిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి. అయినప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం దేశాలు లాక్డౌన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్‌లన్ని కరోనాను సమర్థవంతంగా ఎందుర్కొగలవనే గ్యారంటీ లేదు. స్వయంగా డబ్ల్యూహెచ్ఓనే కోవిడ్ -19 సమర్థవంతంగా కట్టడి చేయగల వ్యాక్సిన్ రావడానికి సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం రానున్న వ్యాక్సిన్‌లన్ని 6-12 నెలల వ్యవధి గడువులోనే తయారయ్యాయి. చాలా తక్కువ మంది మీదనే ట్రయల్స్ జరిపారు. అది కూడా చాలా తక్కువ రోజులపాటే. (చదవండి: కోటిన్నర మంది చనిపోయినా... ఒక్క టీకా పడలేదు ) వ్యాక్సిన్ ప్రభావంపై జనాల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీకా ప్రభావం ఒకవేళ 70 శాతమే ఉన్నప్పుడు... మిగతా 30 శాతం మందిలో అది పనిచేయనప్పుడు దాన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత 95 శాతం రక్షణ ఇస్తుందని ఆ కంపెనీ వారు చెబుతున్నారు. అలాగే మన దేశంలోని కో–వ్యాక్సిన్ నుంచి 70 శాతం రక్షణ కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీన్నిబట్టి వ్యాక్సిన్ వేసిన వాళ్లలో కరోనా అస్సలు రాకుండా ఉండాలనే నియమం ఏమీ లేదు. కొంతమందిలో వ్యాక్సిన్ వేసిన తర్వాతా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సుమారు 95% ప్రొటెక్షన్ ఉంది అంటే వందలో ఐదుగురికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం అభివృద్ధి చేస్తోన్న వాటిల్లో ఏ వ్యాక్సిన్ కూడా 100 శాతం సమర్థవంతైనది లేదు. దాంతో చాలా దేశాలు వ్యాక్సిన్ కంటే ఎక్కువగా లాక్డౌన్, మాస్క్ ధరించడం, శుభ్రత పాటించడం, సామాజిక దూరం పాటించే అంశాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. కేసుల పెరుగుదల-శీతాకాలం కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్డౌన్ ఆంక్షలు సడలించారు. ప్రజలు మాములుగా రోజువారి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. కానీ సడెన్‌గా ఓ రెండు నెలల నుంచి కోవిడ్ కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉంది. అయితే వేసవి కారణంగా కేసుల సంఖ్య తగ్గిందని.. ప్రస్తుతం శీతకాలం కావడంతో వైరస్ విజృంభిస్తోంది. సాధారణంగా శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. ఈ పరిస్థితులు వైరస్‌కు ఎంతో అనుకూలంగా ఉండటమే కాక వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించేందుకు అవకాశ ఉంటుంది. శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ఎక్కువ వేధిస్తుంటుంది. ఫ్లూ వైరస్, కరోనా వైరస్ లక్షణాలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. ఈ రెండు రకాల వైరస్లు ఒకరి నుంచి మరొకరికి శ్వాసకోశ బిందువులు, దగ్గు, కఫం ద్వారా వ్యాప్తి చెందుతూ ఇబ్బంది పెడతాయి. జలుబే కదా అని లైట్ తీసుకోవడంతో ఇతరులకు త్వరగా వ్యాప్తి చెందుతుంది. (చదవండి: చలికాలంలో కరోనా పంజా) భారత్‌లో సెకండ్‌వేవ్.. ఇప్పటికే పలు ప్రపంచ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. భారత్‌లో కూడా ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా థర్డ్ వేవ్ ప్రారంభమయ్యింది. కారణాలు మన దగ్గర కరోనా ఫస్టవేవ్ అక్టోబర్ వరకు కొనసాగింది. ఇక అక్టోబర్ మాసం చివర్లో కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో భారత్‌లో పండగల సీజన్ ప్రారంభమయ్యింది. అప్పటికే జనాలు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి అంశాల గురించి లైట్ తీసుకున్నారు. ఇక పండుగల కాలంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. గుంపులు గుంపులుగా చేరడం వంటివి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్, జనవరి నెలల్లో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావచ్చని నిపుణులు హెచ్చరించారు. ఇక కరోనా కాలంలో కూడా పలు రాష్ట్రాల్లో వివిధ ఎన్నికలు జరిగాయి.. జరుగుతున్నాయి. ఇది కూడా దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.. (చదవండి: మళ్లీ లాక్డౌన్.. 3 కోట్ల మందికి ముప్పు?) ఇండియాలో మరో మారు లాక్డౌన్..? కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా ఈ ఏడాడి మార్చి 25 నుంచి దాదాపు 68 రోజుల పాలు పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించారు. ఆయితే ఆశ్చర్య ఏంటంటే అన్‌లాక్ కాలంలో దేశంలో గరిష్ట సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే మొదటి సారి లాక్డౌన్ ఎఫెక్ట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. కేంద్ర ఉద్దీపనల ప్యాకేజీ ప్రకటించినప్పటికి ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పేమి రాలేదు. ఇప్పటికి పర్యాటక, విద్యా, రియల్ ఎస్టెట్, అసంఘటిత రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని నిపుణలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో సెకండ్ వేవ్ మొదలైనప్పటికి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించే అవకాశాలు లేవంటున్నారు నిపుణులు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. -
20 వేల కోట్లతో రెండో విడత వ్యాక్సిన్
వాషింగ్టన్ : అమెరికా ప్రభుత్వం దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు మరో పదికోట్ల మోడర్నా కోవిడ్ వ్యాక్సిన్ డోసుల కోసం దాన్ని సరఫరా చేస్తోన్న ‘వార్స్ స్పీడ్స్’తో ఒప్పందం చేసుకొంది. వచ్చే ఏడాది జూన్ నాటికల్లా ఈ డోసులను సరఫరా చేసేందుకు 2.6 బిలియన్ డాలర్లకు (దాదాపు 20 వేల కోట్ల రూపాయలు) ఒప్పందం చేసుకుంది. అదే కంపెనీతో ఇంతకుముందు ఓ పది కోట్ల డోస్‌ల సరఫరా కోసం ఒప్పందం చేసుకున్న విషయం తెల్సిందే. వాస్తవానికి రెండోసారి ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్‌ను సరఫరా చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకోవాలని చూసింది. అందుకోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ కూడా అవసరమైన అత్యవసర అనుమతిని కూడా మంజూరు చేసింది. చాలా దేశాలతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకొన్నందున పది కోట్ల డోస్‌లను సరఫరా చేయలేమని, అందులో ఐదు కోట్ల డోసులను మాత్రమే సరఫరా చేయగలమని, కావాలంటే డిసెంబర్ నెలాఖరులోగానే సరఫరా చేస్తామని ఫైజర్ కంపెని ప్రతిపాదించింది. అందుకు ట్రంప్ అధికార యంత్రాంగం ఒప్పుకోకుండా రెండో విడత కూడా మోడర్నా వ్యాక్సిన్ కోసమే ఒప్పందం చేసుకుంది. వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం: ట్రంప్ సంచలనం -
వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం : ట్రంప్ సంచలనం
వాషింగ్టన్: కరోనా మహమ్మారితో అతలాకుతలమైన అమెరికావాసులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్-జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)అనుమతి లభించింది. గురువారం 8 గంటల పాటు జరిపిన బహిరంగ చర్చ అనంతరం ఈ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ తొలి డోస్‌ను 24 గంటల్లో ఇవ్వనున్నారు. (ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అమెరికా ఓకే) కోవిడ్-19 అంతానికి ఫైజర్ బయోఎన్‌టెక్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలుపుతున్నామని ఎఫ్‌డీఏ చీఫ్ సైంటిస్ట్ డెనైజ్ హింటన్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికన్లందరికీ ఫైజర్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కేవలం తొమ్మిదినెలల్లోనే అద్భుతమైన విజయాన్ని సాధించామని, ఇది నిజంగా శుభవార్త అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సైన్సుపరంగా చరిత్రలో ఇదొక చారిత్రాత్మక సందర్బమని పేర్కొన్నారు. మొదటి టీకాను ఎవరు వినియోగించాలనే విషయాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లే నిర్ణయిస్తారని , వయోవృద్ధులకు, ఆరోగ్య కార్యకర్తలు మొదటివరుసలో ఉంటారని చెప్పారు. కఠినమైన పరీక్షల అనంతరం ఈ వ్యాక్సిన్‌కు అమోదం లభించిందని, 24 గంటల్లోపునే వాక్సినేషన్ ప్ర్రక్రియ మొదలవుతుందని ఆయన వెల్లడించారు. అంతకు ముందు ఎఫ్‌డీఏకు బయట నుంచి సలహాలు ఇచ్చే నిపుణుల కమిటీ అనుకూలంగా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. pic.twitter.com/ofLq3OMicv — Donald J. Trump (@realDonaldTrump) December 12, 2020 -
ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అమెరికా ఓకే
వాషింగ్టన్ : అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య నిపుణుల ప్రత్యేక సలహా మండలి సిఫారసు చేసింది. ఈ వ్యాక్సిన్ వినియోగానికి ఇవ్వాల్సిన అనుమతులపై ఎనిమిది గంటల సేపు చర్చించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్స్ (ఎఫ్‌డీఏ), వ్యాక్సిన్స్ అండ్ రిలేటెడ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ అడ్వయిజరీ కమిటీ (వీఆర్‌బీపీఏసీ) 17–4 ఓట్లతో వ్యాక్సిన్ వినియోగానికి ఆమోద ముద్ర వేసింది. ఫైజర్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై ఆందోళనలున్న నేపథ్యంలో అత్యవసర వినియోగానికి అనుమతుల్లో జాప్యం జరుగుతుందన్న ప్రచారానికి ఎఫ్‌డీఏ తెర దించింది. లాంఛనంగా ఎఫ్‌డీఏ ఆమోదం పొందాక వచ్చే వారం నుంచి అమెరికాలో భారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఇక యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్!
న్యూఢిల్లీ, సాక్షి: ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్‌కు యూఎస్ ప్రభుత్వ సలహా మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎమెర్జెన్సీ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ను వినియోగించవచ్చంటూ సూచించింది. వ్యాక్సిన్ వినియోగంలో రిస్కులతో పోలిస్తే రోగులకు ఉపశమన అవకాశాలే అధికంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. యూకేలో అలెర్జీలున్న వ్యక్తులకు వ్యాక్సిన్‌ను ఇవ్వవద్దంటూ ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ప్రభుత్వ ప్యానల్ సలహాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 20 మందితో ఏర్పాటైన వ్యాక్సిన్లు, సంబంధిత బయోలాజికల్ ప్రొడక్టుల సలహా కమిటీ(వీఆర్‌బీపీఏసీ) ఫైజర్ వ్యాక్సిన్‌కు 17-4 ఓట్లతో ఆమోదముద్ర వేసింది. దీంతో యూఎస్ ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఫైజర్ వ్యాక్సిన్‌కు నేటి(11) నుంచి అనుమతి మంజూరు చేసే అవకాశమున్నట్లు ఫార్మా వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెకండ్‌వేవ్‌లో భాగంగా యూఎస్‌లో కేసులు, మరణాల సంఖ్య పెరగుతున్న కారణంగా యూఎస్ఎఫ్డీఏ త్వరితగతిన అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అభిప్రాయడ్డారు. యూఎస్‌లో కరోనా వైరస్ బారినపడినవారి సంఖ్య 1.5 కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 2.8 లక్షలకు చేరినట్లు తెలియజేశారు. .(తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్- పరీక్షలకు రెడీ) తప్పనిసరికాదు నిపుణులు కమిటీ సూచనలను యూఎస్ఎఫ్డీఏ తప్పనిసరిగా పాటించవలసిన అవసరంలేదని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో భాగస్వామ్యంలో ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్ వినియోగానికి ఇటీవల యూకే, కెనడా, బెహ్రయిన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ సలహా మండలి ఇచ్చిన నివేదిక సూచనలు మాత్రమేనని.. యూఎస్ఎఫ్డీఏ వీటికి కట్టుబడవలసిన అవసరంలేదని నిపుణులు తెలియజేశారు. కాగా.. యూఎస్‌లో పరిస్థితుల ఆధారంగా ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూఎస్ఎఫ్డీఏ వెనువెంటనే అనుమతించే వీలున్నట్లు అంచనా వేశారు.(అలర్జీలు ఉన్న వారికి వ్యాక్సిన్లు వాడొద్దు) రాజీ పడబోము రానున్న వారాల్లో దేశీయంగానూ కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తాజాగా పేర్కొన్నారు. అయితే సైంటిఫిక్, ఔషధ నియంత్రణ సంస్థల నిబంధనల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. కోవిడ్-19 కట్టడికి యూఎస్ హెల్త్‌కేర్ దిగ్గజం ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు తాజాగా యూఎస్ సలహా మండలి సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో హర్షవర్ధన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇటీవల యూకే, కెనడా, బెహ్రయిన్ అనుమతించిన విషయం విదితమే. దేశీయంగా ప్రపంచస్థాయి సంస్థలున్నాయని, తద్వారా కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నాయని హర్ష వర్ధన్ తెలియజేశారు. ప్రస్తుతం పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీ, పంపిణీ తదితర కార్యక్రమాలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి సుమారు 260 వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఇవి వివిధ దశల్లో ఉన్నాయని, దేశీయంగా వీటిలో 8 వ్యాక్సిన్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు.() -
తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్- పరీక్షలకు రెడీ
ముంబై, సాక్షి: కోవిడ్-19 కట్టడి కోసం దేశీయంగా తొలిసారి మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా వ్యాక్సిన్ అభివృద్ధికి బీజం పడింది. తొలి, రెండు దశల క్లినికల్ పరీక్షలకు దేశీ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. యూఎస్ సంస్థ హెచ్‌డీటీ బయోటెక్ కార్పొరేషన్ సహకరాంతో పుణే కంపెనీ జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ ఇందుకు అనుమతిని పొందింది. జెన్నోవా అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రభావంతో ఎలుకలు, చింపాజీలు తదితర జంతువులలో కనిపించిన యాంటీబాడీలు, ఇమ్యునాలజీ తదితర అంశాల డేటా ఆధారంగా డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. (అలర్జీలు ఉన్న వారికి వ్యాక్సిన్లు వాడొద్దు) షరతులతో.. హెచ్‌జీసీవో19 పేరుతో జెన్నోవా రూపొందించిన వ్యాక్సిన్‌కు మానవులపై క్లినికల్ పరీక్షల నిర్వహణకు డీసీజీఐ కొన్ని షరతులతో ఆమోదముద్ర వేసింది. వ్యాక్సిన్ డేటా పరిశీలించిన సంబంధిత నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) సలహామేరకు ఇందుకు అనుమతించింది. దీంతో కోవిడ్-19 కట్టడికి తొలిసారి ఎంఆర్ఎన్ఏ సాంకేతికతో దేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న కంపెనీగా జెన్నోవా నిలవనుంది. అయితే తొలి దశ క్లినికల్ పరీక్షల మధ్యంతర ఫలితాలను జెన్నోవా కమిటీకి దాఖలు చేయవలసి ఉంటుంది. వీటి ఆధారంగా రెండో దశ పరీక్షలకు అనుమతించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. జెన్నోవా అభివృద్ధి చేస్తున్న కొత్తతరహా వ్యాక్సిన్‌కు మద్దతుగా బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రాథమిక నిధులను(సీడ్ ఫండింగ్) అందించినట్లు తెలుస్తోంది. (జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!) -
అలర్జీ ఉంటే వ్యాక్సిన్ వద్దు
లండన్: కరోనాను తరిమికొట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించి 24 గంటలు గడవకుండానే సమస్యలు తలెత్తాయి. ఫైజర్– బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్న నేషనల్ హెల్త్ సర్వీసుకి చెందిన ఇద్దరు వర్కర్లు తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న ఒక్క రోజులోనే వారికి ఒళ్లంతా దద్దుర్లు, రక్తప్రసరణలో తేడాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో యూకే డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ అప్రమత్తమైంది. ఏదైనా మందులకుగానీ, ఆహార పదార్థాలకు గానీ అలర్జీ వచ్చే వాళ్లు ఎవరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి రావద్దని హెచ్చరించింది. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి వచ్చిన వారి మెడికల్ హిస్టరీని పరిశీలించాలని ఆదేశించింది. ఎవరికైనా అలర్జీలు ఉన్నాయని తేలితే వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ఏదైనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్లు రావడం సర్వసాధారణమే. ఎందుౖనా మంచిదని వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చే వారి మెడికల్ హిస్టరీ చూడాలని చెప్పాము. ప్రస్తుతం ఆ హెల్త్ వర్కర్లు ఇద్దరూ కోలుకుంటున్నారు. వారి ఆరోగ్యం బాగుంది’’ అని అధికారులు చెప్పారు. -
వ్యాక్సిన్ల సందడి
మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం ఆగమిస్తున్న వేళ ప్రపంచమంతటా వ్యాక్సిన్ సీజన్ మొదలైంది. అందరికన్నా ముందు అనుమతులు పొందిన ఫైజర్ సంస్థ బ్రిటన్‌లో టీకాలివ్వడం కూడా మొదలుపెట్టింది. మరో వారం రోజుల్లో 91వ ఏట అడుగుపెట్టనున్న మహిళ మార్గరెట్ కీనన్ ప్రపంచంలో టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా నమోదయ్యారు. 80 ఏళ్లు పైబడినవారికీ, కరోనా సోకితే ముప్పు అధికంగా వుండే అవకాశం వున్నవారికి తొలి దశలో ప్రాధాన్యమిస్తామని బ్రిటన్ ప్రక టించింది. ఇప్పుడు టీకాలు తీసుకుంటున్నవారికి మూడు వారాల తర్వాత రెండో డోసు అందిస్తారు. తీసుకునేవారి వయసునుబట్టి కాస్త హెచ్చుతగ్గులున్నా, మొత్తంమీద దీని సామర్థ్యం రేటు 95 శాతమని సంస్థ చెబుతోంది. మరోపక్క అమెరికా సైతం దాన్ని అనుమతించేందుకు రెడీ అవు తోంది. ఈ వారం ఆఖరులో అక్కడ కూడా టీకాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాన్ని మన దేశంలో అందించడానికి కూడా ఫైజర్ అనుమతి కోరుతోంది. ఇంకా ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, ఆక్స్ఫర్డ్ తదితర ఫార్మస్థీలు రూపొందించిన వ్యాక్సిన్లు తుది దశ పరీక్షల్లోవున్నాయి. భారత్ బయోటెక్, సీరమ్ సంస్థలు తమ టీకాలకు అత్యవసర అనుమతులివ్వాలని కేంద్ర ఔషధాల ప్రమాణ నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ)ను కోరాయి. అయితే మరింత డేటా అవసరమని సీడీఎస్సీఓ తెలిపింది. సాధారణంగా వ్యాక్సిన్లను అనుమతించడం అంత తేలిగ్గా జరగదు. వేర్వేరు దశల్లో జరిపిన పరీక్షల డేటాను నిపుణులు నిశితంగా పరిశీలించాకే అది సాధ్యం. ఇదిగాక వచ్చిన డేటాపై లాన్సెట్ వంటి అంతర్జాతీయ వైద్య శాస్త్ర పత్రికల్లో ప్రపంచవ్యాప్తంగావున్న సహచర నిపుణుల సమీక్షలు జరుగుతాయి. ఆ డేటాపై వారి అభిప్రాయాలు, సందేహాలు, అభ్యంతరాలు వెల్లడయ్యాక అవస రమైతే తదుపరి పరీక్షలు జరుపుతారు. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఆ తర్వాతే టీకాలకు అనుమతిస్తుంది. అయితే ఫైజర్‌గానీ, మోడెర్నాగానీ లాన్సెట్‌కు తమ పరీక్షల డేటాను ఇంకా పంపలేదు. లాన్సెట్ ప్రచురించిన తొలి వ్యాక్సిన్ డేటా ఆస్ట్రాజెనెకా టీకాకు సంబంధించిందే. అది 70 శాతంమేర వ్యాధినుంచి రక్షించగలదని తేలింది. వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమైనవని, వాటివల్ల కలిగే దుష్ఫలితాలు తక్కువని తేలితే తప్ప ఔషధ నియంత్రణ సంస్థలు అనుమతులు మంజూరు చేయవు. ప్రయోగాత్మక పరీక్షలన్నీ నిపుణుల నిత్య పర్యవేక్షణలో జరుగుతాయి. పరీక్షల సమయంలో బయటపడని సమస్యలు కూడా క్షేత్ర స్థాయిలో టీకాలిచ్చినప్పుడు ఏర్పడవచ్చు. అందుకే ఏ వ్యాక్సిన్‌కైనా అనుమతులు రావడానికి కనీసం ఒకటి రెండేళ్లు పడుతుంది. అయితే కరోనా మోగిస్తున్న చావు బాజాను చూసి బెంబేలెత్తిన బ్రిటన్ మొన్న అక్టోబర్‌లోనే చట్టాన్ని సవరించి అత్యవసర అనుమతులిచ్చే అధికారాన్ని ఔషధ నియంత్రణ వ్యవస్థకు కట్టబెట్టింది. యూరప్‌లో మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిటన్‌లోనే కరోనా మృతులు అత్యధికం. అక్కడ 62,000కు పైగా జనం మరణించారు. ఫైజర్‌ను అనుమతిస్తూనే అది తాత్కాలికమేనని బ్రిటన్ షరతు పెట్టింది. దాని ప్రకారం ప్రతి బ్యాచ్‌లో ఉత్పత్తయిన వ్యాక్సిన్‌కూ విడివిడిగా అనుమతులిస్తారు. ఏ దశలోనైనా అది రద్దు చేసే అవకాశం కూడా వుంటుంది. అందుకే ఫైజర్‌కు బ్రిటన్ ఇచ్చిన అనుమతి రాజకీయపరమైనదే తప్ప, శాస్త్రీయ ప్రాతిపదిక వున్నది కాదన్న విమర్శలు కూడా వున్నాయి. బ్రిటన్ నమూనాను అనుసరించవద్దంటూ యూరప్ దేశాల్లోని నిపుణులు అక్కడి ప్రభుత్వాలను హెచ్చ రిస్తున్నారు. కరోనా ఉధృతి అధికంగా వున్నప్పుడు మన దేశం, మరికొన్ని దేశాలు రెమ్‌డెసివిర్ వినియోగానికి అనుమతించాయి. అది అప్పటికే వినియోగంలో వున్న యాంటీ వైరల్ ఔషధం కనుకే ఆ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా రూపొందిన ఔషధం విషయంలో అలా చేయడం అసాధ్యం. ఏ దేశమైనా పౌరుల ప్రాణాలను అత్యంత విలువైనవిగా భావిస్తుంది. వ్యాక్సిన్ తీసు కున్నవారు ఆరోగ్యపరంగా చిక్కుల్లో పడితే ఆ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన సంస్థ మాత్రమే కాదు... అనుమతించిన ఔషధ నియంత్రణ సంస్థ కూడా సమస్యలు ఎదుర్కొనక తప్పదు. బ్రిటన్ కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతులిచ్చింది. ఇప్పుడు అమెరికా సైతం ఆ తోవనే ఎంచుకుంది. మన దేశంలో ఇప్పటికైతే అత్యవసరంగా అనుమతించే విధానం లేదు. వ్యాక్సిన్వల్ల కలిగే లబ్ధి, తలెత్తగల సమస్య మధ్య వుండే నిష్పత్తి ఆధారంగా మాత్రమే ఇంతవరకూ అనుమతులిస్తున్నారు. భారత్ బయోటెక్, సీరమ్ల వ్యాక్సిన్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్న అభిప్రాయమే ఔషధ నియంత్రణ డైరెక్టర్ జనరల్‌కు వున్నట్టుంది. కనుకనే ఆ రెండు వ్యాక్సిన్లూ ఇంకా పరిశీలన దశలోనే వున్నాయి. ఔషధాన్ని అనుమతించడానికి కనీసం రెండు వారాల వ్యవధి తీసుకోవడం, ఈలోగా నిశితంగా పరిశీలించడం మన దేశంలో అనుసరిస్తున్న విధానం. ఒక విధంగా ఇది మంచిదే. ఎందుకంటే అమెరికా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా తీవ్రత చాలా తగ్గింది. ఆ వైరస్ వ్యాప్తి మూడునెలల క్రితంతో పోల్చినా ఎంతో మందగించింది. రెండో దశ ముంచుకురావొచ్చునన్న అభిప్రాయం వున్నా దాని ప్రభావం చెప్పుకోదగ్గ రీతిలో వుండకపోవచ్చని అంటున్నారు. వేరే దేశాల్లో ఇచ్చిన అనుమతుల్ని గీటురాయిగా తీసుకునే సంప్రదాయం మన దేశంలో లేదు. అయితే పరీక్షలకు సంబంధించిన డేటానూ, ఇతరచోట్ల వచ్చే ఫలితాలనూ కూడా నిపుణులు అనుమతుల ప్రక్రియలో పరిశీలిస్తారు. మొత్తానికి రాగలకాలంలో పంజా విసరడం కరోనావైరస్కు అంత సులభం కాదని ఇప్పుడు వ్యాక్సిన్ల కోలాహలం చూస్తుంటే అర్థమవుతుంది. అయితే వ్యాక్సిన్లు వంద శాతం సురక్షితమని అనుకోరాదన్నదే నిపుణుల హెచ్చరిక. కనుక ఏ రోగం విషయంలోనైనా ముందు జాగ్రత్తలు పాటించడమే అత్యుత్తమం. -
అలర్జీలు ఉన్న వారికి వ్యాక్సిన్లు వాడొద్దు
లండన్: కోవిడ్-19 కట్టడికి యూఎస్ ఫార్మా దిగ్గజం ఫైజర్ అందిస్తున్న వ్యాక్సిన్‌ను గతంలో అలెర్జీల బారినపడిన వ్యక్తులకు వినియోగించవద్దంటూ తాజాగా యూకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఔషధాలు, ఆహారం లేదా లేదా ఏ ఇతర అలెర్జీ సంబంధ రియాక్షన్స్ ఉన్న వ్యక్తులకూ వ్యాక్నిన్ను అందించవద్దని పేర్కొంది. ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చాక జాతీయ ఆరోగ్య సర్వీసుల(ఎన్హెచ్ఎస్)కు చెందిన ఇద్దరు ఉద్యోగులు అలెర్జిక్ రియాక్షన్స్‌కు లోనుకావడంతో యూకే ప్రభుత్వం తాజా హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం వ్యాక్సిన్లను అందుకున్న ఈ ఇద్దరు ఉద్యోగులూ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. క్లినికల్ పరీక్షలలో ఎదురుకాని ఇలాంటి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఎంహెచ్ఆర్ఏ సీఈవో డాక్టర్ జూన్ రైనే పేర్కొన్నారు. వ్యాక్సిన్ల కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయంలో పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలను జారీ చేయనున్నట్లు వివరించారు. చదవండి: (మార్గరెట్- షేక్స్పియర్.. వీళ్లెవరో తెలుసా?) సాధారణమే.. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్ సహకారంతో యూఎస్ ఫార్మా దిగ్గజం ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను మంగళవారం నుంచీ ఎమర్జెన్సీ ప్రాతిపదికన యూకేలో వినియోగిస్తున్న విషయం విదితమే. ప్రపంచ దేశాలలోనే తొలిసారిగా ఔషధాలు, ఆరోగ్యపరిరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ(ఎంహెచ్ఆర్ఏ) సూచనలమేరకు యూకే ప్రభుత్వం ఇందుకు అనుమతించింది. మంగళవారం తొలిసారిగా 91 ఏళ్ల మహిళ మార్గరెట్ కీనన్ వ్యాక్సిన్‌ను వేయించుకున్న సంగతి తెలిసిందే. కాగా.. వ్యాక్సిన్ల వినియోగంలో యూకే ప్రభుత్వ ఆదేశాలు ముందస్తు జాగ్రత్తలో భాగంగా జారీ చేసినట్లు ఎన్హెచ్ఎస్ జాతీయ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ స్టీఫెన్ పోవిస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త వ్యాక్సిన్ల వినియోగంలో అలెర్జిక్ రియాక్షన్స్వంటివి సహజమేనని తెలియజేశారు. చదవండి: (జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!) -
ఆస్ట్రాజెనెకా సురక్షితం.. ప్రభావవంతం
వాషింగ్టన్: యూకే వ్యాప్తంగా ఫైజర్ బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ భాగస్వామ్యంలో అభివృద్ధి చేందుతోన్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిడ్‌కు వ్యతిరేకంగా ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని తెలిపారు. డోసేజ్ ప్రకారం ఇది 62 శాతం, 70 శాతం, 90 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ఫేస్ 3 డాటాని పలువురు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు పరిశీలించారని.. మొత్తం మీద తమ వ్యాక్సిన్ 70.4శాతం సామార్థ్యం కలిగి ఉన్నట్లు సైంటిస్ట్‌ల బృందం వెల్లడించదని తెలిపారు. దాదాపు 20 వేల మందికి పైగా అధునాతన పరీక్షల పూర్తి ఫలితాలను పరిశీలించిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ నివేదిక రూపొందించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ అత్యవసర వినియోగం.. అనుమతులు జారీ చేయడం వంటి కీలక అంశాలన్ని ఈ డాటా మీదనే ఆధారపడతాయన్నారు. అంతేకాక తమ ఫేజ్ 3 డాటాను స్టడీ చేసి లాన్సెట్ ఓ నివేదక విడుదల చేసిందని.. దాని ప్రకారం ఆస్ట్రాజెనెకా కోవిడ్19-కు వ్యతిరేకంగా ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ డైరెక్టర్, ట్రయల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మేం ఫేజ్ 3 ట్రయల్ డాటా తాత్కాలిక విశ్లేషణలను ప్రచురించాము. ఈ కొత్త వ్యాక్సిన్ మంచి సేఫ్టీ రికార్డ్, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పని చేయగల సామార్థ్యం కలిగి ఉన్నట్లు ఈ విశ్లేషణలు వెల్లడించాయి’ అన్నారు. అయితే ఏ డోస్ సురక్షితం.. ఏ వయసుల వారి మీద ఎంత డోస్ ఎఫెక్టివ్‌గా పని చేస్తుందనే పలు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇంకా లభించలేదని లాన్సెట్ నివేదిక పేర్కొంది. ఇక గత నెల రిలీజ్ చేసిన తాత్కాలిక ట్రయల్ రిజల్ట్స్ ఆధారంగా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ సమర్థత స్థాయిలను మూడు రకాలుగా విభజించారు. మొత్తం సమర్థత స్థాయి 70 శాతంగా ఉండగా.. 62 శాతం తక్కువ సమర్థత స్థాయిగా ఉండగా.. 90 శాతం అధిక సమర్థత స్థాయిగా ఉంది. ట్రయల్స్ సమయంలో వ్యాక్సిన్ డోసుల విషయంలో పొరపాటు జరగడంతో సమర్థత స్థాయిలోల తేడా వచ్చినట్లు తెలిపారు. (చదవండి: బ్రిటన్‌లో ఫైజర్ టీకా మొదలు) ఇక లాన్సెట్ 1,367 మంది ఫలితాలను విశ్లేషించి మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. వీరిలో సగం డోసు.. పూర్తి డోసు తీసుకున్నవారు కూడా ఉన్నారు. ఇక వీరిలో కొందరిలో వ్యాక్సిన్ కోవిడ్ బారి నుంచి 90 శాతం రక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడయ్యింది. అయితే ఇంత తక్కువ మంది సమాచారంతో ఓ ముగింపుకు రావడం కష్టం అంటున్నారు సైంటిస్టులు. ఇక ఈ డాటా ప్రకారం లో/స్టాండర్డ్ డోస్ లక్షణాలు బహిర్గతం కానీ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. చివరగా ఈ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిడ్-19కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీన్ని తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ తీవ్రం కావడం లేదు.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రావడం వంటి పరిస్థితులు తలెత్తడం లేదు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఎంతో సురక్షితం.. బాగా తట్టుకోగలదు అని నిరూపితమయ్యింది అని లాన్సెట్ వెల్లడించింది. (చదవండి: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ముందుగా మనకే!) ఈ సందర్భంగా ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాస్కల్ సోరియట్ మాట్లాడుతూ.. ‘మేము ముందస్తు అనుమతి పొందడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెగ్యులేటరీ అధికారులకు ఈ డాటాను సమర్పించడం ప్రారంభించాము. త్వరలోనే ప్రపంచ స్థాయిలో వందల మిలియన్ల డోసులను ఎటువంటి లాభాపేక్ష లేకుండా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము’ని తెలిపారు. భద్రత పరంగా, వ్యాక్సిన్‌కు సంబంధించిన ఒక తీవ్రమైన ప్రతికూల సంఘటన ఉంది మరియు మరొకటి - అధిక ఉష్ణోగ్రత - ఇప్పటికీ పరిశోధించబడుతోంది. -
కోవిడ్ వ్యాక్సిన్: హరి శుక్లా రికార్డు
లండన్: భారత సంతతి వ్యక్తి హరి శుక్లా అరుదైన ఘనత సాధించనున్నారు. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొదటి వ్యక్తుల జాబితాలో చేరారు. ఈ రోజు ఆయన యూకేలోని ఓ ఆస్పత్రిలో ఫైజర్-బయో ఎన్ టెక్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ని తీసుకోబోతున్నారు. ఫైజర్-బయో ఎన్ టెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటీష్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలుత 80 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ వర్కర్స్‌కి, హోం కేర్ వర్కర్స్‌కి వ్యాక్సిన్ వేస్తారు. ఈ సందర్బంగా హరి శుక్లా మాట్లాడుతూ.. ‘ఇప్పటికైనా మహమ్మారి కట్టడికి ఓ ఆయుధం రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రపంచంలో కోవిడ్ వ్యాక్సిన్ పొందిన మొదటి వ్యక్తుల జాబితాలో చేరడం ఉద్వేగానికి గురి చేస్తోంది. నాకు కాల్ చేసి వ్యాక్సిన్ తీసుకునే వారి జాబితాలో నా పేరు ఉందని చెప్పినప్పటి నుంచి ఎంతో సంతోషిస్తున్నాను. ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను. కోవిడ్ సంక్షోభం ముగింపుకు వ్యాక్సిన్ అభివృద్ధి అయ్యింది అనే విషయం తలుచుకుంటే ఎంతో ఊరటగా ఉంది’ అన్నారు హరి శుక్లా. (చదవండి: జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!) ఇక బ్రిటన్‌లో అత్యవసర వినియోగంలో భాగంగా మొదటి వారంలో 8 లక్షల డోసుల వ్యాక్సిన్లని అందుబాటులోని తీసుకురానున్నారు. కోవిడ్ వల్ల ఎక్కువ ప్రమాదంలో ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి, 80ఏళ్లు పైబడిన వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జన్సాన్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌పై పొరాటంలో యూకే నేడు అతి పెద్ద ముందడుగు వేయబోతుంది. దేశంలో మొదటి సారిగా కోవిడ్ వ్యాక్సిన్‌ని వేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలు, ట్రయల్స్ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన జనాలను చూసి నేను గర్వ పడుతున్నాను’ అన్నారు. -
కరోనా కిల్లర్: ఆఫ్టర్ 28 డేస్...
సాక్షి, హైదరాబాద్ : కరోనా కిల్లర్‌గా భావిస్తున్న ఫైజర్ టీకా మంగళవారం నుంచి బ్రిటన్‌లో ఇవ్వడం ప్రారంభించనున్నారు. ఇటు భారత్‌లోనూ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ కంపెనీ దరఖాస్తు చేసుకుంది.. ఈ నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం కనుక అనుమతిస్తే.. అది ఎలా పనిచేస్తుంది అన్నది మనకు తెలియాలిగా.. ఈ టీకాను అక్స్‌ఫర్డ్, మోడెర్నా లాంటి వాటిలా కాకుండా –70డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది.. రెండు డోసులు తీసుకోవాలి. ఒక్కో డోసు ధర రూ.1,500.. అయితే.. 28 రోజులు చాలట.. వైరస్‌కు వ్యతిరేకంగా మన శరీరంలో పూర్తి స్థాయిలో రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. చదవండి: కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు మొదటి రోజు.. తొలి డోస్.. ► 12వ రోజు.. రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది.. ► 21వ రోజు.. రెండో డోస్ ► 28వ రోజు.. పూర్తి స్థాయిలో రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది -
కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు
న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ భారత్‌లో వినియోగానికి అత్యవసర అనుమతుల్ని మంజూరు చేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ని కోరింది. ఇప్పటికే యూకే, బహ్రెయిన్‌లో ఫైజర్ అనుమతులు పొందింది. కరోనా టీకా వినియోగం కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న మొదటి సంస్థ ఇదే కావడం విశేషం. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకా వినియోగం కోసం శుక్రవారం ఫైజర్ దరఖాస్తు చేసుకుందని డీసీజీఐ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ టీకా అత్యవసర వినియో గానికి అనుమతులు ఇవ్వాలని సీరం ఇన్స్టి ట్యూట్ కూడా ఆదివారం కేంద్రాన్ని కోరింది. నిబంధనల ప్రకారం ఔషధ వినియోగానికి అనుమతులు కోరితే 90 రోజుల్లో బదులివ్వాల్సి ఉంది. యూకే, బహ్రెయిన్లలో ఫైజర్ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇస్తే డీసీజీఐ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ప్రయోజనం ఎంత ? భారత్‌లో ఈ వ్యాక్సిన్ వినియోగం ఎంతవరకు ఉపయోగం అన్న దానిపై అనుమానాలున్నాయి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో భద్రపరచాలి. సాధారణంగా భారత్‌లో వ్యాక్సిన్లన్నీ రెండు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనే ఉంచుతారు. మన దగ్గర ఈ వ్యాక్సిన్‌ను భద్రపరిచే కోల్డ్ స్టోరేజీలు దొరకడం దుర్లభం. అందుకే భారత్ మొదట్నుంచి ఫైజర్‌తో ఎలాంటి ఒప్పందాలు కానీ వ్యాక్సిన్ ప్రయోగాలు కానీ చేపట్టలేదని అధికారులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ 95% సామర్థ్యంతో పని చేస్తుందని తేలినప్పటికీ ఈ సంస్థల మాతృదేశాలైన అమెరికా, జర్మనీలు ఇంకా అనుమతులివ్వలేదు. జనవరి నుంచి నెలకి 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తామని ఫైజర్ సంస్థ చెప్పింది. దీంతో భారత్ అవసరాలకు సరిపడా డోసులు ఉత్పత్తి, పంపిణీ చేయడం ఫైజర్ ఇప్పట్లో చేయడం కష్టమేనని కరోనాపై జాతీయ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు. -
రేపట్నుంచి యూకేలో ఫైజర్ టీకా
లండన్: బ్రిటన్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఒక భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. మొత్తం 50 జాతీయ ఆరోగ్య సేవా ఆస్పత్రుల్లో కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మట్ హన్‌కాక్ చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇళ్లల్లోనే ఉండే వయో వృద్ధులకు, ముఖ్యంగా 80 ఏళ్ల వయసు పై బడిన వారికి, వారి సంరక్షకులకి మొట్ట మొదట వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టుగా మంత్రి తెలిపారు. ప్రజలందరూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సహకరించాలని, నిబంధనలన్నీ తప్పనిసరిగా పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు. కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలం అవుతున్న యూకే గతవారంలోనే అమెరికాకి చెందిన ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే. 6.7కోట్ల జనాభా ఉన్న బ్రిటన్ తొలి విడతగా 2 కోట్ల మందికి టీకా డోసుల్ని ఇవ్వనుంది. ఇందు కోసం 4 కోట్ల టీకా డోసులకి ఆర్డర్ చేసింది. బెల్జియం నుంచి ఇప్పటికే 8 లక్షల డోసులు జాతీయ ఆరోగ్య కేంద్రాలకి చేరుకున్నాయి. రాణి దంపతులకు వ్యాక్సినేషన్! బ్రిటన్ రాణి ఎలిజెబెత్ (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99)లకు త్వరలో ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. వయసుని దృష్టిలో ఉంచుకొని వారికి తొలి ప్రాధాన్యంగా టీకా ఇస్తారని ది మెయిల్ పత్రిక వెల్లడించింది. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని ప్రజల్లో నమ్మకం పెంచేందుకు రాణి దంపతులతో పాటు మరి కొందరు ప్రముఖులు కూడా టీకా తీసుకోనున్నారు. అయితే బకింగ్çహామ్ ప్యాలె స్ టీకా అంశంలో ఇంకా స్పందించాల్సి ఉంది. చైనా సన్నాహాలు చైనా కూడా దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. 140 కోట్ల మంది జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వడం సవాలేనని అధికారులు చెప్పారు. చైనాలో మొత్తం అయిదు వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. వీటిలో సినోఫార్మ్ కంపెనీ టీకా వినియోగం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం ఏ వ్యాక్సిన్‌ను ఇస్తుందో అధికారికంగా వెల్లడించలేదు. -
జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!
న్యూఢిల్లీ, సాక్షి: కోవిడ్-19 కట్టడికి వచ్చే(2021) జనవరికల్లా దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు ఎయిమ్స్(AIIMS) డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా పేర్కొన్నారు. ఈ రెండింటినీ దేశీ హెల్త్‌కేర్ రంగ కంపెనీలే అభివృద్ధి చేస్తుండటం గమనార్హం! వీటిలో ఒకటి సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్కాగా.. మరొకటి భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్. వీటిని ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) జనవరికల్లా అనుమతించవచ్చని రణదీప్ అంచనా వేశారు. మూడో దశ క్లినికల్ పరీక్షలలో ఉన్న వ్యాక్సిన్లకు ఇందుకు అవకాశమున్నట్లు తెలియజేశారు. కోవిడ్-19 నిర్వహణకు సంబంధించిన జాతీయ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులు కూడా కావడంతో రణదీప్ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉన్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. యూకే బాటలో ఇటీవల యూకే ప్రభుత్వం అత్యవసర వినియోగానికి యూఎస్ ఫార్మా దిగ్గజం ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న విషయం విదితమే. దీంతో పలు దేశాలు ఈ బాటను అనుసరించే వీలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను పూర్తిచేసుకున్నాక వ్యాక్సిన్ పనితీరుపై డేటా ఆధారంగా ఔషధ నియంత్రణ సంస్థ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించే వీలున్నట్లు ఫార్మా నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని సీఎస్ఐఆర్- ఐఐఐఎంకు చెందిన రామ్ విశ్వకర్మ సైతం ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయంగానూ ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి సంప్రదించవచ్చని, అయితే డేటా ఆధారంగా డీసీజీఐ నిర్ణయాన్ని తీసుకోనుందని తెలియజేశారు. వ్యాక్సిన్‌కు అనుమతించడం లేదా మరిన్ని పరీక్షలకు ఆదేశించడం తదితర చర్యలకు వీలున్నట్లు వివరించారు. పరిశీలించాకే వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ పరీక్షల డేటాను పరిశీలించాక పరిస్థితులకు అనుగుణంగా డీసీజీఐ పరిమితకాలానికి ఎమర్జెన్సీ అనుమతిని మంజూరు చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపై ఆయా కంపెనీలు వ్యాక్సిన్లపై పరీక్షల పూర్తి డేటాను అందజేయవలసి ఉంటుందని తెలియజేశారు. వ్యాక్సిన్ పనితీరు, భద్రత, ప్రమాణాలు, ఇతర ప్రభావాలు వంటి అంశాలను తెలియజేయవలసి ఉంటుందని వివరించారు. సైంటిస్టులు సిఫారసు చేశాక కొద్ది వారాలలోనే దేశీయంగా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు అన్ని రాజకీయ పార్టీల సమావేశంలో వారాంతాన ప్రధాని మోడీ సైతం ప్రకటించిన విషయం ప్రస్తావనార్హం! -
వ్యాక్సిన్ : లండన్‌కు క్యూ కట్టనున్న ఇండియన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడంతో భారతీయులు బ్రిటన్ వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం బుధవారం ఆమోదించిన కోవిడ్-19 ఫైజర్ వ్యాక్సిన్ కోసం వీలైనంత త్వరగా యూకే వెళ్లాలని భావిస్తున్నారట.చాలామంది వీసాదారులు ట్రావెల్ ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. ఈ మేరకు తమకు కాల్స్ రావడం ప్రారంభమైందని ట్రావెల్ ఏజంట్లు చెబుతున్నారు. అటు ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ట్రావెల్ ఏజెన్సీలు కూడా భారీ ప్రణాళికలతో సిద్ధమైపోతున్నాయి.(ఫైజర్ టీకా వచ్చేసింది!) వచ్చే వారం నుంచే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎపుడు, ఎలా వెళ్లాలి, ఐసోలేషన్ నిబంధనలు ఏమిటి అంటూ చాలామంది తమను ప్రశ్నిస్తున్నారని ముంబైకి చెందిన ట్రావెల్ ఏజెంట్ తెలిపారు. క్వారంటైన్ లేకుండా లండన్‌కు షార్ట్ ట్రిప్ ఏదైనా ఉందా అని కొంతమంది వాకబు చేసినట్టు బెంగుళూరుకు చెందిన మరో ట్రావెల్ కంపెనీ తెలిపింది. లండన్ వెళ్లే భారతీయులకోసం మూడు రాత్రుల ప్యాకేజీని ప్రారంభించాలని యోచనలో ఉన్నాయి కంపెనీలు. ఈ నెల(డిసెంబరు) 15 నుంచి తమ దేశంలో అడుగుపెట్టే ప్రతి విదేశీయుడూ 5 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని, ఆరో రోజున ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని బ్రిటన్ కఠిన ఆంక్షలు విధించింది. (పిజ్జా హట్ కో ఫౌండర్ ఇక లేరు) లండన్ పర్యటనకు ఇది ఆఫ్‌బీట్ సీజన్ అయినప్పటికీ ఫైజర్ వ్యాక్సిన్ గురించి బుధవారం ప్రకటించిన మరుక్షణం, యూకే వీసాలున్న భారతీయులు వాక్సిన్ లభ్యతపై ఎంక్వైరీ మొదలు పెట్టారని ఈజ్ మై ట్రిప్ డాట్ కామ్ సీఈఓ నిషాంత్ వెల్లడించారు. అయితే భారతీయ పాస్ పోర్టు హోల్డర్లు అక్కడ వ్యాక్సినేషన్‌కు అర్హులా కారా అన్నది ఇపుడే తేల్చలేమన్నారు. దీనిపై ప్రభుత్వం నుండి స్పష్టత కోసం వేచి చూస్తున్నా మన్నారు. మరోవైపు విమాన టికెట్ల రేట్ల విషయమై వివిధ విమానయాన సంస్థలను సంప్రదిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే లండన్ హోటళ్లతో, అక్కడి ఆసుపత్రులతో కూడా సంప్రదింపులు జరుపు తున్నామని, ఇప్పటికే లండన్ హోటళ్ళతో ఒప్పందాలున్నాయని వెల్లడించారు. అయితే ఆ దేశం నుంచి అధికారికంగా తమకు సమాచారం లభించాల్సి ఉందని మరికొందరు ట్రావెల్ ఏజంట్లు చెబుతున్నారు. అయితే ఫైజర్ వ్యాక్సిన్ ప్రభావం, సమర్థతను తెలుసుకోవాలనుకుంటున్న ప్రజలు వేచి చూసే ధోరణిలో ఉన్నారని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు జ్యోతి మాయల్ చెప్పారు. సైడ్ ఎఫెక్ట్స్ పై కూడా కొందరు భయపడుతున్నట్టు తెలుస్తోంది. కాగా కరోనా తొలి వ్యాక్సిన్ ఆమోదించిన తొలి దేశంగా యూకే నిలిచింది. ఫైజర్, బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ప్రయోగాల ఫలితాల ఆధారంగా అక్కడి స్వతంత్ర రెగ్యులేటర్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీకి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
ఫైజర్ టీకా వచ్చేసింది!
లండన్: ఫైజర్– బయో ఎన్ టెక్ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి బ్రిటిష్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌కు చెందిన ఔషధ నియంత్రణా సంస్థ ఎంహెచ్ఆర్ఏ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు హెల్త్ సెక్రటరీ మాట్ హాంకాక్ చెప్పారు. టీకా అధ్యయనాల్లో 95 శాతం ప్రభావశీలత చూపిందన్నారు. టీకా పంపిణీ మంత్రి నదీమ్ మాట్లాడుతూ ‘‘ కరోనాపై పోరాటంలో ఇది అతిపెద్ద అడుగు’’ అన్నారు. కంపెనీ సమర్పించిన డేటా విశ్లేషణను నిపుణులు పరిశీలించిన అనంతరం వ్యాక్సిన్‌కు ఉండాల్సిన ప్రమాణాలను, రక్షణ నియమాలను ఈ టీకా అందుకున్నట్లు ఎంహెచ్ఆర్ఏ భావించి, ప్రజల్లో వాడకానికి అనుమతినిచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టీకాను ముందుగా తీసుకునే ప్రాధామ్య వర్గాలు(ప్రియారిటీ గ్రూప్స్) అనుసరించాల్సిన సూచనలను ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. వైద్యులు, వయోవృద్ధుల్లాంటి వారిని ప్రాధామ్య వర్గాలుగా పరిగణిస్తారు. ‘‘వచ్చేవారం నుంచి యూకే మొత్తం టీకా పంపిణీ ప్రారంభం అవుతుంది. టీకా విజయవంతం కావాలంటే ప్రజలంతా తమకు నిర్ధేశించిన పాత్రను సమర్ధవంతంగా పోషించాలి’’ అని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు 4కోట్ల డోసులను ప్రభుత్వం ఆర్డరు చేసింది. వ్యాక్సినేషన్లో భాగంగా 21 రోజుల వ్యవధితో రెండుమార్లు టీకా ఇస్తారు. టీకాను అత్యంత శీతల ఉష్ణోగ్రతల వద్ద భద్రపరచడం అతిపెద్ద సవాలని హాంకాక్ అభిప్రాయపడ్డారు. తొలి దశలో ముందుగా 8 లక్షల వ్యాక్సిన్షాట్స్ అందుబాటులో ఉంటాయని, క్రమంగా నెలాఖరుకు మిగిలిన డోసులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. టీకాను ఫైజర్ ఎంత వేగంగా ఉత్పత్తి చేస్తే అంతవేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు. టీకాలు అందుబాటులోకి వస్తుండడం సంతోషకరమైన అంశమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. రష్యాలో వ్యాక్సినేషన్ మాస్కో: ఒకవైపు ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలపగా, మరోవైపు స్పుత్నిక్ వీ వ్యాక్సినేషన్‌కు రష్యా అనుమతినిచ్చింది. వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. డిసెంబర్లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. రష్యా 20 లక్షల డోస్‌లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే లక్ష మందికిపైగా ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మిఖైల్ చెప్పడం గమనార్హం. -
అదిగో వ్యాక్సిన్!
మానవాళి అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ శరవేగంతో అందుబాటులో కొస్తోంది. అందరికన్నా ముందు వ్యాక్సిన్ తీసుకొచ్చి అగ్రగాములం అనిపించుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మసీ సంస్థలు తహతహలాడగా... చివరకు అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్, జర్మనీ సంస్థ బయోఎన్టెక్లు ఉమ్మడిగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆ వ్యాక్సిన్ అన్నివిధాలా సురక్షితమని బ్రిటన్ ప్రభుత్వం భావించి అత్యవసర అనుమతులిస్తున్నట్టు బుధవారం ప్రకటిం చింది. ప్రపంచంలో అధికారికంగా అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్ ఇదే. పాశ్చాత్య దేశాల ప్రజ లకు ఇది సంతోషకరమైన వార్తే. వారికి ఈ నెల కీలకమైనది. క్రిస్మస్ పర్వదినం, ఆతర్వాత ఆగమించే నూతన సంవత్సర వేడుకల కోసం వారు ఏడాదంతా ఎదురుచూస్తారు. విందులు, వినోదాల్లో మునిగితేలుతారు. అందుకే లాక్డౌన్లతో, కంపెనీల మూతతో అల్లాడిపోతున్నవారంతా ఈ పండగ సీజన్‌కల్లా వ్యాక్సిన్ పుట్టుకురావాలని బలంగా కోరుకున్నారు. అలాగని అది వెంటనే అందరికీ అందుబాటులోకొస్తుందని చెప్పలేం. ఈ నెలాఖరుకల్లా అయిదు కోట్ల డోస్‌లు ఉత్పత్తి చేయగలమని ఫైజర్ చెబుతోంది. అందులో సగం అమెరికాకు వెళ్తాయి. ఒక్కొక్కరికి రెండు డోసులు అవసరం కనుక ఆ రెండు దేశాల్లోనూ మొత్తంగా 2.5 కోట్లమందికి చేరతాయి. ఫైజర్‌తో 10 కోట్ల డోసులకు అమెరికా, 20 కోట్ల డోసులకు యూరప్ యూనియన్(ఈయూ) ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చు కున్నాయి. వెనకబడిన దేశాలకు చేరడం ఆ తర్వాతే. గతంలో టీకాను రూపొందించే క్రమంపై ఇంత చేటు ప్రచారం వుండేది కాదు. ఆటలమ్మ, పోలియో, ఎయిడ్స్, చికున్‌గున్యా... ఇలా దేనికి సంబంధించిన ఔషధం గురించైనా తుది పరీక్షల అనంతరం వెల్లడించేవారు. ఆ తర్వాత కొన్ని నెలలకో, రోజులకో అది మార్కెట్లోకి ప్రవేశించేది. చాలా సందర్భాల్లో దాని అవసరం లేకుండానే వైరస్ మటుమాయం కావడమో, బలహీనపడటమో జరిగేది. ఇప్పుడు వ్యాక్సిన్ రెడీ అవుతోందన్న ప్రెస్‌నోట్ సైతం కంపెనీలకు లాభాల పంట పండి స్తోంది. వాటి షేర్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అందుకే ఈ హడావుడంతా. ఇప్పుడొ చ్చిన కరోనా వైరస్ భీతావహమైనది. ఇది ధనిక, బీద దేశాలనే తారతమ్యాలు లేకుండా అన్నిచోట్లా విజృంభించింది. జనజీవితాన్ని తలకిందులు చేసింది. దీనికి సామాజిక, ఆర్థిక అంతరాలు, వయో భేదాలు లేవు. అందరినీ సమానంగానే పీడించింది. ప్రాణాలు బలితీసుకుంది. ఇంతవరకూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6 కోట్ల 44 లక్షలమందికి సోకగా... 15 లక్షలమంది మృత్యువాతపడ్డారు. రష్యా, చైనాలు లోగడే టీకా తయారైందని ప్రకటించాయి. తమ సినోఫార్మ్ గ్రూపు సంస్థ రూపొందించిన టీకా సురక్షితమైనదని, ఇంతవరకూ 10లక్షలమంది దాన్ని తీసుకున్నారని గత నెలాఖరున చైనా ప్రకటించింది. రష్యా కూడా అంతే. స్పుత్నిక్–వీ వ్యాక్సిన్ డోస్‌ను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తన కుమార్తెకు ఇప్పించి అందరిలోనూ విశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు. అయితే ఆ టీకాలకు సంబంధించిన వివిధ స్థాయిల్లోని డేటా అందుబాటులో వుంచకపోవడం వల్ల, అనేకానేక సందేహా లుండటం వల్ల ఎవరూ వాటిని పట్టించుకోలేదు. తాజాగా బ్రిటన్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే స్పుత్నిక్–వీ వాక్సిన్‌కు అనుమతులిస్తున్నట్టు పుతిన్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పది దేశాల్లో కరోనా టీకాల గురించి పరిశోధనలు, క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. వాటిల్లో మొదటినుంచీ అన్నిటికన్నా ముందున్నది ఫైజరే. ఇంకా మోడెర్నా, ఆస్ట్రాజెనికా, నోవాక్స్, సనోఫి, మెర్క్, జీఎస్కే తదితర సంస్థలు జరుపుతున్న పరీక్షలు వివిధ స్థాయిల్లో వున్నాయి. మన దేశంలో కూడా హైదరా బాద్‌లోని భారత్ బయోటెక్, పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్ తదితర సంస్థల ఆధ్వర్యంలో జోరుగా పరీక్షలు సాగుతున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ సాధారణ పౌరుల దగ్గరకు చేరడం అంత సులభమేమీ కాదు. దాన్ని అత్యంత శీతలమైన స్థితిలో... అంటే మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ వుంచాలి. ఆ ఉష్ణోగ్రతలోనే రవాణా, పంపిణీ పూర్తి చేయాలి. అయిదురోజుల్లో రోగికి టీకా ఇవ్వడం కూడా పూర్తయిపోవాలి. లేనట్టయితే దాని సామర్థ్యం క్షీణిస్తుంది. ఉష్ణోగ్రతలు అధికంగా వుండే మన దేశంలో ఈ వ్యాక్సిన్‌ను రోగికి చేరేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. పైగా దాని ఖరీదు కూడా ఎక్కువే. పంపిణీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన ఖర్చుతో కూడిన పని. భారత్ వరకూ ఎందుకు... బ్రిటన్‌లోనే అదెంతో కష్టం. ఒక టీకాకు ఇంత ఆగమేఘాలపై అనుమతులు రావడం అసాధారణమే. బ్రిటన్ ఇప్పటికీ ఈయూ భాగస్వామ్య దేశంగా వుంటే ఇలా హడావుడి అనుమతి కుదిరేది కాదు. ఒక టీకాను అనుమతించడంలో ఈయూ పాటించే నిబంధనలు సంక్లిష్టమైనవి. అందువల్లే మరో పక్షం రోజు లకుగానీ అక్కడ అనుమతులు రాకపోవచ్చంటున్నారు. బ్రిటన్ అన్నిటినీ పక్కనబెట్టి అను మతినిచ్చింది. అందుకు మరొక కారణం కూడా చెబుతున్నారు. బ్రెగ్జిట్తో వచ్చిన ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు ఆ దేశం దీన్నొక అవకాశంగా తీసుకుందన్నదే కొందరి వాదన. దాని ఔషధ నియంత్రణ వ్యవస్థకు ఈ టీకా వల్ల కాసుల వర్షం కురుస్తుందని వారు చెబుతున్నారు. మరోపక్క వ్యాక్సిన్ల తయారీపై ఫార్మసీ సంస్థలు ఇలా పోటీ పడుతుంటే అసలు వాటి అవసరమే వుండకపోవచ్చని నాలుగైదు రోజులక్రితం ఫైజర్ మాజీ చీఫ్ సైంటిస్టు మైకేల్ ఈడెన్ చెప్పిన మాటలు గమనించదగ్గవి. తగినంత సమయం తీసుకుని నిశితంగా పరీక్షించకుండా జనంలోకి వదిలినట్లయితే దుష్పరిణామాలకు దారితీస్తుందని ఆయనంటున్న మాటల్ని కొట్టి పడేయలేం. అందుకే వ్యాక్సిన్ కోసం ఆరాటపడటం, దాంతో మంత్రించినట్టు అంతా మాయమవుతుందని ఆశించడం వృధా ప్రయాస. దానికి బదులు ఆ వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే శ్రేయస్కరం. -
కరోనా తొలి వ్యాక్సిన్‌కు ఆమోదం
-
‘కరోనా అంతానికి వ్యాక్సిన్లు అవసరం లేదు’
వాషింగ్టన్: కరోనా వైరస్‌ని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీదారు ఫైజర్–బయోఎన్‌టెక్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ సైంటిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను అంతం చేయడానికి ఎలాంటి వ్యాక్సిన్లు అవసరం లేదన్నారు. లైఫ్‌సీటెన్యూస్.కమ్ ప్రకారం డాక్టర్ మైఖేల్ యెడాన్ మాట్లాడుతూ.. ‘మహమ్మారిని నిర్మూలించడానికి ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదు. వ్యాక్సిన్ల గురించి కొన్ని వార్తలు చదివితే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. వ్యాధి బారిన పడనివారికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనుషలు మీద ప్రయోగాలు జరపని వ్యాక్సిన్లని మిలయన్ల మంది ఆరోగ్యవంతులైన ప్రజలకు ఇవ్వాలని భావించడం కూడా సరికాదు’ అన్నారు యెడాన్. యూకే ప్రభుత్వ రంగ సంస్థ సేజ్(సైంటిఫిక్ అడ్వైజర్ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీస్)పై విమర్శలో భాగంగా యెడాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సేజ్ అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. (చదవండి: వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి!) లైఫ్‌సీటెన్యూస్.కామ్ ప్రకారం, కోవిడ్ -19 వైరస్‌కు ప్రతిస్పందనగా, ఇటీవల అమలు చేసిన నిబంధనలతో సహా యూకేలో పబ్లిక్ లాక్డౌన్ విధానాలను నిర్ణయించడంలో సేజ్ ప్రధాన పాత్ర పోషించింది. ఇక యెడాన్ సేజ్ తప్పిదాలను ఎత్తి చూపారు. దాని తీర్మానాల వల్ల గత ఏడు నెలలుగా ప్రజలు తీవ్రంగా బాధపడ్డారని ఆయన మండి పడ్డారు. ఏడుగురు మాత్రమే ఇన్ఫెక్ట్ అయ్యారు.. ప్రతి ఒక్కరు వైరస్ బారిన పడ్డారంటూ సేజ్ చేసిన వ్యాఖ్యలను యెడాన్ ఖండించారు. ఇది అస్సలు నమ్మలేని విషయం. శ్వాసకోశ వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక రంగంలోని ముందుమాటను విస్మరించిందని తెలిపారు. (చదవండి: వ్యాక్సిన్ల పనితీరును ఎలా లెక్కిస్తారు?!) ఇక తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు ఇవ్వాలంటూ ఫైజర్–బయోఎన్‌టెక్ కంపెనీలు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10న అడ్మినిస్ట్రేషన్ అడ్వైజరీ కమిటీ కీలక సమావేశం జరగనుంది. వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు లభిస్తే, 24 గంటల్లోగా రాష్ట్రాలకు పంపిణీ చేసి డిసెంబర్ 11న గానీ లేదా 12న గానీ వ్యాక్సినేషన్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమెరికా వ్యాపంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందుతుందని డాక్టర్ మోన్సెఫ్ అన్నారు. వ్యాక్సిన్ వల్ల రోగనిరోధక పెరిగి, మొత్తం జనాభాలో 70 శాతం నిరోధకత వస్తే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని అన్నారు. అన్ని వయసుల వారిపై తమ వ్యాక్సిన్ దాదాపు 95 శాతం ఫలితం చూపిస్తోందని ఫైజర్–బయోఎన్‌టెక్ కంపెనీలు ఇటీవల ప్రకటించాయి. -
అమెరికాలో 11 లేదా 12న వ్యాక్సిన్ ?
వాషింగ్టన్: అమెరికాలో డిసెంబర్ రెండో వారంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాక్సిన్ తయారీని పర్యవేక్షిస్తున్న ఆపరేషన్ వార్ఫ్ స్పీడ్ అధిపతి డాక్టర్ మోన్సెఫ్ స్లౌయి అంచనా మేరకు డిసెంబర్ 11 లేదా 12న వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు ఇవ్వాలంటూ ఫైజర్–బయోఎన్‌టెక్ కంపెనీలు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10న అడ్మినిస్ట్రేషన్ అడ్వైజరీ కమిటీ కీలక సమావేశం జరగనుంది. వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు లభిస్తే, 24 గంటల్లోగా రాష్ట్రాలకు పంపిణీ చేసి డిసెంబర్ 11న గానీ లేదా 12న గానీ వ్యాక్సినేషన్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమెరికా వ్యాపంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందుతుందని డాక్టర్ మోన్సెఫ్ అన్నారు. వ్యాక్సిన్ వల్ల రోగనిరోధక పెరిగి, మొత్తం జనాభాలో 70 శాతం నిరోధకత వస్తే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని అన్నారు. అన్ని వయసుల వారిపై తమ వ్యాక్సిన్ దాదాపు 95 శాతం ఫలితం చూపిస్తోందని ఫైజర్–బయోఎన్‌టెక్ కంపెనీలు ఇటీవల ప్రకటించాయి. -
వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కొన్ని కంపెనీల క్లినికల్ ట్రయల్స్ ముగింపు దశకు చేరాయి. తమ వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఫైజర్, మోడెర్నా వంటి దిగ్గజ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. వ్యాక్సిన్ రాగానే ఉపయో గించాలంటే ప్రభుత్వం అత్యవసర అనుమతి (ఎమర్జెన్సీ ఆథరైజేషన్) ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లకు ఇలాంటి అనుమతి ఇవ్వడానికి అందుబాటులో ఉన్న విధానాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ (వీటీఎఫ్) ఈ పనిలో నిమగ్నమై ఉంది. మోడెర్నా టీకా డోసు ధర ఎంతంటే.. ఫ్రాంక్ఫర్ట్: కరోనా టీకా అభివృద్ధిలో అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా ముందంజలో ఉంది. త్వరలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని నమ్మకంగా చెబుతోంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టెఫానీ బాన్సెల్ మాట్లాడుతూ తమ వ్యాక్సిన్‌కుగాను ప్రభుత్వాల నుంచి ఒక్కో డోసుకు 25 డాలర్ల నుంచి 37 డాలర్లు(రూ.1,854–రూ.2,744) తీసుకుంటామని చెప్పారు. ఆర్డర్ చేసిన డోసులను బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంద న్నారు. ఫ్లూ వ్యాక్సిన్ డోసు 10 డాలర్ల నుంచి 50 డాలర్ల దాకా పలుకుతోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధికారులు ఇప్పటికే మోడెర్నా సంస్థతో చర్చలు జరిపారు. వ్యాక్సిన్ డోసు 25 డాలర్ల లోపు ధరకే తమకు సరఫరా చేయాలని కోరారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. -
కోవిడ్-19కు తొలి వ్యాక్సిన్ రెడీ: ఫైజర్
న్యూయార్క్: కోవిడ్-19 చికిత్సకు తొలి వ్యాక్సిన్ సిద్ధమైంది. మెసెంజర్ ఆర్ఎన్ఏ ఆధారంగా రూపొందించిన తమ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతించమంటూ గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును వచ్చే నెలలో యూఎస్ఎఫ్డీఏ సలహా కమిటీ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 8-10 మధ్య కాలంలో సమీక్ష ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. తద్వారా కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ ను రూపొందించిన తొలి కంపెనీగా ఫైజర్ రికార్డ్ సాధించనున్నట్లు ఫార్మా నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి పలు గ్లోబల్ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లను రూపొందిస్తున్న విషయం విదితమే. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్ తో భాగస్వామ్యంలో రూపొందిస్తున్న వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలలోనూ 95 శాతం ఫలితాలను సాధించినట్లు ఫైజర్ ఇటీవల వెల్లడించింది. మూడో దశ పరీక్షల తొలి ఫలితాల ఆధారంగా తమ వ్యాక్సిన్ సత్ఫలితాలు సాధిస్తున్నట్లు ఫైజర్ తెలియజేసింది. 5 కోట్ల డోసులు యూఎస్, బెల్జియంలలో వినియోగానికి ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసేజీలను అందించగలమని ఫైజర్, బయోఎన్‌టెక్ తాజాగా తెలియజేశాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సురక్షితమైన, సత్ఫలితాలు ఇవ్వగల వ్యాక్సిన్లను అందించేందుకు చూస్తున్నట్లు ఫైజర్ ఇంక్ చైర్మన్ ఆల్బర్ట్ బోర్ల పేర్కొన్నారు. తమ వ్యాక్సిన్ భద్రత, ప్రభావాలపై తమకు పూర్తి అవగాహన ఉన్నట్లు తెలియజేశారు. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించమంటూ యూరోపియన్, యూకే ఔషధ నియంత్రణ సంస్థలకు సైతం తాము దరఖాస్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర దేశాలలో నియంత్రణ సంస్థలకూ దరఖాస్తు చేయనున్నట్లు వివరించారు. అయితే ఫైజర్ తయారీ వ్యాక్సిన్ ను -80-94 సెల్షియస్ లో నిల్వ చేయవలసి ఉన్నందున కంపెనీ ఇందుకు అవసరమైన కూలింగ్ సిస్టమ్స్ ను సైతం సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు వీలుగా డ్రై ఐస్ తో కూడిన సూపర్ కూల్ స్టోరేజీ యూనిట్లను రూపొందించింది. కాగా.. ఇటీవల తమ వ్యాక్సిన్ 94 శాతంపైగా ఫలితాలను సాధించినట్లు వెల్లడించిన ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ సైతం ఫైజర్ బాటలో త్వరలోనే యూఎస్ఎఫ్డీఏకు దరఖాస్తు చేయనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
గుడ్‌న్యూస్: క్రిస్మస్కు ముందే కరోనా వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఇప్పటికే భారీ ఊరటనిచ్చిన వ్యాక్సిన్ తయారీదారులు మరో శుభవార్త అందించారు. అన్ని సవ్యంగా జరిగితే మరి కొన్నిరోజుల్లోనే కోవిడ్-19 డెలివరీ షురూ కానుంది. ఈ మేరకు బయోఎన్‌టెక్ సీఈవ్ ఉగుర్ సాహిన్ రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బుధవారం (నవంబర్18) ప్రకటించారు. ఈ ఏడాది క్రిస్మస్ కంటే ముందే ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ డెలివరీ మొదలు పెట్టనున్నామని భావిస్తున్నామన్నారు. (కరోనా వ్యాక్సిన్: ఇన్ఫీ మూర్తి కీలక డిమాండ్) తమ కరోనా టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు అమెరికా కంపెనీ ఫైజర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగుర్ సాహిన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. యూరోప్‌లో ఈ వ్యాక్సిన్‌కు డిసెంబరులో టీకా అత్యవసర వినియోగం ఆమోదం, డిసెంబర్ రెండవ భాగంలో షరతులతో కూడిన అనుమతి లభించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అన్నీ సానుకూలంగా జరిగితేనే డిసెంబర్ మధ్యలో టీకాకు అనుమతి లభిస్తుందని, క్రిస్మస్ పండుగ లోపే డెలివరీలు ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నామన్నారు. జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి తయారు చేసిన తమ రెండు డోసుల టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో అన్ని ప్రాథమిక ప్రమాణాల్లో విజయం సాధించిందని ప్రకటించేందుకు గర్వంగా ఉందని ఫైజర్ తెలిపింది. 65 ఏళ్లు పైబడిన పెద్దలలో కూడా తమ టీకా సామర్థ్యం 94శాతం కంటే ఎక్కువేననని తుది ప్రయోగ ఫలితాల్లో తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జాతుల, భిన్న వయస్కులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూశామని తెలిపింది. ఫైజర్ టీకాను మైనస్ 70డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి ఉంటుందని పేర్కొంది. త్వరలో అమెరికాలో అత్యవసర వినియోగం కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేస్తామని వెల్లడించింది. BREAKING: We are proud to announce, along with @BioNTech_Group, that the Phase 3 study of our #COVID19 vaccine candidate has met all primary efficacy endpoints. — Pfizer Inc. (@pfizer) November 18, 2020 -
భారత్‌కు ప్రొటీన్ ఆధారిత టీకా ఉత్తమం
న్యూఢిల్లీ: భారత్‌లోని వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రొటీన్ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భద్రత, ధర, దిగుమతికి, నిల్వకు అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి వ్యాక్సిన్‌ను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాను అధిక ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తేనే ప్రభావవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం ఫైజర్–బయోఎన్‌టెక్, మోడెర్నా వంటి సంస్థలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. తమ వ్యాక్సిన్లు 90 శాతానికి పైగానే ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. అమెరికాకు చెందిన మోడెర్నా అభివృద్ధిచేస్తున్న టీకాను అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం లేదని, ఇండియాలోని వాతావరణ పరిస్థితులకు ఈ టీకా సరిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నోవావాక్స్ టీకా భారత్‌లో బాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఫైజర్ టీకా సురక్షితం కరోనా వైరస్‌ను అరికట్టడానికి తాము అభివృద్ధి చేస్తున్న టీకా సురక్షితమేనని 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు చివరి దశ ప్రయోగాల్లో తేటతెల్లమైందని ఫైజర్ కంపెనీ బుధవారం వెల్లడించింది. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ అనే సంస్థతో కలిసి ఫైజర్ కరోనా టీకాను అభివృద్ధిచేస్తున్న విషయం తెల్సిందే. 65 ఏళ్ల వయసుపైబడిన వారికి కరోనా ముప్పు అధికం. వీరిలో ఫైజర్ టీకా దాదాపు 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. అమెరికాలో తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం అతి త్వరలో దరఖాస్తు చేయనున్నట్లు ఫైజర్ తెలిపింది. తమ వ్యాక్సిన్‌కు సంబంధించిన పూర్తి డేటాను అమెరికాతోపాటు ప్రపంచ దేశాల్లోని వ్యాక్సిన్ నియంత్రణ సంస్థలకు అందజేస్తామని ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా వెల్లడించాయి. కోవాగ్జిన్ మూడో దశ ఈ నెల 20 నుంచి హరియాణాలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. మూడో దశ ప్రయోగ మొదటి వాలంటీర్‌గా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వ్యాక్సిన్ ట్రయల్‌ను స్వీకరించనున్నారు. ఆయనతో పాటు మరో 25 సెంటర్లలో 26 వేల మంది వాలంటీర్లు వ్యాక్సిన్ ట్రయల్‌ను స్వీకరించనున్నారు. భారత్‌లో ఎక్కువ మంది ట్రయల్స్‌లో పాల్గొంటున్న వ్యాక్సిన్ తయారీదారు కోవాగ్జిన్ కావడం గమనార్హం. ఈ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్.. ఐసీఎంఆర్‌తో సంయుక్తంగా తయారు చేస్తోంది. తమ వ్యాక్సిన్ మొదటి, రెండో దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని వ్యాక్సిన్ తయారీ దారులు ఇటీవల వెల్లడించడం తెల్సిందే. -
వ్యాక్సిన్లు ఓకే- కోట్ల డోసేజీలు ఈజీ కాదు!
న్యూయార్క్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి ఇటీవల రెండు వ్యాక్సిన్లు చివరి దశలో విజయవంతమైనట్లు కంపెనీలు ప్రకటించాయి. అమెరికన్ దిగ్గజాలు ఫైజర్, మోడర్నా.. తమ వ్యాక్సిన్లు 90 శాతంపైగా సురక్షితమంటూ పేర్కొన్నాయి. దీంతో ప్రపంచ దేశాలు ఈ వ్యాక్సిన్లపై దృష్టిసారించాయి. ఇప్పటికే నోవావాక్స్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర కంపెనీల వ్యాక్సిన్లు సైతం చివరి దశ పరీక్షలలో ఉన్నాయి. కాగా.. అమెరికన్ దిగ్గజాల వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో విజయవంతమై నియంత్రణ సంస్థల అనుమతులు పొందవలసి ఉంది. ఒకవేళ యూఎస్ఎఫ్డీఏ తదితరాలు వ్యాక్సిన్లకు వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ వీటి తయారీ, పంపిణీ పలు సవాళ్లతో కూడుకుని ఉన్నట్లు ఫార్మా నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: (ఇండియాకు మోడర్నా వ్యాక్సిన్) వచ్చే ఏడాదిలోనే ఫెడరల్ నియంత్రణ సంస్థల నుంచి ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లకు త్వరితగతిన అనుమతులు పొందినప్పటికీ వీటిని భారీ స్థాయిలో తయారు చేయడం కష్టమేనని ఫార్మా రంగ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది లేదా జనవరికల్లా గరిష్టంగా 5 కోట్ల డోసేజీలను మాత్రమే రూపొందించే వీలున్నట్లు అంచనా వేశారు. ఫైజర్, మోడర్నా సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్లు తొలుత అమెరికన్లకు మాత్రమే అందనున్నాయి. ఫెడరల్ ప్రభుత్వం బిలియన్లకొద్దీ డాలర్లను వ్యాక్సిన్ల అభివృద్ధికి అందించడంతో తొలుత ప్రభుత్వానికి సరఫరా చేయవలసి ఉంటుంది. యూఎస్ ప్రభుత్వం ఈ ఏడాది 30 కోట్ల డోసేజీలను లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: (వ్యాక్సిన్ దెబ్బకు పసిడి- వెండి డీలా) సాంకేతికత కారణంగా కోవిడ్-19కు చెక్ పెట్టగల వ్యాక్సిన్ల తయారీలో ఫైజర్, మోడర్నా కొత్త టెక్నాలజీలను వినియోగించాయి. ఇలాంటి టెక్నాలజీ ఆధారిత వ్యాక్సిన్లను ఇంతక్రితం భారీ స్థాయిలో వినియోగించేందుకు నియంత్రణ సంస్థలు అనుమతులు ఇచ్చింది లేదని ఫార్మా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే.. ఫార్మా దిగ్గజాలు మిలియన్లకొద్దీ డోసేజీలను రూపొందించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఇందుకు వీలుగా ముడి(రా) వ్యాక్సిన్, ఇతర ముడిపదార్ధాలు(ఇన్‌గ్రెడియంట్స్) తగినంతగా సమకూర్చుకోవలసి ఉంటుంది. ఇదేవిధంగా వీటన్నిటినీ క్రోడీకరించి అత్యంత నాణ్యమైన వ్యాక్సిన్ల బ్యాచ్‌లను తయారు చేయవలసి ఉంటుంది. అన్నిటినీ ఒకే స్థాయి ప్రమాణాలతో రూపొందించవలసి ఉంటుంది. బయోలాజికల్ ప్రొడక్టుకు సంబంధించిన తయారీని పెంచడంలో పలు సవాళ్లు ఎదురుకావచ్చని ఆరోగ్య పరిరక్షణ శాఖకు చెందిన స్టాఫ్ డిప్యూటీ చీఫ్ పాల్ మ్యాంగో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా 30 కోట్ల డోసేజీల తయారీ అత్యంత క్లిష్టతతోకూడిన వ్యవహారమని అభిప్రాయపడ్డారు. 5 కోట్ల డోసేజీలే.. ఫైజర్ తొలుత ఈ ఏడాది చివరికల్లా 10 కోట్ల డోసేజీలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ తాజాగా వీటిలో సగం పరిమాణంలోనే అందించగలమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రపంచ దేశాలకు కోవిడ్-19 విసురుతున్న సవాళ్ల కారణంగా గతంలోలేని విధంగా ముందుగానే ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షలు పూర్తికాకుండానే తయారీ ప్రణాళికలకు శ్రీకారం చుట్టాయి. వ్యాక్సిన్ విజయవంతమైతే వెనువెంటనే భారీ స్థాయిలో డోసేజీలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 10 కోట్ల డోసేజీలను అందించేందుకు వీలుగా మోడర్నా 2 బిలియన్ డాలర్లను ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందుకుంది. అయితే జనవరికల్లా 2 కోట్ల డోసేజీలను అందించే వీలున్నట్లు అంచనా. ఇక ఫైజర్ అయితే 10 కోట్ల డోసేజీలను 1.95 బిలియన్ డాలర్లకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసేజీలను అందించగలమని భావిస్తున్నట్లు ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బోర్లా ఇటీవల తెలియజేశారు. ఇతర కంపెనీలు బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా జనవరికల్లా మిలియన్లకొద్దీ వ్యాక్సిన్లను అందించేందుకు సన్నాహాలు చేసినప్పటికీ క్లినికల్ పరీక్షలను ఆరు వారాలపాటు నిలిపివేయడంతో ఈ ఏడాది చివరికల్లా అనుమతులు లభించకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో జనవరిలో ఈ వ్యాక్సిన్లకు గ్రీన్‌సిగ్నల్ లభించవచ్చని భావిస్తున్నారు. ఇక రెండు డోసేజీలలో వ్యాక్సిన్లను రూపొందిస్తున్న నోవావాక్స్ వచ్చే ఏడాదిలో 2 బిలియన్లకుపైగా డోసేజీలను అందించాలని చూస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధికి ఫెడరల్ ప్రభుత్వం నుంచి నోవావాక్స్ 1.6 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక జాన్సన్ అండ్ జాన్సన్ సైతం మార్చికల్లా 10 కోట్ల డోసేజీలను సిద్ధం చేసే వ్యూహాల్లో ఉంది. 2021 చివరికల్లా 1 బిలియన్ డోసేజీలను సరఫరా చేయాలని భావిస్తోంది. -
త్వరలో ఫైజర్ కరోనా టీకా సరఫరా
లండన్: కరోనా టీకా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఫైజర్, బయోఎన్‌టెక్ టీకా సరఫరా ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం అవుతుందని టీకా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న సీనియర్ శాస్త్రవేత్త ఆదివారం చెప్పారు. ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు కలిసి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బయోఎన్‌టెక్ సంస్థ సీఈవో ప్రొఫెసర్ ఉగుర్ సాహిన్ తెలిపారు. చదవండి: ఫైజర్ ప్రయోగాల్లో అపశ్రుతి -
ఫైజర్ ప్రయోగాల్లో అపశ్రుతి
ఫార్మా కంపెనీ ఫైజర్ తయారు చేస్తున్న కోవిడ్ టీకా ప్రయోగాల్లో అపశ్రుతి దొర్లింది. టీకా తీసుకున్న కొంతమందిలో కొన్ని దుష్పరిణామాలు కనిపించాయన్న వార్తలు వస్తున్నాయి. జలుబు నివారణకు టీకా తీసుకున్నప్పుడు కనిపించే ప్రభావాల మాదిరిగానే ఇవీ ఉన్నాయని వారు చెబుతున్నారు. టీకా దుష్పరిణామం మద్యం తీసుకున్న తరువాత వచ్చే హ్యాంగోవర్ మాదిరిగా ఉందని ఒక కార్యకర్త చెప్పారు. ఫైజర్ కంపెనీ ఆరు దేశాల్లో సుమారు 43,500 మందిని ఎంపిక చేసి టీకా ఇస్తున్న విషయం తెలిసిందే. టెక్సస్‌లోని 45 ఏళ్ల కార్యకర్త కారీ టీకా రెండో డోసు తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటివి కనిపించాయని తెలిపారు. కారీ తొలి డోసు సెప్టెంబర్‌లో నెలలో తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రయోగాల్లో తమకు ఎలాంటి తీవ్రస్థాయి దుష్ప్రభావాలూ కనిపించ లేదని ఫైజర్, దాని భాగస్వామి సంస్థ∙బయోఎన్టెక్లు తెలిపాయి. భారత్‌లో రికవరీ రేటు 92.89% భారత్‌లో కరోనా కేసులు ఒక్క రోజులోనే మరో 47,905 బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,916కు చేరుకుంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 80,66,501 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 92.89% శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం పేర్కొంది. అదేవిధంగా, ఈ వ్యాధితో 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 550 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 1,28,121గా నమోదైంది. కోవిడ్ టీకా పరిశోధనలకు రూ.900 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. కోవిడ్ సురక్ష మిషన్ కోసం ఈ నిధులను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి అందిస్తున్నామని మంత్రి తెలిపారు. టీకా పరిశోధనలు, అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామని పంపణీ కోసం వేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. -
కోవిడ్-19: మోడర్నా వ్యాక్సిన్ డేటా రెడీ!
న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ పరీక్షల డేటాను విడుదల చేసేందుకు అమెరికన్ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చివరి దశ క్లినికల్ పరీక్షలలో తమ వ్యాక్సిన్ 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు యూఎస్ దిగ్గజం ఫైజర్ ఇంక్ పేర్కొంది. ఇక స్ఫుత్నిక్ పేరుతో విడుదల చేసిన వ్యాక్సిన్ అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) తెలియజేసింది. ఈ బాటలో తాజాగా మోడర్నా సైతం తుది దశ పరీక్షల డేటాను ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దేశీయంగా.. ఫైజర్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మైనస్ 70 డిగ్రీల సెల్షియస్‌లో నిల్వ ఉంచవలసి ఉన్నట్లు వెలువడిన వార్తలతో ఫార్మా రంగ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దేశీయంగా ఈ వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీ వంటివి సమస్యాత్మకంగా నిలవనున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో మోడర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. చివరి దశ పరీక్షలకు సంబంధించిన తొలి మధ్యంతర విశ్లేషణ తమ వద్ద ఉన్నట్లు మోడర్నా చెబుతోంది. ఈ డేటా ద్వారా వ్యాక్సిన్ ఎంత సురక్షితమన్న అంశాన్ని తెలుసుకునే వీలున్నట్లు తెలియజేసింది. విశ్లేషణకు వీలుగా ఈ డేటాను స్వతంత్ర పర్యవేక్షక బోర్డుకి నివేదించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వ్యాక్సిన్ పరీక్షల ఫలితాలను విశ్లేషించి సూచనలు చేయనున్నట్లు తెలియజేసింది. నోవావాక్స్.. ఐసీఎంఆర్ సహకారంతో రూపొందిస్తున్న కోవిడ్‌షీల్డ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షల కోసం దేశీయంగా ఎన్రోల్మెంట్ పూర్తియినట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. మరోవైపు నోవావ్యాక్స్, సీరమ్ అభివృద్ధి చేస్తున్న కోవావ్యాక్స్కూ ఐసీఎంఆర్ సేవలు అందిస్తోంది. కాగా.. స్ఫుత్నిక్-వి వ్యాక్సిన్‌పై దేశ, విదేశాలలో ఇటీవల క్లినికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వీటి మధ్యంతర ఫలితాలు 92 శాతం విజయవంతమైనట్లు ఆర్డీఐఎఫ్ చెబుతోంది. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో రూపొందిస్తున్నవ్యాక్సిన్ 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు ఫైజర్ ప్రకటించిన మరుసటి రోజు రష్యన్ వ్యాక్సిన్ వివరాలు వెల్లడికావడం గమనార్హం! దేశీయంగా వ్యాక్సిన్లను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ చేస్తుంటారని ఫార్మా రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ బాటలో అతితక్కువ టెంపరేచర్‌ను తీసుకుంటే.. మైనస్ 25 డిగ్రీలు మాత్రమేనని చెబుతున్నారు. వెరసి ఇందుకు అనువైన వ్యాక్సిన్లు మాత్రమే దేశీయంగా వినియోగించేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
సెన్సెక్స్@ 43,000- ఫైజర్ రికార్డ్
ముంబై: వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దౌడు తీస్తున్నాయి. వెరసి స్టాక్ మార్కెట్ల చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 43,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం 418 పాయింట్లు జంప్ చేసి 43,015 వద్ద ట్రేడవుతోంది. సోమవారం సైతం ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ సరికొత్త రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా ఫలితాలనిచ్చినట్లు పేర్కొనడంతో ఫైజర్ లిమిటెడ్ కౌంటర్ జోరందుకుంది. అమెరికన్ పేరెంట్ కంపెనీ ఫైజర్ ఇంక్ షేరు సోమవారం 7.5 శాతం లాభపడటంతో ఈ కౌంటర్ కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. 20 శాతం ప్లస్ జర్మన్ కంపెనీ బయో ఎన్‌టెక్ తో సంయుక్తంగా రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు ఫైజర్ ఇంక్ పేర్కొంది. ఈ నెలాఖరుకల్లా ఎమెర్జీన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించే వీలున్నట్లు అభిప్రాయపడింది. దీంతో దేశీ అనుబంధ సంస్థ ఫైజర్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్ఎస్ఈలో తొలుత 20 శాతం దూసుకెళ్లింది. రూ. 977 ఎగసి రూ. 5,900ను తాకింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుుకుంది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 5,256 వద్ద ట్రేడవుతోంది. -
వ్యాక్సిన్ బూస్ట్- టెక్ దిగ్గజాల షాక్
న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా సఫలమైనట్లు ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ ప్రకటించింది. జర్మన్ కంపెనీ బయోఎన్ టెక్ తో సంయుక్తంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ కు నవంబర్ చివరిలోగా యూఎస్ఎఫ్డీఏ నుంచి ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగానికి అనుమతి లభించే వీలున్నట్లు అంచనా వేసింది. ఫలితంగా సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లకు వ్యాక్సిన్ బూస్ట్ లభించింది. డోజోన్స్ 835 పాయింట్లు(3 శాతం) జంప్ చేసి 29,158కు చేరగా.. ఎస్అండ్పీ 41 పాయంట్లు(1.2 శాతం) ఎగసి 3,551 వద్ద ముగిసింది. అయితే టెక్ దిగ్గజాలలో ట్రేడర్లు అమ్మకాలు చేపట్టడంతో నాస్డాక్ 181 పాయింట్లు(1.5 శాతం) పతనమై 11,714 వద్ద స్థిరపడింది. కార్నివాల్ జోరు వ్యాక్సిన్ ఆశలతో ఫైజర్, మోడర్నా ఇంక్ 7.5 శాతం చొప్పున జంప్ చేయగా.. ఆస్ట్రాజెనెకా 2.5 శాతం క్షీణించింది. అయితే కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ రానుందన్న అంచనాలతో సోమవారం ఎంటర్ టైన్మెంట్ కంపెనీల షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వెరసి ఏఎంసీ 50 శాతం, కార్నివాల్ కార్పొరేషన్ 39 శాతం, సిక్స్ ఫ్లాగ్స్ 18 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఈ బాటలో జెట్ బ్లూ ఎయిర్వేస్, స్పిరిట్ ఎయిర్ లైన్స్ 21 శాతం చొప్పున జంప్ చేశాయి. అయితే జూమ్ వీడియా కమ్యూనికేషన్స్ షేరు 17 శాతం పతనమైంది. కాగా.. అల్జీమర్స్ చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ.. నో చెప్పడంతో బయోజెన్ 30 శాతం కుప్పకూలింది. ఫాంగ్ స్టాక్స్ డీలా ఫాంగ్ స్టాక్స్ గా పిలిచే దిగ్గజాలలో నెట్ ఫ్లిక్స్ 8.6 శాతం పతనంకాగా.. ఫేస్ బుక్ 5 శాతం, మైక్రోసాఫ్ట్ 2.4 శాతం, యాపిల్ 2 శాతం చొప్పున నష్టపోయాయి. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 2 శాతం డీలాపడింది. ఈ ఏడాది భారీ లాభాలతో ర్యాలీ చేస్తున్న టెక్ దిగ్గజాలలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీయడంతో నాస్డాక్ పతనమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. -
మా వ్యాక్సిన్‌తో 90శాతం ఫలితాలు..
న్యూయార్క్: కరోనాను ఎదుర్కోవడానికి అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, యూరోప్‌కు చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని ఆ కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా చెప్పారు. తమ ఫలితాలు తెలిసిన నేటి రోజు సైన్సుకూ, మానవాళికి చాలా మంచి రోజు అని అభిప్రాయపడ్డారు. మూడో దశ ప్రయోగం వల్ల తమ వ్యాక్సిన్ కరోనాను అడ్డుకుంటోందని తెలుస్తోందని చెప్పారు. ప్రపంచానికి అత్యవసరమైన కరోనా వ్యాక్సిన్ త్వరలోనే తమ నుంచి వచ్చే వకాశం ఉందని తెలిపారు. బయోఎన్‌టెక్ సీఈఓ ఉగుర్ సాహిన్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో దాడి చేస్తున్న నేపథ్యంలో ఈ ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పారు. ఫైజల్, బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జూలై 27న ప్రారంభమైంది. మొత్తం 38,955 మందికి నవంబర్ 8 నాటికి వ్యాక్సిన్ ఇచ్చారు. రెండో, మూడో దశ ప్రయోగాల్లో వచ్చిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించినట్లు తెలిపాయి. అయితే, పరిశీలన పూర్తయ్యే నాటికి ఈ డేటా మారే అవకాశం ఉందని ఫైజర్ కంపెనీ ఉపాధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఈ యేడాది చివరి నాటికి టీకా వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఫైజర్ భారత్‌కు వచ్చేనా ? తాజా పరిణామంతో ఫైజర్ టీకాను భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ జాతీయ నిపుణుల బృందం ఫైజర్ ప్రతినిదులను కలసి చర్చించినట్లు సమాచారం. భారత్‌లో దీన్ని డెలివరీ చేయించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ఈ బృందం పరిశీలిస్తోంది. 45 వేల కేసులు.. భారత్‌లో గత 24 గంటల్లో 45,903 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కు చేరుకుంది. గత 24 గంటల్లో 490 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 1,26,611. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 79,17,373కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 5,09,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన 9 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమీక్ష జరిపారు. అమెరికాలో ఆగమేఘాలపై టీకా తయారీ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ట్రంప్ అధికారంలోంచి దిగిపోయేందుకు ముందుగానే ఓ అద్భుతాన్ని సృష్టించనున్నారా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఎఫ్‌డీఏ అనుమతి రాకమునుపే కోట్లాది కోవిడ్–19 టీకాలు ఫ్యాక్టరీల్లో సిద్ధమైపోతున్నాయి. ‘‘ఆపరేషన్ వార్ప్ స్పీడ్’’ కోవిడ్ టీకా తయారీని వేగవంతం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరు ఇది. అమెరికన్ పౌరులు 30 కోట్ల మందికి టీకా అందించే లక్ష్యంతో మొదలైన ఆపరేషన్ వార్ప్ స్పీడ్‌కు నేతృత్వం వహించింది ఓ ఆర్మీ జనరల్. ఈ ఏడాది మేలోనే రిటైర్ కావాల్సిన ఓ ఆర్మీ జనరల్! పేరు గస్ పెర్నా. టీకా తయారీకి సంబంధించిన వీడియోలు సీబీఎస్ టీవీ ప్రసారం చేయడంతో ఇప్పుడు గస్ పెర్నా పేరు మారుమోగిపోతోంది. -
వ్యాక్సిన్ ఆశలు : అమెరికా మార్కెట్లు హైజంప్
వాషింగ్టన్: ఒకవైపు రోజుకు లక్షకుపైగా కరోనా కేసులతో అమెరికా ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి కట్టడికి సంబంధించి తమ వ్యాక్సిన్ ట్రయల్స్ కీల పురోగతి సాధించాయంటూ ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ ఆశాజనకమైన ప్రకటన వెలువరించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. (కరోనా వ్యాక్సిన్ : ఫైజర్ పురోగతి) కరోనా వైరస్ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ లో 90 శాతానికిపైగా సానుకూల ఫలితాలు వస్తున్నాయని ప్రాథమిక విశ్లేషణ సూచించినట్లు ఫైజర్ తెలిపింది. దీంతో డోజోన్స్ 1500 ఏకంగా పాయింట్లు పుంజుకుంది. ఎస్ అండ్పీ, నాస్డాక్ ఇదే బాటలో ఉన్నాయి. యూకే మార్కెట్ ఎఫ్టీఎస్ఈ100 కూడా 4 శాతం ఎగిసింది. ఇతర యూరోపియన్ మార్కెట్లు 5 శాతానికి పైగా లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ట్రావెల్ సంస్థలు లాభాలతో కళకళలాడుతున్నాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ ఓనర్ ఐఏజీ ఏకంగా 26శాతం పెరిగింది. (కరోనా టెస్ట్ : 90 నిమిషాల్లోనే ఫలితం) కాగా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న తరుణంలో ఫైజర్, జర్మన్ ఔషధ తయారీదారు బయోఎన్‌టెక్‌తో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై అమెరికా ప్రజలకు శుభవార్త అందించింది. నవంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తేనున్నామని ఫైజర్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.