వాషింగ్టన్: అమెరికాలో డిసెంబర్ రెండో వారంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాక్సిన్ తయారీని పర్యవేక్షిస్తున్న ఆపరేషన్ వార్ఫ్ స్పీడ్ అధిపతి డాక్టర్ మోన్సెఫ్ స్లౌయి అంచనా మేరకు డిసెంబర్ 11 లేదా 12న వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు ఇవ్వాలంటూ ఫైజర్–బయోఎన్‌టెక్ కంపెనీలు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10న అడ్మినిస్ట్రేషన్ అడ్వైజరీ కమిటీ కీలక సమావేశం జరగనుంది. వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు లభిస్తే, 24 గంటల్లోగా రాష్ట్రాలకు పంపిణీ చేసి డిసెంబర్ 11న గానీ లేదా 12న గానీ వ్యాక్సినేషన్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమెరికా వ్యాపంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందుతుందని డాక్టర్ మోన్సెఫ్ అన్నారు. వ్యాక్సిన్ వల్ల రోగనిరోధక పెరిగి, మొత్తం జనాభాలో 70 శాతం నిరోధకత వస్తే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని అన్నారు. అన్ని వయసుల వారిపై తమ వ్యాక్సిన్ దాదాపు 95 శాతం ఫలితం చూపిస్తోందని ఫైజర్–బయోఎన్‌టెక్ కంపెనీలు ఇటీవల ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment